విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలు

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

నేలకొండపల్లి: ప్రమాదవశాత్తు విద్యుత్‌ ప్రమాదం జరగగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నేలకొండపల్లిలోని ఓ కంపెనీ సెల్‌ఫోన్‌ టవర్‌ మరమ్మతు లను కల్లూరుకు చెందిన కొందరు చేస్తున్నారు. ఈ క్రమాన ఆదివారం కార్మికుడు ఈశ్వర్‌ 11 కే.వీ.కి జంపర్లు కలిపేందుకు ఎల్‌సీ ఇవ్వాలని ఆన్‌లైన్‌లో కోరాడు. కానీ అనుమతి రాకముందే ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద పనిచేస్తుండుగా విద్యుదాఘాతానికి గురయ్యా డు. ఆయన పైనుంచి కింద పడడంతో తీవ్రగాయాలు కాగా సహచరులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

95 కేజీల గంజాయి సీజ్‌

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

పెనుబల్లి: ఒడిశా నుంచి కర్ణాటకలోని మైసూరుకు తరలిస్తున్న గంజాయిని ఈగల్‌ టీం, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండ లం వీఎం బంజర పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. కారులో గంజాయి తరలిస్తున్న నిందితులు పెనుబల్లి మండలం ముత్తగూడెంలోని గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ఎగ్జిట్‌ పాయింట్‌ వద్ద టిఫిన్‌ కోసం ఆగారు. ఇదే సమయాన తనిఖీలు చేపడుతున్నఈగల్‌ టీం, స్థానిక పోలీసులు కారులో పరిశీలించగా 95 కేజీల గంజాయి బయటపడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన ఆకుల అయ్యప్పరెడ్డి, కాకినాడకు చెందిన మొగిలిశెట్టి దేవి, మైసూర్‌కు చెందిన అంబరీ పూజారి చంద్రశేఖర్‌ను విచారించగా ఒడిశా నుంచి మైసూర్‌కు గంజాయి తరలిస్తున్నట్లు అంగీకరించారు. కాగా, నిందితులపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో ఎస్‌ఐ వెంకటేశ్‌, ఏఎస్‌ఐ చెన్నారావు, సిబ్బంది పాల్గొన్నారు.

చోరీ కేసులో నిందితుడి రిమాండ్‌

దర్యాప్తు కోసం కస్టడీ కోరిన పోలీసులు

కారేపల్లి: చోరీ కేసులో నిందితుడిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా.. విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరినట్లు కారేపల్లి ఎస్‌ఐ బి.గోపి తెలిపారు. జూన్‌ 22వ తేదీన కారేపలి బస్టాండ్‌ సెంటర్‌కు చెందిన కేతిమాల సారయ్య ఇంట్లో ఐదు తులాల బంగారం, రెండు తులాల వెండి పట్టీలతో పాటు, కొంత నగదు చోరీకి గురైంది. విచారణలో నిందితుడు హైదరాబాద్‌కు చెందిన పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు. తాజాగా హైదరాబాద్‌లోనూ చోరీ చేయగా, నిందితుడు అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ మేరకు కారేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి ఖమ్మం సబ్‌జైలుకు తరలించారు. కాగా, చోరీకి సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు కోసం నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరినట్లు ఎస్‌ఐ గోపి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement