
కటిహార్: బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రాక్టర్ ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
బాధితులంతా సుపౌల్‌కు చెందినవారని, వివాహ వేడుకకు హాజరై తిరిగి సొంతూరుకు వస్తుండగా ప్రమాదం జరిగిందని కటిహార్ ఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని వెల్లడించారు.