అలరించిన ‘సుదీర్ఘ గానలహరి’ | - | Sakshi
Sakshi News home page

అలరించిన ‘సుదీర్ఘ గానలహరి’

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

ఖమ్మంగాంధీచౌక్‌: ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం వేదికగా ఆదివారం ఉదయం 6 నుంచి 15 గంటల పాటు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’పేరిట నిర్వహించిన సుదీర్ఘ గానలహరి ప్రేక్షకులను అలరించింది. స్వర మధురిమ కల్చరల్స్‌ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్‌ గాయకుడు వీవీ రెడ్డి 15 గంటల పాటు తన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఆయనతో పాటు మరో 20 మంది గాయనీ, గాయకులు 150 సినీ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా కల్చరల్‌ యూనిట్‌ అధ్యక్షుడు ఇసనపల్లి నగేశ్‌ మాట్లాడుతూ.. 15 గంటల పాటు సంగీత విన్యాసం చేసిన వీ.వీ.రెడ్డి పలు రికార్డులను సొంతం చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ బాధ్యులు, గాయకులు మార్కపూడి నాగభూషణం, నందిగామ రాజ్‌కుమార్‌ జానీ, దేవపంగు ఫణి, భిక్షం, శ్రీకాంత్‌ కన్నా, అద్దంకి నరసింహారావు, గద్దల కుటుంబరావు, ఆలవాల కృపానందం, పీజే వినయ్‌కుమార్‌,జిల్లపల్లి రమేశ్‌, పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement