
కాకినాడ జిల్లా: తుని రూరల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు.
మరో ఘటనలో కడియం-రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ల మధ్య రైలునుంచి జారి పడి సుమారు 50 ఏళ్ల వయసుగల వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని జీఆర్ఫీ ఎస్సై మావుళ్లు తెలిపారు. గాయపడి ఉండగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తించి 108 అంబులెన్సు ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.
మృతుడు నలుపు రంగుపై పసుపు రంగు గడులు గల హాఫ్ హాండ్స్ షర్ట్, నీలం రంగు లుంగీ ధరించాడు. మృతుడి కుడి చేయి మీద సన్ ఫ్లవర్ గుర్తుతో పచ్చబొట్టు ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27551, 94910 03239 నంబర్లలో సంప్రదించాలన్నారు.