
రామగిరిలో ఆగని ‘రక్తచరిత్ర’
ఎంపీపీ ఉపఎన్నిక నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యులకు బెదిరింపులు
టీడీపీకి ఎంపీపీ అభ్యర్థి కరువు
బలవంతంగా వైఎస్సార్‌సీపీ మహిళా ఎంపీటీసీ భారతిని టీడీపీలో చేర్చుకున్న ‘పరిటాల’
ఆ తర్వాత భయంతో ఊరు వదిలి వెళ్లిపోయిన ఎంపీటీసీ
ఆమె ఆచూకీ చెప్పాలని వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ గూండాల దాడి
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు.. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వీడియో విడుదల చేసిన ఎంపీటీసీ భారతి
టీడీపీలో చేరే ప్రసక్తే లేదని.. ఉప ఎన్నికకు రాలేనని వెల్లడి
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ దాషీ్టకాలతో నియోజకవర్గంలోని రామగిరి మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తారో, ఏ పరిణామాలు ఎవరి ప్రాణాలు తీస్తాయో.. అని వణికిపోతున్నారు. బలవంతంగా పార్టీలోకి చేర్చుకోవడం,అవసరమైతే దాడులు చేయడం రామగిరి మండలంలో టీడీపీ గూండాలకు పరిపాటిగా మారింది. ఎంపీపీ ఉప ఎన్నికకు మరోసారి నోటిఫికేషన్ విడుదల కావడంతో ‘రక్తచరిత్ర’ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
మార్చిలో జరగాల్సిన ఎంపీపీ ఉప ఎన్నికను టీడీపీ గూండాల దౌర్జన్యాలతో అధికారులు వాయిదా వేశారు. ఎంపీటీసీ సభ్యులను బెదిరించి కిడ్నాప్‌నకు యత్నం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను టీడీపీ గూండాలు హతమార్చారు. పరామర్శించడానికి వచి్చన మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పోలీసులు సరైన రక్షణ కల్పించలేదు.
మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు వైఎస్సార్‌సీపీ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఎంపీపీ స్థానానికి అభ్యర్థి కూడా లేని టీడీపీ వాళ్లు ఎలాంటి దారుణాలకు ఒడిగడతారోనని వైఎస్సార్‌సీపీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు భయపడుతున్నారు.
బలవంతంగా టీడీపీలో చేర్చుకుని..
ఈ నెల 19వ తేదీన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుంది. ఎంపీపీ పదవి మహిళా అభ్యర్థికి రిజర్వు కావడంతో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి వేటలో పడ్డారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని మంగళవారం బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లి టీడీపీ కండువా వేసి పా ర్టీలో చేరినట్లు పరిటాల సునీత, శ్రీరామ్ ఫొటోలకు పోజులిచ్చారు.
సాయంత్రం నుంచి భారతి ఎవరికీ కనిపించకుండా పోయారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలే కిడ్నాప్ చేశారంటూ టీడీపీ వారు దు్రష్పచారం చేశారు. వారి ప్రచారాన్ని భారతి ఖండిస్తూ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బుధవారం వీడియో విడుదల చేశారు.
ఇంటిపై దాడి... పట్టించుకోని పోలీసులు
టీడీపీలో చేరిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని ఎక్కడ దాచారో చెప్పాలంటూ కొత్తపల్లి గ్రామంలో కురుబ సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు నారాయణరెడ్డి ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి టీడీపీకి చెందిన మాదాపురం శంకర్‌తోపాటు మరికొంతమంది రౌడీలు దాడి చేశారు.
ఈ ఘటన గురించి బుధవారం ఉదయం రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీసులపై నమ్మకం పోయిందని, ఎన్నిక పూర్తయ్యే వరకు స్థానికంగా ఉంటే టీడీపీ గూండాలు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్యను హత్య చేసిన తరహాలోనే దారుణానికి ఒడిగడతారని కొత్తపల్లి గ్రామస్తులు భయపడుతున్నారు.

ఎంపీపీ ఇస్తామన్నారు
‘టీడీపీ నేతలు నన్ను భయపెట్టి బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లారు. పరిటాల సునీత, శ్రీరామ్ సమక్షంలో పార్టీ కండువా వేసి ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. నాకు ఎలాంటి పదవీ వద్దని చెప్పినా బలవంతపెట్టారు. ఆ తర్వాత మా గ్రామంలో వదిలారు. అక్కడ ఉంటే రక్షణ ఉండదని భావించి బంధువుల ఇంటికి వచ్చాను. నాకు టీడీపీలోకి వెళ్లడం ఇష్టం లేదు. పదవి కంటే పార్టీ ముఖ్యం. వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతా. ఎంపీపీ ఉప ఎన్నికకు హాజరుకాలేను. ఈ నెల 20 తర్వాత గ్రామానికి వస్తాను. – భారతి, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు, పేరూరు–2
ఎన్నికను బహిష్కరిస్తున్నాం
‘రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికను వైఎస్సార్‌సీపీ బహిష్కరిస్తోంది. మార్చి 27న జరగాల్సిన ఎన్నిక టీడీపీ నాయకుల దౌర్జన్యాల కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కురుబ లింగమయ్యను కోల్పోయాం. మరోసారి ఇంకొందరు కార్యకర్తలను కోల్పోలేం. అందుకే ఎన్నికకు దూరంగా ఉంటాం. రామగిరి పోలీసులపై నమ్మకం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తేనే సరైన రక్షణ కల్పించలేకపోయారు.’ – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే