బావ మా అక్క మరో పెళ్లి చేసుకుంటుంది..! | wife second marriage issue in banjara hills police station | Sakshi
Sakshi News home page

Banjara Hills: బావ మా అక్క మరో పెళ్లి చేసుకుంటుంది..!

May 8 2025 7:31 AM | Updated on May 8 2025 7:31 AM

wife second marriage issue in banjara hills police station

బంజారాహిల్స్‌(హైదరాబాద్): భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా..భర్తకు దూరంగా ఉంటున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని ప్రశ్నించగా..అతనిపై రోకలితో దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నేపాల్‌ దేశం బరాండ్‌కు చెందిన కృష్ణదమత్‌ బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. 2013లో సునీత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో హౌస్‌కీపింగ్‌గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. 2024 అక్టోబర్‌లో కుటుంబాన్ని తన గ్రామానికి పంపించేందుకు స్నేహితుడి నుంచి రూ.1.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇదే విషయమై సునీతకు, కృష్ణకు గొడవలు జరిగాయి. ఇదే క్రమంలో జనవరి 3న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కృష్ణకు భార్యతో మరోసారి గొడవ జరిగింది. దీంతో సునీతను ఇంటి నుంచి పంపించివేశాడు. అప్పటి నుంచి భార్యతో ఎలాంటి సంప్రదింపులు చేయలేదు.

 ఇదిలా ఉండగా మంగళవారం సునీత సోదరుడు దీపక్‌..కృష్ణదమత్‌కు ఫోన్‌చేసి తన సోదరి అమర్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. దీంతో కృష్ణదమత్‌ వెంటనే నందినగర్‌లోని సునీత ఉండే నివాసానికి వెళ్లి నిలదీశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా సునీత అల్యుమినియం రోకలితో భర్తపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కుడికంటి వద్ద తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. ఆమెతో పాటు అమర్‌ కూడా కృష్ణదమత్‌పై దాడి చేయగా బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement