విశాఖలో విషాదం.. స్కూటీపై వెళుతున్న మహిళ స్పాట్‌లో మృతి | Tree And Road Accident In Visaka | Sakshi
Sakshi News home page

విశాఖలో విషాదం.. స్కూటీపై వెళుతున్న మహిళ స్పాట్‌లో మృతి

May 5 2025 12:34 PM | Updated on May 5 2025 1:27 PM

Tree And Road Accident In Visaka

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో భారీ వర్షాల కారణంగా విశాఖలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు విరిగి పడిపోవడంతో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

వివరాల ప్రకారం.. విశాఖలోని సీతమ్మధారలో విషాదం నెలకొంది.  సితార అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పూర్ణిమ (38) ఈరోజు ఉదయం తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తోంది. ఈ సందర్భంగా ఆమెపై చెట్టు విరిగి పడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో కారు, బైక్‌ సహా ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. ఇక, సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement