సెప్టెంబరు 8 వరకు సభా పర్వం | - | Sakshi
Sakshi News home page

సెప్టెంబరు 8 వరకు సభా పర్వం

Aug 6 2026 2:14 AM | Updated on Aug 6 2026 2:14 AM

– నేడు వ్యవసాయ బడ్జెట్‌

సాక్షి, చైన్నె : అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబరు 8వ తేది వరకుజరగనున్నాయి. శని, ఆదివారాలు, ఇతర ప్రభుత్వ సెలవు రోజులు మినహా తక్కిన అన్ని రోజులలో సభ జరగనున్నది. శాఖల వారీగానిధుల కేటాయింపు చర్చ నిర్వహించనున్నారు. బడ్జెట్‌దాఖలు అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగింది. ఇందులో సభను ఎన్ని రోజులు నిర్వహించాలో అన్నది నిర్ణయించారు. ఆ మేరకు తేదీల వారీగా, ఆయాశాఖలకు సంబంధించిన అంశాలపై చర్చలు,నిధుల కేటాయింపు ప్రకటనలు వెలువడనున్నాయి. ఈమేరకు సెప్టెంబరు 8వ తేదీ వరకు సభను నిర్వహించనున్నారు. ఇక, గురువారం వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి వినోద్‌ సభలో దాఖలు చేయనున్నారు. కాగా, సభకు తిరువీకానగర్‌ ఎమ్మెల్యే పల్లవి తన చంటి బిడ్డతో వచ్చారు. అయితే, బిడ్డను సభా మందిరంలోకి తీసుకు రాలేదు.

ఇండోనేషియా – ఐఐటీ మద్రాసు మధ్య ఒప్పందం

సాక్షి, చైన్నె: ఇండోనేషియా రిపబ్లిక్‌ ఉన్నత విద్య, సైన్స్‌– టెక్నాలజీ మంత్రిత్వ శాఖ , ఐఐటీ మద్రాస్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ఉన్నత విద్య, పరిశోధనలు, డీప్‌–టెక్నాలజీ, ఆవిష్కరణలు , వ్యాపారవేత్తల అభివృదిక్దకి సంబంధించి ఒక మైలురాయి లాంటి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా భారతదేశం , ఇండోనేషియాల మధ్య సౌత్‌–సౌత్‌ స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌మరింత బలోపేతం కానుంది. ఐఐఖీ మద్రాస్‌ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇండోనేషియా ఉన్నత విద్య, సైనన్స్‌ – టెక్నాలజీ శాఖ మంత్రి ప్రోఫెసర్‌ బ్రియన్‌ యులియార్టో సమక్షంలో ఒప్పందం జరిగింది. ఐఐటీ మద్రాస్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రఘునాథన్‌ రంగస్వామి, సీఈఓ – డైరెక్టర్‌ మాధవ్‌ నారాయణ్‌, , ఇండోనేషియా విద్యా మంత్రిత్వ శాఖ ఆర్‌క్యాండ్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మహమ్మద్‌ ఫౌజన్‌ అడ్జిమాన్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఐఐటీ మద్రాసు డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి. కామకోటి, ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్‌ చక్రవర్తి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఇండోనేషియాలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధకులు , వ్యాపారవేత్తలను ఐఐటీమద్రాస్‌ అత్యాధునిక రీసెర్చ్‌ , డీప్‌–టెక్‌ వ్యవస్థతో అనుసంధానించడం ఈ ఒప్పందం లక్ష్యంగా ప్రకటించారు.

సెంథిల్‌ బ్రదర్స్‌కు

షరతుల సడలింపు

సాక్షి, చైన్నె: టీవీకే ఎమ్మెల్యేను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో నమోదైన కేసులో మాజీ మంత్రి వి. సెంథిల్‌ బాలాజీ, ఆయన సోదరుడు ఆర్‌.వి. అశోక్‌ కుమార్‌లకు విధించిన ముందస్తు బెయిల్‌ నిబంధనలను సడలిస్తూ మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో 14 మందినిట్రిప్లికేన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఈ కేసులో సెంథిల్‌ బాలాజీ, అశోక్‌ కుమార్‌లకు గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం, వారిద్దరూ ప్రతిరోజూ ఉదయం 10:30 గంటలకు మరియు సాయంత్రం 5:30 గంటలకు ట్రిప్లికేన్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాల్సి ఉండేది.

విచారణపై స్టే – నిబంధనల సడలింపు..

ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ ట్రిప్లికేన్‌ పోలీసులు విచారణకు స్టే విధించింది. అలాగే, పలువురికి ఈ కేసులో బెయిల్‌ లభించాయి. అదే సమయంలో రోజువారీ హాజరు నిబంధనను తొలగించాలని సెంథిల్‌ బాలాజీ సోదరులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ జి.కే. ఇళంతిరైయన్‌, ఇద్దరికీ రోజువారీ హాజరు నుండి మినహాయింపు ఇస్తూ నిబంధనలను సడలించారు. అయితే విచారణకు అవసరమైనప్పుడు మాత్రమే పోలీసు సమన్లు జారీ చేసి పిలవవచ్చని స్పష్టం చేశారు.

పంట రుణాలన్నీ

మాఫీ చేయాలని ధర్నా

తిరువొత్తియూరు: తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని పొన్నేరిలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ఎదుట పూర్తిగా పంట రుణమాఫీ చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఈమేరకు విజయ్‌ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడు రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement