Seetammadhara
-
విశాఖలో విషాదం.. స్కూటీపై వెళుతున్న మహిళ స్పాట్లో మృతి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో భారీ వర్షాల కారణంగా విశాఖలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు విరిగి పడిపోవడంతో సదరు మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. విశాఖలోని సీతమ్మధారలో విషాదం నెలకొంది. సితార అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పూర్ణిమ (38) ఈరోజు ఉదయం తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తోంది. ఈ సందర్భంగా ఆమెపై చెట్టు విరిగి పడిపోయింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ప్రమాదంలో కారు, బైక్ సహా ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. ఇక, సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మహిళ మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
పిట్ట కొంచెం... డ్యాన్స్ ఘనం
సాక్షి, సీతమ్మధార(విశాఖపట్నం) : పిట్ట కొంచెం..డ్యాన్స్ ఘనం అంటే ఆశినిచంద్రెడ్డి.మూడేళ్ల వయసులోనే కూచిపూడి నృత్యంలో తనకుంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఇప్పటికే అనేక ప్రదర్శనలిస్తూ మెప్పిస్తోంది. రెండేళ్ల వయసులోనే టీవీలో వచ్చే డ్యాన్స్ షోలు ఆసక్తిగా చూసేది. రానురానూ డ్యాన్స్ ప్రొగ్రామ్స్ పెట్టమని గొడవ చేసేది. నాట్యంలో ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు శ్వేతరెడ్డి, చందు కూచిపూడి నేర్పించాలని నిర్ణయించుకున్నారు. నాట్య గురువు బేత సత్యనారాయణ సమక్షంలో కూచిపూడి శిక్షణ పొందుతోంది. ఇప్పటికే నగరంలో చాలా స్టేజ్ షోలిచ్చి ఆకట్టుకుంది. ఆమె స్టేజ్‌పై కాళ్లకు గజ్జెలు కట్టుకుని డ్యాన్స్ చేస్తూంటే ఆహూతులంతా కళ్లార్పకుండా చూస్తారు. రూపం..హావభావాలు... పాటకు తగ్గట్టు, లయ తప్పకుండా నాట్యం చేస్తుండడం ఆ చిన్నారి ప్రత్యేకత. ఇప్పటికే సామర్లకోట, విజయవాడ, అన్నవరంలోని దేవస్థానంలో, అలాగే భీమేశ్వరస్వామి ఆలయం కూచుపూడి నాట్య ప్రదర్శన చేసి మెప్పిచ్చింది. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది. భవిష్యత్తులో ఆశిని ఉత్తమ నాట్యకారిణిగా గుర్తింపు పొందాలని ఆశిస్తున్నట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
సుప్రీంకోర్టులో రామోజీరావుకు చుక్కెదురు
న్యూఢిల్లీ : ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. రామోజీరావు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం కొట్టేసింది. విశాఖపట్నం సీతమ్మధార స్థలం అద్దెకేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయటానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అద్దె బకాయిల పిటిషన్ తేలేంతవరకూ స్థల యజమాని మంతెన ఆదిత్యవర్మకు నెలకు రూ. 17 లక్షల చొప్పున అద్దె చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే దీంతోపాటు అద్దె బకాయి రూ.2.60 కోట్ల అద్దె బకాయిని చెల్లించాలని స్పష్టం చేసింది. దీనికి రామోజీరావు రెండు నెలలు గడువు కోరిగా, గడువు ఇచ్చేది లేదని సుప్రీంకోర్టు నిరాకరించింది. వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. 1974, మార్చి 30న రామోజీరావు 2.78 ఎకరాల స్థలం, 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలను 33 ఏళ్ల కాలపరిమితికి అద్దెకు తీసుకున్నారు. అద్దె గడువు 2007 ఏప్రిల్‌తో ముగిసిన పిదప లీజు పొడిగించడానికి వర్మ తిరస్కరించడంతో రామోజీరావు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. మరోవైపు లీజు సమయంలో రూ. 2,500 అద్దె, కొన్నేళ్ల తరువాత రూ.3వేలు చెల్లించాలన్న ఒప్పం దం ప్రకారం అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో వర్మ విశాఖలోని అద్దె నియంత్రణ చట్టం ప్రత్యేక కోర్టు (ఆర్సీసీ)ని ఆశ్రయించారు. నెల రోజుల్లో భవనం ఖాళీ చేసి యజమానికి అప్పగించాలని కోర్టు రామోజీరావును ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై రామోజీరావు అప్పీల్ చేయగా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆర్సీసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఈ స్టేను తొలగించాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయిం చారు. ముంబై, హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో అద్దెలు పెరగడంపై ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం ప్రతిని కూడా హైకోర్టు ముందు ఉంచారు. దీన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి... దిగువ కోర్టులో స్టే కొనసాగాలంటే ప్రస్తుత స్థలం విలువపై ఐదు శాతం అద్దెను ప్రతీనెల చెల్లించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విశాఖలోని సీతమ్మధార ప్రాంతంలో రిజిస్ట్రేషన్ విలువ చదరపు గజానికి రూ. 30 వేలు పైచిలుకు ఉన్న ప్రకా రం ప్రస్తుతం స్థలం విలువ రూ. 40,36,50,000గా, భవనాల విలువ రూ. 90 లక్షలుగా లెక్కించారు. ఆ ఆస్తులను వాణిజ్య అవసరాలకు తీసుకున్న రామోజీరావు స్థల యజమాని వర్మకు రూ.17లక్షల చొప్పున ప్రతినెల 10లోపు అద్దె చెల్లించాలని, అద్దె బకాయిలు రూ. 2.57 కోట్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రామోజీరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రాథమిక విచారణ జరిపిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న రామోజీరావు అభ్యర్థనను తిరస్కరించింది. -
'సీతమ్మధార ఈనాడులో అక్రమ నిర్మాణాలను తొలగించండి'
విశాఖ: అనుమతుల్లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా సీతమ్మధార ఈనాడు కార్యాలయంలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని సంబంధిత అధికారులను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ (జీవీఎమ్ సీ) ఆదేశించింది. తమ అనుమతి లేకుండా అక్రమ కట్టడాలను నిర్మించారని స్థల యజమాని జీవీఎమ్ సీకి ఫిర్యాదు చేశారు. యజమాని ఫిర్యాదు మేరకు అధికారులు అక్రమ నిర్మాణలను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.