నా చావుకు భార్య కుటుంబమే కారణం | Private company employee ends life wife issues | Sakshi
Sakshi News home page

నా చావుకు భార్య కుటుంబమే కారణం

May 5 2025 11:21 AM | Updated on May 5 2025 11:21 AM

Private company employee ends life wife issues

బ్రిడ్జిపై నుంచి దూకి ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి ఆత్మహత్య 

అన్నానగర్‌(తమిళనాడు): తన చావుకు భార్య కుటుంబమే కారణం అని ప్రైవేట్‌ ఫారెస్ట్‌ ఉద్యోగి స్నేహితుడికి వీడియో పంపించి  కోట్టూరుపురం వంతెన పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

వివరాలు.. చెన్నైలోని కేకే నగర్‌ కామరాజర్‌ రోడ్డులో నివాసం ఉంటున్న అజిత్‌ (32) పెరుంగుడిలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఇతనికి భార్య ఆర్తి (29), రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఆర్తి పల్లావరంలో సెంట్రల్‌ కార్యాలయంలో సెక్యూరిటీగా పనిచేస్తోంది. అజిత్‌కు అతని భార్యకు మధ్య తరచూ గొడవలు జరిగేవన్నారు. దీంతో అజిత్‌ భార్య ఆర్తి కుటుంబం కఠినంగా మాట్లాడిందని తెలుస్తుంది. దీంతో మనస్తాపంతో ఉంటు వచ్చాడు. గత 28వ తేదీన అజిత్, ఆయన భార్య మధ్య మరో వివాదం జరిగినట్లు తెలుస్తుంది. 

ఆ తర్వాత అజిత్‌ కోట్టూరుపురం వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు యతి్నంచాడు. స్థానికులు తీవ్రంగా గాయపడిన అజిత్‌ను రాయపేట ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కోట్టూరుపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. ‘తన ఆత్మహత్యకు నా భార్య బంధువులే కారణం’ అంటూ అజిత్‌ తన స్నేహితుల్లో ఒకరికి వీడియో పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు ఆత్మహత్యకు సంబంధించి అజిత్‌ భార్య కుటుంబాన్ని విచారిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement