Crime
-
అనకాపల్లి: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టు
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టరయ్యింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఈ సైబర్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని.. గత రెండేళ్ల నుండి సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. నెలకి రూ.15 నుంచి 20 కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, రాజస్థానకు చెందిన ఇద్దరు ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారు. మేఘాలయ, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పనిచేస్తున్నారు. అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్ లా పేరుతో నాలుగు దశల్లో ట్రాప్ చేస్తున్నారు.3 వందల డాలర్ల నుంచి 3,000 డాలర్ల వరకు కూపన్లు ఒక్కొక్కరికి అమ్ముతున్నారు. ఇందులో 200 నుండి 250 మంది కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. మొదట వీరందరికీ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్లకు 18 లక్షల రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. పోలీసులు.. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. రూ.3 లక్షల నగదు, 300కు పైగా కంప్యూటర్స్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని.. అపార్ట్మెంట్ ఓనర్లపై కూడా విచారణ జరుపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. -
నంద్యాల: పంటి నొప్పితో వెళ్తే.. ప్రాణం తీసిన ఆర్ఎంపీ వైద్యుడు
సాక్షి, నంద్యాల జిల్లా: పంటి నొప్పితో వెళితే ఓ వైద్యుడు ప్రాణం తీశాడు. సంజామల మండల కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకంతో మహిళ మృతి చెందింది. సంజామల మండలం చిన్న కొత్తపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (52) రెండు రోజులుగా పంటి నొప్పి ఉండటంతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లింది. ఇంజెక్షన్ నరానికీ ఇవ్వగా ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.దీంతో 108 ద్వారా కోవెలకుంట్ల ఆసుపత్రికి ఆర్ఎంపీ వైద్యుడు తరలించగా, అప్పటికే ఆ మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ వైద్యుడు పరారిలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
ఫిలింనగర్(హైదరాబాద్): ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి..మరో యువతితో తిరుగుతున్న యువకుడిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. అర్చిత్ పసుపులేటి అనే యువకుడు 2023 ఓ యువతిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతితో సన్నిహితంగా ఉండడంతో గర్భందాల్చగా అబార్షన్ చేయించాడు. అనంతరం ఆమెను దూరం పెట్టాడు. ఇటీవల అర్చిత్ మరో యువతితో తిరుగుతున్నట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్చిత్‌తో పాటు అతని సోదరుడు, మామ, మరో ఇద్దరు స్నేహితులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొంది. తనను మానసికంగా వేధిస్తుండడంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా ప్రవర్తించారని, ఆర్థికంగా దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొంది. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు తోసేశారని, అర్ధరాత్రి రోడ్డుపై బలవంతంగా నడుచుకుంటూ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశానని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఆమె పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు అర్చిత్‌తో పాటు సోదరుడు, మామ, మరో ఇద్దరిపై బీఎన్ఎస్ సెక్షన్ 69, 79, 89, 351 (3) కింద కేసు నమోదు చేశారు. -
ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
ఘట్కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది. సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్‌షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు. -
బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో గ్యాంగ్‌రేప్
యశవంతపుర: మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆర్ఎంసీ యార్డు పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. తాను బీజేపీ కార్యకర్తనని, మాట వినలేదని చెప్పి మునిరత్న తనపై వ్యభిచారం సహా పలు కేసులు పెట్టించి జైలుకు పంపాడని ఆమె ఆరోపించింది. 2023 జూన్‌లో కేసులు మాఫీ చేయిస్తానని ఎమ్మెల్యే అనుచరులు వసంత్, చెన్నకేశవ, కమల్ ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ముఖంపై మూత్రం పోసి, ప్రమాదకరమైన జబ్బు వైరస్‌ను ఎక్కించారని పేర్కొంది. కాగా, మునిరత్నపై ఇదివరకే కాంట్రాక్టర్లకు బెదిరింపులు, హనీట్రాప్ తదితర కేసులు ఉన్నాయి. అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే తాజా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించలేదు. -
మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్‌ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి. కీలక నేతలే టార్గెట్‌గా ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్‌లైన్‌గా విధించడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్‌మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్‌గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు. దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి. క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు. తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’ దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా.. 1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు. 2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్‌లను వాడుతున్నారు. 3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్‌ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు. ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి. -
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్‌గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్‌ఎస్‌లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్‌లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్‌లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్‌గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్‌ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్‌వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్‌వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్‌వార్ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్‌వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్‌గా..పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్‌వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్‌లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్‌వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది. -
ట్రాఫికింగ్ డాన్ హితేశ్ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాల్లో కొలువుల పేరిట వందలాది మంది భారతీయులను విదేశాల్లోని చైనా సైబర్ కేఫ్‌లకు విక్రయించిన మానవ అక్రమ రవాణా డాన్ హితేశ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. భారత విదేశాంగ శాఖ కోరిక మేరకు అతడిని మంగళవారం రాత్రి థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులు ఇండియాకు డిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన హితేశ్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, విదేశాంగశాఖకు అప్పగించారు. మార్చిలో కరీంనగర్ పోలీసులు జారీచేసిన లుక్అవుట్ నోటీసుల ఫలితంగా హితేశ్ ఇండియా రాగానే అదుపులోకి తీసుకున్నారు. హితేశ్ ఇండియాకు వస్తున్నాడన్న సమాచారంతో మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, గుజరాత్‌కు చెందిన హితేశ్‌ను తెలంగాణ పోలీసుల కంటే ముందే ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రోజంతా జరిగిన హైడ్రామా తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలుగజేసుకోవటంతో ఎట్టకేలకు హితేశ్‌ను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. దీంతో కరీంనగర్ పోలీసులు అతన్ని సాయంత్రానికి కరీంనగర్‌కు తరలించారు. దేశవ్యాప్త నెట్వర్క్ గుజరాత్‌లోని పోర్బందర్కు చెందిన హితేశ్ మానవ అక్రమ రవాణా సూత్రధారి. ఇతను థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ దేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడే కేఫ్‌లకు మనుషులను అక్రమంగా పంపిస్తాడు. విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని, నెలకు రూ.లక్ష జీతమని నమ్మబలికి ఒక్కో వ్యక్తిని 3,000 డాలర్లకు చైనీస్ సైబర్ కేఫ్‌లకు విక్రయించేవాడు. మనదేశంలో ఇతనికి ప్రతి రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నారు. ఇప్పటివరకు అతడు దాదాపు 300 మందికిపైగా భారతీయులను విక్రయించాడని సమాచారం. ఇతని ఏజెంట్లలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామారావు రాజశేఖర్ ఒకడు. వీరిద్దరు కలిసి గతేడాది డిసెంబర్లో కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మధుకర్‌రెడ్డి అనే యువకుడిని మయన్మార్‌కు పంపారు. అక్కడ ఆ యువకుడు తిరగబడ్డాడు. ఈ విషయాన్ని ‘సాక్షి’వరుస కథనాలతో వెలికితీయడంతో స్పందించిన బండి సంజయ్.. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. దీంతో తొలుత అక్కడ సైబర్‌కేఫ్‌లో చిక్కుకున్న 540 మందిని మయన్మార్ సైన్యం సాయంతో కాపాడారు.తెలంగాణ సైబర్ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానకొండూరు, ఖానాపూర్‌లో హితేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనే కరీంనగర్ పోలీసులు హితేశ్‌పై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. మరో కీలక నిందితుడు రాజశేఖర్ లావోస్‌లో తలదాచుకుంటున్నాడని సమాచారం. భారతీయ యువతీ యువకులను చైనీయులకు విక్రయించిన హితేశ్.. వారు తిరగబడితే చిత్రహింసలు పెట్టి చీకటిగదుల్లో వేయించేవాడు. చైనీయుల కోసం వందల మంది భారతీయులను అంగడి సరుకుగా విక్రయించాడు. చివరికి ఆ చైనీయులే అతన్ని చితకబాది థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టించడం కొసమెరుపు. -
బెంగళూరు: సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ కలకలం
బెంగళూరు: నగరంలో దారుణం జరిగింది. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. రైల్వే వంతెన సమీపంలో ట్రావెల్ బ్యాగ్‌లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం హోసూర్ ప్రధాన రహదారిలోని పాత చందాపుర రైల్వే బ్రిడ్జి సమీపంలో, రైలు పట్టాల దగ్గర నీలం రంగులో ఉన్న ట్రావెల్ సూట్‌కేస్ పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు.అందులో యువతి మృతదేహం ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి కదులుతున్న రైలు నుంచి బయటకు విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు.ట్రావెల్ బ్యాగ్‌లోని యువతి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతి వయస్సు 18 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. -
ఇదెక్కడి ‘పంచాయితీ’!
ఆమె ఓ గ్రామ సర్పంచ్. లక్షల్లో అప్పులు చేసింది. అది తీర్చడం కుదరకపోయేసరికి ఏకంగా పంచాయితీనే మరొక వ్యక్తికి లీజు కింద అప్పగించింది. అయితే ఇప్పటికిప్పుడు జరిగిందేం కాదు!. చాలా కాలం కిందటే ఆమె ఇలా కాంట్రాక్ట్ కుదుర్చుకుని పంచాయితీ ఆఫీస్‌ను అతని చేతిలో పెట్టిందట!. ఇదేం పంచాయితీ అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదివేయండి.మధ్యప్రదేశ్ గుణ జిల్లాకు కరోడ్ గ్రామ పంచాయితీలో ఆ ఊరి సర్పంచ్ లక్ష్మీ బాయి సీట్లో మరో వ్యక్తి కూర్చోవడం ఉన్నతాధికారులను ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే అందుకు గల కారణం తెలిసి.. వెంటనే ఆ సర్పంచ్‌ను తొలగించి, ఇన్చార్జి సర్పంచ్‌గా మరొకరిని నియమించారు.లక్ష్మీ బాయి అదే గ్రామానికి చెందిన రణవీర్ సింగ్ కుష్వాహా అనే వ్యక్తి నుంచి 2020లో 20 లక్షల రూపాయలు అప్పు తీసుకుంది. ఒకవేళ అప్పును తీర్చినట్లయితే.. పంచాయతీ పనులను తన పదవీకాలం ఉన్నంత వరకు ఆ వ్యక్తికి అప్పగిస్తానని ఒప్పందం కూడా చేసుకుంది. ఇందుకోసం100 రూపాయల స్టాంప్ పేపర్ ఒప్పందం చేసుకున్నారు.అయితే.. సకాలంలో అప్పు తీర్చకపోవడంతో ఆమె అన్నంత పని చేసింది. ఇది చాలదన్నట్లు కుష్వాహా ఓ నోటరైజ్డ్ అఫిడవిట్ ద్వారా కరోడ్ గ్రామ పంచాయతీని మూడో వ్యక్తికి అప్పగించారు. ఈ విషయం గునా జిల్లా యంత్రాగం దృష్టికి వెళ్లడంతో.. అధికారులు రంగంలోకి దిగారు. మే 9న సర్పంచ్ లక్ష్మీ బాయిని అధికారికంగా ఆమె పదవి నుంచి తొలగించి సమగ్ర విచారణకు ఆదేశించారు. అలాగే.. రణవీర్ సింగ్ కుష్వాహా, సర్పంచ్ కుర్చీలో కూర్చున్న మూడో వ్యక్తిపై సైతం అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉంటే.. 2022 పంచాయతీ ఎన్నికల సమయంలో తన ప్రచారానికి నిధులు సమకూర్చుకోవడానికి లక్ష్మీ బాయి ఈ రుణం తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను లక్ష్మీ బాయి భర్త శంకర్ సింగ్ ఖండించారు. తాము ఎవరి నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేదని.. లక్ష్మీ బాయిని అన్యాయంగా పదవి నుండి తొలగించారని, ఇకనైనా తమను వదిలేయాలని అధికారులను వేడుకుంటున్నాడు. -
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
షాబాద్, పరిగి(వికారాబాద్ జిల్లా): రంగాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన ముత్యాల మల్లేశ్‌కు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు మాన్యశ్రీ, ఆర్యాధ్య, కూమారుడు ప్రనిల్ ఉన్నారు. మల్లేశ్ మండల పరిధిలోని నాగర్‌గూడలో కులవృతి అయిన కటింగ్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయన మృతి చెందడంతో భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. సోలీపేట్కు చెందిన మంగలి బాలమ్మకు ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అందరి వివాహాలయ్యాయి. చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పెళ్లికి వెళ్లింది. రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందగా, మోక్షిత నీలోఫర్‌లో చికిత్స పొందుతోంది.అనాథలయ్యామురా.. ‘తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా.. నేను, నా పిల్లలు అనాథలయ్యామురా’.. అంటూ పెళ్లి కుమారుడి (సతీష్) అక్క స్వప్న తన తమ్ముడి పట్టుకుని విలపించింది. తండ్రి రామస్వామి రాగానే నా బతుకు ఆగమయ్యింది నాన్నా అంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. న్యాయం జరిగేలా చూస్తాం.. రంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకులు చేవెళ్ల స్వామి, డాక్టర్ రాజు, మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్‌లు జనార్దన్‌రెడ్డి, మహేందర్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, నరేందర్, రఫిక్, దయాకర్ తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా కృషిచేస్తామని తెలిపారు. చదవండి: చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం -
అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతి కి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30)ని తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంతా కత్తితో విరుచుకు పడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్టుండి ఎటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తాడో పొడిచి పారిపోయాడు. నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండేల్గా గురించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది..గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.అక్షయ్ గుప్తాకు, నిందితుడు దీపక్ కండేల్‌కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటివరకు కామ్‌గా కూర్చున్న నిందుతుడు వేటకత్తితో బాధితుపై దాడి చేశాడన్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్‌ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.దీపక్ నేర చరిత్రస్థానిక మీడికా కథనం ప్రకారం, కాండెల్కు 2016 నుండి నేర చరిత్ర ఉంది. తీవ్రమైన నేరాలు సహా విస్తృతమైన అరెస్టు చరిత్ర ఉందని, కానీ ఎప్పుడూ విచారణ జరగలేదు. ప్రాసిక్యూటర్లు అతనిపై అనేకసార్లు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గతంలో 12 సార్లు అరెస్ట్ అయినట్టు సమాచారం. హత్యకు షాకింగ్ రీజన్అక్షయ్పై ఎటాక్ చేసిన కాండెల్ ఇతర ప్రయాణీకులతో కలిసి వాహనం నుండి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే పెట్రోల్ అధికారులు కాండెల్ను పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
Hyderabad: స్టార్ హోటల్లో యువ వైద్యురాలిపై లైంగిక దాడి
హైదరాబాద్: తన భార్యకు విడాకులు ఇచ్చానని, త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటానని వైద్యురాలిని నమ్మించి బంజారాహిల్స్ లోని ఒక స్టార్ హోటల్ లో లైంగిక దాడికి పాల్పడిన వైద్యుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మహబూబాబాద్ లోని అమ్మ ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ జర్పుల స్వామి (37)కి 2023 లో అక్కడే మెడికో గా పని చేస్తున్న యువ వైద్యురాలు (30)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. తన భార్య తనను బలవంతంగా వివాహం చేసుకుందని, ఆమెకు నాలుగు అబార్షన్లు సైతం అయ్యాయని, అందుకే ఆమెకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నట్లు యువ వైద్యురాలిని నమ్మించారు. ఆమెతో స్నేహం, ప్రేమకు దారి తీసి విషయం పెళ్ళి వరకు వెళ్ళింది. 2024 సెపె్టంబర్లో వైద్యురాలు నగరానికి వచ్చి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నది. ఇదిలా ఉండగా డాక్టర్ స్వామి ఈ ఏడాది జనవరి 12న నేషనల్ పెడికాన్ సదస్సు నిమిత్తం నగరానికి రాగా ఆ సదస్సుకు యువ వైద్యురాలు సైతం హాజరైంది. ఇద్దరు కలిసి అదే రోజు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో గది తీసుకున్నారు. పెళ్లి పేరుతో నమ్మించిన డాక్టర్ స్వామి ఆమెపై బలవంతంగా లైంగిక దారికి పాల్పడ్డాడు. విషయం బయటికి తెలియవద్దని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెళ్లిపోయాడు. స్వామి వ్యవహార తీరును అనుమానించిన యువ వైద్యురాలు అతని గురించి విచారించగా భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్నది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వామి తల్లిదండ్రుల దృష్టికి యువ వైద్యురాలు తీసుకెళ్లింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం పోలీసులు డాక్టర్ స్వామి, అతని కుటుంబ సభ్యులపై బి.ఎన్.ఎస్ 64 (1), 318(4), 318(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం
పరిగి: హైదరాబాద్– బీజాపూర్ రహదారి రక్తసిక్తమైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లింట నిర్వహించిన చిన్నవిందుకు హాజరై వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు, పెళ్లికొడుకుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుల్లో షాబాద్ మండలం సీతారాంపూర్‌కు చెందిన మల్లేశ్(35), ఇదే మండలం సోలిపేట్‌కు చెందిన బాలమ్మ (60), చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత(32), ఫరూక్నగర్ మండలం కిషన్‌నగర్‌కు చెందిన సందీప్(28) ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ సంతోష్‌కుమార్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను పరిగి ఆస్పత్రికి అక్కడి నుంచి తాండూరు, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పరిగి ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.ఎలా జరిగిందంటే..వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన రామకృష్ణ, స్వప్న దంపతుల కూతురు మల్లేశ్వరిని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లికి చెందిన సతీష్‌కు ఇచ్చి ఈనెల 16న పరిగిలో వివాహం జరిపించారు. 19న చిన్నవిందు ఏర్పాటు చేయడంతో పెళ్లి కొడుకు బంధువులు సుమారు 50 మంది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రాత్రి 8:30 గంటలకు చందనవెళ్లి నుంచి పరిగికి చేరుకున్నారు. బస్సును పార్కింగ్ చేసి వస్తానని వెళ్లిన డ్రైవర్.. ఇదే ట్రావెల్స్‌కు చెందిన మరో బస్సు పాడవడంతో అందులో ఉన్నవారిని పరిగి నుంచి వారి గమ్యస్థానంలో వదిలేసి, తిరిగి అర్ధరాత్రి 1:20 గంటలకు పరిగికి చేరుకున్నాడు. పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో పాటు బంధువులతో కలిసి చందనవెళ్లి బయలుదేరారు. పది నిమిషాలు కూడా గడవకముందే రంగాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీకి సైడ్ ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కన ఎడమ వైపు నిలిపి ఉన్న సిమెంట్ లోడ్ లారీని బలంగా ఢీకొట్టింది.తల్లి మృతి, ప్రాణాపాయంలో కూతురుప్రమాద స్థలంలో మృతిచెందిన హేమలత కూతురు మోక్షిత(5)కు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మిగిలిన వారిని వికారాబద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సుజాత, నీరజ, నిహారి, మహేశ్, అరుణ, సాహితికి కాళ్లు, చేతులు విరిగాయి. ప్రియాంక, కార్తీక్, రమేశ్, లక్ష్మి, రాములు, మంజుల, సుజాత, నవనీతకు స్వల్ప గాయాలయ్యాయి.పెళ్లి కొడుకు బావ మృతిపెళ్లికొడుకు సతీష్ బావ (అక్క భర్త) మల్లేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతని భార్య, ముగ్గురు పిల్లలు సైతం ఇదే బస్సులో ఉన్నారు. మృతుల్లో కిషన్‌నగర్‌కు చెందిన సందీప్‌కు ఆరు నెలల క్రితమే వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం నాగుపల్లికి చెందిన మహేశ్వరితో వివాహం జరిగింది. పెళ్లికుమారుడికి మేనబావ కావడంతో ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇతని తండ్రి గతంలోనే మృతిచెందగా ఒకేఒక్క కుమారుడైన సందీప్ అకాల మృతితో అతని కుటుంబం విలవిల్లాడుతోంది. -
ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్బీఆర్ లేఔట్‌లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి. -
HYD: డీసీఎంను ఢీకొన్నకారు.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, హయత్‌నగర్: హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లోని కుంట్లూరు వద్ద బుధవారం తెల్లవారుజామున అతి వేగంలో ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను కుంట్లూరుకు చెందిన చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. అయితే, ఇంటికి సరిగ్గా 100 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంటికి చేరుకోవడానికి కొన్ని సెకన్ల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. -
విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి
బయ్యారం/మిరుదొడ్డి (దుబ్బాక)/జగదేవ్‌పూర్ (గజ్వేల్)/పిట్లం (జుక్కల్)/ తొగుట (దుబ్బాక): విద్యుత్ తీగలు ప్రాణాలు తీశాయి. వేర్వేరుచోట్ల కరెంట్ షాక్‌కు గురై ఆరుగురు మృతిచెందారు. పెళ్లయిన 48 గంటలకే.. పెళ్లి బాజాలు...డీజే మోతలు మోగిన ఆ ఇంట చావు డప్పు మోగింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా య్యారం మండలం కోడిపుం జుల తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్ (26)కు ఏపీలోని కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన జాహ్నవితో ఆదివారం వివాహం జరిగింది. సోమవారం తండాకు దంపతులిద్దరూ వచ్చారు. మంగళవారం నరేశ్ ఇంటి వద్ద మోటార్‌ను ఆన్‌చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గుర య్యా డు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. విద్యుత్ సర్వీస్ వైరుపైపడి.. కౌలు రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పీర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్‌కు చెందిన మహ్మద్ షాదుల్ (25) మామిడితోటను కౌలుకు తీసుకున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో మామిడి చెట్టుకు ఇనుప స్టాండ్ వేసుకొని ఎక్కి వలను చుడుతున్నాడు. ఈ క్రమంలో స్టాండ్‌పై నుంచి జారి కిందున్న విద్యుత్ సర్వీస్ వైర్‌పై పడటంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలు తగిలి.. విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్ఐ హరీశ్ కథనం మేరకు.. మోతె గ్రామానికి చెందిన మంగోరి కృష్ణ హరి (60) తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం పొలం వద్దకు వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి వీచిన గాలి వానకు పొలంలో కరెంటు స్తంభం పడిపోయి ఉంది. ఇది గమనించని కృష్ణ హరి వ్యవసాయ పనులు చేస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మోటారు తీస్తుండగా విద్యుత్ తీగలు తగిలి.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని పొలంలో బోరు మోటారు పని చేయకపోవడంతో మంగళవారం గ్రామానికి చెందిన రాములు (42), హన్మయ్య (59) బోరు మోటారును తీయడానికి వెళ్లారు. మోటారును పైకి తీస్తున్న క్రమంలో మోటార్‌కు ఉన్న ఇనుప పైప్ పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మత్తులో ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకుని.. సిద్దిపేట జిల్లా తొగుటకు చెందిన రామారపు రాజు (36) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ మాదిరిగా మంగళవారం కూలి పనికి వెళ్లి.. సాయంత్రం మద్యం సేవించి ఇంటికొచ్చాడు. మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకోగా కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. -
ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా!
చండీగఢ్/న్యూఢిల్లీ: ఇండియన్ అండర్‌కవర్ ఏజెంట్లను గుర్తించడానికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)(33)ను వాడుకుందా? నిజమేనని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఐఎస్ఐ హ్యాండ్లర్ అలీ హసన్‌తో వాట్సాప్‌లో జ్యోతి చేసిన చాటింగ్‌లను వెలికి తీశారు. ఇద్దరి మధ్య కోడ్ భాషలో ఈ చాటింగ్‌లు జరిగాయి. ఒక చాటింగ్‌ను పరిశీలిస్తే.. భారత అండర్‌కవర్ ఏజెంట్ల వివరాలు, వారి ఆపరేషన్ల గురించి అలీ హసన్ ఆమెను ప్రశ్నించాడు.భారత్–పాక్ సరిహద్దు అయిన అటారీ బోర్డర్‌ను సందర్శించినప్పుడు ప్రత్యేక ప్రోటోకాల్ ఉన్న అండర్‌కవర్ ఏజెంట్లను చూశావా? అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని జ్యోతి బదులిచ్చింది. ప్రోటో కాల్ అందుకున్నవారే అండర్ కవర్ ఏజెంట్లు కావొ చ్చు అని అలీ హసన్ చెప్పగా, అలాంటి వారిని తాను చూడలేదని పేర్కొంది. భారత నిఘా ఏజెంట్ల గుట్టుమట్లు తెలుసుకోవడానికి జ్యోతిని అస్త్రంగా ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఐఎస్ఐ కోసమే పని చేస్తున్నట్లు ఆమెకు పూర్తి అవగాహన ఉందని పేర్కొంటున్నారు. పాకిస్తాన్‌కు సంబంధించిన భారీ గూఢచార ముఠాలో ఆమె ఒక కీలక సభ్యురాలని నిర్ధారణకు వచ్చారు. జ్యోతి తొలిసారిగా 2023లో బైశాఖి పండుగ సమయంలో పాకిస్తాన్లో పర్యటించింది. ఈ సరిహద్దులు ఇంకా ఎన్నాళ్లో.. జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. ఆమె తన ఆలోచనలు, పర్యటనల గురించి ఇందులో రాసుకుంది. పాకిస్తాన్ ప్రస్తావన సైతం ఉంది. డైరీలో 11 పేజీల్లో రాయగా.. 8 పేజీల్లో సాధారణ అంశాలు, 3 పేజీల్లో పాకిస్తాన్ గురించి హిందీ, ఇంగ్లిష్ భాషలో రాతలు కనిపిస్తున్నాయి. ‘‘పాకిస్తాన్ ప్రజల ఆదరణ, వారి అతిథి మర్యాదలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాకిస్తాన్లో భారతదేశ హిందువుల పర్యటనలు ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్‌లోని తమ పూరీ్వకుల గ్రామాలను హిందువులు సందర్శించాలి.అక్కడి హిందూ ఆలయాలు, గురుద్వారాలకు సులువుగా వెళ్లొచ్చే పరిస్థితులు రావాలి. 1947లో దేశ విభజన తర్వాత విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిస్తే బాగుంటుంది. పాకిస్తాన్లో పది రోజుల పర్యటన పూర్తి చేసుకొని ఈ రోజే ఇండియాకు తిరిగొచ్చా. రెండు దేశాల మధ్య ఈ సరిహద్దులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. బాధపడే హృదయాలకు ఉపశమనం కలగాలి. మనమంతా ఒకే దేశం, ఒకే నేలకు చెందినవాళ్లం’’ అని జ్యోతి తన డైరీలో రాసుకుంది. మరోవైపు ఆమె కశీ్మర్ పర్యటనల వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.అర్ధరాత్రి పొద్దుపోయే దాకా పనిచేయడం ఆమెకు అలవాటు అని గుర్తించారు. రాత్రి ఒంటి గంట సమయంలో వీడియోలను ఎడిటింగ్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుండేదని చెప్పారు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి మరోచోటుకి వెళ్లినట్లు గుర్తించారు. జ్యోతి వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆమె ఫోటోలన్నీ తొలగించారు. తన బిడ్డ సంగతి తనకు తెలియదని, దీనిపై తనను ఏమీ ప్రశ్నించవద్దని జ్యోతి తండ్రి స్పష్టం చేశారు. నిందితురాలిపై ప్రశ్నల వర్షంయూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. పూర్తి సమాచారం రాబట్టానికి భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణాల వివరాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆమె పాకిస్తాన్, చైనాతోపాటు ఇతర దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 16న ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో గత రెండు వారాల్లో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఆదాయానికి, ఖర్చులకు పొంతనేదీ?ఇదిలా ఉండగా, నిందితురాలు జ్యోతి మల్హోత్రా ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ పర్యటించింది, ఎవరిని కలిసిందీ పూర్తి వివరాలు తెలిస్తే వాటన్నింటినీ క్రోడీకరిస్తామని, దానివల్ల దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారానే తనకు ఆదాయం వస్తోందని నిందితురాలు చెబుతుండగా, అధికారులు విశ్వసించడం లేదు. ఆమెకు వచ్చిన ఆదాయానికి, విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులకు పొంతన లేదని అంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వివరాలు కూపీ లాగుతున్నారు.జ్యోతి ల్యాప్‌టాప్‌పై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని అధికారులు చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య నాలుగు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేసే ఓ అధికారిని తరచుగా కలిసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సిబ్బందితో ఆమెకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. సోషల్ మీడియా ద్వారా జనంలో గుర్తింపు పొందినవారిని నియమించుకొని, దేశ రహస్యాలు కొల్లగొట్టడం ఆధునిక యుద్ధరీతిలో ఒక భాగంగా మారిందని తెలిపారు. -
వ్యభిచారం కేసులో ఒలింపిక్ చాంపియన్ అరెస్టు
కొలంబస్: అమెరికా స్టార్ రెజ్లర్ కైల్ స్నైడర్ వ్యభిచారం కేసులో అరెస్టయ్యాడు. 20 ఏళ్ల వయసులో రియో ఒలింపిక్స్ (2016)లో ఫ్రీస్టయిల్ 97 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన స్నైడర్ టోక్యో ఒలింపిక్స్ (2020)లో రజత పతకం సాధించాడు. పిన్నవయసులో అమెరికా రెజ్లింగ్ చాంపియన్‌గా ఘనతకెక్కిన స్నైడర్‌ను వ్యభిచారం కేసులో ఈ నెల 9న అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో స్నైడర్ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 29 ఏళ్ల స్నైడర్‌ను తాజాగా కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అతనికి 250 అమెరికన్ డాలర్లు (రూ. 21,386) జరిమానా విధించడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం ఒక రోజంతా పని చేయాలని ఆదేశించారు. తీర్పు అనంతరం తన తప్పుపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రెజ్లర్ ఇకపై సరైన నిర్ణయాలతో జీవితాన్ని కొనసాగిస్తానని, తన తప్పువల్ల కుటుంబం పడిన వేదన తనకు అర్థమైందని వాపోయాడు. అతని భార్య మ్యాడీ ఫుట్‌బాల్ ప్లేయర్! రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన స్నైడర్ గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్నైడర్ మూడు స్వర్ణ పతకాలు (2015, 2017, 2022), రెండు రజత పతకాలు (2018, 2021), రెండు కాంస్య పతకాలు (2019, 2023) సాధించాడు. అమెరికాలోని నేషనల్ కాలేజ్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) క్రీడల్లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో స్నైడర్ 30 స్వర్ణ పతకాలు, 5 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు గెలిచాడు. 199 బౌట్లలో నెగ్గి, 21 బౌట్లలో మాత్రమే ఓడిపోయాడు. ఇటీవలే అతను రియల్ అమెరికన్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లీగ్‌లో పాల్గొనేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. -
25 మందిని వివాహం చేసుకున్న యువతి.. 26వ పెళ్లితో
జైపూర్: పెళ్లి పేరుతో అమాయికుల్ని మోసం చేస్తున్న నిత్య పెళ్లి కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 25మందిని పెళ్లి చేసుకున్న నిత్యపెళ్లి కూతురు 26వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. పోలీసులకు అడ్డంగా దొరికి పోయింది.వివరాల్లోకి వెళ్లితే.. రాజస్తాన్‌కు చెందిన యువతి అనురాధా పాస్వాన్ది కడుపేదరికం, ఒంటరి జీవితం, నిరుద్యోగైన తమ్ముడు బాధ్యతను తానే చూసుకోవాలి. పెళ్లి చేసుకునేందుకు చేతిలో డబ్బు లేదు. వెరసీ.. పేదరికం నుంచి బయటపడేందుకు కతర్నాక్ ప్లాన్ వేసింది. తనకున్న అందం, తెలివితేటలతో పెళ్లి పేరుతో వరుస మోసాలకు పాల్పడింది.పెళ్లి చేసుకోవడం. ఆపై అత్తారింట్లో అనుకువగా ఉండటం. వారిని తన మాటలతో నమ్మించి ఇంట్లో ఉన్న బంగారం,డబ్బులు,ఖరీదైన వస్తువుల్ని అందినకాడికి దోచుకోవడం పరారవ్వడం. పేరు మార్చి, మకాం మార్చడం మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇలా తక్కువ సమయంలో 25మందిని వివాహం చేసుకుంది.ఇందుకోసం తానే ఓ గ్యాంగ్‌ను నడుపుతోంది. అమాయకులు, పెళ్లి కుమార్తె కోసం అన్వేషిస్తున్న వారి ఇంటికి తన గ్యాంగ్‌లోని మనిషిని పంపిస్తోంది. ఈ గ్యాంగ్ ఆమె ఫోటోలు, ప్రొఫైల్‌ను పెళ్లి కుమారులకు చూపిస్తారు. అనంతరం, పెళ్లికి ఒప్పిస్తారు. ఇందుకు గాను పెళ్లి కుమార్తెను చూసినందుకు పెళ్లి కుమారుడి కుటుంబం నుంచి రూ.2లక్షలు వసూలు చేస్తారు. పెళ్లి తర్వాత ప్లాన్ ప్రకారం.. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే అనురాధా పాస్వాన్ అత్తింటి వారితో అనుకువగా మెసులుతుంది. ఇంట్లో ఉన్న బంగారాన్ని ఉడాయించాలనుకుంటే వెంటనే తన ప్లాన్‌లో భాగంగా కట్టుకున్న భర్త, ఇతర కుటుంబసభ్యులు తినే ఆహారంలో మత్తు మందు కలుపుతుంది. మత్తు మందు కలిపిన ఆహారం తిన్న కుటుంబ సభ్యులు ఆపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను కాజేస్తుంది.ఇప్పటివరకు 25 మందిని బురిడీ కొట్టించింది. ఈ క్రమంలో అనురాధా పాస్వాన్ చేతిలో మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె రూట్లోనే వెళ్లారు. నిత్యపెళ్లి కుమార్తెను, ఆమె ముఠా గుట్టురట్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
స్పా ముసుగులో వ్యభిచారం
కర్ణాటక: మండ్య నగరంలోని బెంగళూరు -మైసూరు జాతీయ రహదారిలో క్లౌడ్ -11 పేరుతో నిర్వహిస్తున్న యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పాపై ఒడనాడు సంస్థ సిబ్బంది, పోలీసులు సం యుక్తంగా దాడి చేశారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి సెలూన్ యజమాని ఎలిజబెతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలకు విముక్తి కల్పించారు.ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వారిని వ్యభిచారం ఊబిలోకి దింపారని పోలీసులు తెలిపారు. ఈ స్పా సమీపంలోనే విద్యా సంస్థలు ఉన్నాయి. స్పాలో చీకటి వ్యవహారాలు జరుగుతున్నట్లు ప్రజలనుంచి ఫిర్యాదులు రావడంతో ఒడనాడు సంస్థకు చెందిన స్వాన్లి పరశురామ్, సీఐ నవీన్ లు పోలీసులతో కలిసి దాడి చేశారు. -
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నా కుమారుడిది సహజ మరణం కాదు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. నా కుమారుడు నివాసముంటున్న నివాసంలోనే అతని భార్య స్నేహితుడు కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని నా కోడలు చెప్పలేదు. దీనిపై విచారణ చేపట్టండి’ అంటూ శ్రీకాకుళానికి చెందిన మృతుడి తండ్రి పీ.నరసింహమూర్తి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శీకాకుళం ప్రాంతానికి చెందిన పూతల గణేష్ కుమార్(34), అతని భార్య అమృత, వారి బాబుతో కలిసి నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడు నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. గణేష్‌కుమార్ మేనకూరు సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గణేష్‌కుమార్ ఇంట్లో నిద్రలేచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తీసుకెళ్తుండగా గణేష్‌కుమార్ మృతి చెందినట్లుగా భార్య అమృత పేర్కొన్నారు. అయితే కోడలు అమృత చెప్పిన విషయాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. తన కుమారుడు నివాసముంటున్న ఇంట్లో కోడలు అమృత స్నేహితుడు కూడా ఉంటున్నాడు. ఆ విషయం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గణేష్‌కుమార్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు శ్రీకాకుళం నుంచి నాయుడుపేటకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. -
నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు..!
నాయుడుపేట టౌన్(తిరుపతి): ‘నాన్నే అమ్మను రాయితో గుద్ది చంపేశాడు.. మా కళ్లెదుటే అమ్మ చనిపోయింది’ అంటూ ఆ చిన్నారి కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని తన తల్లిని చంపిన వైనాన్ని పోలీసులకు వివరించిన తీరు స్థానికులను కలచివేసింది. కన్న బిడ్డల ఎదుటే అతి కిరాతకంగా భార్యను కడతేర్చిన ఘటనపై పోలీసులు సోమవారం విచారణ చేపట్టారు. వివరాలు.. మండల పరిధిలోని మడపలం గ్రామ సమీపంలో కాలువ గట్టు వద్ద శనివారం రాత్రి మద్యం మత్తులో భార్య వీణమ్మ(28)ను భర్త రాపూరు శ్రీనివాసులు హత్య చేసిన విషయం తెలిసిందే. మృతురాలి తల్లి తుపాకులు పెంచలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలికి అఖిల(7), బత్తెయ్య(4), ఆదెయ్య(3) చిన్నారులున్నారు. శనివారం రాత్రి భర్త శ్రీనివాసులు పూటుగా మద్యం సేవించి భార్య వీణమ్మతో గొడవపడ్డాడు. ఆపై బండరాయితో తలపై మోది చంపేశాడు. తర్వాత పాము కాటు వేయడంతో వీణమ్మ మృతి చెందిందని నమ్మబలికాడు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి పెంచలమ్మ ఆదివారం ఉదయం బిక్కుబిక్కుమంటూ ఏడ్చుతున్న వీణమ్మ పిల్లల్ని అక్కున చేర్చుకుంది.పోలీసుల ఔదార్యం విచారణ అనంతరం వీణమ్మ మృతదేహానికి సోమవారం నాయుడుపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతురాలి కుటంబ సభ్యులు నిరుపేద గిరిజనులు కావండతో వారికి పోలీసులు అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించారు. వీణమ్మ మృతదేహాన్ని సైతం తీసుకెళ్లందుకు వారి వద్ద నగదు లేక పోవడంతో పోలీసులే నాయుడుపేటలో వీణమ్మకు అంత్యక్రియలు జరిపించారు. పరారీలో ఉన్న ఆమె భర్త శ్రీనివాసులును త్వరలో పట్టుకుంటామని తెలిపారు. -
Hyderabad: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్(హైదరాబాద్): ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. క్రాష్ బారియర్‌ను ఢీకొట్టడంతో కారులోకి పది మీటర్ల మేర దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. బెంగాల్ రాష్ట్రానికి చెందిన కితాబ్‌అలీ అలియాస్ హిలాల్ (35) ఘట్కేసర్ మండలం, నాగారంలోని శిల్పానగర్, విశ్వసాయి బృందావనం అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. తుక్కుగూడ సమీపంలోని వివిధ కంపెనీలకు మ్యాన్‌పవర్ సప్లయ్ చేసేవాడు. సోమవారం ఉదయం తుక్కుగూడకు వచ్చి తిరిగి నాగారం వైపు కారులో వెళ్తున్నాడు. బొంగ్లూర్ ఎగ్జిట్ 12 వద్దకు రాగానే అతివేగం కారణంగా కారు అదుపుతప్పి క్రాష్ బారియర్‌ను ఢీకొంది. దీంతో కారు అద్దంలో నుంచి క్రాష్ బారియర్ పది మీటర్ల వరకు దూసుకెళ్లడంతో కితాబ్‌అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో క్రాష్‌బారియర్ ఇరక్కుపోవడంతో మృతదేహం బయటకు తీయడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఔటర్‌రింగ్ రోడ్డు సిబ్బంది సహాయంతో కారు పైభాగం కట్ చేయించి గంటల తరబడి శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. సీఐ రాఘవేందర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మంచి మాటలు చెప్పినందుకు...
మేడ్చల్: మద్యానికి బానిసై సంసారాన్ని ఎందుకు చెడగొట్టుకుంటున్నావ్ మంచిగా ఉంటూ భార్యా పిల్లలను బాగా చూసుకో అంటూ నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ఓ వ్యక్తి తన బావ వరుసైన వ్యక్తిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానిక సరస్వతీనగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన సోలంకి మోతీలాల్(43), అతడి మేనత్త కుమారుడు శంకర్(35) కుటుంబాలతో కలిసి రైల్వె స్టేషన్ సమీపంలోని సరస్వతీ నగర్లో ఉంటూ భవన నిర్మాణ కారి్మకులుగా పని చేస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన శంకర్ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కూడా మద్యం తాగి వచి్చన అతను కుటుంబ సభ్యులతో గొడవ పడి సమీపంలోని రైల్వే ప్లాట్ ఫారంపై పడుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోతీలాల్ అక్కడికి వెళ్లి శంకర్‌కు నచ్చజెప్పేందుకు యతి్నంచాడు. అయితే మద్యం మత్తులో ఉన్న శంకర్ అతడిని దుర్బాషలాడాడు. అనవసరంగా భార్యా పిల్లలతో గొడవలు ఎందుకని అతడికి సర్దిచెప్పిన మోతీలాల్ శంకర్‌ను ఇంట్లో దిగబెట్టి తన ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమైన మోతీలాల్ తన బంధువుల ఇంటి వద్దకు వెళుతుండగా అతడిని అడ్డుకున్న శంకర్ తన కుటుంబ విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ అతడిని తిడుతూ దాడి చేసేందుకు వెళ్లాడు. దీంతో మోతీలాల్ ఈ విషయాన్ని శంకర్ తల్లికి చెప్పేందుకు వెళుతుండగా ఆగ్రహానికి లోనైన శంకర్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మోతీలాల్పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడే కుప్పకూలడంతో శంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు మోతీలాల్‌ను 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. -
తెలంగాణ రాజ్‌భవన్ హార్డ్ డిస్క్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సస్పెండైన ఉద్యోగి శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌భవన్ చోరీ కేసు నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేయగా.. ఆ కేసులో మొదటిసారి అరెస్ట్ చేశారు. కాగా.. హార్డ్ డిస్క్‌ల చోరీ కేసులో రెండోసారి చేశారు. ఆ ఉద్యోగి వారంలో రెండుసార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది. సస్పెండ్ అయినా కానీ.. సెక్యూరిటీని మాయ చేసి రాత్రి సమయంలో రాజ్‌భవన్‌లోకి ప్రవేశించాడు. రాజ్ భవన్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో శ్రీనివాస్.. ఓ మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫొటోలను చూపించాడు. ఎవరో తనకు ఈ ఫోటోలు పంపిస్తున్నారు జాగ్రత్త అంటూ భయపెట్టాడు. దీంతో కలవరపాటుకు గురైన ఆ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మార్ఫింగ్ ఫోటోలను సృష్టించింది.. శ్రీనివాసేనని తేల్చారు. శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. రాజభవన్ అధికారులు శ్రీనివాస్ సస్పెండ్ చేశారు.జైలకు వెళ్లిన శ్రీనివాస్.. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి లోపలికి వెళ్ళాడు. తన కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్‌ను చోరీ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై రాజభవన్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు సీసీ కెమెరాల ద్వారా శ్రీనివాస్ చోరీని గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి.. హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన ఫోటోలు ఉండడంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడాడ్డని తెలిసింది. -
కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
రాయచోటి టౌన్(అన్నమయ్య): కాళ్లు.. చేతులు కట్టేశారు.. గొంతుకు తాడుతో బిగించారు.. చనిపోయిన తరువాత ఆనవాళ్లు లభించకుండా చేసేందుకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. అయితే మృతి చెందిన మహిళ చేతి పై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హత్య జరిగిన వా రం రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. మృతురాలు మదనపల్లె నియోజకవర్గం పరిధిలోని రామసముద్రం ప్రాంతానికి చెందిన వెంకటరమణ భార్య బూసిపల్లె శివమ్మ(27) గా గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం విలేకరుల స మావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలోని రామసముద్రం మండలం చెంబుకూరు ఎలకపల్లె రహదారిలో ఈనెల 11వ తేదీ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగించారు. మృతదేహంపై పెట్రోలు పోసి తగలబెట్టడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్కడ పెట్రోల్ కోసం వాడిన బాటిల్ మాత్రమే ఉండింది. అయితే మృతురాలి చేతిపై యస్మిత అనే పచ్చబొట్టు ఉండటంతో దాని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. పచ్చ బొట్టును సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనే విషయం తెలిసింది. అలాగే డాగ్‌స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి బెంగళూరు రోడ్డు వైపు వెళ్లడంతో ఆ మేరకు టెక్నాలజీని ఉపయోగించి నిందితులను గుర్తించారు. నిందితులంతా మృతురాలి బంధువులే అని తేలడంతో ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బెంగళూరులో నివాసం ఉంటున్న ఎం.నీలావతి, రామసముద్రం మండలం గుండేవారిపల్లె నడింపల్లె ప్రాంతానికి చెందిన కన్నెమడుగు గణేష్, బెంగళూరులోని బి.హోసహళ్లి సజ్జాపురం ప్రాంతం అంబేద్కర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్ ఉన్నారు.ఎందుకు హత్య చేశారంటే..మృతురాలు బూసిపల్లె శివమ్మ అదే ప్రాంతానికి చెందిన సంతోష్ అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె బంధువులు భర్తకు తెలియకుండా ఆమెను హత్య చేసేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగా మృతురాలి బంధువైన నీలావతి బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్‌తో హత్య చేసేందుకు బేరం కుదుర్చుకుంది. వీరికి కన్నెమడుగు గణేష్ అనే వ్యక్తి సహకరించాడు. ఆ తర్వాత వారు రామసముద్రం వచ్చి శివమ్మకు మాయమాటలు చెప్పి ఆమెను తమ వెంట శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకు తాడు బిగించి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక ముందుగానే తమ వెంట తెచ్చుకున్న పెట్రోలును మృతదేహంపై పోసి నిప్పంటించారు. అయితే ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. మదనపల్లె డీఎస్పీ ఎస్.మహేంద్ర, రూరల్ సీఐ సత్యనారాయణ, రామసముద్రం ఎస్ఐ జి.రవికుమార్, మరికొంతమంది సిబ్బంది చాకచక్యంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారని ఎస్పీ ప్రశంసించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారుసోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే కఠిన చర్యలురాయచోటి టౌన్ : సమాజంలో ప్రజలను ఉద్రేకపరిచేలా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్‌లు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లాఎస్పీ విద్యా సాగర్‌నాయుడు హెచ్చరించారు. మదనపల్లెలో హనుమాన్ శోభాయాత్రలో జరిగిన సంఘటనపై సోమవారం ఆయన స్పందించి విలేకరులతో మాట్లాడారు. శోభాయాత్ర నిర్వాహకులు ముందుగా తమతో అనుమతులు పొందే సమయంలో ఇచ్చిన రూట్‌మ్యాప్ ప్రకారం కాకుండా వేరే దారిలో వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా సమస్యలు సృష్టించాలని చూశారన్నారు. ప్రకటించిన సమయానికి రాకుండా సుమారు ఒకటిన్నర గంట ఆలస్యంగా రావడమే కాకుండా దారి మళ్లించి సమస్య ను సృష్టించడంతో తమ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చిందన్నారు. కావాలనే శోభాయాత్రను దారి మళ్లించి సమస్యలు సృష్టించేందుకు కారణమైన వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే అక్కడ ఏదో జరిగిందని ఒక వర్గాన్ని అణచివేస్తున్నట్లుగా తప్పు డు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపైన కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించుకోవాలని సూచించారు. -
మామిడికాయ పచ్చడి విషయంలో గొడవ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మామిడికాయ పచ్చడి పెట?్ట విషయంలో తలెత్తిన గొడవలో భార్యను గొంతు నులిపి చంపాడు భర్త. ఈ ఘటన పందిళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర అంజలి– సూర రాజ్‌కుమార్ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం మామిడికాయ పచ్చడి పెట్టేందుకు అంజలి సన్నద్ధమైంది. ఇందుకోసం అవసరమైన వెల్లుల్లి కొనుక్కు రావాలని భర్త రాజ్‌కుమార్‌కు సూచించింది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్.. అంజలి(27)ను గొంతు నులిమి చంపేశాడు. ఈమేరకు మృతురాలి తండ్రి సంపంగి మల్లేశ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శవాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు. -
ఆత్మహత్య వెనుక.. ప్రొఫెసర్‌తో ప్రేమ
యశవంతపుర: ఓ ప్రొఫెసర్ ప్రేమ పురాణం యువ ఇంజినీరును బలిగొన్నట్లు తేలింది. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థళకు చెందిన ఏరోనాటిక్స్ ఇంజినీరు ఆకాంక్ష ఎస్ నాయర్ (23) ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. ఈ నెల 17న ఆమె పంజాబ్‌లో జలంధర్ వద్ద పగ్వారలో ఎల్పీయూ విద్యాసంస్థలో నాలుగో అంతస్తు నుంచి కిందపడి చనిపోయారు. అక్కడి పోలీసుల విచారణలో పలు విషయాలు తెలిశాయి. అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కేరళ కొట్టాయంవాసి బిజిల్ మ్యాథ్యూతో ప్రేమలో పడిందని, అతనికి ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. అతని ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. అతడు తిరస్కరించి కాలేజీకి వచ్చాడు. మళ్లీ అక్కడకు వచ్చిన ఆకాంక్ష మ్యాథ్యూతో గొడవ పడింది, పెళ్లి చేసుకోనని అతడు తెగేసి చెప్పడంతో మోసపోయానని బాధపడింది, అక్కడే నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె చావుకు కారణమయ్యాడని మ్యాథ్యూపై జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు ఆమె భౌతికకాయాన్ని ఇంటికి తీసుకువచ్చారు. దారి తప్పిన ప్రేమ ఎంతపని చేసిందని బంధుమిత్రులు శోకంలో మునిగిపోయారు. ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి -
తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ.. హార్డ్ డిస్క్‌లు మాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్ భవన్లో చోరీ కలకలం రేపింది. చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుధర్మ భవన్లో నాలుగు హార్డ్ డిస్క్‌లు చోరీ అయినట్లు అధికారులు నిర్థారించారు. మొదటి అంతస్తులోని రూమ్ నుంచి హార్డ్ డిస్క్‌లను అపహరించారు.14వ తేదీన హెల్మెట్ ధరించిన వ్యక్తి.. నాలుగు హార్డ్ డిస్క్‌లను చోరీ చేశాడు. హార్డ్ డిస్క్‌లో కీలకమైన సమాచారం, ఫైల్స్ ఉన్నట్లుగా రాజ్ భవన్ అధికారులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చోరీ ఘటన బయటపడింది. పంజాగుట్ట పోలీసులకు రాజ్‌భవన్ అధికారలు ఫిర్యాదు చేశారు. -
ఉరివేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
రామగిరి(మంథని): కల్వచర్ల గ్రామానికి చెందిన వేముల లింగయ్య(90) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రకుమార్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం .. లింగయ్య భార్య పద్మ కొంతకాలం క్రితం మరణించడంతో లింగయ్య ఒంటరితనం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి తన ఐదో కుమారుడు ఇంట్లో భోజనం చేయాలని అడుగగా తినకుండా వెళ్లి పడుకున్నాడు. సోమవారం ఉదయం బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి తలుపుతీయగా రేకులషెడ్డు కర్రకు ఉరి వేసుకుని ఉన్నాడు. తమ తండ్రి ఒంటరిగా ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి పెద్ద కుమారుడు వేముల కుమార్‌స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
మాజీ ప్రధానిగా నటనకు ప్రశంసలు, హత్యాయత్నం కేసులో అందాల నటి
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయింది. ఢాకాలోని షాజహాన్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం కేసులో ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరా నటి? ఆమె చేసిన తప్పేంటి? పోలీసలు ఆమెపై ఎందుకు కన్నేశారు? తెలుసుకుందాం.హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్ చేసిన పోలీసులు గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది. దీనిపై నుస్రత్ ఫరియా న్యాయవాది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీన్ని ఈ నెల(మే) 22న విచారిస్తుంది. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారితీసిన నిరసనలతో ఈ అరెస్ట్ ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నుస్రత్ ఫరియాపై అవామీ లీగ్‌కు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.నివేదికల ప్రకారం ఫరియా థాయిలాండ్‌కు వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో పోలీసులు అడ్డకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనా పాత్రను ఫరియా పోషించి పాపులర్ అయింది ఫరియా. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్' చిత్రంలో హసీనా పాత్ర ఫరియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2023నాటి ఈ మూవీకి శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ , భారతదేశం కలిసి నిర్మించగా అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్గత నెల వరకు,హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన నిరసనలకు సంబంధించి కనీసం 137 మంది జర్నలిస్టులు 32 కేసుల్లో చిక్కుకున్నారు. కేసులోని వివరాల ప్రకారం నుస్రత్ ఫరియా, నటుడు అపు బిశ్వాస్, నిపున్ అక్తర్, అష్నా హబీబ్ భబ్నా, జాయెద్ ఖాన్ మరో 12 మందితో కలిసి భటారా ప్రాంతంలో జరిగిన వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. షేక్ హసీనా, 283 మందిపై కూడా ఇదే కేసులో ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకునే వరకు పాలనను నిర్ధారించేలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కొంతమందివ్యక్తులను, పత్రికలను లక్ష్యంగా చేసుకున్నట్లు పౌర హక్కుల సంస్థలు, నేతలు మండి పడుతున్నారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ ఉగ్రవాదులు జైలు నుండి విడుదలవుతున్నారు. ప్రస్తుత పాలనలో ఉగ్రవాదులకు మద్దతుగా, భారత వ్యతిరేక స్వరాలకు ఊతమిచ్చినట్టవుతోందనే విమర్శలు బాగా విని పిస్తున్నాయి. నుస్రత్ ఫరియా 2013లో టెలివిజన్ యాంకర్‌గా పనిచేసింది. అందుకు ముందు రేడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె కొన్ని నాటకాల్లో కూడా నటించింది. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్తంగా నిర్మితమైన ‘ఆషికి’ ద్వారా వెండితెరకు పరిచయం మంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ తమనవైపు తిప్పుకుంది. అనేక సినిమాల్లో నటించింది. ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! -
సైబర్ మోసాలు : చదువుకున్నవారే ఎక్కువగా..!
హాస్టళ్లలో దొంగతనాలు ఎక్కువ ప్రధాన కూడళ్లలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలుమాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయ్‌నాయక్ మాదాపూర్: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నారని మాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డి.విజయ్‌నాయక్ తెలిపారు. సోషల్ మీడియా, ఫెడెక్స్ మోసాలు, రెంటల్, ఇన్వెస్ట్మెంట్, లోన్స్, బెట్టింగ్ యాప్, కస్టమర్ కేర్ మోసాలు అధికంగా జరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల బారిన పడినపుడు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫోన్.1930కి.. ఇతర సమస్యలు ఎదురైతే 100కి డయల్ చేయాలని ఆయన తెలిపారు. ఈ నేరాలపై ప్రధాన కూడళ్లలో, కళాశాలల్లో, జన సమ్మర్ధం ఉన్నచోట వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. మాదాపూర్ డిటెక్టివ్ టీంలో 10 మంది ఉన్నారు. సైబర్ క్రైంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నవారు ఇద్దరున్నారు. నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరించారు.ఇదీ చదవండి: టెక్ నగరాన్ని ముంచెత్తిన వరద : జేసీబీలో ఎమ్మెల్యే, వైరల్ వీడియో ప్రశ్న: మాదాపూర్ ప్రాంతంలో ఎలాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి? ఇన్స్పెక్టర్: సైబర్ నేరాలతో పాటు ఎక్కువగా హాస్టళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. సరైన భద్రత లేకపోవడం వల్ల రూంలలోకి చొరబడి ల్యాప్టాప్స్, ఫోన్స్, నగదుతో పాటు ఖరీదైన వస్తువులను దొంగిలిస్తున్నారు. 24 గంటల పాటు సెక్యూరిటీని నియమించాలి. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఐడీ కార్డు ఇవ్వాలి. లోపలికి వెళ్ళేవారు తప్పని సరిగా ఐడీ కార్డులను చూపాలనే నిబంధన ఉండాలి. అప్పుడే దొంగతనాలను అరికట్టవచ్చు. ప్ర: ఫెడెక్స్ మోసం గురించి? జ: గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీకు ఎయిర్‌పోర్టు నుంచి పార్సిల్ వచి్చందని అందులో డ్రగ్స్ ఉన్నాయని.. మీరు ఫలానా పోలీస్‌స్టేషన్‌కు రావాలని భయపెడతారు. కొంత సమయం తరువాత మీరు డబ్బు చెల్లిస్తే కేసు కొట్టివేస్తామని చెప్పి వారివద్ద నుంచి డబ్బు వసూలు చేసి ఫోన్లను స్విచ్చాఫ్ చేస్తారు. ఇలాంటి మోసాల బారిన విద్యావంతులేపడుతున్నారు. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలి. ప్ర: ట్రాన్స్‌జెండర్స్, సోషల్‌మీడియా ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటి? జ: ఖాళీ ప్రదేశాల వద్ద, ప్రధాన కూడళ్లలో ట్రాన్స్‌జెండర్స్ ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్నారు. వారి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలి. వారి వద్ద ఆగవద్దు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే 100కి డయల్ చేయాలి. అమ్మాయి, అబ్బాయిలు కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోలు వారు విడిపోయిన తరువాత మారి్ఫంగ్ చేసి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పర్సనల్ విషయాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ప్ర: బెట్టింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న మోసాలు ఏమిటి..జ: ప్రస్తుతం బెట్టింగ్‌కి అలవాటు పడ్డారంటే ప్రాణాలు కోల్పోవాల్సిందే. చిన్న చిన్న బెట్టింగ్‌లు కట్టినప్పుడు తిరిగి డబ్బును చెల్లించి ఆసక్తి కలిగిస్తారు. అలవాటు అయిన తరువాత పెద్దమొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు పోతాయి. ఇలాంటి అలవాట్లతో బంధువుల వద్ద, స్నేహితుల వద్ద అప్పులు చేస్తుంటారు. నష్టపోయాక దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్ మాదాపూర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విజయ్‌నాయక్ -
అంతా నా ఇష్టం..
నంగునూరు(సిద్దిపేట): ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తుండటంతో పోలీసులకు సైతం తలనొప్పులను తెస్తోంది. ఇటీవల ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితుల ఎదుటే సిబ్బందిపై చిందులు తొక్కడంతో అక్కడే ఉన్న ఎస్ఐ, పోలీసులు అవాక్కయ్యారు. ఇంత జరుగుతున్నా ఆమెపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో సివిల్ వివాదాల్లో సహితం జోక్యం చేసుకుంటున్నారు. రెండు రోజుల కిందట ఏకంగా మండల మెజి్రస్టేట్, తహసీల్దార్‌కు ఫోన్ చేసి రిజి్రస్టేషన్ ఆపాలని చెప్పడంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్.. రిసెప్షన్ గదిలో విధులు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుగా ఆమెనే కలవాల్సిరావడం అనుకూలంగా మార్చుకున్నారు. కేసులకు సంబంధించిన ఫిర్యాదులో జోక్యం చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారం రోజుల కిందట తనపై అధికారిపై ఎస్ఐ, సిబ్బంది, బాధితుల ఎదుటే వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్ ఆపాలంటూ తహసీల్దార్‌కు ఫోన్.. నంగునూరుకు చెందిన ఓ వ్యక్తి తన కూతురు పేరిట రెండెకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు శనివారం స్లాట్ బుక్ చేసుకున్నాడు. రిజి్రస్టేషన్ చేయొద్దని అతని కుమారుడు అడ్డు చెప్పడంతో వివాదం రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఈ విషయంపై మహిళా హెడ్‌కానిస్టేబుల్ రిజి్రస్టేషన్ ఆపాలని తహసీల్దార్‌కు ఫోన్ చేయడంతో ఆశ్చర్యానికి గురైన సదురు అధికారి.. ఎస్ఐకి, మరో ఉన్నతాధికారికి ఫోన్ చేసిన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రిసెప్షనిస్ట్ విధుల నుంచి తొలగించాం ఈ విషయమై రాజగోపాల్‌పేట ఎస్ఐ ఎండీ అసీఫ్ను వివరణ కోరగా.. మహిళా హెడ్ కానిస్టేబుల్ తహసీల్దార్‌కు ఫోన్ చేయడం నిజమేనన్నారు. దీంతో తహసీల్దార్ సరిత తనతో పాటు ఏసీపీతో ఫోన్లో మట్లాడారన్నారు. ఆమెను రిసెప్షనిస్ట్ విధుల నుంచి తొలగించి సాధారణ విధులు అప్పగించామన్నారు. -
మాటలకందని విషాదం
అమ్మా... అందరం కలిసి ఆడుకుంటామంటే సరే అన్నారు.. అదే పిల్లల చివరి మాట అని ఆ తల్లులకు తెలియదు.. అక్కడే మృత్యువు కాపుకాసి ఉందని గుర్తించలేకపోయారు.. మూడు గంటల పాటు పిల్లలు కనిపించకపోయే సరికి తల్లిడిల్లిపోయారు.. ఏమయ్యారో అంటూ ఊరంతా గాలించారు.. చివరకు కారులో ప్రాణవాయువు అందక విలవిల్లాడుతూ విగత జీవులుగా కనిపించిన పిల్లలను చూసి కుప్పకూలిపోయారు.విజయనగరం క్రైమ్: సమయం మధ్యాహ్నం 2 గంటలు.. గ్రామంలోని పెళ్లివేడుకలో పెద్దలు, ఆటపాటల్లో చిన్నారులు నిమగ్నమయ్యారు. ఆటలాడుతూ గ్రామ బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఉన్న కారులోకి నలుగురు చిన్నారులు వెళ్లారు. పొరపాటున డోర్లు వేయడంతో లాక్ అయ్యాయి. అంతే.. వారికి ప్రాణ వాయువు అందలేదు. కాపాడాలంటూ వారి ఆర్తనాదాలు బయటకు వినిపించలేదు. మూడుగంటల తర్వాత వెతుకుతూ వెళ్లిన పెద్దలకు కొనఊపిరితో కారులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారులు కనిపించారు. డోర్లు బద్దలగొట్టి చిన్నారులను బయటకు తీసినా ఫలితం లేకపోయింది. చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ ఘటనతో విజయనగరం సమీపంలోని ద్వారపూడిలో మృత్యుఘోష వినిపించింది. సర్వజన ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. మాటలకందని విషాదం అందరూ పదేళ్లలోపు పిల్లలే. కూలి పనులు చేసుకుంటూ తల్లిదండ్రులు వారిని అల్లారు ముద్దుగా సాకుతున్నారు. పిల్లలు ఆడుకుంటేంటే సంబర పడ్డారు. పెళ్లివేడుకలో బిజీ అయ్యారు. ఒకేసారి కారు రూపంలో కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), పండి ఉదయ్ (7), బూర్లె జాస్రిత(8)ను మృత్యువు కాటేయడంతో కన్నీరుకార్చారు. విగతజీవులుగా మారిన చిన్నారులను పట్టుకుని బోరున విలపించారు. కడుపుకోత.. మృతిచెందిన చిన్నారుల్లో బూర్లె చారులత, జాస్రిత అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ ఒకే సారి మృతిచెందడంతో తల్లిదండ్రులు ఉమ, ఆనంద్‌లు విషాదంలో ముని గిపోయారు. దేవుడా.. కడుపుకోత మిగిల్చావా అంటూ విలపించారు. సర్వజన ఆస్పత్రి మార్చురీ వద్ద ఉన్న కుమార్తెల మృతదేహాలను చూసిన ఉమ ఓ దశలో సొమ్మసిల్లి పోయింది. ఉదయ్ తల్లిదండ్రులు బుచ్చిబాబు, భవానీ, మణీశ్వరి తల్లిదండ్రులు సురేష్ అరుణలు సైతం బిడ్డల మృతదేహాలను పట్టుకుని రోదించారు.ఇళ్ల మధ్యనే ఘటన... మృత్యువుకు కారణమైన కారు వీధిలో ఇళ్ల మధ్యనే ఉంది. దాని పక్కగుండానే అందరూ రాకపోకలు సాగించినా.. అందులో ఉన్న చిన్నారులను గుర్తించలేకపోయారు. వారి ఆర్తనాదాలను ఆలకించలేకపోయారు. కారు అద్దాలు నలుపువి కావడం కూడా దీనికి ఓ కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్‌టౌన్ ఎస్ఐ రామ్‌గణేష్‌లు హుటాహుటిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వజన ఆస్పత్రికి వచ్చి మృతుల వివరాలు సేకరించారు.కారు ఎవరిది? బీసీ కాలనీ నీళ్ల ట్యాంకు వద్ద ఆగి ఉన్న కారు ఎవరిది..? అక్కడే ఎందుకు పార్క్ చేశారు? డోర్‌కు లాక్ ఎందుకు వేయలేదు అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ద్వారపూడిలో జరుగుతున్న పెళ్లి వేడుకకు సంబంధించి వైజాగ్ నుంచి ఆ కారు వచ్చినట్టు సమాచారం. కారు ఓనర్, డ్రైవర్ ఒక్కరేనని తెలిసింది. సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. -
ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యావంతురాలి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ధర్మస్థలం నివాసి అయిన ఏరోస్పేస్ ఇంజినీర్ పంజాబ్‌లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆకాంక్ష (23) మృతురాలు. ధర్మస్థలంలోని బోళియార్ నివాసులైన సురేంద్ర, సింధూదేవి దంపతుల కుమార్తె ఆకాంక్ష, పంజాబ్‌లోని ఫగ్వాడాలో ఎల్పీయూ విద్యాసంస్థలో ఉన్నత విద్యను పూర్తి చేసి, 6 నెలల నుంచి ఢిల్లీలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. తరువాత జపాన్‌లో ఉద్యోగం సంపాదించుకున్న ఆకాంక్ష తాను చదివిన కాలేజీలో కొన్ని సర్టిఫికెట్లు పొందడానికి పంజాబ్‌కు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం సర్టిఫికెట్లు తీసుకున్నట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. జలంధర్ నగరంలో ఉన్నట్లు తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఓ భవనంలో 3వ అంతస్తు పడి దుర్మరణం చెందింది. స్థానిక పోలీసులు ఆ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే తల్లిదండ్రులు పంజాబ్‌కు వెళ్లారు. ఏదో దారుణం జరిగిందని, ఇది ప్రమాదం కాదని తల్లిదండ్రులు వాపోయారు. -
ఉగ్రకుట్ర భగ్నం
సాక్షి,హైదరాబాద్/విజయనగరం/విజయనగరం క్రైమ్: తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు (సీఐ సెల్) హైదరాబాద్ బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్(28)ను అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్‌ను విజయనగరం తరలించారు. డమ్మీ బ్లాస్ట్‌లకు కుట్ర విజయనగరానికి చెందిన సిరాజ్.. సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహబుల్ మిసిలెన’ (ఏహెచ్‌ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులకు కీలక అధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓహ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐ సెల్‌కు సమాచారం అందింది.దీంతో తెలంగాణ సీఐ సెల్ అధికారులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలుకు పూనుకున్నట్టు సమాచారం. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో చదువుకున్నప్పుడే... సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో సమీర్‌తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్‌తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలుచేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. -
ఐదుగురు చిన్నారులు జలసమాధి
కుప్పం రూరల్/బుట్టాయగూడెం: వేసవి సెలవుల్లో చిన్నారుల సందడితో కళకళలాడాల్సిన ఇళ్లల్లో విషాదం అలముకుంది. అప్పటివరకు కుటుంబసభ్యులతో సంతోషంగా గడిపిన ఐదుగురు చిన్నారులు జల సమాధి అయ్యారు. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. చిత్తూరు జిల్లా దేవరాజపురంలో ఆడుకోవడానికి వెళ్లి నీటి కుంటలో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు జలాశయంలో నీటమునిగి ఓ అన్న, తమ్ముడు మృతి చెందారు. ప్రమాదవశాత్తూ జారి పడి..చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురానికి చెందిన యశోద, వరలక్ష్మి, రాజా ఒకే తల్లి బిడ్డలు. యశోద తమిళనాడులో నివసిస్తుండగా.. వరలక్ష్మి, రాజా దేవరాజపురంలోనే ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో యశోద తన కుమారుడు అశ్విన్‌తో కలిసి ఇటీవల దేవరాజపురం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం యశోద కుమారుడు అశ్విన్(7), వరలక్ష్మి కుమార్తె గౌతమి(6), రాజా కుమార్తె శాలిని(7) ఆడుకుంటూ.. సమీపంలోని నీటి కుంట వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ ముగ్గురూ అందులోకి జారిపడ్డారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఎంతసేపటికీ రాకపోవడంతో.. తల్లిదండ్రులు వారిని వెదుకుతూ నీటి కుంట వద్దకు వెళ్లగా.. ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. వారిని అలా చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేయనున్నట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు.బిడ్డల కోసం తల్లి పోరాడినా..తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ అన్వర్, పర్విన్ దంపతులకు ఇద్దరు కుమారులు సిద్దిక్(10), అబ్దుల్(7). వేసవి సెలవులు కావడంతో పర్విన్ తన ఇద్దరు కుమారులను తీసుకుని జంగారెడ్డిగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆదివారం బంధువులతో కలిసి బుట్టాయగూడెం మండలం అలివేరు సమీపంలోని జల్లేరు జలాశయాన్ని చూసేందుకు వెళ్లారు. నీళ్లు తక్కువగా ఉండడంతో స్నానం చేసేందుకని జలాశయంలోకి దిగారు. సిద్దిక్, అబ్దుల్ లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్లడంతో.. నీట మునిగారు. వారిని కాపాడేందుకు తల్లి పర్విన్తో పాటు మరో మహిళ ప్రయత్నించారు.ఈ క్రమంలో వారిద్దరూ కూడా నీటిలో మునిగిపోతుండగా.. స్థానికులు చున్నీల సాయంతో వారిద్దరినీ బయటకు లాగారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ దుర్గామహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకొని పిల్లల కోసం జలాశయంలో గాలించారు. గంట సేపటి తర్వాత స్థానికుల సాయంతో వలలు వేసి.. పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లలూ.. ఒకేసారి మరణించడంతో తల్లిదండ్రులు ‘ఇక మాకు దిక్కెవరు?’ అంటూ రోదించారు. చిన్నారుల మృతిపై సీఎం విచారం సాక్షి, అమరావతి: విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడటంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పిల్లల మృతితో తీవ్ర శోకంలో ఉన్న తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. -
చిన్నారుల ఉసురు తీసిన కారు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని ద్వారపూడి గ్రామంలో విషాదం అలముకుంది. ఆటలాడుతూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. విజయనగరం రూరల్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారపూడి గ్రామం, బీసీ కాలనీలో ఆదివారం ఒక పెళ్లివేడుక జరిగింది పెళ్లి హడావిడిలో ఉన్న తల్లిదండ్రులను విడిచి, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకటో తరగతి చదువుతున్న కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), 2వ తరగతి చదువుతున్న బూర్లె జాస్రిత (8), 3వ తరగతి చదువుతున్న పండి ఉదయ్ (7) సమీపంలోని నీళ్ల ట్యాంక్ వద్ద ఆడుకోవడానికి వచ్చారు. ఆటల్లో ఆటగా అక్కడే ఆగి ఉన్న ఒక కారులోకి ఎక్కారు. అకస్మాత్తుగా డోర్ లాక్ కావడంతో లోపల చిక్కుకుపోయారు. కేకలు వేసినా బయటకు వినపడక పోవడంతో నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి సందడిలో ఉన్న తల్లిదండ్రులు, ఎంతకూ తమ పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో కారులో పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.వెంటనే కారు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్నారన్న భావనతో 108 వాహనంలో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతిచెందినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుల్లో చారులత, జాస్రిత అక్కచెల్లెళ్లు. ఇద్దరు కుమార్తెలు మృతిచెందడంతో తండ్రి ఆనంద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సంఘటనలో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్‌టౌన్ ఎస్ఐ రామ్‌గణేష్ లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
హత్యాయత్నం కేసు.. ప్రముఖ నటి అరెస్ట్
బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటి నుసారత్ ఫరియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేశారు ఆ దేశ పోలీసులు. ఆమె థాయ్ లాండ్ కు వెళుతున్న క్రమంలో ఢాకా షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. . ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఆమెతో పాటు మరో 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు నమోదయ్యాయిఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ఆధారంగా తమ బృందం విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినట్లు పోలీస్ అధికారి సుజన్ హక్ తెలిపారు. కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్థించిన విషయాన్ని సదరు పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆమెపై పతరా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక 2023లో తెరకెక్కిన ముజిబ్: ద మేకింగ్ ఆఫ్ నేషన్ చిత్రంలో షేక్ హసీనా పాత్రలో నటించింది నుసారత్ ఫరియా. -
తీవ్ర విషాదం.. కారు డోర్ లాక్ పడి నలుగురు చిన్నారుల మృత్యువాత
విజయనగరం: జిల్లాలోని ద్వారపూడి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు డోర్ లాక్ పడటంతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఈ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతికినప్పటికీ కనిపించలేదు.అయితే గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేశారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి (8) చరిష్మా (6), కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు. ఉదయం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు ఇలా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డలు చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతిచెందిన చిన్నారులపై పడి వారు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. చిన్నారుల తల్లిదండ్రుల్ని బంధువులు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నా వారిని ఆపడం కష్టసాధ్యంగా మారింది. -
సంగారెడ్డిలో ఉగ్రమూలాల కలకలం.. పాక్‌కు సమాచారం చేరవేత?
సంగారెడ్డి: జిల్లాలో ఉగ్రమూలాల కలకలం రేగింది. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాం(19) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో షాకింగ్ విషయాలు బయడపడినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసుల ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా ఇస్లాం బాగోతం వెలుగులోకి వచ్చింది.అస్సాంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకుని సంగారెడ్డి జిల్లాలో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో అస్సాంలో మొబైల్ షాపులో పని చేసిన ఇస్లాం.. అక్కడే కొందరి గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్ లు తీసుకుని అధిక ధరకు విక్రయించాడు.ప్రస్తుతం గొల్లపల్లిలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అదే సమయంలో తన వద్ద ఉన్న నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీయులకు అమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్ ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్ లో వాట్పాప్ అకౌంట్ లు క్రియేట్ కావడంతో ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.ఇటీవల జరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంలో భాగంగా మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నట్లు సమాచారం.దేశ వ్యాప్తంగా ఏడుగురు అరెస్ట్.. అంతా అస్సాం వారేఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడుగురు అనుమానితులువివిధ రాష్ట్రాల్లో ఉంటూ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ లోని తమ మిత్రులకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సంగారెడ్డిలో మకాం వేసిన అస్సాం పోలీసులు తమ దర్యాప్తును అత్యంత గోప్యంగా సాగిస్తున్నట్లు సమాచారం.#OperationGhostSIMAssam police has arrested 7 people for helping people from Pakistan to use WhatsApp from Indian numbers by sharing OTPs.7 arrested, 948 SIMs seized.These SIMs were being used for cyber crimes and anti-national operations. pic.twitter.com/crLN5LMmpO— Incognito (@Incognito_qfs) May 18, 2025 Assam Police busts major fake SIM racket in ‘Operation GHOST SIM’; 7 arrested, 948 SIMs seized; WhatsApp OTPs linked to Pakistan. The public is urged to stay alert.Read Full Story: https://t.co/zhwxJLa7Cm#AssamPolice #OperationGhostSim #Crime #SimCardRacket pic.twitter.com/BU94CVK9o1— Pratidin Time (@pratidintime) May 17, 2025 -
గూఢచర్యం ఆరోపణలపై మహిళా యూట్యూబర్ అరెస్ట్
చండీగఢ్: హరియాణాకు చెందిన ప్రముఖ మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్‌కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్‌చేశారు. పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసు నమోదుచేశారు. శుక్రవారం ఆమెను హరియాణాలోని హిస్సార్‌లోని న్యూ అగ్రసేన్ ఎక్స్టెన్షన్ కాలనీలో అరెస్ట్‌చేశారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా జ్యోతిని ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ జడ్జీ ఉత్తర్వులు జారీచేశారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం భారత్‌ను వీడాలని ఆదేశించడం తెల్సిందే. పంజాబ్ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచి్చనట్లు తెలుస్తోంది. పాకిస్తానీ అధికారితో కలిసి గూఢచర్యం కేసులో పంజాబ్ పోలీసులు ఇప్పటికే ఒక మహిళ సహా ఇద్దరిని అరెస్ట్ చేయడం తెల్సిందే. ఎవరీ జ్యోతి? హిస్సార్‌కు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’పేరిట ఒక యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఛానెల్‌కు 3.77 లక్షల మంది సబ్‌స్రై్కబర్లు ఉన్నారు. ట్రావెల్ బ్లాగర్‌గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఎన్నో వీడియోలు తీసి పోస్ట్‌చేశారు. ఈమె ట్రావెల్‌విత్‌జో1 ఇన్‌స్టా గ్రామ్ ఖాతాకు 1,32,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. చైనా, పాకిస్తాన్, ఇండోనేసియాల్లోనూ వీడియోలు తీసింది. మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం జ్యోతి రెండేళ్ల క్రితం పాకిస్తాన్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు వెళ్లింది. అక్కడ ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డ్యానిష్ తో ఈమెకు పరిచయం ఏర్పడింది. తర్వాత వీసా లభించాక మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లి వచ్చింది. ఆ సమయంలో డ్యానిష్ ఆదేశానుసారం అలీ అహా్వన్ అనే వ్యక్తి ఈమెకు పాక్‌లో బస, రవాణా ఏర్పాట్లుచేశాడు. పాకిస్తాన్లో పర్యటించిన కాలంలో జ్యోతి అక్కడి ఐఎస్ఐ అధికారులను కలిసింది. షకీర్, రాణా షహ్‌బాజ్‌లతో పరిచయం పెంచుకుంది. షహ్బాజ్ ఫోన్‌నంబర్‌ను ఎవరూ గుర్తుపట్టకుండా తన స్మార్ట్‌ఫోన్‌లో జాట్ రంధావా అనే వేరే పేరుతో సేవ్‌చేసింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాప్ యాప్‌లలో మాత్రమే వివరాలు పంపించేది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు తరచూ వెళ్తూ అక్కడ డ్యానిష్‌ను ఎక్కువగా కలిసేది. అతని ద్వారా పాకిస్తానీ నిఘా బృందాలతో సంప్రతింపులు జరిపి భారత్‌కు చెందిన సున్నిత సమాచారాన్ని చేరవేసేది. డ్యానిష్ తో ఈమెకు శారీరక సంబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఇండోనేసియాలోని బాలీ ద్వీపానికీ వెళ్లొచ్చారు. ఇటీవల పాకిస్తాన్ అనుకూల వీడియోలు తీసి పోస్ట్చేసింది. పాక్‌లో కతాస్ రాజ్ టెంపుల్సహా పలు హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్ పట్ల ఇండియన్లలో మంచి అభిప్రాయం పెరిగేందుకు ప్రయత్నించింది. -
చచ్చేలా కొట్టి.. మూత్రం తాగించి..
సాక్షి, టాస్క్ ఫోర్స్: దళితుడిగా పుట్టడమే ఓ బీటెక్ విద్యార్థికి శాపంగా పరిణమించింది. సీనియర్ అన్న గౌరవం కూడా లేకుండా తరచూ కులం పేరుతో దూషిస్తున్న జూనియర్‌కు అది తగదని చెప్పడమే పాపమై పోయింది. ఆ జూనియర్ రౌడీషీటర్లతో కలిసి దళిత విద్యార్థిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కారులో కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారు. కత్తులతో తలపై కోశారు. అరవకుండా నోట్లో డ్రాయర్ (అండర్ వేర్) కుక్కారు. హాకీ స్టిక్‌లు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా మూత్రం తాగించారు. ఇంత తీవ్ర అవమానంతో న్యాయం కోసం వెళ్తే పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి మిన్నకుండిపోయారు.ఈ అమానవీయ ఘటనకు సంబంధించి బాధిత విద్యార్థి విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ఓ కళాశాలలో జేమ్స్ అనే విద్యార్థి బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోని తన జూనియర్ యశ్వంత్ నాయుడు తరచూ కులం పేరుతో దూషిస్తూ, జేమ్స్‌ను తీవ్రంగా అవమానిస్తున్నాడు. ఇటీవల యశ్వంత్ మరోసారి తీవ్రంగా అవమానించడంతో అలా మాట్లాడటం తగదని జేమ్స్ బదులిచ్చాడు. దీంతో అతనిపై యశ్వంత్ నాయుడు కక్ష పెంచుకున్నాడు.‘మంగళవారం’ మంగళం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న తన బావను కలిసేందుకు జేమ్స్ వెళ్లాడు. ఆ విషయం తెలుసుకున్న యశ్వంత్ నాయుడు.. రౌడీషిటర్ రూపేష్, మరో రౌడీషిటర్ చోటా బ్లేడ్, కిరణ్, జగ్గ, నానిలతో కారులో అక్కడికి వెళ్లాడు. జేమ్స్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకొని బూతులు తిడుతూ.. కులం పేరుతో దూషించాడు. ఆపై కారులో అందరూ పిడిగుద్దులు గుద్దుతూ హాకీ స్టిక్స్, రాడ్లతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కత్తితో తలపై గాయ పరిచారు. మూత్రం పోసి తాగించారు. బాధితుడు అరవకుండా నోట్లో డ్రాయర్ కుక్కారు. లాడ్జిలో బంధించి మరోమారు దాడి జేమ్స్‌ను తిరుచానూరు సమీపంలోని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి చేతులు, కాళ్లు కట్టేసి ఓ గదిలో బంధించారు. ఒకటిన్నర రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారు. హోటల్ యజమానితో పాటు అందరూ మరోమారు దాడి చేశారు. ముఖంపై మూత్రం పోశారు. కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తుండగా కొంత మంది అక్కడికి రావడంతో వారంతా అక్కడ నుంచి వెళ్లిపోయారు. జేమ్స్ అపస్మారక స్థితిలో ఉండగా.. అక్కడికి వచి్చన వారు (ఎవరో తెలియదు) కట్లు విప్పి ఆస్పత్రికి తరలించారు. కొంచెం కోలుకున్న తర్వాత తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జరిగిన విషయం పోలీసులకు వివరించాడు.ఆ మేరకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు స్వీకరించ లేదు. వారిపై కేసు కట్టేంత ధైర్యం తమకు లేదని నిస్సిగ్గుగా స్పష్టం చేశారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే ఉండి బతిమాలినా పట్టించుకోలేదు. మరుసటి రోజు పోలీసుస్టేషన్‌కు వెళితే ఫిర్యాదులో కొంత మంది పేర్లు తొలగించి మరో ఫిర్యాదు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని జేమ్స్ చెప్పడంతో పోలీసు సిబ్బందే తూతూ మంత్రంగా ఫిర్యాదు రాసి బాధితుడి వద్ద సంతకం తీసుకున్నారు.ఇదేమిటని ప్రశ్నిస్తే తీవ్రంగా బెదిరించారని బాధితుడు వాపోయాడు. కాగా, జేమ్స్ కుడి కన్నుకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిందితులకు అధికార టీడీపీ అండ ఉండటంతో కేసు తీసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నట్లు సమాచారం. -
కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల చిన్నారి క్షేమం
విశాఖ: అనకాపల్లిలో కిడ్నాప్ కు గురైన నాలుగేళ్ల చిన్నారి క్షేమంగా బయటపడింది. ఆ చిన్నారిని గాజువాకలో గుర్తించారు పోలీసులు. ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి, విక్రయించేందుకు జరిగిన యత్నంలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కు పాల్పడిన వారికి లక్ష్మీ, అప్పలస్వామిలుగా గుర్తించారు.ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. అనకాపల్లి టౌన్‌కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న అనకాపల్లి పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని ఎత్తుకెళ్లింది మహిళగా గుర్తించారు. అనంతరం గాలింపు ముమ్మరం చేయడంతో ఆ చిన్నారి కథ సుఖాంతమైంది. ఆ చిన్నారిని గాజువాకలో విక్రయానికి పెట్టే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ కేసును తక్కువ సమయంలోనే ఛేదించారు పోలీసులు. 48 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు పోలీసులు. -
పాకిస్థాన్ స్పైగా హర్యానా యూట్యూబర్.. జ్యోతి మల్హోత్రా అరెస్ట్
ఢిల్లీ: హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్‌లో ఐఎస్ఐ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురి అరెస్ట్‌ను చేశారు. భారత సైనిక సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన జ్యోతి మల్హోత్రా.. ఇటీవల ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో రెండుసార్లు పర్యటించారు. పాకిస్తాన్ అధికారి ఎహ్సాన్ రహీంను కలిసిన జ్యోతి మల్హోత్రా.. ఆ దేశానికి కీలక సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించినట్లు తేలింది. వీరంతా పాక్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. జ్యోతి.. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది.డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి కూపీ లాగడంతో జ్యోతి గూఢచార్యం సంగతి బట్టబయలైంది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు జ్యోతి మల్హోత్రాను డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు తేలింది.ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేసినట్లు సమాచారం. ‘జాట్ రంధావా’ అని సేవ్ చేసుకున్న ఓ పేరు షకీర్ అలియాస్ రాణా షాబాజ్ అనే పాకిస్థాన్ వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లిన జ్యోతి.. యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, యూఏఈ దేశాల్లో కూడా పర్యటించింది.పాక్ ఇంటలిజెన్స్ అధికారితో సన్నిహిత పెంచుకుని ఇద్దరూ ఇటీవల ఒక వారం పాటు ఇండోనేషియాలోని బాలి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు. జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు. -
భారత్‌కు ద్రోహం.. పాక్‌కు గూఢచర్యం చేస్తున్న విద్యార్థి అరెస్ట్
ఛండీగఢ్: దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న విద్యార్థిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ అధికారులు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.వివరాల ప్రకారం.. నిందితుడు దేవేంద్ర సింగ్ ధిల్లాన్ హర్యానాలో పాటియాలలో ఉన్న ఖల్సా కళాశాలలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. అయితే, మే 12న ధిల్లాన్.. తన ఫేస్బుక్ ఖాతాలో గన్, పిస్టోల్ చిత్రాలను పోస్టు చేశాడు. ఈ విషయం పోలీసులు దృష్టికి చేరడంతో.. కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. అనంతరం, అతడిని పోలీసులు అరెస్టు చేశారు. దేవేంద్రసింగ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ దర్యాప్తునకు పంపించారు. ఈ క్రమంలో ధిల్లాన్ విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.విచారణలో భాగంగా.. ధిల్లాన్ గతేడాది నవంబరులో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్‌కు వెళ్లినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా అక్కడి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు తేలిపింది. ఈ మేరకు నిందితుడు అంగీకరించాడు. అందుకు పాక్ అధికారులు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు తెలిపాడు. పటియాలా మిలిటరీ కంటోన్మెంట్‌కు సంబంధించిన చిత్రాలను సైతం అతడు పాక్ అధికారులకు అందించాడు. దీంతో, డబ్బు లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.Kaithal, Haryana! Pak ISI spy Devendra Singh Dhillon arrested! Devendra sent army camps and other sensitive information to Pakistan ISI! Devendra went to Pakistan for a religious trip in 2024, during which an ISI agent caught him in a girl's honey trap. Police investigation is on pic.twitter.com/gnTVuHUDXh— Kalu Singh Chouhan (@kscChouhan) May 17, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల ఉత్తరప్రదేశ్ చెందిన రవీంద్రకుమార్‌కు సైతం ఇలాగే పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌లోని ఐఎస్ఐకు గూఢచర్యం చేస్తున్న కారణంగా రవీంద్రకుమార్‌ను విచారిస్తున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేస్తున్న రవీంద్రకుమార్ ఓ అమ్మాయితో హానీట్రాప్‌లో చిక్కి.. భారత సైన్యం ఆయుధాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేశాడు. ఐఎస్ఐ సభ్యులతోనూ అతడు నేరుగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో, అతడి అంశంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. -
రోడ్డు పక్కన వదిలేస్తే చేరదీసింది.. అదే ఆమె పాలిట శాపమైంది!
రోడ్డు పక్కన అనాథగా పడి ఉన్న పసికందును మానవత్వంతో ఓ మహిళ చేరదీసింది. చదువు కూడా చెప్పించి.. ఆ బాలికను పెంచి పెద్ద చేసింది. అలా చేయడం.. ఆ మహిళకు శాపమైంది. చివరికి ప్రాణాలు కోల్పోయాంది. ప్రేమ మైకంలో ఓ బాలిక తన పెంపుడు తల్లిని హతమార్చింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసు అధికారులు ఛేదించారు. ఎస్పీ జ్యోతీంద్ర పండా ఆదర్శ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. స్థానిక తెలుగు సొండి వీధిలో రాజ్యలక్ష్మీ కోరో (54) గత నెల 26న అనుమానాస్పదంగా చనిపోయింది. మృతురాలి పెంపుడు కూతురు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తన ప్రియుడు, స్నేహితుని సహాయంతో మృతదేహాన్ని తరలించింది.ఈ విషయం భువనేశ్వర్‌లో ఉన్న మృతురాలి సోదరుడు ప్రసాద్ మిశ్రాకు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ లోగా పెంపుడు కూతురు, అతని ప్రియుడు కలిసి పోలీసు కేసు కాకుండా చూసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు కొద్ది నెలలుగా గణేష్ రథ్ (21) అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీన్ని గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో పాటు స్నేహితుడు దినేష్ సాహు అలియాస్ అమన్ సాయంతో తల్లిని చంపడానికి పథకం పన్నారు.పథకం ప్రకారం ఏప్రిల్ 26న ఆమె నిద్రిస్తున్న సమయంలో దిండు సహాయంతో ఇద్దరు స్నేహితులు చంపి, నగదు, బంగారం దొంగిలించి పారిపోయారు. సోదరి చనిపోయాక ఆమె పెంపుడు కూతురిలో మార్పులు గమనించిన ప్రసాద్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితురాలిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.దీంతో హత్య జరిగినట్లు నిర్ధారించారు. నిందితులందరినీ గుర్తించి వారిని అరెస్టు చేసి విచారించగా రాజలక్ష్మీ కోరోకు మత్తు మందు ఇచ్చి ఎలా చంపారో వారే పోలీసులకు వివరించారు. మృతురాలి ఇంటి నుంచి 7 తులాల బంగారం వస్తువులు, రూ.60 వేలు నగదు చోరీ కాగా 2.6 గ్రాముల బంగారం, మూడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిందితులు ఇద్దరు గణేష్ రోథో, దినేష్ సాహులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
ఉమ్మడి విశాఖ జిల్లాలో కిడ్నాప్ కలకలం
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో చిన్నపిల్లల కిడ్నాప్ కలకలం రేపుతోంది. అనకాపల్లి టౌన్‌కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అనకాపల్లి లోకావారి వీధి ఇంటి నుంచి అదృశ్యం అయినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు.సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన అనకాపల్లి పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఓ మహిళ చాకచక్యంగా చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. గుర్తు తెలియని మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాత కిడ్నాప్ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. -
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
కాకినాడ జిల్లా: తుని రూరల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. మరో ఘటనలో కడియం-రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ల మధ్య రైలునుంచి జారి పడి సుమారు 50 ఏళ్ల వయసుగల వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని జీఆర్ఫీ ఎస్సై మావుళ్లు తెలిపారు. గాయపడి ఉండగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తించి 108 అంబులెన్సు ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.మృతుడు నలుపు రంగుపై పసుపు రంగు గడులు గల హాఫ్ హాండ్స్ షర్ట్, నీలం రంగు లుంగీ ధరించాడు. మృతుడి కుడి చేయి మీద సన్ ఫ్లవర్ గుర్తుతో పచ్చబొట్టు ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27551, 94910 03239 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
నమ్మించి ముంచేసిన నగల వ్యాపారి: రూ.10కోట్ల నగలతో పరార్
కేపీహెచ్‌బీ/నిజాంపేట్: బాచుపల్లి ప్రగతినగర్‌లో బంగారం వ్యాపారం నిర్వహిస్తూ నమ్మించి డబ్బులు వసూలు చేసి ఉడాయించిన మోసగాడి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. గురువారం ఇద్దరు వ్యాపారులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధరాణి అనే మహిళ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. అశోక్ కుమార్ జైన్ అనే వ్యక్తి 30 ఏళ్లుగా కేపీహెచ్‌బీ కాలనీలో రిషబ్ జువెల్లరీ పేరుతో బంగారు నగల వ్యాపారం చేస్తున్నాడు. ప్రగతినగర్‌లో చేతన్ జువెల్లరీ పేరుతో వ్యాపారం చేస్తున్న నితీష్ జైన్ నాలుగేళ్లుగా అశోక్ కుమార్ జైన్ వద్ద బంగారం తీసుకుని వ్యాపారం చేసేవాడు. గత నెల 8న, ఈ నెల 10న నితీష్ జైన్ అతని భార్య స్వీటీ జైన్లు అశోక్ కుమార్ నగల షాపుకు వచ్చి రెండుమార్లు సుమారు అరకేజీ బంగారు నగలును తీసుకున్నారు. డబ్బులు త్వరలో చెల్లిస్తామని నమ్మబలికి వెళ్లిపోయారు. ఎప్పుడు డబ్బులు అడిగినా త్వరలోనే ఇస్తామని నమ్మబలికేవారు. ఇదే కోవలో ఐడీపీఎల్ కాలనీలోనీ దీపక్ జైన్‌కు చెందిన జ్యోతి జువెల్లరీలోనూ సుమారు 860 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకొని నెలరోజుల్లో డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికారు. చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్అయితే ఈ నెల 10 నుంచి ప్రగతినగర్‌లోని నితీష్ జైన్‌కు చెందిన చేతన్ జువెల్లరీ దుకాణాన్ని తెరవకపోవడంతో అతనికి బంగారం ఇచి్చన వ్యాపారులు, బంగారం కుదువపెట్టిన వారు, వివిధ స్కీంల పేరుతో డబ్బులు కట్టినవారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ, ఐడీపీఎల్ కాలనీలకు చెందిన ఇద్దరు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆమె భర్తపై పగబట్టాడు! -
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆమె భర్తపై పగబట్టాడు!
కేపీహెచ్‌బీకాలనీ: ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే కోపంతో ఆ అమ్మాయి భర్తను హత్యచేసిన ఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గురువారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ శ్రీనివాసరావు, సిఐ రాజశేఖర్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. కాకినాడకు చెందిన పంపేన అయ్యప్పస్వామి అలియాస్ పవన్ (27) చిన్నప్పుడే తల్లి చనిపోవంతో మేనత్త ఇంటి వద్ద పెరిగాడు. ఈ సమయంలో శ్రావణి సంధ్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాని పెళ్లి చేసుకుంటానని వాళ్ల తల్లిదండ్రులకు బంధువులతో అడిగించాడు. అతడి ప్రవర్తన నచ్చక వివాహం చేసేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని రాజమండ్రి దగ్గరలోని కోరుకొండ మండలం, ములగాడు గ్రామానికి చెందిన కాళ్ల వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారు బతుకు తెరువు కోసం భగత్‌సింగ్ నగర్ఫేస్–1లో నివాసముంటున్నారు. ఇటీవల తన సోదరీతో కలిసి శ్రావణి సంధ్య రాజమండ్రికి వివాహ కార్యక్రమానికి వెళ్లగా అక్కడ పవన్ ఆ అమ్మాయిని చూశాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలంటే ఆమె భర్తను చంపాలని పవన్ పథకం వేసి ఆ అమ్మాయి నివాసముండే సమీపంలో మకాం మార్చాడు. తరచూ ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో ఈ నెల10న అర్ధరాత్రి వెంకటరమణ తన తోడల్లుడు దుర్గాప్రసాద్‌తో ఇంట్లో బంధువులతో కలిసి ఉండగా పవన్ వచ్చి గొడవ పడ్డాడు. వెంకటరమణను హత్య చేసేందుకు పవన్ తన స్నేహితులైన గుప్పల శివరామకృష్ణ (20), రాజమహేంద్రవరం అనిల్ (19), నంబిగారి సాయికుమార్(20), మరో బాలుడిని కలిసి వచ్చి వెంకటరమణ గుండెల్లో కత్తితో పొడవగా అక్కడికక్కడే వెంకట రమణ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుబ్బల శివరామకృష్ణ, రాజమహేంద్రవరం అనిల్, నంబిగారి సాయికుమార్‌ను అరెస్టు చేయగా బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు అయ్యప్పస్వామి అలియాస్ పవన్‌న్ పరారీలో ఉండగా గురువారం రిమాండ్‌కు తరలించామన్నారు. -
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలను కేటుగాళ్లు దోచేశారు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇపిస్తామంటూ నిరుద్యోగులను నిండా ముంచేశారు. మొగల్ రాజుపురంలోని నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మోసానికి పాల్పడింది. ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసి సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు.మాచవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన కానీ న్యాయం జరగలేదంటూ విజయవాడ కమిషనర్‌ను కలిసేందుకు బాధితులు వచ్చారు. విజయవాడ కమిషనరేట్‌లో స్పందనలో కంప్లైంట్ ఇచ్చిన కానీ నేటికీ కూడా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఉన్నారని బాధిత నిరుద్యోగులు అంటున్నారు. ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచిన ఇప్పటి వరకు నిర్వాహకులను అరెస్టు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సంస్థ ప్రతినిధులు నాగరాజు, హెచ్ఆర్ శిరీషలను అరెస్ట్ చేయకుండ మాచవరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు.మోసపోయిన వాళ్లందరూ ఒకేసారి వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. వారిపై చర్యలు తీసుకునే సరికి పది సంవత్సరాలైనా సమయం పట్టవచ్చంటూ హేళనగా సమాధానం చెబుతున్నారని బాధితులు అంటున్నారు. చేసేదిలేక విజయవాడ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చామని సీపీ రాజశేఖర్‌బాబు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
సాక్షి, బంజారాహిల్స్: నీ భార్య ఫొటోలు డిలీట్ చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి. ఓ డ్రైవర్ తన యజమానిని బ్లాక్మెయిల్ చేసిన సంచలన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.బంజారాహిల్స్ పోలీసుల కథనం మేరకు.. ఆసిఫ్‌నగర్ అహ్మద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఇప్తేకర్ అహ్మద్ జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వద్ద డ్రైవర్‌గా పని చేసేవాడు. సదరు యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇప్తేకర్ అహ్మద్ ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఫొటోలు తీసుకున్నాడు. ఆమె నగ్న చిత్రాలు, వీడియోలను తీసి తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. ఆ ఫొటోలను తన యజమానికి పంపించి మీ భార్య నగ్న చిత్రాలు, వీడియోలతో పాటు తనతో కలిసి ఉన్నప్పుడు దిగిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో, ఇతర వెబ్సైట్లలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతేగాక గతంలో యజమాని ఇంటికి వచ్చి బెదిరించగా ఆయన డయల్ 100కు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.కొన్నాళ్లుగా వేధింపులు తీవ్రతరం చేసిన ఇప్తెకార్ ఆహ్మద్ యజమానికి వాట్సాప్‌లో భార్య ఫొటోలు, నగ్న చిత్రాలు పంపుతూ, వెంటనే వాటిని తొలగిస్తుండటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారవేత్త గత నెలలో తన న్యాయవాది ద్వారా ఇప్తేకర్ అహ్మద్‌కు ఫోన్ చేయించి వేధింపుల విషయమై అడిగించాడు. బంజారాహిల్స్‌లోని ఓ కేఫ్‌కు రావాలని యజమానికి సూచించాడు. అక్కడికి వెళ్లిన యజమానిని మీ భార్యకు విడాకులు ఇవ్వాలని, లేదా ఖులా (భర్త నుంచి విడాకులు) అడగాలని బెదిరించాడు. అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని, బ్లాక్మెయిల్ చేయవద్దని అతను కోరినా పట్టించుకోకుండా అసభ్యంగా దూషించాడు. ముగ్గురు పిల్లలను చంపి భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించాడు. ఫోన్లో సేవ్ చేసిన ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాలంటే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహ్మద్ ఇఫ్తేకర్ అహ్మద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పశ్చిమ బెంగాల్ మహిళలను రేణిగుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణిగుంట లాడ్జిలో ఉన్న వారి వద్ద నుంచి 24.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలోని 207 గదిలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమోని మొండాల్ (31), నమితా మొండాల్ (37) లను అదుపులోకి తీసుకుని, రెండు సూట్‌కేస్‌లలో ఉన్న రూ.2.45 లక్షల విలువ చేసే 24.5 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రైల్లో కేరళ తీసుకెళుతుండగా వారి సంబం«దీకుల నుంచి సూచన రావడంతో రేణిగుంటలో దిగి లాడ్జిలో బస చేశారు.వారిద్దరినీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో వారు చెప్పిన ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సీఐ జయచంద్ర, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు. -
రూ. 9 కోట్ల నగదు.. రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం!
హైదరాబాద్: నగరానికి చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. గురువారం హైదరాబాద్ లోని వైఎస్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వైఎస్ రెడ్డి.. అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా ఈరోజు ఆయనకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. ముంబైతో పాటు హైదరాబాద్ ఇలా 12 చోట్ల ఈడీ సోదాలు చేసింది. దీనిలో భాగంగా రూ. 9 కోట్ల నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలకు కేసు నమోదు కాగా, దీనికి సంబంధించి సోదాలు చేశారు ఈడీ అధికారులు. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించిన తర్వాత ఈడీ సోదాలు చేసింది. -
దురుసు ప్రవర్తన.. టాలీవుడ్ హీరోపై కేసు నమోదు!
సాక్షి, బంజారాహిల్స్: రాంగ్రూట్లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai srinivas)పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ జర్నలిస్ట్‌కాలనీలో నివసించే బెల్లంకొండ శ్రీనివాస్ మంగళవారం మధ్యాహ్నం కారులో జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45 వైపు నుంచి జర్నలిస్ట్‌కాలనీ వరకు వచ్చి చౌరస్తాలో రాంగ్రూట్లో తన ఇంటికి వెళుతుండగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ అతడిని అడ్డుకున్నాడు. (చదవండి: రాంగ్ రూట్ లో కారు నడిపిన తెలుగు హీరో)దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించడమేగా అతడి పైకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచాడు. దీంతో కానిస్టేబుల్ భయంతో పక్కకు తొలగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఆయన మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడా? అన్న విషయం తేలాల్చి ఉంది. శ్రీనివాస్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించనున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు. -
కుటుంబం కోసం భార్య జాబ్.. అనుమానంతో భర్త ఏం చేశాడంటే?
సాక్షి, పహాడీషరీఫ్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తలపై కర్రతో బాది.. గాజుతో చేయి నరాలు కోసి ఆపై చున్నీతో ఆమె గొంతు బిగించి భార్యను భర్త హతమార్చాడు.ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జాకీర్ అహ్మద్, నాజియాబేగం(30) దంపతులు. వీరికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు సంతానం. ఆటో నడుపుతూ జీవనం సాగించే జాకీర్ సంపాదనతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో నాజియా ప్రైవేట్ జాబ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమైపె అనుమానం పెంచుకున్నాడు జాకీర్. ఆమెపై అనుమానంతో 15రోజుల క్రితం తన మకాంను బాలాపూర్ ఠాణా పరిధిలోని కొత్తపేట న్యూ గ్రీన్‌సిటీ కాలనీకి మార్చాడు.అలాగే, అనుమానంతో రహస్యంగా భార్యను గమనిస్తున్నాడు. ఈనెల 13న రాత్రి 11గంటలకు ఇంటికి వచ్చాడు. పిల్లలు మరో గదిలో ఉండగా.. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తున్నావని భార్యను జాకీర్ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అర్ధరాత్రి భార్యతో గొడవపడి కర్రతో తలపై మోది, గొంతుకు చున్నీ బిగించి హత్యచేశాడు. రక్తపు మడుగుల్లో పడి ఉన్నా.. ఆమెపై కోపం తగ్గలేదు. కిటికీకి ఉన్న అద్దాన్ని విరగ్గొట్టి ఓ ముక్కతో ఆమె కుడిచేయి నరాలను కోసేశాడు. అక్కడి నుంచి పారిపోయి, బుధవారం ఉదయం అత్త రుబీనాబీకి ఫోన్ చేసి చెప్పాడు. తల్లి, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా నాజియా అప్పటికే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
మహిళ ఆత్మహత్య
నాగోలు(హైదరాబాద్): భర్త వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఖమ్మం పట్టణానికి చెందిన కట్టా వెంకటేశ్వర్లు కుమార్తె జాస్మిన్(29)కు ఎల్బీనగర్, శివపురి కాలనీ చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెండెం రాజశేఖర్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 25 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహం జరిగిన కొన్నాళ్లకే రాజశేఖర్, అతడి కుటుంబ సభ్యులు జాస్మిన్ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులు ఆమెకు నచ్చజెప్పి కాపురానికి పంపించారు. అయినా తన వైఖరి మార్చుకోని రాజశేఖర్ కొన్నాళ్లకే జాస్మిన్ను కొట్టి పుట్టింటికి పంపించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజశేఖర్‌ను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మంగళవారం ఆఫీస్‌కు వెళ్లిన రాజశేఖర్ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. జాస్మిన్ను పిలిచినా స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగలకొట్టి చూడగా జాస్మిన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. దీంతో అతను ఎల్బీనగర్ పోలీసులు, జాస్మిన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. జాస్మిన్ శరీరంపై గాయాలను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు రాజశేఖర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో విడాకులు తీసుకుంటున్నానని చెప్పి..!
బంజారాహిల్స్(హైదరాబాద్): నా తల్లితో ఆస్తి గొడవలు ఉన్నాయి..నా భార్య నాతో సఖ్యంగా ఉండదు..అందుకే విడాకులు తీసుకుంటున్నాం..అందుకు సంబంధించిన విడాకులు పత్రాలు ఇవిగో అంటూ వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. చివరకు సదరు వైద్యుడి అసలు నిజ స్వరూపం తెలియడంతో తాను మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భరత్ గెరా నగరంలోని కొండాపూర్ ప్రైమ్ స్ప్లైండర్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని డెరెడియా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెచ్ఆర్ ఆపరేషనల్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో గత ఏప్రిల్‌లో భరత్ సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు గతంలోనే వివాహం జరిగిందని, తన భార్యతో గొడవల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. న్యాయవాది ఎదుట ఇద్దరూ సంతకం చేసిన పత్రాలను కూడా ఆమెకు చూపించాడు. తన తల్లికి తనకు ఆస్తి గొడవలు ఉన్నాయని, తల్లి, సోదరుడు ఢిల్లీలో ఉంటారని చెప్పాడు. ఈ క్రమంలో మార్చి 31న కంపెనీ పనిపై చంఢీఘడ్ వెళుతున్న భరత్ సదరు వైద్యురాలిని కూడా తీసుకెళ్లి అక్కడ హోటల్ రూంలో బస చేశారు. ఆ సమయంలో భరత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భరత్‌ను కంపెనీ యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించగా, అతడితో పాటు సదరు యువతి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం ఆమె నుంచి భరత్ రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. అంతేగాక భరత్ సదరు యువతి ఫోన్లో లోకేషన్‌ను ట్రాక్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుందని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె భరత్‌తో మాట్లాడేందుకు అతని ఇంటికి వెళ్లగా అతడి భార్య ఇంట్లో ఉండటాన్ని చూసి షాక్‌కు గురైంది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న అతని భార్య కూడా వైద్యురాలిని అసభ్యంగా దూషించడమేగాక వివాహితుడితో ఎందుకు సంబంధం కొనసాగిస్తున్నావంటూ నిలదీసింది. ఆ తర్వాత భరత్, అతని భార్య పూణెకు మకాం మార్చారు. కొన్ని రోజుల తర్వాత గర్భం దాల్చిన బాధితురాలు భరత్ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగని ‘రక్తచరిత్ర’.. ఎదురొస్తే ఎవరినీ వదలం
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ దాషీ్టకాలతో నియోజకవర్గంలోని రామగిరి మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తారో, ఏ పరిణామాలు ఎవరి ప్రాణాలు తీస్తాయో.. అని వణికిపోతున్నారు. బలవంతంగా పార్టీలోకి చేర్చుకోవడం,అవసరమైతే దాడులు చేయడం రామగిరి మండలంలో టీడీపీ గూండాలకు పరిపాటిగా మారింది. ఎంపీపీ ఉప ఎన్నికకు మరోసారి నోటిఫికేషన్ విడుదల కావడంతో ‘రక్తచరిత్ర’ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. మార్చిలో జరగాల్సిన ఎంపీపీ ఉప ఎన్నికను టీడీపీ గూండాల దౌర్జన్యాలతో అధికారులు వాయిదా వేశారు. ఎంపీటీసీ సభ్యులను బెదిరించి కిడ్నాప్‌నకు యత్నం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను టీడీపీ గూండాలు హతమార్చారు. పరామర్శించడానికి వచి్చన మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పోలీసులు సరైన రక్షణ కల్పించలేదు. మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు వైఎస్సార్సీపీ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఎంపీపీ స్థానానికి అభ్యర్థి కూడా లేని టీడీపీ వాళ్లు ఎలాంటి దారుణాలకు ఒడిగడతారోనని వైఎస్సార్సీపీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు భయపడుతున్నారు. బలవంతంగా టీడీపీలో చేర్చుకుని.. ఈ నెల 19వ తేదీన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుంది. ఎంపీపీ పదవి మహిళా అభ్యర్థికి రిజర్వు కావడంతో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి వేటలో పడ్డారు. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని మంగళవారం బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లి టీడీపీ కండువా వేసి పా ర్టీలో చేరినట్లు పరిటాల సునీత, శ్రీరామ్ ఫొటోలకు పోజులిచ్చారు. సాయంత్రం నుంచి భారతి ఎవరికీ కనిపించకుండా పోయారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలే కిడ్నాప్ చేశారంటూ టీడీపీ వారు దు్రష్పచారం చేశారు. వారి ప్రచారాన్ని భారతి ఖండిస్తూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బుధవారం వీడియో విడుదల చేశారు. ఇంటిపై దాడి... పట్టించుకోని పోలీసులు టీడీపీలో చేరిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని ఎక్కడ దాచారో చెప్పాలంటూ కొత్తపల్లి గ్రామంలో కురుబ సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు నారాయణరెడ్డి ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి టీడీపీకి చెందిన మాదాపురం శంకర్‌తోపాటు మరికొంతమంది రౌడీలు దాడి చేశారు. ఈ ఘటన గురించి బుధవారం ఉదయం రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీసులపై నమ్మకం పోయిందని, ఎన్నిక పూర్తయ్యే వరకు స్థానికంగా ఉంటే టీడీపీ గూండాలు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్యను హత్య చేసిన తరహాలోనే దారుణానికి ఒడిగడతారని కొత్తపల్లి గ్రామస్తులు భయపడుతున్నారు.ఎంపీపీ ఇస్తామన్నారు ‘టీడీపీ నేతలు నన్ను భయపెట్టి బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లారు. పరిటాల సునీత, శ్రీరామ్ సమక్షంలో పార్టీ కండువా వేసి ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. నాకు ఎలాంటి పదవీ వద్దని చెప్పినా బలవంతపెట్టారు. ఆ తర్వాత మా గ్రామంలో వదిలారు. అక్కడ ఉంటే రక్షణ ఉండదని భావించి బంధువుల ఇంటికి వచ్చాను. నాకు టీడీపీలోకి వెళ్లడం ఇష్టం లేదు. పదవి కంటే పార్టీ ముఖ్యం. వైఎస్సార్సీపీలోనే కొనసాగుతా. ఎంపీపీ ఉప ఎన్నికకు హాజరుకాలేను. ఈ నెల 20 తర్వాత గ్రామానికి వస్తాను. – భారతి, వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు, పేరూరు–2ఎన్నికను బహిష్కరిస్తున్నాం ‘రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికను వైఎస్సార్సీపీ బహిష్కరిస్తోంది. మార్చి 27న జరగాల్సిన ఎన్నిక టీడీపీ నాయకుల దౌర్జన్యాల కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కురుబ లింగమయ్యను కోల్పోయాం. మరోసారి ఇంకొందరు కార్యకర్తలను కోల్పోలేం. అందుకే ఎన్నికకు దూరంగా ఉంటాం. రామగిరి పోలీసులపై నమ్మకం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తేనే సరైన రక్షణ కల్పించలేకపోయారు.’ – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే -
ఇద్దరు బామ్మర్దులను బల్లెంతో పొడిచి చంపిన బావ
అల్లూరి సీతారామరాజు: జిల్లాలో సంచలనం సృష్టించిన బావమరుదుల హత్య కేసులో బావను సీలేరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను జీకే విధి సీఐ వరప్రసాద్, సీలేరు ఎస్ఐ రవీంద్ర విలేకరులకు తెలియజేశారు. నిందితుడు వంతల గెన్ను సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. గ్రామంలో ఆదివారం జరిగిన బంధువు దినకర్మకు బావమరుదులు కిముడు కృష్ణ, కిముడు రాజు హాజరయ్యారు. అనంతరం ఆదివారం రాత్రి నిందితుడి ఇంట్లోనే వారంతా ఉన్నారు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో గెన్ను తన తరచూ వేధిస్తున్న విషయాన్ని అన్నదమ్ములకు సోదరి(గెన్ను భార్య) చెప్పింది. దీంతో బావమరుదులు గెన్నును నిలదీశారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు గొడవ కొనసాగింది. ఆగ్రహించిన గెన్ను.. ఇంట్లో ఉన్న బల్లెంతో ముందుగా మూడో బావమరిది కిముడు రాజును పొడిచాడు. ఆయన తప్పించుకుని పారిపోయాడు. అప్పటికే ఇంట్లో ఉన్న ఆడవాళ్లు, పిల్లలు కేకలు వేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న మరో బావమరిది కిముడు రాజు అడ్డుకున్నాడు. అతనిని కూడా బల్లెంతో కడుపులో పొడవడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇంటి బయట కారులో నిద్రిస్తున్న కిముడు కృష్ణ చూసి ఇంట్లోకి పరిగెత్తి వెళ్లగా నిందితుడు దాడి చేసి హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై 2013లో కూడా ఓ హత్య కేసు ఉందన్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించామని తెలిపారు.వేదన మిగిల్చిన హత్యలుసీలేరు మేజర్ పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల హత్యలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా.. మరో సోదరుడు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అన్నదమ్ముల అంత్యక్రియలకు కూడా తమ్ముడు రాలేని దీన పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రం పోస్టుమార్టం నిమిత్తం సీలేరు నుంచి చింతపల్లికి మృతదేహాలను తరలించారు. మంగళవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పచెప్పినట్టు ఎస్ఐ రవీందర్ తెలిపారు. మృతదేహాలకు స్వగ్రామమైన ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. సొంత కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా కిరాతకంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. -
ఎందుకురా నీ బతుకు చావరాదు..! అని తిట్టడంతో
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కులపెద్దలు చేసిన పంచాయితీ ఒకరి నిండు ప్రాణాన్ని తీసింది. పంచాయితీలో బూతులు తిట్టడంతో అవమాన భారంగా భావించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కడమంచి స్వామి(34) ఇంట్లో లేనప్పుడు అ తని భార్యపై అదే గ్రామానికి చెందిన టేకు ప్రేమ్‌కుమార్ లైంగికదాడికి యత్నించాడు. స్వామికి ఈ విషయం తెలియడంతో ప్రేమ్‌కుమార్‌ను నిలదీశా డు.మూడు రోజుల క్రితం కులపెద్దలు పంచాయితీ పెట్టి ప్రేమ్‌కుమార్‌కు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రేమ్‌కుమార్ స్వామిని అందరిముందే బూతులు తిట్టాడు. అంతేకాకుండా చావమని తిట్టడంతో అవమానంగా భావించిన స్వామి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో ప్రేమ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ట్రెయినీ ఎస్సై కె.వినీతారెడ్డి తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులతోపాటు కొందరు విలేకరులు కలిసి ఈ పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. వీరిద్దరి నుంచి రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షలు పంచాయితీ దరావతుగా తీసుకోవడంతోపాటు ఆ మొత్తం కూడా ఖర్చు అయినట్లు తెలిపారనే చర్చ సాగుతోంది. -
మామ వెంటనే నా భార్యను మా ఇంటికి పంపు..!
అనంతపురం/నందవరం: అప్పటికే ఆమెకు ఒక కుమారుడు. తర్వాత రెండో కాన్పులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఇద్దరు బిడ్డలకు తల్లి ప్రేమను దూరం చేస్తూ ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పుట్టింటికి వెళ్లి వెంటనే రావాలని భర్త సూచించడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... మంత్రాలయం మండలం మాధవవరం గ్రామానికి చెందిన బోయ ఈరన్న చిన్న కుమార్తె ఉరుకుందమ్మ (24)కు 2020లో అదే జిల్లా నందవరం గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు పొపయ్యతో వివాహమైంది. వీరికి మూడేళ్ల వయస్సు, మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు నాగరాజు వివాహ నిశ్చితార్థం ఉండడంతో ఉరుకుందమ్మ పుట్టింటికి వెళ్లింది. నిశ్చితార్థ వేడుక ముగిసిన తర్వాత స్వగ్రామానికి చేరుకోగానే సాయంత్రం పొపయ్య ఫోన్ చేసి తన భార్యను వెంటనే మా ఊరికి పంపాలని మామను కోరాడు. బుధవారం పిలుచకొస్తామని తెలిపినా అల్లుడు వినలేదు. దీంతో ఆదివారమే కుమార్తెను తండ్రి పిలుచుకెళ్లి భర్త వద్ద వదిలాడు. సోమవారం ఉదయం 11 గంటలకు పాపయ్య మరోసారి ఫోన్ చేసి ఉరుకుందమ్మ కనిపించడం లేదని తెలిపాడు. దీంతో కుమారుడు నాగరాజు, అల్లుళ్లు తాయన్న, రమేష్ తో కలసి నందవరం గ్రామానికి ఈరన్న చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టాడు. అయినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అనంతపురం త్రీ టౌన్ పోలీసులు ఫోన్ చేసి ఉరుకుందమ్మ రైల్వే స్టేషన్ క్వార్టర్స్ పక్కన చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిపారు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు అనంతపురానికి చేరుకుని ఉరుకుందమ్మ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అల్లుడి ఒత్తిళ్లు తాళలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం మూడో పట్టణ సీఐ కె.శాంతి లాల్ తెలిపారు. -
మోదీ ఇంటిపై పాక్ దాడి చేయాలి.. నవాజ్ అరెస్ట్
బెంగళూరు: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకుడిని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు యువకుడు.. ప్రధాని మోదీ ఇంటిపై బాంబు దాడి చేయాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశాడు. దీంతో, అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని మంగనమ్మనపాళ్యకు చెందిన నవాజ్.. ఇటీవల పాకిస్తాన్‌తో యుద్ధం సమయంలో ప్రధాని మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వీడియో తీశాడు. దీనిని పబ్లిక్ సర్వేంట్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నవాజ్ వీడియోలో మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌పై బాంబు దాడులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ ఇంటిపై పాకిస్తాన్ ఎందుకు బాంబులు వేయడం లేదు. బాంబు దాడికి నేను పిలుపునిస్తున్నా. బాంబు దాడి చేయాలనుకుంటున్నా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియో గురించి తెలిసి పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని గుర్తించి నిర్బంధించారు. కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ (తూర్పు) రమేష్ బానోత్ మాట్లాడుతూ..‘ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన నవాజ్ కంప్యూటర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రెచ్చగొట్టే కంటెంట్ ఉన్నందుకు అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. బండేపాళ్య పోలీసులు అతన్ని అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు రిమాండ్ చేశారు. అతనిపై తుమకూరులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కేసు పెండింగ్‌లో ఉందని తేలింది. ఈ పోస్ట్ వెనుక ఉన్న ఉద్దేశ్యంపై పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. నవాజ్‌ను జ్యుడీషియల్ కస్టడీ కోసం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. -
వినుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
వినుకొండ : పొట్ట కూటి కోసం వస్తున్న కూలీలను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గడ్డమీద పల్లె, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దారుపల్లి తాండకు చెందిన ఆరుగురు రైతు కూలీలు మంగళవారం బొప్పాయి తోటలో కాయ కోసేందుకు బొలెరో ట్రక్‌లో పల్నాడు జిల్లా ఈపూరు వస్తున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరి బొండాల లారీ, బొలెరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో గడ్డమీద పల్లె గ్రామానికి చెందిన పగడాల రమణారెడ్డి (45), పగడాల సుబ్బమ్మ (40) దంపతులు, దారుపల్లి తాండకు చెందిన జొన్నగిరి రామాంజి (35), జొన్నగిరి అంకమ్మ (28) దంపతులు మృతి చెందారు. లారీలో ఉన్న కన్నెబోయిన నాగమణి, పగడాల శివమ్మ, డ్రైవర్ కదిరి నాగేశ్వరరావులు తీవ్రంగా గాయపడ్డారు. పగడాల సుబ్బమ్మ, జొన్నగిరి అంకమ్మలు ఘటనా స్థలంలో మృతి చెందగా, రమణారెడ్డి, రామాంజిలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. వినుకొండ పోలీసులు గాయపడ్డ వారిని సమీపంలోని వైద్యశాలకు, మృతదేహాలను మార్చురీకి తరలించారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి : పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద బొలెరో ట్రక్, లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. -
బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి తేలుస్తాం
సాక్షి, అమరావతి: మద్యం కేసులో వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగానే ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈమేరకు స్పందించింది. గోవిందప్ప అరెస్ట్ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధా్దర్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయ్యారని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమవుతుందని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ హితవు పలికింది. కాగా అగర్వాల్ వాదనను బాలాజీ గోవిందప్ప తరఫు న్యాయవాది సిద్ధా్దర్థ దవే తీవ్రంగా వ్యతిరేకించారు. తమ వ్యాజ్యం నిరర్థకం కాదన్నారు. గోవిందప్ప అరెస్ట్ అక్రమమని నిరూపిస్తామన్నారు. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని తెలిసి కూడా అరెస్ట్ చేశారన్నారు. దర్యాప్తు సంస్థ తీరును ఈ కోర్టు పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. సిద్ధార్థ దవేదీనిపై ధర్మాసనం స్పందిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ సంగతి కూడా తదుపరి విచారణ సమయంలో తేలుస్తామని ప్రకటించింది. అయితే మీరు (సుప్రీంకోర్టు) ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే కింది కోర్టులో బాలాజీ గోవిందప్ప.. ఏసీబీ రిమాండ్ రిపోర్ట్‌ను వ్యతిరేకిస్తారని సిద్ధా్దర్థ అగర్వాల్ పేర్కొన్నారు. అరెస్ట్ సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి రిమాండ్‌కు ఇవ్వవద్దని అడుగుతారన్నారు. అగర్వాల్ వాదనపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మీరు మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇద్దరికీ ఊరట..ఇదే సమయంలో కె.ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. తదుపరి విచారణ వరకు వీరిద్దరిని అరెస్టు చేయరాదని ఏసీబీని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని వారిద్దరినీ ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అదే రోజు గోవిందప్ప అరెస్ట్‌తో సహా అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రకటించింది.ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలతో పాటు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఏసీబీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుకి సైతం నిరాకరించింది. ఈ నేపథ్యంలో వారు ముగ్గురూ అత్యవసరంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.సమావేశాల్లో పాల్గొంటే నిందితుడిని చేసేస్తారా...?ధనుంజయరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది వికాశ్సింగ్, కృష్ణమోహన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. హైకోర్టు కనీస స్థాయిలో కూడా తమ వాదనలు వినలేదని వికాశ్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తమకు హైకోర్టు అవకాశం ఇచ్చి ఉంటే పిటిషనర్లపై ఏసీబీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని నిరూపించేవారిమన్నారు.కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రాన నిందితునిగా చేర్చడం సరికాదన్నారు. రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో ఇదే సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన తీర్పునిచ్చిందని తెలిపారు. కార్యదర్శి హోదాలో సమావేశాల్లో పాల్గొన్నంత మాత్రాన నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని ఆ తీర్పులో పేర్కొన్నారని వికాశ్ సింగ్ నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రముఖ మద్యం తయారీ కంపెనీలను పక్కకు నెట్టేసి ఎవరికీ తెలియని కంపెనీల నుంచి మద్యం కొనుగోలు చేశారన్నారు. బాలాజీ గోవిందప్ప అక్రమ అరెస్టుకర్ణాటకలో అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తరలింపుసాక్షి,అమరావతి: వికాట్ గ్రూప్ భారత దేశ వ్యవహారాల డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా యలందూర్లో అక్రమంగా అరెస్టు చేశారు. ప్రకృతి వైద్యం చేయించుకుంటున్న గోవిందప్పను అదుపులోకి తీసుకుని అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకొస్తున్నారు. బుధవారం ఉదయం విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారిస్తారని తెలుస్తోంది. అనంతరం బాలాజీ గోవిందప్పను న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో సోదాల పేరుతో వేధింపులు కేసు దర్యాప్తు పేరిట హైదరాబాద్‌లోని బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి నివాసాల్లో సోదాల పేరిట సిట్ అధికారులు హల్చల్ సృష్టించి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. సిట్ బృందాలు హైదరాబాద్‌లో బాలాజీ గోవిందప్ప నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను హడలెత్తించారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలకు ప్రశ్నలతో వేధించారు.ఇంట్లో పత్రాల తనిఖీ పేరిట మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు హల్చల్ చేశారు. కృష్ణమోహన్‌రెడ్డి నివాసంలోనూ సిట్ అధికారులు సోదాల పేరిట వేధింపులకు పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి దాటేవరకు సోదాలు చేస్తూనే ఉన్నారు. మరో ప్రాంతంలో ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డిని పిలిపించి మరీ ఆయనకు సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ధనుంజయ్‌రెడ్డి నివాసంలోనూ సోదాల పేరిట సిట్ అధికారులు అదే రీతిలో బెదిరింపులకు పాల్పడ్డారు. -
ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
బ్రహ్మంగారి మఠం: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం మల్లేపల్లె చెరువులో ఈతకు దిగి చరణ్ (15), పార్థు (12), హర్ష (12), దీక్షిత్ (12), తరుణ్ యాదవ్ (10) మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవులు కావటంతో మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి అతడి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి వచ్చారు. గ్రామంలోని చెరువులో ఈత కొట్టాలని భావించిన భవాని పిల్లలు చరణ్, పార్థు, మరో చెల్లెలు సావిత్రి కుమారుడు హర్ష, మల్లేపల్లె గ్రామానికి చెందిన మేకల గంగాధర్ యాదవ్ కుమారుడు తరుణ్ యాదవ్, కాశినాయన మండలం మల్లేరు కొట్టాలకు చెందిన నారాయణ కుమారుడు దీక్షిత్ గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లారు. పిల్లల బట్టలు ఒడ్డున ఉండటం.. చుట్టూ ఎక్కడా పిల్లల జాడ కనిపించపోవడంతో చెరువులో పిల్లలు గల్లంతైనట్టు తెలుసుకుని గాలించారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ శివప్రసాద్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. -
పంజాబ్‌లో విషాదం
చండీగఢ్/అమృత్సర్: పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 21 మంది అమాయకులు బలయ్యారు. మజీఠా పట్టణ పరిధిలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మరో 10 మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం వీళ్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం సేవించి ప్రజలు చనిపోతున్నారని సోమవారం రాత్రి ఐదు గ్రామాల నుంచి పోలీసులకు సమాచారం అందింది.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కల్తీ మద్యం సరఫరాకు కారకులైన పది మందిని అరెస్ట్‌చేశారు. మద్యం ప్రధాన సరఫరాదారు ప్రభ్‌జీత్ సింగ్‌ను అరెస్టు చేశారు. విచారణ సమయంలో ప్రభ్‌జీత్ సింగ్ కీలక సరఫరాదారు సాహబ్‌సింగ్ పేరును వెల్లడించాడు. మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఎక్సయిజ్, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద వేర్వేరు పోలీస్స్టేషన్లలో రెండు కేసులు నమోదుచేసి దర్యాప్తు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.నకిలీ మద్యం ఏరులై పారుతున్నా నిఘా పెట్టకుండా నిర్లక్ష్యం వహించారంటూ ప్రభుత్వం వెంటనే మజీఠా డెప్యూటీ ఎస్పీ అమోలక్ సింగ్, మజీఠా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవతార్ సింగ్‌ను సస్పెండ్ చేసింది. బాధిత కుటుంబాలకు తలో రూ.10 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి మాన్ సింగ్ సారథ్యంలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబంలోని చిన్నారులు చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం మాన్ అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలే ఉన్నారు. -
డీఎస్పీ ఇంట్లో భారీగా ఆస్తుల పత్రాలు గుర్తింపు
హైదరాబాద్: లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ సూర్యాపేట డీఎస్సీ పార్థసారథి ఇంట్లో భారీగా ఆస్తుల పత్రాలు గుర్తించారు.పార్థసారథికి సంబంధించిన ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఏసీబీ. హయత్ నగర్ లోని ఆయన నివాసంతో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేసింది ఏసీబీ. నిన్న (సోమవారం) డీఎస్పీ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించగా భారీగా ఆస్తులకు సంబంధించి పత్రాలను గుర్తించారు. ఈ సోదాలు నిర్వహించే క్రమంలో ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లను గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై హయత్ నగర్ పోలీసులకు ఏసీబీ ఫిర్యాదు చేసినట్లు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్‌కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ అవినీతి కేసులో భాగంగా ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. -
హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్
కర్నూలు జిల్లా: కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. గుమ్మనూరు నారాయణను ఆలూరు పీఎస్‌కు తరలించారు. ఈరోజు గుమ్మనూరు నారాయణను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత లక్ష్మీ నారాయణ హత్య కేసులో గుమ్మనూరు నారాయణ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే గుమ్మనూరు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, గత నెలలో గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్‌కు సైతం గాయాలయ్యాయి. -
ఏం కష్టం వచ్చిందో..?
కృష్ణరాజపురం(కర్ణాటక): విదేశాల్లో చదువుకుని ఇటీవలే ఇంటికి వచ్చిన యువకుడు ఏం కష్టం వచ్చిందో కానీ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.. ఇంటిలో ఉన్న సింగిల్ బ్యారెల్ గన్‌తో షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరు గ్రామీణ జిళ్లాలోని హోసకోటె నియోజకవర్గం పరిధిలోని దేవిశెట్టిహళ్ళి గ్రామంలో జరిగింది. గ్రామవాసి బైయేష్ (28) తుపాకీతో తలలో కాల్చుకోవడంతో తల ఛిద్రమై చనిపోయాడు. ఇంటిలోవారు ఆందరు ఆదివారం తిరుపతికి వెళ్లారు. అతడు ఒక్కటే ఇంట్లో ఉన్నాడు. సోమవారం కుటుంబీకులు తిరుపతి నుంచి తిరిగి వచ్చి చూడగా మృతదేహం కనిపించింది. వెంటనే తిరుమలశెట్టిహళ్ళి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మాజీ ప్రియురాలిపై దాడి చేసిన యువకుడి అరెస్టు
బంజారాహిల్స్(హైదరాబాద్): మాజీ ప్రియురాలిపై దాడికి పాల్పడటమే కాకుండా ఆమె తాజా బాయ్‌ఫ్రెండ్‌ను బెదిరింపులకు గురిచేస్తూ ఆమెను తీవ్రంగా కొట్టిన ఘటనలో నిందితుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేసన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నాచారం ప్రాంతానికి చెందిన కోటి అఖిల్‌కుమార్(28) బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అందులో పనిచేస్తున్న యువతిని కొంతకాలంగా ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఉన్నత చదువుల కోసం పోలాండ్ దేశానికి వెళ్లి అక్కడ కొద్ది రోజులు సహజీవనం చేసిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధిత యువతి మరో యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని మాజీ ప్రియుడు అఖిల్ జీర్ణించుకోలేకపోయాడు. ఆమెను తరచూ వెంబడిస్తూ ఆమె రాకపోకలపై నిఘా ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమె విధులు ముగించుకుని బంజారాహిల్స్ నుంచి క్యాబ్‌లో తార్నాకలోని తన గదికి వెళ్తుండగా ఆమెను అనుసరించి ఆమెకు తెలియకుండా నేరుగా ఆమె గదిలోకి వెళ్లి తాజా ప్రియుడితో కలిసి ఉండగా ఫొటోలు తీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె సెల్‌ఫోన్ లాక్కొని అందులో డేటాను తొలగించి ధ్వంసం చేశాడు. ఆమెను తీవ్రంగా కొట్టడంతో కన్ను, ముక్కుపై తీవ్ర గాయాలయ్యాయి. అఖిల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని, తన కుటుంబ సభ్యులను కూడా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అఖిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
బయో మెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడి కి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జార్ఖండ్ కు చెందిన యువతి (20) తమిళనాడులోని కలస లోకేషన్లింగం కాలేజీలో బయో మెడికల్ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన అజయ్ (24) బీటెక్ చదువుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్ప డింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఇంటర్న్íÙప్ చేయాలని యువతి నిర్ణయించుకుంది. దీంతో ఈ నెల 3న ఆమె హైదరాబాద్‌కు రాగా కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఆమెను అజయ్ ఉంచాడు. అదేరోజు సాయంత్రం పార్టీ చేసుకుందామని ఆమెను బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న తన స్నేహితుడు హరి ఇంటికి తీసుకెళ్లాడు. ముగ్గురు కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించిన అనంతరం అజయ్ యువతిపై లైంగిక దాడి చేశాడు. తర్వాత హరి కూడా యువతిపై లైంగిక దాడి చేయటానికి ప్రయతి్నంచగా యువతి కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణæ అనంతరం 4వ తేదీన అజయ్, హరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి సురక్షితంగా స్వస్థలానికి వెళ్లేందుకు సహాయం చేశారు. ఓ బైక్, మద్యం బాటిల్, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. -
ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ
సూర్యాపేటటౌన్: సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులు ఏసీబీకి చిక్కారు. ఓ కేసులో రిమాండ్‌కు పంపించకుండా ఉండేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు డిమాండ్ చేసి.. రూ.16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరూ ఆధారాలతో సహా ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. రెండు గంటలకు పైగా చేసిన తనిఖీల్లో సరైన ఆధారాలు దొరకడంతో డీఎస్పీ, సీఐపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పర్చనున్నారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట పట్టణంలో ఓ స్కానింగ్ సెంటర్‌ను నడిపిస్తున్న వ్యక్తిపై గత నెలలో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయన్ను రిమాండ్‌కు తరలించకుండా ఉండాలంటే రూ. 25 లక్షలు ఇవ్వాలని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు డిమాండ్ చేశారు. తాను అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.16 లక్షలైనా ఇవ్వాలంటూ ఆ వ్యక్తిపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక బాధితుడు ఈ నెల మొదటి వారంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అతను ఇచి్చన ఫిర్యాదును పరిశీలించి ఆధారాలు సేకరించారు. డీఎస్పీ, సీఐలపై గతంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలింది. కేసులో రిమాండ్ చేయకుండా ఉండటానికి, అతని స్కానింగ్ సెంటర్‌ను భవిష్యత్‌లో సక్రమంగా నడిపించడానికి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఏసీబీ విచారణలో బట్టబయలైంది. పూర్తి ఆధారాలతో ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో డబ్బులు డిమాండ్ చేసినట్టు తేలడంతో డీఎస్పీ, సీఐలపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ కమలాకర్‌రెడ్డి, నల్లగొండ రేంజ్ ఏసీబీ టీం సభ్యులు పాల్గొన్నారు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫోన్ చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ఏసీబీ ఉంటుందని, లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064కు కాల్ చేయాలని డీఎస్పీ జగదీశ్‌చందర్ తెలిపారు. -
ఇష్టపడిన యువతి దక్కలేదని..
కూకట్పల్లి(హైదరాబాద్): తాను ఇష్టపడిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఆమె భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా, అడవిపూడి గ్రామానికి చెందిన జగదీష్ అతడి సోదరుడు దుర్గా ప్రసాద్ కేపీహెచ్‌బీ కాలనీలోని సర్ధార్ పటేల్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరి సమీప బంధువు కాళ్ల వెంకటరమణ భగత్ సింగ్ నగర్లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దుర్గా ప్రసాద్ భార్య, వెంకట రమణ భార్య అక్కా చెల్లెళ్లు కావటంతో మూడు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకట రమణ తరచూ దుర్గా ప్రసాద్, జగదీష్ ల వద్దకు వచ్చి వెళుతుండేవాడు. కాగా అదే గ్రామానికి చెందిన పవన్ ఎనిమిదేళ్ల క్రితం వెంకట రమణ భార్య శ్రావణి సంధ్యను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెకు కాళ్ల వెంకటరమణతో వివాహం జరిపించారు. తనకు దక్కని శ్రావణి సంధ్య మరొకరిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేని పవన్ అప్పటి నుంచి వారిపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం నగరానికి మకాం మార్చిన పవన్ కూడా కూకట్పల్లి ప్రాంతంలోనే ఉంటూ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శ్రావణి సంధ్యను వివాహం చేసుకున్న వెంకటరమణపై కక్ష పెంచుకున్న పవన్ అతడిని హత్య చేసేందుకు అతడి కదలికలపై నిఘా ఏర్పాటు చేశాడు. వెంకటరమణ తరచూ జగదీష్ ఇంటికి వస్తున్నట్లు గుర్తించిన పవన్ అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిని పసిగట్టిన జగదీష్ తన ఇంటి ఎదుట నిలుచుని ఉన్న పవన్‌ను గుర్తించి ఇక్కడ ఎందుకు ఉన్నావని నిలదీయగా తన స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. వారం రోజుల క్రితం శ్రావణి సంధ్య, ఆమె సోదరి ఉమా మహేశ్వరితో కలిసి స్వగ్రామంలో పెళ్లికి వెళ్లింది. ఆదివారం రాత్రి వెంకటరమణ జగదీష్ ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో పవన్ తన స్నేహితులు మరో నలుగురితో కలిసి అక్కడికి వచ్చి మాటు వేశాడు. జగదీష్ ఇంటి గేటు స్కూటీని అడ్డు పెట్టి స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతూ ఉండటాన్ని గుర్తించిన జగదీష్ అతడిని నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పవన్ జగదీష్‌తో గొడవపడుతుండటాన్ని గుర్తించిన వెంకట రమణ బయటికి వచ్చి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పవన్ కత్తితో వెంకటరమణ చాతిలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలడంతో పవన్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న డాక్టర్ సంజన సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని పరీక్షించగా వెంకటరమణ అప్పటికే మృతి చెందాడు. జగదీష్ ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రధాన నిందితుడు పవన్పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
స్కూల్‌పై మయన్మార్ సైన్యం దాడి.. 20 మంది విద్యార్థులు మృతి
బ్యాంకాక్: మయన్మార్ సైన్యం సోమవారం ఓ పాఠశాల భవనంపై జరిపిన వైమానిక దాడిలో 20 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులకు సమీపంలోని సగయింగ్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. డెపాయిన్ పట్టణ సమీపంలోని గ్రామంపై జరిగిన ఈ దాడిలో 50 మంది విద్యార్థులు గాయపడినట్లు ప్రైవేట్ మీడియా సంస్థలు తెలిపాయి.ప్రజాస్వామ్య అనుకూల వాదులు ఈ స్కూలును నడుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం, ప్రభుత్వ మీడియా ఈ దారుణంపై స్పందించలేదు. 2021లో అంగ్‌సాన్ సుకీ సారథ్యంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సాయుధ గ్రూపులకు వ్యతిరేకంగా సైనిక జుంటా భారీ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఆర్మీ దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 6,600 మంది పౌరులు చనిపోయినట్లు అంచనా. -
బావమరుదులపై బల్లెంతో బావ దాడి
సీలేరు (అల్లూరి జిల్లా): ముగ్గురు బావమరుదులపై బావ బల్లెంతో దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, సీలేరు మేజర్ పంచాయతీ, చింతపల్లి క్యాంపు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కిముడు కృష్ణ (36) కిముడు రాజు (40) కిముడు రాజు (25)అన్నదమ్ములు. వీరు ముగ్గురికీ వివాహాలు జరిగాయి. వీరికి నలుగురు, ముగ్గురు, ఇద్దరు చొప్పున పిల్లలున్నారు.బంధువు దినకార్యానికిగాను ఆదివారం చింతపల్లి క్యాంప్‌లో నివాసముంటున్న బావ వంతల గెన్ను ఇంటికి కుటుంబ సభ్యులతోసహా హాజరయ్యారు. బావ ఇంట్లోనే రాత్రి బస చేశారు. ఈ సమయంలో మద్యం తాగిన బావ తమ సోదరితో గొడవపడుతూ, కొడుతుండటంతో ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మొదలైన గొడవ అర్ధరాత్రి దాటే వరకు జరుగుతూనే ఉంది.సుమారు ఒంటిగంట సమయంలో ఇంట్లో ఉన్న బల్లెంతో గెన్ను తన భార్య సోదరులను ఒకరి తర్వాత ఒకరిని కడుపులో పేగులు బయటికి వచ్చేలా పొడిచాడు. తరువాత బల్లెంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, గాయాలతో ఉన్న రాజు అనే మరో బావ మరిదిని కుటుంబ సభ్యులు, స్థానికులు సీలేరు పీహెచ్‌సీకి తరలించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ జరుపుతున్నారు.నిందితునిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నిందితుడు వంతల గెన్ను అత్యంత కిరాతకుడు. ఇతనిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల కిందట ఒడిశాలో ఒకరిని కిరాతకంగా నరికి చంపిన కేసులో జైలుకు వెళ్లాడు. తర్వాత సీలేరులో బంధువుల దగ్గరికి చేరాడు. నాలుగేళ్ల కిందట ఇదే గ్రామంలో వంతల గురువు అనే వ్యక్తిని గొడ్డలితో నరకగా కేసు నమోదై, జైలుకి వెళ్లొచ్చి ప్రస్తుతం చిన్నా చితకా పనులు చేస్తున్నాడు. -
మల్కన్‌గిరి కేంద్రంగా గంజాయి ప్రాసెసింగ్
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని మల్కన్‌గిరి కేంద్రంగా కొన్ని ముఠాలు గంజాయి ప్రాసెసింగ్ చేస్తున్నట్టు ఎక్సైజ్‌శాఖ కీలక ఆధారాలు సేకరించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పండిస్తున్న గంజాయి అంతా మల్కన్‌గిరి అటవీ ప్రాంతానికి తరలిస్తున్న ముఠాలు.. అక్కడే ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతుల్లో ప్రాసెస్ చేస్తున్నట్టు ఆధారాలు లభించాయి. మల్కనగిరి నుంచి గంజాయిని హైదరాబాద్‌కు రవాణా చేస్తున్న ఓ ముఠాను అరెస్టు చేయగా, అసలు విషయం వెలుగుచూసింది. ⇒ ఉప్పల్ హెచ్‌సీఎల్ మల్లాపూర్‌లో జరిపిన సోదాల్లో ఎక్సైజ్ సిబ్బందికి చిక్కిన నిందితులు వివేక్‌రెడ్డి, మధుకిరణ్‌ల ఫోన్లలో ఈ మేరకు కీలక వీడియోలు లభించాయి. వీటిల్లో టన్నుల కొద్ది గంజాయిని కుప్పగా పోసి కొందరు వాటిని ప్యాకింగ్ చేస్తూ..గంజాయి రవాణా గురించి మాట్లాడుకుంటున్నట్టు ఉంది. గంజాయి ముఠా కార్యకలాపాలను క్షణ్ణంగా వివరించే ఇలాంటి వీడియోలు దర్యాప్తు బృందాలకు చిక్కడం ఇదే తొలిసారి అని మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రాసెసింగ్ నుంచి ప్యాకింగ్ దాకాఅటవీ ప్రాంతంలో సేకరించిన గంజాయిని ఎండబెట్టిన తర్వాత అంతా ఒక్కచోటకు తెస్తారు. కుప్పలుగా పోసి..దానిని కిలోల చొప్పున అవసరం మేరకు ఎన్ని కిలోల ప్యాకెట్లు కావాలంటే అంత బరువు తూచి ఒక కవర్లో పెడతారు. ఈ కవర్లను చతురస్రాకార డబ్బాల్లో కూర్చి వీలైనంత వరకు ముద్దగా మార్చుతున్నారు. ఆ తర్వాత ఆ చతురస్రాకార బాక్స్‌ల్లోని గంజాయిని ప్రెసింగ్ రాడ్ కింద పెట్టి పదిమంది తిప్పుతూ వీలైనంత మేరకు తక్కువ పరిమాణంలో కనిపించేలా ముద్దలా అయ్యేలా చేస్తున్నారు. దీనిపై ప్లాస్టర్‌తో సీల్ చేస్తున్నారు.ఇలా చేయడం వల్ల బరువు ఎక్కువగా ఉన్నా..ప్యాకెట్ సైజు కుదించబడడంతోపాటు, గంజాయి రవాణా సమయంలో వాసన రాకుండా చేస్తున్నారు. దీన్ని దళారులు, గంజాయి ముఠాలతో డీల్ చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా భద్రాచలం, రాజమండ్రి మార్గాల్లో రోడ్డు మార్గంలో, లేదంటే ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి రైలు మార్గంలో దేశంలోని పలు పట్టణాలు, ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాయి. రూ.53 లక్షల విలువైన గంజాయి సీజ్ మల్లాపూర్‌లోని హెచ్‌సీఎల్ ప్రాంతంలోని ఓ గోదాంలో 106 కిలోల గంజాయిని ఎక్సైజ్‌శాఖ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.53 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆబ్కారీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్, మల్కాజ్గిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కేసులో గంజాయి సరఫరా ముఠాకు చెందిన దగ్గుమల్లి మధు కిరణ్ , కట్ల వివేక్‌రెడ్డిలను అరెస్టు చేయగా, ఏ–1 మల్కన్‌గిరి జిల్లాకు చెందిన రాంబాబు పరారీలో ఉన్నట్టు తెలిపారు. -
ఏసీబీ దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన పోలీసు ఉన్నతాధికారులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు ఏబీసీకి చిక్కారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో రూ. 25 లక్షల లంచం డిమాండ్ చేస్తూ డీఎస్పీ, సీఐ ఏబీసీకి దొరికిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న ఓ ఆస్పత్రిపై నమోదైన కేసులో భారీగా లంచం డిమాండ్ చేశారు.. కేసు వివరాలను.. ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ మీడియాకు వెల్లడించారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, వ్యాపారం సజావుగా సాగాలంటే రూ.25 లక్షలు ఇవ్వాలని సీఐ వీర రాఘవులు, డీఎస్పీ పార్థసారధి డిమాండ్ చేశారు. డీఎస్పీను కలిసి సెటిల్ చేసుకోమంటూ సీఐ వీర రాఘవులు ఆఫర్ ఇచ్చారు. డీఎస్పీని కలిసిన సదరు వ్యక్తి.. రూ. 25 లక్షలు ఇవ్వలేనని ప్రాధేయపడటంతో రూ. 16 లక్షలు తీసుకునేందుకు అంగీకరించారు. డబ్బులు వెంటనే ఇవ్వాలంటూ సీఐ, డీఎస్పీ ఆ వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించి పూర్తి స్థాయిలో విచారించామని . ఏసీబీ డీఎస్పీ తెలిపారు.గతంలో కూడా సీఐ వీరరాఘవులు, డీఎస్పీ పార్థసారధిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం. రేపు నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తాం. డబ్బులు తీసుకుంటూ దొరకడమే కాదు. డిమాండ్ చేయడం కూడా నేరంలో భాగమే’’ అని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. -
తల్లే హంతకురాలు.. కొడుకుని ముక్కలు ముక్కులుగా నరికి.. సూట్‌కేస్‌లో కుక్కి
గౌహతి: ఓ అమ్మ పేగు బంధాన్ని తెంచుకుంది. నవ మాసాలు మోసి.. పురిటి నొప్పులు భరించిన ఆ తల్లి ప్రియుడి మోజులో పడి తన పదేళ్ల కుమారుడిని అత్యంత దారుణంగా కడతేర్చింది. కఠినాత్ములను సైతం కంటతడి పెట్టించే ఈ ఘటన అస్సాం రాష్ట్రం గౌహతిలో చోటు చేసుకుంది.గౌహతికి చెందిన దీపాలి రాజ్బోంగ్షి ఓ క్లీనిక్‌లో విధులు నిర్వహిస్తోంది. ఆమె కుమారుడు 10ఏళ్ల మృణ్మోయ్ బర్మన్ నవోదయ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో దీపాలి గౌహతి పోలీసుల్ని ఆశ్రయించింది. ట్యూషన్‌కు వెళ్లిన తన కుమారుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా అటవీ శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఓ స్క్రాప్ దుకాణం సమీపంలో అనుమానాస్పద సూట్‌కేస్ గురించి సమాచారం అందింది. స్క్రాప్ దుకాణం యజమాని ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్‌కేసును తెరిచి చూశారు. అంతే సూట్‌కేస్ లోపల ముక్కులు, ముక్కులగా ఉన్న మానవ శరీర భాగాల్ని చూసి కంగుతిన్నారు. ఫోరెన్సిక్ టీంను సైతం కేసులో ఇన్వాల్వ్ చేశారు.ఫోరెన్సిక్ టీం సేకరించిన ఆధారాలతో సూట్‌కేస్‌లో ఉన్నది బాలుడి శరీర భాగాలేనని నిర్ధారించారు. మరి బాలుడిని ఎవరు హత్య చేశారు? బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఏంటి? అనే దిశగా ఆరా తీశారు. ముందుగా బాలుడి కుటుంబంలో గొడవలే హత్యకు దారి తీశాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రుల్ని, బంధువుల్ని విచారించారు.అయితే విచారణలో తల్లి తీరుపై పోలీసులకు అనుమానం వేసింది. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. ఓ ప్రభుత్వ సంస్థలో తాత్కాలికంగా ప్యూన్‌గా పనిచేస్తున్న ప్రియుడు జ్యోతిర్మయి హలై కలిసి కుమారుడిని తల్లి దారుణంగా హత్య చేసిందని తేల్చారు.కొంతకాలం క్రితం దీపాలికి, జ్యోతిర్మయి హలైల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ముదిరి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భర్తను వదిలేసి ప్రియుడితో కలిసి జీవించాలని దీపాలి నిశ్చయించుకుంది. రెండు నెలల క్రితం తన భర్తకు విడాకులిచ్చింది. ప్రియుడితో కలిసి జీవించేందుకు అడ్డుగా ఉన్న కొడుకును కడతేర్చింది. చివరికి కటకటాలపాలైంది. -
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులు.. మహిళ బలి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులకు ఓ మహిళ బలైన ఘటన చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో జరిగింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న అబ్బూరి మాధురిని టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ నోటికొచ్చినట్లు తీవ్ర దుర్భాషలాడారు. అందరి ముందూ దూషించడంతో పాటు దౌర్జన్యం చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన మాధురి.. రవితేజ చేసిన అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.తనపై తీవ్ర దుర్భాషలాడుతూ.. దౌర్జన్యం చేస్తున్నా కానీ ఎవరూ అడ్డుకోలేదని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ కారణమంటూ మాధురి వీడియోలో పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం మరొక మహిళకు జరగకూడదంటూ తన ఆవేదన వెల్లబుచ్చిన మాధురి.. తాను చచ్చిపోతున్నానని.. మరో మహిళకు ఇలాంటి అవమానం జరగకూడదంటూ పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలను సెల్ఫీ వీడియోలో మాధురి వేడుకుంది. -
కిట్టువల్లనే కుటుంబంలో కల్లోలం, సంధ్య చచ్చిపోయింది!
పశ్చిమ గోదావరి: తనను ఆర్థికంగా మోసగించారన్న మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో భార్య మృతి చెందింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మాదు శ్రీనివాస్ దంపతులు ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం భార్య సంధ్య (23) మృతి చెందడంతో బంధువులు విషాదంలో మునిగిపోయారు. దగ్గర బంధువైన కిట్టుకు 20 ఏళ్ల క్రితం నగదు ఇచ్చాడని ఆ నగదుతో పొలం కొన్నారని బంధువులు తెలిపారు. ప్రస్తుతం తాను అప్పుల్లో ఉన్నానని తన వాటాగా ఎంత వస్తే అంత ఇవ్వాలని శ్రీనివాస్ కిట్టును అడగ్గా.. ఇచ్చేది లేదని చెప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. మేకా రామకృష్ణ (కిట్టు) వల్ల ఒక కుటుంబం నాశనమైందని బంధువులు ఆరోపించారు. ఈ చావుకు అతనిదే బాధ్యతని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. -
పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. బొల్లారం ప్రాంతానికి చెందిన సిద్దిక్ మేడ్చల్‌లో నివాసం ఉంటూ వారాంతపు మార్కెట్లో బ్యాటరీ లైట్లు సప్లై చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొంపల్లి మున్సిపల్ పరిధిలోని సెంట్రల్ పార్క్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మార్కెట్లో బ్యాటరీ లైట్లు సాయంత్రం ఇచ్చి.. తిరిగి రాత్రి తీసుకునే క్రమంలో ముగ్గురు వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. గతంలో సిద్దిక్ బొల్లారం ప్రాంతంలో బ్యాటరీ లైట్లు ఏర్పాటు విషయంలో మరో వర్గంతో గొడవ పడ్డాడని... అది మనసులో పెట్టుకొని కక్షగట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాట్లాడుకుందాం.. అంటూ పిలిచి విచక్షణారహితంగా పొట్ట, ఛాతీ భాగాల్లో కత్తులతో పొడిచారు. ఇంతటితో ఆగకుండా నిందితుల్లో ఒకరు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సిద్దిక్ మెడను కోసేసినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి సీసీ కెమెరాలు పరిశీలించారు. సిద్దిక్‌తో ఇటీవల జరిగిన గొడవలపై ఆరాతీశారు. ముగ్గురు నిందితులు వచి్చనట్లు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ రాములు పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ విజయ్‌వర్ధన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అజయ్ పరిశీలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని...
సాక్షి, హైదరాబాద్:: చిన్న నాటి స్నేహితురాలిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, యాపర్ల గ్రామానికి చెందిన తిమ్మరాజు రవి(25) కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి కూకట్పల్లి, శంషీగూడలో నివాసముంటోంది. రవి కూకట్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సమయంలో తన స్నేహితురాలు నీలవేణితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్ల క్రితం వారు పెద్దలను ఎదిరించి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. గత 8 నెలలుగా వారు బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్నారు. రవి కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా నీలవేణి ఇంటి వద్దనే ఉంటుంది. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నెల 10న భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు మధ్యాహ్నం తన ఇంటికి వచి్చన తల్లితో కలిసి నీలవేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రవి తన తల్లికి ఫోన్ చేసి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని, తనకు బతకాలని లేదని చెప్పి విలపించాడు. దీంతో ఇంటికి రావాలని కోరగా ఫోన్ పెట్టేశాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తల్లి, సోదరుడు బౌరంపేటకు వచ్చి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. టీడీపీ వీర విధేయుడిగా ముద్రపడిన ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కనుసన్నల్లో సాగిన ‘పోలీసు మార్కు’ విచారణతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ లాకప్ డెత్ వ్యవహారం ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరిని ఏప్రిల్‌లో ప్రత్యర్థులు హత్య చేశారు. రియల్ ఎస్టేట్, మద్యం సిండికేట్ విభేదాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.టీడీపీలోని వీరయ్య చౌదరి వైరి వర్గం వారే ఈ హత్యకు పాల్పడ్డారని కూడా గుర్తించినట్టు సమాచారం. ఆయన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు పలువురు అనుమానితులను కొన్ని రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కానీ కేసు దర్యాప్తు కొలిక్కి రాలేదు. మరోవైపు ఈ కేసును త్వరగా ఛేదించాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి వస్తోంది. దాంతో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఎలాగైనా దోషులను గుర్తించి త్వరగా కేసు క్లోజ్ చేయాలని పంతం పట్టారు. ఆ మేరకు అనుమానితులుగా భావిస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొడుతూ నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా వేధిస్తున్నారు. దెబ్బలు తట్టుకోలేకే.. ఇటీవల కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని పోలీసు శాఖకు చెందిన శిక్షణ కార్యాలయం ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా ఆ అనుమానితులను అక్రమంగా నిర్బంధించి విచారణ పేరిట పోలీసులు తమదైన శైలిలో తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఓ అనుమానితుడు మృతి చెందాడు. దాంతో ఆందోళన చెందిన పోలీసులు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగించాలని భావించారు.మృతుని కుటుంబ సభ్యులను పిలిచి తీవ్రంగా బెదిరించారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే వారిని కూడా ఈ కేసులో ఇరికిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూడా ఆ మృతుని కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించినట్టు తెలుస్తోంది. వారికి కొంత మొత్తం ముట్టచెప్పి గుట్టు చప్పుడు కాకుండా మృతునికి అంత్యక్రియలు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా జరిపించేసినట్లు సమాచారం. ఏకంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారే బెదిరించడంతో బాధిత కుటుంబం హడలిపోతోంది. కుటుంబ సభ్యులు ఎవర్ని కలుస్తున్నారు, వారి ఇంటికి ఎవరు వస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వారి నివాసం వద్ద పోలీసు నిఘా కూడా పెట్టడం గమనార్హం. ప్రభుత్వ ముఖ్య నేత మద్దతుతోనే ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి అంతగా చెలరేగిపోతున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం
నిర్మల్/ఆదిలాబాద్‌టౌన్: ఆగి ఉన్న వాహనాన్ని కారు ఢీకొట్టగా తండ్రీకూతురు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. మాతృదినోత్సవం రోజున తల్లికి గర్భశోకంతోపాటు సౌభాగ్యమూ దూరం చేసింది. తనతో కలిసి పుట్టిన కవల సోదరిని ఒంటరి చేసింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తండ్రీకూతురు శంకర్(50), కృతిక(20) హైదరాబాద్ నుంచి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సొంతూరైన ఆదిలాబాద్‌కు కారులో బయల్దేరారు. నిర్మల్ రూరల్ మండలం నీలాయిపేట సమీపంలో ఎన్‌హెచ్–44 బైపాస్ రోడ్డు వద్దకు ఆదివారం వేకువజామున చేరుకున్నారు.ఈ క్రమంలో రోడ్డుపై ఎలాంటి సూచికలు లేకుండా నిలిపి ఉంచిన ఐషర్ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శంకర్, కృతిక తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. డ్రైవర్ విలాస్ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో మహారాష్ట్రలోని యవత్మాల్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. ఘటన జరిగిన సమయంలో విలాస్ డ్రైవింగ్ చేస్తుండగా, ముందు సీట్లో శంకర్, వెనుక సీట్లో కతిక ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు డ్రైవర్ ఐషర్ వాహనాన్ని నిలిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. -
ఊహించని విధంగా పెళ్లి వాయిదా.. యువతి ఆత్మహత్య
అనంతపురం: ఊహించని విధంగా పెళ్లి వాయిదా పడటంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ గౌస్ మహమ్మద్‌బాషా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇల్లూరుకు చెందిన మస్తానయ్య, సుశీలమ్మ దంపతులు బతుకు తెరువు కోసం కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. కుమార్తె లక్ష్మీనరసమ్మ(23)కు గుంతకల్లు మండలంలోని ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14, 15 తేదీల్లో వివాహం జరగాల్సి ఉంది. వారం క్రితమే కుటుంబ సభ్యులంతా స్వగ్రామం ఇల్లూరుకు చేరుకున్నారు. పెళ్లి ఏర్పాట్లల్లో తలమునకలయ్యారు. ఈ క్రమంలో బంధువు ఒకరు చనిపోవడంతో పెళ్లి వాయిదా వేశారు. రెండేళ్ల క్రితం కూడా బంధువొకరు చనిపోవడంతో పెళ్లి ఆగింది. వరుస ఘటనలతో మనస్తాపం చెందిన లక్ష్మీనరసమ్మ తనకు కళ్యాణ యోగం లేదేమోనన్న బాధతో శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చంపేస్తా ’
హైదరాబాద్: పెళ్లి చేసుకోవాలని ఓ యువతిని ఒత్తిడి చేయడమే కాకుండా..ఆమె వివాహ నిశ్చితార్థాన్ని చెడగొట్టి.. వేరెవరినైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లా బాల్కొండ ప్రాంతానికి చెందిన యువతి (21) నగరంలోని ఓ హాస్టల్లో ఉంటూ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. కామారెడ్డిలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసే శేషుకుమార్ (28) గత తొమ్మిది నెలల క్రితం సదరు యువతిని బస్సులో కలిశాడు. నెల తర్వాత శేషు ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు. దీనికి ఆమె నిరాకరించి స్నేహితులుగా ఉందామని చెప్పింది. ఈ క్రమంలో ఇరువురూ కలిసి ఫొటోలు దిగారు. ఇదిలా ఉండగా తన వివాహ నిశ్చితార్థం ఖరారు అయ్యిందని యువతి స్నేహితులకు చెప్పగా వారి ద్వారా శేషు ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. దీంతో ఈ నెల 6న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బేగంపేట ఫ్లైఓవర్ వద్ద ఆమెను కలుసుకుని ఘర్షణకు దిగాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెతో వివాహ నిశ్చితార్థం జరుపుకునే యువకుడి ఫోన్ నెంబర్ తీసుకుని వారిద్దరూ దిగిన ఫోటోలను అతనికి పంపించడంతో పాటు లేనిపోని ఆరోపణలు చేశాడు. దీంతో ఆ నిశితార్థం ఆగిపోయింది. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి పెంచాడు. తనను కాదని వేరే వారిని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీబిడ్డను కాటేసిన కరెంట్
నిజాంసాగర్ (జుక్కల్): ఇంట్లోని ఇనుప కూలర్‌కు కరెంట్ సరఫరా కావడంతో తల్లీకూతురు మరణించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద గుల్లా తండాకు చెందిన చవాన్ ప్రహ్లాద్, శంకబాయి (36) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ప్రహ్లాద్ డ్రైవర్‌గా, శంకబాయి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి శంకబాయి, చిన్న కూతురు శ్రీవాణి (12), కుమారుడు ఇంట్లో నిద్రించారు. తల్లి, కూతురు ఒకేచోట ఇనుప కూలర్ ముందర నిద్రించగా, కుమారుడు ప్రతీక్ కొద్ది దూరంలో పడుకున్నాడు. రాత్రి వేళ కూలర్ అడుగు భాగంలోని నీటిలో శ్రీవాణి కాలుపడటంతో కరెంట్ షాక్ సరఫరా జరిగి శ్రీవాణితో పాటు పక్కనే పడుకున్న తల్లి శంకబాయి మృతి చెందింది. ఉదయం నిద్ర లేచిన ప్రతీక్ తల్లి, సోదరి మృతి చెందడాన్ని గమనించి తండా ప్రజలకు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న బిచ్కుంద సీఐ నరేశ్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్, ట్రాన్స్‌కో ఏఈ బాలాజీ తండాకు చేరుకున్నారు. ఇనుప కూలర్‌కు కరెంట్ సరఫరా కావడంతోనే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Outer Ring Road: కారు దగ్ధం.. ఇద్దరు సజీవ దహనం
అబ్దుల్లాపూర్‌మెట్: ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. రహదారిపై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులూ మంటల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరి«ధిలో జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని తాడ్‌బండ్ బహదూర్‌పురా ప్రాంతం హెచ్‌బీ కాలనీలో నివాసం ఉండే రితేష్ కుమార్ కుమారుడు దీపేష్కుమార్ (23) శుక్రవారం రాత్రి 11 గంటలకు స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి తన కారులో ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో తన స్నేహితులైన నగరంలోని వీటీసీ కాలనీకి చెందిన సంచయ్ మల్పనీ (22), మూసాపేట్‌కు చెందిన ప్రియాష్ మిఠల్ (23) కలిసి శంషాబాద్ వైపు వెళ్తున్నారు. పెద్దఅంబర్‌పేట శివారు గండిచెరువు వంతెన సమీపంలోకి రాగానే (రాత్రి 2 గంటలకు) ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా రోడ్డుపై నిలిపి ఉంచిన బొలేరోను ఢీకొట్టారు. వీరి కారు బొలేరో ముందు భాగంలో ఇరుక్కుని, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యువకులు తేరుకునేలోపే ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో దీపేష్ కుమార్, సంచయ్ మల్పనీ కారులోనే సజీవ దహనమయ్యారు. కొన ఊపిరితో ఉన్న ప్రియాన్స్ మిఠల్‌ను అతికష్టమ్మీద బయటికి తీసిన స్థానికులు ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
హాస్టల్ గదిలో ఉరేసుకుని.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం పరిధిలోని గురునానక్ కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కురనవెల్లికి చెందిన ఆలూరి భావన (22) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాల హాస్టల్లో ఉంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె గదిలో ఉండే మరో ఇద్దరు విద్యారి్థనులు స్వగ్రామాలకు వెళ్లడంతో ప్రస్తుతం భావన మాత్రమే ఉంది. కారణాలేమిటో తెలియదు గానీ.. శనివారం తన గదిలోని ఫ్యాన్‌కు ఆమె ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి విద్యార్థినులు యాజమాన్యంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి శశిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ వద్ద ఉద్రిక్తత విద్యార్థిని భావన ఆత్మహత్య విషయం తెలుసుకున్న మిత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. పలువురు ఎస్ఎఫ్ఐ నేతలు గేట్లు దూకి లోపలికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను ఏసీపీ రాజు, సీఐ జగదీశ్‌లు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యలకు అడ్డాగా మారింది గురునానక్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్, కార్యదర్శి శంకర్ మండిపడ్డారు. భావన బలవన్మరణానికి పాల్పడిందనే విషయాన్ని బయటకు చెప్పకుండా, ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారని మండిపడ్డారు. కాలేజీలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ పాటు ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రూ.70 లక్షల లంచం డిమాండ్
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం అర్బన్/వైరా: ట్యాక్స్ అప్పీళ్లపై అనుకూల నిర్ణయం తీసుకునేందు రూ.70 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఇన్‌కమ్‌ట్యాక్స్ (ఎక్సెంప్షన్స్) కమిషనర్, వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ కుమారుడు జీవన్‌లాల్ లవిడియా సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కమిషనర్ తరఫున లంచం స్వీకరిస్తుండగా ముంబైలో ఒక మధ్యవర్తిని సీబీఐ శుక్రవారం ఉచ్చు వేసి పట్టుకుంది. సీబీఐ అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో మధ్యవర్తిని అరెస్ట్ చేసిన తర్వాత పలు ప్రాంతాల్లో మరికొందరిని అరెస్టు చేశారు. మధ్యవర్తి అరెస్టు సందర్భంగా సేకరించిన సమాచారం మేరకు సీబీఐ అధికారులు ముంబై, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్నం, ఢిల్లీలో 18 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో లంచం మొత్తంతో పాటు, రూ.69 లక్షల నగదు, పలు పత్రాలు స్వా«దీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం పాండురంగాపురంలోని మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ నివాసంలోనూ శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు 50మందితో కూడిన సీబీఐ అధికారుల బృందం తనిఖీ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి శుక్రవారం కమిషనర్ జీవన్‌లాల్ సహా 14 మందిపై కేసు నమోదు చేయగా, ఇప్పటివరకు జీవన్‌లాల్ లవిడియాతోపాటు శ్రీరామ్ పలిశెట్టి (శ్రీకాకుళం), నట్టా వీర నాగ శ్రీరామ్ గోపాల్ (విశాఖపట్నం), ముంబైకి చెందిన విరల్ కాంతిలాల్ మెహతా, సాజిద మజ్హర్ హుస్సేన్ షాలను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వారు చెప్పారు. -
రూటు మార్చిన కేటుగాళ్లు
ఈనెల 8న సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌లో ఫుడ్ ఇన్స్పెక్టర్ పేరుతో ఆశాబీ అనే మహిళ హంగామా చేసింది. బేకరీ, హోటల్, చికెన్ పకోడా దుకాణాల దారుల నుంచి రూ.1,500 చొప్పున వసూలు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి ఫోన్ చేయగా...ఆశాబీ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. అప్పటికే ఆమె అక్కడి నుంచి ఉడాయించింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సాక్షి, పుట్టపర్తి : ప్రభుత్వ అధికారుల పేరుతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మొబైల్ కాల్స్ ద్వారా నిమిషాల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. మోసపోయామని బాధితులు తెలుసుకునేలోపే అక్కడి నుంచి పరారవుతున్నారు. అనంతరం మొబైల్స్ స్విచాఫ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో సత్యసాయి జిల్లాలో వరుసగా వెలుగు చూస్తున్నాయి. పెరిగిన సైబర్ నేరాలు హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. అమాయక ప్రజలను టార్గెట్ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సమూహంగా ఏర్పడి.. కొత్త కొత్త మొబైల్ నంబర్ల నుంచి కాల్ చేసి మాయమాటలు చెప్పి.. నిమిషాల వ్యవధిలో డబ్బులు లాగుతున్నారు. లాటరీ తగిలిందని.. పర్సనల్ లోన్ అప్రూవల్ అయిందని.. ట్యాక్స్ ఆన్లైన్లో కడితే రాయితీ వస్తుందని.. ఇలా పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ కార్డులతో గుంపుగా వచ్చి.. రెండు నెలల క్రితం నల్లమాడ, బుక్కపట్నం, ఓడీ చెరువు, కొత్తచెరువు, గోరంట్ల, తనకల్లు తదితర ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో దుండగులు చొరబడ్డారు. తమ వాహనాలను ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుని.. నకిలీ కార్డులు మెడలో వేసుకుని ఆయా దుకాణదారులను భయపెట్టి భారీగా వసూళ్లు చేశారు. ఓ దుకాణదారుడికి వీరి వ్యవహారంపై అనుమానం రావడంతో అతను ఫుడ్ సేఫ్టీలో తమకు తెలిసిన వాళ్లు ఉన్నారని చెప్పాడు. దీంతో ఆగంతకులు అక్కడి నుంచి పరారయ్యారు. అధికారులపైనే ఆరోపణలు కొందరు ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో అక్కడక్కడా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నకిలీ ఐడీ కార్డులు అందజేసి వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై కొందరిని ప్రశ్నించగా.. తమకు సంబంధం లేదని దాటవేశారు.అప్రమత్తత అవసరంసైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ద్వారా వచ్చే ఓటీపీలను తెలియని వ్యక్తులు అడిగితే షేర్ చేయరాదు. పన్ను వసూళ్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించాల్సిన అవసరం లేదు. అధికారులపై ఎలాంటి అనుమానం వచ్చినా.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. ప్రజల సహకారంతోనే సైబర్ నేరాల కట్టడి సాధ్యం. – వి.రత్న, జిల్లా ఎస్పీ -
పెళ్లి ఇంట మృత్యు గంట!
హనుమాన్‌జంక్షన్ రూరల్/గన్నవరం రూరల్: చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నవ వరుడు, అతడి బావ మృతి చెందగా, ముగ్గురు చిన్నారులుసహా ఆరుగురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన ఇరువురిలో ఒకరికి గత నెల 30వ తేదీన వివాహమయ్యింది. కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, వీరవల్లి వద్ద శనివారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, హనుమాన్జంక్షన్కు చెందిన మూడెడ్ల స్వామి వెంకట ధీరజ్ (37) సీఏ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. అతడి చిన్న బావ చీరా నవీన్ (35) కెనరా బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత నెల 30న ధీరజ్‌కు వివాహమైంది. ధీరజ్ భార్య రూప (32)తో కలిసి శనివారం సాయంత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. వీరితో పాటుగా ధీరజ్ అక్క అలేఖ్య, మరో సోదరి ప్రవల్లిక, ఆమె భర్త చీరా నవీన్‌తో పాటు ముగ్గురు చిన్నారులు కూడా విజయవాడకు కారులో పయనమయ్యారు. ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి.. మార్గం మధ్యలో వీరవల్లి వద్ద ఎదురుగా అవతలి వైపు రోడ్డులో వేగంగా వస్తున్న కారు ఒకటి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని, ఎగిరి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. అప్పటి వరకూ కారులో సరదాగా మాటలు చెప్పుకుంటూ వెళుతున్న వీరంతా తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. అంబులెన్స్, ట్రక్కు ఆటోలో క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన చిన్నవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ ఆస్పత్రికి తరలించారు. ధీరజ్, నవీన్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ధీరజ్ భార్య రూప అపస్మారక స్థితిలో ఉంది. మృతుడు నవీన్‌కు కూడా రెండేళ్ల క్రితమే ప్రవల్లికతో వివాహం కావడం గమనార్హం. అలేఖ్య, ఆమె మూడేళ్ల కుమార్తె హంస్విక (4), కుమారుడు తనుష్ సాయి (2), ప్రవల్లిక, ఆమె రెండేళ్ల కుమార్తె ఎస్.జాని్వక గాయత్రి (1) కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఎదుటి కారు డ్రైవర్ నిర్లక్ష్యంఎదురుగా వస్తున్న కారు డ్రైవర్, వీడియోగ్రాఫర్ కోసూరు శ్రీనివాసరావు తీవ్ర నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఘటనను బట్టి స్పష్టమవుతోంది. విజయవాడకు చెందిన అతడు హనుమాన్‌జంక్షన్‌లో ఒక శుభకార్యానికి వీడియోగ్రఫీ పని నిమిత్తం వస్తున్నాడు. శ్రీనివాసరావు కూడా గాయాలపాలై ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మానవత్వం చాటుకున్న వైద్యుడురోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను గుర్తించిన డాక్టర్ బి.కిషోర్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఈ మార్గంలో కారులో వెళుతున్న హైదరాబాద్ ఎమ్మోర్ హస్పటల్స్ ఎండీ డాక్టర్ బి.కిషోర్‌రెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గమనించి హుటాహుటిన కిందకు దిగారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు ప్రాథమిక చికిత్స అందించారు. -
వీర సైనికా.. మా గుండెల్లోనే ఉంటావిక
గోరంట్ల: జమ్మూ కాశ్మీర్లో పాక్‌తో పోరాటంలో మరణించిన వీరజవాన్ మురళీ నాయక్ భౌతికకాయం శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఆయన స్వగ్రామమైన కల్లి తండాకు చేరుకుంది. నాయక్ భౌతికకాయం శనివారం కాశ్మీరు నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఎయిర్‌పోర్టులో సైనిక అధికారులు, సిబ్బంది ఘన నివాళులరి్పంచారు. రాష్ట్ర మంత్రి సవిత ప్రభుత్వం తరఫున నివాళులరి్పంచారు. అక్కడి నుంచి ఆర్మీ కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన స్వగ్రామానికి తీసుకొచ్చారు.దారి పొడవునా వేలాదిగా ప్రజలు తరలివచ్చి అమర వీరుడికి జోహార్లు అరి్పంచారు. దీంతో 44వ నంబరు జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. కర్ణాటకలోని బాగేపల్లి, చిక్కబళ్లాపురం, బాగేపల్లి టోల్‌ప్లాజా తదితర ప్రాంతాల్లోనూ ప్రజలు వేలాదిగా జాతీయ రహదారిపైకి చేరుకుని వీరజవాన్‌కు ఘన నివాళులరి్పంచారు. వందేమాతరం, జై జవాన్ నినాదాలు మిన్నంటాయి. భారీ జనం రావడంతో కాన్వాయ్ ముందుకు సాగడానికి చాలా సమయం పట్టింది. కర్ణాటక సరిహద్దు దాటి జిల్లాలోకి ప్రవేశించగానే.. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద జవాన్ భౌతికకాయం ఉన్న వాహనంపైకి పూలవర్షం కురిపించారు. మురళి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జనం కంటతడి పెట్టారు. కోడూరు థామస్ మన్రో తోపు, గుమ్మయ్యగారిపల్లి క్రాస్ మీదుగా స్వగ్రామం కల్లి తండాకు భౌతిక కాయం చేరుకుంది. స్వగ్రామంలో ఉద్వేగభరిత వాతావరణం మురళీ నాయక్ భౌతిక కాయం చేరుకోవడంతో స్వగ్రామం కల్లితండాలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు సహా అక్కడ ఉన్న ప్రజలు జవాన్ భౌతికకాయానికి కన్నీటితో స్వాగతం పలికారు. వీరజవాన్‌కు నివాళులరి్పంచడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, అధికారులు, నాయకులు భారీగా ఇంటి వద్దకు చేరుకున్నారు. మురళి అమర్ రహే అంటూ నినదించారు. వీరజవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు శంకరనారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు. నేడు అంత్యక్రియలు వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
డ్రగ్స్‌కు బానిసైన డాక్టర్ నమ్రత.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
సాక్షి, శేరిలింగంపల్లి: ప్రజలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు చెప్పాల్సిన వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది. డ్రగ్స్‌కు బానిసగా మారిన సదరు వైద్యురాలు.. నిషేధిత కొకైన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చిక్కింది. దీంతో, ఆమెను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత (34) సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా ఆమె డ్రగ్స్ తీసుకుంటూ.. మత్తు పదార్థాలకు బానిసగా మారిపోయారు. ఈ క్రమంలో ముంబైలో నివాసం ఉండే వాన్స్ టక్కర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించి, రూ.5 లక్షల కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది. డబ్బును మొత్తం ఆన్ లైన్ ద్వారా పంపించింది.అనంతరం, టక్కర్ తన వద్ద డెలివరీ బాయ్‌గా పనిచేసే బాలకృష్ణ రాంప్యార్ రామ్(38)కు డ్రగ్స్ ఇచ్చి నగరానికి పంపించాడు. రాయదుర్గంలో నమ్రతను కలిసిన రాంప్యార్ రామ్ డ్రగ్స్ ను అందజేస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డ్రగ్స్ ఇస్తున్న సమయంలో వారిద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్, ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ.. తన నివాసం షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్మెంట్లో దొరికిన చిగురుపాటి నమ్రతవంశ్ టక్కర్‌కు… pic.twitter.com/A03UqI0JvZ— Telugu Scribe (@TeluguScribe) May 10, 2025Credit: Telugu Scribe -
బావతో సహజీవనం చేస్తోందంటూ..
నెల్లూరు సిటీ: మహిళపై కొడవలితో దాడి చేసిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన శేషమ్మ అనే మహిళను 20 ఏళ్ల క్రితం భర్త వదిలేశాడు. ప్రస్తుతం ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటూ కేజీకే కల్యాణ మండపం వద్ద పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన కరుణాకరన్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. అతను ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం శేషమ్మ వద్ద ఉండటం అతడి బావమరిది శ్రీనివాసులుకు తెలిసింది. తన సోదరికి అన్యాయం జరుగుతోందని అతను శేషమ్మపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం పండ్ల దుకాణం వద్ద శ్రీనివాసులు కొడవలితో శేషమ్మ మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సై‘బరి’ తెగింపు
‘విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఓ వ్యక్తి స్మార్ట్ ఫోన్‌కు ఓ వెరిఫికేషన్ కోడ్, ఓటీపీ వచ్చాయి. వెంటనే ఓ ఆగంతకుడి నుంచి కాల్ వచ్చింది. పొరపాటున మీ నంబర్‌కు నాకు సంబంధించిన కోడ్, ఓటీపీ వచ్చిందని, దయచేసి దాన్ని తనకు చెప్పాలని ఆగంతకుడు అభ్యర్ధించాడు. ఫోన్లలో ఇలాంటి పొరపాటు మెసేజ్‌లు రావడం సహజమేనని నమ్మి. ఆ ఆగంతకుడికి ఆ వ్యక్తి కోడ్, ఓటీపీ చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే గుడ్‌మార్నింగ్ మెసేజ్ తన స్నేహితులకు పంపేందుకు ఆ వ్యక్తి విఫలయత్నం చేశాడు. 12 గంటల పాటు తన వాట్సాప్‌కు ఎలాంటి మెసేజ్‌లు, ఫొటోలు రావడం లేదని, తన నుంచి ఎవరికీ మెసేజ్‌లు వెళ్లడం లేదని గ్రహించాడు. ఎట్టకేలకు తన వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయిందని గ్రహించి హుటాహుటిన సైబర్ పోలీస్ స్టేషన్‌కు పరుగు పెట్టాడు’.విజయవాడస్పోర్ట్స్: డిజిటల్ అరెస్ట్, జాబ్‌ఫ్రాడ్, హనీ ట్రాప్, ఫిషింగ్, డేటా బ్రీచ్ తదితర వందకుపైగా స్కామ్‌లతో ప్రజలను ఆరి్ధక దోపిడీ చేసిన సైబర్ నేరగాళ్లు.., తాజాగా రూటు మార్చారు. ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్తో వ్యక్తిగత సమాచార మార్పిడికి రక్షణగా ఉన్న వాట్సాప్పైనా కేటుగాళ్లు కన్నేశారు. వాస్తవ ఖాతాదారులను బురిడీ కొట్టించి హ్యాక్ చేస్తూ సరికొత్త నేరాలకు పాల్పడుతున్నారు. ఒకే నంబర్‌తో వేర్వేరు ఫోన్లలో ఎన్నైనా వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసుకునే వెసులుబాటును సైబర్ నేరస్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ‘‘ నేరగాళ్లు వారి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న వాట్సాప్‌కు మీ నంబర్ ఇస్తారు. దీంతో వాట్సాప్ సంస్థ నుంచి మీ మొబైల్‌కు వెరిఫికేషన్ కోడ్, ఓటీపీ వస్తుంది. ఈ రెండూ తెలుసుకునేందుకు మిమ్మల్ని ఫోన్లో సంప్రదిస్తారు. పొరపాటున కోడ్, ఓటీపీ మీ నంబర్‌కు వచ్చిందని, దాన్ని కాస్త చెప్పాలని అభ్యర్థిస్తారు. కోచ్, ఓటీపీ వారికి చెప్పగానే మీ వాట్సాప్ ఖాతా వారి ఫోన్లో ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిజెప్పీరింగ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తారు. మీ వాట్సాప్ వచ్చే అన్ని మెసేజ్, ఫోటోలు పూర్తిగా వారి ఫోన్‌కు వెళ్లేలా సెట్టింగ్స్ చేసి హ్యాక్ చేస్తారు. వాట్సాప్ సంభాషణ పూర్తిగా వారి ఆ«దీనంలోకి తీసుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలు, వ్యక్తిగత హననానికి, ఆర్థిక దోపిడీకి పాల్పడతారు. హ్యాకింగ్‌తో అపరిమితమైన నేరాలువాట్సాప్లో చాటింగ్, గ్రూప్‌ల ఆధారంగా ఆ వాట్సాప్ వినియోగించే వ్యక్తి మనస్తత్వాన్ని నేరగాళ్లు అంచనా వేస్తున్నారు. ఏయే గ్రూప్‌లకు మెసేజ్‌లు పార్వాడ్ చేస్తున్నారో.., ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నారో.., ఎలాంటి సంభాషణలు చేస్తున్నారో.., క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీని ఆధారంగా స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు, వ్యాపార భాగస్వాములను వాట్సాప్ ద్వారా డబ్బులు అభ్యర్థిస్తారు. వాస్తవ ఖాతాదారుడికి తెలియకుండానే అతని పేరుతో చాటింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. వాట్సాప్ బ్యాంకింగ్ వ్యాలెట్‌లో ఉన్న నగదునూ లూటీ చేస్తారు. డీపీ (డిస్ప్లే పిక్చర్) ఫొటోను మారి్ఫంగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరిస్తారు. వాట్సాప్ కాంటాక్ట్, గ్రూప్‌లలో ఉన్న మహిళల డీపీలను మారి్ఫంగ్ చేస్తారు. మహిళలకు అసభ్య మెసేజ్‌లు పంపి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. డేటింగ్, బెట్టింగ్, గేమింగ్ యాప్‌లను వినియోగించడమే కాకుండా గ్రూప్‌లలో ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటారు. వాట్సాప్ గ్రూప్లలోకి, వ్యక్తిగత నంబర్లకు ఏపీకే ఫైల్స్, మాల్వేర్లను పంపిస్తారు. పొరపాటున వాటిని క్లిక్ చేసిన వ్యక్తుల అకౌంట్లను హ్యాక్ చేస్తారు. చైల్డ్ పోర్నోగ్రఫి, పోర్న్ వీడియోలను, న్యూడ్ ఫొటోలను వాట్సాప్ అకౌంట్ ద్వారా ఇతరులకు షేర్ చేస్తారు. స్త్రీ/పురుషు వ్యభిచారుల(మేల్ ఎస్కార్ట్ సర్వీస్, ఫిమేల్ ఎస్కార్ట్ సర్వీస్) వివరాలను ఇతరులకు షేర్ చేసేందుకు ఈ వాట్సాప్‌ను వినియోగిస్తారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచార మారి్పడికి హ్యాక్ చేసిన అకౌంట్లను వినియోగిస్తారు. వాట్సాప్ చానల్ ద్వారా సంఘ వ్యతిరేక, అసభ్య సమాచార మార్పిడి చేసి కేసుల్లో ఇరికిస్తారు.లా ఎన్ఫోర్స్మెంట్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండికీ ప్యాడ్ ఫోన్ వినియోగించే వారు సైబర్ నేరస్తుల ట్రాప్‌లో అత్యధికంగా పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగించే ఉన్నత విద్యావంతులూ బాధితులుగా ఉన్నారు. వాట్సాప్ మాత్రమే కాకుండా ఇన్‌స్టా, టెలిగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ ఖాతాలకు సంబంధించిన వెరిఫికేషన్ కోడ్, ఓటీపీలను ఇతరులకు చెప్పడం, షేర్ చేయడం చేయరాదు. సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్ హ్యాకింగ్‌కు గురైతే వెంటనే లా ఎన్ఫోర్స్మెంట్ పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. గూగుల్లోకి వెళ్లి లా ఎన్ఫోర్స్మెంట్ అని టైప్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో ‘మీరు పోలీసా’ అని అడుగుతుంది, ‘నో’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయగానే కొత్త ఫారం ఓపెన్ అవుతుంది. అందులోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, ఇష్యూష్ ఆప్షన్లో హ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేస్తే ఫిర్యాదు ఆన్లైన్లో రికార్డవుతుంది. ఫిర్యాదు చేయడంలో ఏమైనా సందేహాలుంటే సైబర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి. –శ్రీరామచంద్రమూర్తి రాళ్లపల్లి, ఎస్ఐ, సైబర్ క్రైం, ఎన్టీఆర్ జిల్లా -
రూ.50 లక్షల ఆభరణాలు : చెల్లని చెక్కు ఇచ్చి చెక్కేసిన కిలాడీ
గచ్చిబౌలి: సినీ ప్రముఖులు, రాజకీయ పెద్దలు తెలుసని బిల్డప్ ఇస్తూ విలువైన నగలను ఆర్డర్ చేసి ఉడాయించిన ఓ కిలేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాయమాటలు చెప్పి రూ.50 లక్షల విలువ చేసే నగలను తీసుకుని బిల్లులు చెల్లించకుండా తిరుగుతున్న మహిళ కోసం రాయదుర్గం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కొద్ది రోజుల క్రితం అబిడ్స్‌లోని ఓ నగలు షాపు యజమానికి రమాదేవి అనే మహిళ వాట్సాప్ వీడియో కాల్ చేసి వివిధ డిజైన్ల నగలను ఎంపిక చేసుకుంది. దాదాపు రూ.50 లక్షల విలువైన నలను రాయదుర్గం పీఎస్ పరిధిలోని తాను నివాసం ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీకి తెప్పించుకుంది. చెక్ ఇచ్చి కొంత డబ్బు తక్కువగా ఉందని రెండు రోజుల తర్వాత బ్యాంకులో వేసుకోవాలని సూచించింది. అయితే ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో డబ్బులు ఇవ్వకుండా మొఖం చాటేసింది. బాధితులు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు రమాదేవి కోసం గాలిస్తున్నారు. ఇది ఇలా ఉండా గతంలో ఇదే తరహాలో నగలు కాజేసిన ఆమెపై నార్సింగి పీఎస్ పరిధిలో ఒకటి, రాయదుర్గం పీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. అయినా తన తీరుమార్చుకోని సదరు మహిళ సినీ ప్రముఖులు, రాజకీయనాయకులతో దిగిన ఫొటోలు చూపిస్తూ, తాను ధనవంతురాలినని బిల్డప్ ఇస్తూ జ్యువెల్లర్ షాపుల యజమానులతో పరిచయం చేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో నమ్మకంగా ఉన్నట్లు నమ్మిస్తుంది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో విలువైన నగలు తీసుకుని మోసాలకు పాల్పడుతోంది. గతంలో నమోదైన కేసుల్లో నోటీసులు ఇచ్చినన పోలీసులు ఈ సారి ఆమెను అరెస్ట్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్తోగొంతు కోసి..మృతదేహాన్ని తగులబెట్టి..చాంద్రాయణగుట్ట: ఓ మహిళను గొంతుకోసి దారుణంగా హత్య చేయడమేగాక మృతదేహాన్ని తగలబెట్టిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ కేశవగిరి హిల్స్ ప్రాంతంలో కేతావత్ బుజ్జి (55), రూప్ దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త, కుమారుడు మరో ప్రాంతంలో ఉండటంతో ఒంటరిగా ఉంటున్న బుజ్జి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. బుధవారం కూలీ పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చింది. అర్ధరాత్రి ఆమె ఇంట్లో నుంచి మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ ఇన్స్పెక్టర్ గురునాథ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఓ మహిళ మృతదేహం తగలబడుతున్నట్లు గుర్తించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె మృతదేహం సగం కాలిపోయింది. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా బుజ్జిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: వెయిటర్ టు కరోడ్‌పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీ -
నకిలీకి ‘అసలు సీఐ’ తోడు
పీఎం పాలెం (విశాఖపట్నం): మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నకిలీ ఏసీబీ సీఐ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. నకిలీ ఏసీబీ సీఐ అవతారం ఎత్తిన బలగ సుధాకర్.. ‘సీఐ’గా పనిచేస్తున్న స్వర్ణలతను ‘ఏసీబీ ఎస్పీ’గా పేర్కొంటూ సబ్ రిజిస్ట్రార్ (sub registrar) చక్రపాణిని మభ్యపెట్టాడు. ‘ఏసీబీ దాడుల నుంచి ముప్పు లేకుండా ఉండాలంటే సుధాకర్ కోరినట్లుగా రూ. 5 లక్షలు ఇచ్చేయండి’ అంటూ ఆమె కూడా చక్రపాణికి ఫోన్లో తెలిపారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న సుధాకర్ ఫోన్ నంబరు ఆధారంగా చేసిన దర్యాప్తులో తాజా అంశం బట్టబయలైంది. దీంతో గతంలో వైజాగ్‌లో పనిచేసి ప్రస్తుతం బాపట్ల (Bapatla) రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్వర్ణలత ప్రమేయం ఈ కేసులో ఉందని పోలీసులు తేల్చారు. ఆమెను గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అరెస్టయిన సుధాకర్‌తోపాటు, సీఐ స్వర్ణలతను రిమాండ్ నిమిత్తం భీమిలి కోర్టుకు తరలించామని స్థానిక సీఐ బాలకృష్ణ తెలిపారు.అసలేం జరిగింది? బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖపట్నం (Visakhapatnam) మధురవాడలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి బలగ సుధాకర్ వచ్చాడు. నేరుగా సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని కలిసి, తనను ఏసీబీ సీఐగా పరిచయం చేసుకున్నాడు. త్వరలో మీ ఆఫీసులో రైడ్ జరగబోతోందని, తనకు 5 లక్షల రూపాయలు ఇస్తే దాడుల ముప్పు నుంచి మిమ్మల్ని కాపాడతానని నమ్మబలికాడు. అతడి వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పీఎం పాలెం పోలీసులకు చక్రపాణి సమాచారం ఇచ్చారు. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. చదవండి: అంతుచూసిన అనుమానం.. భర్త చేతిలో భార్య దారుణ హత్య -
ఉద్యోగం కోసం వచ్చి ఐఫోన్లు మాయం చేశాడు
సనత్‌నగర్: ఉద్యోగం కోసం వచ్చినన ఓ వ్యక్తి రూ.1.40 లక్షల విలువైన రెండు ఐఫోన్లను చోరీ చేసిన ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బేగంపేట డీఐ జి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..బేగంపేటలోని ఎఫ్డీఆర్ ఆర్డీ టవర్స్‌లో గల జెప్టో కార్యాలయానికి స్టోర్ ప్యాకర్‌గా పనిచేసేందుకు బాలానగర్‌లోని జింకలవాడకు చెందిన గౌతమ్ అంకిత్‌పాత్ర (24) ఈ నెల 3వ తేదీన వచ్చాడు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత స్టోర్‌లో పనిచేసేందుకు అంగీకరించాడు. స్టోర్‌ను ఒకసారి చూసి వస్తానని చెప్పి స్టోర్‌లో కనిపించిన రెండు విలువైన ఐఫోన్లను తీసి దాచుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి కార్యాలయానికి రాలేదు. ఆ తర్వాత స్టోర్ ఆడిట్ చేసిన నిర్వాహకులు రెండు ఐఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా గౌతమ్ అంకిత్‌పాత్ర సెల్ఫోన్లను చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు స్టోర్ ఉద్యగి తిలక్‌కుమార్ బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యం సికింద్రాబాద్: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచి్చన వివాహిత అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. ఒడిశా రాష్ట్రం పలపాతి గ్రామానికి చెందిన జడునాథ్ ముర్ము, మల్హో మణి ముర్ము(26) దంపతులు. ఈ నెల 6న సాయంత్రం 8 గంటల సమయంలో భార్యభర్తలు భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ తీసుకొని విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలెక్కారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ ఫాం నంబర్ 1లోని గేట్ నంబర్ 5 వద్ద కూర్చున్నారు. టూత్‌పేస్ట్ తీసుకొచ్చేందుకు భర్త జడునాథ్ బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య కనిపించకుండా పోయింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికినా భార్య మల్హో మణి ఆచూకీ లభించకపోవడంతో జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లో యువకుడి ఆత్మహత్య చిక్కడపల్లి: పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం చిక్కడపల్లి మెట్రోస్టేషన్‌కు వచి్చన గుర్తుతెలియని యువకుడు అక్కడే వాంతులు చేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిని గుర్తించిన మెట్రో సిబ్బంది 108కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలో గురువారం జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి వేదవతి కుమారి సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎం.భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఏరో ట్రాన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బెల్ హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి గంగోత్రి సమీపంలోని ఖర్సాలీ హెలిప్యాడ్‌కు టేకాఫ్ తీసుకుంది.ఉదయం 8.45 గంటల సమయంలో రిషికేశ్–గంగోత్రి నేషనల్ హైవేపై గంగ్నానీ సమీపంలో అదుపు తప్పిన హెలికాప్టర్ సుమారు 250 మీటర్ల లోతైన లోయలో కూలిపోయింది. ఆ సమయంలో అందులో పైలట్ సహా ఏడుగురున్నారు. ఘటనలో మృతి చెందిన వారిని ఏపీకి చెందిన వేదవది కుమారి(48), విజయా రెడ్డి(57), కళ చంద్రకాంత్ సోని(61), రుచి అగర్వాల్(56), రాధ అగర్వాల్(79), కెపె్టన్ రాబిన్ సింగ్(60)గా గుర్తించారు.రాబిన్ సింగ్ స్వస్థలం గుజరాత్ కాగా ముగ్గురిది ముంబై, ఒకరిది యూపీ. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏపీ వాసి ఎం.భాస్కర్(51)ను వెంటనే మరో హెలిక్టాపర్లో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించామని జిల్లా మేజి్రస్టేట్ మెహర్బన్ సింగ్ బిష్త్ చెప్పారు. ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. -
నారాయణరెడ్డి హత్య కేసులో.. 11 మందికి జీవిత ఖైదు
కర్నూలు (సెంట్రల్)/వెల్దుర్తి: కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన అనుచరుడు బోయ సాంబశివుడు హత్య కేసులో 11 మంది నిందితులపై నేరం రుజువైంది. వీరందరికీ జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి జి. కబర్థి గురువారం తీర్పు చెప్పారు. మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. 2017 మే 21న చెరుకులపాడు నారాయణరెడ్డి అనుచరులతో కలిసి కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో పెళ్లికి రెండు వాహనాల్లో బయల్దేరారు. నిందితులు రెండు ట్రాక్టర్లలో వచ్చి నారాయణరెడ్డి కారును ఢీకొట్టి నారాయణరెడ్డిపై దాడిచేసి హత్యచేశారు. అడ్డుకోబోయిన సాంబశివుడునూ అంతమొందించారు. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదుచేసి 19 మందిపై చార్జిషీటు దాఖలు చేశారు. నిందితులుగా ఉన్న ప్రస్తుత పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ప్రస్తుత వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మలు హైకోర్టును ఆశ్రయించగా వీరి పేర్లు కేసు నుంచి తొలగించారు. ఏ4గా ఉన్న కోతుల రామాంజనేయులు చనిపోవడంతో మొత్తం 16 మందిపై తుది విచారణ సాగింది. ఇందులో 11 మందికి జీవిత ఖైదు పడగా, ఐదుగురిపై నేరం రుజువు కాలేదు. జీవిత ఖైదు పడిన నిందితులు వీరే.. కురువ రామాంజనేయులు, రామయ్యనాయుడు, కురువ రామకృష్ణ, కోతుల బాలు, కోతుల చిన్న ఎల్లప్ప, కోతుల పెద్ద ఎల్లప్ప, గంటల వెంకటరాముడు, గంటల శీను, బీసన్నగారి రామాంజనేయులు(40), బీసన్నగారి రామాంజనేయులు(42), బీసన్నగారి పెద్ద బీసన్నలకు జీవితఖైదు పడింది. చాకలి నారాయణ, కర్రి గిడ్డయ్య, చెరుకులపాడు గోపాల్, చిన్న వెంకటలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. బీసన్నగారి పెద్ద బీసన్న వయస్సు ప్రస్తుతం 83 ఏళ్లు. నిందితుడు ఆత్మహత్యా యత్నం.. నిందితుల్లో ఒకరైన రామాంజనేయులును వాహనంలో కడపకు తీసుకెళ్తుండగా తలను వాహనం కిటికీకి కొట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకే.. నారాయణరెడ్డి, బోయ సాంబశివుడు హత్యకేసులో తమకే ఎందుకు జీవితఖైదు పడిందని, కేఈ శ్యాంబాబుకు ఎందుకు శిక్ష పడలేదని నిందితులు కురువ రామాంజనేయులు, బీసన్నగారి రామాంజనేయులు ప్రశ్నించారు. కేఈ కుటుంబాన్ని నమ్ముకుంటే జైలుకు పోవాల్సిందేనని, ఆ కుటుంబాన్ని ఎవరూ నమ్మొద్దని.. వారెలాంటి సాయం చేయరని, తమకు తగిన శాస్తి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.చట్టం, కోర్టులపై నమ్మకం పెరిగింది.. నారాయణరెడ్డి సతీమణి,మాజీఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనంతరం.. కర్నూలులోని తన స్వగృహంలో నారాయణరెడ్డి సతీమణి, కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఈ అంశంపై స్పందించారు. కోర్టు తీర్పుతో, పోలీసులు కేసులో చూపిన తెగువతో తమకు, ప్రజలకు చట్టంపై, కోర్టులపై నమ్మకం పెరుగుతోందన్నారు. తన భర్త నారాయణరెడ్డి బతికుంటే ఎమ్మెల్యే కాలేమన్న భయంతోనే కేఈ శ్యాంబాబు కుట్ర పన్ని హత్య చేయించారని ఆమె ఆరోపించారు. నారాయణరెడ్డి హత్య కేసు తీర్పును చూసి ప్రజలు కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉండాలని శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. నారాయణరెడ్డి సోదరుడు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కేఈ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడే తన తండ్రిని, తన సోదరుడిని పోగొట్టుకున్నామన్నారు. -
మందుపాతర్లు పేల్చిన మావోయిస్టులు
వాజేడు/ఎంజీఎం/సాక్షి, హైదరాబాద్: కర్రిగుట్టలు మరోసారి దద్దరిల్లాయి. ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల పైనున్న పెనుగోలు గ్రామ సమీప నూగూరు అటవీ ప్రాంతంలో అమర్చిన మందుపాతరలను మావోయిస్టులు పేల్చేశారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్రే హౌండ్స్‌కు చెందిన కమాండోలు వడ్ల శ్రీధర్ (జేసీ4973/పీసీ1785), ఎన్.పవన్‌కల్యాణ్ (జేసీ10541/పీసీ) టి.సందీప్ (జేసీ 4638/పీసీ8124) అక్కడికక్కడే మృతి చెందారు. పైడిపల్లికి చెందిన అర్ఎస్ఐ సీహెచ్ రణదీర్ గాయపడ్డారు. మరో ఇద్దరు జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం. కాగా మెరుగైన వైద్యం కోసం రణదీర్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. భారీ ఎన్కౌంటర్ మరుసటి రోజే.. కర్రిగుట్టల్లో చేపట్టిన కగార్ ఆపరేషన్ 17 రోజులకు చేరుకుంది. కర్రి గుట్టలను చుట్టు ముట్టిన భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే బుధవారం ఎన్కౌంటర్ చోటు చేసుకోగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కూంబింగ్ కోసం వచ్చే దళాలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుని ముందే అమర్చిన మందుపాతరలను రిమోట్ల సహాయంతో పేల్చివేసినట్లు తెలుస్తోంది. 35 – 40 మందితో కూడిన మావోయిస్టుల బృందం (మహిళలు కూడా ఉన్నారు) ఇందులో పాల్గొన్నట్టు సమాచారం. మృతదేహాలు పరిశీలించిన మంత్రి, డీజీపీ గ్రేహౌండ్స్ కమాండర్ల మృతదేహాలను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క, డీజీపీ జితేందర్, గ్రే హౌండ్స్ ఏడీజీ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు నాగరాజు, రాజేందర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, ము లుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ మార్చురీ వద్ద పరిశీలించారు. ఈ ఘటనపై వాజేడు పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 62, 148, 191(1), 191(3), 103, 109 ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్, సెక్షన్ 25(1–బీ)(ఏ), 27 ఏఆర్‌ఎమ్‌ఎస్ యాక్ట్, సెక్షన్ 10, 13 ,18,20, కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కాగా మందుపాతర్ల పేలుడులో మరణించిన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్రీధర్ (30)కు 9 నెలల క్రితమే వివాహమైనట్లు తెలిసింది. నాలుగు గంటల పాటు పోస్టుమార్టం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వరంగల్ ఎంజీఎం మార్చురీకి చేరుకున్న పోలీసుల మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులు నాలుగు గంటల పాటు పోస్టుమార్టం జరిపారు. బుల్లెట్ల గాయాలతోనే జవాన్లు మృతి చెందినట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు: డీజీపీ ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఈడీల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులపై దూరంలో మాటేసిన మావోయిస్టులు మందుపాతరలు పేల్చారని డీజీపీ తెలిపారు. సెర్చ్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా భారీ కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో మావోయిస్టులు కాల్పులు ఆపేసి పారిపోయారన్నారు. ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దు: మావోయిస్టులు పోలీసుల వలలోపడి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని మావోయిస్టులు మరోమారు హెచ్చరించారు. ఈ మేరకు మావోయిస్టు వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట గురువారం ఒక లేఖ విడుదల అయ్యింది. ‘పోలీసు బలగాల కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి కర్రిగుట్టలపై బాంబులు అమర్చాం. ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాం. అయినా కొంతమంది ఆదివాసీ, ఆదివాసీయేతర ప్రజలకు పోలీసులు మాయ మాటలు చెప్పి నమ్మిస్తూ, డబ్బులు ఇస్తూ ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారు. షికారు పేరుతో వారిని కర్రిగుట్టల వైపు పంపిస్తున్నారు. మా రక్షణ కోసం అమర్చిన బాంబులు పేలి వారు చనిపోతున్నారు. కాబట్టి ప్రజలెవరూ కర్రిగుట్టల వైపు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం..’అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
ఏడేళ్ల ప్రేమ అంతలోనే .. ! పాపం ఆ యువకుడు..
జమ్మికుంట(కరీంనగర్): ఇటీవల యువతలో ఒకరిని ప్రేమించడం, మరొకరిని పెళ్లాడటం కామన్‌గా మారిపోయింది. అయితే కొందరు దీన్ని జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతుండటమే బాధకరం. అలాంటి దారుణ ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకెళ్తే..కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో ఆమె ఇటీవలే వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఇది తెలిసి మనస్తాపం చెందిన ఎల్లేష్ సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా ఆ వీడియోలో తన ఫోన్లో ఆమెకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని..యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని కోరాడు. అలాగే తనను ఇంతలా మోసం చేసిన ఆ యువతి కుటుంబంపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడ్డ యువకుడు7 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యకరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ… pic.twitter.com/lx0DPxyUEd— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025 -
ఐదేళ్లుగా వివాహేతర సంబంధం.. చివరికి..!
మహబూబ్‌నగర్ క్రైం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళతో డబ్బుల విషయంలో ఏర్పడిన గొడవలో ఓ వ్యక్తి సదరు మహిళను గొంతు నులిమి హత్య చేశాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని దొడ్డలోనిపల్లికి చెందిన శాంతమ్మ (35) ఒంటరిగా జీవనం సాగించేది. ఈ క్రమంలో ఆమెకు నవాబ్‌పేట మండలం తీగలపల్లికి చెందిన కృష్ణయ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఐదేళ్లుగా ఇద్దరు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే డబ్బుల వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఇద్దరు గొడవ పడేవారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం కూడా గొడవ జరగగా కృష్ణయ్య, శాంతమ్మను గొంతు నులిమి హత్య చేసి పారిపోయాడు. ఇంట్లో మంచంపై పడి ఉన్న శాంతమ్మ మృతదేహన్ని స్థానికులు బుధవారం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గాం«దీనాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ సోదరి మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలో హెలికాప్టర్ కూలిపోయిన (Chopper Crashes) ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. ఉత్తర కాశీ జిల్లాలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో కొందరు పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న హెలికాప్టర్ భగీరథి నది (Bhagirathi River) సమీపంలో కుప్పకూలిపోయింది. కాగా, ప్రమాద సమయంలో అందులో ఏడుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.అయితే, ఈ ప్రమాదంలో టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ సోదరి వేదవతి కుమారి (48) మృతిచెందారు. ఈ ఘటనలో అంబికా లక్ష్మీ నారాయణ బావ భాస్కర్ (51) గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన భాస్కర్‌ను రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ రుషికేశ్ బయలుదేరారు. A Helicopter carrying devotees to Gangotri crashed near Gangnani in Uttarakhand's Uttarkashi; 5 dead, 2 injuredRescue operations are underway, Administration and relief teams are present at the crash site.#Uttrakhand #Uttarkashi pic.twitter.com/3bix32iBnN— Ishani K (@IshaniKrishnaa) May 8, 2025విమాన ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, జిల్లా పరిపాలన బృందాలు సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. -
అంతుచూసిన అనుమానం..!
శ్రీకాకుళం: కోటబొమ్మాళిలో బ్యూటీపార్లర్, లేడీస్ కార్నర్ షాపు నిర్వహిస్తున్న మహిళ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నర్సిపురం లక్ష్మి (30) తన భర్త తిరుపతిరావుతో కలిసి కోటబొమ్మాళి విద్యుత్‌నగర్‌లో నివాసముంటోంది. లక్ష్మి స్థానికంగా హర్షిణి పేరుతో బ్యూటీ పార్లర్, లేడీస్ కార్నర్ నిర్వహిస్తోంది. తిరుపతిరావు కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. భార్యపై అనుమానంతో ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవి. గతంలో పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భార్య లక్ష్మిని భర్త తిరుపతిరావు దారుణంగా గొంతు కోశాడు. దీంతో లక్ష్మి తీవ్ర రక్తస్రావంతో విగత జీవిగా పడిపోయింది. అనంతరం తిరుపతిరావు మద్యం షాపునకు వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు మద్యం షాపు వద్ద ఉన్న తిరుపతిరావును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భార్యపై అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతురాలికి భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇన్చార్జి సీఐ విజయకుమార్, ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలంలో దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు. -
ఏసీకి షార్ట్ సర్క్యూట్..కొరియోగ్రాఫర్ మృతి
మణికొండ(హైదరాబాద్): గాఢ నిద్రలో ఉన్న ఓ కొరియోగ్రాఫర్ గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి, దట్టమైన పొగ పీల్చటంతో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్, పుప్పాలగూడ శ్రీరాంనగర్ కాలనీలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.ఎస్ మునీందర్ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లాకు చెందిన పోరేటి వీరేందర్‌రెడ్డి (38) కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీరాంనగర్ కాలనీలోని కుతుబ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్లోని 301 ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం రాత్రి తన గదిలో వీరేందర్‌రెడ్డి నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో అతని గదిలోని ఏసీకి షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు చెలరేగాయి. దుస్తులు, ఫర్నిచర్ కాలిపోయి పొగలు వ్యాపించాయి.గమనించిన చుట్టు పక్కల వారు డయల్ 100 ద్వారా పోలీసు, అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలార్పి గదిలోకి వెళ్లగా వీరేందర్‌రెడ్డి అపస్మారక స్థితిలో కనిపించాడు. సీపీఆర్ చేసినా అప్పటికే దట్టమైన పొగను పీల్చటంతో మృతి చెందినట్టు 108 సిబ్బంది ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించామని, షార్ట్ సర్క్యూట్ కారణాలను తెలపాలని విద్యుత్ శాఖకు లేఖ రాశామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బావ మా అక్క మరో పెళ్లి చేసుకుంటుంది..!
బంజారాహిల్స్(హైదరాబాద్): భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా..భర్తకు దూరంగా ఉంటున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని ప్రశ్నించగా..అతనిపై రోకలితో దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేపాల్ దేశం బరాండ్కు చెందిన కృష్ణదమత్ బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. 2013లో సునీత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో హౌస్‌కీపింగ్‌గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. 2024 అక్టోబర్‌లో కుటుంబాన్ని తన గ్రామానికి పంపించేందుకు స్నేహితుడి నుంచి రూ.1.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇదే విషయమై సునీతకు, కృష్ణకు గొడవలు జరిగాయి. ఇదే క్రమంలో జనవరి 3న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కృష్ణకు భార్యతో మరోసారి గొడవ జరిగింది. దీంతో సునీతను ఇంటి నుంచి పంపించివేశాడు. అప్పటి నుంచి భార్యతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. ఇదిలా ఉండగా మంగళవారం సునీత సోదరుడు దీపక్..కృష్ణదమత్కు ఫోన్‌చేసి తన సోదరి అమర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. దీంతో కృష్ణదమత్ వెంటనే నందినగర్‌లోని సునీత ఉండే నివాసానికి వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా సునీత అల్యుమినియం రోకలితో భర్తపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కుడికంటి వద్ద తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. ఆమెతో పాటు అమర్ కూడా కృష్ణదమత్పై దాడి చేయగా బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డాడీ.. లే డాడీ..
తంగళ్లపల్లి (సిరిసిల్ల): తండ్రి నిద్రపోయాడనుకున్న ఆ రెండేళ్ల చిన్నారి చనిపోయిన తండ్రిని ‘డాడీ.. లే డాడీ’.. అంటూ పిలవడం అందరినీ కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్‌నగర్ (డబుల్ బెడ్రూం సముదాయం)లోని బ్లాక్ నంబర్ 18, రూం నంబర్ 6లో నివాసముంటున్న తాడూరి రామ్‌కుమార్ (38) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. రామ్‌కుమార్ 14 ఏళ్ల కిత్రం వేములవాడకు చెందిన అనితను కులాంతర వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం సుఖజిత్ (11), శ్రీవాస్తవ్ (5), విహాన్ (2). రామ్‌కుమార్ జిరాక్స్ మెషీన్ మెకానిక్‌గా, వివాహ ఈవెంట్లలోనూ పనిచేస్తుండేవాడు. పనులు సరిగాలేక రామ్‌కుమార్‌కు రూ.3 లక్షల వరకు అప్పులు కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం మధ్యాహ్నం భార్య వంట గదిలో ఉన్న సమయంలో పెద్ద కొడుకు సుఖజిత్తో మాట్లాడిన రామ్‌కుమార్, తమ్ముళ్లను బాగా చూసుకోమని చెప్పి గదిలోకి వెళ్లి డోర్ వేసుకుని ఉరేసుకున్నాడు. ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో భార్య కేకలతో స్థానికులు వచ్చి తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే మృతిచెందాడు. ట్రెయినీ ఎస్సై వినీతారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కర్రిగుట్టల్లో రక్తపుటేర్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టలు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బుధవారం జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 38 మంది మావోయిస్టులు చనిపోయినట్టు విశ్వసనీయవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ మాత్రం.. 22 కంటే ఎక్కువ మావోయిస్టుల మృతదేహాలు లభించినట్లు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ బుధవారం ఉదయమే జరిగినట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మొదలైంది. తొలుత 15 మంది మావోయిస్టులు మాత్రమే చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ సంఖ్య గంటగంటకూ పెరగగా, ఛత్తీస్‌గఢ్ సీఎం మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని రోజులుగా కర్రిగుట్టల దగ్గర యాంటీ నక్సలైట్ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా దళాలకు ఈ రోజు భారీ విజయం దక్కింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది..’అని వెల్లడించారు. మృతదేహాలేవీ..? బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రిగుట్టల సమీపాన గుంజపర్తి – ఇత్తగూడ సమీపంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్టు సమాచారం. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నామని ఛత్తీస్‌గఢ్ సీఎం ప్రకటించినా..ఎవరెవరు చనిపోయారు? ఆ మృతదేహాలను ఎక్కడికి, ఎలా తరలించారనే అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో చనిపోయిన మావోయిస్టుల్లో అగ్రనేతలు ఉన్నారా లేక దళ సభ్యులు, జన మిలీషియా సభ్యులే ఉన్నారా? అనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ గుట్టలపై తెలంగాణ మావోయిస్టు కమిటీతో పాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, పీఎల్జీఏ బెటాలియన్ వన్ ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు బుధవారం ఐఈడీ పేలి ఓ జవాను గాయపడగా, ఎలుగుబంటి దాడిలో ఇంకొకరు గాయపడినట్టు తెలుస్తోంది. అయితే వీటిపై పోలీసు వర్గాల నుంచి అధికారిక సమాచారం అందలేదు. మిషన్‌లో అంతా గోప్యతే మంగళవారం డ్రోన్‌తో తీసిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. కొందరు సాయుధులు నడిచి వెళ్తున్న దృశ్యాలు వాటిల్లో కనిపించాయి. ఈ వీడియో ‘మిషన్ సంకల్ప్’కు సంబంధించినదే అని ప్రచారం జరిగినా, అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. అయితే ఆ మరుసటి రోజే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఒక్క వీడియోనే కాదు మిషన్ సంకల్ప్ మొదలైనప్పటి నుంచి అన్ని విషయాల్లో భద్రతా దళాలు గోప్యత పాటిస్తున్నాయి. మావోయిస్టులు ఉపయోగించిన గుహలు అంటూ వైరల్ అయిన వీడియోలపైనా స్పష్టత కరువైంది. ఏప్రిల్ 24న జరిగిన ఒక ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు చనిపోయారని ప్రకటించి, వారి పేర్లు, ఫొటోలు వెల్లడించడానికి 72 గంటల సమయం తీసుకున్నారు. వారు ఎక్కడివారనేది వెల్లడించలేదు. అలాగే మంగళవారం చనిపోయిన మరో మహిళా మావోయిస్టుకు సంబంధించిన వివరాలపై కూడా స్పష్టత లేదు. ప్రస్తుత భారీ ఎన్కౌంటర్ విషయంలోనూ అదే గోప్యత కొనసాగుతోంది. కొనసాగుతున్న ఆపరేషన్ మిషన్ సంకల్ప్ ఏప్రిల్ 21న మొదలైంది. ఈ ఆపరేషన్‌లో 24 వేల మంది బలగాలను, నాలుగు హెలీకాప్టర్లు, రెండు డ్రోన్లు, 20 వరకు ఆన్మ్యాన్డ్ వెహికల్స్(యూఏవీ)ను ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు కర్రిగుట్టల్లో 70 శాతం ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ అ«దీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 6 తర్వాత దశల వారీగా ఇక్కడ బలగాలను తగ్గించాలని ముందుగా నిర్ణయించినా, బుధవారం నాటి ఎన్కౌంటర్ నేపథ్యంలో మరికొన్ని రోజులు యధాతథంగా కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 184 మంది మావోయిస్టులు చనిపోయారు.ఐదుగురు మావోయిస్టుల లొంగుబాటుములుగు: మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు బుధవారం లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ తెలిపారు. లొంగిపోయిన వారిలో కొమటిపల్లికి చెందిన ఆర్పీసీ సభ్యుడు మడావి భీమా, జంగిల్శాఖ సభ్యుడు మడావి కోస, డీకేఏఎంఎస్ సభ్యుడు మడివి భీమా, ఆర్పీసీ సభ్యుడు వంజం ఊర, చైతన్య నాట్యమండలి సభ్యురాలు వంజం హుంగి ఉన్నట్లు చెప్పారు. -
ప్రియుడితో వెళ్లిపోయిన పెళ్లి కూతురు
నారాయణపేట రూరల్: మూడు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కాబోయే వధువు ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో పరువు పోయిందన్న మనస్తాపంతో పెళ్లి కొడుకు తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణలోని నారాయణపేటలో చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన కాంజి గోవిందరావు కుమారుడు అభిషేకు జ్ఞాని విజయ్‌కుమార్ కూతురు శ్వేతతో పెళ్లి కుదిరింది. నాలుగు నెలల క్రితం ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని సైతం ఘనంగా నిర్వహించారు.ఈ నెల 9వ తేదీన పెళ్లి ముహూర్తం నిశ్చయించి పెళ్లిపత్రికలు కూడా పంచారు. కాగా.. ఆదివారం ఉదయం పెళ్లి కూతురు శ్వేత తన ప్రియుడు వెంకటేశ్‌తో వెళ్లిపోయింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అయితే మంగళవారం తన కుమారుడిని పెళ్లి కొడుకుని చేయాల్సి ఉండగా ఇలా పెళ్లి ఆగిపోవడం భరించలేక.. మనస్తాపంతో తండ్రి గోవిందరావు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసినా విజయ్‌కుమార్ దాచిపెట్టి.. పెళ్లికి సిద్ధమై పరువు తీశారని, అందుకే గోవిందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.చదవండి: కన్నీటి నిశ్చితార్థం.. తల్లిదండ్రులు, ముగ్గురు పిల్లలు దుర్మరణం -
రాత్రి 9:30 తరువాత అన్నీ బంద్
దొడ్డబళ్లాపురం/బనశంకరి: మంగళూరులో గత గురువారం రాత్రి హిందూ కార్యకర్త సుహాస్‌శెట్టి హత్య తరువాత నివురుగప్పిన నిప్పులా మారింది. ప్రజల్లో భయం నెలకొంది. ఇంతలో మరో హిందూ కార్యకర్త భరత్ కుమ్దేల్ను సోమవారం రాత్రి 9–30కి హత్య చేస్తామని కొందరు గుర్తుతెలియని దుండగులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు సోమవారం రాత్రి నుంచి అన్ని వ్యాపార, వ్యవహారాలను రోజూ రాత్రి 9:30కి బంద్ చేయాలని ఆదేశించారు. రేవు సిటీలో పరిస్థితులు చక్కబడే వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ హస్తం సుహాస్‌శెట్టి హత్యలో రోజూ కొత్త సంగతులు బయటపడుతున్నాయి. రషీద్ అనే హెడ్‌కానిస్టేబుల్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుహాస్‌శెట్టి బజ్పేలో ఇంట్లో ఉండగా రషీద్ కావాలనే ఠాణాకు పిలిపించి వేధించేవాడని ఆరోపణలున్నాయి. వాహనంలో ఎలాంటి ఆయుధాలు ఉండరాదు, నీ జతలో స్నేహితులు ఉండరాదని హెచ్చరించాడని సుహాస్‌శెట్టి తల్లి ఆరోపించారు. -
ఓయో రూమ్‌కు తీసుకువెళ్లి.. రహస్య వీడియోలు
సాక్షి,హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళను వేధిస్తున్న యువకుడికి నగర షీ–టీమ్స్ బృందాలు చెక్ చెప్పాయి. ఇతడితో పాటు మరికొందరు పోకిరీలు, నిరాధార ఫిర్యాదులు చేస్తున్న యువతిని పట్టుకున్నట్లు డీసీపీ డాక్టర్ ఎన్జేపీ లావణ్య మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ యువకుడు (30) ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళతో కొన్నాళ్లు స్నేహం చేశాడు. ఆపై ఇరువురూ కలిసి ఓయో రూమ్‌కు వెళ్లగా... సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను రహస్య కెమెరాతో రికార్డు చేశాడు. ఆపై వాటిని బయటపెడతానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. అలా కాకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు చేయాలంటూ మూడు ఆప్షన్లు ఇచ్చాడు. తాను కోరినప్పుడల్లా రావాలని, తనతో సన్నిహితంగా ఉండటానికి మరికొందరు మహిళలను ఏర్పాటు చేయాలని, రూ.లక్ష ఇవ్వాలని చెప్పిన యువకుడు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరారు. ఎట్టకేలకు «ధైర్యం చేసిన ఆ మహిళ షీ–టీమ్స్‌ను ఆశ్రయిస్తూ తనకు ఉన్న నాలుగో ఆప్షన్ చూపింది. నిందితుడిని పట్టుకున్న బృందాలు అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి అతగాడికి మూడు రోజుల సాధారణ జైలుశిక్ష విధించారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తన సహోద్యోగులతో కలిసి ఓ వేడుక చేసుకున్నారు. దీన్ని వారికి తెలియకుండా పక్క ఇంట్లో ఉండే ప్లంబర్ (34) రికార్డు చేశాడు. మర్నాడు ఆ వీడియోలు చూపిస్తూ మహిళలను బెదిరించడం మొదలెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని లేదంటే ఆ వీడియోలు ఆన్లైన్లో పెడతానని వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడిని నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నివసించే యువతి ఇటీవల ప్రజావాణిలో ఓ ఫిర్యాదు చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తనపై లైంగికదాడి చేశారని అందులో పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి ఈ ఫిర్యాదు షీ–టీమ్స్‌కు రాగా.. అధికారులు బాధితురాలిని సంప్రదించి గోపాలపురం ఠాణాకు తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె చేస్తున్న దందా వెలుగులోకి వచి్చంది. పోలీసులనే టార్గెట్‌గా చేసుకుంటున్న ఈ యువతి వివిధ కారణాలు చెప్తూ వారి ఫోన్లు తీసుకుంటుంది. వాటి ద్వారా అశ్లీల చిత్రాలను తన నెంబర్‌కు ఫార్వర్డ్ చేసుకుంటుంది. వీటిని చూపిస్తూ ఆ పోలీసులనే బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదు చేసిన ఆరోపణలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే జీహెచ్ఎంసీ వాహనం డ్రైవర్ ఓ మహిళను వేధించారు. చెత్త వెయ్యడానికి వచ్చే ఆమెను చూస్తూ అభ్యంతరకర, అశ్లీల పనులు చేసేవాడు. దీనిపై బాధితురాలు షీ–టీమ్స్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా డెకాయ్ ఆపరేషన్ చేసిన అధికారులు సదరు డ్రైవర్‌ను పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ∙ బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఆపై బెదిరింపులకు దిగుతున్న ముగ్గురిని పట్టుకున్న షీ–టీమ్స్ వారిపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయించాయి. ఛత్రినాక, జూబ్లీహిల్స్, మాదన్నపేటలకు చెందిన యువకులు బాలికల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నారు. ఆపై డబ్బు కోసమో, తనతో సన్నిహితంగా ఉండాలనో బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న షీ–టీమ్స్ నిందితులపై సంబంధిత ఠాణాల్లో పోక్సో కేసులు నమోదు చేయించాయి. మరోపక్క బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల్ని వేధిస్తున్న 49 మంది పోకిరీలను షీ–టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. -
కన్నీటి నిశ్చితార్థం
నిశ్చితార్థం చేసుకుని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి మార్చురీలో శాశ్వత విశ్రాంతి తీసుకుంటోంది. కుమార్తె పెళ్లి గురించి కోటి కలలు కన్న తల్లిదండ్రులదీ అదే దుస్థితి. నిశ్చితార్థం గోరింటాకు ఇంకా ఆరలేదు, అప్పుడే మృత్యువు పంజా విసిరింది. సాగరలో వేడుకను పూర్తి చేసుకుని బాగల్‌కోట జిల్లాలో తమ ఇంటికి వెళ్తుండగా, దారిలోనే ప్రయాణం ముగిసింది. కారు లారీని ఢీకొనడంతో కుటుంబం కడతేరిపోయింది.హుబ్లీ/ శివమొగ్గ(కర్ణాటక): వారంతా ఒకే కుటుంబ సభ్యులు. కూతురికి నిశ్చితార్థం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విధి చిన్నచూపు చూసింది. లారీ– కారు ఢీకొన్న ఘటనలో కాబోయే పెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, బంధువుల అమ్మాయి దుర్మరణం చెందారు. మంగళవారం ఉదయం హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి క్రాస్‌లో జాతీయ రహదారిలో ఈ ఘోరం జరిగింది. వివరాలు... ఈ ప్రమాదంలో విఠల శెట్టి (55), భార్య శశికళ (40), కుమార్తె శ్వేతా శెట్టి (29), కుమారుడు సందీప్ (26), అన్న కుమార్తె అయిన అంజలి (26) దుర్మరణం చెందారు. వీరి స్వస్థలం శివమొగ్గ జిల్లా సాగర వద్ద మూరుకై అనే గ్రామం. బాగల్‌కోటెలోని కులగేరి క్రాస్‌లో హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. సోమవారం శివమొగ్గ జిల్లా సాగరలో శ్వేతకు కుందాపుర యువకునితో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. త్వరలోనే పెళ్లి పెట్టుకుందామని తీర్మానించుకున్నారు. అలాగే సాగరలోనే కొత్తగా కట్టిన ఇంటిలో గృహ ప్రవేశం చేశారు. 8:30 సమయంలో.. రెండు వేడుకలను ముగించుకుని మంగళవారం తెల్లవారుజాము 4 గంటలప్పుడు సంతోషంగా సాగర నుంచి కారులో బయలు దేరారు. సుమారు 8:30 సమయంలో ఘటనాస్థలిలో కారు, అహ్మదాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్తున్న లోడ్ లారీ–వేగంగా ఢీకొన్నాయి. సందీప్ కారును నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ధాటికి కారులోని ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలి రక్తసిక్తమైంది. ప్రజలు హుబ్లీ గ్రామీణ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. లారీలో చిక్కుకున్న కారు కారు లారీ లోపలికి దూసుకుపోవడంతో బయటకు తీయడం కష్టసాధ్యమైంది. కారు మొత్తం తుక్కయింది. కష్టమ్మీద మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పెద్దసంఖ్యలో బంధువులు చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనాస్థలిని ఎస్పీ బ్యాకోడ పరిశీలించారు. లారీ డ్రైవర్ మాట్లాడుతూ కారు అతివేగంగా వచ్చి తన లారీని ఢీకొట్టిందని చెప్పాడు. -
బంగ్లాదేశ్ నుంచి నగరానికి వచ్చిన యువతి..
బంజారాహిల్స్: ట్రావెల్ ఏజెంట్ సహకారంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి వ్యభిచారం చేసేందుకు అర్ధరాత్రి ఆ దేశ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. మొదట పశ్చిమ బెంగాల్ చేరుకున్న ఆమె అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి, చివరకు హైదరాబాద్‌కు చేరుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు వ్యభిచార గృహంపై చేసిన దాడిలో పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే..బంగ్లాదేశ్, మాణిక్‌గోంజ్ జిల్లాకు చెందిన యువతి (23) 2024లో రకీబ్ అనే ట్రావెల్ ఏజెంట్ సహాయంతో అర్ధరాత్రి దేశ సరిహద్దు దాటి పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించింది. కొంతకాలం పాటు అతను ఆమెకు ఆ రాష్ట్రంలోనే ఆశ్రయం కల్పించాడు. ఆమెకు సిమ్‌కార్డు సైతం సమకూర్చి బెంగళూరుకు తీసుకెళ్లి అక్కడ మూజమ్ అనే వ్యక్తికి అప్పగించాడు. నెల రోజుల పాటు గదిలో ఉంచిన మూజమ్ ఆమెతో వ్యభిచారం చేయించాడు. ఆ తర్వాత ఆమె బెంగళూరులోని కోరమంగళకు పారిపోయి, బంగ్లాదేశ్‌కు చెందిన మిస్తి అనే స్నేహితుడిని కలుసుకుంది. అతని వద్ద రెండు నెలల పాటు తలదాచుకుంది. మిస్తి ఆమెను అఖిల్ అనే వ్యక్తికి అప్పగించగా, వ్యభిచారం చేస్తే ఎక్కువ జీతం ఇస్తానని అఖిల్ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో అఖిల్ సూచన మేరకు గత నెల 21న బస్సులో హైదరాబాద్ చేరుకున్న ఆమె అతని ఇంట్లో 10 రోజులు ఉంది. ఆ తర్వాత సదరు యువతి మరిన్ని డబ్బులు సంపాదించేందుకు నాయక్ అనే వ్యక్తిని ఫోన్లో సంప్రదించింది. నాయక్ ఆమెను గత నెల 30న జూబ్లీహిల్స్‌లోని మింట్ లీవ్స్ సరీ్వస్‌డ్ అపార్ట్మెంట్ రూం నెంబర్–112లో దించేందుకు క్యాబ్ ఏర్పాటు చేశాడు. కస్టమర్లను సంప్రదించి గదికి పంపుతానని నాయక్ ఆమెకు చెప్పాడు. అయితే వ్యభిచార దందాపై పోలీసులకు సమాచారం అందడంతో సదరు అపార్ట్మెంట్లోని గదిపై సోమవారం దాడులు నిర్వహించిన పోలీసులు బంగ్లాదేశ్ యువతితో పాటు కస్టమర్లను అరెస్టు చేశారు. యువతిని పునరావాస కేంద్రానికి తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య వివాహేతర సంబంధం.. పిల్లలకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య
కొండాపూర్ (సంగారెడ్డి): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అవమానంగా భావించిన భర్త, తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, అనంతరం తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచి్చన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, ఇద్దరు పిల్లలతోపాటు తండ్రి విగతజీవిగా కనిపించాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటేశ్ కథనం ప్రకారం... కొండాపూర్ మండలం గారకుర్తికి చెందిన సుభాష్.. భార్య మంజుల, కుమారుడు మరియన్ (13), కూతురు ఆరాధ్య (9)తో కలిసి మల్కాపూర్‌లోని సా యినగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సుభాష్ సదాశివపేట మండలం ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా భార్య మంజుల ప్రవర్తనలో మార్పు రావడంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంజుల 5 రోజుల కిందట ఎవరికీ చెప్ప కుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని భావించిన సుభాష్ అవమానభారం భరించలేకపోయాడని, దీంతో పిల్లకు ఉరి వేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు. సుమారు 5 రోజుల కిందటే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఘటనా స్థలం వద్ద 4 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు. -
వీడియో కాల్ ద్వారా గర్భిణికి వైద్యం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఏడేళ్ల నిరీక్షణ తర్వాత గర్భం దాల్చిన ఓ ఇల్లాలి మాతృత్వపు కలను వైద్య నిర్లక్ష్యం విచ్ఛిన్నం చేసింది. గర్భస్థ పిండాల (మగ కవలలు) మృతికి కారణమై కాబోయే తల్లికి అంతులేని వేదనను మిగిల్చింది. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన గర్భిణికి వాట్సాప్ వీడియో కాల్లో ఓ డాక్టర్ చేపట్టిన వైద్యం వికటించి ఐదు నెలల గర్భస్థ పిండాలు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. వైద్య నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో స్పందించిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆస్పత్రిని సీజ్ చేశారు. పెళ్లయిన ఏడేళ్లకు ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తికి చెందిన కీర్తికి ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడుకు చెందిన బుట్టి గణేశ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటివరకు పిల్లలు పుట్టకపోవడంతో చంపాపేటలోని ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించారు. అక్కడి చికిత్సలతో చివరకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పద్ధతిలో ఐదు నెలల క్రితం కీర్తి గర్భం దాల్చింది. తొలి మూడు నెలలు చంపాపేట ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకున్న ఆమె తరచూ అక్కడకు వచ్చి వెళ్లడం ఇబ్బందిగా మారడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ అనూషరెడ్డిని సంప్రదించారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన మహిళా డాక్టర్... కీర్తి గర్భసంచి వదులుగా ఉన్నట్లు గుర్తించి ఏప్రిల్ 6న కుట్లు వేసింది. అయితే అప్పటి నుంచే బాధితురాలికి రక్తస్రావం మొదలైంది. తరచూ ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు మందులు తీసుకొని ఇంటికి వెళ్తోంది. ఇంటి నుంచే చికిత్స అందించడంతో.. ఆదివారం తెల్లవారుజామున కీర్తి రక్తస్రావంతోపాటు భరించలేని నొప్పులతో బాధపడుతుండటంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఉదయం 5:45 గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్ అనూషరెడ్డి లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెకు సమాచారం అందించారు. అయినా వైద్యురాలు ఆస్పత్రికి రాకుండా ఇంటి నుంచే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా స్టాఫ్‌నర్సు, ఆయాలతో చికిత్స ప్రారంభించింది. స్టాఫ్ నర్సు, ఆయాలకు అనుభవం లేకపోవడం, అప్పటికే పరిస్థితి విషమించడంతో గర్భ సంచి సహా గర్భంలోని కవల పిండాలు బయటకొచ్చేశాయి. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందంటూ బాధితురాలి బంధువులు సోమవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలియగానే పోలీసులు, జిల్లా వైద్యాధికారులు ఆస్పత్రికి చేరుకొని సీజ్ చేశారు. ఆస్పత్రిలోని ముగ్గురు బాలింతలను వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వదిలేశారు.నిర్లక్ష్యం లేదన్న ఆస్పత్రి.. అధిక రక్త స్రావంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన తల్లి ప్రాణాలను కాపాడేందుకు అప్పటికే గర్భంలో మృతి చెందిన కవల పిండాలను అబార్షన్ ద్వారా తొలగించాల్సి వచి్చందని.. ఇందులో ఎలాంటి వైద్య నిర్లక్ష్యం లేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మానవతా దృక్పథంతో చికిత్స అందించామని.. ఆస్పత్రి బిల్లు చెల్లించడం ఇష్టంలేకే కుటుంబ సభ్యులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆ వర్గాలు పేర్కొనడం గమనార్హం. -
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
కటిహార్: బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రాక్టర్ ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.బాధితులంతా సుపౌల్‌కు చెందినవారని, వివాహ వేడుకకు హాజరై తిరిగి సొంతూరుకు వస్తుండగా ప్రమాదం జరిగిందని కటిహార్ ఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని వెల్లడించారు. -
నీట్ పరీక్ష రాసింది.. ఇంటికొచ్చి ప్రాణం తీసుకుంది!
జగిత్యాల జిల్లా : జిల్లాలోని చల్ గల్ గ్రామానికి చెందిన జంగా పూజ(18) అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నీట్ పరీక్ష రాసిన ఆమె.. పేపర్ ను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల క్రితం రాసిన నీట్ పరీక్షలో ర్యాంకు రాకపోవడంతో రెండోసారి తాజాగా నీట్ పరీక్ష రాసింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ ను క్రాస్ చెక్ చేసుకుని ర్యాంకు రాదనే ఆందోళనలో పడింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుంది.కాగా, జగిత్యాల జిల్లాలోని రెండు కేంద్రాల్లో నిర్వహించిన నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నాచుపల్లి జేఎన్టీయూ కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. అక్కడి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఒక సెంటర్లో 480, రెండో సెంటర్లో 278 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఒక కేంద్రంలో 13 మంది, మరో కేంద్రంలో ఐదుగురు గైర్హాజరైనట్లు వివరించారుమూడు నిమిషాల ఆలస్యం.. పరీక్షకు దూరంమల్యాల: జేఎన్టీయూ పరీక్ష కేంద్రం తెలియక మూడు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న ఓ విద్యార్థిని పరీక్ష దూరమైంది. మల్లాపూర్ మండలం వీవీ.రావుపేటకు చెందిన సీహెచ్.నవ్యకు జేఎన్టీయూ కేంద్రం పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరింది. ఇంజినీరింగ్ కళాశాల అడ్రస్‌పై అవగాహన లేక దిగువ కొండగట్టు వరకు వెళ్లారు. పూర్తి అడ్రస్ తెలుసుకుని వెళ్లే సరికి మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో అక్కడున్న సిబ్బంది లోపలికి అనుమతించలేదు. గతంలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నా.. ఆశించిన ఫలితం రాలేదని, మరోసారి పరీక్షకు సన్నద్ధమైన రాయలేకపోయాయని ఆవేదనతో తిరిగి వెళ్లిపోయింది.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
తప్పతాగి, ఎయిర్‌హోస్టెస్‌కు వేధింపులు : తిక్క కుదిర్చిన ఎయిర్‌లైన్స్
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన తాజాగా వెలుగులోకి చ్చింది.ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో విమాన సిబ్బందిలో భాగమైన ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడు. ఆమెను అనుచితంగా తాకి లైంగికంగా వేధించాడు. చివరికి ఏమైందంటే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 2న ఢిల్లీ నుంచి షిర్డీ వెళ్లే 6E 6404 ఇండిగో విమానంలో మద్యం తాగిన వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.విమానంలోని టాయిలెట్ దగ్గర ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్‌ను అనుచితంగా తాకినట్లు పోలీసు అధికారి తెలిపారు. అసభ్యకరమైన ప్రవర్తనతో విసిగిపోయిన ఎయిర్ హోస్టెస్ తన మేనేజర్‌కు సమాచారం అందించింది. దీంతో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వారు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారని, ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.రహతా పోలీస్ స్టేషన్లో అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వైద్య పరీక్షలో అతను మద్యం సేవించినట్లుగా కూడా నిర్ధారణ అయింది. దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందింస్తూ.. ‘‘అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని" అందించడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నామని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
తల్లి తప్పుదోవ.. తండ్రి రాసిన మరణ శాసనం
సంగారెడ్డి, సాక్షి: కొండాపూర్ మండలం మల్కపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందనే మనస్థాపంతో సుభాష్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. తాను బలవన్మరణానికి పాల్పడ్డారని తొలుత అంతా భావించారు. అయితే ఆమె వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమైందని తేలింది ఇప్పుడు.సుభాష్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసం ఉండేవాడు. అతని భార్య మంజుల మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో భర్త ఎంత మంచి చెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ మధ్య ఓరోజు గొడవ ముదిరి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన సుభాష్.. తన ఇద్దరు పిల్లలు మారిన్ (13), ఆరాధ్య (10) ఉరివేసి చంపి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘డబ్బు ఆశ చూపించి నా భార్యను వాడుకున్నారు. ఎంత మంచి చెప్పినా ఆమెలో మార్పు రాలేదు. అందుకే ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాం..’’ అంటూ సుభాష్ రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి..
కీసర(హైదరాబాద్): కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. దైవ దర్శనం చేసుకుని వెళ్లి వస్తుండగా మృత్యువు కబళించింది. కీసరలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కీసర ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా మేడిపల్లికి చెందిన యశ్వంత్ (25), పీర్జాదిగూడకు చెందిన చార్లెస్ (25), ఎల్బీనగర్కు చెందిన చెన్నకేశవ గౌడ్ (23), వివేక్, సురేష, యశ్వంత్ నాయక్ శనివారం ఉదయం కారులో కర్ణాటక బీదర్‌లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లారు. అనంతరం ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. యశ్వంత్ కారు నడుపుతుండగా, చార్లెస్ ముందు సీట్లో కూర్చున్నాడు. మిగతవారు వెనక సీటులో ఉన్నారు. ఉదయం 11:15 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కీసర ఎగ్జిట్ దాటిన తర్వాత ముందున్న గ్యాస్ కంటెయినర్ లారీని కారు ఢీకొట్టి, డివైడర్‌కు తగిలింది. ఈ ఘటనలో యశ్వంత్‌తో పాటు చార్లెస్ అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నకేశవ గౌడ్ తీవ్రంగా గాయపడటంతో వైద్యం కోసం ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్లో చేర్పించారు. మిగతా ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిని చికిత్స కోసం ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో చేర్చించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విశాఖలో విషాదం.. స్కూటీపై వెళుతున్న మహిళ స్పాట్లో మృతి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో భారీ వర్షాల కారణంగా విశాఖలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు విరిగి పడిపోవడంతో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. విశాఖలోని సీతమ్మధారలో విషాదం నెలకొంది. సితార అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పూర్ణిమ (38) ఈరోజు ఉదయం తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తోంది. ఈ సందర్భంగా ఆమెపై చెట్టు విరిగి పడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో కారు, బైక్ సహా ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. ఇక, సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
పాముకాటుకు వివాహిత మృతి
కడెం(మంచిర్యాల): పాముకాటుకు గురై వివాహిత మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దూర్‌కు చెందిన నేరెళ్ల రజిత (35), దాసు భార్యభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. అద్దె ఇంటి డబ్బుల భారంతో గత కొన్నినెలలుగా పెద్దూర్ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటి పరిసరాల్లో రజిత తోటకూర తెంపుతుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు ఆమెను కడెంలో ప్రథమ చికిత్స చేయించి, నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్దమృతదేహం వద్ద రోదిస్తున్న కూతురు కూతుళ్ల రోదన అందరిని కంటతడి పెట్టించింది. పెద్ద కూతురు వివాహం నిశ్చయం కాగా, అంతలోనే తల్లి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయ లు అలముకున్నాయి. భర్త ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. -
ప్రియురాలి చేతిలో ట్రావెల్ ఏజెంట్ హత్య
అన్నానగర్(తమిళనాడు): మద్యం, మాంసంలో నిద్రమాత్రలు కలిపి దుబాయ్ ట్రావెల్స్ సీఈఓను హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుక్కుడి కి చెందిన త్యాగరాజన్(69) ఇతను కోయంబత్తూరు వచ్చి ఖతీమా నగర్లో నివశించే సమయంలో గోమతి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. గోమతికి నీల, శారద అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో శారదతో గొడవపడిన ఆమె భర్త గుణవేల్ను హత్య చేసి త్యాగరాజన్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై వచ్చాడు. ఈ క్రమంలో శారద పని నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఆ సమయంలో తిరువారూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ సిగమణి(47)తో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. శారదకు, సిగమణికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమస్య వచ్చింది. దీంతో శారద కోవైకి తిరిగి వచ్చింది. శారదను శాంతింపజేసేందుకు సిగమణి 21న కోయంబత్తూరుకు వచ్చాడు. అతనిని శారద తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో త్యాగరాజన్ నెల్లైకి చెందిన ప్రముఖ రౌడీ పశుపతిపాండియన్ సహచరుడు పుదియవన్ కోయంబత్తూరుకు ఆహ్వానించారు. ఆ తర్వాత 22వ తేదీ రాత్రి మద్యం, మాంసంలో 30కి పైగా నిద్ర, నొప్పి నివారణ మాత్రలు కలిపి సిగమణిని హత్య చేశారు. అనంతరం సిగమణి మృతదేహాన్ని త్యాగరాజన్, శారద, పుదియవన్ కారులో తీసుకెళ్లి కరూర్ పొన్నమరావతి పక్కన పడేసి, పారిపోయారు. మిగిలిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దీనిపై సిగమణి భార్య ప్రియా(69) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు బీలమేడు పోలీసులు విచారణ చేపట్టారు. త్యాగరాజన్(69), ఇతని వివాహేతర ప్రియురాలు గోమతి (53), ఆమె కూతుళ్లు నీల (33), శారద (35), కోడలు స్వాతి (26), పుదియవన్(48) సిగమణిని హత్య చేసినట్లు తేలింది. ఆదివారం శారదతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. -
నా చావుకు భార్య కుటుంబమే కారణం
అన్నానగర్(తమిళనాడు): తన చావుకు భార్య కుటుంబమే కారణం అని ప్రైవేట్ ఫారెస్ట్ ఉద్యోగి స్నేహితుడికి వీడియో పంపించి కోట్టూరుపురం వంతెన పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. చెన్నైలోని కేకే నగర్ కామరాజర్ రోడ్డులో నివాసం ఉంటున్న అజిత్ (32) పెరుంగుడిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఇతనికి భార్య ఆర్తి (29), రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఆర్తి పల్లావరంలో సెంట్రల్ కార్యాలయంలో సెక్యూరిటీగా పనిచేస్తోంది. అజిత్‌కు అతని భార్యకు మధ్య తరచూ గొడవలు జరిగేవన్నారు. దీంతో అజిత్ భార్య ఆర్తి కుటుంబం కఠినంగా మాట్లాడిందని తెలుస్తుంది. దీంతో మనస్తాపంతో ఉంటు వచ్చాడు. గత 28వ తేదీన అజిత్, ఆయన భార్య మధ్య మరో వివాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత అజిత్ కోట్టూరుపురం వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు యతి్నంచాడు. స్థానికులు తీవ్రంగా గాయపడిన అజిత్‌ను రాయపేట ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కోట్టూరుపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. ‘తన ఆత్మహత్యకు నా భార్య బంధువులే కారణం’ అంటూ అజిత్ తన స్నేహితుల్లో ఒకరికి వీడియో పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఆత్మహత్యకు సంబంధించి అజిత్ భార్య కుటుంబాన్ని విచారిస్తున్నారు. -
భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..!
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్‌లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నంచాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్‌పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. -
ఇదేం ప్రేమరా బాబు.. భార్య అందాన్ని తట్టుకోలేక భర్త పిచ్చి పని..
ఎవరైనా భర్త.. తన భార్య అందంగా ఉండాలని అనుకుంటాడు. అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఇక్కడో భర్త.. తన భార్య అందంగా ఉందన్న కారణంగా ఆమె ముక్కును కొరుక్కుని తిన్నాడు. ఈ వింత దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనతో ఆ భార్య భయపడిపోయింది. బాధతో గట్టిగా కేకలు వేసింది.వివరాల ప్రకారం.. నదియా జిల్లాలోని శాంతీపుర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్, మధు ఖాతూన్ అనే దంపతులు నివసిస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఎనిమిదేళ్ల కూతురు కూడా ఉంది. ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున అర్ధరాత్రి మూడు గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. తన భార్య మధు ఖాతూన్ ముక్కును భర్త కొరికి నమిలేశాడు. దీంతో బాధను తట్టుకోలేక మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేసింది. బయటకు పరుగులు తీసింది. అయితే ఆమె వెంటబడిన భర్త.. వేలును కూడా కొరికే ప్రయ్నతం చేశాడు. ఈ క్రమంలో ముక్కూ, వేలికి తీవ్రగాయాలయ్యాయి.అనంతరం, భర్త నిర్వాకంపై మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి రేష్మా బేగంతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మధు ఖాతూన్ భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అనేవాడు. చివరకు అన్నంత పనీ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు తాను అందంగా ఉండటంతో ముఖంపై యాసిడ్ పోస్తానని తాగిన మత్తులో తన భర్త బెదిరించేవాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది. దీంతో, అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాపన్ షేక్‌ను అరెస్టు చేసి కోర్టులో పరిచారు. ఇక, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క..!
వెంగళరావునగర్(హైదరాబాద్): తాను పెంచుకుంటున్న శునకమే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన డి.పవన్‌కుమార్ (37) తన స్నేహితుడు సందీప్‌తో కలిసి పదేళ్లుగా మధురానగర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గదిలో నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్క కూడా ఉంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారితో తలుపు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా పవన్ విగతజీవిగా కనిపించాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. కుక్క అతడి మర్మాంగాలను గాయపర్చడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పవన్‌కుమార్‌కు గతంలో వివాహమైంది. భార్యతో విడాకులు కావడంతో నగరంలో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధ దంపతుల దారుణ హత్య
అల్వాల్(హైదరాబాద్): వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు, ఇంట్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లిన సంఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూర్యనగర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, మాణిక్యారం గ్రామానికి చెందిన కనకయ్య (70), రాజమ్మ (65) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావడంతో బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఊరిలో వ్యవసాయం చేసుకునే కనకయ్య, రాజమ్మ వయసు మీద పడడంతో పిల్లల వద్ద ఉందామనే ఆలోచనతో మూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. కనకయ్య అల్వాల్, సూర్యనగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. కొన్నాళ్ల క్రితం అతను అనారోగ్యానికి గురి కావడంతో ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమీపంలో ఉంటున్న కూతురు లత ఇంటికి వెళ్లి సామన్లు సర్దుకునేందుకు అవసరమైన సంచులు కూడా తెచ్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వారి కుమార్తె లత ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో మంచంపై విగతజీవులై పడి ఉన్నారు. ఇద్దరి తలలపై గాయాలు ఉన్నాయి. సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లత కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాగిలాలను రప్పించి పరిసరాల్లో తనిఖీలు చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంట్లో చొరబడి దొంగతనాలు పాల్పడి ఉంటారని, ఈ క్రమంలోనే వారిపై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, వెండి పట్టీలు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కనకయ్య తమ వద్ద ఉన్న నగదు అవసరమైన వారికి వడ్డీకి ఇచ్చే వాడని తాను ఊరికి వెళ్లి రూ. లక్ష తీసుకువచ్చానని, అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తానని చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ డీసీపీ సుధీర్ కుమార్, ఏసీపీ రాములు, సీఐ రాహుల్‌దేవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
విమాన టికెట్‌కు డబ్బుల్లేక.. వ్యభిచార కూపంలోకి..
బంజారాహిల్స్(హైదరాబాద్): స్నేహితుడిని నమ్ముకుని భారత్‌కు వచ్చిన థాయ్‌లాండ్ యువతి మోసానికి గురైంది. తిరిగి తన స్వదేశం వెళ్లేందుకు విమాన టికెట్‌కు డబ్బులు లేక వ్యభిచారంలోకి దిగి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. థాయ్‌లాండ్‌కు చెందిన యువతి (30)కి, చెన్నైకి చెందిన యువకుడికి ఇన్‌స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అతడు రమ్మనడంతో గత మార్చిలో యువతి చెన్నైకి వచ్చేసింది. ఆమెను చెన్నైలోని ఓ హోటల్లో ఉంచి అతడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో యువతి హోటల్ బిల్లు చెల్లించలేక.. థాయలాండ్ వెళ్లలేక ఇబ్బందుల పాలయ్యింది. థాయ్‌లాండ్‌కు చెందిన స్నేహితురాలిని సంప్రదించింది. థాయ్‌లాండ్ నుంచి పలువురు మహిళలను వ్యభిచార వృత్తి కోసం భారత్‌కు పంపించే ఓ స్నేహితురాలు నగరంలోని యువతితో మాట్లాడించడంతో గత నెల 30న బాధితురాలు నగరానికి చేరుకుంది. శ్రీనగర్ కాలనీలో ఓ ప్లాట్‌లో మరో యువతితో కలిసి వ్యభిచారానికి పాల్పడింది. విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు చేయగా బాధిత యువతి పట్టుబడింది. తనను బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడని, హోటల్ బిల్లు చెల్లించేందుకు, తిరిగి స్వదేశం వెళ్లిపోవడానికి విమాన చార్జీల కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే వ్యభిచార వృత్తిలోకి దిగినట్లు ఆమె తెలిపింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి ఆదివారం పునరావాస కేంద్రానికి తరలించారు. -
వివాహిత ఆత్మహత్య
జీడిమెట్ల(హైదరాబాద్): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ అపార్ట్మెంట్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మి(25)కి గత డిసెంబర్లో హరికృష్ణతో వివాహం జరిగింది. భార్యాభర్తలు సుభా‹Ùనగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. హరికృష్ణ ఓ ప్రైవేట్ పరిశ్రమలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం లక్ష్మి తాము ఉంటున్న అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి కిందకు దూకింది. దీనిని గుర్తించిన అపార్ట్మెంట్ వాసులు అక్కడకు వెళ్లి చూడగా తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. కాగా లక్షి్మకి పెళ్లి ఇష్టం లేని కారణంగానే అత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని సమాచారం. మృతురాలి తల్లిదండ్రుల వచి్చన తర్వాత వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
బాలుడిపై లైంగిక దాడి కేసులో యువతి రిమాండ్
బంజారాహిల్స్(హైదరాబాద్): ఆ బాలుడికి 16 ఏళ్లు. అతడి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌లోని ఓ బడా పారిశ్రామికవేత్త ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. సదరు బాలుడు పదో తరగతి పరీక్షల కోసం గత జనవరిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అదే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మరో యువతి (28) వారు ఉంటున్న క్వార్టర్ పక్కనే మరో క్వార్టర్లో ఉంటోంది. ఆ బాలుడితో పరిచయం పెంచుకున్న ఆమె తరచూ అతడిని తన క్వార్టర్లోకి పిలిపించుకుని అతడిపై లైంగిక దాడికి పాల్పడేది. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల్లి మీద దొంగతనం కేసు పెట్టించి ఉద్యోగం నుంచి తీసివేయిస్తానని బాలుడిని బెదిరించేది. తన తల్లి ఉద్యోగం పోతుందనే భయంతోనే అతను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఐదు రోజుల క్రితం సదరు యువతి గదిలో తన కుమారుడు ఉండడాన్ని గుర్తించిన అతడి తల్లి అక్కడికి వెళ్లి చూడగా సదరు యువతి తన కొడుకును బలవంతంగా ముద్దు పెట్టుకుంటుండగా చూసింది.ఈ విషయమై తన కుమారుడిని నిలదీయగా అతను తల్లికి పూర్తి వివరాలు చెప్పాడు. దీంతో బాధితుడి తల్లి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
బెట్టింగ్‌కు బానిసై..
బలిరామగిరి(మంథని): ఆన్లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఆదివారం జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ చంద్రకుమార్ కథనం ప్రకారం.. సెంటినరీ కాలనీ టీ2– 185 క్వార్టర్లో నివసిస్తున్న వేముల విజయ, రవిశంకర్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయ గృహిణి కాగా, రవిశంకర్ ఓసీపీ–2 షావెల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరి పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. చిన్న కుమారుడు వేముల వసంత్ కుమార్ (27) ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–2 పరిధిలోని సీ–5 కంపెనీలో వోల్వో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్ యాప్‌లో నష్టాలు రావడంతో.. ఇకనుంచి వాటి జోలికి వెళ్లవద్దని గతేడాది డిసెంబర్లో తండ్రి రవిశంకర్ మందలించాడు. రూ. 4 లక్షల వరకు అప్పు తీర్చాడు. కానీ మళ్లీ ఆన్లైన్ బెట్టింగ్‌లకు పాల్పడిన వసంత్ కుమార్.. నష్టాలు రావడంతో ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేకుల పైప్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.బంధువుల ఇంట్లో ఒకరు మృతి చెందడంతో.. వారిని పరామర్శించేందుకు వెళ్లి వచ్చిన దంపతులు.. కుమారుడి ఆత్మహత్యతో నిశ్చేష్టులయ్యారు. వెంటనే తేరుకుని సమీప డిస్పెన్సరీకి తరలించగా అప్పటికే వసంత్ కుమార్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రకుమార్ వివరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం
సనత్‌నగర్ (హైదరాబాద్): సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బీఐ బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ భవనం నాలుగో అంతస్తులో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపకశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కొన్నిసార్లు ఆదివారం కూడా కొందరు సిబ్బంది కార్యాలయానికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ఇద్దరు ఉద్యోగులు నాలుగో అంతస్తులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు అగ్ని ప్రమాదం జరగక మునుపే బయటకు వెళ్లిపోగా, మరొకరు అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించడంతో భయంతో బయటకు వచ్చేసినట్లు సమాచారం.ఎగసిన మంటలతో భయాందోళనప్యాట్నీ సెంటర్ ప్రధాన రహదారిలో నగరానికి సంబంధించి ఎస్బీఐ అడ్మి నిస్ట్రేషన్ కార్యకలాపాలు ఇక్కడి నాలుగు అంతస్తుల భవనంలో కొనసాగు తాయి. నాలుగో అంతస్తులో లోన్ల విభాగం ఉంది. ఆ విభాగంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో.. స్థానికులతో అటు ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్షణాల్లో అగ్నికీలలు అంతస్తు మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటల తీవ్రత అధికంగా ఉండడంతో.. మల్కాజిగిరి, మౌలాలి ప్రాంతాల నుంచి మరో రెండు అగ్నిమాపక శకటాలను రప్పించారు. కాగా, ప్రమాదం జరిగింది నాలుగో అంతస్తులో కావడంతో.. భారీ క్రేన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో కీలక ఫైళ్లు, పెద్ద ఎత్తున ఫర్నిచర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉండే ఈ కార్యాలయంలో.. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ప్రాణనష్టమే తప్పింది. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమై ఉండవచ్చని సికింద్రాబాద్ ఫైర్ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. -
అద్దెకు ఇల్లు పేరుతో.. మేనత్త సొమ్ముకు మేన కోడలి పథకం
హైదరాబాద్: వారాసిగూడ చోరీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక మహిళను కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న నగలతో పాటు సొమ్మును అపహరించుకుని వెళ్లిన ఘటనలో మేనకోడలే నిందితురాలిగా తేలింది. మేనత్త సొమ్మును కాజేయాలని మేనకోడలు జ్యోతి పథకం రచించి ఆ ఇంటికి యువకుడ్ని పంపించి చోరీకి పాల్పడేలా పురిగొల్పింది. ఈ కేసులో జ్యోతిపాటు మరో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.కాగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి యజమానురాలిని కట్టేసి నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం ది. ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పార్శిగుట్టలోని ఓ ఇంట్లోని మొదటి అంత స్తులో పారిజాతం (56) అనే మహిళ నివాసముం టోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలంటూ ఇంట్లోకి చొరబడ్డారు.తలుపులు గ యపెట్టి ఆమెను కత్తితో బెదిరించి కుర్చీలో కట్టేశాడా ఇంట్లో ఉన్న 30 గ్రాముల బంగారు నగలు, 6 మే నగదు, సెల్ ఫోన్ ను తీసుకుని పరారయ్యారు. కొ సేపటికి కట్లు విప్పుకుని బయటికి వచ్చి పారిజాతం చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది స్థానికులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఆమె వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టగా మేనకోడలే నిందితురాలు అయ్యింది. -
గుంటూరు లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాల కలకలం
గుంటూరు: లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. గుంటూరు బ్రాడీపేటలోనీ శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థునులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్‌లు చేయటం.. అబ్బాయిల్ని తీసుకొని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారని హాస్టల్ విద్యార్థునులు చెబుతున్నారు. అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.గత ఏడాది కూడా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఈ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు.తెలంగాణలోని ఈ ఏడాది మార్చి నెలలో సంగారెడ్డి జిల్లాలోని ఓ గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపింది. హాస్టల్లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హాస్టల్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. -
భర్తను సర్జికల్ బ్లేడుతో హత్య చేసిన భార్య..!
పిఠాపురం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తాళి కట్టిన భర్తను ప్రియుడితో కలసి అతి కిరాతకంగా సర్జికల్ బ్లేడుతో హత్య చేసింది ఆమె. మార్చి మూడో తేదీన గొల్లప్రోలు మండలం చేబ్రోలులో 216 జాతీయ రహదారి పక్కన లభ్యమైన వ్యక్తి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. కత్తిపూడి–కాకినాడ జాతీయర రహదారి పక్కన కల్వర్టు వద్ద పంట బోదెలో ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో పోలీసులు గుర్తించారు. చేబ్రోలు వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినప్పటికీ మృతదేహంపై గాయాలు ఉండడంతో సీఐ జి.శ్రీనివాస్ హత్య కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షణలో ఎస్డీపీఓ దేవరాజ్ మనీష్ పాటిల్ మార్గదర్శకంలో సర్కిల్ ఎస్సైలు నాలుగు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంతో పాటు, సరిహద్దు రాష్ట్రాల మిస్సింగ్ కేసుల డేటా, హైవే సీసీ కెమెరా ఫుటేజీ, టోల్ ప్లాజా, సెల్ టవర్ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 28న అనకాపల్లి జిల్లా ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసుపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. అక్కడి ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వ్యక్తి వివరాలతో ఇక్కడి లభ్యమైన మృతదేహం వివరాలు పోలి ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడు ధర్మవరం ప్రాంతానికి చెందిన తంగిళ్ల లోవరాజుగా గుర్తించారు.అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన అతని భార్య శ్యామల, భర్త బంధువు అయిన మోహన్ కుమార్‌తో వివాహేతర సంబంధం నెరపుతూ తమకు అడ్డంగా ఉన్న భర్తను తొలగించాలని భావించింది. పథకం ప్రకారం ప్రియుడు మోహన్ కుమార్, అతని స్నేహితుడు గంగాధర్, ముగ్గురూ కలిసి గత ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి లోవరాజును హత్య చేసి మృతదేహాన్ని చేబ్రోలు హైవే వద్ద పడవేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. హత్య చేయడానికి రెండు సర్జికల్ బ్లేడ్లను సిద్ధం చేసుకుని, పిల్లలు పడుకున్నాక మోహన్‌కుమార్, గంగాధర్ ఇంటిలోకి ప్రవేశించి లోవరాజుపై దాడి చేసి బ్లేడ్లతో పీకకోసి, గుండెల్లో పొడిచినట్టు పోలీసులు తెలిపారు. రాంబాబు అరవడానికి ప్రయతి్నంచగా నోట్లో గుడ్డలు కుక్కేసారని, అప్పటికీ లోవరాజు చనిపోకపోవడంతో కాలి చీలమండ కోసి రక్తం పోయేలా చేసి హత్య చేసినట్టు ఎస్పీ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కారులో తమకు పరిచయం ఉన్న ప్రాంతమైన చేబ్రోలు హైవే పక్కన పడేసి పరారయ్యారన్నారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ జి శ్రీనివాస్, ఎస్సై ఎన్.రామకృష్ణ, ఎస్ఐటీ సిబ్బందిని ఆయన ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
మాజీ మంత్రి జవహర్ ఇంట్లో చోరీ
కొవ్వూరు(తూర్పు గోదావరి): మాజీ మంత్రి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ ఇంట్లో శనివారం దొంగలు పడ్డారు. వేసవి సెలవుల నేపథ్యంలో రెండు రోజుల కిత్రం జవహర్ తన స్వగ్రామం తిరువూరు వెళ్లారు. శనివారం మొక్కలకు నీళ్లు పోయడానికి వెళ్లిన అనుచరుడు ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లో సామాన్లు చిందరవందరగా ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ జి.దేవకుమార్, సీఐ పి.విశ్వం సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ తీరును పరిశీలించారు. జవహర్ కుటుంబ సభ్యులు వస్తే తప్ప చోరీ సొత్తు వివరాలు తెలియవని వారు తెలిపారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. ఈ చోరీపై ఇంకా ఫిర్యాదు అందలేదని సీఐ తెలిపారు. జవహర్‌కు సమాచారం అందించామని, ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కొవ్వూరు వస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సీమా హైదర్ ఇంట్లోకి చొరబడి మరీ..
న్యూఢిల్లీ: పహల్గాం దాడి తర్వాత పాక్-భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల పౌరులను సొంత దేశాలకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.సరిగ్గా రెండేళ్ల కిందట.. భారతదేశంలోని ప్రియుడి కోసం భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో మరీ భారత్‌కు వచ్చేసింది సీమా హైదర్(37). అంతేకాదు.. ప్రియుడు సచిన్ మీనాను పెళ్లాడి ఓ బిడ్డను సైతం కన్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల నడుమ ఆమెను పాక్‌కు పంపించాలా? వద్దా? అనేదానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే తాను మాత్రం ఇక్కడి కోడలినేనని, తనను వెనక్కి పంపించొద్దంటూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని ఆమె వేడుకుంటోంది. ఈలోపు..ఓ వ్యక్తి సీమా హైదర్ ఇంట్లోకి చొరబడ్డాడు. వెనుక నుంచి వెళ్లి ఆమెపై దాడికి ప్రయత్నించబోయాడు. అయితే అది గమనించిన ఆమె భర్త సచిన్.. ఆ ఆగంతకుడ్ని నిలువరించగలిగాడు. స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించాడు. సదరు నిందితుడి తేజాస్‌గా పోలీసులు నిర్ధారించారు.గుజరాత్ సురేందర్ నగర్‌కు చెందిన తేజస్.. న్యూఢిల్లీకి రైలు ద్వారా వచ్చాడు. అక్కడి నుంచి బస్సులోసీమా హైదర్ ఉంటున్న గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చేరాడు. అతని ఫోన్లో సీమా హైదర్‌కు చెందిన ఫొటోల స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అతను ఏ ఉద్దేశంతో ఆ ఇంట్లోకి చొరబడ్డాడు అనేది తెలియాల్సి ఉంది అని పోలీసులు చెబుతున్నారు. అయితే సీమా హైదర్ తనపై చేతబడి చేస్తోందని.. అందుకే ఆమెను కట్టడి చేయడానికి వచ్చానని తేజస్ చెబుతున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదని పోలీసులు చెబుతున్నారు. అతని మానసిక స్థితి బాగోలేదా? కావాలనే ఇలా చేస్తున్నాడా? అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని చెబుతున్నారు. -
ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై కేసు
హైదరాబాద్, క్రైమ్: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ (Na Anvesh)పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం.ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్ చేసేస్తూ.. ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బూలు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే.. తాజాగా బెట్టింగ్ యాప్‌ల ప్రచారం పేరుతో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే అన్వేష్ అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటో(Suo moto)గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్‌క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
పిల్లలు పుట్టలేదు అని భార్యని చంపి తన ఇంట్లోనే..
జగిత్యాలక్రైం: నిండునూరేళ్లు కలిసి ఉంటామని.. ఏడడుగులు నడిచి ప్రమాణం చేసిన భర్తే కాలయముడై భార్యను హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలకేంద్రంలో జరిగింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించగా ఎట్టకేలకు పోలీసులు కేసును ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు.ఇరవై ఏళ్ల క్రితం వివాహంకరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్‌కు చెందిన మమతను (35) ఇరవై ఏళ్ల క్రితం జగి త్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన అవుదుర్తి మహేందర్‌కు ఇచ్చి వివాహం చేశా రు. వివాహ సమయంలో కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మహేందర్ మద్యానికి బానిసై అప్పులు చేశాడు. రోజూ తాగి వచ్చి మమతను వివాహ సమయంలో కట్నం తక్కువగా ఇచ్చారని, పిల్లలు పుట్టడం లేదని తీవ్రంగా వేధించాడు. అతడితోపాటు తల్లి వజ్రవ్వ, తండ్రి లక్ష్మణ్, తమ్ముళ్లు అ నిల్, వెంకటేశ్ కూడా వేధింపులకు గురిచేసేవారు. మహేందర్ ఏ పని చేయకపోవడంతో మమత కరీంనగర్‌లోని ఓషాపింగ్‌మాల్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.ఇరవై రోజుల క్రితం పంచాయితీతరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో 20 రోజుల క్రితం మల్లాపూర్‌లో పంచాయితీ నిర్వహించారు. దీంతో మమతను బాగా చూసుకుంటానని మహేందర్ కరీంనగర్‌లోని అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం పుస్తెలతాడు ఇవ్వాలని మమతను కోరగా నిరాకరించింది. ఈనేపథ్యంలో మహేందర్ గతనెల 26న నల్లగొండ, వేములవాడ దైవ దర్శనానికని నమ్మించి, దైవ దర్శనం అనంతరం కొడిమ్యాలకు తీసుకెళ్లాడు. అదేరోజు నైలాన్ తాడును ఆమె మెడ చుట్టూ బిగించి హత్య చేశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు ఆమె మెడకు నైలాన్‌తాడు చుట్టి ఇంటి స్లాబ్‌కు కట్టాడు. పుస్తెలతాడు తీసుకొని గంగాధరలోని ఓ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని అప్పులు తీర్చాడు. ఈక్రమంలో పోలీసులు లోతుగా విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. శనివారం నిందితుడు మోటారుసైకిల్‌పై పారిపోతుండగా చెప్యాల ఎక్స్‌రోడ్ వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, తమ్ములపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పాల్గొన్నారు. -
టీచర్‌తో వివాహేతర సంబంధం.. భార్యను..!
హోసూరు(తమిళనాడు): ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ భర్త తప్పుదారి పట్టాడు, ప్రశ్నించిన భార్యను హతమార్చాడు. హోసూరు పారిశ్రామికవాడలో భార్యను హత్య చేశాడో భర్త. వివరాల మేరకు హోసూరు జూజువాడి ఉప్కర్ నగర్ రాజేశ్వరిలేఔట్కు చెందిన భాస్కర్ (34), భార్య శశికళ (33). గత 2018న ఫేస్బుక్లో పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకు ఆరూష్ (4), శ్రీషా (2) అనే పిల్లలున్నారు. దంపతులు హోసూరులోని సీతారామ్‌దిన్న , కామరాజ్‌నగర్, జూజువాడి, రాజేశ్వరిలేఔట్ ప్రాంతాల్లో జిమ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. టీచర్‌తో అక్రమ సంబంధం ఈ నేపథ్యంలో భాస్కర్‌కు ఓ టీచర్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆమెకు అలసనత్తం ప్రాంతంలో అద్దె గదిలో ఉంచాడు. విషయం తెలుసుకొన్న భార్య శశికళ భర్తతో గొడవపడుతూ వచ్చింది.గత 30వ తేదీన రాత్రి భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో దుస్తులతో గొంతు పిసికి హత్య చేశాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు ముక్కులో రక్తం కారుతోందని, వైద్యం చేయాలని తెలిపాడు. పరిశీలించిన డాక్టర్లు శశికళ చనిపోయిందని ధృవీకరించారు. ఈ ఘటనపై శశికళ బంధువుల ఫిర్యాదు మేరకు సిఫ్‌కాట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నింధితుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని క్రిష్ణగిరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. హత్య చేసినట్లు రుజువు కావడంతో నిందితున్ని అరెస్ట్ చేశారు.