
జమ్మికుంట(కరీంనగర్): ఇటీవల యువతలో ఒకరిని ప్రేమించడం, మరొకరిని పెళ్లాడటం కామన్‌గా మారిపోయింది. అయితే కొందరు దీన్ని జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతుండటమే బాధకరం. అలాంటి దారుణ ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే..కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో ఆమె ఇటీవలే వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఇది తెలిసి మనస్తాపం చెందిన ఎల్లేష్ సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా ఆ వీడియోలో తన ఫోన్‌లో ఆమెకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని..యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని కోరాడు. అలాగే తనను ఇంతలా మోసం చేసిన ఆ యువతి కుటుంబంపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడ్డ యువకుడు
7 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ… pic.twitter.com/lx0DPxyUEd— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025