టీచర్‌తో వివాహేతర సంబంధం.. భార్యను..! | Gym Master Wife Ends Life In Krishnagiri | Sakshi
Sakshi News home page

టీచర్‌తో వివాహేతర సంబంధం.. భార్యను..!

May 4 2025 7:46 AM | Updated on May 4 2025 11:05 AM

Gym Master Wife Ends Life In Krishnagiri

 హోసూరులో జిమ్‌ మాస్టర్‌ దురాగతం 

హోసూరు(తమిళనాడు): ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ భర్త తప్పుదారి పట్టాడు, ప్రశ్నించిన భార్యను హతమార్చాడు. హోసూరు పారిశ్రామికవాడలో భార్యను హత్య చేశాడో భర్త. వివరాల మేరకు హోసూరు జూజువాడి ఉప్కర్‌ నగర్‌ రాజేశ్వరిలేఔట్‌కు చెందిన భాస్కర్‌ (34), భార్య శశికళ (33). గత 2018న ఫేస్‌బుక్‌లో పరిచయమై ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకు ఆరూష్‌ (4), శ్రీషా (2) అనే పిల్లలున్నారు. దంపతులు హోసూరులోని సీతారామ్‌దిన్న , కామరాజ్‌నగర్, జూజువాడి, రాజేశ్వరిలేఔట్‌ ప్రాంతాల్లో జిమ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు.   

టీచర్‌తో అక్రమ సంబంధం   
ఈ నేపథ్యంలో భాస్కర్‌కు ఓ టీచర్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఆమెకు అలసనత్తం ప్రాంతంలో అద్దె గదిలో ఉంచాడు. విషయం తెలుసుకొన్న భార్య శశికళ భర్తతో గొడవపడుతూ వచ్చింది.గత 30వ తేదీన రాత్రి భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో దుస్తులతో గొంతు పిసికి హత్య చేశాడు. మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు ముక్కులో రక్తం కారుతోందని, వైద్యం చేయాలని తెలిపాడు. పరిశీలించిన డాక్టర్లు శశికళ చనిపోయిందని ధృవీకరించారు. 

ఈ ఘటనపై శశికళ బంధువుల ఫిర్యాదు మేరకు సిఫ్‌కాట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని నింధితుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని క్రిష్ణగిరి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు.  హత్య చేసినట్లు రుజువు కావడంతో నిందితున్ని అరెస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement