25 మందిని వివాహం చేసుకున్న యువతి.. 26వ పెళ్లితో | Anuradha Paswan Arrested for Cheating 25 Grooms and Escaping with Jewelry and Cash Worth Lakhs | Sakshi
Sakshi News home page

25 మందిని వివాహం చేసుకున్న యువతి.. 26వ పెళ్లితో

May 20 2025 4:46 PM | Updated on May 20 2025 5:03 PM

Anuradha Paswan Arrested for Cheating 25 Grooms and Escaping with Jewelry and Cash Worth Lakhs

జైపూర్: పెళ్లి పేరుతో అమాయికుల్ని మోసం చేస్తున్న నిత్య పెళ్లి కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 25మందిని పెళ్లి చేసుకున్న నిత్య‌పెళ్లి కూతురు 26వ పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైంది. పోలీసుల‌కు అడ్డంగా దొరికి పోయింది.

వివ‌రాల్లోకి వెళ్లితే.. రాజస్తాన్‌కు చెందిన యువ‌తి అనురాధా పాస్‌వాన్‌ది క‌డుపేద‌రికం, ఒంట‌రి జీవితం, నిరుద్యోగైన త‌మ్ముడు బాధ్య‌త‌ను తానే చూసుకోవాలి. పెళ్లి చేసుకునేందుకు చేతిలో డ‌బ్బు లేదు. వెర‌సీ.. పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు క‌త‌ర్నాక్ ప్లాన్ వేసింది. త‌న‌కున్న అందం, తెలివితేటల‌తో పెళ్లి పేరుతో వ‌రుస మోసాల‌కు పాల్ప‌డింది.

పెళ్లి చేసుకోవ‌డం. ఆపై అత్తారింట్లో అనుకువగా ఉండ‌టం. వారిని త‌న మాట‌ల‌తో న‌మ్మించి ఇంట్లో ఉన్న బంగారం,డ‌బ్బులు,ఖ‌రీదైన వ‌స్తువుల్ని అందినకాడికి దోచుకోవ‌డం ప‌రార‌వ్వ‌డం. పేరు మార్చి, మ‌కాం మార్చడం మ‌రొక‌రిని పెళ్లి చేసుకోవడం ఇలా త‌క్కువ స‌మ‌యంలో 25మందిని వివాహం చేసుకుంది.

ఇందుకోసం తానే ఓ గ్యాంగ్‌ను న‌డుపుతోంది. అమాయ‌కులు, పెళ్లి కుమార్తె కోసం అన్వేషిస్తున్న వారి ఇంటికి త‌న గ్యాంగ్‌లోని మ‌నిషిని పంపిస్తోంది.  ఈ గ్యాంగ్  ఆమె ఫోటోలు, ప్రొఫైల్‌ను పెళ్లి కుమారుల‌కు చూపిస్తారు. అనంత‌రం, పెళ్లికి ఒప్పిస్తారు. ఇందుకు గాను పెళ్లి కుమార్తెను చూసినందుకు పెళ్లి కుమారుడి కుటుంబం నుంచి రూ.2ల‌క్ష‌లు వ‌సూలు చేస్తారు. 

పెళ్లి తర్వాత 
ప్లాన్‌ ప్రకారం.. పెళ్లి చేసుకున్న మొద‌టి రోజు నుంచే అనురాధా పాస్‌వాన్‌ అత్తింటి వారితో అనుకువ‌గా మెసులుతుంది. ఇంట్లో ఉన్న బంగారాన్ని ఉడాయించాల‌నుకుంటే వెంట‌నే త‌న ప్లాన్‌లో భాగంగా క‌ట్టుకున్న భ‌ర్త‌, ఇత‌ర కుటుంబ‌స‌భ్యులు తినే ఆహారంలో మ‌త్తు మందు క‌లుపుతుంది. మ‌త్తు మందు క‌లిపిన ఆహారం తిన్న కుటుంబ స‌భ్యులు ఆప‌స్మార‌క స్థితిలోకి జారుకున్న త‌ర్వాత  బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను కాజేస్తుంది.

ఇప్పటివరకు 25 మందిని బురిడీ కొట్టించింది. ఈ క్రమంలో అనురాధా పాస్‌వాన్‌ చేతిలో మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె రూట్లోనే వెళ్లారు. నిత్యపెళ్లి కుమార్తెను, ఆమె ముఠా గుట్టురట్టు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement