హైదరాబాద్: జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపణలు చేశారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై బాధితురాలు ఫిర్యాదు చేశారు.
అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్. అసభ్యకర మెసేజ్‌లు పంపి బూతులు తిడుతున్నాడని ఆరోపించారు. గదిలోకి తీసుకెళ్లి మెడపై కత్తిపెట్టి బెదిరించాడని తెలిపారు. ప్రైవేట్ వీడియోలు తీసి తన భర్తకు పంపించాడని ఆరోపించారు.


