భార్యపై కత్తితో దాడి చేసిన భర్త | - | Sakshi
Sakshi News home page

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

వేంసూరు: భార్య కాపురానకి రావడం లేదని శనివారం రాత్రి మద్యం మత్తులో భార్యపై కత్తితో దాడి చేసిన భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. లింగపాలెం గ్రామానికి చెందిన ప్రొద్దుటూరి నాగరాజుకు రేజర్ల గ్రామానికి చెందిన మాధివితో ఏడేళ్ల కిందట వివాహమైంది. కుటుంబ కలహాలతో వారు కొంతకాలంగా వేరుగా ఉంటున్నారు. కాగా, మర్లపాడులోని తిరువూరు రోడ్డులో అనురాధ రెస్టారెంట్‌లో ఒంటరిగా ఉన్న మాధవిపై నాగారాజు కత్తితో దాడి చేయాగా కుడి భుజం, కుడి చేతి వేళ్లు, ఎడమ మణికట్టుకు తీవ్ర గ్రాయాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు, తన సోదరుడు అన్నమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ కవిత వెల్లడించారు. కాగా, నాగరాజు కుటుంబ సభ్యులు సైతం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement