అద్దెకు ఇల్లు పేరుతో.. మేనత్త సొమ్ముకు మేన కోడలి పథకం | Hyderabad Warasiguda Robbery Case Chased By Police | Sakshi
Sakshi News home page

అద్దెకు ఇల్లు పేరుతో.. మేనత్త సొమ్ముకు మేన కోడలి పథకం

May 4 2025 8:10 PM | Updated on May 4 2025 8:25 PM

Hyderabad Warasiguda Robbery Case Chased By Police

హైదరాబాద్: వారాసిగూడ చోరీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక మహిళను కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న నగలతో పాటు సొమ్మును అపహరించుకుని వెళ్లిన ఘటనలో మేనకోడలే నిందితురాలిగా తేలింది.  మేనత్త సొమ్మును కాజేయాలని మేనకోడలు జ్యోతి పథకం రచించి  ఆ ఇంటికి యువకుడ్ని పంపించి చోరీకి పాల్పడేలా పురిగొల్పింది. ఈ కేసులో జ్యోతిపాటు మరో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

కాగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి యజమానురాలిని కట్టేసి నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం ది. ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పార్శిగుట్టలోని ఓ ఇంట్లోని మొదటి అంత స్తులో పారిజాతం (56) అనే మహిళ నివాసముం టోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇల్లు అద్దెకు  కావాలంటూ ఇంట్లోకి చొరబడ్డారు.

తలుపులు గ యపెట్టి ఆమెను కత్తితో బెదిరించి కుర్చీలో కట్టేశాడా ఇంట్లో ఉన్న 30 గ్రాముల బంగారు నగలు, 6 మే నగదు, సెల్ ఫోన్ ను తీసుకుని పరారయ్యారు. కొ సేపటికి కట్లు విప్పుకుని బయటికి వచ్చి పారిజాతం చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది స్థానికులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఆమె వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై  దర్యాప్తు చేపట్టగా మేనకోడలే నిందితురాలు అయ్యింది. 

Advertisement
 
Advertisement
Advertisement