గుంటూరు లేడీస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాల కలకలం | Secret Cameras In Guntur Ladies Hostel | Sakshi
Sakshi News home page

గుంటూరు లేడీస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాల కలకలం

May 4 2025 3:15 PM | Updated on May 4 2025 4:27 PM

Secret Cameras In Guntur Ladies Hostel

గుంటూరు: లేడీస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. గుంటూరు బ్రాడీపేటలోనీ శ్రీనివాసన్ లేడీస్ హాస్టల్‌లో బాత్రూం ముందు కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థునులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అసభ్యకరంగా మెసేజ్‌లు చేయటం.. అబ్బాయిల్ని తీసుకొని వచ్చి లేడీస్ హాస్టల్లో ఉంచడం చేస్తున్నారని హాస్టల్ విద్యార్థునులు చెబుతున్నారు. అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

గత ఏడాది కూడా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్‌ కెమెరాల కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. లేడీస్ హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరా బ‌య‌ట‌ప‌డింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఈ కెమెరా ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు.

తెలంగాణలోని ఈ ఏడాది మార్చి నెలలో సంగారెడ్డి జిల్లాలోని ఓ గర్ల్స్ హాస్టల్‌లో స్పై కెమెరా కలకలం రేపింది. హాస్టల్‌లో ఉండే విద్యార్థినిలు స్పై కెమెరాను గుర్తించి.. అమీన్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హాస్టల్‌ నిర్వాహకుడిని అరెస్ట్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement