
సాక్షి,విశాఖ: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని బుధవారం వాతావారణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో మత్స్యకారులు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్,ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావారి, పశ్చిమ గోదావారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు..ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి 45-65 కిమీ వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని,భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఇంకా తీవ్ర వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తత అవసరం ఉందని సూచించారు.
