
ఉడాయించిన బంగారు నగల వ్యాపారి
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
రూ.10 కోట్ల నగలతోబంగారంతో పరార్
కేపీహెచ్‌బీ/నిజాంపేట్: బాచుపల్లి ప్రగతినగర్‌లో బంగారం వ్యాపారం నిర్వహిస్తూ నమ్మించి డబ్బులు వసూలు చేసి ఉడాయించిన మోసగాడి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. గురువారం ఇద్దరు వ్యాపారులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధరాణి అనే మహిళ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. అశోక్ కుమార్ జైన్ అనే వ్యక్తి 30 ఏళ్లుగా కేపీహెచ్‌బీ కాలనీలో రిషబ్ జువెల్లరీ పేరుతో బంగారు నగల వ్యాపారం చేస్తున్నాడు. ప్రగతినగర్‌లో చేతన్ జువెల్లరీ పేరుతో వ్యాపారం చేస్తున్న నితీష్ జైన్ నాలుగేళ్లుగా అశోక్ కుమార్ జైన్ వద్ద బంగారం తీసుకుని వ్యాపారం చేసేవాడు.
గత నెల 8న, ఈ నెల 10న నితీష్ జైన్ అతని భార్య స్వీటీ జైన్‌లు అశోక్ కుమార్ నగల షాపుకు వచ్చి రెండుమార్లు సుమారు అరకేజీ బంగారు నగలును తీసుకున్నారు. డబ్బులు త్వరలో చెల్లిస్తామని నమ్మబలికి వెళ్లిపోయారు. ఎప్పుడు డబ్బులు అడిగినా త్వరలోనే ఇస్తామని నమ్మబలికేవారు. ఇదే కోవలో ఐడీపీఎల్ కాలనీలోనీ దీపక్ జైన్‌కు చెందిన జ్యోతి జువెల్లరీలోనూ సుమారు 860 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకొని నెలరోజుల్లో డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికారు.
చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్
అయితే ఈ నెల 10 నుంచి ప్రగతినగర్‌లోని నితీష్ జైన్‌కు చెందిన చేతన్ జువెల్లరీ దుకాణాన్ని తెరవకపోవడంతో అతనికి బంగారం ఇచి్చన వ్యాపారులు, బంగారం కుదువపెట్టిన వారు, వివిధ స్కీంల పేరుతో డబ్బులు కట్టినవారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ, ఐడీపీఎల్ కాలనీలకు చెందిన ఇద్దరు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆమె భర్తపై పగబట్టాడు!