భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..! | Khammam Woman Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..!

May 5 2025 9:45 AM | Updated on May 5 2025 9:51 AM

Khammam Woman Ends Life In Hyderabad

భర్తే కొట్టి చంపాడని అనుమానాలు 

ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్‌లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్‌తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. 

అనిల్‌ హైదరాబాద్‌లోని పోలీస్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్‌ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్‌  యత్నంచాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.

మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్‌ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్‌పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్‌ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్‌ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement