పిట్ట కొంచెం..డ్యాన్స్‌ ఘనం

3Years Old Asinichandar Is Doing Good Performance At Kuchipudi In Visakhapatnam - Sakshi

సాక్షి, సీతమ్మధార(విశాఖపట్నం) : పిట్ట  కొంచెం..డ్యాన్స్‌ ఘనం అంటే ఆశినిచంద్‌రెడ్డి.మూడేళ్ల వయసులోనే కూచిపూడి నృత్యంలో తనకుంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఇప్పటికే అనేక ప్రదర్శనలిస్తూ మెప్పిస్తోంది. రెండేళ్ల వయసులోనే టీవీలో వచ్చే డ్యాన్స్‌ షోలు ఆసక్తిగా చూసేది. రానురానూ డ్యాన్స్‌ ప్రొగ్రామ్స్‌ పెట్టమని గొడవ చేసేది. నాట్యంలో ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు శ్వేతరెడ్డి, చందు కూచిపూడి నేర్పించాలని నిర్ణయించుకున్నారు. నాట్య గురువు బేత సత్యనారాయణ సమక్షంలో కూచిపూడి శిక్షణ పొందుతోంది.

ఇప్పటికే నగరంలో చాలా స్టేజ్‌ షోలిచ్చి ఆకట్టుకుంది. ఆమె స్టేజ్‌పై కాళ్లకు గజ్జెలు కట్టుకుని డ్యాన్స్‌ చేస్తూంటే ఆహూతులంతా కళ్లార్పకుండా చూస్తారు. రూపం..హావభావాలు... పాటకు తగ్గట్టు, లయ తప్పకుండా నాట్యం చేస్తుండడం ఆ చిన్నారి ప్రత్యేకత. ఇప్పటికే సామర్లకోట, విజయవాడ, అన్నవరంలోని దేవస్థానంలో, అలాగే భీమేశ్వరస్వామి ఆలయం కూచుపూడి నాట్య ప్రదర్శన చేసి మెప్పిచ్చింది. ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకుంది. భవిష్యత్తులో ఆశిని ఉత్తమ నాట్యకారిణిగా గుర్తింపు పొందాలని ఆశిస్తున్నట్టు తల్లిదండ్రులు పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top