ప్రియురాలి చేతిలో ట్రావెల్‌ ఏజెంట్‌ హత్య | Travel agent Ends Life In Tamil nadu | Sakshi
Sakshi News home page

ప్రియురాలి చేతిలో ట్రావెల్‌ ఏజెంట్‌ హత్య

May 5 2025 11:34 AM | Updated on May 5 2025 11:35 AM

Travel agent Ends Life In Tamil nadu

అన్నానగర్‌(తమిళనాడు): మద్యం, మాంసంలో నిద్రమాత్రలు కలిపి దుబాయ్‌ ట్రావెల్స్‌ సీఈఓను హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తూత్తుక్కుడి కి చెందిన త్యాగరాజన్‌(69) ఇతను కోయంబత్తూరు వచ్చి ఖతీమా నగర్‌లో నివశించే సమయంలో గోమతి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. గోమతికి నీల, శారద అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో శారదతో గొడవపడిన ఆమె భర్త గుణవేల్‌ను హత్య చేసి త్యాగరాజన్‌ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్‌పై వచ్చాడు. 

ఈ క్రమంలో శారద పని నిమిత్తం దుబాయ్‌ వెళ్లింది. ఆ సమయంలో తిరువారూరు జిల్లాకు చెందిన ట్రావెల్‌ ఏజెంట్‌ సిగమణి(47)తో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. శారదకు, సిగమణికి  డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమస్య వచ్చింది. దీంతో శారద కోవైకి తిరిగి వచ్చింది. శారదను శాంతింపజేసేందుకు సిగమణి 21న కోయంబత్తూరుకు వచ్చాడు. అతనిని శారద తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో త్యాగరాజన్‌ నెల్లైకి చెందిన ప్రముఖ రౌడీ పశుపతిపాండియన్‌ సహచరుడు పుదియవన్‌  కోయంబత్తూరుకు ఆహ్వానించారు. 

ఆ తర్వాత 22వ తేదీ రాత్రి మద్యం, మాంసంలో 30కి పైగా నిద్ర, నొప్పి నివారణ మాత్రలు కలిపి సిగమణిని హత్య చేశారు. అనంతరం సిగమణి మృతదేహాన్ని త్యాగరాజన్, శారద, పుదియవన్‌ కారులో తీసుకెళ్లి కరూర్‌ పొన్నమరావతి పక్కన పడేసి, పారిపోయారు. మిగిలిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దీనిపై సిగమణి భార్య ప్రియా(69) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు బీలమేడు పోలీసులు విచారణ చేపట్టారు. త్యాగరాజన్‌(69), ఇతని వివాహేతర ప్రియురాలు గోమతి (53), ఆమె కూతుళ్లు నీల (33), శారద (35), కోడలు స్వాతి (26), పుదియవన్‌(48) సిగమణిని హత్య చేసినట్లు తేలింది. ఆదివారం శారదతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.     

Advertisement
 
Advertisement
Advertisement