మార్కులు సున్నా.. స్టిక్కర్లు వేశారు.. | - | Sakshi
Sakshi News home page

మార్కులు సున్నా.. స్టిక్కర్లు వేశారు..

Aug 6 2026 2:14 AM | Updated on Aug 6 2026 2:14 AM

– పళనిస్వామి తీవ్ర విమర్శలు

సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ ప్రజల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయిందని, పాత పథకాలకు రంగులు మార్చి, కొత్త పేర్లు పెట్టి ’స్టిక్కర్‌’ రాజకీయం చేస్తున్నారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఘాటుగా విమర్శించారు. ఈ బడ్జెట్‌కు తానూ సున్న మార్కులే ఇస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మార్పు తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం, గతంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాలకే పేర్లు మార్చి ప్రవేశపెట్టిందన్నారు. కొత్త పథకాలేవీ లేకపోగా, కేవలం ఉపన్యాసాలు ఇస్తూ, రీల్స్‌ చేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంపై రూ. 10.98 లక్షల కోట్లకు పైగా రుణ భారం ఉందని పేర్కొంటూ, ఈ భారీ అప్పులను తీర్చడానికి లేదా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రభు త్వం వద్ద ఎటువంటి స్పష్టమైన ప్రణాళికలు లేదా మార్గదర్శకాలు లేవని విమర్శించారు. ప్రవేశపెట్టిన కొత్త కమిటీలన్నీ కేవలం మరిన్ని అప్పులు చేయడానికి వంకగా మాత్రమే ఉపయోగపడతాయని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement