
సాక్షి, విశాఖపట్నం: హెచ్‌పీసీఎల్‌లో భారీ పేలుడు సంభవించింది. రఫ్ సైట్ బ్లూషెడ్ వద్ద గ్యాస్ కంప్రెసర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్మికులు బయటకు పరుగులు తీశారు. పైప్ లైన్ లీకేజీ వలన వేజల్ పేలినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం 9:20 నిమిషాలకి ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి ఫైర్ సేఫ్టీ అధికారులు చేరుకున్నారు. వేజల్ పేలిన సమయంలో లోపల ఎంత మంది కార్మికులు ఉన్నారన్నదానిపై స్పష్టత కొరవడింది. అయితే వందలాది కార్మికులను అధికారులు బయటికి పంపించేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది.