
బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటి నుసారత్ ఫరియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేశారు ఆ దేశ పోలీసులు. ఆమె థాయ్ లాండ్ కు వెళుతున్న క్రమంలో ఢాకా షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. . ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఆమెతో పాటు మరో 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు నమోదయ్యాయి
ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ఆధారంగా తమ బృందం విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినట్లు పోలీస్ అధికారి సుజన్ హక్ తెలిపారు. కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్థించిన విషయాన్ని సదరు పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆమెపై పతరా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక 2023లో తెరకెక్కిన ముజిబ్: ద మేకింగ్ ఆఫ్ నేషన్ చిత్రంలో షేక్ హసీనా పాత్రలో నటించింది నుసారత్ ఫరియా.