
ఇంటర్న్‌షిప్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన జార్ఖండ్ యువతి
మద్యం తాగించి స్నేహితుడితోపాటు మరో యువకుడి లైంగిక దాడి
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడి కి పాల్పడిన ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. జార్ఖండ్ కు చెందిన యువతి (20) తమిళనాడులోని కలస లోకేషన్‌లింగం కాలేజీలో బయో మెడికల్ కోర్సు చదువుతోంది. అదే కాలేజీలో బాచుపల్లి హరితవనం కాలనీకి చెందిన అజయ్ (24) బీటెక్ చదువుతున్నాడు.
దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్ప డింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఇంటర్న్íÙప్ చేయాలని యువతి నిర్ణయించుకుంది. దీంతో ఈ నెల 3న ఆమె హైదరాబాద్‌కు రాగా కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఆమెను అజయ్ ఉంచాడు. అదేరోజు సాయంత్రం పార్టీ చేసుకుందామని ఆమెను బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న తన స్నేహితుడు హరి ఇంటికి తీసుకెళ్లాడు.
ముగ్గురు కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించిన అనంతరం అజయ్ యువతిపై లైంగిక దాడి చేశాడు. తర్వాత హరి కూడా యువతిపై లైంగిక దాడి చేయటానికి ప్రయతి్నంచగా యువతి కేకలు వేసింది. దీంతో చుట్టు పక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణæ అనంతరం 4వ తేదీన అజయ్, హరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి సురక్షితంగా స్వస్థలానికి వెళ్లేందుకు సహాయం చేశారు. ఓ బైక్, మద్యం బాటిల్, ఇతర సామగ్రిని సీజ్ చేశారు.