breaking news
Narendra Modi
-
వివేక్, మాధవన్‌పై ప్రముఖ నేత ఆగ్రహం.. సంపాదన కోసమే దేశమా?
ముంబై: నటులు ఆర్ మాధవన్ (మ్యాడీ),వివేక్ ఓబెరాయ్పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే విమర్శలు గుప్పించారు. భారత్‌పై అంత ప్రేముంటే విదేశాల్లో ఎందుకు నివసిస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారత్‌లో ప్రతీదీ అద్భుతంగా మార్చిందని భావిస్తే వాళ్లెందుకు విదేశాల్లో ఉంటున్నారని అన్నారు.ముంబైలో ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగం ‘మహారాష్ట్ర నవనిర్మాణ విద్యార్థి సేన’ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని వేలాది మంది పారిశ్రామికవేత్తలు విదేశాలకు వెళ్లిపోయారని అన్నారు. మోదీ బయోపిక్‌లో నటించి, ఆయన పాత్రను పోషించిన వివేక్ ఓబెరాయ్ కూడా ఇప్పుడు దుబాయ్‌లోనే నివసిస్తున్నారు. పీఎం మోదీని ప్రశంసించిన ఆర్ మాధవన్ ఎక్కడ ఉంటున్నారు? ఆయన కూడా దుబాయ్‌లోనే ఉంటున్నారు.మీకు భారత్‌పై అంత ప్రేమ ఉంటే పీఎం మోదీని అంతగా అభిమానిస్తే, దేశాన్ని మోదీ అభివృద్ధి చేస్తున్నారని నమ్మితే.. మరి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? తమ కుటుంబాలతో కలిసి దుబాయ్‌లో ఎందుకు నివసిస్తున్నారు? అని థాకరే నిలదీశారు.వారు ఇక్కడికి వస్తారు, ప్రభుత్వం స్పాన్సర్ చేసే ‘ధురంధర్’లాంటి సినిమాల్లో నటిస్తారు. ఆ తర్వాత మళ్లీ దుబాయ్‌కి వెళ్లిపోతారు’ అని ఆయన ఆరోపించారు. అయితే, తన కుమారుడి స్విమ్మింగ్ కెరీర్ కోసం కోవిడ్-19 మహమ్మారి సమయంలో తాను దుబాయ్‌కి మారినట్లు ఆర్ మాధవన్ గతంలో పేర్కొనగా, తన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు దుబాయ్ వెళ్లినట్లు వివేక్ ఓబెరాయ్ చెప్పారు. -
మోదీ పెద్ద మనసు.. తనను తిట్టిన అమ్మాయికి ‘కొత్త జీవితం’ ఇచ్చిన ప్రధాని!
సాక్షి,ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఆందోళనల్లో పాల్గొన్న ఓ మైనర్ బాలిక, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై సదరు బాలిక తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ పెద్ద మనసుతో తన కుమార్తెను క్షమించి, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని కొనియాడారు. ఈ సందర్భంగా తన కుమార్తెపై నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను పూర్తిగా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.చేతులు జోడించి ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాను. నా కుమార్తె చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ పెద్ద మనసుతో క్షమించారు. ప్రధాని కొత్త జీవితాన్ని ప్రసాదించడంతో ఆమె మళ్లీ జన్మించినట్లైంది’అని అన్నారు.కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో బాలిక ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గత వారం నోయిడా పోలీసులు ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో బాలిక పేరు రుచికా సింగ్, వయస్సు 25గా పొందుపరిచారు. అయితే ఆ ఎఫ్ఐఆర్లో తన కుమార్తె వివరాలు తప్పుగా ఉన్నాయని ఆమె తల్లి మోదీకి వివరించారు.మోదీపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఒకటే అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఆమెపై తప్పుడు పేరు, వయస్సుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తొలగించండి. అప్పుడు ఆమె ప్రశాంతంగా జీవించగలదు. ఇప్పుడు ఆమె మీ పర్యవేక్షణలో ఉంది. మైనర్ పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలనుకునే వారికి సులభ లక్ష్యాలుగా మారతారని పేర్కొంటూ, వారిపై సోషల్ మీడియాను నిషేధించాలని కూడా ఆమె ప్రధానమంత్రిని కోరారు.విద్యార్థుల నిరసనల సందర్భంగా తనపై చేసిన దూషణాత్మక నినాదాల విషయంలో, ప్రధాని మోదీ గత శుక్రవారం సంయమనం పాటించాలని, క్షమించాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో ఆయన దూషణలు ఎప్పటికీ దేనినీ పరిష్కరించవు అని పేర్కొంటూ వారిని శిక్షించడం కాకుండా సమాజం వారికి మార్గనిర్దేశం చేయాలని కోరారు.వారు తప్పుదారి పట్టిన పిల్లలు. వారికి సరైన మార్గాన్ని చూపించడం మన బాధ్యత. వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం లేదా వేధించడం వల్ల పరిస్థితులేమీ మారవు. నేను వారిని క్షమించాలనుకుంటున్నాను. సమాజం కూడా నా మాటను అంగీకరించాలని కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై బాలిక ప్రధానికి క్షమాపణలు చెప్పారు. నిరసన సమయంలో ఇతరుల ప్రభావంతోనే తాను ప్రధానమంత్రిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడానని ఆమె పేర్కొన్నారు. నా వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. నేను చేసిన పని క్షమించరానిది. నేను అభ్యంతరకరమైన మాటలు అన్నాను. ఇదే నా మొదటి, చివరి తప్పు. దేశం మొత్తానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నా ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆమె చెప్పింది. -
భోగాపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్‌వే’... ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
-
మోదీజీ.. సారీ!
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై జరిగిన నిరసన ప్రదర్శనల్లో ప్రధాని మోదీని దుర్భాషలాడిన బాలిక ఒకరు క్షమాపణలు చెబుతూ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇతరుల ప్రభావానికి లోనై తాను అలా మాట్లాడానని, పోస్టు చేసింది కూడా తాను కానని, తన వయసు పదిహేనేళ్లు మాత్రమేనని శనివారం విడుదలైన వీడియోలో ఒక బాలిక చెబుతూండటం కనిపించింది. అయితే ఈ వీడియో అసలుదా? కాదా? అన్నది తాము నిర్ధారించలేదని పీటీఐ స్పష్టం చేయడం గమనార్హం. ప్రధాని మోదీ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో మాట్లాడుతూ తప్పుదారి పట్టిన పిల్లలు కొందరు తనను దుర్భాషలాడారని, వారిని క్షమించి సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరముందని వ్యాఖ్యానించిన కొంత సమయానికే క్షమాపణలు కోరుతున్న బాలిక వీడియో విడుదల కావడం గమనార్హం. బాలిక ఆ వీడియోలో మాట్లాడుతూ... ‘‘జూలైలో ఫ్రెండ్స్‌తో కలిసి కన్నాట్‌ప్లేస్‌కు వెళ్లా. అక్కడ కొంతమంది ప్రధానిని తిడుతూ, అభ్యంతరకరమైన భాష వాడుతూ కనిపించారు. వాళ్లు నన్ను ప్రభావితం చేశారు. తమ మాటలను రిపీట్ చేయాల్సిందిగా ప్రోత్సహించారు. దాంతో నేను కూడా వారిలా మాట్లాడాను’’ అని చెప్పింది. ‘‘నేనిప్పుడు తలెత్తుకోలేకపోతున్నాను. దేశం మొత్తాన్ని, ప్రతి ఒక్కరిని నన్ను క్షమించమని కోరుతున్నా’’ అని కూడా ప్రార్థించినట్లు ఆ వీడియోలో ఉంది. ‘‘ఇదే తన తొలి, చివరి తప్పిదమని, ఇలాంటి పని ఇంకోసారి చేయను’’అని వివరించింది. ప్రధానిని తిడుతూ చేసిన వీడియో ఆధారంగా పోలీసులు ఇప్పటికే ఒక కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నోయిడాలో ఆ వీడియోపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా... అది ఆ తరువాత ఢిల్లీకి బదిలీ అయ్యింది. -
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘రన్‌వే’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రన్‌వేగా, యువత భవిష్యత్తుకు లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు, సెమీకండక్టర్ పరిశ్రమలకు శనివారం ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు, శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి, శ్రీకూర్మనాథ స్వామి, పైడితల్లి అమ్మవారిని స్మరించారు. భోగాపురం వేదిక నుంచి సుమారు రూ.17,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేశారు. ఈ రోజు ప్రారంభమైన విమానయానం, రహదారులు, సెమీకండక్టర్లు, స్వచ్ఛ ఇంధనం, పోర్టులు, రైల్వేలు, కనెక్టివిటీ తదితర రంగాలకు సంబంధించిన ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశను చూపుతాయని ప్రధాని పేర్కొన్నారు. సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన నేలపైనే కొత్త విమానాశ్రయం ఏర్పాటు కావడం గొప్ప విశేషమన్నారు. ఎయిర్‌పోర్టును ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్‌నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ దేశంలో పౌర విమానయాన రంగం గత 12 ఏళ్లలో విశేషంగా అభివృద్ధి చెందిందని ప్రధాని వివరించారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు పెరిగిందన్నారు. ఉడాన్ పథకంతో సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించామని చెప్పారు. ఉడాన్ రెండో దశకు రూ.29 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కాశీలో ప్రారంభించిన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఇప్పుడు అమృత్‌సర్‌కు విస్తరించి, అక్కడి నుంచి 25కుపైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం కల్పించిందని తెలిపారు.బ్లూ ఎకానమీకి ప్రోత్సాహం దేశంలో బ్లూ ఎకానమీ బలోపేతానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తుందని చెబుతూ విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు తీర ప్రాంతాన్ని కోస్టల్ ఎకనామిక్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల ఆధునికీకరణతో పాటు, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నం–రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే సహా రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణంలో ఉన్నాయని, రైల్వే రంగంలో సుమారు లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. రైల్వే నెట్వర్క్ పూర్తిగా విద్యుదీకరణ కావడంతో పాటు, 70కుపైగా స్టేషన్లు ఆధునికీకరణ జరుగుతోందని వివరించారు.» పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టులు, విమానాశ్రయాల అనుసంధానంతో సమగ్ర లాజిస్టిక్స్ వ్యవస్థ ఏర్పడుతుందని, దీనివల్ల పరిశ్రమలు, రైతులు, వ్యాపార రంగానికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతలో అపారమైన ప్రతిభ ఉందని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని ప్రధాని కొనియాడారు. ఈ ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు సెమీకండక్టర్ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడం ఈ దిశగా కీలక ముందడుగని చెప్పారు.» సాఫ్ట్వేర్ రంగంతో పాటు తయారీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీంతో భవిష్యత్ సాంకేతిక ఉద్యోగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని అన్నారు.» కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్ల రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని, గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి దీనికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. నక్కపల్లిలో భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకు కేంద్రం పూర్తి మద్దతు అందిస్తోందని, దీనివల్ల దేశంలో ప్రముఖ ఔషధ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని తెలిపారు. » ఈ సందర్భంగా 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు, యువతులు ప్రదర్శించిన థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించడం గర్వకారణమని కొనియాడారు. భారత గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ఇది అద్భుత నిదర్శనమని పేర్కొన్నారు.ఇక ఉత్తరాంధ్ర వైపు వలసలు : చంద్రబాబుఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం, ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం ద్వారా ఈ ప్రాంతంలో రివర్స్ మైగ్రేషన్‌కు నాంది పలికిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో ఒకటిగా నిలబెడుతుందని చెప్పారు. గత రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టుల ద్వారా రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని, వీటి ద్వారా 5.57 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశముందని వెల్లడించారు. రూ.2,784 కోట్ల వ్యయంతో ఎనిమిది ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నేరడి బ్యారేజ్‌కు అనుమతులు, నిధులు లభించాయని చెప్పారు. ఆగస్టు 14న గోదావరి జలాలు అనకాపల్లికి చేరనున్నాయని, అలాగే వంశధార–గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా చేపడతామని వెల్లడించారు. పర్యాటకం, ఔషధ పరిశ్రమలు, అరుదైన ఖనిజాలు, జాతీయ రహదారులు, ఆధ్యాత్మిక పర్యాటకం వంటి రంగాల అభివృద్ధితో ఉత్తరాంధ్ర దేశంలో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ రైల్వే జోన్, అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారానికి ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మోదీ వంటి నాయకుడిని చూడలేదని చంద్రబాబు కొనియాడారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని, అలాగే 2028 నాటికి అమరావతి తొలిదశ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటించారు. » విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణికుల సౌకర్యాలు, చెక్–ఇన్ హాల్, ఆధునిక సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయం మాస్టర్ ప్లాన్, భవిష్యత్ ఏవియేషన్ హబ్, ఏరోసిటీ అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ప్రధానికి వివరించారు.థింసా నృత్యంతో స్వాగతంఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వం, ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రతిబింబించే ప్రదర్శనలను ప్రధాని సందర్శించారు. సంప్రదాయ థింసా నృత్యాలను తిలకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి పొందూరు ఖాదీ శాలువాతో సత్కారం చేయగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను బహూకరించారు.ప్రధానిని తిడుతుంటే కన్నీళ్లొచ్చాయి.. పవన్ కల్యాణ్‘భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కొందరు ఇష్టానుసారం తూలనాడుతుంటే గుండె కదిలిపోయింది. కన్నీళ్లు వచ్చాయి. బాధ పడ్డాను. దేశం కోసం నిస్వార్థంగా కష్టపడే వారికి ఇవా బహుమతులు అనిపించింది’అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో రూ.17,900 కోట్ల అభివృద్ధి పనులు మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా భారతదేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి మోదీ. ఆయన వెనుక మనం ఉండాలన్నారు.ఏపీకి గ్రోత్ ఇంజన్ ఉత్తరాంధ్ర : లోకేశ్ కొందరు ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఎయిర్ పోర్ట్ వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ రోజు కేవలం ఒక ఎయిర్ పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు. మన మోదీ వికసిత్ భారత్, మన సీబీఎన్ విజన్ కలిసిన రోజు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దూసుకెళ్లే రోజు అని అన్నారు.అభివృద్ధికిది సింహద్వారం.. రామ్మోహన్నాయుడు ఒకప్పుడు అవకాశాల కోసం ప్రపంచం వైపు ఉత్తరాంధ్ర చూసేదని.. ఇప్పుడు ప్రపంచం మనవైపు చూసేలా భోగాపురం విమానాశ్రయం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని » ఎయిర్‌పోర్టు ప్రారంభంతో పాటు ప్రధాని మోదీ రాష్ట్రంలోని పలు రోడ్లు, పారిశ్రామిక సంస్థలను రిమోట్‌తో ప్రారంభించారు. » విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్–టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. » కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. » అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలు ప్రారంభం» కర్నూలు–ఐవీరెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, పెంచలకొన–యరపాడు మధ్యనున్న బ్రిడ్జికి శంకుస్థాపన.» ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం–దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లైన్ల బైపాస్ రోడ్లు ప్రారంభించారు. -
E 20పై యుద్ధం.. ప్రధాని నివాసం ముట్టడి..?
-
విద్యార్థులకు కావాల్సింది క్షమాభిక్ష కాదు మోదీజీ: రాహుల్
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ఆరోపించారు. విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష కాదు, క్షమాపణ చెప్పాలని అన్నారు."భారత్ విద్యార్థులకు ఆయన క్షమాభిక్ష అవసరం లేదు. వారికి ఆయన క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంది" అని రాహుల్ చెప్పారు. విద్యార్థులు తనపై చేసిన వ్యాఖ్యలను "క్షమిస్తున్నాను" అన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాహుల్ ఇలా అన్నారు.నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను రాహుల్ కలుసుకుని ఓదార్చారు. ఈ భేటీ చెన్నై సమీపంలోని మహాబలిపురంలో జరిగింది. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు దుఃఖంలో ఉండటాన్ని చూడటం కంటే బాధాకరమైనది మరొకటి లేదని రాహుల్ అన్నారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతి యువకుడు, యువతి వెనుక జీవితాంతం బాధ మోసే కుటుంబం ఉంటుందని చెప్పారు.పలుసార్లు ప్రశ్నపత్రాల లీకులు జరగడం, పరీక్షలు రద్దు కావడం, ఎన్నో సంవత్సరాల సన్నాహాలు ఒక్క రాత్రిలో వృథా కావడం విద్యా వ్యవస్థలోని వైఫల్యాన్ని బయటపెట్టాయని అన్నారు. నిజాయితీగా లేని వ్యవస్థలో విద్యార్థులు నిజాయితీగా శ్రమించాలని అడుగుతున్నారని చెప్పారు.ప్రశ్నపత్రం లీక్ కారణంగా భవిష్యత్తు కోల్పోయిన ఒక్క విద్యార్థినైనా, దుఃఖంలో ఉన్న ఒక్క తల్లిదండ్రినైనా ప్రధాన మంత్రి కలవలేదని ఆయన విమర్శించారు. విద్యార్థులు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న వేదనను కేంద్ర ప్రభుత్వం గుర్తించడంలో విఫలమైందని అన్నారు. -
అసెంబ్లీ సాక్షిగా నీ తల్లిని తిడితే.. సీఎంని చేశావ్.. మోదీకి రాచమల్లు సలహా
-
ఈ20కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాల్సిందే: కేజ్రీవాల్
ఢిల్లీ: ఈ20 పెట్రోల్ కి వ్యతిరేకంగా ఢిల్లీలో శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ సదస్సు నిర్వహించింది. మాజీ సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆఫ్‌లైన్, ఆన్లైన్లో కలిసి మొత్తం 6 లక్షల మందికి పైగా హాజరయ్యారు. E20ని వ్యతిరేకిస్తూ ప్రధానికి రాసిన పిటిషన్ పై 2 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. ప్రధానికి మంగళవారం (ఆగస్టు 4) స్వయంగా పిటిషన్ అందజేస్తానని కేజ్రీవాల్ అన్నారు. లాఠీఛార్జీకి భయపడని 100 మందితో కలిసి వెళ్తానని తెలిపారు. ఈ20కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాల్సిందేనని తెలిపారు.‘‘ఎవరూ భయపడొద్దు.. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయాలి. ఇథనాల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోతుంది, పాడవుతున్నాయి. ప్రభుత్వం స్టడీ చేసిన రిపోర్ట్ బయటపెట్టాలి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, ఆయన కొడుకులకు మేలు చేసేందుకే ఇథనాల్ తీసుకువచ్చారు.అమెరికాతో చేసుకున్న ట్రేడ్ డీల్‌లో భాగంగా దేశంపై ఇథనాల్ ను రుద్దుతున్నారు. మేం చదువుకున్నవాళ్లం.. మీ డిగ్రీ ఎలాగో నకిలీది.. మా డిగ్రీ అసలైంది. ఆర్టీఐ ద్వారా నా డిగ్రీ వివరాలు కూడా తీసుకున్నారు. ప్రశ్నిస్తే FIR లు నమోదు చేస్తున్నారు. E20లో ఏదో గందరగోళం ఉంది. లేదంటే ప్రశ్నిస్తే మాట్లాడాలి కానీ కేసులు పెట్టడం ఏంటి?పెట్రోల్, డీజిల్ వాహనాల కొనుగోలు ఆపేయండి. కొంటే ఎలక్ట్రిక్ వాహనాలను కొనండి. E20 విషయంలో ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు పెడుతున్నాం. 1.ప్రతి పెట్రోల్ బంక్ లో వినియోగదారుడికి ఆప్షన్ ఉండాలి. 2. ప్యూర్ పెట్రోల్ కంటే, E20 పెట్రోల్ ధర తక్కువగా ఉండాలి. 3.పెట్రోల్ ధరను 84 రూపాయలే ఉంచాలి’’ అని అన్నారు.పెట్రోల్ ధర రూ. 125 అయ్యేది!ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 135 డాలర్లకు పెరిగినప్పుడు, ఇంధనంలో ఇథనాల్ కలపకపోతే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.125 అయ్యేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇథనాల్ వల్ల, వినియోగదారులు లీటరుకు రూ. 94.77 మాత్రమే చెల్లించారని తెలిపింది. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజీ, ఇంజిన్ పై ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరణ ఇచ్చింది. చమురు సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ఇథనాల్ వినియోగం ఒక మార్గమని తెలిపింది. -
బీజేపీకి గుడ్‌బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
షెహజాద్ పూనావాలా.. బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.షెహజాద్ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్ బయోలో మోదీకి తాను “లైఫ్ లాంగ్ ఫాలోవర్” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.జెన్‌జీ నిరసనల ఎఫెక్ట్‌తోనేనా?షెహజాద్ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్‌జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్‌జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఎవరీ షెహజాద్ పూనావాలా?1987 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్ పూనావాలా, తల్లి యాస్మిన్ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరున్న తహసీన్ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్‌లో పంచాయితీతో.. షెహజాద్ పూనావాలా తొలుత కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.బీజేపీకి బలమైన వాయిస్.. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్‌సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్‌గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్‌జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. -
పవిత్రమైన ఉత్తరాంధ్రకు రావడం నా అదృష్టం: ప్రధాని మోదీ
సాక్షి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని స్పీచ్‌ను ఎంపీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలుగులో తర్జుమా చేసి ప్రజలకు వినిపించారు.పవిత్రమైన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ పైడితల్లి అమ్మవారికి, సింహాచలం అప్పన్నకు నమస్కరిస్తున్నా. స్వర్ణాంధ్ర విజన్‌కు ఇవాళ కీలక రోజు. రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను శ్రీకారం చుట్టాం. ఇవాళ రెండు రికార్డులు సృష్టించాం. ఒకటి ఎయిర్పోర్ట్.. రెండోది థింసా నృత్యం. 13 వేల మందికిపైగా గిరిజన పిల్లలు ఉత్సాహం చూస్తే ముచ్చటేసింది. .. ఇది అల్లూరి సీతారామ రాజు నడియాడిన నేల. గిరిజన హక్కుల కోసం ఆయన తన జీవితాన్నిఅంకితం చేశారు. ఇదే భూమిపై ఇవాళ అభివ ల్యాంచ్‌ప్యాడ్ ప్రారంభమైంది. ఎయిర్‌పోర్టుల పేర్లను ఒక కుటుంబానికి పరిమితం చేయలేదు. అయోధ్య ఎయిర్‌పోర్టుకు వాల్మీకి, ఇవాళ అల్లూరి పేరు పెట్టుకున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 166కి చేరింది. చిన్న పట్టణాలకు నుంచి నగరాలకు ఎయిర్ సేవలు ఉన్నాయి. ఉడాన్ పథకం వల్ల ఎయిర్‌పోర్టుల సంఖ్య మాత్రమే పెరగలేదు.. ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ అమృత్సర్ వరకు విస్తరించింది. బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నాం. ఈ మొత్తం కోస్టల్ ఏరియాను అభివృద్ధి చేస్తున్నాం. మూలపేట, రామయపట్నం పోర్టులను నిర్మిస్తున్నాం. ఐటీ రంగంలో ప్రపంచానికి ఏపీ యువత తమ ట్యాలెంట్‌ను చూపిస్తున్నారు. ఏపీ యువత దేశానికి కూడా ఉపయోగపడాలి. ఒక్క ఫ్యాక్టరీతో ఏ గ్రోత్‌సెంటర్ నిర్మితం కాదు. ఇక్కడ గూగుల్ కూడా డేటా సెంటర్ నిర్మిస్తోంది. నక్కపల్లిలో ఫార్మ్ పార్క్ రాబోతోంది. విశాఖను ఇండస్ట్రీయల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. భోగాపురం విమానాశ్రయం.. అభివృద్ధికి కొత్త ద్వారం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొత్త అవకాశాలు వస్తాయి. విమాన రవాణా విస్తరణతో పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతాయి. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
పని YSRCP ది.. ప్రచారం చంద్రబాబు ది.. బాబుకు ఇచ్చిపడేసిన వైఎస్ జగన్
-
మోదీజీ క్షమించండి.. ఇదే నా మొదటి, చివరి తప్పు బాలిక వీడియో వైరల్
-
ప్రధాని మోదీ ‘ఫ్రంట్ కెమెరా’పై ప్రముఖ నటుడు ఎగతాళి!
న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు, షో హోస్ట్ శేఖర్ సుమన్ తన ‘శేఖర్ టునైట్’ టాక్ షో తాజా ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రంట్ కెమెరా వీడియో, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఢిల్లీ పోలీసుల లాఠీచార్జి, ‘జెన్-జీ’ భాషపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. 63 ఏళ్ల ఈ నటుడు తనదైన శైలిలో రాజకీయ, సామాజిక పరిణామాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ప్రధాని మోదీ తొలిసారిగా ఫ్రంట్ కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోపై స్పందిస్తూ ‘రావాల్సిన 'అచ్ఛే దిన్ వస్తాయో లేదో కానీ, మంచి రీల్స్ మాత్రం వస్తాయి’ అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ ఉదంతాన్ని ప్రధాని ‘ఘోర పాపం’ అని అభివర్ణించడంపై స్పందిస్తూ, ఆ వేదనను వ్యక్తంచేయడానికి మూడు నెలల సమయం పట్టిందని విమర్శించారు. ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధం జెన్-జీ ట్రెండ్స్‌లోని ‘సిచ్యుయేషన్‌షిప్’ మాదిరిగా మారిందని, ఎన్నికలప్పుడు లవ్ బాంబింగ్ చేసి, ఆ తర్వాత గోస్టింగ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఇక విద్యార్థుల నిరసనలను అణచివేయడానికి ఢిల్లీ పోలీసులు ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసుల నినాదమైన 'శాంతి, సేవ, న్యాయం' అనే మూడింటి ఎక్స్పైరీ తేదీ ఆరోజే ముగిసిందని చురకలంటించారు. సుదీర్ఘ ఆందోళనల తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఆయనకు విద్యాశాఖతో పాటు రక్షణ శాఖ బాధ్యతలు కూడా అప్పగించాలని వ్యంగ్యంగా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ‘నాన్న జ్ఞాపకం’ చోరీ.. తెచ్చిస్తే రూ. 5 లక్షలు, ఉద్యోగం! -
భోగాపురం ఎయిర్ పోర్ట్ టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ
సాక్షి, భోగాపురం: ప్రధాని నరేంద్ర మోదీ.. భోగాపురం పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతకుముందు ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మోదీకి ఏపీ గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
మోదీ మంచి మనసు.. రుచికా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జంతర్ మంతర్ నిరసనల్లో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు.. కేసు ఎదుర్కొంటున్న రుచికా సింగ్ తాజాగా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేసింది. తాను చేసింది ముమ్మాటికీ తప్పేనని అంటోంది. అదే సమయంలో రుచికా వ్యవహారంపై పరోక్షంగా ప్రధాని మోదీ స్పందించడమూ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వెంటనే ఈ ఎపిసోడ్లో మరికొన్ని ట్విస్టులు వెలుగు చూశాయి.. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా నోయిడాకు చెందిన రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. కొందరు యువకులు వీడియో తీస్తుండగా రెచ్చిపోతూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ప్రధానిపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 352, 353(1), 356(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం, ప్రజా శాంతికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. జంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు.మోదీ ఏమన్నారంటే..ఈ వివాదం మధ్య ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తనపై, తన దివంగత తల్లిపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చెప్పిన ఆయన.. యువత చేసిన తప్పులకు మార్పు అవకాశం ఇవ్వాలని సూచించారు. “నన్ను దూషించిన వారిని క్షమించాలనుకుంటున్నాను. పిల్లలు తప్పులు చేస్తారు. వారిని శిక్షించడం కంటే సరైన మార్గం చూపించడం సమాజం బాధ్యత” అని మోదీ అన్నారు. అవమానాలు ఏ సమస్యను పరిష్కరించవని, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాతే రుచికా క్షమాపణ వీడియో బయటకు రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026చేతులు జోడించి రుచికా క్షమాపణలుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రుచికా సింగ్ చేతులు జోడించి దేశ ప్రజలకు క్షమాపణలు కోరింది. “నేను చేసినది తప్పు. దేశం మొత్తానికి క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇది నా మొదటి, చివరి తప్పు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయను” అని ఆమె చెప్పింది. తాను అక్కడ ఉన్న కొందరి ప్రభావానికి లోనై ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొంది. అయితే ఈ వీడియో ఎప్పుడు తీశారనేది స్పష్టత రావాల్సి ఉంది.Ruchika Singh, a CJP protester who made abusive remarks against PM Narendra Modi, has issued an apology to the entire country.She claims that other people at the protest influenced and encouraged her to use abusive language. She has promised never to repeat such an act again.… pic.twitter.com/hNQULRZ8r1— Mukesh (@mksh_kgp) July 31, 2026వయసుపై వివాదంఈ వ్యవహారంలో మరో కీలక అంశంగా రుచికా వయసు మారింది. క్షమాపణ వీడియోలో ఆమె తన వయసు 15 ఏళ్లు అని చెప్పింది. అయితే పోలీసుల ఎఫ్ఐఆర్లో ఆమె వయసు 25 ఏళ్లుగా పేర్కొనడం గమనార్హం. దీంతో ఆమె అసలు వయసు ఎంత? అనే ప్రశ్నలు తలెత్తాయి. పోలీసులు ఆమె కుటుంబ వివరాలు, నేపథ్యాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.నేపథ్యంపై సోషల్ మీడియాలో చర్చఇదే సమయంలో రుచికా వ్యక్తిగత నేపథ్యంపై సోషల్ మీడియాలో పలు వాదనలు వైరల్‌గా మారాయి. ఆమె గతంలో ఓ సెలూన్లో నెయిల్ ఆర్ట్ శిక్షణ కోసం వెళ్లేదని, ఆధార్ కార్డు అడిగిన తర్వాత అక్కడికి వెళ్లడం ఆపేసిందని ఆ సెలూన్ యజమాని చెప్పినట్లు కొన్ని పోస్టుల్లో పేర్కొన్నారు. అలాగే ఆమె తన పేరు వేరుగా చెప్పిందని, ఆధార్ వివరాలు ఇవ్వలేదని కూడా కొన్ని వాదనలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అంశాలను అధికారికంగా ధ్రువీకరించలేదు. వాస్తవాలు పోలీసు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.భావ ప్రకటనా స్వేచ్ఛపై చర్చరుచికాపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రశ్నించారు. అభ్యంతరకర వ్యాఖ్యలను సమర్థించలేమని చెబుతూనే.. కేవలం వ్యాఖ్యల ఆధారంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని అన్నారు. అలాంటి సందర్భాల్లో పరువునష్టం వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించవచ్చని సూచించారు. అదే సమయంలో నిరసనకారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని కూడా కోరారు.రుచికా క్షమాపణలు, మోదీ స్పందన, ఆమె వయసుపై వివాదం, సీజేపీ స్పందన పోలీసుల దర్యాప్తు.. ఈ పరిణామాలతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. యువతకు మార్పు అవకాశం ఇవ్వాలన్న మోదీ సందేశం ఒకవైపు చర్చకు దారితీస్తుండగా.. చట్టపరమైన ప్రక్రియ మరోవైపు కొనసాగుతోంది. -
మణిహారం భోగాపురం
సాక్షి, న్యూఢిల్లీ / సాక్షి, విశాఖపట్నం : ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల టెర్మినల్‌ను పరిశీలించిన అనంతరం 11.30 గంటలకు జాతికి అంకితం చేస్తారు. ఉత్తరాంధ్ర ఊహలకు రెక్కలు తొడుగుతూ.. ఈ ప్రాంతానికి మణిహారంగా మారనుంది ఈ విమానాశ్రయం. ప్రారంభోత్సవం అనంతరం అదే వేదిక నుంచి రాష్ట్రంలోని రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నట్లు ప్రధాని కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, శనివారం ప్రధాని ప్రారంభించనున్న భారీ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్(ఓశాట్) ఫెసిలిటీ ప్లాంట్ ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. మొదటి విడత రూ.542.19 కోట్లు, రెండో విడత రూ.1,845.61 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ వాచ్‌లు, ఐఓటీ పరికరాలకు కావాల్సిన అధునాతన 2.5డీ, త్రీడీ చిప్ ప్యాకేజింగ్, టెస్టింగ్ సేవలను ఇక్కడ అందించనున్నారు. -
పీఎం–కిసాన్.. మరో ఐదేళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతన్నలకు ఆర్థిక మద్దతును పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు ప్రతిఏటా మూడు విడతల్లో పెట్టుబడి సాయం అందించే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) పథకాన్ని 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించాలని నిర్ణయించింది. రాబోయే ఐదేళ్లలో ఈ పథకం అమలుకు రూ.3.15 లక్షల కోట్లు కేటాయించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ శుక్రవారం సమావేశమైంది. 2026–2031 కాలానికి సంబంధించి వ్యవసాయంతోపాటు పునరుత్పాదక ఇంధనం, చమురు అన్వేషణకు భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాల వివరాలు, పథకాల గణాంకాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. పీఎం–కిసాన్తో సత్ఫలితాలు పీఎం–కిసాన్ పథకంలో ఆశించిన ఫలితాలు వస్తున్నట్లు గుర్తించారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని డెవలప్మెంట్ మానిటరింగ్, ఎవాల్యుయేషన్ ఆఫీస్(డీఎంఈఓ) నివేదిక ప్రకారం.. 92 శాతం మంది లబి్ధదారులు ఈ నగదును నేరుగా వ్యవసాయ పనులకు వినియోగించారు. 85 శాతం రైతులు తమ వ్యవసాయ ఆదాయం పెరిగిందని, ప్రైవేట్ అప్పులపై ఆధారపడటం తగ్గిందని చెప్పారు. పీఎం–కిసాన్ పథకం అమలుతో 2020–21 నుంచి 2025–26 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 9.65 శాతం, ఉత్పాదకత 10.53 శాతం మేర పెరిగినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫలితంగా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 21.18 శాతం వృద్ధి నమోదైంది. చమురు అన్వేషణకు ‘సముద్ర మంథన్’ దేశీయంగా చమురు, సహజ వాయువుల అన్వేషణ, ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో జాతీయ ఆఫ్‌షోర్ అన్వేషణ పథకం ‘సముద్ర మంథన్’కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుకు రూ.84,084 కోట్లు కేటాయించారు. సముద్రగర్భ అన్వేషణల ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను వెలికితీయవచ్చని అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆఫ్‌షోర్ టెక్నాలజీ పెంపు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుంది. దీర్ఘకాలిక ఇంధన భద్రత సాధన దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సౌర విద్యుత్‌కు ‘పీఎం సూర్య సరోవర్’ జలాశయాలపై తేలియాడే సౌర విద్యుత్ (ఫ్లోటింగ్ సోలార్ ఫొటోవోల్టాయిక్) ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ‘ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన(పీఎం–ఎస్ఎస్వై)’ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి రూ.5,070 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. 2026–27 నుంచి 2030–31 మధ్య ఈ ప్రాజెక్టులను మంజూరు చేస్తారు. 2032–33 వరకు ఆర్థిక సాయం కొనసాగిస్తారు. పూర్తయిన ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.కోటి చొప్పున కేంద్ర ఆర్థిక సాయం(సీఎఫ్ఏ) కింద అందజేస్తారు. ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనానికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు అందజేస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఈ) అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా జలాశయాలపై 102.18 గిగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ప్రస్తుతం 700 మెగావాట్ల సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త ప్రాజెక్టుల వల్ల భూమి కొరత సమస్యను అధిగమించవచ్చు. ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గడంతోపాటు 16 వేల నుంచి 17 వేల వరకు పూర్తిస్థాయి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. -
'అలాంటి వారికి మార్గనిర్దేశం చేయాలి': ప్రధాని మోదీ పిలుపు
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అంశంపై మరోసారి మాట్లాడారు. జంతర్‌మంతర్‌లో ఏం జరిగిందో దేశ ప్రజలంతా చూశారని అన్నారు. నిరసనలో కొందరు అసభ్యకరమైన పదాలు వాడారని అన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. అయినప్పటికీ అందరినీ తాను క్షమించానని ప్రధాని మోదీ వెల్లడించారు. సరికొత్త భారత్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తప్పుదోవ పట్టిన వారికి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని సూచించారు. కాగా.. నీట్ పేపర్ లీక్ కావడంతో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈ నిరసనను కొన్ని రాజకీయ పార్టీలు అవకాశంగా మార్చుకున్నాయి. కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలో హంగామా చేశారు. చివరికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇవాళ మరో వీడియో సందేశమిచ్చారు. Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026 -
రుచికా సింగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. క్రిమినల్ కేసుపై CJP సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ అంశంపై జరిగిన నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యువతి రుచికా సింగ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తీవ్రంగా తప్పుబట్టారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సమర్థించలేమని స్పష్టం చేసిన ఆయన, అలాంటి సందర్భాల్లో క్రిమినల్ చర్యలకు బదులుగా పరువు నష్టం దావా వంటి చట్టపరమైన మార్గాలను అనుసరించాలని సూచించారు.జూలై 23న జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న రుచికా సింగ్ ప్రధాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ పరిణామంపై స్పందించిన సౌరవ్ దాస్, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే విధంగా క్రిమినల్ చట్టాలను వినియోగించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.‘రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యలు తప్పు కావచ్చు. అవి చాలామందికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. కానీ కేవలం అలాంటి భాష వాడినందుకు ఒక యువతిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం సమంజసం కాదు. అలాంటి సందర్భాల్లో పరువు నష్టం దావా వంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. క్రిమినల్ విచారణ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది యువతకు ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన అన్నారు.అయితే యువ నిరసనకారులు తమ అసమ్మతిని వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించాలని, ఉపయోగించే పదాల విషయంలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని కూడా దాస్ సూచించారు. ప్రజాప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో పోలీసులు రాజకీయ ప్రయోజనాల కోసం తమ అధికారాలను దుర్వినియోగం చేయరాదని ఆయన హెచ్చరించారు. ‘క్రిమినల్ న్యాయ వ్యవస్థను ఇలాంటి సందర్భాల్లో వినియోగించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. పోలీసులు శాంతంగా వ్యవహరించాలి. యువతపై వేధింపులు ఆగాలి’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, ఘజియాబాద్‌కు చెందిన స్మృతి సింగ్ ఫిర్యాదు మేరకు జూలై 29న గౌతమ్ బుద్ధ నగర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో రుచికా సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రధానమంత్రి రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశాయని, ద్వేషాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసినవని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద కేసు నమోదు చేశారు.జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రకారం, నేరం ఎక్కడ జరిగినా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అనంతరం సంబంధిత అధికార పరిధి ఉన్న పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేస్తారు. నీట్ పేపర్ లీక్, పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన సీజేపీ ఆందోళన నేపథ్యంలో ఈ వివాదం చోటుచేసుకుంది. 36 రోజుల పాటు కొనసాగిన నిరసనలు కేంద్ర ప్రభుత్వం పార్టీ ప్రధాన డిమాండ్లను అంగీకరించిన అనంతరం జూలై 25న ముగిశాయి. -
ఫేస్బుక్ వివాదం.. కేంద్రం యాక్షన్!
భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్బుక్ పోస్ట్‌ను కొంతసేపు పరిమితం చేసిన ఘటన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థపై మరింత దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై.. మెటా గ్లోబల్ బృందాన్ని భారత్‌కు పిలిపించి.. సంస్థ విధానాలు, కంటెంట్ నియంత్రణ వ్యవస్థలపై వివరణ కోరాలని నిర్ణయించింది.మెటా ప్రతినిధులను ముఖ్యంగా అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయి?, వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలి?, అనే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, కంటెంట్ మోడరేషన్లో ఏమైనా పక్షపాతం ఉందా?, అనే అంశాలపై ప్రశ్నించనున్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజా శాంతి, సమాజంపై చూపించే ప్రభావం గురించి కూడా చర్చ జరగనుంది. దీంతో.. మెటా గ్లోబల్ బృందం వచ్చే వారం మధ్యలో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అనంతరం పార్లమెంటరీ కమిటీ ముందు కూడా హాజరుకానుందని సమాచారం.సోషల్ మీడియా సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు.. దేశ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి షేర్ చేసిన ఒక ఫేస్బుక్ పోస్టును తాత్కాలికంగా పరిమితం చేసింది. ఈ పోస్టులో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటన సాంకేతిక లోపం వల్ల జరిగిందని మెటా వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివరణపై కేంద్రం సంతృప్తి చెందలేదని సమాచారం.ఈ పరిణామాల తర్వాత ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖుల ఖాతాల నుంచి వచ్చే పోస్టులపై మరింత పర్యవేక్షణ ఉంటుందని మెటా తెలిపింది. ముఖ్యమైన ఖాతాల కంటెంట్‌ను సీనియర్ అధికారులు పలు స్థాయిల్లో పరిశీలించే విధంగా అదనపు భద్రతా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ కేంద్రానికి వివరించింది.ఇదే సమయంలో.. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన చిత్రాలు, ఏఐ ద్వారా రూపొందించిన తప్పుడు పోస్టులు ప్రచారం చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు కొన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కేసులు నమోదు చేశారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడంలో సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. సోషల్ మీడియా అధిక వినియోగం పిల్లలు, పెద్దల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వివిధ పథకాలకు 4,50,988 కోట్ల రూపాయల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన 5070 కోట్లు, ప్రధానమంత్రి కిసాన్ సన్మానిధికి 3,15,614 కోట్లు, ఖేలో ఇండియా పథకం నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీంకు 36441 కేటాయించింది. సముద్ర మంతన్ పథకానికి 84,084 కోట్ల రూపాయలు, యూని డైరెక్షనల్ ట్విన్ ట్యూబ్ టన్నుల్స్ నిర్మాణానికి 9779 కోట్ల రూపాయల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. -
భారత్‌కు జిన్‌పింగ్.. గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలి పర్యటన!
ఢిల్లీ: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే సెప్టెంబర్‌లో భారత్‌లో జరగనున్న బ్రిక్స్ (BRICS) సదస్సుకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 12–13 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు రావచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ పర్యటనపై భారత్ లేదా చైనా ప్రభుత్వాలు ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.షీ జిన్‌పింగ్ భారత్‌కు వస్తే.. 2020 గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఆయన చేసే తొలి భారత పర్యటనగా నిలుస్తుంది. చివరిసారిగా ఆయన 2019 అక్టోబర్‌లో భారత్‌ను సందర్శించారు. ఆ తర్వాత తూర్పు లడఖ్‌లో భారత్–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. కాగా, జిన్‌పింగ్ పర్యటనకు ముందు భారత్–చైనా మధ్య దౌత్య చర్చలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ త్వరలో చైనాలో పర్యటించి ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే, సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) సమావేశం, అనంతరం ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరగనున్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో భారత్–చైనా సరిహద్దు వివాద పరిష్కారానికి సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సరిహద్దు నిర్వహణ, ఉద్రిక్తతల నివారణ, పరస్పర విశ్వాసం పెంపు వంటి అంశాలపై రెండు దేశాలు ముందడుగు వేయాలని ప్రయత్నిస్తున్నాయి.#JUSTIN: Sources: Chinese President Xi Jinping is likely to visit India in September for the BRICS Summit in New Delhi, marking his first trip to India since the COVID-19 pandemic and the Galwan border tensions, sources said. Ahead of the summit, India and China are expected to…— India Today Global (@ITGGlobal) July 31, 2026మోదీ–షీ భేటీపై ఆసక్తిషీ జిన్‌పింగ్ బ్రిక్స్ సదస్సుకు హాజరైతే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశముంది. ఈ భేటీలో సరిహద్దు వివాదం, ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. అయితే, ప్రస్తుతం జిన్‌పింగ్ భారత్ పర్యటనపై అధికారిక ధృవీకరణ లేదు. ఢిల్లీ లేదా బీజింగ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ పర్యటన ఖరారైనట్లు భావించాల్సి ఉంటుంది. -
మరోసారి కేంద్ర క్యాబినేట్ భేటీ .. కీలక నిర్ణయాలు?
సాక్షి, ఢిల్లీ: ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) సమావేశం కానుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, తాజా బిల్లుల వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనుంది. కాగా నిన్న రాత్రి ప్రధాని మోదీ అత్యంత కీలకమైన భద్రతపై క్యాబినెట్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇంతలోనే క్యాబినేట్ మరోసారి సమావేశం కానుంది.ఈ రోజు జరగబోయే భేటీలో ఇటీవల ఆమోదం పొందిన జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు-2026, పేపర్ లీకేజీల నిరోధక బిల్లు వంటి కీలక అంశాలపై తదుపరి పార్లమెంటరీ వ్యూహాలను ఖరారు చేయనున్నారు.దానితో పాటు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల దిగుమతులకు ఆటంకం కలగవచ్చు. దేశంలోని రైతులకు రాబోయే రబీ సీజన్లో ఎరువుల కొరత రాకుండా, ప్రత్యామ్నాయ దేశాల నుంచి స్టాక్‌ను తెప్పించుకునే వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కాగా నిన్న జరిగిన భేటీలో పశ్చిమాసియాలో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులు భారత రక్షణ, ఆర్థిక రంగాలపై దాని ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయ నావికులకు, ప్రవాస భారతీయుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని ఆదేశించారు. వారి కుటుంబాలకు సమాచారం, అత్యవసర సహాయం అందించేందుకు ప్రత్యేక సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.అదే విధంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ముడిచమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినేట్ మరోసారి భేటీ కాబోతుంది.కాగా విపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ ఆగస్టు 3వరకూ వాయిదా వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. -
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. విపక్షాల నినాదాలు
పార్లమెంట్ సమావేశాలు అప్డేట్స్.. రాజ్యసభ వాయిదా.. రాజ్యసభ సోమవారానికి వాయిదా.. రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నిరసనలు లోక్‌సభలో విపక్షాల నిరసనలు.. మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా.. ఎంపీ వినూత్న నిరసనలు..రెండు కుండీలు పెట్టి అందులో డబ్బులు వేసిన ఎంపీలుహుండీ చోరీపై ఎంపీ వినూత్న నిరసనలు.స్వామీజీ గెటప్లోని వచ్చి చందా అడిగిన ఎంపీ పప్పూ యాదవ్.హుండీలో డబ్బులు వేసిన రాహుల్ గాంధీ. #WATCH | Delhi | Monsoon Session of the Parliament | Opposition MPs including Lok Sabha LoP and Congress MP Rahul Gandhi protest over the issue of alleged Ayodhya Ram Mandir donations embezzlement pic.twitter.com/1BXa6UiUuq— ANI (@ANI) July 31, 2026 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..పార్లమెంటు మకర ద్వారం వద్ద కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ధర్నావిద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించడాన్ని నిరసిస్తూ నినాదాలుకేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని నినాదాలుపార్లమెంటుకు అమిత్ షా రావాలని డిమాండ్అయోధ్య విరాళాల చోరీపై దర్యాప్తు జరపాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల డిమాండ్ -
మోదీపై అభ్యంతకర పోస్టులు.. మెటా హెడ్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలలో ప్రధాని మోదీకి అభ్యంకతరంగా పోస్టులు చేశారంటూ మోటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఇద్దరు బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీకి సంబంధించినటువంటి అభ్యంతరకరమైన, తప్పుడు కంటెంట్‌ను తమ ఫ్లాట్పారమ్లపై (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రసారం కావడానికి అనుమతించారని,అటువంటి పోస్టులను తొలగించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని అసభ్యకరంగా, అవమానకరంగా మరియు తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ చేయబడిన, డిజిటల్‌గా తారుమారు చేయబడిన అనేక వీడియోలు ,చిత్రాలు అందులో కనిపించాయని తెలిపారు.కాగా నీట్లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. దీంతో మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని డిమాండ్లను సైతం కేంద్రం ముందుంచింది. -
భారత్‌తో పోలుస్తావా?.. పాక్‌లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనల విషయంలో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆ దేశ అధికార వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి’’ అంటూ పాకిస్థాన్ పాలకులకు హితవు పలికారు. ప్రజల గొంతును అణచివేయడం కాకుండా.. వారి సమస్యలను వినే సంస్కృతి అలవర్చుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.పాకిస్థాన్‌లో ఇటీవల విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు చేపట్టిన నిరసనలపై భద్రతా బలగాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో విద్యార్థుల నిరసనలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు వంటి నిర్ణయాలు తీసుకుందని అలీమా ఖానుమ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆవేదనను వినడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ విషయంలో భారత్‌ను చూసి పాకిస్థాన్ ప్రభుత్వం నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు.‘‘భారత్‌లో విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ పాకిస్థాన్‌లో ప్రజలు ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు, బెదిరింపులే ఎదురవుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతును అణచివేయడం కాదు’’ అంటూ ఆమె మండిపడ్డారు. అధికార యంత్రాంగం ప్రజల హక్కులను గౌరవించకుండా వ్యవహరిస్తోందని, ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని అలీమా హెచ్చరించారు.అలీమా ఖానుమ్ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వ్యక్తమైంది. అధికార పక్షానికి చెందిన నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడగా, పాకిస్థాన్‌ను భారత్‌తో పోల్చడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ నేతలు మాత్రం ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే విమర్శలను అంగీకరించే సంస్కృతి అవసరమని వారు అభిప్రాయపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉండగా, ఆయన కుటుంబ సభ్యులు తరచూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను అణచివేస్తున్నారని, న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీమా ఖానుమ్ చేసిన "మోదీ సర్కార్‌ను చూసి నేర్చుకోండి" వ్యాఖ్యలు భారత్-పాకిస్థాన్ పోలికలకే కాకుండా, పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పరిస్థితులపై కూడా మరోసారి చర్చను రేకెత్తించాయి.ప్రస్తుతం ఈ అంశం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. కొందరు అలీమా ఖానుమ్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు భారత్‌ను ఉదాహరణగా చూపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా, ఆమె చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ రాజకీయాల్లో మరో కొత్త దుమారానికి తెరలేపాయి.నీట్ యూజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదంపై విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించి.. పరీక్ష రద్దు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివాదం తీవ్రం కావడంతో కేంద్రం విచారణలు, సంస్కరణలపై చర్యలు చేపట్టింది. విద్యార్థుల ఆందోళనలు కొనసాగిన నేపథ్యంలో ప్రభుత్వం–నిరసనకారుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులు తమ నిరసనలను విరమించినట్లు ప్రకటించారు. -
మోదీపై వ్యాఖ్యల వివాదం.. ఎవరీ రుచికా సింగ్?
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నీట్ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన యువతికి పెద్ద షాక్ తగిలింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆమెపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘రాజ్యాంగ పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు దెబ్బతీశాయని.. ప్రజా శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని’’ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న ఆ యువతి.. జూలై 23-24 తేదీల మధ్య ఈ వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. మోదీని గద్దె దిగిపోవాలని.. యువత ఆ పని చేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్ఫోన్లతో వీడియోలు తీసిన మరింత రెచ్చిగొట్టినట్లు కనిపించింది. అవి విపరీతంగా వైరల్ కావడంతో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్వచ్చందంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు.జీరో ఎఫ్ఐఆర్ నమోదుసుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జూలై 29న నోయిడాలోని ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా అవమానించడం ద్వారా ప్రజా శాంతికి భంగం కలిగించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, పరువునష్టం వంటి అంశాలపై అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో.. సదరు యువతి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ప్రజా శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆ వీడియోలో ఆమె ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. ఎవరీ అమ్మాయి?.. జంతర్ మంతర్ నిరసనల్లో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్‌గా గుర్తించారు. 25 ఏళ్ల రుచిక.. విద్యార్హతలు ఏంటో స్పష్టత లేదు. అయితే ఆమె మోడల్‌గా, ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె.. ఇలా అభ్యంతరక వ్యాఖ్యలతో దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.ఢిల్లీ పోలీసులకు బదిలీజంతర్ మంతర్ ప్రాంతం ఢిల్లీ పోలీసుల పరిధిలో ఉండటంతో నోయిడాలో నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసును ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఐఎఫ్ఎస్ఓ (Intelligence Fusion and Strategic Operations) పరిశీలిస్తోంది. నిరసనకు సంబంధించిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెను అరెస్ట్ చేశారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులుఈ వ్యవహారంలో ఇప్పటికే పలు సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన, పరువునష్టం కలిగించే కంటెంట్‌ను షేర్ చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ (X) వేదికకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి సంబంధిత పోస్టులను తొలగించడం లేదంటే వాటి యాక్సెస్‌ను నిలిపివేయడం, దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని కోరినట్లు సమాచారం. -
అనిశ్చితి వేళ అత్యయిక భేటీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో మళ్లీ రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడి విపరిణామాలు భారత్‌పై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయమై ప్రధాని మోదీ కీలక సమీక్ష జరిపారు. కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులను పలు అంశాలపై ప్రధాని ఆరా తీశారు. తన అధ్యక్షతన గురువారం ఢిల్లీలో జరిగిన భద్రతపై కేబినెట్ కమిటీ(సీసీఎస్) అత్యవసర సమావేశంలో ప్రధాని మోదీ ఇంధన అవసరాల కోసం కొనసాగుతున్న దిగుమతుల తీరుతెన్నులు, అవలంభిస్తున్న అంతర్జాతీయ విధానాలను సమీక్షించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్, హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్, షిప్పింగ్ మంత్రి శర్బానంద సోనోవాల్, పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురితోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హార్మూజ్ జలసంధి, నల్ల సముద్ర, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మార్గాల ద్వారా పెట్రోలియం, సహజవాయువు, ఎరువుల దిగుమతి తీరుతెన్నులపై కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్ని అనిశ్చితి, భద్రతపై దాని దుష్ప్రభావాలు, దేశీయంగా ద్రవరూప సహజ వాయువు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్, పెట్రో ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు భారత్ ఆ మేరకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి విడమర్చి చెప్పారు. ఎల్పీజీని విభిన్న దేశాల నుంచి సమీకరిస్తున్నామని, సరిపడా నిల్వలు దేశంలో ఉన్నాయని సోమనాథన్ వెల్లడించారు. రైతులుకు ఎల్లవేళలా ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆదేశించారు. హార్మూజ్ జలసంధి, సమీప సముద్ర జలాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే సరకు రవాణా నౌకల్లోని భారతీయ నావికులు, సిబ్బంది రక్షణపై మోదీ ఆరాతీశారు. భారతీయ సిబ్బంది యోగక్షేమాలను భారత్‌లోని వాళ్ల కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేసే యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని మోదీ సూచించారు. -
పదవి వదిలేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారండి
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో విద్యార్థులతో సంప్రదింపుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాను వినియోగించుకోవడంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకొని, దానికి బదులుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారా లని సూచించారు. నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరించడానికే సరిగ్గా సరిపోతారని ఎద్దేవా చేశారు. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని, దేశాన్ని నడిపే బాధ్యతను మరొకరికి అప్పగించాలని అన్నారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనను విరమించినప్పటికీ నిరసనకారులపై వేధింపులు ఆగడం లేదని దీప్కే ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన నిరసన కారుల ఆగ్రహం చల్లారలేదని తేల్చిచెప్పారు. యువత ఆగ్రహాన్ని బీజేపీ ఎందుకు అర్థం చేసుకో లేకపోతోందని ప్రశ్నించారు. -
లీకేజీ ముఠాలను వదలం: మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోల పరంపర కొనసాగుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ‘ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణ బిల్లు’ ఆమోదం పొందిన వేళ ప్రధాని మోదీ గురువారం రాత్రి ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో సెల్ఫీ వీడియో ఒకటి విడుదలచేశారు. ‘‘అత్యంత పటిష్టమైన పరీక్ష విధానాన్ని తీసుకొచ్చేందుకు అనుక్షణం శ్రమిస్తున్నాం. పేపర్ లీకేజీలు కోట్లాది మంది పరీక్షార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరంగా పరిణమించాయి. కోట్లాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పేపర్ లీకేజీ గ్యాంగ్‌లను, లీకేజీ మాఫియాను వదిలేది లేదు. నేను మాట ఇచ్చినట్లే శక్తివంతమైన పేపర్ల లీకేజీ నివారణ బిల్లును రూపొందించాం. అది ఇప్పుడు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందడం సంతోషకరం. పేపర్ల లీకేజీలపై మా పోరాటం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది’’ అని మోదీ హామీ ఇచ్చారు. -
'పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదిలే ప్రసక్తే లేదు'.. పీఎం మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదిలిపెట్టే ప్రసక్తే లేదనిస ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే పార్లమెంట్లో యాంటి పేపర్ లీక్ బిల్ పాస్ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియాలో మరో వీడియో రిలీజ్ చేశారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతాయని నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. కాగా.. ఈ ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీకైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా మరోసారి నిర్వహించారు. ఈ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు దిగింది, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే ఆధ్వర్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతో నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం యాంటి పేపర్ లీక్ బిల్‌ను తీసుకొచ్చింది. ఈ బిల్లుకు లోక్ సభ కూడా ఆమోదం తెలిపింది. Parliament passes a Bill that makes our examination system more robust! pic.twitter.com/OEvLKXoUaf— Narendra Modi (@narendramodi) July 30, 2026 -
యువతను ఆకట్టుకునే పనిలో బీజేపీ అగ్రనేతలు!
ఫేస్బుక్, ఎక్స్, వాట్సప్‌లకు ఇక కాలం చెల్లినట్లే! రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా బీజేపీ వారు ఇక ఇన్‌స్టా మార్గం పట్టనున్నారు. రీల్స్ రాజకీయమే భేషన్న ప్రధాని మాటలు వారిపై సీరియస్ ప్రభావమే చూపాయి. జెన్–జీ ప్రియ నేస్తం ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్ర మంత్రులు సహా కాషాయ పార్టీ నేతల విన్యాసాలు ఎంతమేరకు రక్తికట్టిస్తాయో చూడాలి మరి! కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుణ్యమా అని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలకు తమ రాజకీయాన్ని పండించుకునేందుకు కొత్త అస్త్రం దొరికింది. నిన్న మొన్నటివరకూ అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ సందేశాన్ని వినిపిస్తూ వచ్చిన కాషాయ పార్టీ నీట్ ప్రశ్న పత్రాల లీకేజీలపై విద్యార్థుల ఆందోళనల తరువాత రూటు మార్చింది. ఇన్‌స్టాగ్రామ్‌పై తన దృష్టిని కేంద్రీకరించింది. ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇన్‌స్టా సందేశం పంపడం, జెన్–జీని ఆకట్టుకోవాలంటే ఇదే మేలి మార్గమని ఆయన స్వయంగా ప్రకటించడం ఆ పార్టీ నేతల్లో జోష్ నింపిందని చెప్పాలి. అందుకేనేమో... ఒక్కరొక్కరుగా కేంద్ర మంత్రులు కూడా రీల్స్ చేయడం మొదలుపెట్టారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత కొత్త విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఓ నాలుగు పోస్టులు పెట్టారు అందులో. ప్రస్తుతానికి ఆయనకున్న ఫాలోయర్లు కేవలం 23 మంది మాత్రమే. మోదీ సందేశం, తనను విద్యాశాఖ మంత్రిగా నియమించడం, కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్‌తో చర్చలు, ప్రశ్న పత్రాల లీకేజీ విషయమై అధికారులతో చర్చలు మాత్రమే ఆయన పోస్టులు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, సీజేపీతో చర్చలు జరిపిన బీజేపీ నేత జేపీ నడ్డా, మాజీ మంత్రి జితేంద్ర సింగ్‌లు గతంలో వారానికి నాలుగైదు పోస్టులు మాత్రమే పెడుతూంటే.. తాజాగా ప్రతిరోజు బోలెడన్ని ఇన్‌స్టా పోస్టులు పెడుతున్నారు. ఇన్‌స్టాను వాడుకోండి అన్న ప్రధాని పిలుపునకు ముందు జేపీ నడ్డా ఇన్‌స్టాపై చివరగా పోస్టు చేసింది జూలై నాలుగున. అంతకు ముందు జూన్ 27న ఒక పోస్టు చేశారు. ఇప్పుడు మాత్రం రోజూ పోస్టులే పోస్టులు! పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా కొన్ని రోజులుగా ఇన్‌స్టా వేదికగా ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లుపై పలు పోస్టులు చేస్తున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ అంశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా వర్ణించిన రిజిజు చర్చకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలకు చేసిన విజ్ఞప్తులను రీల్స్‌గా పోస్ట్ చేశారు.చదవండి: నీలేకనికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఇన్‌స్టా బాట పట్టారు. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం సత్వర చర్యలకు దిగిందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హామీ ఇచ్చిందని ఆమె ఈ మధ్యే పోస్టు పెట్టారు. ఇక బీజేపీని డిజిటల్ మార్గం పట్టించిన ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మలవీయా కూడా జెన్–జీకి దగ్గరైన ఇన్స్టాగ్రామ్పైకి రాక తప్పలేదు. సీజేపీ నిరసనల్లో అసంబద్ధమైన నినాదాలు ఉన్నాయని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రశ్న పత్రాల లీకేజీలపై వారెవరూ మాట్లాడకపోవడాన్ని ప్రశ్నించారు.టాప్‌లో పీఎం... భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉన్నారు. పది కోట్ల మందికిపైగా ఫాలోయర్లు ఉండగా... సీజేపీ నిరసనల సందర్భంగా అర్ధ రాత్రి చేసిన సెల్ఫీ వీడియోతో ఫాలోయర్ల సంఖ్య సుమారు పది లక్షల మంది పెరిగారు. మూడు నెలల క్రితం భారతీయ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్‌కు 9.5 లక్షల మంది ఫాలోయర్లు ఉండగా సీజేపీ కొన్ని గంటల్లోనే ఈ సంఖ్యను దాటిపోయింది. తరువాత సీజేపీ హ్యాండిల్‌పై నిషేధం వేటు పడటం.. కోర్టు కేసుల తరువాత హ్యాండిల్ మళ్లీ దక్కడం తెలిసిన విషయమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ మంచి ఇన్ఫ్లుయెన్సర్.. కంగనా లైట్: అభిజిత్ దీప్కే
ప్రధాని నరేంద్ర మోదీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ మాంచి ఇన్ఫ్లుయెన్సర్ అంటూ ప్రశంసలు గుప్పించారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై జరిగిన ఆందోళనలు, కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంతో.. దీప్కే సెటైరిక్ వ్యాఖ్యలే చేశారు.రాజకీయ నేతగా కంటే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా బాగా రాణిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ.. ప్రధాని పదవి నుంచి తప్పుకుని ఆ రంగంలో కొనసాగాలంటూ వ్యంగ్యంగా సూచించారు. ఢిల్లీ నిరసనలు, అనారోగ్యం నుంచి కోలుకున్నాక తన స్వస్థలమైన మహారాష్ట్రకు తిరిగి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన దీప్కే.. ప్రధాని మోదీ మంచి ఇన్ఫ్లూయెన్సర్గా పని చేస్తున్నారని, అయితే దేశ పాలన బాధ్యతలను మరొకరికి అప్పగించాలని వ్యాఖ్యానించారు.🚨 BREAKING 🚨Abhijeet Dipke asks PM Modi to resign, & become full-time INFLUENCER 🤯🗣️"He is doing good as an influencer— I think he should STEP DOWN, & someone else should take over governance." pic.twitter.com/o2r8hoG9x0— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) July 29, 2026"మోదీ ఇప్పుడు ఇన్ఫ్లూయెన్సర్గా మారాలి. ఆ పని ఆయన చాలా బాగా చేస్తున్నారు. ప్రధాని పదవి వదిలి ఇంకొక నాయకుడు దేశాన్ని నడిపే అవకాశం ఇవ్వాలి" అని అన్నారు. నీట్ ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించినప్పటికీ.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తించి వేధిస్తున్నాయని దీప్కే ఆరోపించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టడం వెంటనే ఆపాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారని గుర్తుచేసిన దీప్కే.. అయితే మొదటి విచారణకే సీబీఐ న్యాయవాది హాజరు కాకపోవడంతో కేసు వాయిదా పడిందని ఎద్దేవా చేశారు. మాటలకు, చేతలకు పొంతన ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.అదే నిజమైతే హోం మంత్రి ఫెయిల్ అయినట్లే!పెల్లెట్ గన్స్ వాడడం నా కళ్లారా చూశా. చాలా మంది కళ్లు పోయాయి. బిహార్‌లో ఏకంగా ఏకే47 ఎక్కుపెట్టారు. కసబ్‌లాంటి ఉగ్రవాదులపై ఎక్కుపెట్టాల్సిన ఏకే-47ను విద్యార్థులపై గురి పెట్టారు. బీజేపీలోకి రమ్మని నన్ను బెదిరిస్తున్నారు. అమిత్ షా చెప్పడం వల్లే పెల్లెట్ గన్స్ వాడి ఉండొచ్చు. ఢిల్లీ పోలీసులు అమిత్‌షాకే రిపోర్ట్ చేస్తారు. ఇది అమిత్ షాకు తెలియదంటే హోం మంత్రిగా ఆయన ఫెయిల్ అయినట్లే!. 'ఆగ్రహం ఇంకా చల్లారలేదు'కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా.. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఉన్న ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదని దీప్కే అన్నారు. ఆగ్రహం వ్యక్తిగతంగా మంత్రి మీద కాదని, ప్రభుత్వ వైఖరిపైనేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం యువత మనోభావాలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. విద్యార్థులపై వేధింపులు కొనసాగితే ఉద్యమం మరింత పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభిస్తామని దీప్కే స్పష్టం చేశారు. "ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. దేశ భవిష్యత్తు. భవిష్యత్తును ఇలా ఇబ్బంది పెడితే.. అవసరమైతే ఈ ప్రభుత్వాన్నే మార్చే స్థాయిలో ఉద్యమం చేస్తాం" అని హెచ్చరించారు.పెల్లెట్ గన్స్.. చర్యలు తీసుకోవాలిజంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించిన ఘటనపై కూడా దీప్కే స్పందించారు. ఆదేశాలు ఇచ్చింది ఎవరైనా సరే.. అది కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయినా, మరెవరైనా అయినా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రధాన్‌కు సన్మానం చేయడంపై.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్లో ఆయనకు బీజేపీ సభ్యులు సన్మానం చేయడాన్ని కూడా దీప్కే తప్పుబట్టారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో రాజీనామా చేసిన మంత్రిని సత్కరించడం సరికాదని వ్యాఖ్యానించారు.కంగనా.. లైట్నీట్ ఉద్యమంపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దీప్కే.. ఆమెను "పార్ట్‌టైమ్ రాజకీయ నాయకురాలు"గా అభివర్ణించారు. తాను సీరియస్ రాజకీయ నాయకుల వ్యాఖ్యలకే స్పందిస్తానని చెప్పి ఆమె విమర్శలను తేలికగా కొట్టిపారేశారు. -
‘విద్యార్థులకు న్యాయం జరగాలి’
పార్లమెంట్ సమావేశాలు అప్డేట్స్.. రాహుల్‌కు కౌంటర్..నిశికాంత్ దూబే వ్యాఖ్యలుఅమిత్ షాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను దూబే తీవ్రంగా ఖండించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరికి భయపడరు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే అమిత్ షాకు భయపడుతున్నారు.దేశాన్ని విభజించాలని కోరుకునే దేశ వ్యతిరేక శక్తులే అమిత్ షాకు భయపడుతున్నాయి.ప్రజలు, ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసంతోనే అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్పెల్లెట్ గన్స్‌పై చర్చించాలని పట్టుఅమిత్ షా సభకు రావాలంటూ నినాదాలు.చర్చకు అంగీకరించని ప్రభుత్వంవిద్యార్థులకు న్యాయం చేయాలి: రాహుల్రాహుల్ గాంధీ కామెంట్స్..విద్యార్థులకు న్యాయం జరగాలి.విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ ఉన్నత స్థాయి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలి.రాజకీయ జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి.విద్యార్థుల హక్కులు, భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.Students deserve justice. An independent SC monitored high powered committee must be constituted to probe brutalities against our students. pic.twitter.com/pZATUeAjwC— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2026 కాంగ్రెస్ వాయిదా తీర్మానం..రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై చర్చించాలని డిమాండ్ పార్లమెంట్ వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా..కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంపార్లమెంటు ద్వారం వద్ద ప్రతిపక్ష పార్టీల ధర్నా అయోధ్య విరాళాల చోరీ పైన దర్యాప్తు చేయాలని నినాదాలుఉభయసభల్లో చర్చకు నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీఅయోధ్య విరాళాల చోరీపై స్వతంత్ర ఆడిటింగ్ దర్యాప్తు జరగాలని నినాదాలుచందా చోర్.. అధికారం నుంచి గద్దె దిగాలని ప్రతిపక్ష నేతల నినాదాలు#WATCH | Delhi: Congress MPs including Priyanka Gandhi Vadra and others hold a protest at Makar Dwar of the Parliament, against Union Home Minister Amit Shah over 'police action' against CJP protestors on 20th July. pic.twitter.com/zmuqaWOt6n— ANI (@ANI) July 30, 2026 -
దేవుడి విరాళాలే కాపాడలేదు పేపర్ లీక్ ఎలా అరికడతారు..?
-
పేపర్ లీక్ తర్వాత పెట్రోల్ పోరు..కేజ్రీవాల్ సన్నాహాలు
న్యూఢిల్లీ: పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం (E20)పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ సమన్వయకన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ ఆందోళనలకు మద్దతు తెలిపిన ఆయన, తాజాగా ఈ20 విధానానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2023కి ముందు తయారైన వాహనాల్లో ఈ20 వాడకం సురక్షితమేనా అని తాను 29 ఆటోమొబైల్ కంపెనీలను ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వంపై భయంతో ఏ కంపెనీ కూడా లిఖితపూర్వకంగా స్పందించలేదని అన్నారు.సాంకేతికంగా ఈ విధానం వల్ల వాహనాలు దెబ్బతింటాయని, మైలేజ్ తగ్గుతుందని కంపెనీల అధికారులు అనధికారికంగా అంగీకరించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్లాంట్లు మూసివేయిస్తామని, ఈడీ దాడులు చేయిస్తామని కేంద్రం నుంచి బెదిరింపులు వస్తున్నందునే వారు బయటకు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. దేశంలో 2023కి ముందు కొనుగోలు చేసిన దాదాపు 30 కోట్ల వాహనాలను మోదీ ప్రభుత్వం పనికిరాకుండా చేస్తోందని ఆరోపించారు. ఇథనాల్ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని, పైగా నీటి వనరులు కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు.శనివారం తలపెట్టిన టౌన్‌హాల్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారని, అనుమతుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. పోలీసులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం ఈ20 విధానాన్ని శాంతియుతంగా వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజలే తరగబడతారని ఆయన హెచ్చరించారు. -
‘దిల్ కా యాంగిల్’ మార్చుకోండి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెన్ జెడ్ తరాన్ని, వారి మనసులను గెలుచుకోవాలనుకుంటే కెమెరా యాంగిల్స్ కాకుండా ‘దిల్ కా యాంగిల్’మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా సూచించారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల వీపులపై పడే ప్రతి లాఠీ దెబ్బ వారి కంటే ఎక్కువగా ప్రభుత్వ ప్రతిష్టకే హాని కలిగిస్తుందని తేల్చి చెప్పారు. మంగళవారం లోక్‌సభలో పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విద్యార్థులపై బాష్పవాయువు ప్రయోగించి, లాఠీలతో విరుచుకుపడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.యువతుల దుస్తులు చింపేసి అవమానించడం, కనికరం లేకుండా కొట్టించడం ఏమిటని మండిపడ్డారు. దేశ యువతపై పెల్లెట్ గన్లు, ఏకే–47లతో కాల్పులు జరపడం రాక్షసత్వం కాదా? అని నిలదీశారు. ప్రభుత్వం దృష్టిలో విద్యార్థులు ఉగ్రవాదులా? అని ధ్వజమెత్తారు. ఈ రోజు ఈ ప్రశ్నలను కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశం మొత్తం అడుగుతోందని అన్నారు. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.దేశంలోని యువతను ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అడిగారు. వారి గొంతుకలను అణచివేసే హక్కు ఎవరు ఇచ్చారు? అంటూ దుయ్యబట్టారు. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో దాడి చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దేశమంతా ఇదే ప్రశ్న అడుగుతోందని వెల్లడించారు. మోదీ సత్య మార్గంలో నడవాలి పేపర్ లీకేజీలను అరికట్టడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనను ప్రియాంకా గాంధీ తోసిపుచ్చారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల పనితీరు ఇప్పటికే చాలా పేలవంగా ఉందని గుర్తుచేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాన్ని నిందించడం, డొల్ల రాజకీయ క్రీడలు ఆడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నేటి కొత్త తరం ఎంతో అవగాహన కలిగి ఉందని, అబద్ధాలను గుర్తించగల అపారమైన సామర్థ్యాన్ని వారికి ఉందని వెల్లడించారు. యువత హృదయాలను గెలుచుకోవాలంటే ప్రధాని మోదీ సత్య మార్గంలో నడవాలని ప్రియాంకా గాంధీ సూచించారు. మోదీ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.‘‘నిజాన్ని అంగీకరించండి, బాధ్యత తీసుకోండి, పటిష్టమైన చర్యలు చేపట్టింది. నిపుణులను సంప్రదించండి. లోపాలకు తావులేని నూతన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయండి. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కలి్పంచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలి. దేశంలో విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను విస్తరించాలి. అప్పుడే పిల్లలు ఉజ్వల భవిష్యత్తును కలలు కనగలరు’’అని స్పష్టంచేశారు. విద్యార్థులను బలవంతంగా వీధుల నుంచి తొలగించవచ్చేమో గానీ వారి ప్రశ్నలను మాత్రం తొలగించలేమని ప్రియాంకా గాంధీ తేల్చి చెప్పారు. -
పేపర్ లీక్ బిల్లు చరిత్రాత్మకం
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’చరిత్రాత్మకమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావాలన్న అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసిందని తెలిపారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ బిల్లు విద్యార్థులు, యువత ప్రయోజనాలు కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, మంగళవారం చర్చ ప్రారంభమైంది. మంత్రి జితేంద్ర సింగ్ చర్చకు శ్రీకారం చుట్టారు.ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల భారీ జరిమానా వంటి కఠినమైన శిక్షలు విధించేలా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను రూపొందించిన సంగతి తెలిసిందే. బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి వరకు చర్చ కొనసాగింది. నిరసన వ్యక్తంచేసిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని విపక్ష సభ్యులు తప్పుపట్టారు.ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లును సమరి్థంచారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పేపర్ లీకేజీలను అరికట్టడానికి పటిష్టమైన చట్టం తీసుకొస్తుండడం కీలక పరిణామం అని వెల్లడించారు. అనంతరం చర్చ బుధవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యులది రాజకీయ ప్రసంగం: రిజిజు ప్రతిపక్షాలు పేపర్ లీక్ నిరోధక బిల్లు గురించి కాకుండా ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. మొత్తం చర్చ బిల్లు యోగ్యతపై కేంద్రీకృతమై ఉండాల్సిందని అన్నారు. ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులు బిల్లు గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయాలు చేశారని అన్నారు. అందరూ రాజకీయ ప్రసంగాలు చేశారని ఆక్షేపించారు. సభలో ఇలా చేయడం సరైంది కాదన్నారు. -
ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ఈ లేఖలో కోరారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు మురుగునీటి నిల్వ/డ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆ సమాధానం ఇచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి మాట్లాడుతూ, కావేరీ నదిపై ఏదైనా నిర్మాణాన్ని చేపట్టే ముందు కర్ణాటక రాష్ట్రం ఇతర దిగువ రాష్ట్రాల (తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి) అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పులో స్పష్టంగా ఎక్కడా పేర్కొనలేదని సమాధానమిచ్చారు.అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సమాధానం తీవ్ర నిరాశకు గురిచేసిందని సీఎం విజయ్ పేర్కొన్నారు. అంతరాష్ట్ర నీటి వివాదాలలో ఇప్పటికే స్థిరపడిన చట్టాలు మరియు చట్టపరమైన సూత్రాలను పరిశీలించకుండానే కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారని విజయ్ విమర్శించారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జరిగిన ఆలమట్టి డ్యామ్ వివాదంలో, దిగువన ఉండే రాష్ట్రం యొక్క అనుమతి ఖచ్చితంగా అవసరమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.కావేరీ నీటి వివాదాల ట్రిబ్యునల్ అవార్డు, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఉంటే తప్ప, మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుకు ఎటువంటి పరిపాలనాపరమైన లేదా చట్టపరమైన అనుమతులు మంజూరు చేయకుండా చూడాలని సీఎం విజయ్ ప్రధానమంత్రిని కోరారు. అలాగే, 2018లో సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ తీర్పును సమర్థించినప్పుడు, రాష్ట్రాలు తమ పరిధిలోని నీటిని ట్రిబ్యునల్ ఆదేశాలకు లోబడి మాత్రమే నియంత్రించుకోవచ్చని స్పష్టం చేసిందని పేర్కొన్నారు.గతంలో కేరళకు చెందిన పాంబార్ హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విషయంలో కూడా దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉమ్మడి ఒప్పందాలు అవసరమని ట్రిబ్యునల్ పేర్కొన్న విషయాన్ని విజయ్ గుర్తు చేశారు. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యసభలో ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని, దిగువ రాష్ట్రాల హక్కులను రక్షించాలని ఈ ప్రాజెక్టుపై సమగ్ర చట్టపరమైన, సాంకేతిక పరిశీలన జరపాలని డిమాండ్ చేశారు. -
మోదీకి మెటా క్షమాపణలు.. మోదీ వీడియో డిలీట్.. అసలు కారణమిదే!
-
నీలేకనికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి.. ఎందుకంటే!
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ముఖం లేని సంపన్నుడు (ఫేస్‌లెస్ బిలియనీర్) అంటూ నీలేకనిపై గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్నారు. గతంలో విమర్శలు చేసిన వ్యక్తికి ఇప్పుడు కీలక బాధ్యతలు అప్పజెప్పడం మోదీ రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని దుయ్యబట్టారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం మోదీ ఏమైనా చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.''నందన్ నీలేకనికి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి. మీ రాజకీయాలకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకరిని 'ముఖం లేని బిలియనీర్' అని ముద్ర వేసి, మీ ప్రభుత్వం విఫలమైనప్పుడు అదే వ్యక్తికి భారతదేశ పరీక్షా విధానాన్ని సంస్కరించే బాధ్యతను అప్పగించలేరు. ఇది నందన్ నీలేకని సామర్థ్యాన్ని ప్రశ్నించడం గురించి కాదు, మేము ఎల్లప్పుడూ ఆయన సామర్థ్యాలను గుర్తించాము. ఇది రాజకీయ కపటత్వం, జవాబుదారీతనం గురించిన విషయం. మన నాయకులు స్థిరంగా ఉండాలి, దేశానికి సేవ చేసే వారిని గౌరవించాల''ని ఎక్స్‌లో హరిప్రసాద్ పేర్కొన్నారు.నీలేకణికి ముఖం వచ్చిందా? "ప్రధానిగారూ... ఇప్పుడు నందన్ నీలేకణికి ముఖం వచ్చిందా? లేక అప్పట్లో చేసిన ఆరోపణలే ఇప్పుడు అర్థరహితమయ్యాయా? ఆ ఆరోపణలు నిజమే అయితే కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఆయన చేతుల్లో ఎలా పెడుతున్నారు? అవి అబద్ధమైతే, బహిరంగ వేదికపై ఒక ప్రతిభావంతుడిని అవమానించినందుకు ఎప్పుడు క్షమాపణ చెబుతారు?" అని హరిప్రసాద్ ప్రశ్నించారు."ఇది నాయకత్వం కాదు. ప్రతిపక్షంతో ఉన్నారని దేశ ప్రతిభను అవమానించడం, తర్వాత తమ ప్రభుత్వ వైఫల్యాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అదే ప్రతిభను ఆశ్రయించడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం. నందన్ నీలేకణి సామర్థ్యంపై మాకు ఎలాంటి సందేహం లేదు. ప్రశ్నించాల్సింది ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ నిబద్ధతనే" అని హరిప్రసాద్ విమర్శించారు.నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారం రేపిన కలకలం నేపథ్యంలో పరీక్షల్లో సంస్కరణల కోసం హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నందన్ నీలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్‌ను నియమించినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పటిష్ట, పారదర్శక పరీక్ష విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలు ఇస్తుందని వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో పరీక్షల విశ్వసనీయతను మరింత పెంచేలా చర్యలు చేపడతామన్నారు.చదవండి: ప్రధాని మోదీకి మాజీ ఐఏఎస్ వింత విజ్ఞప్తినందన్ నీలేకణి యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తొలి ఛైర్మన్‌గా పనిచేసి, ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ ఆధార్ రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, బీజేపీ నేత హెచ్ఎన్ అనంత్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. -
కేసులు ఎత్తివేయకపోతే తీవ్ర పరిణామాలు.. కేంద్రానికి CJP మరో వార్నింగ్
-
మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై మెటా వివరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి వాటికి. అయితే ఫేస్బుక్ నుంచి ఆ వీడియోలు కాసేపు కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు తొలగించారంటూ ఫేస్‌బుక్‌పై నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఈ ‘తాత్కాలిక’ వ్యవహారంపై మెటా వివరణ ఇచ్చింది. ఆ వీడియోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెబుతూ.. దాన్ని పునరుద్ధరించామని కూడా వెల్లడించింది.నీట్ వివాదంపై కొనసాగిన విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని మోదీ జులై 23న ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జెన్ జీ విద్యార్థులతో మోదీ చేసిన తొలి ప్రత్యక్ష సంభాషణగా ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది.అయితే జులై 28 తెల్లవారుజామున కొంతసేపు ఈ వీడియో భారతీయ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది. వీడియో స్థానంలో ‘‘చట్టపరమైన అభ్యర్థన కారణంగా మీ ప్రాంతంలో ఈ మీడియా అందుబాటులో లేదు’’ అనే సందేశం కనిపించింది. దీంతో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.మెటా ఏమంది?వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని స్పష్టం చేసింది. పొరపాటున వీడియోను పరిమితం చేశామని, గుర్తించిన వెంటనే దాన్ని పునరుద్ధరించామని తెలిపింది. వీడియోను తొలగించడానికి కారణమైన ప్రక్రియలో తప్పిదం జరిగిందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని మెటా పేర్కొంది.భగ్గుమన్న బీజేపీ, అభిమానులుప్రధాని మోదీ అధికారిక ఖాతాలో ఉన్న వీడియోను ఫేస్బుక్ పరిమితం చేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది భారతీయులకు చేరాల్సిన ప్రధానమంత్రి సందేశాన్ని ఒక సోషల్ మీడియా సంస్థ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగానికి చెందిన నేతలు మెటాను ట్యాగ్ చేస్తూ పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తారు. కంటెంట్ నియంత్రణ పేరుతో రాజకీయ పక్షపాతం చూపుతున్నారా? అనే చర్చకు ఈ ఘటన కారణమైంది.జెన్ జీ ఉద్యమం సమయంలో వీడియోనీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల నిరసనల సమయంలో ప్రధాని మోదీ ఈ వీడియో విడుదల చేశారు. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వీడియోకు భారీగా వ్యూస్ రావడంతో పాటు యువతలో చర్చకు దారితీసింది. ఇలాంటి సమయంలో వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడం మరింత ఆసక్తిని రేపింది.వివాదం టు వివరణ వరకుసోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. ఇన్నేళ్లలో పోస్ట్ చేసిన తొలి సెల్ఫీ వీడియో ఇదే కావడం గమనార్హం. అదీ నీట్ నిరసనలతో జెన్ జీ చేసిన ఆందోళనలపై కావడంతో ప్రపంచవ్యాప్తంగా దానిని కోట్ల మంది వీక్షించారు. అయితే ఉన్నట్లుండి ఆ వీడియో ఎందుకు తొలగించబడిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చట్టపరమైన అభ్యర్థన కారణమా? అనే ప్రశ్నా తలెత్తింది. అయితే మెటా తాజాగా ఇచ్చిన వివరణతో ఇది సాంకేతిక పొరపాటేనని తేలింది. ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో మళ్లీ ఫేస్బుక్లో అందుబాటులోకి వచ్చింది.మెటాకు కేంద్రం నోటీసులుమెటా క్షమాపణలు చెప్పినప్పటికీ.. కేంద్రం మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియో తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) స్పందించింది. ఈ అంశంపై వివరణ కోరుతూ మెటా గ్లోబల్ హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
LIVE: మళ్లీ అదే రిపీట్ అవుతుంది..!
-
లోక్‌సభలో పేపర్‌లీకేజీల బిల్లు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ వంటి కీలక పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో ఉద్యమించిన విద్యార్థిలోకాన్ని శాంతింపజేసేందుకు, లీకేజీ నేరగాళ్ల వెన్నులో వణుకుపుట్టేలా అత్యంత కఠిన శిక్షలు, అత్యధిక జరిమానాలతో నూతన చట్టానికి తుదిరూపునిచ్చి సంబంధిత బిల్లును మోదీ సర్కార్ సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పరీక్షలు(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు,2026ను ప్రధానికార్యాలయానికి సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టారు. బిల్లు ప్రతిపాదించేముందు నిబంధనల ప్రకారం సీనియర్ విపక్ష సభ్యులైన సౌగతా రాయ్(టీఎంసీ), మనీశ్ తివారీ(కాంగ్రెస్), ఎన్కే ప్రేమచంద్రన్(ఆర్ఎస్పీ)లను బిల్లుపై మాట్లాడాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. దానికి వాళ్లు ముందుకురాకపోవడంతో ఇక బిల్లును ప్రవేశపెట్టాలని సహాయమంత్రి జితేంద్రను స్పీకర్ కోరడంతో ఆయన బిల్లును సభముందుకు తెచ్చారు. వెంటనే స్పీకర్ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు తెస్తున్న బిల్లు ఇది. మీరు నినాదాలు ఆపేసి బిల్లుపై చర్చలో పాల్గొంటే బాగుంటుంది. చర్చ వేళ మీరు ఇచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది’’ అని స్పీకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్‌లో అవకతవకలకు పాల్పడే వాళ్లను ప్రత్యేక చట్టాల కింద శిక్షించేందుకు మోదీ సర్కార్ 2024లో పబ్లిక్ ఎగ్జామ్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం తెచ్చింది. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇతర ప్రభుత్వ సంస్థలు చేపట్టే పరీక్షల పేపర్లను లీక్‌చేసే వాళ్లను, ముఠాలను ఈ చట్టనిబంధనల కింద శిక్షిస్తున్నారు. తాజాగా నీట్ లీకేజీ ఉదంతం, విద్యామంత్రిగా ధర్మేంద్ర రాజీనామా డిమాండ్లు, విద్యార్థి నిరసనోద్యమంలో మోదీ సర్కార్ చట్టసవరణ చేస్తూ కొత్త బిల్లును తేవడం తెల్సిందే.బిల్లులో ఏముంది? → అక్రమ పద్దతులను అనుసరిస్తూ పోటీపరీక్షల ప్రశ్నపత్రాలను వ్యక్తిగతంగా లీక్‌చేసిన నేరగాళ్లకు కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టగా పదేళ్ల శిక్ష పడేలా బిల్లులో ప్రతిపాదనలు పొందుపరిచారు. ఈ నేరగాళ్లకు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. → వ్యక్తిగతంగా కాకుండా ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత నేరం చేసిన వాళ్లకు గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు. వీళ్లకు గరిష్టంగా రూ.10 కోట్ల జరిమానా విధిస్తారు. → 2024లో అమల్లోకి వచ్చిన పాత చట్టం ప్రకారం పేపర్ లీకేజీ వ్యక్తిగతం నేరగాళ్లకు మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్ష విధించేవారు. వ్యవస్థీకృత నేరగాళ్లకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి జరిమానా విధిస్తారు. వీటిని పెంచుతూ సవరణ బిల్లును తెచ్చారు.→ లీకేజీ సంబంధిత కేసుల సత్వర విచారణ కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదైనా సెషన్స్ కోర్టును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా ఏర్పాటుచేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు.→ కేసును రోజువారీగా కోర్టులో విచారిస్తూ, ఆ కేసులో నేరాభియోగం(చార్జ్‌షీట్) దాఖలైన మూడు నెలల్లోపు కేసు విచారణ ముగించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేసు తీవ్రత దృష్టా అవసరమైతే ప్రత్యేక టాస్క్ఫోర్స్నుఏర్పాటుచేయొచ్చు.→ పరీక్షల నిర్వహణ కోసం అవసరమైతే ఇతర విభాగాల సాయం తీసుకోవచ్చు.→ పరీక్ష కేంద్రాలు, పరీక్షార్థుల తనిఖీ, బయోమెట్రిక్ నమోదు, భద్రతా ప్రమాణాలు, సీట్ల కేటాయింపు, ప్రశ్నపత్రాల కూర్పు, పేపర్ల లోడింగ్, ఇని్వజిలేషన్లకు సంబంధించి కొత్త నిబంధనలు,ప్రమాణాల రూపకల్పనకు సంబంధించి బిల్లులో ప్రతిపాదనలుచేశారు→ పేపర్ లీక్ చేయడం, ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్, నకిలీ వెబ్సైట్ల రూపకల్పన, నకిలీ ఐడీ కార్డులను జారీచేయడం ఇలా 15 అనైతిక చర్యలను నేరాలుగా పేర్కొన్నారు. నేడు చర్చ! వరసబెట్టి వాయిదాలపర్వంతో ముగుస్తున్న లోక్‌సభ సెషన్లో తొలిసారిగా మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్ట సవరణ బిల్లు–2026 ను మంగళవారం లోక్‌సభో చర్చించనున్నారు. చర్చ కోసం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను స్పీకర్ బిర్లా ఒప్పించడంతో చర్చ సాధ్యంకానుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సభలో బిల్లుపై ఏడు గంటలపాటు చర్చించే వీలుంది. -
ప్రధాని సభకు జన సమీకరణ బాధ్యత సచివాలయ ఉద్యోగులదే
సాక్షి, అమరావతి: ఆగస్ట్ 1న విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలను తరలించే బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నెత్తిన పెట్టింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ సభకు మండలాల వారీగా ఎంత మందిని తరలించాలనే విషయంపై అధికారులకు టార్గెట్లు పెట్టారు. దీంతో ఎమ్మెల్యేల టార్గెట్ల మేరకు..సచివాలయ ఉద్యోగులకు ఒక్కొక్కరు ఎంతమందిని సభకు తరలించాలో పేర్కొంటూ ఆయా మండలాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తమ పరిధిలోని 4 మండలాలతో పాటు రాజాం అర్బన్ ప్రాంతం నుంచి 1,500 మందిని తరలించాలని హుకుం జారీ చేశారు. ఆయా ఉద్యోగులు 1న ఉదయం 4 గంటలకే ఎంపీడీవో ఆఫీసు కంట్రోల్ రూంలో హాజరై జనాల తరలింపులో పాల్గొనాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
నెగ్గాల్సిన ఇతర పరీక్షలు
యాభై రోజులుపైగా ఢిల్లీలో మహోధృతంగాసాగి, దేశం మొత్తాన్ని సుడిగాలిలా చుట్టేసిన జంతర్ మంతర్ ఉద్యమం ఉపశమించిన మర్నాడే ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల సంస్కరణల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని ఆధ్వర్యాన ఆరుగురు సభ్యుల టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. అంతేకాదు... పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పబ్లిక్ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టారు. కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలెట్టి చకచకా సాగుతున్న ఈ పరిణామాలు... ఆగ్రహంతో రగులుతున్న జెన్ జీ తరాన్ని దగ్గర చేసుకోవటానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాల పర్యవసానమే. నీట్ పేపర్ లీకయిందనీ, మరోసారి ఆ పరీక్ష నిర్వహణ తప్పదనీ తేలిన వెంటనే ఇంతే వేగంగా స్పందించివుంటే బహుశా ఈ స్థాయిలో ఆందోళన జరిగివుండేది కాదేమో! ఆ మాటకొస్తే ఎన్నో యేళ్లుగా ఈ లీకులు వినబడుతూనే ఉన్నాయి. కానీ వ్యవస్థల్లో కదలిక లేదు. 2024 నీట్ ప్రశ్నపత్రం లీక్ తర్వాత మాత్రం ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. అది ఇచ్చిన నివేదిక అతీగతీ ఏమైందో తెలియదు. ఇంత నిస్తేజంగా ప్రభుత్వాలున్నప్పుడు ఉద్యమాలు వెల్లువెత్తడంలో ఆశ్చర్యం లేదు. మన దేశంలో సమస్యేమంటే కేంద్రం ఒక్కటే కాదు... రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లీకుల విషయంలో నిర్లిప్తంగానే ఉంటాయి. జంతర్ మంతర్ ఉద్యమం ఒకపక్క సాగుతుండగానే పంజాబ్‌లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షల అక్రమాలు బయటపడ్డాయి. ఇక ఎన్డీయే కూటమి ఏలుబడిలోనే సాగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియే పెద్ద కుంభకోణంగా మారింది. నోటిఫికేషన్ విడుదలనాడే స్పోర్ట్స్ కోటా నియామకాలకు అర్హత పరీక్ష అవసరం లేదంటూ రెండు జీవోలు తీసుకురావటం ఆ ప్రభుత్వ బరితెగింపునకు చిహ్నం. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఏపీ విద్యామంత్రి లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. నందన్ నిలేకని విద్యాధికుడు. ఐటీ రంగంలో పేరెన్నికగన్నవారు. గతంలో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం దేశంలో సంక్షేమ పథకాల అమలుకోసమంటూ తీసుకొచ్చిన ఆధార్ కార్డుల రూపకర్త ఆయనే. నిలేకని మాదిరే ఇతర సభ్యులు సైతం వారి వారి రంగాల్లో నిష్ణాతులు. పరీక్షల నిర్వహణకు ఇప్పుడ నుసరిస్తున్న విధానాల్లోని లోటుపాట్లు అధ్యయనం చేసి, ఎలాంటి సంస్కరణలు అవసరమో వీరు సూచిస్తారు. అడుగడుగునా చోటుచేసుకోవటానికి ఆస్కారం ఉన్న అవకతవకలనూ, అనైతిక పద్ధతులనూ నివారించటానికి ఏం చేయాలో చెబుతారు. వీటన్నిటికన్నా ముందు అసలు పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వంటి జాతీయ సంస్థ అవసరమా అనే సంగతి నిగ్గుదేల్చటం అవసరం. ఒక సంస్థకు దాని సామర్థ్యానికీ, వనరులకూ మించిన బాధ్యతల్ని అప్పగించటం సరైందేనా? ఆలోచించాలి. రెండేళ్లనాటి రాధాకృష్ణన్ కమిటీ నివేదికలోని అంశాలేమిటో, దాని సిఫార్సులపై తీసుకున్న చర్యలేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులకు లేదా? కాక్రోచ్ ఉద్యమం సాగుతుండగానే 2024 నీట్ లీక్ ప్రధాన నిందితుడిపై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని సీబీఐ ప్రకటించటం మరో వైచిత్రి. ఇక విద్యార్థులపై అత్యంత ఘోరంగా బలప్రయోగానికి పూనుకున్నవారిపైనా చర్యలుండాలి.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇకపై అవసరమైన చర్యలు నిరంతరం తీసుకుంటూనే ఉంటుందని ప్రధాని చెప్పటం హర్షించదగ్గది. ఇది కేంద్ర స్థాయిలో మాత్రమే కాదు... రాష్ట్రాల స్థాయిలో కూడా జరగాలి. ఇతర రాష్ట్రాల మాటెలవున్నా తమ ఏలుబడిలోని ప్రభుత్వాలైనా జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత ఎన్డీయే పెద్దలకుంది. ప్రధాని హామీ కంటితుడుపు చర్య మాత్రమేనని, రాష్ట్రాల్లో కూడా కాక్రోచ్ల స్థాయిలో ఉద్యమిస్తే తప్ప డీఎస్సీ అవకతవకల వంటివి పట్టించుకోబోరన్న సంకేతాలు వెళ్లరాదు. అందుకే దేశంలో యువత మనసు గెలవాలంటే నెగ్గాల్సిన పరీక్షలు చాలానే ఉన్నాయని కేంద్రం గుర్తించాలి. -
ఢిల్లీలో పెల్లెట్ గన్స్ బీహార్ లో AK-47 తో కాల్పులు.. రాహుల్ గాంధీ సూటి ప్రశ్న
-
విద్యార్థులపైకి తూటాలా.. మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్
ఢిల్లీ: కేంద్రంలోని మోదీ సర్కార్ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్, బీహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారని రాహుల్ మండిపడ్డారు. విద్యార్థుల పట్ల మొత్తం వ్యవస్థ అత్యంత కఠినంగా, అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్రంపై నిప్పులు చెరిగారు.విద్యార్థులపై పోలీసుల చర్యలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా రాహుల్.. ‘బీహార్‌లో నిరసన చేస్తున్న విద్యార్థులపై ఏకే-47 తూటాలు ప్రయోగించారనే వార్తలు వస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులపై దాడులు, కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.छात्रों के ख़िलाफ़ पूरा का पूरा सिस्टम ही जानलेवा है।खबर आ रही है कि बिहार में प्रदर्शन कर रहे छात्रों पर AK-47 से गोलियाँ चलाई गई हैं और सैकड़ों छात्रों को गिरफ़्तार करके उनपर FIR की जा रही है।मोदी जी, कहाँ गया आपका वादा कि छात्रों पर कोई FIR नहीं की जाएगी और उन्हें रिहा कर… https://t.co/c7zdyyeLA0— Rahul Gandhi (@RahulGandhi) July 27, 2026ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారని, బీహార్‌లో ఏకే-47లు ప్రయోగించారంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ.. ఎక్కడ చూసినా ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించడం లేదని, సంస్కరణలు చేపట్టే సామర్థ్యం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. దేశంలోని విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి కానీ విద్యార్థులపైన కాదు అని డిమాండ్ చేశారు.అయితే, పోలీసుల చర్యలు చట్టపరమైన పరిస్థితుల నేపథ్యంలోనే జరిగాయని, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. బీహార్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఓ పోలీసులు అధికారి ఏకే-47 పట్టుకుని నిరసనకారులపైకి ఎక్కుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసింది. -
‘కాక్రోచ్’ ఉద్యమం కుదిపేసిన రాజకీయాలు.. అమరావతి వరకు సెగ!
రాజకీయాలలో ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నది ఒక అభిప్రాయం. అన్నిసార్లు కాకపోయినా, కొన్నిసార్లు బొద్దింకలు కూడా తిరగబడతాయన్న సత్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పక్షాన యువత రుజువు చేసింది. ఎంత బలాఢ్యుడైనా ఆ తిరుగుబాటుకు తలొగ్గక తప్పదని రుజువైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్వం దేశానికే ఒక స్పూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి లీక్‌లు జరిగినా, లేదా స్కామ్‌ల ఆరోపణలు ఆధారాలతో సహా బయటపడినా సంబందిత బాధ్యులు పదవి నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ యువత ఆందోళన తేల్చి చెప్పింది.కేంద్రంలోనేనా ఇలా రాజీనామాలు జరగవలసింది? మరి రాష్ట్రాలలో జరిగే లీక్‌లు, ఇతర కుంభకోణాల పరిస్థితి ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా తెరపైకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణ, టీచర్ల ఎంపికలో అవకతవకలు, స్పోర్ట్ కోటా టీచర్ల ఎంపికలో అక్రమాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారసహింతంగా ఆరోపణలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. బహుశా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తున్న యువతపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శకు గురయ్యారు.కాక్రోచ్ ఉద్యమానికి కాంగ్రెస్ తదితర విపక్షాలు రంగంలోకి దిగడంతో తీవ్రరూపం దాల్చింది. ఒకరకంగా రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ప్రధాని ఇంటిముందు ధర్నాకు దిగడంతో బీజేపీ కంగుతిన్నట్లనిపించింది. సీజేపీతో చర్చలకు సిద్దమని బీజేపీ కూడా చెప్పవలసి వచ్చింది. రాహుల్ గాంధీపై విమర్శలు చేసినా, బీజేపీ కొంత డిఫెన్స్‌లో పడినట్లయింది. కాక్రోచ్ ఉద్యమంతో పాటు, కాంగ్రెస్ ధర్నా ప్రభావం వివిధ రాష్ట్రాలలో కూడా పడింది. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యాయి. వారికి పోటీగా బీజేపీ కూడా ఎదురుదాడి చేయడానికి యత్నించింది.ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇదో గొడవగా మారింది. తెలంగాణలో రెండు పార్టీలు కర్రలతో ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్‌పై బీజేపీ దాడికి యత్నించడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయినా, ఈ అవకాశం ద్వారా తమ ఉనికి కోసం ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.23 లక్షల మంది విద్యార్ధులు మెడికల్ కాలేజీలలో సీట్ల నిమిత్తం రాసిన నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వైనం, ఆ తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ చేసిన ఒక అనవసర వ్యాఖ్యతో దేశంలో కొత్తగా పుట్టుకువచ్చిన క్రాకోచ్ జనతాపార్టీ యువతను ఆకర్షించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి కొందరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కాని తొలి నీట్ పరీక్ష రద్దు కావడంతో సుమారు ఇరవైమంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించినప్పటికీ, నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వీరు కోరారు.ఇలా వివిధ డిమాండ్లతో సాగుతున్న వీరి ఉద్యమం ఒక దశలో ముగిసిపోయిందని అనుకున్నారు. కాని వాంగ్ చుక్ అనే ఉద్యమకారుడు నిరాహారదీక్షకు దిగడంతో తిరిగి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాదిగా తరలివచ్చిన యువత పార్లమెంటు ముట్టడికి వెళ్లడం, ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడం వంటివి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. పోలీసులు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పలువురిని లాఠీలతో కొట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది సంబంధం లేని పిల్లలను కూడా పోలీసులు కొట్టిన తీరు విమర్శలకు గురి అయింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.ప్రధాని మోదీ తొలిసారిగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై స్పందించి అది మహాపాపమని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి యత్నించారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఇతరత్రా ఆరోపణలు చేసినా, ప్రధాని ఆ యువతను స్నేహితులు అని అడ్రస్ చేయడం విశేషం. ఈ కేసులో నిందితులకు సత్వరమే శిక్ష పడడానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. వాంగ్ చుక్ దీక్ష విరమించినా, ఉద్యమం కొనసాగడం, దేశం అంతటా దీని ప్రభావం పడుతుండడం గమనించి మోదీ స్పందించారు. వెంటనే డామేజ్ కంట్రోల్‌కు చర్యలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించినట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. దాంతో కాక్రోచ్ సంబరాలు అంబరాన్ని అంటాయి.నిజానికి కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మొదట తేలికగా తీసుకున్నట్లుగా ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కొన్ని వందలమంది దేశ యువతకు ప్రతినిధులుగా కేంద్రం ఆలోచించలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారంటే, 18 మెట్రో రైల్వేస్టేషన్లను బంద్ చేశారంటేనే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఇదంతా యువత స్వచ్చందంగా చేసిందే.కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రైతుల ఆందోళన కుదిపేసింది. వారు కోరినట్లు కొన్ని చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. అయినా ఆనాడు సమర్థంగా హాండిల్ చేశామన్న భావన కేంద్ర పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఆ పరిస్థితి వేరు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి వేరు. ఒక్కసారి యువతలో గూడుకట్టిన అసంతృప్తి ఎగసిపడితే, అది దేశ వ్యాప్తంగా పాకితే ఎంత ప్రమాదమో బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. అందులోనూ పలు ఇతర దేశాలలో యువత ఈ మధ్యకాలంలో ఎంతటి క్రియాశీలకపాత్ర పోషించి ప్రభుత్వాలే మారిపోయేలా చేసిందో ఇటీవలి చరిత్రే.ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాలలో సహజంగానే విపక్షం దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మంత్రి ప్రధాన్ రాజీనామాకు విపక్షం కూడా పట్టుబట్టింది. ఎప్పుడో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సంచలనం అయింది. తర్వాతకాలంలో కొందరు కేంద్ర మంత్రులు వివిధ కారణాలతో రాజీనామాలు చేయకపోలేదు. రైల్వే ప్రమాదాల కారణంగానే నితీష్ కుమార్, మమత బెనర్జీ వంటివారు రాజీనామా చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ పదవి నుంచి తప్పుకున్నారు.అలాగే, ఆయా స్కామ్‌ల ఆరోపణలపై దయానిది మారన్, ఎ.రాజా తదితరులు రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్‌కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యా మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజీనామా చేశారు. క్యాబినెట్ ఎజెండాను లీక్ చేశారన్న కారణంగా 31 మంది మంత్రుల నుంచి ఎన్టీరామారావు రాజీనామాలు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్‌లో వివిధ ఆరోపణలు వచ్చినా ఆయన నైతిక బాధ్యత వహించడానికి సిద్దపడలేదు. గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట కారణంగా 29 మంది మరణిస్తే, చంద్రబాబు ఎదురు బుకాయించారు తప్ప బాధ్యత తీసుకోలేదు. పూరి జగన్నాథ రథయాత్రలో జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో మరణించడం లేదా అంటూ డబాయించారు. ఆ ఘటనలో ఒక్క కానిస్టేబుల్‌పై కూడ కేసు రాకపోవడం చిత్రంగానే అనిపిస్తుంది.తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్ కౌంటర్‌కు గురి కావడం వివాదాస్పదం అయినా, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినా, ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసే లేకుండా చేసుకోగలిగారు. ఒకప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ జరిగితే అప్పటి మంత్రి కోనేరు రంగారావుతో రాజీనామా చేయించారు. తదుపరి ఆ ఆరోపణలు రుజువు కాలేదని తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలకు వైఎస్సార్సీపీ ఎన్నో ఆధారాలు చూపి సీబీఐ విచారణ కోరుతోంది. వాటికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా నేరుగా జవాబు ఇవ్వలేదు. టీడీపీ ఇతర నేతలతో ఎదురుదాడి చేయించారు.ఈ నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై ఉద్యమించాలని వైఎస్సార్సీపీ తలపెట్టింది. దీనికి యువత కూడా తోడైతే అది సీరియస్‌గా మారవచ్చు. అయితే వారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇది ఏ రూపు దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోకేష్‌పై ఒత్తిడి పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమం చేసిన కాక్రోచ్ యువతపై కక్ష కట్టకుండా ఉండాలని ఆశిద్దాం. ఏది ఏమైనా కాక్రోచ్‌లే కదా అని తేలికగా చూడరాదన్న విషయం అర్థం అవుతోంది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం.. రేపటికి వాయిదా
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పరీక్షల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. నిరసనల సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.పార్లమెంట్ సమావేశాలు.. 6వ రోజు అప్డేట్స్రాజ్యసభ రేపటికి వాయిదారాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో మళ్లీ గంగదగోళంరేపటికి వాయిదా వేసిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్లోక్సభ రేపటికి వాయిదాలోక్సభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో గందరగోళం.. రేపటికి వాయిదాకాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని సభా కార్యక్రమాలుయాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరగని చర్చవాయిదాల పర్వంలోక్సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా3 గంటల వరకు వాయిదా పడి మళ్లీ ప్రారంభమైన రాజ్యసభఆ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళనరాజ్యసభ మళ్లీ సాయంత్రం 5.15 గంటల వరకు వాయిదాఓం బిర్లా కీలక ప్రకటనలోక్సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లువిపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టిన కేంద్రంచర్చ ముందుకు సాగకపోవడంతో వాయిదామధ్యాహ్నం 2గం. తిరిగి ప్రారంభం కానున్న లోక్సభలోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటనబిల్లుపై ఎంపీల సూచనలు కోరిన స్పీకర్.మధ్యాహ్నం 1 గంట వరకు సవరణలకు అవకాశం.చర్చకు తగిన సమయం ఇస్తామని హామీ.పేపర్ లీక్‌కు భారీ శిక్షలుయాంటీ పేపర్ లీక్ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్‌లో వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్రతిపాదన.జరిమానా రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే అవకాశం.విద్యార్థుల లాఠీఛార్జిపై రగడపోలీసుల చర్యలపై హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని పవన్ ఖేరా డిమాండ్.నిరసనలను అణచివేయడం సరికాదని వ్యాఖ్య.సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన కాంగ్రెస్.సమగ్ర కథనం: లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపేపర్ లీక్ బిల్లుకు కేంద్రం ప్రాధాన్యంలోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుస్పందించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుబిల్లు ఆమోదమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటనవిద్యార్థుల భవిష్యత్ రక్షణే ప్రధాన ఉద్దేశమని వెల్లడి.పేపర్ లీక్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం.విపక్షాలు ఇతర అంశాలతో దృష్టి మళ్లించొద్దని సూచన.పరీక్షల వ్యవస్థపై నమ్మకం పెంచడమే లక్ష్యమని వ్యాఖ్య.లోక్‌సభ సైతం వాయిదామధ్యాహ్నానికి లోక్‌సభ వాయిదావిపక్షాల నిరసనల నడుమే.. యాంటీ పేపర్ లీక్ బిల్లు పెట్టిన కేంద్రంవిపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని చర్చలోక్‌సభ మధ్యాహ్నం 2గం. కు వాయిదారాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదావాయిదా తర్వాత కూడా మారని సీన్పెద్దల సభలో విపక్షాల నిరసన గళంప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాల డిమాండ్మధ్యాహ్నం 2గం. దాకా సభ వాయిదా వేసిన చైర్మన్వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలులోక్సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళనవిపక్షాల నిరసనల నడుమే లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్నీట్ నిరసనలు.. కేంద్రంపై పప్పు యాదవ్ ఫైర్ నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన.. ప్రభుత్వ చర్యలు తీవ్రంగా తప్పుబట్టిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉన్న విద్యార్థులను నేరస్తుల్లా చూస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.“మన పిల్లలు ఉగ్రవాదులా? మన కూతురు నేరస్తురాలా? హక్కుల కోసం గొంతెత్తడం తప్పా?” అని పప్పు యాదవ్ వ్యాఖ్యానించారు.బిహార్‌లో దాదాపు 800 మంది విద్యార్థులను జైలుకు పంపించారని ఆరోపించారు.విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరితో దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని ఆయన విమర్శించారు.ఖర్గే తీవ్ర వ్యాఖ్యలునీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత అరుదైన ఘటన (rarest of rare) గా అభివర్ణించారు.ఈ అంశంపై రాజ్యసభలో తక్షణ చర్చకు అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఖర్గే కోరారు.రూల్ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధన ప్రకారం ఆ రోజు జాబితాలో ఉన్న ఇతర కార్యక్రమాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చ చేపట్టవచ్చు.భారత చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఖర్గే పేర్కొంటూ.. ఈ అంశంపై వెంటనే చర్చ అవసరమని అన్నారు.ఖర్గే డిమాండ్‌పై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్.. రూల్ 267 అమలుకు ఆ అంశం నిజంగా “rarest of rare” స్థాయిలో ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనల అంశం మాన్సూన్ సమావేశాల్లో రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసనప్రధాని మోదీపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్విద్యార్థుల్ని అణచివేయడంలో మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేఢిల్లీలో పెల్లెట్లు.. పట్నాలో ఏకే 47 ప్రయోగించారుప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే स्टूडेंट्स पर लाठीचार्ज और पैलेट गन के इस्तेमाल के विरोध में विपक्ष संसद परिसर में विरोध प्रदर्शन कर रहा है#Parliament pic.twitter.com/ihXExAzby2— Poonam Pandey (@pandeypoonam20) July 27, 2026 बिहार के सीवान में छात्र प्रदर्शन के दौरान AK-47 से फायरिंग करने वाले SIT जवान अभिषेक पटेल को सस्पेंड कर दिया गया है!सिवान में छात्र आंदोलन के दौरान पुलिस अधिकारी अभिषेक पटेल ने छात्रों की दिशा में AK-47 असॉल्ट राइफल से फायरिंग की थी! pic.twitter.com/ZjyQa8fGOK— Sadaf Afreen صدف (@s_afreen7) July 27, 2026జంతర్ మంతర్‌లో లాఠీఛార్జిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలుఛలో సంసద్ ర్యాలీ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుశాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు: సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం.విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించుకోలేం ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరంశాంతియుత నిరసనలు, పోలీసు చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకరూప మార్గదర్శకాలు అవసరం.నిరసనల్లో చొరబడే సామాజిక విద్రోహ శక్తులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలినిరసనల్లో హింసకు తావులేకుండా నిరసనకారులు 'ఆత్మశిక్షణ' పాటించడం అత్యంత కీలకమన్న సుప్రీంకోర్టు.విద్యార్థుల నిరసనలు, పోలీసుల దాష్టీకంపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా.ఉభయ సభలు వాయిదా!ఆరో రోజు అదే తీరునీట్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలుప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ఉభయ సభలు మధ్యాహ్నం 12గం. దాకా వాయిదాప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలులోక్సభలో విపక్ష ఎంపీల ఆందోళనపబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 నేడే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచనలాఠీ ఛార్జిపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. పోటాపోటీ నినాదాలుపార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీ నినాదాలుపార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ధర్మేంద్ర ప్రధాన్‌కు హీరో వెల్ కమ్ చెప్పిన ఎన్డీయే ఎంపీలుకేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇండియా కూటమి ఎంపీలునీట్ లీకేజీ వ్యవహారంలో.. యువత నిరసనతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ఊహించినట్లే.. కాంగ్రెస్ వాయిదా తీర్మానంపార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానంవిద్యార్థులపై లాఠీఛార్జి, పెల్లెట్ గన్స్‌తో దాడిపై చర్చకు నోటీసుజంతర్ మంతర్ ధర్నా సమయంలో విద్యార్థులపై భద్రతా బలగాల బలప్రయోగంచలో సంసద్‌ను అడ్డకునే కమ్రంలో జులై 20న చోటు చేసుకున్న పరిణామాలుతీవ్రంగా ఖండించిన కాంగ్రెస్అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీవిద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటున్న విపక్ష నేతపరీక్షా బిల్లు.. చర్చలో పాల్గొనేది వీళ్లే!నేడు లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026పై చర్చబిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్బిల్లుపై 8–12 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశంబీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్ చర్చ ప్రారంభంబీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగంటీడీపీ తరఫున లావు శ్రీకృష్ణ దేవరాయలుజేడీయూ నుంచి లల్లన్ సింగ్ సభలో మాట్లాడనున్నారుశివసేన తరఫున డా. శ్రీకాంత్ షిండే ప్రసంగంఅప్నా దల్ (ఎస్) నుంచి అనుప్రియా పటేల్ చర్చలో పాల్గొననున్నారుఎల్జేపీ (రామ్ విలాస్) నుంచి అరుణ్ భారతికి అవకాశంఎన్సీపీ తరఫున సునీల్ తట్కరేతృణమూల్ కాంగ్రెస్ నుంచి సయోని ఘోష్ లేదా మితాలి బాగ్ పాల్గొనే అవకాశంపరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు బిల్లు ప్రధాన లక్ష్యంబిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించే అవకాశంపై ఆసక్తిసభ.. సజావుగా సాగేనా?సీజేపీ ఆందోళన విరమణతో పార్లమెంట్ సమావేశాలపై అందరి దృష్టిగతవారమంతా విపక్షాల నిరసనలతోనే గడిచిన పార్లమెంట్కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ సభను అడ్డుకున్న విపక్షాలునీట్ లీకేజీపై చర్చ.. ప్రత్యేక చట్టంకు సిద్ధమని ప్రకటించిన కేంద్రంఅయినా వెనక్కి తగ్గని విపక్షాలు, చివరకు..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శాంతించిన యువతఆందోళన విరమించిన కాక్రోచ్ జనతా పార్టీనేడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకాసేపట్లో ఖర్గే కార్యాలయంలో విపక్షాల సమావేశంయువతపై జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలుదాడికి బాధ్యత వహించాలని ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు.లీకేజీలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష.నిందితులపై రూ.50 లక్షల వరకు జరిమానా.వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడే ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా.ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు.కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా నిబంధనలు.ఎన్డీయే వ్యూహం ఏంటి?పేపర్ లీక్‌లను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చాటే ప్రయత్నం.యువ ఎంపీలను రంగంలోకి దించి బిల్లుపై బలమైన వాదనలు వినిపించాలనే వ్యూహం.బీజేపీ నుంచి బన్సూరీ స్వరాజ్, తేజస్వీ సూర్య చర్చకు నాయకత్వం వహించే అవకాశం.టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఇతర మిత్రపక్షాల ఎంపీలు కూడా చర్చలో పాల్గొననున్నారు.విపక్షాల వ్యూహం ఏమిటి?బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా.. నీట్ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాలని భావిస్తున్నాయి.పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావాన్ని లేవనెత్తే అవకాశం.జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్చ్ సమయంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు.ఘటనలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తొలి పార్లమెంట్ సమరంనీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.కొత్త మంత్రి తొలిసారి విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు.నీట్ వివాదంపై ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.10 గంటల పాటు చర్చబిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చకు అవకాశం.దాదాపు 8 నుంచి 10 గంటల పాటు చర్చ జరగనున్నట్లు సమాచారం.అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించనున్నారు.36 రోజుల ఉద్యమం తర్వాత..నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిగాయి.విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఉద్యమం ముగిసింది. -
నందన్ నీలేకని ఎవరు?..‘పరీక్షల భద్రత’కు ఎందుకు ఎంపిక చేశారు?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్ ఉదంతాలు, అక్రమాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూఐడీఏఐ (ఆధార్) వ్యవస్థాపక ఛైర్మన్ నందన్ నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా వివరాలను వెల్లడించారు. HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5— Narendra Modi (@narendramodi) July 26, 2026పోటీ పరీక్షలను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు ఈ కమిటీ పలు సిఫార్సులు చేయనుంది. ప్రశ్నాపత్రాల భద్రతను పటిష్టం చేయడం, అభ్యర్థుల ధృవీకరణ, మూల్యాంకన విధానాలు, పరీక్షల నిర్వహణలో సాంకేతికతను ఏ విధంగా అమలు చేయాలనే అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కల్వాల్ తదితరులు ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉన్నారు.నందన్ నీలేకని ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, టెక్నాలజీ నిపుణుడు. ప్రభుత్వ విధాన నిపుణుడు. 1981లో ఎన్ఆర్ నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2002 నుండి 2007 వరకు ఆ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) సేవలు అందించారు. ఆ తర్వాత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచపు అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు ప్రాజెక్ట్ అయిన ‘ఆధార్’ (యూఐడీఏఐ) వ్యవస్థాపక ఛైర్మన్‌గా విశేష సేవలందించి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి విశేష కృషి చేశారు.ఇది కూడా చదవండి: ‘నన్ను అరెస్ట్ చేస్తారా?’.. మమ్దానీపై విరుచుకుపడ్డ నెతన్యాహు -
రక్షణ రంగంలో ఉన్నత శిఖరాలకు భారత్
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ రంగ ఉత్పత్తులు, ఎగుమతులు, మిత్రదేశాలతో రాజకీయ సహకారం వంటి రంగాల్లో భారత్ నిరంతరం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో మనదేశం స్వయం సమృద్ధి సాధిస్తోందని, స్వదేశీ పరిజ్ఞానంతో నూతన రికార్డులు సృష్టిస్తోందని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం 136వ ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ రక్షణ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, యువత సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. ఆయన ఏం చెప్పారంటే.. ‘ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్–1’జూలై 18న శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం చరిత్రాత్మక ఘట్టం. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషంగా ఉంది. ‘క్యాచ్ ది రెయిన్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్ పే’ కార్యక్రమాలు ఉద్యమంలా కొనసాగుతున్నాయి’’ అని అన్నారు. క్రీడలు, విద్యలో సత్తా చాటుతున్న యువత ‘‘అంతర్జాతీయ క్రీడల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ షట్లర్‌గా పీవీ సింధు చరిత్ర సష్టించింది. లండన్‌లోని చారిత్రక లార్డ్స్ మైదానంలో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి టెస్ట్ మ్యాచ్‌లో 270 పరుగుల తేడాతో అపూర్వ విజయం సాధించడం మనందరికీ గర్వకారణం. 1983లో పురుషుల జట్టు ఇక్కడే తొలి ప్రపంచకప్ సాధించగా, ఇప్పుడు మన నారీశక్తి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచి్చపెట్టింది’’ అని అన్నారు. చేనేత కళాకారులను గౌరవించాలి‘‘అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్‌లో సత్తా చాటిన భారత విద్యార్థులను నా అభినందలు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లాలోని సౌత్ చిట్టూర్కు చెందిన ఉపాధ్యాయుడు అభిలాష్ ఫుట్‌బాల్ పదాలతో సంస్కృతం నేర్పిస్తున్న ‘అక్షర కందుక్’ ప్రాజెక్టు ప్రయోగం ప్రశంసనీయం. జూలై 27న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్థంతి జరుగనుంది. గురు పూరి్ణమ నిర్వహించుకోబోతున్నాం. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలంతా ‘హర్ ఘర్ తిరంగా’కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి. ఆగస్ట్ 7న ‘నేషనల్ హ్యాండ్లూమ్ డే’జరుగనుంది. చేనేత వ్రస్తాలను ప్రోత్సహించడం ద్వారా చేనేత కళాకారులను గౌరవించాలని ప్రజలను కోరుతున్నా’’ అని అన్నారు. -
మోదీపై అభ్యంతకర పోస్టర్.. నటిపై ఫిర్యాదులు
కోల్‌కతా:ప్రధాని నరేంద్ర మోదీపై 'అసభ్యకరమైన' పోస్టర్‌ను ప్రదర్శించారనే ఆరోపణలతో ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు నమోదైంది. కోల్‌కతాలో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనలో మోదీ చిత్రపటాన్ని అసభ్యకరరీతిలో ప్రదర్శించారని నటి శ్రీలేఖపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.నిన్న (ఆదివారం) ఆనంద్‌పూర్ పోలీసు స్టేషన్లో బీజేపీ నాయకురాలు కేయా ఘోష్, నటి శ్రీలేఖ మిత్రపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేవలం ఒకే చోట కాకుండా బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌తో సహా పలు జిల్లాల్లోని వివిధ పోలీసు స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు దాఖలైనట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ అంశమై బీజేపీ నేత మాట్లాడుతూ.. "దేశ ప్రధానిని అవమానించేలా ఒక అసభ్యకరమైన పోస్టర్‌ను ప్రదర్శించినందుకు నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు దాఖలైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. శ్రీలేఖ మిత్రను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి" అని పేర్కొన్నారు.నిరసన ప్రదర్శన నేపథ్యంNEET ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోల్‌కతా రోడ్లపై భారీ నిరసన ప్రదర్శన జరిగింది.ఈ నిరసనలో శ్రీలేఖ మిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన/అసభ్యకరమైన చిత్రంతో ఉన్న పోస్టర్‌ను పట్టుకున్నట్లు ఫోటోలు వెలువడ్డాయి.అయితే దీనిపై శ్రీలేఖ మిత్ర తన సోషల్ మీడియా పేజీలో ఒక వీడియో స్టేషను విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు."నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి; నన్ను ఉరిశిక్షకు పంపాలనుకుంటే ఉరిశిక్షకు పంపండి. దీనికి వ్యతిరేకంగా కూడా కచ్చితంగా ఒక ఉద్యమం వస్తుందని నేను నమ్ముతున్నాను" అని ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. -
హైపవర్డ్ యాక్షన్
దేశంలో తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో పలు పరిణామాల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా.. ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ఆదివారం కూడా ఇదే అంశం చుట్టూ దేశ రాజకీయాలు పరిభ్రమించాయి. ఢిల్లీలో 37 రోజులపాటు చేసిన యువత ఆందోళనలు ఆగిపోయినప్పటికీ.. పరీక్షల్లో లీకేజీలు, అక్రమాల విషయంలో వారిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని కేంద్రం గుర్తించింది. ఈ అంశంపై ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, లీకేజీలకు పాల్పడితే పదేళ్ల జైలుశిక్ష వంటి చర్యలు తీసుకునే దిశగా సాగుతున్న ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో సంస్కరణల కోసం హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్‌ను నియమించినట్లు చెప్పారు. పటిష్ట, పారదర్శక పరీక్ష విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్‌ఫోర్స్ సూచనలు ఇస్తుందన్నారు. మరోవైపు పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం మోపడానికి, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను కేంద్రం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో తాము మరింత విజృంభించాలని విపక్షాలు కూడా భావిస్తున్నాయి. విద్యార్థులపై పాశవికంగా దాడికి దిగడం, వారిపై కేసులు నమోదు చేయడంపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వినియోగించాలంటూ అనుమతిచి్చంది మీరేనా? అంటూ హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖాస్త్రం సంధించారు. మరోవైపు నీట్ ఆందోళనలను పతాకస్థాయికి తీసుకెళ్లి ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించడంతో విజయం సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టంచేసింది. పంజాబ్‌లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై త్వరలో ఉద్యమించబోతున్నట్లు ఆ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే సంకేతాలిచ్చారు. ఇలా ఎవరికి వారు తమ హైపవర్డ్ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షల్లో సంస్కరణలకు టాస్క్‌ఫోర్స్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థలో సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పరీక్షల వ్యవస్థలను ఎలా మెరుగుపరచాలన్న అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో పరీక్షల విశ్వసనీయతను మరింత పెంచేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పటిష్టమైన, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్ ఫోర్స్ సూచనలు ఇస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు ఉద్ఘాటించారు. కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు. విశ్వసనీయంగా, పారదర్శకంగా... నీట్ పేపర్ లీకేజీ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజే హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై ప్రధాని స్వయంగా ప్రకటన చేయడం గమనార్హం. మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. మన పరీక్షా విధానం విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. అలాగే, అందులో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పరీక్షల సంస్కరణలపై దృష్టి సారించేందుకు ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సభ్యులు నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌లో మొత్తం ఆరుగురు సభ్యులను నియమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్షా విధానాన్ని, ముఖ్యంగా సాంకేతిక కోణంలో వ్యవస్థాగత సంస్కరణల పరంగా పునరుద్ధరించడంలో సహాయపడేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఇందులో స్థానం కల్పించింది. → టెక్నాలజీ నిపుణుడు నందన్ నీలేకని → ఇస్రో మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్ → ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా → ఐఐటీ–చెన్నై డైరెక్టర్ వి.కామకోటి → విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కార్వాల్ → లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనాటెక్నాలజీ దిగ్గజం నీలేకని నందన్ నీలేకని భారతీయులకు సుపరిచితులే. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు ఆయన సహ వ్యవస్థాపకుడు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) వ్యవస్థాపక చైర్మన్‌గా సేవలందించారు. ‘ఆధార్’ ప్రాజెక్టు విజయవంతం కావడం వెనుక ఆయనదే కీలకపాత్ర. 2023 జనవరిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఏర్పాటు చేసిన జీ20 టాస్క్ ఫోర్స్ సహ–అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బెంగళూరులో జన్మించిన నందన్ నీలేకని ఐఐటీ–బాంబే నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందారు. పద్మభూషణ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు.ఫోర్బ్స్ ఆసియా బిజినెస్‌మేన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, బిజినెస్ స్టాండర్డ్ లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డు ఆయనను వరించాయి. ఏక్‌స్టెప్ ఫౌండేషన్‌ను నిలేకని స్థాపించారు. ‘టైమ్స్’ పత్రిక విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో(2006, 2009), ఏఐ రంగంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల(2024) జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. వ్యాపారం, ఆవిష్కరణలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రంగాల్లో అందించిన సేవలకు గాను నీలేకని అనేక అవార్డులను పొందారు.టాస్క్ ఫోర్స్ బాధ్యతలు → నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన పరీక్షల వ్యవస్థను పునర్వ్యస్థీకరించడం→ పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక సంస్కరణలను సిఫార్సు చేయడం→ పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి అనైతిక పద్ధతులను అరికట్టడానికి నూతన వ్యవస్థను రూపొందించడం → జాతీయ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం. -
మోదీ ఎంచుకున్న టెక్ దిగ్గజం.. ఆధార్ రూపకర్తకు కీలక బాధ్యత!
భారతదేశంలో సమాచార సాంకేతిక (ఐటీ) రంగం ప్రపంచ స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో నందన్ నీలేకని ఒకరు. కేవలం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్‌గా మాత్రమే కాకుండా.. ఆధార్ (Aadhaar) రూపకల్పనలో చేసిన సేవలకు ఈయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కాగా.. ఇప్పుడు పరీక్షల సంస్కరణల కోసం నీలేఖని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు పీఎం మోదీ పేర్కొన్నారు.ఎవరీ నందన్ నీలేకనినందన్ నీలేకని 1955 జూన్ 2న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆయన తండ్రి మోహన్ రావు నీలేకని టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసేవారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన నందన్, ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అక్కడే ఆయనకు సాంకేతిక రంగంపై మరింత ఆసక్తి పెరిగింది.1981లో ఎన్.ఆర్. నారాయణ మూర్తితో కలిసి మరో ఆరుగురు సహ వ్యవస్థాపకులతో కలిసి ఇన్ఫోసిస్ (Infosys) సంస్థను ప్రారంభించారు. అప్పట్లో చిన్న స్థాయిలో మొదలైన ఈ సంస్థ, నేడు ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. కంపెనీ అభివృద్ధిలో నందన్ నీలేకని కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా పనిచేసి సంస్థను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేశారు.ఉడాయ్ చైర్మన్2009లో ఆయన కార్పొరేట్ జీవితానికి కొంత విరామం ఇచ్చి.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ''యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా'' (UIDAI)కి తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అందించే ఆధార్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంలో ఆయన నాయకత్వం కీలకంగా నిలిచింది.రచయితగా నీలేకనివ్యాపారవేత్తగానే మాత్రమే కాకుండా.. రచయితగా కూడా గుర్తింపు పొందారు. 'ఇమాజినింగ్ ఇండియా' అనే పుస్తకంలో భారతదేశ భవిష్యత్తు, ఆర్థిక వ్యవస్థ, విద్య, సాంకేతికత వంటి అంశాలపై తన ఆలోచనలను వివరించారు. ఆయన రచనలు, ప్రసంగాలు యువతకు స్ఫూర్తినిస్తుంటాయి.రాజకీయాల్లో నీలేకని2014లో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో విజయం సాధించలేదు. అనంతరం తిరిగి ఇన్ఫోసిస్‌లో చేరి సంస్థ అభివృద్ధిలో తన పాత్రను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఇన్ఫోసిస్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు.నందన్ నీలేకని కేవలం విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు. డిజిటల్ ఇండియా, ఫిన్‌టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కూడా విలువైన సూచనలు చేస్తుంటారు. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి మార్గం సుగమం చేసిన ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకరుగా గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) -
పరీక్షల సంస్కరణలపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పరీక్షల సంస్కరణలపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమాల నివారణే లక్ష్యంగా పలు సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం సన్నద్ధమైంది. పరీక్షల సంస్కరణలపై ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు నరేంద్ర మోదీ. ‘ పరీక్షల సంస్కరణలపై ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. సాంకేతిక నిపుణుడు నందన్ నీలేఖని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం, పరీక్షల విశ్వసనీయతపై ఇచ్చే ఈ నివేదికను అమలు చేస్తాం. లీక్‌లకు పాల్పడిన వారిని జైల్లో పెట్టాం. రేపు పార్లమెంట్లో కఠిన చట్టాలను తీసుకొస్తాం. పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతతో పాటు అక్రమాల నివారణే లక్ష్యం సంస్కరణలు తీసుకురాబోతున్నాం. విద్యార్థుల భవిష్యత్ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం. కఠిన నియమాలతో కొత్త చట్టం తీసుకొస్తున్నాం. వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగిస్తాం’ అని తెలిపారు.HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5— Narendra Modi (@narendramodi) July 26, 2026 -
భారత్ ఇప్పుడు తిరుగులేని శక్తి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు. జూలై 14న ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ నుండి ప్రారంభమైన ‘శౌర్య విజయ్ యాత్ర’ ద్రాస్ లోని కార్గిల్ వార్ మెమోరియల్ వరకు సాగుతుందని తెలిపారు.భారత రక్షణ రంగ తయారీ సామర్థ్యాలకు ప్రతీకగా ఐఎన్ఎస్ మహేంద్రగిరి నౌకను ఇటీవల నావికాదళంలో చేర్చినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ ఆధునిక యుద్ధ నౌక పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారని, ఇందులో 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలనే వినియోగించినట్లు చెప్పారు. అలాగే లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్, కుషా క్షిపణి పరీక్షలు విజయవంతం కావడంపై డీఆర్డీఓను ప్రశంసించారు. ఇండోనేషియాతో బ్రహ్మోస్, అస్త్రా క్షిపణుల ఒప్పందం కుదిరిందని, రక్షణ రంగంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని పేర్కొన్నారు.అంతర్జాతీయ వేదికలపై అద్భుత ప్రతిభ కనబరుస్తున్న భారతీయ అథ్లెట్లను ప్రధాని అభినందించారు. జపాన్ ఓపెన్ బాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధును, లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రశంసించారు. కేరళలోని ఎర్నాకులం విద్యార్థుల సంస్కృత క్లబ్, ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన దేశపు తొలి రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతమైన ప్రయోగాన్ని కొనియాడారు. సైన్స్ ఒలింపియాడ్లలో విద్యార్థులు సాధించిన పతకాల గురించి ప్రస్తావించారు. కాశ్మీరీ సాంప్రదాయ చాపల తయారీ కళ ‘వాగు’ పునరుద్ధరణకు గులాబ్ హుస్సేన్, తన్జిలా చేస్తున్న కృషితో పాటు ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లా మహిళలు తయారు చేస్తున్న ‘విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ’ విశేషాలను ప్రధాని వివరించారు. -
‘సంపూర్ణ క్రాంతి’ సైరన్!
‘‘పదండి ముందుకు, పదండి తోసుకు – ప్రభంజనం వలె హోరెత్తండి’’... శ్రీశ్రీ కవితావేశానికి దృశ్యరూపంలా కనిపించింది ‘కాక్రోచ్’ల కదనోత్సాహం. ఎండుగడ్డి మైదానంలో నిప్పు రవ్వలా నిద్రాణమైన జన చేతనను రగిలించగలిగింది. 1974లో స్వాతంత్య్ర సమరయోధుడు జేపీ నాయకత్వంలో నడిచిన ‘సంపూర్ణ క్రాంతి (టోటల్ రివోల్యూషన్) ఛాయలు ఈ ఉద్య మంలో ప్రస్ఫుటంగా కనిపించాయి. నిరంకుశ పాలన వైపు అడుగులేస్తున్న అధికార కూటమికీ, పక్షవాతం సోకిన ప్రధాన ప్రతిపక్షానికీ కాక్రోచ్ ఉద్యమం గట్టి సవాల్నే విసిరింది. ఉద్యమ స్వభావాన్ని, దాని గమనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమయంలోనే గుర్తించగలిగారు. ఫలితంగా శనివారం మధ్యాహ్నం విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆయనే వ్యక్తిగతంగానే తీసుకున్నారని జాతీయ మీడియాకు లీకులందాయి. బహుశా ఆయన ప్రతిష్ఠను నిలబెట్టడం కోసం వీటిని ప్రసారం చేసి ఉండవచ్చు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల విజయాల కీలక పాత్రధారుల్లో ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఒకరు. ఆయన గౌరవాన్ని కాపాడటం పార్టీ బాధ్యత కూడా. సంపూర్ణ క్రాంతి ఉద్యమం మాదిరిగా దేశ వ్యాప్తంగా విస్తరించే లక్షణాలను కాక్రోచ్ ఉద్యమంలో గుర్తించి నందువల్ల దీనికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టాలని ప్రధాని భావించి నట్టు సమాచారం.ధరేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌ను తొలి దశలో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రజా ఉద్యమాలకు తలొగ్గి నిర్ణయాలను మార్చుకునే లక్షణం పన్నేండేళ్ల పాలనా కాలంలో ఎన్డీఏకు ఎప్పుడూ లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతి రేకంగా పంజాబ్ రైతులు చేసిన చరిత్రాత్మక పోరాటంపై స్పందించడానికి మోదీ సర్కార్ సుదీర్ఘ సమయాన్ని తీసు కున్నది. అంతర్జాతీయ క్రీడా యవనికపై దేశ ప్రతిష్ఠను ఇనుమ డింపజేసిన మహిళా మల్లయోధుల ఆక్రందన అరణ్యరోదనగా మారింది తప్ప ఎన్డీఏ సర్కార్ చలించలేదు. పౌరసత్వ చట్టం దగ్గర నుంచి అనేకానేక అంశాల్లో కేంద్రం ప్రజా ఉద్యమాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘కాక్రోచ్’ల పార్లమెంట్ ముట్టడి జరిగిన మూడు రోజుల్లోనే ప్రధానమంత్రి రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలను చేపట్టారు.ఈ నెల 23న ఆందోళనపై తొలిసారిగా ఆయన నోరు విప్పారు. పేపర్ లీకేజీ ఘటనల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు లను ఏర్పాటు చేస్తున్నట్టు అర్ధరాత్రి ట్వీట్ చేశారు. విద్యార్థుల సంక్షేమం, వారి భవితవ్యం కంటే ఇంకేదీ ముఖ్యం కాదని కూడా అందులో పేర్కొన్నారు. 24న జరిగిన కేబినెట్ సమావేశంలో ఇటువంటి నేరాలకు సంబంధించి చట్టానికి మరింత పదును పెడుతూ తీర్మానించారు. సీజేపీ ప్రతినిధులు పెట్టిన గడువు లోపల 25 మధ్యాహ్నం మంత్రి రాజీనామా నిర్ణయం వెలువడింది. ఈ మూడు రోజులుగా కేంద్రమంత్రులు సీజేపీ ప్రతి నిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సీజేపీ పెట్టిన డిమాండ్లలో మంత్రి రాజీనామా ముఖ్యమైనది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం, ఆందోళనలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయడం మిగిలిన రెండు డిమాండ్లు. వీటిని కూడా కేంద్రం అంగీకరించినట్టు సమాచారం.విద్యార్థులపై జరిగిన పాశవిక లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని తాజాగా సీజేపీ డిమాండ్ చేసింది. మంత్రి రాజీనామాతో యువజనోద్యమం ముగిసిపోలేదనీ, విద్యావ్యవస్థ ప్రక్షాళన జరిగేవరకూ కొనసాగు తుందనీ కాక్రోచ్ ప్రతినిధులు విజయోత్సవం సందర్భంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ధర్నా, దీక్షా కార్యక్రమాల విరమణపై నిర్ణయం వెలువడాల్సి ఉన్నది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం కంటే ఎక్కువగా అప్రదిష్ట మూటకట్టుకున్నది గోదీ (పెంపుడు) మీడియా.ఏన్డీఏ కూటమిలో అప్రకటిత భాగస్వాములుగా పెంపుడు మీడియా, యెల్లో మీడియా వగైరాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జూలై 20న జరిగిన కాక్రోచ్ల పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం పెంపుడు మీడియాను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది యువజనం తరలి వస్తారని అది ఊహించలేకపోయింది. పోలీసు దమనకాండకు ఎదురొడ్డి నిలబడతారని కూడా అంచనా వేయలేకపోయింది. ఈ ఉలికి పాటు నుంచి తెప్పరిల్లిన తర్వాత సన్నాయి నొక్కులు ప్రారంభించింది. తరలివచ్చిన ఝంఝూమారుత యువ కెరటాలను ‘నీట్ పరీక్ష’ పరిధిల్లోనే బంధించడానికి తాపత్రయపడింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని ధర్మపన్నాగాలను వల్లె వేసింది. జవాబుదారీతనం ఒక కనీస ప్రజాస్వామిక ధర్మమనే విషయాన్ని విస్మరించి మంత్రి రాజీనామా డిమాండ్‌ను తప్పుపట్టింది. తాడూ బొంగరం లేని పార్టీ పిలుపునిస్తే ఇంత జనసందోహం పోగవడం వెనుకనున్న ‘అదృశ్య శక్తుల’ కోసం ఆరా తీయడం మొదలుపెట్టింది. మీడియా పక్షపాతాన్ని నిలదీసిన యువకులను అరాచక శక్తులుగా చిత్రించారు. నవతరం యువతుల ధైర్యసాహసాలకూ, మొహమాటమెరుగని ముక్కుసూటి తనానికీ వాట్సాప్ యూనివర్సిటీ పెడార్థాలు తీసింది.ఆన్లైన్లో మొదలైన కాక్రోచ్ పార్టీ పిలుపునిస్తే లక్షలాది మంది స్పందించడం పట్ల ప్రభుత్వం, పెంపుడు మీడియాలే కాదు, ప్రతిపక్షం కూడా అవాక్కయింది. పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి సహజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అయితే పాలక కూటమి అందుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. యాభయ్యేళ్ల కింద దేశంలో సంపూర్ణ క్రాంతి ఉద్యమంనాటి పరిస్థితులే నేటి యువజనో ద్యమం పరిస్థితులు కూడా. బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ ప్రతిష్ఠ పెరిగింది కానీ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. సరకుల ధరలు పెరిగాయి. నిరుద్యోగం ప్రబలింది. రాజకీయ నేతలు, అధికార యంత్రాంగంలో గతంతో పోలిస్తే అవినీతి ప్రబలింది. దీనికి తోడు ఎదురులేదన్న ధీమాతో అధికార పార్టీలో, అధినాయకత్వంలో నియంతృత్వ ధోరణులు ప్రబలాయి. ఈ ధోరణులకు వ్యతిరేకంగా గుజరాత్ విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనను బిహార్ అందిపుచ్చుకున్నది.అనంతరం జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో అది సంపూర్ణ క్రాంతి ఉద్యమంగా పరిణామం చెంది ఎమర్జెన్సీ విధింపునకు, తదనంతరం ఇందిరాగాంధీ ఓటమికి దారితీసింది. 1974 నాటి పరిస్థితులు మరింత దారుణంగా ఇప్పుడు పరిణమించాయి. విద్యారంగంలో విచ్చలవిడిగా ప్రైవేటీకరణ ప్రబలింది. ఈ ప్రైవేటీకరణ భూతంలేని ఆ రోజుల్లోనే సంపూర్ణ క్రాంతి డిమాండ్లలో అందరికీ విద్య అందుబాటులో ఉండాలనే అంశం ప్రముఖంగా చోటుచేసుకున్నది. ఇప్పుడు దేశంలో మెజా రిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో లేని పరి స్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ స్కూళ్లను దిగజార్చుతున్నాయి. 2014 నుంచి నేటివరకు దేశంలోని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఒక కోటి పద్దెనిమిది లక్షలు తగ్గింది. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో 88 లక్షల మంది పెరిగారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కొన్ని స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు పెట్టడం జాతీయ వార్తగా మారింది. వాస్తవాలు ఇలా వుంటే... ఇప్పుడు కొత్తగా లోకేశ్ సారథ్యంలో ప్రభుత్వ స్కూళ్లు నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నట్టు రంప చోడవరం సభలో చంద్రబాబు కళ్లార్పకుండా చెప్పేశారు. తల్లికి వందనం ఐడియా కూడా లోకేశ్‌దే నన్నట్టుగా ఆయన మాట్లా డారు. పెద్ద నాయకుడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అలా మాట్లాడితే ‘అతన్నెవరికైనా చూపించండర్రా’ అంటారు. జగన్ మోహన్‌రెడ్డి నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం అనుమతులు తీసుకోకుండా 1,800 మెడికల్ సీట్లను ఏపీ విద్యార్థులకు దూరం చేసి వారి కలలను భగ్నం చేశారు. ఇలాంటి పరిస్థితులే కదా కాక్రోచ్ల పుట్టుకకు దారితీసేది!దేశవ్యాప్తంగా ఉన్నత విద్యారంగం పరిస్థితి కూడా నిరాశా జనకంగానే ఉన్నది. యూజీసీ గ్రాంట్లకు భారీగా కత్తెర వేసి విశ్వవిద్యాలయాల నాణ్యతా ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు పెరిగాయి. అవి కాసుల కోసం పని చేస్తాయి తప్ప పరిశోధనల కోసం పాకులాడవు కదా! ఉన్నత విద్యారంగంలో కూడా ప్రమాణాలు గణనీయంగా పడిపోతు న్నాయి. లక్షల సంఖ్యలో ఉత్పత్తి అవుతున్న నాణ్యతలేని పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకడం లేదు. పట్టభద్రుల నిరు ద్యోగితా శాతం దేశంలో ముప్పయి శాతం దాటింది. నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో దూరం చేశారు. ప్రైవేట్ సంస్థల్లో కొనలేని పేద, మధ్యతరగతి విద్యార్థులు నిరుద్యో గులుగా మిగిలిపోతున్నారు. విద్యారంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సంక్షోభంలో కోట్లాది మంది చిక్కుకొని పోయారు.సంక్షోభానికి మరోకోణం అవినీతి. రాష్ట్రాల వారీగా నిక్షేపంగా జరుగుతున్న మెడికల్ అడ్మిషన్ల విధానాన్ని ఉద్దరిస్తామని చెప్పి కేంద్రీకరించారు. వ్యవస్థాగత బలంలేని టెస్టింగ్ ఏజెన్సీకి ప్రతిష్ఠాత్మక సంస్థల అడ్మిషన్ల బాధ్యతను అప్పగించారు. ప్రైవేట్ సంస్థలకు కీలకమైన పనులను ఔట్ సోర్సింగ్ చేసే పద్ధతి వల్ల అవకతవకలకు రాచబాట ఏర్పడింది. ఫలితంగా లక్షలాది విద్యా ర్థుల కలలు కల్లలవుతున్నాయి. ఈ పూర్వరంగంలో ప్రధాన్ రాజీనామాతోనే ఈ సంక్షోభం తొలగిపోదు. సంపూర్ణ క్షాళన కోసం యువతరం ఉద్యమించడం అనివార్యం. ఇవాళ కాక పోయినా రేపైనా ఈ సంపూర్ణ క్రాంతిరథం కదలక తప్పదు.ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అవకతవకలపై ప్రతిపక్ష నేత అందజేసిన సాక్ష్యాలను యువతరం అందిపుచ్చుకోవలసి ఉన్నది. మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులకు అందకుండా చేసిన నిర్వాకంపై ఎలు గెత్తవలసి ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం తోడుగా ఉన్నంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ శక్తీ ఏమార్చ లేదని ఈ పరిణామం రుజువు చేసింది. జెన్జీగా పిలుచుకుంటున్న నవతరం మొబైల్ ఫోన్లలో మునిగిపోయి స్తబ్ధుగా మారిపోయిందనే అభిప్రాయం శుద్ధ తప్పని తేలి పోయింది. అవసరం వస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలాంటి సవాలైనా ఎదుర్కొనేందుకు వారు సిద్ధపడతారని రుజువైంది. కాక్రోచ్ ఆందోళనకు దేశవ్యాప్త గుర్తింపు రావడానికి దోహద పడిన సోనమ్ వాంగ్‌చుక్, ఒక సెటైర్‌ను వైల్డ్ ఫైర్‌గా మార్చగలిగిన అభిజిత్ దీప్కే, 23 రోజుల నిరాహార దీక్ష అనంతరం కూడా సివంగిలా రణగర్జనలు చేసిన నేహా బోరా, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా పోలీస్ వ్యాన్ ఎదురుగా నిలబడి అమరత్వానికి సిద్ధపడిన రియా అహిర్, వాటర్ కెనాన్లను గేలిచేస్తూ వాటికింద డ్యాన్సులు చేసిన బిహారీ విద్యార్థులు, తోడేళ్ల మంద ఎదుట తొడగొట్టినట్టు లాఠీచార్జీలను సవాల్ చేసిన యువతీ యువకులందరూ ఈ ఉద్యమంలో హీరోలే! రాబోయే సంపూర్ణ విప్లవానికి వేగుచుక్కలు వారే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
వీడియోలు కాదు, యాక్షన్ కావాలి : రాహుల్ గాంధీ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ అవకతవకలపై దేశ రాజదాని నగరం న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ,విద్యార్థులు ఆందోళన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా విడుదల చేస్తున్న వీడియోలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీడియోలు కాదు, విద్యార్థులపై కోరుతున్న డిమాండ్లపై చర్యలు కావాలి అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో దాడికి గురైన విద్యార్థులకు ప్రధాని మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.23 రోజులుగా నిరాహార దీక్ష చేసిన విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడిన రాహుల్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యా వ్యవస్థ అవినీతికి ప్రతీక అని విమర్శించారు. ఆయనను వేరే శాఖకు మార్చడం కాకుండా, ప్రభుత్వం నుంచే పూర్తిగా తొలగించాలని (మంత్రివర్గం నుండి తీసేయాలని) విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారన్నారు.మోదీ రాత్రివేళల్లో చేసే వీడియో సందేశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులకు ప్రధాని హామీలు, వీడియోలు వద్దని, తక్షణ చర్యలే కావాలని స్పష్టం చేశారు.मोदी जी, करोड़ों छात्रों का भविष्य बर्बाद करने के बाद अब आधी रात की Reel से उनका वक़्त बर्बाद मत कीजिए।प्रधान बर्ख़ास्त। दोषियों पर कार्रवाई। छात्रों से माफ़ी।इससे कम कुछ भी मंज़ूर नहीं। pic.twitter.com/RWrLLDD0WC— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026 అలాగే ఆందోళన బాట పట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్ ప్రయోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గాయపడిన ఒక విద్యార్థిని చూపిస్తూ... విద్యార్థులపై దాడికి బాధ్యులైన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. విద్యార్థులే ఈ దేశపు భవిష్యత్తు అని మోదీ దేశానికి గతం అని గతం ఎన్నటికీ భవిష్యత్తును ఓడించలేదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా AISA ప్రతినిధి నేహా బోరా మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో విద్యా వ్యవస్థపై చర్చలు జరిపినట్లు తెలిపారు. కాగా నీట్ 2026 పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి మోదీ గురువారం అర్ధరాత్రి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరో సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
NTAలో 47 మందిపై క్రిమినల్ చర్యలు... BJP సీరియస్ యాక్షన్
-
నా నిజాయితీని నిరూపించాలా? విమర్శలకు వాంగ్ చుక్ ఘాటు రియాక్షన్
-
నీట్ సెగ.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కీలక నిర్ణయం?
నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా.. కేంద్రం వరుస చర్యలు చేపట్టింది. ఎన్టీఏలో మార్పులు, ఉన్నతాధికారుల బదిలీలు, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. నిరసనలు మాత్రం తగ్గడం లేదు. కీలకమైన మూడు డిమాండ్లలో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానేనని అటు విద్యార్థి సంఘాలు.. నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకుంటేనే తమ పోరాటానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆందోళనలు విరమిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో.. ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించేందుకు కేంద్రం సుముఖంగా కనిపించడం లేదని సమాచారం. ఇదే ప్రధాన ఎజెండాగా నిన్న కేబినెట్ భేటీలోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వివాదం నేపథ్యంలో ఆయన్ని మరో శాఖకు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా శాఖ మార్పును పరిశీలిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ ఈ ఉదయం ప్రెస్మీట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. నీట్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను అవినీతికి ప్రతీకగా అభివర్ణించిన ఆయన.. మరో శాఖకు మార్చడం పరిష్కారం కాదని అన్నారు. విద్యార్థులు కోరుకుంటున్నట్లు ఆయనను కేబినెట్ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. పైగా ఈ వ్యవహారంపై తనకు సమాచారం ఉందని పేర్కొన్న ఆయన.. పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అర్ధరాత్రి వీడియోలు చేయడంతో లాభం లేదని.. మంత్రిని తొలగించి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.#WATCH | LoP, Lok Sabha, Rahul Gandhi says, "...Students have three demands, and these are not negotiable demands... The first demand is that the Education Minister, who is corrupt, incompetent, and misaligned, has to be sacked... There's some talk going on in Mr. Modi's cabinet… pic.twitter.com/hKoXOQ4SSz— ANI (@ANI) July 25, 2026మరోవైపు కేంద్ర ప్రభుత్వం నీట్ వివాదం నేపథ్యంలో పలు చర్యలు చేపట్టింది. పేపర్ లీక్ కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఏలోని 47 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్ వివాదం వేళ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించింది.అయితే ఈ చర్యలు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయాయి. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పిదాలకు కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం సరిపోదని, రాజకీయ బాధ్యత కూడా ఉండాలని సీజేపీ, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇదే సమయంలో విద్యార్థి సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రి రాజీనామా డిమాండ్‌పై మాత్రం విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్పు జరుగుతుందా? లేదంటే ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు విద్యార్థులు రాజీనామా డిమాండ్‌పై పట్టుబడుతుండగా.. మరోవైపు కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. నీట్ వివాదం రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. -
మెట్రో ఆపగలరు.. పేపర్ లీక్ ఆపలేరు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న నీట్ అభ్యర్థుల నిరసనలు, పేపర్ లీక్ ఉదంతాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మెట్రో స్టేషన్లు, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు గత కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలు విధించడంతో పాటు 18 మెట్రో స్టేషన్లను మూసివేసింది. దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. ‘మెట్రో బంద్ చేయండి, ఇంటర్నెట్ బంద్ చేయండి, దుకాణాలు బంద్ చేయండి.. కానీ ప్రధాని మోదీ మాత్రం పేపర్ లీక్ మాత్రం అడ్డుకోలేకపోయారు’ అంటూ ఎద్దేవా చేశారు. मेट्रो बंद करो।रास्ते बंद करो।दुकानें बंद करो।Internet बंद करो।खाना बंद करो।अपना हक़ मांग रहे छात्रों के ख़िलाफ़ सरकार ने ये क्रूर कदम उठाए।बस एक चीज़ बंद नहीं कर पाए, मोदी जी - पेपर लीक।— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2026శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ప్రభుత్వం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని రాహుల్ ఆరోపించారు. జాతీయ జెండాలు పట్టుకుని నిరసన తెలుపుతున్న యువకులపై పోలీసులు పెల్లెట్ గన్లు ప్రయోగించారని, లాఠీచార్జీ చేశారని మండిపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ పతనానికి ఆయనే ప్రధాన కారణమని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం, వారిపై అణచివేత చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.ఇది కూడా చదవండి: యువతకు సమాధానం ఇవ్వాల్సిందే: మోహన్ భగవత్ -
యువతకు ధన్యవాదాలు మోదీ మరో వీడియో వైరల్
-
మోదీ మ్యాజిక్ ఇలాగే ఉంటుంది మరి!
నరేంద్ర మోదీ.. ఈ పేరుకు ఉన్న గ్లోబల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాల అధినేతలు సైతం ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతర్జాతీయ వేదికలపై మోదీకి లభించే ఆదరణకు ఇదే నిదర్శం కూడా. అలాంటి వ్యక్తి తొలిసారి జాతిని ఉద్దేశించి.. అదీ నీట్‌లాంటి నిరసనల మీద సెల్ఫీ వీడియో పోస్ట్ చేస్తే స్పందన ఎలా ఉంటుందో ఊహించగలరా?. నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో లోపాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ గురువారం రాత్రి మోదీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. పేపర్ లీక్‌పై ఆందోళనలను అర్థం చేసుకున్నామని, కఠిన చర్యలకు దిగుతున్నామని ప్రకటించారు. ఇకనైనా ఆందోళనలు విరమించాలి అంటూ పరోక్షంగా ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ వీడియోకు భారీ స్పందన లభించింది. కోట్లాది మంది వీక్షణలు, లక్షల సంఖ్యలో స్పందనలతో ఆ వీడియో వైరల్‌గా మారింది.ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ సెల్ఫీ వీడియోకు తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి. సుమారు 25 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా.. 10 లక్షలకు పైగా కామెంట్లు, కోటిన్నరకు పైగా లైక్స్‌తో దూసుకుపోతోంది. అయితే అన్ని ప్లాట్‌ఫారమ్‌లతో కలిపి ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026నీట్ వివాదంపై వీడియో సందేశంలో స్పందించిన ప్రధాని.. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలను సహించేది లేదని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత ఆశలు, భవిష్యత్తుతో ఎలాంటి రాజీ ఉండదని భరోసా ఇచ్చారు.ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపించాయి. ప్రధాని సందేశాన్ని స్వాగతించిన పలువురు.. ఇది విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం నీట్ వివాదంలో బాధ్యులపై చర్యలు, వ్యవస్థలో సమూల మార్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.శుక్రవారం రాత్రి మరో వీడియోను రిలీజ్ చేశారాయన. ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మోదీ.. “ధన్యవాదాలు మిత్రులారా. నిన్న (గురువారం) రాత్రి మీతో మాట్లాడే అవకాశం లభించింది. నా వీడియోను ఎంతోమంది చూసి, విలువైన సూచనలు అందించారు. మీ ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు. యువత నుంచి వచ్చిన సానుకూల స్పందన తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)ఇక మోదీకి ఉన్న వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్, సోషల్ మీడియా ప్రభావం మరోసారి ఈ వీడియోల ద్వారా చర్చకు వచ్చింది. దేశీయ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన మోదీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ భారీ స్థాయిలో ప్రజలతో అనుసంధానమవుతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతకు చేరువ కావాలంటూ మంత్రులకు సైతం నిన్నటి కేబినెట్ భేటీలో మోదీ సూచించడం గమనార్హం. నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఈ సెల్ఫీ వీడియో.. కేవలం ఓ రాజకీయ సందేశంగానే కాకుండా, సోషల్ మీడియాలో మోదీకి ఉన్న ప్రజాదరణకు మరో ఉదాహరణగా నిలిచిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. -
విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న మోదీ ప్రభుత్వం: సోనియా
న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు, అకౌంటబిలిటీ కోరిన పాపానికి మోదీ ప్రభుత్వం విద్యార్థులపట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని, ఈ దేశ భవిష్యత్తుగా కాకుండా శత్రువులా చూస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీప ఆర్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించార.ఉ. దేశ విద్యా వ్యవస్థను దిగజారుస్తున్న మోడీ ప్రభుత్వ డొల్లతనాన్ని ఈ దేశ విద్యార్థులు బట్టబయలు చేశారని వ్యాఖ్యానించారు. విద్యార్థుల పక్షాన నిలవడం నైతికంగానే కాకుండా రాజకీయ, రాజ్యాంగబద్ధ ధర్మం కూడా అని స్పష్టం చేశారు. నిరాశ నిస్పృహలను కలిగించే విద్యావ్యవస్థ, మోడీ ప్రభుత్వపు అహంకార ధోరణి, బాధ్యతారాహిత్యం వంటి అంశాలన్నీ నిరసనలకు దారితీయడం సహజ పరిణామమేనని సోనియాగాంధీ ‘ద హిందూ’పత్రికలో ‘ఆన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్, యంగ్ ఇండియాస్ ట్రామా’శీర్షికతో రాసిన కథనంలో పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు ‘ఛలో సంసద్’సందర్భంగా విద్యార్థులపై చూపిన క్రూరత్వం ఈ ప్రభుత్వ హయాంలో కొత్తేమీ కాదని, 2020లో సీఏఏ నిరసన ప్రదర్శనల సందర్బంగానూ పోలీసులు, పారా మిలటరీ బలగాలు దారుణంగా వ్యవహరించాయని, మహిళ రెజ్లర్లపై జరిగిన దమనకాండను కూడా ఈ దేశం మరచిపోలేదని అన్నారు. విద్యార్థులు ధైర్యంగా వేస్తున్న ప్రశ్నలకు ఈ ప్రభుత్వం పిరికితనంతో జవాబు చెబుతోందని, క్రూరంగా అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టడంలో దారుణంగా విఫలమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేందుకు నిరాకరించడం ప్రజల మనసుల్లో గూడుకట్టుకుపోయిన ఆగ్రహానికి ఆజ్యం పోసిందని అన్నారు. ఎనీ్టయేను శక్తిమంతం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచి్చన సలహాలను బహిరంగంగానే తిరస్కరించడం ద్వారా ప్రధాన్ ధిక్కారాన్ని ప్రదర్శించడమే కాకుండా బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆ కథనంలో ఆరోపించారు. -
యువతకు కృతజ్ఞతలు.. మోదీ మరో వీడియో
సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ మరో వీడియో విడుదల చేశారు. నిన్న అర్థరాత్రి (గురువారం) తను పోస్ట్ చేసిన వీడియోపై అభిప్రాయాలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విలువైన సూచనలు చేసిన యువతకు ప్రత్యేక కృతజ్ఞతలని పేర్కొన్నారు. యువతరం ఇచ్చే విలువైన సలహాలు దేశ భవిష్యత్తుకు మరింతగా సహకరిస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. కేంద్ర కేబినేట్ భేటీ అనంతరం మోదీ ఈ వీడియోని విడుదల చేశారు.మోదీ మాట్లాడుతూ "ధన్యవాదాలు మిత్రులారా. నిన్న రాత్రి ఆలస్యంగా మిమ్మల్ని కలిసే అవకాశం నాకు లభించింది. నా వీడియోకు మీరు స్పందించిన తీరును, మీ సానుకూల సూచనలను నేను అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు..." అని అన్నారు. కాగా నిన్న (గురువారం) నీట్ లీకేజ్‌పై జరుగుతున్న నిరసనలపై మోదీ కీలక ప్రకటన చేశారు" నీట్ లీకేజ్‌పై కేంద్ర కేబినేట్లో పేపర్‌లీక్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీకెజ్‌లపై కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయాలుంటాయని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ వివరాలను ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. #WATCH | Prime Minister Narendra Modi shared a video on his Instagram handle;, "Thanks to the youngsters who watched my video yesterday and sent insightful suggestions."He says, "Thank you friends. I had the opportunity to meet you late last night. I appreciate the way you… https://t.co/B4hrqwPwic pic.twitter.com/t6hfaVcvET— ANI (@ANI) July 24, 2026 -
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు మోదీ క్లాస్
ఢిల్లీ :కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకారు. సోషల్ మీడియాలో మంత్రులు యాక్టివ్‌గా ఉన్నారా.. లేదా అని నిలదీశారు. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది యాక్టివ్‌గా ఉన్నారని ఆరా తీశారు. మంత్రులందరూ సోషల్ మీడియాలో కచ్చితంగా యాక్టివ్‌గా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అందులో పోస్ట్ చేయడం కాదు.. వాటి గురించి అర్థం అయ్యేలా వీడియోలు పోస్ట్ చేయాలన్నారు. యువత ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, మంత్రులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ వారితో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిందేనన్నారు మోదీ. -
పేపర్ లీక్ చేస్తే.. 10 ఏళ్లు జైలుకే.. మోదీ కేబినెట్ కఠిన నిర్ణయాలు
-
GEN Zతో పెట్టుకున్నావ్.. యువతకు పొట్టు పొట్టు ఆకలి ఉంది..
-
కేంద్రం కీలక నిర్ణయం..10ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా!
సాక్షి,న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమల్లోకి వచ్చాయి. ఇకపై పేపర్ లీకేజీకి పాల్పడినట్లు తేలితే ఎంతటి వారైనా పదేళ్ల జైలుశిక్ష, పదికోట్లు జరిమానా విధించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో.. పేపర్ లీక్‌లు, మోసాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. పేపర్ లీకేజీ పాల్పడిన నిందితులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి వీడియో సందేశంలో దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా చట్టానికి మరింత బలం చేకూర్చింది. రాబోయే మార్పులను వివరిస్తూ పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధనను చట్టంలో చేర్చినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తాను ఆదేశించినట్లు ప్రధాని మోదీ గురువారం ఉదయం పోస్ట్ చేశారు. ఈ ఫాస్ట్-ట్రాక్ కోర్టులు మూడు నెలల్లోగా కేసును పరిష్కరించి, శిక్షను ప్రకటించాల్సి ఉంటుంది. పేపర్ లీక్‌లలో పాల్గొన్న వారికి జైలు శిక్ష,జరిమానాలను కూడా పెంచే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశంలో పేపర్ లీకేజీకి పాల్పడిన నేరస్తులను పట్టుకున్నాం. వాళ్లిప్పుడు జైల్లో ఉన్నారు. విద్యార్థుల ఎడ్యుకేషన్ ఇయర్ వృథా కాకూడదనే వెంటనే నీట్ పరీక్ష నిర్వహించాం. కనీసం 22 లక్షల మంది విద్యార్థులకు సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తన పూర్తి శక్తిని వినియోగించింది.ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి నేను సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశాను. ఆయా శాఖలు తీవ్రంగా శ్రమించి, రాత్రికి రాత్రే దీనికి ఆమోదం తెలిపాయి. రేపు (శుక్రవారం) దీనిపై మంత్రివర్గంలో చర్చ జరుగుతుంది. మంత్రివర్గ సభ్యుల సూచనల అనంతరం దీనికి తుది రూపం ఇస్తారు. పార్లమెంట్ సమావేశాల రెండో వారం ప్రారంభమయ్యే సోమవారం నుంచే, ఆ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేసేందుకు ప్రయత్నిస్తాం’అని అన్నారు.ప్రధాని మోదీ వీడియో ప్రకటనపై స్పందిస్తూ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి నొక్కి చెప్పారు. -
ప్రధాని వీడియో సందేశం ఏంటీ? కాక్రోచ్ ఉద్యమం వెసక ఉన్నదెవరు?
-
ధర్మేంద్ర రాజీనామా నుంచి PM మోదీ రాజీనామా వరకు వెళ్లిందంటే.. నెక్స్ట్ జరగబోయేది అదే..
-
సిరిసిల్ల: ‘నా చావుకి ప్రధాని మోదీనే కారణం’
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తన చావుకు ప్రధాని నరేంద్రమోదీ కారణమంటూ సూసైడ్‌నోట్ రాసి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం కలకలం రేపింది. సర్(ఎస్ఐఆర్) ఫామ్‌పై సూసైడ్‌నోట్ రాసి చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రధాని మోదీ తన చావుకు ఎందుకు కారణమో ఆ నోట్లో వివరించలేదు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన పిట్ల వంశీ(25) బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ ఫస్టి యర్ వరకు చదువుకున్న వంశీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చదువు అక్కడితోనే ఆపేసి పెయింటింగ్ పని చేసేవాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మృతుడి తండ్రి పిట్ల బాలయ్య ఫిర్యాదు మేరకు తల్లి తిట్టిందన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. అంత్యక్రియల ఖర్చులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.20వేలు పంపించారు. వంశీ కుటుంబానికి అండగా ఉంటామని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. అంత్యక్రియల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీగా శ్మశానవాటిక వద్దకు వెళ్లారు. నా చావుకు ప్రధాని నరేంద్ర మోదీ కారణం SIR ఫాం మీద సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వంశీ అనే యువకుడునా చావుకు కేవలం ప్రధాని నరేంద్ర మోదీ కారణమని, ఎవరిని ఏం… pic.twitter.com/kU98biYIbX— Telugu Scribe (@TeluguScribe) July 23, 2026 -
NEET పేపర్ లీక్ పై మోదీ సంచలన వీడియో
-
మోదీ వీడియో.. వాంగ్‌చుక్ దీక్ష విరమణపై సీజేపీ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నీట్ నిరసనల్లో భాగంగా చేపట్టిన తన దీక్షను విరమించారు. గురువారం రాత్రి మేదాంత ఆస్పత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆయనకు స్వయంగా నీళ్లు తాగించారు. ఆ సమయంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు. అయితే.. వాంగ్‌చుక్ దీక్ష ముగింపుపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పందించింది. వాంగ్‌చుక్ దీక్ష విరమించడంతో తాము కాస్త ఉపశమనం పొందామని, ఆయనకు ఎంతో కృతజ్ఞతతో ఉన్నామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వాంగ్‌చుక్ దీక్ష విరమణతో ఆందోళనలు ఆగిపోతాయా? అనే అనుమానాలకు అభిజిత్ పుల్‌స్టాప్ పెట్టారు. అసాధారణ ధైర్యం.. గొప్ప త్యాగం“26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో, త్యాగంతో పోరాడిన సోనమ్ సర్‌కు ధన్యవాదాలు. మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచించేలా చేశారు. ఈ దేశానికి మీ జీవితం ఎంతో విలువైనది” అని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. అయితే వాంగ్‌చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది. We are relieved and grateful that Sonam sir has ended his hunger strike after 26 days.Thank you, sir, for your extraordinary courage and sacrifice. By putting your own life on the line, you awakened the conscience of an entire nation. Your life is far too precious to this…— Abhijeet Dipke (@abhijeet_dipke) July 23, 2026కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కేంద్రం తీసుకునే కఠిన చర్య. అది నెరవేరే దాకా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన శాంతియుత నిరసనలు కొనసాగుతాయి అని స్పష్టం చేశారాయన. వీ సపోర్ట్ వాంగ్‌చుక్ అనే డీపీని అభిజిత్ ఇంకా ఎక్స్ కొనసాగిస్తుండడం గమనార్హం.కేంద్రం ఇచ్చిన హామీలేంటి?వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించినట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. దేశంలో హింస చోటుచేసుకునే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని షరతులతో దీక్షను ముగించినట్లు వెల్లడించారు. తాను అంగీకరించిన షరతులను త్వరలోనే వీడియో ద్వారా వివరిస్తానని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి హింసకు తావివ్వొద్దని కోరారు.కాగా, జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.జూన్ 28 నుంచి నిరాహార దీక్షపరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకు ముందే జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆయనను జంతర్ మంతర్ నుంచి తరలించి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు అనుమతితో మెదాంత ఆస్పత్రికి మార్చారు. 26 రోజుల దీక్షలో ఆయన సుమారు 11 కిలోల బరువు కోల్పోయినట్లు సమాచారం.పేపర్ లీకులపై కేంద్రం కీలక చర్యలుపరీక్ష పేపర్ లీకుల వ్యవహారంపై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. ఢిల్లీ పరిధిలో రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లో స్పెష్టల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ను నియమించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను ఈ కోర్టు విచారించనుంది. ఇటు విద్యాశాఖలో ఉన్నతాధికారుల మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసి ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్‌ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీ.కే. అనిల్‌కుమార్‌ను నియమించింది.మోదీ వీడియో మెసేజ్.. రాహుల్ కౌంటర్ప్రధాని మోదీ తొలిసారిగా వీడియో సందేశం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నీట్ పేపర్ లీక్ అతిపెద్ద సమస్య.. పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కాపాడటమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. పేపర్ లీకులపై కఠిన చర్యలు ఉంటాయని.. ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. పలువురు అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారాయన. విద్యా సంస్కరణలు తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు ఇవాళ్టి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయని ఓ వీడియో సందేశంలో తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026అలాగే సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణపైనా మోదీ స్పందించారు. వైద్యుల సలహా మేరకు వాంగ్‌చుక్ తన దినచర్యను కొనసాగించాలని.. త్వరగా కోలుకొని మునుపటి ఆరోగ్యం పొందాలని ఆకాంక్షించారు.అయితే.. మోదీ ట్వీట్‌పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మంత్రితో రాజీనామా చేయించకుండా.. విద్యార్థుల్ని అవమానించొద్దు అని రీట్వీట్ చేశారు. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పి.. ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని, విద్యార్థులు కోరుకునేది ఇదేనని అన్నారాయన. అలాగే లీకులకు పాల్పడిన వాళ్లపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన వాళ్లపైనా చర్యలకు రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. Mr. Modi, our students are demanding Dharmendra Pradhan’s resignation.Don’t insult their intelligence with this pathetic midnight video. 1. Sack Pradhan.2. Punish those who beat students.3. Apologise https://t.co/7SLB6pQqZx— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2026మాకు రాజీనామానే కావాలిఇటు మోదీ వీడియో సందేశంపై సీజేపీ స్పందించింది. కేంద్రం తీసుకున్న చర్యలు సరిపోవని.. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని అంటోంది. జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. “ఒక్క మంత్రి పదవి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కంటే గొప్పది కాదు. విద్యార్థుల న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది” అని సీజేపీ తెలిపింది. మరోవైపు సీజేపీతో ఏ టైంలోనైనా.. ఎక్కడైనా చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్రం.. రాజీనామా డిమాండ్ విషయంలో మాత్రం తలొగ్గే తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు ఇస్తోంది. ఇవాళ మధ్యాహ్నాం సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. -
యువత కళ్లలోకి చూసే ధైర్యం మోదీకి ఉందా?
న్యూఢిల్లీ: ఢిల్లీ వీధుల్లో రక్తమోడిన యువత కళ్లలోకి నేరుగా చూసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. యువతకు అన్ని దారులు మూసుకుపోయాయని, ఇక వారు ఎక్కడికి వెళ్లాలని అన్నారు. నరేంద్ర మోదీ హయాంలో విద్యా వ్యవస్థ క్షీణించిపోయిందని ఆరోపించారు. ప్రజలకు ఊరట మాటలు గానీ, శాంతి ప్రకటనలు గానీ అవసరం లేదన్నారు. మోదీ ప్రభుత్వం యువతపై లాఠీచార్జి చేసిందని, సొంత పిల్లలు కానట్లుగా నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. ఈ మేరకు ఖర్గే గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘మీ ఏసీ గదుల విలాసవంతమైన కోటల నుంచి బయటకు రండి. మీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ వీధుల్లో రక్తమోడ్చిన యువతీ యువకుల కళ్లలోకి నేరుగా చూడండి’’అని మోదీకి తేలి్చచెప్పారు. విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నేరవేర్చాలని స్పష్టంచేశారు. దేశంలో విద్యా వ్యవస్థ ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో చిక్కుకుందని ఖర్గే ఆరోపించారు. మోదీ చేసిన ప్రకటన కంటితుడుపు చర్యగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ అభివరి్ణంచారు. యువత దీన్ని అంగీకరిస్తారనే భ్రమలో ప్రధానమంత్రి ఉన్నారని ఆక్షేపించారు. టూ లిటిల్, టూ లేట్ పేపర్ లీక్‌ల దోషులను శిక్షించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రధానమంత్రి ప్రకటనను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘చాలా తక్కువ, చాలా ఆలస్యం’అని కొట్టిపారేశారు. అది మోసపూరితమైన ప్రకటన అని విమర్శించారు. విద్యార్థులు అలాంటి తక్కువ స్థాయి చర్యలను అంగీకరించలేరని పేర్కొన్నారు. పేపర్ లీకేజీలను నివారించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. -
రాజకీయ మనుగడ కోసమే అరాచకాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల జరిగిన ప్రవేశపరీక్షల పత్రాల లీకేజీలను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్, వామపక్ష పారీ్టలు రాజకీయ మనుగడ కోసం అరాచకాలకు పాల్పడుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. విద్యార్థులను కవచంగా వాడుకుంటూ దేశ వ్యతిరేక శక్తులు, తుక్డే గ్యాంగులతో కలిసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ షహీన్‌బాగ్ తరహాలో దేశంలో అలజడి సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నీట్ లీకేజీపై తక్షణ చర్యలు తీసుకున్నాం... నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 17 మందిని సీబీఐ అరెస్టు చేసిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం ద్వారా దోషులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారన్నారు. రెండోసారి పకడ్బందీగా పరీక్ష నిర్వహించామని.. విద్యార్థులంతా సంతోషంగా ఉన్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలకు దమ్ముంటే పార్లమెంటులో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చకు రావాలని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. టెన్త్ పేపర్ లీకైనప్పుడు రేవంత్ రాజీనామా చేయలేదేం? గతంలో కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రశ్నపత్రాల లీకేజీలు జరిగినా ఏనాడూ బాధ్యత వహించని నేతలు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ రాజీనామాను డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డిలకు రాజీనామాలు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. 2025లో టెన్త్ పేపర్ లీక్ అయినప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. 2026లో జగిత్యాలలోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ పేపర్ లీక్ అయినప్పుడు కాంగ్రెస్ మంత్రులతో రాజీనామా చేయించారా అని నిలదీశారు. దీనిపై సమాధానం చెప్పాకే రేవంత్‌రెడ్డి నీట్ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. -
కొడంగల్‌లో ధర్నా రాజకీయ నాటకం
సాక్షి ప్రతినిధి, వరంగల్: నీట్ పరీక్ష ఉదంతంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోదీ పేరును ప్రస్తావించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంపై రాజ్ భవన్ ముందు ధర్నా చేయాల్సిందిపోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకమేనన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, మంత్రులు హైదరాబాద్‌లో ధర్నా చేస్తే ఆయన కొడంగల్‌కు పోయి అక్కడ ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. ‘మోదీ అంటే రేవంత్‌కు భయం. ఆయన పగలు కాంగ్రెస్‌తో ఉంటాడు. రాత్రయితే బీజేపీతో కలుస్తాడు..’అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు ఒక మూట ఇస్తే బీజేపీకి రెండు మూటలు పంపుతున్నాడని ఆరోపించారు. సీఎంపై ఉన్న పాత కేసులను బీజేపీ ప్రభుత్వం తోడుతుందనే ఉద్దేశంతోనే ప్రధాని పేరును కూడా పలకడానికి భయపడుతున్నాడని విమర్శించారు. గురువారం హనుమకొండ జిల్లా మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు ‘ఇది మూటలు పంపే పాలన. ప్రజలకు ఉపయోగపడే ఏ పని రేవంత్ చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టులను తన బంధువులకు ఇప్పించుకుంటున్నారు. బొగ్గు కుంభకోణంలో ఎవరున్నారో అందరికీ తెలుసు. ఆయన బామ్మర్ది సృజన్‌రెడ్డికి మేలు జరిగే విధంగా వ్యవహరించారు. కన్నెపల్లి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయరు? బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులేవీ కాంగ్రెస్ హయాంలో పూర్తి చేయడం లేదు. ఆ పనులు పూర్తి చేస్తే మాకు పేరొస్తుందని సీఎం భయపడుతున్నారు. దేవాదుల నుంచి నీటిని లిఫ్ట్ చేసినప్పుడు కన్నెపల్లి నుంచి ఎందుకు నీటిని పంపిణీ చేయరు? కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయకుండా తాము ఆపలేదని, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు..’అని కేటీఆర్ అన్నారు. నాలుగు పార్టీలు మారి హరీశ్‌రావుపై ఆరోపణలా? ‘హరీశ్‌రావు పార్టీ మారరు. బీఆర్ఎస్ పార్టీ లోనే తన పుట్టుక, చావు అని ఇప్పటికే పలుమార్లు హరీశ్‌రావు ప్రకటించారు. అయినా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. హరీశ్‌రావుపై నాలుగు పార్టీలు మారిన రేవంత్‌రెడ్డి కామెంట్ చేయడం విడ్డూరంగా ఉంది. ఎవరితోనూ పొత్తులుండవు.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు. కవిత అంశంపై కూడా వ్యక్తులుగా కాకుండా వ్యవస్థలుగానే మాట్లాడతాం. కేసీఆర్ దయవల్లే మేమంతా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరగొచ్చు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 179 వరకు పెరిగే అవకాశం ఉంది. పునర్విభజన వల్ల నా నియోజకవర్గం మారే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలో ఉండటమే నాకు ఎక్కువ సంతృప్తినిస్తోంది.ప్రజా సమస్యలపై అంశాల వారీగా ఉద్యమాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే రైతులు, నిరుద్యోగులతో సమావేశాలు నిర్వహించాం. త్వరలో ఇతర వర్గాలతో కూడా సమావేశాలు చేపడతాం. నిరుద్యోగం, యువత సమస్యలు, రైతుల ఇబ్బందులపై బీఆర్ఎస్ మరింత దూకుడుగా పోరాటాలు కొనసాగిస్తుంది. అలాగే వచ్చే ఏడాది పాదయాత్ర కూడా చేస్తా. త్వరలోనే తేదీలు, వివరాలు ప్రకటిస్తాం. విద్యార్థుల ఆగ్రహం మోదీపైకి మళ్లింది.. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అంశంపై విద్యార్థుల ఆందోళనలు పెరుగుతున్నాయి. మొద ట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తున్నారు. దేశంలో యువత, నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసంతృప్తే దీనికి కారణం. మోదీ ప్రభుత్వం ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకుంది..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం పదవి వారసత్వ హక్కు కాదు.. ‘ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. సీఎం పదవి అనేది వారసత్వ హక్కు కాదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు, రాష్ట్ర సాధకుడు.. కేసీఆర్ కుమారుడిగా, ఈ తెలంగాణ బిడ్డగా రాష్ట్ర సాధన పోరాటంలో మమేకం అయినందుకు గర్వపడుతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. పదవులు ప్రజల అభీష్టం మేరకు వస్తాయని, ప్రజలు ఏది కోరుకుంటే అదే అవుతుందని అన్నారు. -
నీట్ పేపర్ లీకేజ్‌పై మోదీ కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: నీట్ లీకేజ్‌పై నిరసనలు తీవ్ర తరమవుతున్న వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు కేంద్ర కేబినేట్లో పేపర్‌లీక్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. పేపర్ లీకెజ్‌లపై కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయాలుంటాయని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ వివరాలను మోదీ స్వయంగా వెల్లడించారు.రీఎగ్జామ్ తర్వాత విద్యార్థులు సంతోషంగా ఉన్నారని విద్యాసంవత్సరం వృథా కాకూడదని తిరిగి పరీక్ష నిర్వహించామని మోదీ తెలిపారు. లక్షలాది మంది విద్యార్థుల హృదయాలను పేపర్ లీకేజ్‌లు గాయపరిచాయన్నారు. పరీక్ష విధానంలో సంస్కరణలు తెస్తామని తెలిపారు. ఈ మేరకు సోమవారం సభలో ప్రత్యేక బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. అదేవిధంగా నీట్ పేపర్ లీక్ బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేశారు. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026 -
కాక్రోచ్ నిరసనపై PM మోదీ రియాక్షన్
-
మోదీ ట్వీట్‌కు రాహుల్, సీజేపీ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీకుల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించాయి.ప్రధాని మోదీ స్పందిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పేపర్ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఎవరినీ వదిలిపెట్టం’’ అని ప్రధాని స్పష్టం చేశారు.రాహుల్ గాంధీ ఘాటు స్పందనప్రధాని ట్వీట్‌పై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ‘‘యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే’’ అంటూ విమర్శించారు. పేపర్ లీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాహుల్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.మంత్రి రాజీనామా చేయాల్సిందే:సీజేపీమరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ కూడా ప్రధాని మోదీ ట్వీట్‌పై స్పందించింది. పేపర్ లీకుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. అలాగే విద్యార్థులపై దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్ఘాటించింది. అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేపీ కోరింది. -
పేపర్ లీకులకు చెక్! కేంద్రం సంచలన నిర్ణయం
పేపర్ లీకేజీ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పవిత్రతను కాపాడేందుకు.. అక్రమాలకు పాల్పడే వారికి త్వరగతిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వెల్లడించారు. యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే తమకు ఏదీ ముఖ్యమైనది కాదని స్పష్టం చేశారు.ఈ మేరకు గురువారం ఉదయం ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులపై కఠిన, వేగవంతమైన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, విభాగాలకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.“యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదు. పేపర్ లీకులకు పాల్పడి యువత భవిష్యత్తును దెబ్బతీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.Nothing is more important than the welfare and future of our youth!We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…— Narendra Modi (@narendramodi) July 23, 2026విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు చర్యలుపరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటోందని ప్రధాని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పేపర్ లీకులు, పరీక్షల్లో అక్రమాలు లక్షలాది మంది విద్యార్థుల శ్రమను దెబ్బతీస్తాయని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది.నీట్ వివాదం వేళ ప్రధాని ప్రకటననీట్–యూజీ పరీక్షలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న సమయంలో ప్రధాని ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పరీక్షల నిర్వహణపై విశ్వసనీయతను పునరుద్ధరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న వేళ.. కేంద్రం వేగవంతమైన న్యాయ ప్రక్రియపై దృష్టి సారించింది.ఇటీవల పేపర్ లీకేజీ కేసుల్లో పలువురిపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇకపై ఇలాంటి వ్యవహారాల్లో విచారణ, శిక్షల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయ వ్యవస్థను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.“యువత భవిష్యత్తుతో ఆటలాడితే క్షమించం”పేపర్ లీకుల వ్యవహారాన్ని మహా పాపంగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నాలను సహించబోమని ఇదివరకే స్పష్టం చేశారు. పరీక్షల వ్యవస్థపై విద్యార్థులకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వం నిరంతరం చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. అయితే పేపర్ లీకేజీ అంశంపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం.. నీట్ నిరసనకారులను శాంతింపజేస్తుందా? అనేది చూడాలి. -
భారత్‌లో నిరసనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
భారత్‌లో జరుగుతున్న నిరసనలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న నిరసనలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా ఇలా అన్నాడు.I am disturbed because every protest in India seems to have the same script.1. Abuse Lord Ram.2. Abuse Bharat Mata.3. Abuse PM Modi.4. Abuse PM Modi’s late mother.5. Abuse Brahmins.6. Abuse Hindutva.No discussion.No solutions.Only slogans, abuse, and chaos.The…— Danish Kaneria (@DanishKaneria61) July 22, 2026"భారత్‌లో జరిగే ప్రతి నిరసనకూ ఒకే రకమైన స్క్రిప్ట్ ఉండటం బాధాకరం. అనేక నిరసనల్లో సమస్యల పరిష్కారం కంటే రాముడిని తిట్టడం, భరతమాతను తిట్టడం, నరేంద్ర మోదీని, ఆయన తల్లిని తిట్టడం, హిందుత్వం, బ్రాహ్మణులపై విమర్శలు చేయడమే ఎక్కువగా కనిపిస్తుంది. చర్చలు లేవు, పరిష్కారాలు లేవు.. నినాదాలు, దూషణలు, గందరగోళమే కనిపిస్తుంది.అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఇంకా ఖరారు కాకముందే కొందరు రైతులు ఢిల్లీ ముట్టడికి సిద్ధమవుతున్నారు.ప్రతిపక్ష రాజకీయ వర్గాలు నేపాల్ తరహా పరిస్థితిని సృష్టించగలమనే భ్రమలో ఉన్నాయి. రోజురోజుకు పరిస్థితి మరీ సర్కస్‌లా మారుతుంది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా నిరసన తెలపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, దేశం ఎలా పురోగమించగలదు" అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.దానిష్ కనేరియా చేసిన ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతడి అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ప్రాముఖ్యతను గుర్తు చేస్తున్నారు.కాగా, పాక్ మాజీ లెగ్ స్పిన్నర్ అయిన కనేరియా గతంలోనూ భారత దేశానికి, ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడి వార్తల్లో నిలిచాడు. కనేరియా హిందువు కావడంతో పాక్ జట్టులో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని గతంలో చాలాసార్లు ప్రస్తావించాడు. -
సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, పోలీసుల చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన ఆయన, విద్యార్థుల సమస్యలను చట్టం, వ్యవస్థ అంశంగా కాకుండా సామాజిక సమస్యగా చూడాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించారు.జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సీజేపీ నిర్వహించిన ‘చలో సంసద్’ ర్యాలీ.. పరీక్షలలో అవకతవకలు, పేపర్ లీకులు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వంటి డిమాండ్లతో జరిగింది. అనంతరం ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ద్వారా నిరసనకారులను చెదరగొట్టారు.ఈ నేపథ్యంలో స్పందించిన అన్నా హజారే తన లేఖలో ప్రజాస్వామ్యంలో హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, అవసరం లేని బలప్రయోగానికి స్థానం లేదని పేర్కొన్నారు. పేపర్ లీకులు, ఉద్యోగ నియామకాలలో జాప్యం, నిరుద్యోగం వంటి అంశాలపై యువత వ్యక్తం చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించాలని కోరారు. నీట్ (NEET) పరీక్ష వివాదాన్ని ప్రస్తావించిన హజారే, ప్రభుత్వ వ్యవస్థలో లోపాలు బయటపడినప్పుడు కేవలం కింది స్థాయి ఉద్యోగులపైనే బాధ్యత మోపడం సరికాదన్నారు. సంబంధిత శాఖకు రాజకీయ బాధ్యత వహించే మంత్రులు కూడా జవాబుదారీతనం చూపాలని సూచించారు. అవసరమైతే శాఖా వైఫల్యాలపై మంత్రిని తప్పించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినదని, బాధ్యతాయుత పాలనకు అది సంకేతంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.‘ప్రజాస్వామ్యంలో ఘర్షణ కంటే సంభాషణే ఉత్తమ మార్గం. ప్రజల గొంతును ప్రతిపక్ష స్వరంగా మాత్రమే చూడకూడదు. విభేదాలు సహజం. వాటిని చర్చలు, పరస్పర గౌరవంతో పరిష్కరించాలి’ అని హజారే లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సీజేపీ ఆందోళనల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. మరోవైపు లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ నిరాహార దీక్ష విషయంలో కూడా ప్రభుత్వం చర్చలకు ముందుకు రావాలని అన్నా హజారే మరోసారి విజ్ఞప్తి చేశారు. -
ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ పరిణామాలు వే గంగా మారిపోతున్నాయి. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లోని రెండు వర్గా లు ఒక్కటైపోయి, ఎన్డీయేలో చేరుతాయన్న ఊహాగానాలు నిజమేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. మోదీతో భేటీ అనంతరం శరద్ పవార్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నీట్–యూజీ పేపర్‌పై విద్యార్థులు డిమాండ్లు, రైతుల సమస్యలు, వాటర్ మేనేజ్మెంట్, విద్యా రంగం సమస్యలపై తాము చర్చించినట్లు తెలిపారు. ఎన్సీపీలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గానికి శరద్ పవార్, మరో వర్గానికి ఆయన కోడలు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ నేతృత్వం వహిస్తున్నారు. సునేత్ర పవార్ పార్టీ ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతోంది. శరద్ పవార్ పార్టీ విపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగస్వామి. రెండు పార్టీలు విలీనమై, ఎన్డీయేలో చేరుతాయన్న ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ఈ మెజార్టీ కోసం ఎన్డీయే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్సీపీలోని వర్గాలను ఏకం చేసే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. -
నీట్ మంటలు.. కేంద్రానికి రాహుల్ గాంధీ ఐదు డిమాండ్ల అస్త్రం
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, విద్యార్థులపై పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ఢిల్లీలో భారీ నిరసన చేపట్టింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార నివాసం లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అదుపు తప్పకుండా ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వివిధ ప్రాంతాలకు తరలించారు. అనంతరం మంగళవారం రాత్రి వారిని విడుదల చేశారు.రాహుల్ గాంధీని ఛత్రసాల్ స్టేడియానికి తరలించగా, ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రియాంకను పరామర్శించేందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్, ప్రియాంకతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్బంగా నిర్బంధంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ వీడియో సందేశం విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు కీలక డిమాండ్లు ఉంచారు.కీలక డిమాండ్లు..👉కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, 👉విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 👉విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 👉అలాగే విద్యార్థులపై జరిగిన చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి క్షమాపణ చెప్పాలని, 👉నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో తక్షణమే చర్చ నిర్వహించాలని, 👉దేశ విద్యా వ్యవస్థతో పాటు పోటీ పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కోరారు.దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..‘భారత్‌లో విద్యా వ్యవస్థ ఎందుకు కుప్పకూలుతోంది? ప్రశ్నపత్రాలు ఎందుకు వరుసగా లీకవుతున్నాయి? విద్య ఎందుకు అంత ఖరీదుగా మారింది? పిల్లలను చదివించడానికి కుటుంబాలు ఎందుకు అప్పుల పాలవుతున్నాయి? ఇవి లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అడుగుతున్న సహజమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అడగడంలో ఎలాంటి తప్పు లేదు’ అని వ్యాఖ్యానించారు. బుధవారం లోక్‌సభ, రాజ్యసభల్లో ఈ అంశంపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలన్నీ కోరుతున్నాయని తెలిపారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.भारत के छात्रों और प्रधानमंत्री को मेरा सीधा संदेश... pic.twitter.com/pgZZHLLz8h— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026మరోవైపు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలిపినా, కాంగ్రెస్ విద్యార్థుల సమస్యలకు పరిష్కారం వెతకడం కంటే రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయ లబ్ధే రాహుల్ గాంధీ లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన 'ఎక్స్'లో పేర్కొన్నారు. -
పేపర్ లీకేజీ... ఘోరమైన పాపం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన నీట్–యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ప్రశ్నపత్రాలను లీక్ చేయడం ‘ఘోరమైన పాపం’గా అభివర్ణించారు. ఈ పాపానికి ఒడిగట్టినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. యువత భవిష్యత్తుతో ఆటలాడితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు. మంగళవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ‘మంగళ్ మిలన్’పేరిట జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. పేపర్ లీక్ అనేది పార్టీల రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని.. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని వెల్లడించారు. ఈ జాఢ్యాన్ని అంతం చేయడానికి కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో ఆప్యాయత, అనురాగంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని, యువత విశ్వాసాన్ని పొందాలని ఎన్డీయే ఎంపీలకు సూచించారు. ‘మంగళ్ మిలన్’ముగిసిన అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రసంగం వివరాలను వెల్లడించారు. ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వార్తలు రాగానే ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపిందంటూ ప్రధానమంత్రి చెప్పారని వెల్లడించారు. ఈ సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని, ప్రధాని అనేక ముఖ్యమైన అంశాలపై మాట్లాడారని రిజిజు పేర్కొన్నారు. యువతతో ఎంపీలు మమేకం కావాలి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ‘నీట్’పునఃపరీక్షకు ప్రాధాన్యతనిచి్చ, దానిని విజయవంతంగా నిర్వహించి, ఫలితాలను ఎటువంటి జాప్యం లేకుండా ప్రకటించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్‌లు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో రాజకీయాలు చేయడం తగదని పేర్కొన్నారు. యువత విశ్వాసాన్ని పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా యువతతో మమేకం కావాలన్నారు.వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించాలని చెప్పారు. నీట్ పేపర్ లీకేజీలో ప్రమేయం ఉన్నవారికి కఠిన శిక్ష పడేలా చూసేందుకు అత్యంత సమర్థులైన న్యాయవాదులను రంగంలోకి దించినట్లు గుర్తుచేశారు. దోషులను శిక్షించాలని, పేపర్ లీకేజీలు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉద్ఘాటించారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని అన్నారు. వారిని తప్పుదోవ పట్టించడం సులభమే అయినప్పటికీ సరైన మార్గంలో నడిపించడం మాత్రం కష్టమని వ్యాఖ్యానించారు. వారు మంచిమార్గంలో నడిచేలా చూడడం మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, యువత భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఎఫ్‌టీఏలతో దేశానికి లాభం అలాగే గత కొన్ని నెలల్లో దేశం సాధించిన విజయాల మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల అనేక దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్‌టీఏ) గురించి ఎన్డీయే ఎంపీలకు వివరించారు. ఈ ఒప్పందాలతో మన రైతాంగానికి, మన దేశానికి లాభమే తప్ప ఎలాంటి నష్టం జరగదన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. దేశ శ్రేయస్సు కోసం జీవితంలోని ప్రతి క్షణాన్నీ అంకితం చేయాలని ఎంపీలను కోరారు. ‘‘దేశమే ప్రథమం, దేశ పురోగతి, సంక్షేమం కోసం మనం నిరంతరంకృషి చేయాలి’’అని పిలుపునిచ్చారు. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులకు ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాన సేవక్ (ప్రధాని మోదీ) శరీరంలోని ప్రతి అణువూ, ఆయన సమయంలోని ప్రతి క్షణమూ పిల్లల భవిష్యత్తు కోసమే అంకితం’’ అని బీజేపీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. -
ప్రధాని నివాసం 'యుద్ధరంగం'
న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల ధర్నాతో ఢిల్లీ లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాస ప్రాంతం అట్టుడికింది. న్యాయం చేయాలని కోరిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు మంగళవారం గొంతెత్తాయి. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్ సహా పలు పార్టీల ఎంపీలు, నేతలు హైసెక్యూరిటీ జోన్ అయిన ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాల హోరుతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అరుపులు, తోపులాటలతో యుద్ధ రంగాన్ని తలపించింది. దాదాపు 20 నిమిషాల తర్వాత కేంద్ర ప్రభుత్వ దూతగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి ధర్నా స్థలికి చేరుకున్నారు. నిరసన విరమించాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఫోన్లో మాట్లాడారు. నీట్–యూజీపై పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకు కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. మోదీ రాజీనామా చేయాల్సిందేనని, లేకపోతే రాత్రంతా ఇక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. చేసేది లేక జితేంద్ర సింగ్ వెనుదిరిగారు. ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛపై ఆంక్షలు విధించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు తమ చేతులను తాళ్లతో కట్టేసుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగింది. చివరకు పోలీసులు ప్రతిపక్ష నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకొని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు..విద్యార్థులపై దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబంపై దాడి జరిగినట్లేనని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎలాంటి సమాధానాలు చెప్పకుండా, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోకుండా తప్పించుకోగలనని ప్రధాని మోదీ భావిస్తున్నారని.. కానీ, ఈసారి అలా చేయడం కుదరదని తేల్చిచెప్పారు. ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు. మన విద్యార్థులకు న్యాయం జరగాలని విశ్వసించే దేశభక్తి గల ప్రతి భారతీయుడు ఈ ధర్నాలో తమతో చేరాలని రాహుల్ కోరారు. విద్యార్థుల గళాన్ని ఎవరూ విస్మరించలేరని చెప్పారు. ‘‘సోమవారం విద్యార్థులపై జరిగిన అరాచకాలకు సంబంధించి ప్రధాని మోదీ నుంచి సమాధానం కోరేందుకు ఆయన నివాసానికి ర్యాలీగా వెళ్లాం. జరిగిన దానికి బాధ్యత వహించడానికి గానీ, దీనిపై పార్లమెంట్లో చర్చ జరపడానికి గానీ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థుల హక్కులు, వారి న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది’’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘విద్యార్థులపై లాఠీచార్జి, బలప్రయోగం చేసినందుకు ఈ పిరికిపంద, నియంతృత్వ ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదు. మోదీ, అమిత్ షా మన యువత పట్ల తప్పు చేశారు. వారు పదవుల నుంచి తప్పుకోవాల్సిందే’’ అని మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. విద్యార్థులకు న్యాయం చేసి, వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే దాకా తమ పోరాటం ఆపబోమని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకూ వెనక్కి తగ్గబోమన్నారు. పోలీసులు తమపై బలప్రయోగం చేశారని కొందరు ఎంపీలు ఆరోపించారు. సోమవారం జరిగిన లాఠీచార్జిలో గాయపడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.అరెస్టు.. విడుదల ప్రధానమంత్రి నివాసం ఎదుట బైఠాయించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టుచేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించేందుకు ప్రయత్నించాయి. పోలీసులను తనను అరెస్టు చేసే సమయంలో రాహుల్ గాంధీ నేలపై పడుకొని కనిపించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆయనకు స్వల్ప గాయమైంది. రాహుల్‌కు, అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు నిర్బంధించి, ఛత్రసాల్ స్టేడియంకు తరలించారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుతం అమలవుతోంది’’ అని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు. చిత్రంలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు రాహుల్ గాంధీ కంటి కింద గాయం కావడంతోపాటు చేతులు, కాళ్లపై కూడా స్వల్ప గాయాలయ్యాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాహుల్ ముక్కు నుంచి రక్తం కారినట్లు తెలుస్తోంది. తనను అరెస్టు చేస్తున్న ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో షేర్చేశారు. ‘‘మోదీజీ, మీరు ఎంత ఒత్తిడి తెచ్చినా, మీ సర్వశక్తులు ఒడ్డినా సరే విద్యార్థుల న్యాయం జరగడం కోసం సాగుతున్న ఈ పోరాటం మాత్రం ఇప్పుడు ఆగదు’’ అని ఉద్ఘాటించారు. మంగళవారం రాత్రి రాహుల్, అఖిలేష్‌ను ఛత్రసాల్ స్టేడియం నుంచి పోలీసులు విడుదల చేశారు. ప్రియాంక గాంధీని మందిర్‌మార్గ్ స్టేషన్‌కు తరలించారు. ఆమె తల్లి సోనియా గాంధీ స్టేషన్‌కు చేరుకొని ప్రియాంకను పరామర్శించారు. తర్వాత ప్రియాంకను పోలీసులు విడుదల చేశారు.పార్టీ నేతలను అరెస్టు చేసి తరలించిన మందిర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సోనియాగాంధీ రాహుల్ గాంధీ మాట మార్చారు నీట్–యూజీకి సంబంధించిన అన్ని అంశాలపై, దానిపై జరుగుతున్న ఉద్యమంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిపై చర్చకు అంగీకరించిన రాహుల్ గాంధీ కొద్ది నిమిషాల్లోనే వెనక్కి తగ్గారని, ఆ స్థాయి నాయకుడికి ఇది తగదని పేర్కొన్నారు. పార్లమెంట్లో చర్చించడంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని పట్టబట్టారని చెప్పారు. నీట్–యూజీపై పార్లమెంట్లో నిబంధనల ప్రకారం అధికారిక చర్చ కోసం కాంగ్రెస్ ఇప్పటివరకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని తెలిపారు. రాహుల్ గాంధీ వంటి సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత మాట తప్పడం దురదృష్టకరం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని జితేంద్ర సింగ్ ఆక్షేపించారు. పార్లమెంట్లో చర్చకు ఇకనైనా ముందుకు రావాలని ప్రతిపక్షాలకు సూచించారు. -
నీట్ సెగలు: ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థులు.. కాక్రోచ్ పార్టీ తరఫున ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్లతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఈ వివాదం మధ్యలో నిలిచిన ధర్మేంద్ర ప్రదాన్ రాజకీయ నేపథ్యం ఏమిటి? బీజేపీలో ఆయనకు ఉన్న ప్రాధాన్యత ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ పదవి నుంచి తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన్ని తప్పించే సంకేతాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ.. పరీక్షా పత్రాల లీకేజీని ‘ఘోర పాపం’గా అభివర్ణించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వివాదంలో ఉన్న ధర్మేంద్ర ప్రదాన్ నేపథ్యం మరోసారి చర్చకు వచ్చింది.తండ్రి కేంద్ర మంత్రిధర్మేంద్ర ప్రదాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. ఆయన తండ్రి దేవేంద్ర ప్రదాన్ కూడా బీజేపీ సీనియర్ నాయకుడు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తండ్రి రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రదాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీ యువమోర్చా, పార్టీ సంస్థాగత బాధ్యతల వరకు సాగింది.వ్యూహకర్తగా.. బీజేపీలో క్రమంగా ఎదిగిన ధర్మేంద్ర ప్రదాన్ 2004లో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన స్థానం బలపర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణ వ్యూహాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ అధిష్ఠానం దృష్టిలో నమ్మకమైన నాయకుడిగా ఎదిగారు.మోదీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా..2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మేంద్ర ప్రదాన్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా పనిచేసిన ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఉజ్వల యోజన అమలును కేంద్రం ఆయన శాఖకు చెందిన ముఖ్య విజయాల్లో ఒకటిగా పేర్కొంది. ఆ తర్వాత 2021లో ఆయనకు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించారు. జాతీయ విద్యా విధానం (NEP) అమలు, విద్యా రంగంలో సంస్కరణలపై ఆయన దృష్టి పెట్టారు.నీట్ వివాదమే ఇప్పుడు అతిపెద్ద పరీక్షవిద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు తెరపైకి రావడం ధర్మేంద్ర ప్రదాన్‌కు అతిపెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుందని చెబుతోంది. లీక్ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామని స్పష్టం చేస్తోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీట్ లీక్‌లో నిందితులపై చర్యలు తీసుకున్నామని, విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారు.Birthday wishes to Union Minister Shri Dharmendra Pradhan Ji. He is making commendable efforts towards the implementation of the National Education Policy, which seeks to make India a hub for knowledge, learning and innovation. Praying for his long and healthy life.@dpradhanbjp— Narendra Modi (@narendramodi) June 26, 2026బీజేపీలో ఎందుకు కీలకం?ధర్మేంద్ర ప్రదాన్‌ను బీజేపీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరిగా భావిస్తారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో ఆయనకు ఉన్న అనుభవం అధిష్ఠానం దృష్టిలో ప్రత్యేక స్థానం కల్పించింది. ఒడిశాకు చెందినప్పటికీ.. ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయికి చేరింది. మోదీ-షా నాయకత్వానికి సన్నిహితంగా ఉండే నేతల్లో ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. అందుకే ప్రస్తుత నీట్ వివాదం నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా.. ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ముందున్న అసలు సవాల్ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు.. మరోవైపు ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడి.. ఇంకోవైపు దేశవ్యాప్తంగా పరీక్షా వ్యవస్థపై తగ్గిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత.. ఇవన్నీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రదాన్ ముందున్న సవాళ్లు. మంత్రి పదవి కొనసాగుతుందా? లేదా?? అన్నది రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉన్నప్పటికీ.. కోట్లాది విద్యార్థులు నమ్మే పరీక్షా వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడం ఆయన ముందున్న అసలు పరీక్షగా మారింది.కుటుంబ నేపథ్యం.. వ్యక్తిగత జీవితంధర్మేంద్ర ప్రదాన్ భార్య పేరు మృదులా ప్రదాన్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. కుటుంబాన్ని రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతూ, ఎక్కువ సమయం పార్టీ మరియు ప్రభుత్వ బాధ్యతలకే కేటాయించే నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ధర్మేంద్ర ప్రదాన్‌కు చర, స్థిరాస్తులు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు, ఆస్తుల వివరాలను ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లలో క్లియర్‌గా వెల్లడించారు. -
నీట్ వివాదంపై మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షా పత్రాలను లీక్ చేయడం ‘ఘోర పాపం’ అని అభివర్ణించిన ఆయన.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమీపంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు కొనసాగుతున్న వేళ.. ఎన్టీయే (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వివరాలు వెల్లడించారు.‘తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’నీట్ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ప్రధాని పేర్కొన్నట్లు కిరణ్ రిజిజు తెలిపారు. లీక్‌కు పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేశామని.. ఇప్పటివరకు 13 మంది నిందితులు జైలులో ఉన్నారని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగించే ఇలాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ప్రధాని స్పష్టం చేసినట్లు తెలిపారు. నిందితులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు అవసరమని పేర్కొన్నట్లు చెప్పారు.విద్యార్థుల ప్రయోజనాలే ప్రాధాన్యంనీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ప్రధాని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని.. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు రిజిజు వెల్లడించారు. లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ పరీక్షకు ప్రభుత్వం రీ-ఎగ్జామ్ నిర్వహించిందని.. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి ఫలితాలను కూడా నిర్ణీత సమయంలో ప్రకటించామని తెలిపారు.పరీక్షా వ్యవస్థలో మార్పులపై దృష్టిపరీక్షా పత్రాల లీకేజీ వంటి ఘటనలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణ విధానంలో మరింత పటిష్ఠమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. పరీక్షల భద్రత, పారదర్శకతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.ఎన్టీయే భేటీలో పలు అంశాలపై చర్చఎన్టీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నీట్ వివాదంతో పాటు పార్లమెంట్ సమావేశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారని తెలిపారు.నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి తప్పుకోవడం లేదా కేంద్రం ఆయనను తప్పించడం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీజేపీ స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని పేర్కొంటూ.. తమ డిమాండ్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు కూడా అందజేసింది. ఆ డిమాండ్లపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా సీజేపీ నిరసనలపై స్పందించారు. యువత సమస్యలను ప్రభుత్వం వినాలని, నీట్ వ్యవహారంలో బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. -
రాహుల్, ప్రియాంక గాంధీ విడుదల
కాక్రోచ్ జనతా పార్టీ తగ్గేదే లే అంటోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌పై పట్టు బట్టి కూర్చుంది. ఈ క్రమంలో రెండో రోజు ఇవాళ పార్లమెంట్ మార్చ్ నిర్వహించబోతోంది. దీంతో ఢిల్లీలో మరోసారి హైఅలర్ట్ నెలకొంది. -
వర్షాలు బాగుండాలి వర్షాకాల సమావేశాలూ బాగుండాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవాలని, అదేమాదిరి వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘రెండూ బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. అప్పుడు అందరి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ఇదే ఆశతో ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుందాం. అదే విధంగా ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సైతం ఫలప్రదంగా సాగాలనీ కోరుకుందాం. సభలో నిర్మాణాత్మక చర్చల ద్వారా దేశ ప్రగతికి, ప్రజా సంక్షేమానికి దోహదపడాలి. రాజకీయాలకు అతీతంగా అనుభవజ్ఞులైన ఎంపీల విజ్ఞానం దేశాభివృద్ధి కోసం ఉపయోగపడాలి. బలమైన వాదనలు ఉన్నప్పుడు ప్రశాంతంగా మాట్లాడినా మన గళాన్ని సమర్థవంతంగా వినిపించవచ్చు’’అని మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో యువత అద్భుతాలు... ‘‘దేశ పురోగతిలో యువత పాత్ర అత్యంత కీలకం. వారి సామర్థ్యాలు, ఆకాంక్షలు అంతరిక్షమంత విశాలమైనవి. గడిచిన నెల రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష రంగాల్లో అసాధారణ మైలురాళ్లను భారత్ అధిగమించింది. భారతీయ వ్యోమగామి గత ఏడాది వర్షాకాల సమావేశాల ముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈసారి వర్షాకాల సమావేశాలకు ముందు భారతీయ అంకుర సంస్థ స్కైరూట్ ప్రయోగించిన విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా గగనతలంలోకి వెళ్లింది. భారతీయ యువత ఆశలు, ఆశయాలకు నింగిలాగా ఎలాంటి హద్దుల్లేవనడానికి ఈ విజయమే నిదర్శనం’’అని మోదీ కొనియాడారు. 7.7 శాతం వృద్ధిరేటు... ‘‘పశి్చమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ఎరువులు, రసాయనాల దిగుమతులపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ భారతదేశం 7.7 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడం దేశానికున్న అపారమైన శక్తికి నిదర్శనం’’అని మోదీ అన్నారు.56 ఏళ్ల యువకుని గురించి మాట్లాడట్లేదు రాహుల్‌కు మోదీ చురక స్కైరూట్ సంస్థ విజయం గురించి మాట్లాడుతూ రాహుల్ గాందీనుద్దేశిస్తూ మోదీ పరో క్షంగా వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. యువకులు ఎంతో సాధిస్తున్నారని, రాహుల్ 56 ఏళ్లు వచ్చినా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విఫలమయ్యారనే అర్థం ధ్వనించేలా మోదీ పరోక్షంగా చురకలంటించారు. ‘‘అంతరిక్షంలో అద్భుతం సృష్టించిన స్కైరూట్ అంకురసంస్థలోని బృంద సభ్యుల సగటు వయస్సు కేవలం 28 ఏళ్లు మాత్రమే. యువత అద్భుతాలు చేస్తోంది. నేనిక్కడ 56 ఏళ్ల యువకుడి(రాహుల్) గురించి మాట్లాడటం లేదు. 28 ఏళ్ల వయస్సున్న దేశీయ యువతే అంతరిక్షంలో భారత జెండాను ఎగరేసింది’’అని మోదీ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ రంగానికి కల్పించిన సంస్కరణల వల్లే సాహసోపేతమైన విజ యాలను యువత సాధిస్తోందని మోదీ అన్నారు. -
నెల రోజులుగా ఎన్నో జరిగాయి: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలకు కీలక విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.సోమవారం సంసద్ భవన్(పార్లమెంట్) ఆవరణలో మీడియా ద్వారా మాట్లాడిన ఆయన.. ‘‘గత నెల రోజులుగా దేశంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. వాటిపై సభలో చర్చలు జరగాలి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ వేదిక కావాలి’’ అని అన్నారు. ఈ సందర్భంలో తాజా స్కైరూట్ విక్రమ్ ప్రయోగంపై ప్రశంసలు గుప్పించారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థ స్కైరూట్ సాధించిన విజయాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతరిక్షంలో నవశకం మొదలైందని.. స్కైరూట్ సంస్థ విక్రమ్ రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం దేశానికే గర్వకారణమని అన్నారు. ‘‘కేవలం 28 ఏళ్ల యువకులు ఈ ఘనత సాధించారు. ఇది భారత యువశక్తికి, కొత్త ఆలోచనలకు నిదర్శనం’’ అని మోదీ పేర్కొన్నారు.56 ఏళ్ల యువకుడ్ని కాదు!అయితే ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. స్కైరూట్ బృందం సక్సెస్‌ను ప్రస్తావిస్తూ.. ‘‘నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారాయన. రాహుల్ గాంధీ వయసు 56 ఏళ్లు కావడంతో.. మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతపై పరోక్ష సెటైర్‌గా భావిస్తున్నారు.సభ సజావుగా సాగాలి..పార్లమెంట్ సమావేశాలు రాజకీయ విభేదాలకు మాత్రమే పరిమితం కాకుండా.. దేశ ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని ప్రధాని ఆకాంక్షించారు. ఎంపీలందరూ సహకరించి నిర్మాణాత్మక చర్చలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, వాదనలు సహజమని.. అయితే సభా సమయం వృథా కాకుండా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం ఏర్పడింది. అన్ని దేశాలు నష్టపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారాయన. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అయినా ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అని అన్నారాయన. ఈ క్రమంలోనే హైడ్రోజన్‌తో నడిచే రైలును పరుగులు పెట్టించినట్లు మోదీ చెప్పారు. ప్రతిపక్షాలకు మోదీ విజ్ఞప్తివర్షాకాల సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చకు అవకాశం ఉండటంతో.. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమన్వయంతో వ్యవహరించాలని ప్రధాని కోరారు.Speaking at the start of the Monsoon Session of Parliament. May this session witness productive discussions that strengthen India's development journey. https://t.co/v25Vg62apy— Narendra Modi (@narendramodi) July 20, 2026 -
రాకెట్ సక్సెస్ కాల్లో బయటపడ్డ మోదీ ఫోన్ సీక్రెట్ ట్యూన్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌కు ‘వందేమాతర కాలింగ్ ట్యూన్’ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. స్కైరూట్ ఏరోస్పెస్ శాస్త్రవేత్తలు ప్రైవేట్ రాకెట్ ప్రయోగ విజయానంతరం ప్రధానికి కాల్ చేసినప్పుడు ఈ ట్యూన్ వినిపించింది. అయితే ఇది ప్రధాని వ్యక్తిగత ట్యూన్ కాదని, అత్యున్నత అధికారిక నంబర్ల కోసం కేటాయించిన ప్రత్యేక రింగ్ బ్యాక్ ట్యూన్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. Skyroot Aerospace की टीम के साथ फोनकॉल के दौरान पता चला पीएम मोदी की कॉलर ट्यून क्या है… जिसने भी सुना, उसके चेहरे पर मुस्कान और गर्व, दोनों आ गए।आखिर ऐसी क्या खास बात है इस धुन में?सुनिए... ⬇️ pic.twitter.com/N9wngZa2V3— BJP (@BJP4India) July 19, 2026భద్రతా కారణాలరీత్యా వీఐపీల అధికారిక నంబర్లపై సాధారణంగా ఎలాంటి పాటలు ఉండవు. ప్రభుత్వ టెలికాం నెట్‌వర్క్‌ల నిబంధనల ప్రకారం జాతీయ భావనను చాటే ఇలాంటి ట్యూన్లను ప్రత్యేక ప్రొటోకాల్ కింద సెట్ చేస్తుంటారు. సామాన్య ప్రజలు కూడా తమ ఫోన్లలో ఈ ట్యూన్‌ను సెట్ చేసుకోవచ్చు. జియో సావన్, వింక్ మ్యూజిక్ లేదా వీఐ యాప్‌లను ఓపెన్ చేసి, కాలర్ ట్యూన్స్ సెక్షన్లో ‘వందేమాతరం ఇన్స్ట్రుమెంటల్’ లేదా ‘ఫ్లూట్’ వెర్షన్‌ను వెతికి సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.ఇది కూడా చదవండి: అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా.. ప్రశాంత్ కిషోర్ సవాల్! -
అయోధ్య విరాళాల్లో అక్రమాలు: ప్రధాని మోదీకి రాహుల్, ఖర్గే లేఖ!
న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణానికి సేకరించిన విరాళాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలను బహిరంగపరచాలని వారు డిమాండ్ చేశారు.భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకున్న విరాళాలు అపహరణకు గురికావడం అందరినీ తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఈ విషయంపై ప్రధాని మౌనం వీడాలని లేఖలో పేర్కొన్నారు. నగదు, బంగారం, వెండి కానుకల స్వీకరణలో జరిగిన అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరిపి, నివేదికను ప్రజల ముందు ఉంచాలని వారు కోరారు. జూన్ ప్రారంభంలో ఈ విరాళాల అపహరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయగా, ట్రస్ట్‌కు చెందిన ఇద్దరు కీలక బాధ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ట్రస్ట్ ఫిర్యాదు మేరకు జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఈ ట్రస్ట్‌లో కేంద్రం నియమించిన సభ్యులే ఉన్నారని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్, ఖర్గే డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో కుండపోత: జలమయమైన రాజౌరి -
అఖిలపక్షానికి టీఎంసీ రెబెల్స్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చీలుస్తూ వేరుకుంపటి పెట్టుకున్న వర్గాన్ని మోదీ సర్కార్ ఆదివారం జరగబోయే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం పలకడం వివాదాస్పదమైంది. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ నుంచి వేరుబడిన 19 మంది ఎంపీలు తాము నేషనల్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్సీపీఐ)లో విలీనమయ్యామని, తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు చేసిన అభ్యర్థన ఇంకా పెండింగ్‌లో ఉండగానే చీలికవర్గానికి ఏకంగా అఖిలపక్షభేటీకి ప్రభుత్వం ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. తమకు పోటీగా చీలిక వర్గానికీ ఆహ్వానం అందడంపై మమత సారథ్యంలోని టీఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజాస్వామ్యాన్ని ఎన్డీఏ కూటమి అపహాస్యంచేస్తోందని టీఎంసీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు డిరెక్ ఓబ్రియాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. టీఎంసీ చీలిక వర్గం నేత సుదీప్ బందోపాధ్యాయ్‌ను అఖిలపక్షభేటీకి ఆహ్వానిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు శనివారం ఒక లేఖ రాశారు. ‘‘బందోపాధ్యాయ్తోపాటు 19 మంది ఎంపీలు ఎన్సీపీఐలో ఇప్పటికే చేరారు. అందుకే తిరుగుబాటు ఎంపీల నాయకుడినీ ఆహ్వానించాం. ఎన్సీపీఐ నామినేటెడ్ చీఫ్ విప్ హోదాలో చీలిక వర్గం నాయకురాలు డాక్టర్ కకోలీ ఘోష్ దస్తిదార్కూ ఆహ్వానం పలికాం’’అని రిజిజు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ డిరెక్ ఓబ్రియాన్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఇదంతా మోసం. ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడమే. చీలికవర్గం టీఎంసీ ఎంపీల అంశం తనవద్దే ఉందని ఓవైపు స్పీకర్ చెబుతారు. మరోవైపు వీళ్లను ఎన్సీపీఐ ఎంపీలుగా పేర్కొంటూ రిజిజు అఖిలపక్ష భేటీకి సాదర ఆహ్వానం పలుకుతారు. టీఎంసీ ద్రోహులను అనర్హులుగా ప్రకటించాలి’’అని అన్నారు. ప్రధానిని కలిసిన సుదీప్ బంధోపాధ్యాయ్... అంతకుముందు సుదీప్ బంధోపాధ్యాయ్ శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్లో టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు ప్రత్యేక సీటింగ్‌కు స్పీకర్ బిర్లా అనుమతించిన కొద్దిసేపటికే సుదీప్ ప్రధానితో భేటీ కావడం గమనార్హం. అయితే మోదీతో సుదీప్ ఏం మాట్లాడారనే వివరాలు తెలియరాలేదు. -
హరిత రవాణా దిశగా ముందడుగు
జింద్/జలంధర్: దేశంలో హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించుకోవడం హరిత రవాణా దిశగా కీలకమైన ముందడుగు, ‘మేక్ ఇన్ ఇండియా’కు ఒక విజయవంతమైన ఉదాహరణగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్‌లో మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలును ఆయన శుక్రవారం హరియాణాలోని జింద్ స్టేషన్లో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జింద్–సోనిపట్ మార్గంలో ఈ రైలు ప్రయాణిస్తుంది. ప్రపంచంలో హైడ్రోజన్ ఇంధన రైళ్లను నడుపుతున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. మోదీ హరియాణాలో రూ.14,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. హైడ్రోజన్ రైలు ఆత్మనిర్భర్ భారత్, ఆధునిక రవాణా వ్యవస్థ పట్ల మన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గతంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల తలెత్తిన పరిస్థితులు ఒకవేళ 2014కు ముందే ఏర్పడి ఉంటే భారతీయ రైల్వేల కార్యకలాపాలు స్తంభించిపోయేవని పేర్కొన్నారు. ఎందుకంటే అప్పట్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో రైళ్లు ప్రధానంగా డీజిల్‌తో నడిచేవని గుర్తుచేశారు. అప్పట్లో డీజిల్ సరఫరాకు అంతరాయం కలిగి ఉంటే డీజిల్ ఆధారిత రైళ్లు ఆగిపోయేవని పేర్కొన్నారు. దేశం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొనేదని చెప్పారు. కానీ, ఇది 2014 నాటి పరిస్థితి కాదన్నారు. ‘‘సమస్యలకు పరిష్కారాలను ముందుగానే ఆలోచించి, వాటిని క్షేత్రస్థాయిలో వాస్తవ రూపంలోకి తీసుకువచ్చే వ్యక్తి మోదీ. పశి్చమాసియా నేడు రణరంగంగా మారింది. హార్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం, చమురు సంక్షోభం ఉన్నప్పటికీ భారత రైల్వేలు, దేశ అభివృద్ధి పరుగు మాత్రం ఆగిపోలేదు’’అని వ్యాఖ్యానించారు. అత్యంత పొడవైన రైలు ‘‘హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడిపే సామర్థ్యం కేవలం మూడు లేదా నాలుగు దేశాలకు మాత్రమే ఉంది. 21వ శతాబ్దపు ఈ సాంకేతికత విషయంలో భారతీయ రైల్వే ఒక పెద్ద ముందడుగు వేసింది. ఈ రైలు 3,200 హార్స్పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదే కాకుండా అత్యంత పొడవైనది(10 కోచ్‌లు) కూడా. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో హైడ్రోజన్ రైలుకు కేవలం మూడు లేదా నాలుగు కోచ్‌లు మాత్రమే ఉంటాయి. కానీ, మన దేశంలో ఈ రైలుకు 10 కోచ్‌లు ఉన్నాయి. ఈ భారీ హైడ్రోజన్ రైలును నడపడం ద్వారా భారత్ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసింది. భవిష్యత్తులో హైడ్రోజన్ రైలుకు సంబంధించిన మరిన్ని మౌలిక సదుపాయాలు రాబోతున్నాయి. కురుక్షేత్రలో సిక్కు మ్యూజియం జింద్ పట్టణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతం కావడం హర్షణీయం. స్వచ్ఛతను ప్రజలు తమ జీవన విధానంలో, దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మార్చుకోవాలి. జింద్ ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇది మహారాజా రంజిత్ సింగ్ కీర్తితోనూ, పాండవులకు సంబంధించిన విశ్వాసంతోనూ ముడిపడి ఉన్న ప్రాంతం. ఈ వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, దానిని గర్వంగా భావి తరాలకు అందించడానికి భారత్ కట్టుబడి ఉంది. ఇదే స్ఫూర్తితో కురుక్షేత్రలో ఈ రోజు ఒక సిక్కు మ్యూజియంకు శంకుస్థాపన చేశాం. ఈ కొత్త మ్యూజియం హరియాణా సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది’’అని మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వేర్వేరు రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. కేరళలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన ఆరు రైల్వే స్టేషన్లను ప్రారంభించారు. అలాగే మధ్యప్రదేశ్‌లో 13 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం ఇచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.4,700 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ‘వికసిత్ భారత్’దిశగా సాగే ప్రయాణంలో భవిష్యత్తుకు సంబంధించిన సాంకేతికతలు, ఆరోగ్య సంరక్షణ సేవలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుత తరానికే కాకుండా, రాబోయే తరాలకు కూడా మేలు చేకూర్చే నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. మోదీ శుక్రవారం పంజాబ్‌లో పర్యటించారు. రూ.5,470 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.పంజాబ్‌లో అరాచక పాలన పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వానికి స్వచ్ఛమైన ఉద్దేశాలు గానీ, నిజాయితీ గానీ లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని, కనీసం పోలీస్ స్టేషన్లు కూడా సురక్షితంగా లేవని ఆరోపించారు. ఇది ‘ఖట్టర్ బీమాన్ సర్కార్’అని విమర్శించారు. పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఎప్పుడు, ఎక్కడ ముఠా పోరు చెలరేగుతుందో, ఏ దిశ నుంచి తూటాలు దూసుకొస్తాయో ఎవరూ ఊహించలేరని ఆందోళన వ్యక్తంచేశారు. జలంధర్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలో బహిరంగంగానే బలవంతపు వసూళ్లు సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఎవరికీ రక్షణ లేదన్నారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నిజమైన మార్పును తీసుకురావడంతోపాటు అభివృద్ధి చెందిన, సంపన్నమైన పంజాబ్‌ను నిర్మించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని మోదీ తేల్చిచెప్పారు. -
75 రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
జలంధర్: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (శుక్రవారం) జలంధర్ నుండి రూ. 5,470 కోట్ల విలువైన రైల్వే, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అమృత్ భారత్ స్కీమ్‌లో భాగంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జలంధర్ స్టేషన్లో రైలు ప్రయాణికులతో ప్రధాని మోదీ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని రాయనపాడు, మంగళగిరి, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు.అమృత్ భారత్ పథకంలో రూ.35 కోట్లతో రాయనపాడు స్టేషన్ ఆధునికీకరించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. చండీగఢ్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం, హర్యానాలోని జింద్‌లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును మోదీ ప్రారంభించారు. అనంతరం జలంధర్ చేరుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను సందర్శించిన తర్వాత ప్రధాని మోదీ జలంధర్‌లో పర్యటించడం ఇది రెండోసారి. -
ఇక ఎన్డీఏ వేదిక 'మంగళ్ మిలన్’!
న్యూఢిల్లీ: ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కొత్తగా మంగళ్ మిలన్ అని పేరు మార్చారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో సాధారణంగా మంగళవారాల్లో జరిగే ఈ ఎన్డీఏ కూటమి ఎంపీల వ్యూహాత్మక భేటీని ఇకపై మంగళ్ మిలన్గా పిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు పేరు మార్పు నిర్ణయాన్ని నేడు(శుక్రవారం, జూలై 17వ తేదీ) అధికారికంగా ప్రకటించారు. రాబోయే సమావేశం: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జూలై 21, ఉదయం 9:30 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ "మంగళ్ మిలన్" మొదటి సమావేశం జరగనుంది.కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా బీజేపీ తన 'మిషన్ 360' ప్రయత్నాలను వేగవంతం చేసింది. నరేంద్ర మోదీ సర్కార్ మహిళలకు రిజర్వేషన్, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు అంశాలను ఒకదానితో ఒకటి అనుసంధానించాలనే ఆలోచనలో ఉంది. ఏప్రిల్‌లో జరిగిన 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు అవసరమైన రెండు వంతుల మెజారిటీ లభించలేదు. దీంతో మరోసారి ప్రయత్నించే ముందు మద్దతు పెంచుకునే చర్యలను ఎన్డీఏ ముమ్మరం చేసింది.ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులు ఈ సారి సర్కార్‌కు అనుకూలంగా ఉండొచ్చని బీజేపీ భావిస్తోంది. పార్లమెంట్లో తన బలాన్ని పెంచుకునే లక్ష్యంతో అధికార పార్టీ విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమావేశాలకు ముందు చర్చలు వేగవంతం చేశాయి. -
తొలి హైడ్రోజన్ రైలు : దీని ప్రత్యేకతలివే!
భారతీయ రైల్వే సరికొత్త మైలురాయిని తాకింది. పర్యావరణహితంగా, స్వదేశీసాంకేతికతతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రవేశపెట్టింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ శూన్య ఉద్గారాల (Zero-emission) రైలుహర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపత్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇలాంటి రైళ్లు కలిగిన అతికొద్ది దేశాల సమూహం లోకి భారతదేశం చేరింది. రైల్వే రంగంలో భారతదేశం స్వచ్ఛమైన సాంకేతికతను అవలంబించేలా చూడటంలో ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు ప్రధాని మోదీ. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు ప్రతిరూపంగా రీసెర్చ్, డిజైన్స్ & స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్' (RDSO) ద్వారా ఈ రైలు పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. ఈ టెక్నాలజీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్‌ను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద, శక్తివంతమైన హైడ్రోజన్ పవర్ ప్యాసింజర్ రైలు. 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడుస్తుంది. ఇదీ చదవండి: హెర్నియా ఆపరేషన్‌కి రూ. 11 లక్షలా? నెటిజన్లు గగ్గోలు Prime Minister @narendramodi flags off India's first Hydrogen train between Jind and Sonipat at Jind railway station#HydrogenTrain #भारत_की_पहली_हाइड्रोजन_ट्रेन @RailMinIndia Watch: ⬇️ pic.twitter.com/j1lJCliqRs— PIB India (@PIB_India) July 17, 2026 ; గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపడానికి ఆమోదం పొందింది, కానీ దీని డిజైన్ వేగం గంటకు 110 కిలోమీటర్లు. ఇందులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. ఇది 2600 ప్రయాణీకులనువారి వారి గమ్య స్థానాలకు చేరుస్తుంది.నిజానికి ప్రపంచంలో ఇప్పటికే నడుస్తున్న ఈ హైడ్రోజన్ ట్రైన్లకు కేవలం రెండు, నాలుగు కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. అదీడా అత్యంత తక్కువ దూరం ప్రయాణిస్తాయి.ఇది జింద్ జంక్షన్, గోహానా జంక్షన్ ,సోనిపత్‌లను కలుపుతూ, జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, ఇసాపూర్ ఖేరి హాల్ట్, బుటానె హాల్ట్, ఖండ్రాయ్ హాల్ట్, రాబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మోహనా, బర్వాస్ని హాల్ట్ , సోనిపత్ న్యూ స్టేషన్లలో ఆగుతుంది.పైలట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసినన ఈ రైలు, హైడ్రోజన్ టెక్నాలజీని పరీక్షించడంలో, భారతదేశంలో పర్యావరణ అనుకూల రైలు ప్రయాణం కోసం భవిష్యత్ ప్రణాళికలకు మద్దతు నిస్తుంది.హైడ్రోజన్ ఆధారిత రైళ్లు ఉన్న ఇతర దేశాలు ఏవి?హైడ్రోజన్ ఆధారిత రైలును నడుపుతున్నదేశాల్లో అమెరికా జర్మనీ, జపాన్, చైనా ఉన్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలు అయిన ఆల్స్టామ్ కొరాడియా ఐలింట్ (Alstom Coradia iLint) ను ప్రవేశపెట్టడంలో జర్మనీ ముందంజలో ఉంది.ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్ -
హర్ముజ్ యుద్ధ క్షేత్రంగా మారింది.. మోదీ
చండీగఢ్: హర్ముజ్ జలసంధి ప్రస్తుతం యుద్ధ క్షేత్రంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. హర్ముజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులున్నాయన్నారు. ఈ రోజు శుక్రవారం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ హర్యానా లోని జింద్ రైల్వేస్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు జింద్, సోనిపట్ స్టేషన్ల మధ్య 89 కిలోమీటర్లు ఈ రైలు ప్రయాణించనుంది.2014కంటే ముందు ఇంధన కొరతతో రైళ్లు ఆగిపోయేవి.. భవిష్యత్తులో ఇంధనం లేకుంటే రైళ్లు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. ప్రపంచంలో ఏ సంక్షోభం ఎదురైనా దానికి సమాధానం భారత్ వద్ద ఉంటుందని మోదీ ఈ సందర్భంగా భారత సత్తాని కొనియాడారు. రైలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ "ఇలాంటి అధునాతన రైళ్లు కలిగిన ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరింది. రైల్వే రంగంలో స్వచ్ఛమైన సాంకేతికతను అవలంబించడంలో ఇది భారతదేశానికి ఎంతగానో దోహదపడుతుంది" అని పేర్కొన్నారు.భారతదేశంలో ఇలాంటి పర్యావరణ అనుకూల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను ఉపయోగించడం ఇదే తొలిసారి. ఈ రైళ్లు హైడ్రోజన్ ఇంధన కణాల ద్వారా సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని నడుస్తాయి. ఇది డీజిల్ రైళ్లకు అత్యంత స్వచ్ఛమైన, పర్యావరణ రహిత ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా హైడ్రోజన్ నిల్వ , రీఫ్యూయలింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారంగా నడిచే 10 కోచ్‌ల రైలుఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల ఆపరేషనల్ స్పీడ్‌తో నడపడానికి అనుమతి లభించింది. కాగా దీని డిజైన్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు.ప్రయాణికుల సామర్థ్యం: ఈ రైలులో దాదాపు 2,600 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవచ్చు.డిజైన్ దశ నుండి ప్రోటోటైప్ తయారీ వరకు ఈ రైలును పూర్తిగా భారతదేశంలోనే (Make in India) రూపొందించారు.హైడ్రోజన్ రైలు భారత్‌లో రావడంతో జర్మనీ,జపాన్, చైనా,అమెరికా దేశాల సరసన భారత్ చేరింది. -
భారత రైల్వే చరిత్రలో గ్రీన్ సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖితం కాబోతోంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా, కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు శుక్రవారం పట్టాలెక్కనుంది. హరియాణా వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్వదేశీ అద్భుతాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఒకప్పుడు బొగ్గు ఇంజన్లతో పరుగులు తీసిన భారత రైల్వే.. ఆ తర్వాత డీజిల్, విద్యుత్ శకాలను దాటుకుని, ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన ఇంధనం ’హైడ్రోజన్’వైపు అడుగులు వేసింది. బ్రాడ్‌గేజ్ మార్గాల్లో ఇప్పటికే 99 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తి చేసుకున్న రైల్వే ఇప్పుడు ఈ సరికొత్త హైడ్రోజన్ రైలుతో సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ప్రమాదాలకు తావులేదు.. భద్రత అమోఘం! హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు కాబట్టి ప్రయాణికులలో భయాలు సహజం. అందుకే రైల్వే శాఖ భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించింది. గ్యాస్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను క్షణాల్లో గుర్తించే అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. ఏ చిన్న తేడా వచ్చినా గ్యాస్ సరఫరా ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది. పొరపాటున హైడ్రోజన్ లీకైనా, అది ఒకచోట చేరకుండా గాల్లో కలిసిపోయేలా నిరంతర వెంటిలేషన్ వ్యవస్థ ఉంది. జింద్ వద్ద అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్! హరియాణాలోని జింద్ వద్ద దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ఇక్కడ నీటి నుంచి విద్యుది్వశ్లేషణ (ఎలక్ట్రోలిసిస్) ద్వారా స్వచ్ఛమైన హైడ్రోజన్ వాయువును తయారు చేస్తారు. దీనిని 500 బార్ ప్రెజర్ వద్ద నిల్వ చేసి, రైళ్లకు 350 బార్ ప్రెజర్ వద్ద నింపుతారు. ఇక్కడ ఏకకాలంలో రెండు పవర్ కార్లలో గ్యాస్ నింపే సదుపాయం ఉంది. ఈ రైలును ‘మేక్ ఇన్ ఇండియా’కింద భారత్‌లోనే రూపొందించారు. రైలు ప్రత్యేకతలు.. ప్రపంచవ్యాప్తంగా నడిచే హైడ్రోజన్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్‌లతో మాత్రమే నడుస్తుండగా, భారత్‌లో ఏకంగా 10 కోచ్‌ల భారీ రైలును సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలుగా ఇది రికార్డ్నెలకొల్పే ఆస్కారముంది. ఈ రైలులో ఒకేసారి గరిష్టంగా 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. హరియాణాలోని నార్తర్న్ రైల్వే పరిధిలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలును నడపునున్నారు. జింద్ జంక్షన్, గోహనా జంక్షన్, సోనిపట్ సహా మధ్యలోని దాదాపు 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. గంటకు గరిష్టంగా 110 కి.మీ వేగంతో ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో 75 కి.మీ వేగంతో నడపనున్నారు. రైలుకు ఇరువైపులా రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు (డీపీసీ)లు ఉంటాయి. ఇవి చెరో 1,200 కిలోవాట్ల (1600 హెచ్‌పీ) శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇందులో బ్యాకప్ కోసం లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) బ్యాటరీలను జతచేశారు.నిప్పులు చిమ్మని హరిత రథంమారనున్న భారతీయ రైల్వే ముఖచిత్రం బొగ్గుతో నడిచే రైళ్లు మొదలు విద్యుత్‌తో నడిచే రైళ్లదాకా కొనసాగిన భారత రైల్వే ప్రస్థానంలో సరికొత్త హరిత అతిథి నేడు వచ్చిచేరుతోంది. వాతావరణంలోని కర్భన ఉద్గారాలను అస్సలు వెదజల్లని వాతావరణహిత హరిత రైలు రాకతో భారత రైల్వే ముఖచిత్రం మారబోతోందని రైల్వే రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో హైడ్రోజన్ రైలు పనితీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలా పనిచేస్తుంది? సంప్రదాయక రైలు మాదిరి ఈ రైలు నుంచి కాలుష్యకారక ఎలాంటి కర్భన ఉద్గారాలు వెలువడవు. హరిత శకటం నుంచి కేవలం నీటి ఆవిరి బయటకు వస్తుంది. ఈ రైలు ముందుభాగంలో లేదా పైభాగంలో లేదా ప్రత్యేక కంపార్ట్మెంట్లో భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువును నిల్వచేసే ట్యాంకర్ ఉంటుంది. దీనికి సమీపంలో ఫ్యూయల్సెల్ వ్యవస్థ ఉంటుంది. ట్యాంక్‌లోని హైడ్రోజన్‌ను ప్రత్యేక పైపుల ద్వారా ఫ్యూయల్‌సెల్‌లోకి పంపిస్తారు. అయితే అది ఫ్యూయల్ సెల్‌లోకి వచ్చే క్రమంలోనే ప్రోట్రాన్లు, ఎల్రక్టాన్లుగా విడిపోతుంది. ఎల్రక్టాన్లు ఫ్యూయల్ సెల్‌లోకి వెళ్లవు. ప్రత్యేక సర్క్యూ ద్వారా ప్రవహిస్తాయి. ఇదే రైలు ముందుకు కదలడానికి సాయపడుతుంది. ఫ్యూయల్‌సెల్‌లోకి వచ్చే ప్రోటాన్లు అనేవి బయటి గాలి నుంచి వచ్చే ఆక్సీజన్‌తో ఎల్రక్టానిక్ రసాయన చర్య జరిపి విద్యుత్‌ను, నీటి ఆవిరిని ఉత్పత్తిచేస్తాయి. ఈ నీటి ఆవిరి ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతుంది. విద్యుత్ మాత్రం అక్కడే ట్రాక్షన్ మోటార్లకు చేరి రైలు చక్రాలను ముందుకు కదిలేలా చేస్తాయి. రైలు ఒకవేళ నెమ్మదిగా వెళితే ఆ సమయంలో ఫ్యూయల్ సెల్ వ్యవస్థ ద్వారా జనించిన విద్యుత్ అనేది రైలులో అమర్చిన భారీ బ్యాటరీల్లో నిక్షిప్తమవుతుంది. ఇది అవసరమైన వేళల్లో హఠాత్తుగా రైలు వేగం పెరిగేందుకు సాయపడుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థతో ఈ రైలు పనిచేస్తుందని శివనాడార్ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ హర్‌ప్రీత్ సింగ్ అరోరా చెప్పారు. ఓవర్‌హెడ్ హైటెన్షన్ విద్యుత్ తీగల నుంచి వచ్చే విద్యుత్‌తో విద్యుత్ ఆధారిత రైలు పనిచేస్తాయి. కానీ హైడ్రోజన్ రైళ్లలో అత్యధిక పీడనంతో నింపిన హైడ్రోజన్ ఈ ప్రోటాన్ ఎక్సే్ఛంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ విధానంలో ఆక్సీజన్‌తో చర్య జరిపి అటు విద్యుత్‌ను, ఇటు నీటి ఆవిరిని, పరిమిత స్థాయిలో వేడిమిని అందిస్తుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరోన్మెంట్ మేథోసంస్థలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మౌష్మీ మొహంతీ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైల్వేలో కొత్త శకం.. భారత్ తొలి హైడ్రోజన్ రైలు.. ఫుల్ డీటెయిల్స్..
హైడ్రోజన్ శక్తితో నడిచే ప్యాసింజర్ రైళ్లను నడిపే దేశాల జాబితాలో భారత్ చేరుతోంది.. హరియాణాలోని జింద్-సోనిపట్ మార్గంలో దేశంలోని తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు సేవలను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు. 10 బోగీలతో రూపొందించిన ఈ రైలుకు దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చేసిన అతిపెద్ద హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైళ్లలో ఇది ఒకటి. సాధారణ విద్యుత్ రైళ్ల మాదిరిగా పైభాగంలో ఉండే విద్యుత్ తీగలు, డీజిల్ ఇంజిన్‌పై ఇది ఆధారపడదు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ల సాయంతో రైలులోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నేరుగా వెలువడే ఉద్గారాలుగా నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదలవుతాయని పత్రికా సమాచార శాఖ తెలిపింది. బ్రాడ్ గేజ్ రైల్వే నెట్‌వర్క్‌లో 99 శాతానికి పైగా విద్యుద్దీకరణ పూర్తి చేసి డీజిల్ వినియోగాన్ని భారీగా తగ్గిస్తోంది. భారతీయ రైల్వే చేపట్టిన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఇది మరో కీలక మైలురాయి.మార్గం వివరాలుహైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు తొలుత ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో నడుస్తుంది. ఈ రైలు జింద్ జంక్షన్, గోహానా జంక్షన్, సోనిపట్ మధ్య ప్రయాణిస్తుంది. మధ్యలో జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్, లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, ఈసాపూర్ ఖేరి హాల్ట్, బుటానా హాల్ట్, ఖండ్రాయ్ హాల్ట్, రబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మొహానా, బర్వాస్ని హాల్ట్, సోనిపట్ న్యూ స్టేషన్లలో ఆగుతుంది. ప్రతిపాదిత హాల్ట్లలో కూడా సేవలు అందిస్తుంది.సాధారణ పరిస్థితుల్లో హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైలు సేవలు ఎంత సమర్థంగా, ఎంత భద్రంగా, ఎంత విశ్వసనీయంగా పనిచేస్తాయో నిరూపించేందుకు ఈ మార్గాన్ని ఎంపిక చేశారు.హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్లతో పరుగులుఈ రైలు ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ (పీఈఎం) ఫ్యూయల్ సెల్ వ్యవస్థతో పనిచేస్తుంది. అధిక పీడన సిలిండర్లలో నిల్వ చేసిన హైడ్రోజన్, వాతావరణంలో ఉండే ఆక్సిజన్‌తో ప్రతిచర్య జరిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఆ విద్యుత్ ట్రాక్షన్ మోటార్లను నడుపుతుంది.ఈ రైలులో రెండు చివరల వద్ద రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు, మధ్యలో 8 ప్రయాణికుల బోగీలు ఉన్నాయి. ప్రతి పవర్ కారు 1,200 కిలోవాట్ల శక్తి, అంటే దాదాపు 1,600 హార్స్పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపకల్పన చేశారు. అయితే పైలట్ దశలో ఉత్తర రైల్వే పరిధిలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ సేవల నిర్వహణకు అవసరంగా హరియాణాలోని జింద్‌లో దేశంలోనే అతిపెద్ద రైల్వే హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని భారతీయ రైల్వే నిర్మించింది.ఈ కేంద్రంలో విద్యుద్విశ్లేషణ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. దానిని 500 బార్ పీడనానికి కుదించి, 350 బార్ పీడనంతో రైలుకు నింపుతారు. దీనివల్ల రెండు పవర్ కార్లలో ఒకేసారి హైడ్రోజన్ నింపే అవకాశం ఉంటుంది. ఈ కేంద్రంలో దాదాపు 3,000 కిలోల హైడ్రోజన్ నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఇది సాధారణ రైలు సేవలు కొనసాగించేందుకు సరిపోతుంది.అధికారుల సమాచారం ప్రకారం, హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, కుదింపు, నింపడం, రైలు నిర్వహణ వంటి అన్ని దశలను కలిపిన దేశంలోని తొలి సమగ్ర రైల్వే హైడ్రోజన్ వ్యవస్థ ఈ ప్రాజెక్టుతో ఏర్పడింది.విదేశాల్లో నడుస్తున్న హైడ్రోజన్ రైళ్ల కంటే పెద్దదిహైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లు ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ దేశాల్లో సేవలు అందిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా నడుస్తున్నాయి. అయితే వాటిలో ఎక్కువ రైళ్లలో 2 నుంచి 4 బోగీలు మాత్రమే ఉంటాయి. ప్రధానంగా ప్రాంతీయ మార్గాల్లోనే అవి నడుస్తున్నాయి.10 బోగీలతో రూపొందించిన భారతీయ రైల్వే హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ శక్తితో నడిచే ప్రయాణికుల రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని భారతీయ రైల్వే తెలిపింది. అధిక సామర్థ్యం ఉన్న ప్రయాణికుల రైలు సేవలకు హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించవచ్చని ఇది నిరూపిస్తోందని తెలిపింది.భారత్‌లోనే తయారీభారతీయ రైల్వే ఆధ్వర్యంలో స్వదేశీ సాంకేతికతతో ఈ హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేశారు. పరిశోధన, నమూనాల రూపకల్పన, ప్రమాణాల సంస్థ (ఆర్డీఎస్ఓ) సాంకేతిక రూపకల్పన, ఆమోద ప్రక్రియకు నాయకత్వం వహించింది. మేధా సర్వో డ్రైవ్స్ రైలు వ్యవస్థను సమీకరించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) రైలు బాహ్య రూపాన్ని రూపొందించింది.జింద్-సోనిపట్ రైలు సేవలు తొలుత పైలట్ ప్రాజెక్టుగా నడుస్తాయి. జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా, దీర్ఘకాలిక నెట్ జీరో లక్ష్యాల దిశగా కల్కా-షిమ్లా రైల్వే వంటి వారసత్వ మార్గాల్లో కూడా హైడ్రోజన్ శక్తితో నడిచే రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది.Are you excited for Bharat's first Hydrogen Train?#HydrogenTrain#भारत_की_पहली_हाइड्रोजन_ट्रेन pic.twitter.com/6uhyLaGC4n— Ministry of Railways (@RailMinIndia) July 16, 2026 -
బీజేపీ మిషన్ 360.. మోదీ మాస్టర్ ప్లాన్‌కు కౌంట్‌డౌన్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకుముందు బీజేపీ తన 'మిషన్ 360' ప్రయత్నాలను వేగవంతం చేసింది. నరేంద్ర మోదీ సర్కార్ మహిళలకు రిజర్వేషన్, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు అంశాలను ఒకదానితో ఒకటి అనుసంధానించాలనే ఆలోచనలో ఉంది. ఏప్రిల్‌లో జరిగిన 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు అవసరమైన రెండు వంతుల మెజారిటీ లభించలేదు. దీంతో మరోసారి ప్రయత్నించే ముందు మద్దతు పెంచుకునే చర్యలను ఎన్డీఏ ముమ్మరం చేసింది.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులు ఈ సారి సర్కార్‌కు అనుకూలంగా ఉండొచ్చని బీజేపీ భావిస్తోంది. పార్లమెంట్లో తన బలాన్ని పెంచుకునే లక్ష్యంతో అధికార పార్టీ విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమావేశాలకు ముందు చర్చలు వేగవంతం చేశాయి.తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ), శరద్ పవార్ వర్గంలో ఇటీవల ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నా, రాజ్యాంగ సవరణ ఆమోదానికి అవసరమైన రెండు వంతుల మెజారిటీకి బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఇంకా దాదాపు ఆరుగురు ఎంపీల మద్దతును సంపాదింకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిపాదిత బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నం సర్కార్ చేస్తుందా అన్న అంశంపై రాజకీయ పరిశీలకులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో జులై 19న బీజేపీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.బీజేపీ వ్యూహాలువర్షాకాల సమావేశాలకు ముందు బీజేపీ అంతర్గత చర్చలను వేగవంతం చేసింది. గత వారం రోజులుగా పార్టీ అగ్రనేతలు పలు కీలక సమావేశాలు నిర్వహించారు. వాటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్. సంతోష్ హాజరయ్యారు.వర్షాకాల సమావేశాల్లో సర్కార్ అనుసరించాల్సిన పార్లమెంటరీ వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో బి.ఎల్. సంతోష్ హాజరు కావడంతో నితిన్ నబీన్ నాయకత్వంలో కొత్త జాతీయ బృందాన్ని బీజేపీ త్వరలో ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సంస్థాగత స్థాయిలో విస్తృత సంప్రదింపులు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి పదవులకు తగిన నాయకుల పేర్లను కోరారు. వచ్చిన సిఫార్సుల ఆధారంగా కొత్త బృందాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధానమంత్రి నివాసంలో జరిగిన సమావేశం సంస్థాగత అంశాలకే పరిమితం కాలేదు. సర్కార్ శాసన కార్యక్రమం, ప్రతిపక్షాల వ్యూహం, సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్న బిల్లులపై కూడా చర్చ జరిగింది. వాటిలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రతిపాదనలపైనే ఎక్కువ చర్చ సాగింది.ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలమే!ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గతంతో పోలిస్తే మరింత అనుకూలంగా ఉన్నాయని సర్కార్ భావిస్తోంది. అధికార కూటమి బలమైన స్థితిలో ఉండగా, ప్రతిపక్షం తక్కువ బలంతో కనిపిస్తోందని అంచనా వేస్తోంది. పలు ప్రాంతీయ పార్టీల వైఖరి కీలకంగా మారే అవకాశం ఉంది. 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే కొన్ని అంశాల్లో సర్కార్‌కు మద్దతు ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపిన వివరాల ప్రకారం.. కీలక అంశాల్లో డీఎంకే వైఖరి కాంగ్రెస్ వైఖరితో భిన్నంగా ఉండొచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. పార్లమెంట్లో కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని, సభలో విడిగా కూర్చోవాలని డీఎంకే నిర్ణయించినట్టు సమాచారం. దీనితో అంశాల వారీగా డీఎంకే మద్దతు లభిస్తుందన్న ఆశలను బీజేపీ పెంచుకుంది.ప్రస్తుతం ఉన్న 3 ఖాళీల కారణంగా లోక్‌సభ సభ్యుల సంఖ్య 540గా ఉంది. రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు అవసరం.రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఎన్డీఏకు దాదాపు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన ఎన్సీపీఐకి చెందిన 20 మంది ఎంపీలు, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల మద్దతు లభిస్తే ఆ సంఖ్య దాదాపు 335కు చేరొచ్చు. మరికొన్ని పార్టీల నుంచి మరో 5 కలుపుకుని మద్దతు దాదాపు 340కు చేరుతుందని అంచనా.మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకుంటోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరినట్టు వస్తున్న సమాచారంతో ఎన్డీఏ బలం దాదాపు 346కు చేరే అవకాశం ఉంది. 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ పార్టీ కూడా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వంటి రాజ్యాంగ సవరణకు మద్దతు ఇస్తే, కూటమి సంఖ్య దాదాపు 354కు చేరుతుంది. అయినా రెండు వంతుల మెజారిటీకి ఇంకా ఆరుగురు ఎంపీలు తక్కువగానే ఉంటారు.చివరి ఆరుగురు ఎంపీల మద్దతు ఎలా సాధిస్తుంది?రెండు వంతుల మెజారిటీ దాటాలంటే ఎన్డీఏకు ఇంకా ఆరుగురు ఎంపీల మద్దతు అవసరం. ఈ పరిస్థితుల్లో హోంమంత్రి అమిత్ షా వరుస రాజకీయ సమావేశాలు నిర్వహించారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, వర్షాకాల సమావేశాలకు ముందు బీజేపీ తన సంఖ్యాబలాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ పలు పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తోంది.మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు షరతులతో మద్దతు ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంకేతాలు ఇచ్చారు. అయితే ఆయన పార్టీ పెట్టిన షరతులను సర్కార్ అంగీకరించే అవకాశం తక్కువని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
పూరీ రథయాత్ర: రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు
పూరీ: ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్ర భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. రథయాత్రలోని సంప్రదాయాలు వినయం, సమిష్టి భాగస్వామ్యం, నిస్వార్థ సేవలను ప్రతిబింబిస్తాయని, ఇవి తరతరాలుగా భారతీయులకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని, సమాజంలో ఐక్యతా స్ఫూర్తి పెంపొందాలని మహాప్రభు జగన్నాథుడిని ఆయన ప్రార్థించారు. ବିଶ୍ଵପ୍ରସିଦ୍ଧ ରଥଯାତ୍ରା ଉପଲକ୍ଷେ ଦେଶବିଦେଶରେ ରହୁଥିବା ଶ୍ରୀଜଗନ୍ନାଥଙ୍କ ଭକ୍ତଗଣଙ୍କୁ ମୁଁ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା ଜ୍ଞାପନ କରୁଅଛି । ଏହି ମହାପର୍ବରେ ମହାପ୍ରଭୁ ଶ୍ରୀଜଗନ୍ନାଥ ବଡ଼ଭାଇ ବଳଭଦ୍ର, ଭଗିନୀ ସୁଭଦ୍ରା ଓ ଚକ୍ରରାଜ ସୁଦର୍ଶନଙ୍କ ସହିତ ରଥାରୂଢ଼ ହୋଇ ଭକ୍ତମାନଙ୍କ ସହିତ ମିଳିତ ହୁଅନ୍ତି । ଭକ୍ତ ଓ ଭଗବାନଙ୍କ ମିଳନର ଏହି ପର୍ବ…— President of India (@rashtrapatibhvn) July 16, 2026రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తజన సమూహానికి, దైవానికి మధ్య జరిగే ఈ కలయిక అద్వితీయమని ఆమె అభివర్ణించారు. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి రథాలపై ఊరేగింపుగా వచ్చి భక్తులకు దర్శనమివ్వడం అత్యంత పవిత్రమైన ఘట్టమని పేర్కొన్నారు.మరోవైపు రథయాత్ర నేపథ్యంలో పూరీ నగరం భారీ భద్రతా వలయంలోకి వెళ్లింది. సింహద్వారం వద్ద నందిఘోష, దర్పదలన, తాళధ్వజ రథాలు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 13 వేల మంది పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ దళాలు, ఎన్ఎస్జీ కమాండోలు, తీర రక్షణ దళాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలతో నిఘాను ముమ్మరం చేశారు. భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ 300 ప్రత్యేక రైళ్లను, రవాణా శాఖ 800 బస్సులను అందుబాటులోకి తెచ్చింది.ఇది కూడా చదవండి: రథయాత్రకు 300 రైళ్లు, 800 బస్సులు -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. యూరియా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సెమీకాన్ 2.0 కోసం 1,27,500 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. వరుణ నది వెంట 6/4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 10,998 కోట్ల రూపాయలు కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గంగానది వెంట ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 14,448 కోట్ల రూపాయలు కేటాయించింది. మొబైల్ ఫోన్ తయారీ పథకం కోసం 62,500 కోట్ల రూపాయలు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. పారాదీప్-హరిదాస్పూర్ రైల్వే లైన్ డబ్బింగ్ కోసం 2,542 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. దంగోపోసి- రాజ్ కర్ సావన్ మధ్య నాలుగవ రైల్వే లైన్ నిర్మాణానికి 1,365 కోట్ల రూపాయలు కేటాయింపునకు ఆమోదం తెలిపింది. -
మీకు ఈ20 పెట్రోల్ ఇబ్బందిని వివరిస్తా
న్యూఢిల్లీ: ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల్లో ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వాడాలనడంపై వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పెట్రోల్ పంపుల్లో స్వచ్ఛమైన పెట్రోల్, ఈ20 పెట్రోల్‌ను ఎంపిక చేసుకునే అవకాశం వాహన యజమానులకు అందుబాటులో ఉండాలన్నారు. తక్కువ మైలేజీ ఇస్తుందన్న ఆందోళన నేపథ్యంలో ఈ20 పెట్రోల్ ధరను తగ్గించాలని కేజ్రీవాల్ కోరారు. వినియోగదారుల గళం వినిపించేందుకు తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు.ఈ మేరకు కేజ్రీవాల్ మంగళవారం ఒక లేఖ రాశారు. వివిధ వర్గాల ప్రజలను కలిసినప్పుడు వ్యక్తమైన అభిప్రాయాలు, ఇందులో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను ప్రధాని మోదీకి వివరిస్తానన్నారు. ‘2023కు ముందు తయారైన 30 కోట్ల రిజిస్టర్డ్ ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుకూలంగా లేవు.ఈ వాహనాల ఓనర్ మాన్యువల్స్‌లో సాధారణంగా స్వచ్ఛమైన పెట్రోల్, కొన్ని సందర్భాల్లో ఈ10 పెట్రోల్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించారని, ఈ20 పెట్రోల్‌ను కాదు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ అంశంపై తమ పార్టీ ఆన్లైన్లో సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టిందని చెప్పారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభిస్తే వీటిని కూడా ఆయనకు చూపెడతానని చెప్పారు. -
పుతిన్‌ని, మోదీ ఆపకుంటే.. పోలండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పోలండ్ మంత్రి భారత ప్రధానిని ప్రశంసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో ప్రపంచాన్ని ఒక పెద్ద ముప్పు నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ కాపాడన్నారు. 2022 చివర్లో రష్యా వ్యూహాత్మక అణు ఆయుధాలను ఉపయోగించకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఒప్పించడంలో పీఎం మోదీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పోలాండ్ విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ థియోఫిల్ బార్టోస్జెవ్స్కీ ANIతో మాట్లాడుతూ, "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో సుప్రసిద్ధ, అత్యంత గౌరవనీయుడైన రాజనీతిజ్ఞుడు. అలీన దేశంగా భారతదేశానికి రష్యన్ ఫెడరేషన్తో, అంతకుముందు సోవియట్ యూనియన్‌తో చాలాకాలంగా సంబంధాలు ఉన్నాయి. అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి మోదీ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. 2022 చివరిలో ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించకుండా పుతిన్‌ను ఆపడంలో ప్రధానమంత్రి మోదీ పోషించిన పాత్ర గురించి నేను ప్రస్తావించాను. కానీ ఇది నిజం, అధ్యక్షుడు పుతిన్‌పై కొంత ఒత్తిడిని, ప్రభావాన్ని చూపగల కొద్దిమంది వ్యక్తులలో ప్రధానమంత్రి మోదీ ఒకరు." అని అన్నారు.రష్యా తనను శత్రువుగా భావించని దేశాల నుండి వచ్చే శాంతి విజ్ఞప్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పోలండ్ మంత్రి తెలిపారు. యుద్ధం మరింత పెరగకుండా చూడటంలో భారత్‌తో పాటు చైనా (షీ జిన్‌పింగ్) పాత్ర కూడా ముఖ్యమైనదని, అయితే ఈ సంక్షోభాన్ని ముగించడంలో భారత్ పాత్ర అత్యంత కీలకంగా మారిందని ఆయన అన్నారు. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై మారిన పోలండ్ వైఖరిభారత్ రష్యా నుండి రాయితీపై ముడి చమురు కొనుగోలు చేయడంపై గతంలో పోలండ్ చేసిన విమర్శలపైనా మంత్రి క్లారిటీ ఇచ్చారు.రష్యా నుండి చౌకగా లభించే చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్ రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా మద్దతు ఇస్తోందని తాము గతంలో భావించామని, అయితే మార్కెట్ ధర కంటే 40% తక్కువకు చమురు లభిస్తున్నందున ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ అంశం రెండు దేశాల మధ్య ఎలాంటి విభేదాలకు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.#WATCH | Delhi: On the Russia-Ukraine conflict, Secretary of State of the Polish Minister of Foreign Affairs, Władysław Teofil Bartoszewski, says, "Prime Minister Narendra Modi is a very well-known world statesman, who is very respected, and India has a long-standing relationship… pic.twitter.com/R38wQurE9u— ANI (@ANI) July 14, 2026 -
ఎస్సెల్ గ్రూపు అధినేత తండ్రి మృతి : పీఎం మోదీ సంతాపం
ఎస్సెల్ గ్రూప్ (Essel Group) వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర పితృవియోగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సామాజికవేత్త నంద్ కిషోర్ గోయెంకా (Nand Kishore goenka ) మృతి సమాజానికి తీరని లోటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.నందర్ కిషోర్ మరణంపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ఆయన జీవితం సమాజ సేవకు, వినయానికి, అంకితభావానికి ఒక గొప్ప నిదర్శనమని ప్రశంసించారు. సామాజిక శ్రేయస్సుకు ఆయన చేసిన సేవలు, చూపిన విలువలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిస్తాయంటూ మోదీ నివాళు లర్పించారు. ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్‌గా సమాజానికి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సుభాష్ చంద్ర తండ్రి, ప్రముఖ దాత, సామాజిక కార్యకర్త నంద్ కిషోర్ గోయెంకా (96) సోమవారం (జులై 13, 2026) కన్నుమూశారు. ముంబైలోని ఆయన నివాసంలో పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం, నంద్ కిషోర్ గోయెంకా అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన హర్యానాలోని హిసార్ జిల్లా, అగ్రోహా (Agroha) లోని 'గోయెంకా ఉద్యాన్' లో జులై 15 న నిర్వహించనున్నారు.ఇదీ చదవండి: ఆ సమయంలో ఒంటెలకు ఆహారంగా పాములు..ఎందుకు?తన తండ్రి మరణాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు కుమారుడు సుభాష్ చంద్ర. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తామంతా తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ, సమాజ సేవ, గోసేవ, దేశ సేవలతో నిండిన ఆయన 96 ఏళ్ల సార్థక జీవితాన్ని ఒక పండుగలా గౌరవించాలనుకుంటున్నామంటూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్గోయెంకా మరణం పట్ల హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే సహా పలు పార్టీల రాజకీయ నాయకులు, సామాజిక ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎసెల్ గ్రూప్ శ్రేణులు, హితైషులు గోయెంకా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్‌గా క్రియాశీలకంగా వ్యవహరించారునంద కిషోర్ గోయెంకా. ఎస్సెల్ గ్రూప్ విజయాల వెనుక ఆయనొక నిశ్శబ్ద మార్గదర్శకుడిగా నిలిచారు. ఇదీ చదవండి: ‘ఫున్సుఖ్ వాంగ్డూ’ చనిపోవడం ఇష్టం లేదు : 3 ఇడియట్స్ నటుడి భావోద్వేగం -
‘ మోదీ జీ.. నా తనయుడి కేసును కాగితంగానే మిగిలిపోనివ్వకండి’
పూణే: మహారాష్ట్రలోని పూణేలో రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా బాధితుడి తల్లి రాఖీ అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ భావోద్వేగ లేఖ రాశారు. తన కుమారుడి హత్యకు కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూసి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ప్రధానిని వేడుకున్నారు.గత జూన్ 18న కేతన్‌తో వివాహం జరగాల్సిన సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలసి కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించి, వారిని అరెస్ట్ చేశారు. కేతన్ మృతిచెందిన 20 రోజులకే, ఆ బాధను తట్టుకోలేక అతని తాత కన్నుమూశారు. దీనిపై రాఖీ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేస్తూ, కొద్దిరోజుల వ్యవధిలోనే తమ కుటుంబం రెండు తరాలను కోల్పోయిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రతిరోజూ తమ ఇల్లు కేతన్ జ్ఞాపకాలతో ప్రతిధ్వనిస్తోందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.తాము ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు ఆశించడం లేదని, కేవలం సత్వర న్యాయం మాత్రమే కావాలని ఆమె ఆ లేఖలో కోరారు. కాగా ఇప్పటికే కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కూడా ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. దోషులకు చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడేలా ప్రధాని వ్యక్తిగతంగా చొరవ చూపాలని బాధితుని తల్లి విజ్ఞప్తి చేశారు. కేతన్ హత్య కేసును కేవలం కాగితంగానే మిగిలిపోనివ్వకండి’ అని లేఖలో విన్నవించారు.ఇది కూడా చదవండి: ‘భోజశాల’పై సుప్రీం తీర్పు.. నమాజ్‌కు నిరాకరణ -
రాహుల్, ఖర్గేకు ఓపెన్ లెటర్.. క్షమాపణ చెప్పాల్సిందే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 'మోదీ ఎయిర్వేస్' పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.నిర్వాహకుల్లో ఒకరైన అమిత్ కరంత్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్ క్రౌడ్' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్‌కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.కాగా, మెల్బోర్న్లో జరిగిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింటా అలన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. -
అంతా ప్రపంచం మంచికే!
జూలై నెల ఇంకా సగం కూడా గడవ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ నెలలో 31 రోజులు అయినందున మూడవ వంతే అయినట్లు లెక్క. ఈ కొద్ది కాలంలోనే జపాన్ ప్రధాని భారత రాజధానికి వచ్చి వెళ్లగా, భారత ప్రధాని మూడు ముఖ్య మైన దేశాలు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించి స్వదేశానికి చేరుకున్నారు. ఏ కొలమానం ప్రకారం చూసినా ఇది అసాధారణమైనది. ఈ నాలుగింటిలో ఏదీ అపుడపుడు జరుగుతుండే సౌహార్ద్రపూరితమైన సందర్శన కాదు. అన్నింటికి అన్నీ వ్యూహాత్మకమైన కోణాలు గలవి. ఎందుకట్లా?కొత్త అస్థిరతలుఆ చర్చలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు అర్థం చేసుకోవటం అవసరం. లేనట్లయితే ఇన్నిన్ని పర్యటనలు, ఒప్పందాలు ఎందుకు, ఇంత వేగంగా ఎందుకు అన్నది తెలుసుకోలేము. ఈ నెల పర్యటనలకు గత ఆరుమాసాల ప్రయాణాలను కూడా జోడించి చూసిన ప్పుడు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటిది, ఒకటి రెండేళ్ల క్రితంతో పోల్చితే ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతుండటం. రెండవది, మార్పులన్నవి రాజకీయం, ఆర్థికం, సైనికం, వేర్వేరు కూటములు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఉద్యోగ ఉపాధుల కోసం ఇతర దేశాలకు తరలిపోవటం, పెరుగుతున్న జాతివాదాలు, వీటితో పాటు తీవ్ర రూపం తీసుకుంటున్న వాతావరణ పరిస్థితుల న్నిటా కనిపిస్తున్నాయి. పర్యవసానంగా ప్రపంచమంతటా కొత్త అస్థిరతలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి స్థితి ఎప్పుడూ లేదు.ఇటువంటి పరిణామాల మధ్య ఆసియాతోపాటు మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్‌లే గాక, ఉత్తర అమెరికాలో భాగమైన కెనడా వరకు కూడా కొత్త ఒత్తిడులు ఏర్పడుతూ, కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. సముద్రాలలో ఎక్కడో విసిరివేసినట్లుండే డజన్లకొద్దీ దేశాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వాటి సమస్యలు మరింత ప్రమాదకర మైనవి. పెద్ద దేశాలు తమ అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని లెక్క చేయనందువల్ల సముద్ర మట్టాలు పెరుగుతూ, ఆ ద్వీప దేశాలు మునిగి పోగల వేగం కూడా పెరుగుతున్నది. అందుకే అటువంటి వారంతా గత నెల మొదటిసారిగా పెద్ద దేశాలు వేటినీ ఆహ్వానించకుండా, ఐక్యరాజ్యసమితితో సైతం నిమిత్తం లేకుండా, కొలంబియాలో సమావేశమయ్యారు. అన్ని ఖండాలలోని అన్ని దేశాలకూ ఆర్థికం, రక్షణలన్నవి అనిశ్చయమవుతున్నాయన్నది గమనార్హం.బహుళ ధ్రువ ప్రపంచంభారత దేశానికిగానీ, మరే దేశానికిగానీ ఆర్థికాభివృద్ధి, దేశ రక్షణ, ఇతర ప్రయోజనాల పరిరక్షణ, నిరాటంకమైన రీతిలో పురోగతి అనే నాలుగు ఆలోచనలు ఎప్పుడూ ఉండేవే. లోగడ కూడా ఇవి సజావుగా ఏమీ సాగలేదు. కానీ సమస్యలు ఇటీవల మరింత పెరుగుతున్నాయి. అందరికీ పెరగటమన్నది ఒక సామాన్య లక్షణంగా మారింది. అందువల్లనే ఇండియా వలెనే అన్ని దేశాలూ ఈ స్థితి నుంచి బయటపడేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. దక్షిణ అమెరికా మొదలు కెనడా, యూరప్, ఆఫ్రికాలపైగా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల వరకు ఆర్థిక, రక్షణ ఒప్పందాల కోసం భారత ప్రధాని పర్యటనలు చేయటమే కాదు, ఒప్పందాల అవసరాన్ని గుర్తించి వారు కూడా ఇటు వస్తున్నారు.ఇండియాను అట్లుంచి వారిలో వారు కూడా పరస్పర ప్రయాణాలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. వేర్వేరు దేశాధినేతల ఆకాశయా నాలు ఇంతగా బహుశా లోగడ ఎప్పుడూ జరిగి ఉండవు. ఆర్థిక, రక్షణ విషయాలతో ముడిపడిన ఇటువంటి మార్పులు రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలోగానీ, ఏకధ్రువ ప్రపంచావ తరణ జరిగిన తర్వాతగానీ, ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయ మంటే అతిశయోక్తి కాకపోవచ్చు.ఏ దేశమైనా అభివృద్ధి చెందాలనీ, భద్రంగా ఉండాలనీ కోరుకుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఆర్థిక సంస్క రణల కాలం నుంచి ఒకవైపు వస్తూత్పత్తి, వినియోగాలు చరిత్రలో ఎన్నడూ లేనట్లు పెరుగుతుండగా, మరొకవైపు అన్ని దేశాలలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలు అదే స్థాయిలో పెరగసాగాయి. ఈ రెండింటికి తగిన విధంగా అభివృద్ధిని సాధించి, దేశ భద్రతా ఏర్పాట్లను కూడా పెంచవలసిన బాధ్యత సహజంగానే ప్రభుత్వాలపై పడింది. ఆ బాధ్యతలను నెరవేర్చలేని ప్రభుత్వాలు ఓటింగ్ ద్వారానో, తిరుగుబాట్ల వల్లనో కూలిపోవటాన్ని చూస్తు న్నాము. ఈ విధమైన పరిణామాలు అంతర్గతమైన ఒత్తిడులు కాగా, అదే విధమైన ఒత్తిడులు వేరే రూపాలలో, బయటి పరిణామాల వల్ల ఏర్పడటం ఇటీవలి కాలంలో పెరగటం మొదలైంది. అందుకు నాంది ఆర్థిక సంస్కరణలు వర్ధమాన దేశాలకు, మరీ ముఖ్యంగా సాధారణ సామాజిక వర్గాలకు ప్రతికూలమై అసమానతలను పెంచటంతో పడింది. ఇటీవలికి వచ్చేసరికి, పాశ్చాత్య దేశాలు తాము సృష్టించి ఇతరులపై రుద్దిన పలు అంతర్జాతీయ నియమ నిబంధనలు తాము కోరుకున్న ఫలితాలనివ్వటం తగ్గటంతో వాటిని భంగపరచటం మొదలైంది. వారు కొత్త వ్యవస్థలనూ సృష్టించలేక పోతున్నారు. ఈ పరిణామాలన్నింటి ఫలితంగా బహుళ ధ్రువ ప్రపంచ భావనలు బలపడటం, ఇండియాతో పాటు కొన్ని ప్రముఖ దేశాలు ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయ సంస్థలను ఏర్పరచటం జరిగింది. బయటకు స్పష్టంగా ప్రకటించకున్నా అమెరికన్ డాలర్‌కు సమాంతర కరెన్సీల వినియోగం క్రమంగా విస్తరిస్తున్నది. పులి మీద పుట్ర వలె ట్యారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాలు, అక్కర లేని యుద్ధాలు, అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.బద్దలవుతున్న చట్రంవీటన్నింటివల్ల వీరువారని గాక అందరికీ ఎదురవుతున్న సమస్యలు ఏమిటో ఏకరువు పెట్టనక్కరలేదు. ఆ సమస్యలలో ఆర్థిక మైనవి, రక్షణపరమైనవి, ఇతరాలు కూడా ఉన్నాయి. ఈ రెండు రంగాలకు సంబంధించి అమెరికాకు సన్నిహిత దేశాలైన యూరప్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, గల్ఫ్ రాజ్యాల వంటివి సైతం తమలో తామే గాక ఇండియా, బ్రెజిల్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాలతోనూ ఇటీవలి ఆరు మాసాలలో చేసుకుంటూ వస్తున్న ఆర్థిక ఒప్పందాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కెనడా, యూరప్‌ల వంటివి అమెరికా వద్దన్నా... చైనాతో ఒప్పందాలను ఆర్థిక భద్రత కోసం చేసుకుంటున్నాయి. ఈ మార్పులు, మలుపులు ప్రపంచాన్ని అను కోని రీతిలో పాత చట్రం నుంచి బయటకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్‌వుడ్స్ సంస్థల నుంచి ఆర్థిక సంస్కరణల వరకుండిన ఒక చట్రం, అప్పటి నుంచి ఉండిన రెండవ చట్రం ఇప్పుడు భగ్నమవుతున్న దృశ్యాన్ని మనమిపుడు చూస్తున్నాము. మన జూలై ఒప్పందాలు కూడా విస్తృతార్థంలో అదే పరిధి లోకి వస్తాయి. అంతటా అందరూ క్రమంగా స్వతంత్ర నిర్ణయా లతో, పరస్పర ఒప్పందాలతో, స్వతంత్రంగా ఎదిగేందుకు,భద్రంగా జీవించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం
అక్లాండ్: భారత్–న్యూజిలాండ్ స్నేహం మరింత బలపడింది. ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రూ.35,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. సముద్ర భద్రత విషయంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. న్యూజిలాండ్‌లోని అక్లాండ్లో శనివారం భారత ప్రధాని మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సమావేశమయ్యారు. రెండుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. శాంతియుత ఇండో–పసిఫిక్ దిశగా ఉమ్మడిగా కృషి చేయాలని తీర్మానించారు. ఇరువురు నేతల భేటీ సందర్భంగా భారత్, న్యూజిలాండ్ మధ్య 10 కీలక ఒప్పందాలు కుదిరాయి. మొత్తంగా 18 అంశాలపై అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించడానికి నాలుగేళ్ల రోడ్‌మ్యాప్, హైడ్రోగ్రాఫిక్ డేటా షేరింగ్‌ను ప్రోత్సహించడం, పరస్పర నావికాదళ లాజిస్టిక్స్‌ను సులభతరం చేయడం, ఇండో–పసిఫిక్‌లో మెరుగైన సముద్ర సంబంధాలను రూపొందించడం వంటివి ఇందులో ఉన్నాయి. రాబోయే 15 ఏళ్లలో భారత్‌లో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే అంశంపై చర్చ జరిగింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) త్వరగా అమలు చేయడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరింపజేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. చర్చల కోసం గవర్నమెంట్ హౌస్‌కు చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి సంయుక్త కార్యవర్గం స్వేచ్ఛాయుత, బహిరంగ, సుసంపన్నమైన ఇండో–పసిఫిక్ పట్ల ఉమ్మడి నిబద్ధతను మోదీ, లక్సన్ పునరుద్ఘాటించారని ఇరుదేశాలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. సార్వ¿ౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, నియమాల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారని తెలిపాయి. ఇండో–పసిఫిక్‌లో చైనా ప్రాబల్యం పెరుగుతుండడంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అందుకే శాంతియుత ఇండో–పసిఫిక్ కోసం కలిసి పనిచేయాలని భారత్, న్యూజిలాండ్ సంకల్పించాయి. ఈ ప్రాంతంలో సహకారాన్ని పెంచుకోవడంతోపాటు ఉగ్రవాదాన్ని అరికట్టడానికి సంయుక్త కార్యవర్గం, సముద్ర భద్రత కోసం చర్యలు చేపట్టడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. క్రీడలపై భారత్–న్యూజిలాండ్ సంయుక్త కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. హార్మూజ్‌లో నౌకలపై ఆంక్షలు వద్దు పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని, పౌరులకు రక్షణ కల్పించాలని సూచించారు. హార్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించకూడదని ఇరు నేతలు కోరారు.మాతో భాగస్వాములుగా మారండి న్యూజిలాండ్ పెట్టుబడిదారులకు మోదీ పిలుపు చరిత్రాత్మక భారత్–న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని మోదీ అన్నారు. ఆయన శనివారం న్యూజిలాండ్ కంపెనీల సీఈఓలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో ఆయన సమావేశమయ్యారు. రెండు దేశాల ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం, సుస్థిర అభివృద్ధి పట్ల నిబద్ధత అనేవి దూరదృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పటిష్టమైన పునాదిగా నిలుస్తాయని తెలిపారు. భారత్, న్యూజిలాండ్‌ల బలమైన ఆర్థిక భాగస్వామ్యం వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు. భారత్‌లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారత్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పౌర విమానయానం, లాజిస్టిక్స్, స్వచ్ఛ ఇంధనం, పట్టణ రవాణా, నీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రంగాల్లో భాగస్వాములుగా చేరాలని న్యూజిలాండ్ పెట్టుబడిదారులను, వ్యాపార సంస్థలను మోదీ ఆహ్వానించారు. భారత అభివృద్ధి వేగం అపూర్వం: ‘కియా ఓరా మోదీ’లో ప్రధానిఅక్లాండ్: అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశ అభివృద్ధి వేగం అపూర్వమైనదని ప్రధాని మోదీ అన్నారు. మన దేశం ప్రపంచానికి కొత్త అభివృద్ధి నమూనాలను అందిస్తోందని చెప్పారు. ఆయన శనివారం అక్లాండ్లో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్తో కలిసి ‘కియా ఓరా మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూజిలాండ్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించిన ప్రసంగించారు. భారత్, న్యూజిలాండ్ సంబంధం మధురమైన జ్ఞాపకాలు, శాశ్వత స్నేహం, ఉమ్మడి విలువలు, పరస్పర నిబద్ధతపై నిర్మితమైందని వివరించారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధి పథంలో భారత్ వేగంగా పరుగులు తీస్తోందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిందని వెల్లడించారు. ఉమ్మడి ప్రయాణానికి ‘వాకా’: ‘కియా ఓరా మోదీ’లో ప్రధాని మోదీ ఓ మఫ్లర్‌ను ప్రజలకు చూపించారు. దాదాపు 30 ఏళ్ల క్రితం న్యూజిలాండ్‌లో పర్యటించినప్పుడు ఇది తనకు బహుమతిగా లభించిందని తెలిపారు. దీంతోపాటు ఒక టోపీ కూడా గిఫ్ట్‌గా వచ్చిందని చెప్పారు. అప్పటి తాను ప్రజా జీవితంలోకి ప్రవేశించలేదని వెల్లడించారు. న్యూజిలాండ్ సంస్కృతికి చెందిన ‘వాకా’అనే పదం గురించి మోదీ ప్రస్తావించారు. ఈ అందమైన పదం భారత్, న్యూజిలాండ్ సంబంధాల సారాంశాన్ని తెలియజేస్తుందని అన్నారు. శతాబ్దాలుగా ఈ పదం ప్రజలను ఏకం చేయడానికి ప్రతీకగా నిలుస్తోందని వివరించారు. వాకా కేవలం ఒక పడవ కాదని, ఉమ్మడి ప్రయాణానికి అదొక చిహ్నమని తెలిపారు. ఈ రోజు భారత్–న్యూజిలాండ్ వాకా కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.బైబై న్యూజిలాండ్ ప్రధాని మోదీ న్యూజిలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం స్వదేశానికి బయలుదేరారు. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఎయిర్‌పోర్టులో మోదీకి వీడ్కోలు పలికారు. -
భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్: ప్రధాని మోదీ
ఆక్లాండ్: భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్.. అంతర్జాతీయ వృద్ధికి భారత్ ప్రయోగాల వేదిక అంటూ ఆక్లాండ్‌లో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్-న్యూజిలాండ్' సరికొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇరు దేశాల ముందు ‘అపారమైన అవకాశాల సముద్రం’ ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి అసలైన దిశానిర్దేశకులు ఈ ప్రవాస భారతీయులేనంటూ పేర్కొన్నారు. ఈ దేశం నలుమూలలా భారతీయులు ఉన్నారని.. ఈ ప్రయాణం విజయవంతమవుతుందనే నమ్మకం ఉందన్నారు.న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఇరుదేశాల ప్రధానుల చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్ సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇరుదేశాల స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ రోడ్ మ్యాప్-2030 ఆవిష్కరించారు. భారత్, న్యూజిలాండ్ దేశాలు శనివారం (జూలై 11, 2026) తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు, సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి రూ.35,000 కోట్లకు చేర్చాలని ఐదేళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.ఈ సమావేశం ద్వారా 10 ఒప్పందాలతో కలిపి మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రాబోయే నాలుగేళ్లలో సంబంధాలను విస్తరించుకోవడానికి ఒక రోడ్‌మ్యాప్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర సహకారాన్ని పెంపొందించుకోవడానికి కార్యాచరణ, భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందాలు జరిగాయి.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న దూకుడు నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో సహకారాన్ని విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా సాగిన మోదీ మూడు దేశాల పర్యటనలో ఆక్లాండ్ చివరి విడత. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తర్వాత ఈ పర్యటన జరగడం విశేషం. కాగా, హాకాతో ప్రధాని మోదీకి సంప్రదాయ స్వాగతం పలికారు. మావోరి సంప్రదాయ నృత్యం హాకాతో మోదీ గౌరవ వందనం స్వీకరించారు. హాకా కళాకారులను ప్రధాని మోదీ అభినందించారు. -
చెన్నైలో బిగ్ బాష్
మెల్బోర్న్: శిక్షణ, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, ఆ్రస్టేలియా నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం శుక్రవారం క్రీడా సహకార రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి. ఇందులో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైలో బిగ్ బాష్ లీగ్ (టీ–20) ఆరంభ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో చెన్నైలోని ఎం.ఎ.చిదంబరం స్టేడియం (చేపాక్) వేదికగా జరగనున్న ఆ్రస్టేలియన్ మెన్స్ బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ పెర్త్ స్కార్చర్స్ జట్టుతో మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడనుంది. తద్వారా భారతదేశంలో ఒక విదేశీ క్రికెట్ లీగ్ మ్యాచ్ నిర్వహిస్తుండడం ఇదే మొదటిసారి కానుంది. మొదటి మ్యాచ్ చెన్నైలో, మిగిలిన మ్యాచ్‌లు ఆ్రస్టేలియాలో జరుగుతాయి. ఎనిమిది జట్లు పాల్గొనే బీబీఎల్.. ఐపీఎల్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందిన దేశీయ క్రికెట్ టీ–20 లీగ్‌లలో ఒకటి కావడం విశేషం. ఇది సాధారణంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ శుక్రవారం ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు నేతలు స్టేడియం అంతటా కలియతిరుగుతూ సందడి చేశారు. ఫోన్లో సెల్ఫీలు దిగారు. ఫొటోలకు పోజులిచ్చారు. ప్రజలకు అభివాదంచేస్తూ ఉత్సాహపర్చారు. పరస్పరం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘చెన్నైలో బిగ్ బాష్ లీగ్ మ్యాచ్ నిర్వహిస్తుండడం నాకు సంతోషంగా ఉంది. భారతదేశంలో మ్యాచ్‌లు నిర్వహించే ఏ క్రీడా లీగ్ అయినా భారీగా ప్రేక్షకులను ఆకర్శించడం ఖాయం’’అని మోదీ పేర్కొన్నారు. భారత్–ఆస్ట్రేలియా క్రీడా సహకార రోడ్‌మ్యాప్‌ను మోదీ, అల్బనీస్ సంయుక్తంగా విడుదల చేశారు. క్రీడా శిక్షణ, క్రీడా విజ్ఞానం, సాంకేతికత, క్రీడా పరిశ్రమ, పెట్టుబడుల రంగాల్లో భాగస్వామ్యాలను ప్రోత్సహించాలన్నదే ఈ రోడ్‌మ్యాప్ ఉద్దేశం. రోడ్‌మ్యాప్‌లో భాగంగా యువ క్రీడాకారుల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడానికి, క్రీడా సంబంధాలను బలోపేతం చేయడానికి ఇరు దేశాలు యూత్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌ను కూడా నిర్వహించబోతున్నాయి. ప్రజలను ఏకం చేసే శక్తి క్రీడలకు ఉందని, ఈ రోడ్‌మ్యాప్ భారత్, ఆ్రస్టేలియా మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి తోడ్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచినందుకు ఆ్రస్టేలియాను అభినందించారు. భారత్, ఆస్ట్రేలియాలు అంతర్జాతీయ క్రీడల్లో ఒక ముఖ్యమైన దశాబ్దంలోకి అడుగుపెడుతున్నాయని పేర్కొ న్నారు. క్రీడల పట్ల ఉన్న ప్రేమ, అభిరుచి ఆ్రస్టేలియా, భారత్‌ను ఐక్యం చేశాయని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ వ్యాఖ్యానించారు. విపక్ష నేతతో మోదీ భేటీ ఆ్రస్టేలియా ప్రతిపక్ష నాయకుడు యాంగస్ టేలర్‌తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. భారత్–ఆ్రస్టేలియా ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరూ చర్చించుకున్నారు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై అభిప్రాయాలు పంచుకున్నారు. మోదీ మూడు రోజుల ఆ్రస్టేలియా పర్యటన శుక్రవారం ముగిసింది -
అనిశ్చితిలో వెలుగురేఖ
‘బలవంతుడ నాకేమని...’ అనుకుంటే దశాబ్దాల తరబడి అమెరికా నిర్మించుకుంటూ వస్తున్న పునాదులు కదిలిపోతాయని ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇంకా జ్ఞానో దయం కాలేదు. నాటో శిఖరాగ్ర సదస్సుకు పోయి ఈసారి కాస్తంత స్నేహపూర్వకంగా మాట్లాడినా అటువైపునుంచి మునుపటి సాన్నిహిత్యం లేదని తుర్కియేలో ముగిసిన ఆ సదస్సు తీరుతెన్నులు చెబుతున్నాయి. అమెరికాతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలే ఉన్న మన దేశం సైతం ఆయన తరచు చేసే ప్రకటనల కారణంగా ఇబ్బంది పడుతోంది. హఠాత్తుగా ‘ఇండో–పసిఫిక్’ పేరు మారాక లోలోన అసంతృప్తి సరేసరి. ఈ నేపథ్యంలో ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరిని తేటతెల్లం చేసేలా, మన చొరవను మరింత పెంచేలా ప్రధాని నరేంద్ర మోదీ ఇండొనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆరు రోజుల పర్యటన ఈ నెల 6న మొదలైంది. ఇప్పటికే ఇండొనేసియా, ఆస్ట్రేలియా పర్యటనలు పూర్తి చేసుకున్న మోదీ శుక్రవారం న్యూజిలాండ్ చేరుకున్నారు. అమెరికా, చైనాలతో... వాటి వైఖరులతో సంబంధం లేకుండా భద్రత, వాణిజ్యం తదితర రంగాల్లో భిన్న దేశాల సహకారం అవసరమని మన దేశం భావించబట్టే ఈ పర్యటన ఖరారైంది. ఈ మూడూ సాగరప్రాంత దేశాలు. ఎప్పుడో 1992లోనే రూపుదిద్దుకున్న ‘లుక్ ఈస్ట్’ విధానానికి కొనసాగింపుగా మన దేశం ‘మహాసాగర్’ దార్శనికతను ప్రతిపాదించింది. పరస్పర సంపూర్ణ అభివృద్ధికి ప్రాంతాలవారీ భద్రత, సమగ్రవృద్ధి అవసరమన్నదిదాని సారాంశం. సాధారణ ఆర్థిక సంబంధాలు మొదలుకొని భారీ రక్షణ, ఇంధన భాగస్వామ్యం వరకూ అనేకం దీని పరిధిలోకొస్తాయి. ఆస్ట్రేలియాతో గురువారం కుదిరిన పౌర అణుశక్తి ఒప్పందం చరిత్రాత్మకమైనది. ఇదిగాక ఆధునిక సాంకేతికతలూ, రక్షణ, భద్రత సహకారం, సరఫరా గొలుసు మెరుగు పరచటం తదితరాలకు సంబంధించి మరో 18 ఒప్పందాలు కుదిరాయి. పారిస్ఒప్పందం కింద స్వచ్ఛ ఇంధన లక్ష్యం సాధనకు మన అణు రియాక్టర్లకు నిరంతరాయంగా యురేనియం అవసరమవుతుంది. ప్రస్తుతం ఉన్న 7.7 గిగావాట్ల అణు విద్యుత్‌ను 2047కల్లా 100 గిగావాట్లకు పెంచాలని భారత్ నిర్దేశించుకుంది. ఇందుకోసం ప్రపంచ యురేనియం నిక్షేపాల్లో 28 శాతంగల ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదరటం కీలక పరిణామం. ప్రపంచ పరిణామాల కారణంగా హఠాత్తుగా నిలిచిపోతున్న ఇంధన సరఫరా తీరును సరిదిద్దటానికి ఎల్ఎన్జీ, బొగ్గు, డీజిల్వంటి సంప్రదాయ ఇంధన వనరుల విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ఏనాటి నుంచో సాన్నిహిత్యంగల ఇండొనేసియాతో మరిన్ని రంగాల్లో సహకారానికి ఈ నెల 6నుంచి 8వరకూ వరసగా మూడురోజులపాటు కొనసాగిన పర్యటనలో ఒప్పందాలు కుదిరాయి. మన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల్ని కొనుగోలు చేయటానికి ఇండొనేసియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాలూ కలిసి ఇండొనేసియాలోని ఆచే, అండమాన్, నికోబార్ దీవుల్లో నౌకాశ్రయాలను నిర్మించటానికి కూడా అధినేతలిద్దరూ అంగీకరించారు. అలాగే హిందూసముద్రం మొదలుకొని పసిఫిక్ మహాసముద్రంవరకూ పరస్పర సహకారంతో సముద్రజలాల్లో భద్రతను పెంచటానికి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియాలతో ఉన్న సహకారానికి ఇండొనేసియా కూడా తోడుకావటం వల్ల ఇండో–పసిఫిక్‌లో పటిష్టమైన సమన్వయం ఏర్పడుతుంది. చైనాతో అంటకాగటానికిట్రంప్ ప్రయత్నిస్తున్న దశలో ఇది కీలక పరిణామం. నిరుడు మన దేశంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ పర్యటించినప్పుడు ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. దాంతోపాటు మొన్న ఏప్రిల్‌లో రెండు దేశాలూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నాయి. దీన్ని మున్ముందు మరింత విస్తృతపర్చుకోవటానికి ఇప్పటికే ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. కూటముల్లో చేరే విషయంలో న్యూజిలాండ్‌కు పెద్దగా ఆసక్తి లేదు. అయితే ప్రాంతీయ భద్రతను పెంపొందించుకోవటానికి భారత్, ఆస్ట్రేలియాలతో కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. మొత్తానికి మోదీ మూడు దేశాల పర్యటన ఇండో–పసిఫిక్‌లో భారత్ పలుకుబడిని మరింత పెంచుతుంది. -
ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ
-
ఆక్లాండ్ చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇవాళ ఆక్లాండ్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సాన్ స్వాగతం పలికారు. ఇరు దేశాల ప్రధానులు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత న్యూజిలాండ్‌లో భారత ప్రధాని పర్యటించారు. వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై దృష్టిపెట్టారు.భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1968లో ఇందిరా గాంధీ, ఆ తర్వాత 1986లో ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ పర్యటించిన అనంతరం.. భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇది మూడోసారి మాత్రమే. ఈ పర్యటనను భారత్-న్యూజిలాండ్ సంబంధాలలో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభంగా భావిస్తున్నారు.భారత ప్రధాని శనివారం లక్సాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు, సముద్ర భద్రత, విద్య, పర్యాటకం, క్రీడలపై ఈ చర్చలు సాగనున్నాయి. వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. శనివారం సాయంత్రం 'స్పార్క్ అరేనా'లో జరిగే ఒక భారీ కమ్యూనిటీ ఈవెంట్లో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కింద తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందం తో న్యూజిలాండ్ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు. భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆస్ట్రేలియా తరహా చట్టాలు భారత్‌లోనూ?
పిల్లలను రక్షణను దృష్టిలో ఉంచుకుని.. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించకుండా ఆంక్షలు విధించే ఆస్ట్రేలియా చట్టాలు డిజిటల్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ఈ విధానాల నుంచి భారత్‌తో పాటు.. ప్రపంచ దేశాలు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని మోదీ పేర్కొన్నారు.మెల్బోర్న్లో జరిగిన ఆస్ట్రేలియా-భారత్ వార్షిక నేతల సదస్సులో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో కలిసి పాల్గొన్న మోదీ, సమాచార సాంకేతికత (IT), సోషల్ మీడియా నియంత్రణ, ఆన్లైన్ భద్రత విషయంలో ఆస్ట్రేలియా తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ముఖ్యంగా చిన్నారులను, సోషల్ మీడియా వల్ల కలిగే హానికర ప్రభావాల నుంచి రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!ఆస్ట్రేలియా కొత్త నిబంధనల ప్రకారం.. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు సృష్టించకుండా ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ వేధింపులు, మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రభావం వంటి సమస్యలను తగ్గించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం.భారత్‌లో నిషేధంపై మోదీ హింట్ ఇచ్చారా?భారత్‌లో కూడా చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు తీసుకురావాలనే చర్చలు పెరుగుతున్న వేళ మోదీ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బహుశా ఈ నియమాలు మనదేశంలో కూడా అమలవుతాయా?, మోదీ హింట్ ఇచ్చారా?, అని పలువురు అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే దిశగా అడుగులు వేసింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే మన దేశంలో కూడా సోషల్ మీడియా వినియోగాన్ని కఠినతరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఓపెన్ఏఐలో కీలక పరిణామం.. ఏజీఐ సీఈఓ రాజీనామా! -
చట్టాల పేరుతో కొత్త సవాళ్లు.. ప్రజాస్వామ్యంపై పెరుగుతున్న ప్రశ్నలు!
భారతదేశం ఎటు వైపు పయనిస్తోంది? ఒకప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ) విధించి పౌర హక్కులను కాలరాశారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ కాకపోయినా, దాదాపు అదే రీతిలో వివిధ రాష్ట్రాలలో బీజేపీ, దాని మిత్రపక్షాలు భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయా అన్న భావనను పలువురు మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జూన్ 25న ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్‌ను ఎండగట్టే బీజేపీ పెద్దలు, తాము ఏమి చేస్తున్నామో కూడా ఆత్మపరీశీలన చేసుకోవడం అవసరం అనిపిస్తుంది.పశ్చిమబెంగాల్లో తీసుకువచ్చిన ఒక చట్టం అందరిని భయపెట్టేలా ఉంది. పేరుకు సంఘ వ్యతిరేక శక్తులను కట్టడి చేయడానికి ఈ చట్టం తీసుకు వస్తున్నామని, దీనిని దుర్వినియోగం చేయబోమని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించినా, ఆచరణలో ఎన్ని ఘోరాలు జరుగుతాయో అన్న ఆందోళనను వివిధ రాజకీయ పక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో అతి ముఖ్యమైన క్లాజ్ ఏమిటంటే ఎవరైనా ఈ చట్టం కింద అరెస్టు అయితే ఏడాదిపాటు జైలులోనే ఉంచుతారట. లాయర్ కలుసుకోవడానికి కూడా అవకాశం ఉండదట. దీనిని రాజకీయంగా వాడుకోబోమని చెబుతున్నా గ్యారంటీ ఏమి ఉంటుందన్న ప్రశ్న వస్తుంది.ఒకవైపు ఉత్తరప్రదేశ్‌లో హాఫ్ ఎన్కౌంటర్ల పేరిట పోలీసులు సాగిస్తున్న ఘాతుకాలపై ఆయా జాతీయ ఆంగ్ల పత్రికలలో వస్తున్న వ్యాసాలు చదువుతుంటే భయం వేస్తుంది. యూపీలో మరీ ఇంత ఘోరంగా పరిస్థితి ఉందా అన్న భావన కలుగుతుంది. ఇక పశ్చిమబెంగాల్ వంతు వచ్చిందేమో అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టి అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటి సోషల్ యాక్టివిటీస్ బిల్లును ఆమోదించారు. ఇది కేవలం జైళ్లకు పంపడం కాదు.. సమాజాన్ని రక్షించడం అని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కాని ఒక ఏడాది వరకు ఎలాంటి విచారణ లేకుండా, కోర్టులతో సంబంధం లేకుండా చట్టాన్ని అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించుకోవడం కష్టం కాదు. ఈ బిల్లు దెబ్బకి, ఆ రాష్ట్రంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరవలసిన అనివార్య పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యం లేదు. తద్వారా కేసుల బారీ నుంచి తప్పించుకోవచ్చు.గతంలో టీఎంసీలో మంత్రిగా ఉన్న సువేందు అధికారిపై స్వయంగా ప్రధాని మోదీ పలు అవినీతి ఆరోపణలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. అదే సువేందు బీజేపీలో చేరడం, ముఖ్యమంత్రి అవడం కూడా జరిగిపోయింది. అలాగే ఆయా పార్టీల ఎంపీలు తమపై ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా బీజేపీ లేదా దాని మిత్రపక్షాలలో చేరిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం ప్రజాస్వామ్యానికి మరింత చేటు చేసే అవకాశం ఉంది. ఈ చట్టం న్యాయ సమీక్షలో నిలబడదని తృణమూల్ కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ చట్టం యూపీ మోడల్లో వచ్చిన బిల్లు అని కొందరు అభివర్ణిస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రౌడీ శక్తులను అణచివేయడానికి ఎన్కౌంటర్లు, హాఫ్ ఎన్కౌంటర్ల పద్దతిని అనధికారికంగా ప్రవేశపెట్టిందని చెబుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా జూన్ 30 నాటి సంచికలో సందీప్ రాయి, కృష్ణ చౌదరి అనే ఇద్దరు వ్యాసకర్తలు రాసిన ఆర్టికిల్ చదివితే యూపీలో భయానక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుంది.2017లో యోగి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఈ ఎన్కౌంటర్లను కొన్ని సందర్భాలలో ప్రజలు కూడా స్వాగతించి ఉండవచ్చు. శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా ఆయా కేసులలో నిందితుల ఇళ్లను కూల్చివేసేవారు. అలాంటి వాటిని సుప్రింకోర్టు కూడా తప్పు పట్టింది. ఇటీవలికాలంలో నిందితులుగా భావించేవారి ప్రాణం పోకుండా కాళ్లపైనో, ఇతర శరీర భాగాలపైన పోలీసులు తుపాకితో కాల్చుతున్నారట. దాంతో వారు ఏళ్ల తరబడి కదలలేని స్థితిలో పడిపోతున్నారు. వీటిని హాఫ్ ఎన్‌కౌంటర్లని పిలుస్తున్నారు. ఇలా గాయపడ్డవారిలో ఎందరు నిజంగా నేరం చేశారో, ఎందరు అమాయకులో ఎవరికి తెలియదు. ఈ వ్యాసంలో పలు ఉదాహరణలను కూడా వారు వివరించారు.యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత 289 మందిని ఎన్కౌంటర్లలో మరణించారట. క్రిమినల్స్‌గా పరిగణించిన 34వేలమందిలో సుమారు మూడోవంతు 11834 మంది హాఫ్ ఎన్కౌంటర్లలో తీవ్రంగా గాయపడ్డారట. వీరిలో పలువురు కదలలేని స్థితిలో ఉన్నారు. వారికి జీవనోపాధి కూడా లేకుండా పోయిందట. నిజంగానే ఈ ఎన్కౌంటర్లు ఫలితాన్ని ఇస్తున్నాయా అంటే అదీ గ్యారంటీ లేదు. 2024లో 2823 మంది తీవ్రంగా గాయపడితే, 2025లో హాఫ్ ఎన్కౌంటర్లలో గాయపడ్డవారి సంఖ్య 3153 గా ఉందట. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం ఫలిస్తే ఇలాంటివి తగ్గాలి కాని, ఎలా పెరుగుతాయన్న ప్రశ్నకు బదులు దొరకదు. రాజకీయ వైరాలకు కూడా ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు సహజంగానే వస్తాయి. ఈ క్రమంలో పోలీసులలో విచ్చలవిడితనం పెరిగి, వారి ఇష్టారాజ్యంగా ఎవరిపైన అయినా ఇలా దారుణంగా వ్యవహరించే అవకాశం లేదని చెప్పలేం.బీహారులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు బహిరంగంగా కాల్చి చంపడం పెద్ద వివాదం అయింది. అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇక బీజేపీ మిత్ర పక్షమైన తెలుగుదేశం ఏలుబడిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ పేరుతో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో అందరికి తెలిసిన సంగతే. తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపక్షాన్ని అణచివేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేవారిపై కక్ష తీర్చుకోవడానికి పోలీసులను వాడుకోవడం సర్వసాధారణం అయిపోయిందన్న విమర్శ ఉంది.కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక సీఐ చేసిన ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీవారు దాడులు చేసినా, అరాచకాలు చేసినా వారిపై తూతూమంత్రంగా కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ల ఇళ్లపై గంటల తరబడి పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులు చేసినా వారిపై సరైన కేసులే పెట్టలేదు. పైగా బాధితులపైనే కేసులు పెట్టడం ట్రెండ్‌గా చేసుకున్నారు.తాజాగా అమరావతి గ్రామాలలో కొందరు రైతుల కోరిక మేరకు వారి సమస్యలను చూడడానికి వెళ్లబోయిన వైఎస్సార్సీపీ బృందంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. అయినా పోలీసులు వైఎస్సార్సీపీవారిపై కేసులు పెట్టారు. ఇలా బీజేపీ, మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో అధికార దుర్వినియోగం, ఎన్కౌంటర్లు, హాఫ్ ఎన్కౌంటర్లు, లాకప్ డెత్‌లు సాగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఈ తరుణంలో పశ్చిమబెంగాల్లో ఏడాదిపాటు నిర్భందించే చట్టం వస్తే ఇంకెంత భయానకంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా పోలీసులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలను కాపాడేదెవరు?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
భారత్‌లో తొలి మ్యాచ్.. ప్రకటించిన ప్రధాని మోదీ
క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చరిత్రాత్మక ముందడుగు వేసింది. మొట్టమొదటిసారిగా భారత్‌లో బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) మ్యాచ్‌ను నిర్వహించనుంది. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ సంయుక్తంగా ప్రకటించారు.దీంతో బీబీఎల్ 2026-2027 సీజన్లో తొలి మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఖరారైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా డిసెంబరు 12న ఆరంభ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ తలపడనున్నాయి.క్రీడా సంబంధాల బలోపేతంకాగా విదేశీ టీ20 లీగ్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే ప్రణాళికలో భాగంగా ఇరుదేశాలు ఇందుకు అంగీకరించాయి. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ను ఆస్ట్రేలియాలో నిర్వహించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆసీస్ మీడియా ‘ది ఏజ్’ వెల్లడించింది.మమ్మల్నీ ఆదరించండిఇక భారత్‌లో బీబీఎల్ మ్యాచ్ నిర్వహణ గురించి సీఏ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టర్ డాబ్సన్ మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో క్రికెట్‌కు ఉన్న అభిమానుల గురించి మాకు తెలుసు. ముఖ్యంగా చెన్నైలో అయితే ఆటకు మరింత ఆదరణ ఉంది. కచ్చితంగా బీబీఎల్ మ్యాచ్ కోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆశిస్తున్నాం.ఇప్పటికే ఇండియాలో చాలా మందికి బీబీఎల్ గురించి తెలుసు. చాలా మంది బీబీఎల్ మ్యాచ్‌లను కూడా చూస్తారు. అందుకే ఈసారి నేరుగా వారి దేశంలోనే బీబీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తున్నాము. ఐపీఎల్ మాదిరే మా పట్ల కూడా ఆదరణ చూపుతారని నమ్ముతున్నాము’’ అని పేర్కొన్నాడు. చదవండి: ఆఖరి బంతికి సింగిల్.. భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక -
భారత్ కలలు ఆశయాలకు ప్రజలే పునాది
మెల్బోర్న్: ‘ఎక్కువగా కష్టపడడం, మరింత ఎక్కువగా సాధించడం’అనే దార్శనికతతో అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా భారత్ పయనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భారతదేశం గొప్ప కలలు, ఉన్నత ఆశయాలకు ప్రజలే పునాది అని స్పష్టంచేశారు. గురువారం ఆ్రస్టేలియాలో ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. విద్య, నైపుణ్యాలు, ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఆ్రస్టేలియా మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలో సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా మారే లక్ష్యం దిశగా భారత్ కృషి చేస్తోందన్నారు. నాగరిక్ దేవోభవ(పౌరుడే దైవం) అనే మంత్రం తమ పాలనకు మార్గదర్శక సూత్రంగా మారిందని ప్రకటించారు. తమ ప్రభుత్వ విధానాలు పౌరుల సంక్షేమమే కేంద్రంగానే ఉంటాయన్నారు. భారత్ నేడు చిప్స్ నుంచి షిప్‌ల వరకు ఒక నూతన తయారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ గురించి మోదీ ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ సమయంలో భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని, విశ్వసనీయతను ప్రపంచం చూసిందన్నారు. ముష్కర మూకల స్థావరాల వద్ద పేలుళ్లు జరిగితే వాటి ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా మార్మోగిందని వ్యాఖ్యానించారు. మిత్రులు, భాగస్వాములతో కలిసి.. భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య వేగంగా పెరుగుతోందని మోదీ వెల్లడించారు. దేశంలో 2 లక్షలకుపైగా నమోదిత స్టార్టప్‌లు ఉన్నాయని, ప్రతినెలా 4 వేలకుపైగా కొత్త స్టార్టప్‌లు నమోదవుతున్నాయని చెప్పారు. రక్షణ, అంతరిక్షం వంటి రంగాల్లో వందలాది స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇండియా విధానం కేవలం సొంత పురోగతిపై దృష్టి సారించడం మాత్రమే కాదని.. మిత్రులు, భాగస్వాములతో కలిసి అడుగులు వేయడమని నొక్కిచెప్పారు. ప్రవాస భారతీయులే ‘జీవన వారధి’ వెనెజువెలాలో ఇటీవల భూకంపాలు సంభవిస్తే భారత్ వెంటనే స్పందించి, సహాయక చర్యలు చేపట్టిందని, త్వరగా తోడ్పాటు అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. వెనెజువెలా బాధను భారత్ తన సొంత బాధగా భావించిందని అన్నారు. సహాయం చేసేటప్పుడు పాస్‌పోర్ట్‌లను గానీ, వాటి రంగును గానీ భారత్ చూడదని ఉద్ఘాటించారు. అందుకే ప్రపంచం భారత్‌పై అపారమైన నమ్మకాన్ని పెట్టుకుందని చెప్పారు. భారత్–ఆ్రస్టేలియా సంబంధాలు బలపడడం వెనుక ప్రవాస భారతీయులదే కీలక పాత్ర అని మోదీ ప్రశంసించారు. వారిని రెండు దేశాల మధ్య ‘జీవన వారధి’గా అభివరి్ణంచారు. ఇంట్లో ఉపయోగించే పాలు ఆస్ట్రేలియన్ కావొచ్చు గానీ తయారుచేసే టీ మాత్రం భారతీయమైనదని చెప్పారు. పప్పులు, కూరగాయలు ఆ్రస్టేలియాలవే అయినా వాటికి అసలైన భారతీయ మసాలాలతో తాలింపు పెడతారని వెల్లడించారు. మెల్బోర్న్ సిటీని మినీ ఇండియాగా అభివరి్ణంచారు. టీ20 మ్యాచ్‌లా.. టెస్ట్ మ్యాచ్‌లా రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి క్రీడల రంగం కూడా ఉందని మోదీ అన్నారు. ప్రపంచ క్రీడా రాజధాని అయిన మెల్బోర్న్లో ఉంటూ క్రీడల గురించి మాట్లాడకపోవడం అనేది టాస్ వేసిన తర్వాత క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించకపోవడంతో సమానమని సరదాగా వ్యాఖ్యానించారు. మన నిర్ణయాలు టీ20 మ్యాచ్‌లా వేగంగా, భాగస్వామ్యం మాత్రం టెస్ట్ మ్యాచ్‌లా సుదీర్ఘంగా, లోతుగా ఉండాలని అన్నారు. భారత్–ఆస్ట్రేలియా దేశాల అజెండా ఒక వన్డే మ్యాచ్‌లా లక్ష్యంపైనే దృష్టి సారిస్తుందని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. -
57 శాతం ఉత్పత్తులపై సున్నా సుంకాలు!
వెల్లింగ్టన్: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కింద తమ దేశం నుంచి భారత్‌కు ఎగుమతి జరిగే ఉత్పత్తుల్లో 57 శాతం ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు చేరుకుంటాయని న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్టుచేశారు. ఇరుదేశాల మధ్య ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన తొలిరోజు నుంచే సున్నా శాతం సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు. ఈ ఒప్పందంతో న్యూజిలాండ్ వ్యాపారాలు భారీగా వృద్ధి చెందనున్నాయని తెలిపారు. భారత మార్కెట్లో న్యూజిలాండ్ ఉత్పత్తులకు విస్తృత ప్రవేశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10, 11న న్యూజిలాండ్‌లో పర్యటించనున్నారు. భారత ప్రధాని న్యూజిలాండ్‌కు వెళ్తుండడం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌తో వాణిజ్యం, రక్షణ, పరస్పర సహకారం తదితర అంశాలపై ప్రధాని మోదీ దృష్టిపెట్టనున్నారు. అంతేకాకుండా వ్యాపారవేత్తలు, క్రీడాకారులతోనూ సమావేశం కానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న భారత్, న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. -
బలపడిన అణు బంధం
మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ‘అణు’బంధం మరింత బలపడింది. భారత అణు విద్యుత్ ప్రాజెక్టులకు యురేనియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరుదేశాల మధ్య అత్యంత కీలకమైన పౌర అణుశక్తి ఒప్పందం కుదిరింది. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ సహా సముద్ర భద్రత, అరుదైన ఖనిజాల రంగాలకు సంబంధించి పలు చరిత్రాత్మక ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ గురువారం మెల్బోర్న్లో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. కీలక రంగాల్లో పరస్పరం సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతికతలు, సప్లై చైన్లు, రక్షణ, భద్రతా సహకారం, సముద్ర భద్రతా సహకార రోడ్‌మ్యాప్, ఇంధన భద్రత తదితర అంశాల్లో మొత్తం 18 ఒప్పందాలపై సంతకాలు జరగడం విశేషం. వీటిలో భారత తీర రక్షక దళం(ఐసీజీ), ఆ్రస్టేలియాకు చెందిన మారిటైమ్ బోర్డర్ కమాండ్(ఎంబీసీ) మధ్య జరిగిన ఒప్పందం కూడా ఉంది. ఇది సముద్ర చట్టాల అమలు, సముద్ర ప్రాంతాలపై అవగాహన, సముద్ర సరిహద్దుల రక్షణ వంటి అంశాలలో పరస్పర సహకారానికి దోహదపడుతుంది. ఇంధన భద్రతను బలోపేతం చేసుకుందాం ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడి రక్షణ విధానాన్ని ఖరారు చేసే దిశగా కార్యాచరణను వేగవంతం చేయాలని భారత్, ఆ్రస్టేలియా నిర్ణయించాయి. ఓడల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణలో కలిసికట్టుగా పనిచేయడానికి ఇరుపక్షాలు అంగీకారం తెలిపాయి. భారత్, ఆ్రస్టేలియాలు చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేసిన 12 ఏళ్ల తర్వాత పౌర అణుశక్తి ఒప్పందం కుదిరింది. ఇంధన భద్రతా ఫ్రేమ్‌వర్క్ నిబంధనల ప్రకారం.. బొగ్గు, డీజిల్, ఇతర ద్రవ ఇంధనాలు, సహజ వాయువుల స్థిరమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన సరఫరాను కొనసాగించడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశాయి. 2028–29 సంవత్సరానికి గాను ఆ్రస్టేలియన్ డిఫెన్స్ కాలేజీలో భారతీయ సైనిక శిక్షకుడిని నియమించాలని నిర్ణయించారు. మరోవైపు భారత్‌లోని గురుగ్రామ్‌లో విక్టోరియా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌ను నిర్వహించుకోవడానికి ఆ్రస్టేలియా పక్షానికి ఆమోద పత్రం అందజేశారు. బెంగళూరులో ఫ్లిండర్స్ యూనివర్సిటీ తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదిరింది. భేటీ అనంతరం మోదీ, అల్బానీస్ ప్రకటన విడుదల చేశారు. భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు నూతన శక్తి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అల్బానీస్‌తో అద్భుతమైన చర్చలు జరిగాయని నరేంద్ర మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చర్చల ఫలితాలను ‘అసాధారణమైనవి’గా అభివర్ణించారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం, వాతావరణ చర్యలు, అణు శక్తి, కీలక ఖనిజాలు, సాంకేతికత, విద్య వంటి రంగాలపై చర్చించామని తెలిపారు. ఈరోజు అణు శక్తి రంగంలో ఒక కీలక ఒప్పందంపై సంతకం జరిగాయని అన్నారు. ఇది ఆ్రస్టేలియా నుంచి భారత్‌కు యురేనియం సరఫరాకు మార్గం సుగమం చేయడంతోపాటు భారత స్వచ్ఛ ఇంధన లక్ష్యాలకు నూతన శక్తిని ఇస్తుందని ఉద్ఘాటించారు. రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికి తీవ్రమైన సవాలుగా పరిణమించిందని భారత్, ఆస్ట్రేలియాలు గుర్తించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందుకే ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం సాగిస్తామన్నారు. తమ సంకల్పం అచంచలమైనదని, సహకారం మరింత బలపడుతూనే ఉందని వెల్లడించారు. ఇండియాతో ఆ్రస్టేలియాకు ఉన్న సంబంధం నేడు ఉన్నంత కీలకమైనదిగా గతంలో ఎప్పుడూ లేదని ప్రధాని ఆంథోనీ అల్బానీస్ పేర్కొన్నారు. పౌర అణుశక్తికి సంబంధించిన ఒప్పందం శాంతియుత ప్రయోజనాల కోసం ఆ్రస్టేలియా నుంచి భారత్‌కు యురేనియం ఎగుమతులను సులభతరం చేస్తుందని వివరించారు. శిలాజ రహిత ఇంధన విద్యుత్ సామర్థ్యం వాటాను పెంచడానికి భారత్‌కు యురేనియం సరఫరా చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ఆ్రస్టేలియన్ వనరుల రంగానికి అదనపు మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. తమ భాగస్వామ్యం ఎన్నడూ లేనంత బలంగా ఉందని తేల్చిచెప్పారు. రక్షణ, భద్రతా సహకారంపై ఉమ్మడి ప్రకటన ‘ఆచరణాత్మక భాగస్వామ్యాన్ని’మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందన్నారు. భారతదేశాన్ని ఒక అగ్రశ్రేణి భద్రతా భాగస్వామిగా పరిగణిస్తున్నట్లు అల్బానీస్ ప్రకటించారు. భారత్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ప్రతిపాదిత భారత్–ఆ్రస్టేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుతుందని పేర్కొన్నారు. గురువారం ఆ్రస్టేలియా–ఇండియా సీఈఓల ఫోరమ్, ఎకనామిక్ రోడ్‌మ్యాప్ బిజినెస్ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. భారత్‌లో విమానయానం, ఆర్థిక సేవలు, కీలక ఖనిజాలు, సాంకేతికత, ఆహార శుద్ధి వంటి రంగాల్లో వృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలని ఆ్రస్టేలియా పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు పిలుపునిచ్చారు. ఇండియాలో 500 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ‘ఆ్రస్టేలియన్ సూపర్’కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ ష్రోడర్ చేసిన ప్రకటనను మోదీ స్వాగతించారు. -
తరలిరానున్న భద్రకాళి, కార్తికేయుడు, నంది!
భారతీయ సంస్కృతీ వైభవం స్వదేశానికి తిరిగి వస్తోంది. దశాబ్ద కాలంలో అమెరికా, యూకే, కెనెడా సహా అనేక దేశాల్లో దశాబ్దాలుగా మగ్గిన 300కుపైగా అరుదైన, అపురూప కళాఖండాలు ఇప్పటికే భారత్‌కు తిరిగి రాగా తాజాగా ఆస్ట్రేలియా చోళుల కాలం నాటి మూడింటిని అప్పగించింది. దొంగల చేత చిక్కి సముద్రాలు దాటిన ఈ కళాఖండాలు ఘనమైన భారత చారిత్రక వారసత్వానికి ప్రతీకలు! భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆ్రస్టేలియా ప్రభుత్వం ఆరు తలల కార్తికేయ విగ్రహం, నంది విగ్రహం, భద్రకాళి త్రిశూలాలను అప్పగించింది. ఇవన్నీ తమిళనాడు నుంచి అక్రమ మార్గాల్లో ఆ్రస్టేలియాలోని నేషనల్ గ్యాలరీ కలెక్షన్‌లోకి చేరాయి. ఇవి చోరీకి గురైనవని తమిళనాడు సీఐడీలోని ప్రత్యేక విభాగం స్పష్టమైన ఆధారాలతో నిరూపించడంతో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ఒప్పందానికి అనుగుణంగా తమకు అప్పగించాలని భారత్ కోరింది. ఇందుకు ఆస్ట్రేలియ అంగీకరించడంతో త్వరలో స్వదేశానికి తిరిగి రానున్నాయి.షణ్ముఖ/కార్తికేయ విగ్రహంతమిళుల ఇష్టదైవం, తమ రక్షకుడిగా భావించే కార్తికేయుడిని సుబ్రమణ్యుడు, స్కంద, మురుగన్ అని కూడా పిలుస్తారు. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న ఆరుతలల రాతి విగ్రహం 12వ శతాబ్ధానికి చెందినది. తమిళనాడులో కుంభకోణం సమీపంలోని మనంబాడి గ్రామంలోని నాగనాథస్వామి దేవాలయం నుంచి చోరీకి గురైంది. సుమారు 130 సెం.మీ ఎత్తు ఉంటుంది. చోళుల శిల్పకళా శైలికి ప్రతిబింబంగా సౌష్టవాకారం, లెక్కకట్టినంత సైజులో ఉండే ఆభరణాలతో కూడి ఉంది. ఆరుతలలను కొందరు ఆరు దిశలుగా, మరికొందరు జ్ఞానం, బలం, కీర్తి, ఐశ్వర్యం, వైరాగ్యం, విజ్ఞానం ఆరు గుణాలుగా, ఇంకొందరు కృతికా నక్షత్ర మండలంలోని దేవతలుగా నమ్ముతారు.మీటర్ పొడవైన నంది 13–16వ శతాబ్దాల మధ్యకాలం నాటి నంది విగ్రహం తంజావూరు ప్రాంతంలోని తిరువారూర్ జిల్లా కడువంకుడి గ్రామంలోని కైలాసనాథర్ ఆలయానికి చెందినది. ఏకశిల విగ్రహం. మీటరు పొడవుతో శిల్పకళ నైపుణ్యానికి అద్దం పడుతుంది. తమిళనాడు సీఐడీలోని విగ్రాహాల విభాగం అంచనాల ప్రకారం దీని విలువ రూ.నాలుగు కోట్లు. భద్రకాళి త్రిశూలంసాధారణంగా త్రిశూలం అనగానే శివుడు గుర్తు వస్తాడు కానీ దక్షిణాది ఆలయాల్లో అమ్మవారు కూడా త్రిశూలంతో దర్శనమిస్తూంటుంది. ఆ్రస్టేలియా అప్పగిస్తున్న మూడో కళాఖండం చోళుల అనంతర కాలపు అరుదైన లోహ త్రిశూలం. శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయానికి చెందినది. సుమారు 46 సెం.మీ ఎత్తు, మీటర్‌కి పైగా వెడల్పు ఉంటుంది. పైభాగంలో భద్రకాళి దేవి ప్రతిమ కనిపిస్తూంటుంది. ఊరేగింపులు, జాతరల్లో శక్తి, రక్షణలకు చిహ్నంగా వాడేవారని అంచనా. 2016లో తమిళనాడు సీఐడీలోని విగ్రహ విభాగం ఈ విగ్రహాల చోరీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తరువాత ఆలయ రికార్డులు, పాత ఫోటోలు, ప్రభుత్వ దస్తావేజులు, మ్యూజియం క్యాటలాగులన్నీ జల్లెడ పట్టారు. ఇవి ఎక్కడి నుంచి ఎప్పుడు గల్లంతయ్యాయో ఎలా విదేశాలకు చేరాయో నిరూపించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచ దేశాలకు మోదీ స్ఫూర్తి.. ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంస
మెల్బోర్న్ తనకు అద్భుతమైన స్వాగతం పలికిందని ప్రధాని మోదీ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని భారత్‌కు మంచి మిత్రుడని కొనియాడారు. ఈ రోజు గురువారం మెల్బోర్న్ మీట్ కార్యక్రమంలో మోదీతో కలిసి ఆస్ట్రేలియా ప్రధాని పాల్గొన్నారు. మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 30 వేల మంది ప్రవాస భారతీయులతో కలసి మెల్బోర్న్ మీట్ కార్యక్రమం నిర్వహించారు.ఆల్బనీస్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడని మెల్బోర్న్ వాసులతో గడపాడనికే ఆస్ట్రేలియా వచ్చానని ప్రధాని అన్నారు. 2014లో తొలిసారి 2023లో రెండోసారి ప్రస్తుతం మూడోసారి ఆస్ట్రేలియా వచ్చానని తెలిపారు. అహ్మాదాబాద్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదని అదే విధంగా మెల్బోర్న్ స్టేడియం క్రికెట్‌కు ఐకానిక్‌గా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. మెల్బోర్న్ను మినీ ఇండియాగా పిలుస్తారని భారతీయుల పండుగలను ఈ ప్రాంతంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.ఒక కల పూర్తవగానే మరో కల నిర్ధేశించుకోవాలని ఆస్ట్రేలియాతో పాటు భారత అభివృద్ధితో సైతం భాగస్వామ్యం కావాలని అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారుఅంతకు ముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ మాట్లాడుతూ.. "ప్రపంచ దేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ స్పూర్తి మోదీ నాయకత్వంలో భారత్ ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది" అని భారత ప్రధానిని ప్రశంసిస్తూ మాట్లాడారు. కాగా ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా జూలై 8 నుంచి 10 వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి ఇరుదేశాల వార్షిక సదస్సులో పాల్గొన్నారు. రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం వంటి కీలక రంగాలలో దాదాపు 18 ముఖ్యమైన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. -
మోదీ ఆస్ట్రేలియా మిషన్.. వ్యూహాత్మక భాగస్వామ్యమే గురి!
మెల్బోర్న్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెల్బోర్న్లో ఘన స్వాగతం లభించింది. గురువారం ఆయనకు అధికారిక గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ ఆనర్) నిర్వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొన్నారు.మోదీ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, విద్య, కీలక ఖనిజాలు, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.వ్యాపార దిగ్గజాలతో మోదీ భేటీమెల్బోర్న్లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం, ఎకనామిక్ రోడ్‌మ్యాప్ బిజినెస్ రిసెప్షన్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం కేవలం రెండు రాజధానులకే పరిమితం కాకుండా.. రాష్ట్రాలు, నగరాలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల స్థాయిలోనూ విస్తరించాలని మోదీ సూచించారు. రాష్ట్రాల మధ్య, రంగాల మధ్య ప్రత్యేక భాగస్వామ్యాలను గుర్తించి కొత్త అవకాశాలను సృష్టించాలని పిలుపునిచ్చారు.ఆస్ట్రేలియా పెట్టుబడులకు ఆహ్వానంఆస్ట్రేలియా పెన్షన్ ఫండ్స్‌ను భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఆ దేశ పెన్షన్ ఫండ్స్ నిర్వహిస్తున్న భారీ నిధులు సురక్షితమైన, స్థిరమైన దీర్ఘకాలిక వృద్ధికి భారత్‌లో అవకాశాలను పొందగలవని చెప్పారు. భారత్‌లో మౌలిక వసతులు, రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.గ్రీన్ ఎనర్జీపై దృష్టిభారత్ స్వచ్ఛ ఇంధన రంగంలో వేగంగా ముందుకు సాగుతోందని మోదీ తెలిపారు. హరిత హైడ్రోజన్, సౌర విద్యుత్, వాయు విద్యుత్, జల విద్యుత్ రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారీగా పెంచే లక్ష్యంతో భారత్ పనిచేస్తోందని, ఈ ప్రయాణంలో ఆస్ట్రేలియా సాంకేతికత, పెట్టుబడులు కీలక పాత్ర పోషించగలవని పేర్కొన్నారు.అల్బనీస్‌తో కీలక భేటీ.. సెల్ఫీ వైరల్ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే మాజీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తోనూ మోదీ సమావేశమయ్యారు.భారత ప్రవాసులతో..మెల్బోర్న్లో భారతీయ ప్రవాసులతో మోదీ సమావేశం కానున్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయులతో సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ సమావేశం కీలకంగా మారనుంది.మొత్తంగా.. మోదీ ఆస్ట్రేలియా పర్యటన భారత్-ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యానికి మరింత ఊతమిస్తుందని విదేశాంగ నిపుణులు భావిస్తున్నారు. రక్షణ నుంచి వాణిజ్యం వరకు పలు రంగాల్లో సహకారాన్ని విస్తరించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. -
ఆ్రస్టేలియాలో మోదీకి ఘన స్వాగతం
మెల్బోర్న్: మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా పర్యటన పూర్తిచేసుకున్న ప్రధాని మోదీ బుధవారం ఆ్రస్టేలియాకు చేరుకున్నారు. ఇప్పుడే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టానని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఈ పర్యటన భారత్–ఆ్రస్టేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ఉత్తేజాన్ని చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఆ్రస్టేలియా నేతలతో జరపబోయే చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులో మోదీకి ఆ్రస్టేలియా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బానీస్‌తో మోదీ సమావేశం కాబోతున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై వారు చర్చిస్తారు. అలాగే ప్రవాస భారతీయులను సైతం మోదీ కలుసుకుంటారు. అల్బానీస్‌తో కలిసి 3వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. కీలకర రంగాల్లో భారత్–ఆ్రస్టేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సంప్రదింపులు జరుపుతారు. మెల్బోర్న్లోని హోటల్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. వందేమాతరం, మోదీ–మోదీ అని నినదించారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ప్రదర్శనతో ఆలరించారు. మెల్బోర్న్లో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ భారతీయుల ఆతీ్మయ స్వాగతం మాత్రం నిజంగా చిరస్మరణీయమని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారి అనురాగం, భారతదేశంతో వారికి ఉన్న దృఢమైన అనుబంధం ఎప్పటికీ ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. -
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత సాంస్కృతిక వారసత్వం
యోగ్యకార్తా: ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశ సాంస్కృతిక వారసత్వం కనిపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియాలోని యోగ్యకార్తాలో శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ఆయన బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మోదీ వెంట ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియంతో కూడా ఉన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన ఈ ఆలయాన్ని ఉమ్మడిగా పరిరక్షించే ప్రాజెక్టును ఇరువురు నేతలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని భారత్, ఇండోనేసియాల మధ్య చిరకాల నాగరికతా బంధాలకు ఒక అద్భుతమైన నిదర్శనంగా మోదీ అభివర్ణించారు. శతాబ్దాలుగా ఇరుదేశాల ప్రజలను అనుసంధానిస్తున్న ఉమ్మడి వారసత్వానికి ఇదొక గొప్ప ప్రతీక అని పేర్కొన్నారు. భారత్ సహాయంతో ఆలయ సముదాయ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఇరు దేశాలు మంగళవారం ఒక అంగీకారానికి వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ తరపున ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) కీలకంగా వ్యవహరించే ఈ ఉమ్మడి సంరక్షణ ప్రాజెక్టు.. అలాగే ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని మోదీ, సుబియంతో కలిసి సందర్శించడం వంటి పరిణామాలు భారత్–ఇండోనేసియా బంధానికి తిరుగులేని ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఆలయ ప్రదేశంలో ఏఎస్ఐ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రారంభానికి గుర్తుగా ఒక ఫలకాన్ని వారిద్దరూ ఆవిష్కరించారు. ఇది దైవత్వ భావనతో నిండిన క్షణం తొలుత ప్రంబనన్ ఆలయానికి చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. ఆలయ ప్రాంగణంలో కలియతిరుగుతూ ఇక్కడి విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ చరిత్రను వివరించారు. మోదీ, సుబియంతో పరస్పరం కరచాలనం చేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ఆలయ సముదాయానికి సంబంధించిన ఉమ్మడి పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకు దక్కిన గౌరవమని మోదీ పేర్కొన్నారు. మిత్రుడు, అధ్యక్షుడు సుబియంతోతో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించడం వల్ల ఈ సందర్భం తనకు మరింత ప్రత్యేకంగా మారిందన్నారు. ఇండోనేసియా ప్రజలు ఈ గొప్ప వారసత్వాన్ని భక్తిభావంతో సంరక్షిస్తూ వస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఇండోనేసియా ప్రజలకు, ఇప్పటివరకు ఈ దేశాన్ని పాలించిన పాలకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. ఆ ఆలయాన్ని సందర్శించిన క్షణం దైవత్వ భావనతో నిండిన క్షణం అని వ్యాఖ్యానించారు. భారత్–ఇండోనేసియా స్నేహాన్ని బలోపేతం చేయడం, ఉభయ దేశాల ప్రజల సంక్షేమం, శీఘ్ర అభివృద్ధి కోసం భగవంతుడిని ప్రార్థించానని మోదీ తెలిపారు. ప్రంబనన్ ఆలయ సముదాయంలో సంరక్షణ, పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తున్న తరుణంలో, భారతీయ పర్యాటకులు కచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని విశ్వాసం ఉందన్నారు. ‘‘ప్రపంచంలోని సుదూర ప్రాంతాల్లో మనం ఎక్కడికి వెళ్లినా భారతదేశపు సాంస్కృతిక వారసత్వాన్ని చూడవచ్చు. ఆగ్నేయాసియాలో భారత వారసత్వానికి సంబంధించిన అతిపెద్ద గుర్తింపుల్లో ఆ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ శివుడు, దుర్గాదేవి, గణేశుడి విగ్రహాలు ఉన్నాయి. శతాబ్దాలుగా ప్రజలు పూజలు చేస్తున్నారు. నేడు ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేసే అదృష్టం నాకు దక్కడం సంతోషంగా ఉంది’’అని మోదీ వివరించారు. కాలాతీత చిహ్నం ఇండోనేసియా అధ్యక్షుడితో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘అద్భుతమైన ప్రంబనన్ దేవాలయం మన సాంస్కృతిక, ఆధ్యాతి్మక అనుబంధాలకు కాలాతీత చిహ్నంగా నిలుస్తుంది. ఇటువంటి వారసత్వాన్ని పరిరక్షించడం అంటే తరతరాలకు స్ఫూర్తినిచ్చే సంప్రదాయాలను కాపాడుకోవడమే. ఈ ప్రయత్నంలో ఇండోనేసియాతో భాగస్వామి కావడం భారత్‌కు దక్కిన అదృష్టం. గాఢమైన సాంస్కృతిక సంబంధాలున్న దేశాలుగా భారత్, ఇండోనేయాలు ఉమ్మడి గతాన్ని స్మరించుకుంటూ, మరింత బలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయి’’అని మోదీ పేర్కొన్నారు. ప్రంబనన్ గుడి యోగ్యకార్తా నగరానికి ఈశాన్యంగా సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ఇండోనేసియాలో అతిపెద్ద హిందూ ఆలయంగా పరిగణిస్తారు. 9వ శతాబ్దంలో నిర్మించారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు అంకితం చేశారు. ఈ ఆలయ సముదాయం భారతదేశం, ఇండోనేసియాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక వారసత్వానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. -
‘ఇదే.. ప్రంబనన్ ఆలయ వైభవం’ : ప్రధాని మోదీ
జోగ్జకర్తా (ఇండోనేషియా): ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడిక్కడ దాదాపు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రక ప్రంబనన్ హిందూ దేవాలయాల సముదాయానికి సంబంధించిన అద్భుతమైన వైమానిక దృశ్యాలను (ఏరియల్ వ్యూ) షేర్ చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాన్ని చూసి, ‘అద్భుతమైన ప్రంబనన్ ఆలయం!’ అంటూ ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసించారు.భారతదేశ ఆర్థిక, సాంస్కృతిక సహాయంతో ఈ ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టు అధికారిక ప్రారంభోత్సవానికి ముందు ఈ వైమానిక ప్రయాణం సాగింది. భారత్ అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా ఇరు దేశాల సాంస్కృతిక దౌత్యంలో ఇదొక కీలక మైలురాయిగా నిలిచింది. మంగళవారం ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవోల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పరస్పరం మార్చుకున్నారు. The majestic Prambanan Temple! pic.twitter.com/pRS2S9X5gm— Narendra Modi (@narendramodi) July 8, 2026జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్ ఆలయ సముదాయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఆగ్నేయాసియాలో కంబోడియాలోని అంగ్ కోర్ వాట్ తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది. 9వ శతాబ్దంలో హిందూ మాతారామ్ రాజవంశానికి చెందిన రాజు రాకై పికాతన్ దీని నిర్మాణాన్ని ప్రారంభించగా, ఆయన వారసుడు లోకపాల పూర్తి చేశారు. ఇక్కడి శివ, విష్ణు, బ్రహ్మ ఆలయాలలో 47 మీటర్ల ఎత్తున్న ప్రధాన శివాలయం అత్యంత విశిష్టమైనది. ఈ ఆలయ గోడలపై చెక్కిన రామాయణ గాథ శిల్పాలు భారత్-ఇండోనేషియాల ప్రాచీన నాగరికత బంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. -
ఇండోనేసియా చేతికి బ్రహ్మోస్!
జకార్తా: భారత అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి బ్రహ్మోస్ ఇకపై మిత్రదేశం ఇండోనేసియా సైనిక పాటవాన్ని సైతం ద్విగుణీకృతంచేయనుంది. ఇరుదేశాల రక్షణ బంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేసియాకు సరఫరాచేసేందుకు భారత్ మంగళవారం సమ్మతి తెలుపుతూ ఒప్పందం కుదుర్చుకుంది. గగనతలం నుంచి ప్రయోగించి గగనతల లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని సైతం ఇండోనేసియాకు సరఫరాచేయనున్నారు.ఇండోనేసియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియంతోతో విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్కు సరఫరా మొదలు, సముద్రప్రాంత భద్రత, ఔషధాలు, విద్య, అంతరిక్ష పరిశోధన, ఆవిష్కరణలు, టెలీకమ్యూనికేషన్స్, ఆహార భద్రత, అత్యంత అరుదైన లోహాలు, భూఅయస్కాంతాల వంటి ప్రధాన రంగాల్లో 14 కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ద్వైపాక్షిక చర్చల తర్వాత సంయుక్త ప్రకటనలో మోదీ మాట్లాడారు. ఇకపై ఇరుదేశాల బంధంలో సువర్ణాధ్యాయం ఆరంభంకానుందని వ్యాఖ్యానించారు.బ్రహ్మోస్, అస్త్ర ఇలా రెండు రక్షణ రంగ కీలక ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించి దాదాపు రూ.5,694 కోట్ల విలువైన ఒప్పందాలు ప్రధాని మోదీ సమక్షంలో కుదరడం ఇదే తొలిసారి కావడం విశేషం. పాక్ సైన్యాన్ని బెంబేలెత్తించిన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల సత్తా చూశాక వీటి కొనుగోలుకు ఇండోనేసియా ఆసక్తి చూపడంతో వీటిని సరఫరాచేసేందుకు భారత్ తన సమ్మతి తెలిపింది. దక్షిణ చైనా సముద్రంపై చైనా తన భల్లూకం పట్టుబిగిస్తున్న నేపథ్యంలో ఆగ్నేయాసియాలో చైనా ఆధిపత్యానికి గండికొట్టేందుకు దాని సమీప దేశాల సైనికసామర్థ్యాలను భారత్ ఇనుమడింపజేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే ఇండోనేసియాకు భారత్ తన బ్రహ్మోస్ వంటి కీలక ఆయుధాల సరఫరాకు ముందుకొచ్చింది.‘‘ఇండో–పసిఫిక్‌లో భద్రతకు మా సమష్టి శక్తియుక్తులు ఎంతో అవసరం. ఆసియా దేశాలకు భారత్ సదా సముచిత స్థానం, గౌరవం ఇస్తుంది. హిందూసముద్రప్రాంతంలోని భారత ఇంటిగ్రేటెడ్ ఫ్యూజన్ సెంటర్లోకి ఇండోనేసియా లియేసన్ ఆఫీసర్‌ను ఇకపై పంపవచ్చు. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం అనేది రక్షణ, భద్రత, సముద్రయానంలో సహకారాన్ని బలోపేతంచేస్తోంది. ఇకపై విపత్తు నిర్వహణ, పారిశ్రామికసహకారం సహా ఎన్నో రంగాల్లో మరింతగా సహకరించుకోబోతున్నాం. మలక్కా జలసంధి ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన సబాంగ్ నౌకాశ్రయాన్ని ఇరుదేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి’’అని మోదీ ప్రకటించారు. ఈ పోర్ట్ భారత గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్‌కు కేవలం 100 మైళ్లదూరంలో ఉండటం గమనార్హం. భారీస్థాయిలో పెట్టుబడులు... ‘‘ఉక్కు, నికెల్, అరుదైన భూ అయస్కాంతాల ఉత్పత్తికి సంబంధించిన ఇండోనేసియా పరిశ్రమల్లో భారత్ పెట్టుబడుల వరద పారిస్తాం. నేటి ప్రపంచంలో ఉత్పత్తుల సరఫరా గొలుసు పటిష్టంగా ఉండటమనేది కీలకంగా తయారైంది. అందుకే ఇండోనేసియాలో అరుదైన మూలకాలు, స్టీల్ సరఫరా గొలుసు బలోపేతానికి కృషిచేస్తాం. దీనికితోడు ఇండోనేసియా చెల్లింపుల వ్యవస్థతో భారత్‌కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) అనుసంధానమై అక్కడి పౌరులకు సేవలు అందిస్తాం. 2018లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతిపొందిన ఇరుదేశాల బంధం ఇప్పుడు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.సహకార రంగంతోపాటు అభివృద్ధి, భద్రత, సాంకేతిక, సాంస్కృతిక, విద్యరంగాల్లోనూ సువర్ణాధ్యాయం మొదలుకాబోతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)బెంగళూరు శాఖను ఇండోనేసియాలోని ఈస్ట్ జావా ప్రావిన్స్‌లోని సింఘసారీ స్పెషల్ ఎకనమిక్ జోన్లో ఆరంభించబోతున్నాం’’అని మోదీ తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎన్నికల నిర్వహణలో భారత్ సాధించిన అపార అనుభవం ఇండోనేసియాకు అక్కరకురానుంది. ఎన్నికల నిర్వహణతోపాటు ఈవీఎంల ఎగుమతికి సంబంధించి ఇరుదేశాల మధ్య అవగాహనఒప్పందం కుదిరింది. మోదీకి ఇండోనేసియా అత్యున్నత పురస్కారంఇరుదేశాల మధ్య సత్సంబంధాల బలోపేతానికి మోదీ చేస్తున్న కృషికిగాను ఇండోనేసియా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’తో సత్కరించింది. సుబియంతో స్వయంగా దీనిని మోదీకి ప్రదానంచేశారు. ఈ సందర్భంగా మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘అవార్డ్ పొందటం ఎంతో గర్వంగా ఉంది. పురస్కారం గౌరవం కోట్లాదిమంది భారతీయులకు దక్కుతుంది’’అని అన్నారు.నేడు ప్రాంభనన్ ఆలయ సందర్శనమంగళవారం మోదీ యోగ్యకర్త నగరంలోని అతిపెద్ద శివాలయం ప్రాంభనన్ను దర్శించుకోనున్నారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో నిలిచిన వెయ్యేళ్ల చరిత్ర గల ఈ ఆలయ కాంప్లెక్స్ పరిరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో భారత్ సైతం పాలుపంచుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ఆరంభించేందుకు ఆసక్తి పత్రాలను ఇరుదేశాల ఉన్నతాధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించారు.సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు⇒ ఇదే మంత్రంతో భారత్ దూసుకెళ్తోంది⇒ ఇండోనేసియాలో భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగంజకార్తా: సంస్కరణలు, పనితీరు, పెనుమార్పు మంత్రం జపిస్తూ భారత్ ముందుకు దూసుకెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇండోనేసియాలోని జకార్తా నగరంలో పర్యటిస్తున్న మోదీ మంగళవారం అక్కడి భారతీయ సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘భారత్ జపిస్తున్న స్వావలంభన మంత్రం ఒక్క ఇండోనేసియాకేకాదు యావత్ ఆసియాన్ దేశాలు ఆచరించాలి. భారత్ ఒక్కో సంస్కరణను అమలుచేస్తూ వస్తోంది. ఇప్పుడు భారత్ పెనుమార్పులకు నిలయంగా మారింది. భారత ప్రగతి వేగాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే 140 కోట్ల స్ఫూర్తికణికలు ప్రజ్వరిల్లుతున్నాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థ మాత్రమేకాదు ఇది వంద కోట్ల కలల పయనం. ఇంధనం, అనుసంధానం, చిప్‌ల తయారీ ఇలా ప్రతి రంగంలోనూ భారత్ ముందడుగేస్తోంది. భారత్ సొంత కలలనేకాదు సోదర దేశాల కలలనూ తీర్చేందుకు తహతహలాడుతోంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్ మంత్రాన్నీ మేం పఠిస్తాం. భారత్ తన నౌకాశ్రయాలను ఆధునీకరిస్తోంది. నూతన సముద్రమార్గాలను అన్వేíÙస్తోంది. ఈ పయనంలో ఇండోనేసియా మాకు మంచి మిత్రునిగా వెంట నడుస్తోంది’’ అని అన్నారు. నాలో ఇండియా డీఎన్ఏ: సుబియంతో మోదీ ప్రసంగం వేళ అక్కడే ఉన్న ఇండోనేసియా అధ్యక్షుడు సుబియంతో మాట్లాడారు. ‘‘అధికార పగ్గాలు చేపట్టిన 3 నెలలకే భారత్ ఆహా్వనించింది. గత ఏడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నా. ముఖ్య అతిథిగా ఆహ్వానించిన భారత్‌కు నా కృతజ్ఞతలు. 1950లో భారత తొలి గణతంత్ర వేడుకలకు ఇండోనేసియా తొలి అధ్యక్షుడు సుకర్ణో హాజరయ్యారు. ఇలా 2 దేశాలు దశాబ్దాలుగా మిత్రులుగా మెలుగుతున్నాయి. గత ఏడాది భారతపర్యటన ముగించుకుని తిరిగిరాగానే జన్యక్రమ విశ్లేషణ పరీక్ష చేయించుకున్నా. డీఎన్ఏ టెస్ట్ పూర్తయింది. నాలో భారతీయ డీఎన్ఏ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అందుకే అనుకుంటా.. ఎప్పుడు భారతీయ సంగీతం విన్నాసరే నా శరీరం ఉత్సాహంతో ఉరకలెత్తుతుంది. నా కేబినెట్ మంత్రులు, ఆర్మీ జనరల్స్ కూడా డాన్స్ ఇష్టపడతారు. పాడటమూ ఇష్టమే. ఒకవేళ వాళ్లలోనూ చాలా మందిలో భారత డీఎన్ఏ ఉందేమో’’ అని సుబియంతో అనగానే అక్కడి వాళ్లంతా ఫక్కున నవ్వారు. మోదీ పథకాలు కాపీ కొట్టా.. మోదీ గౌరవార్థం ఇచ్చిన విందులో సుబియంతో మాట్లాడారు. మోదీనుద్దేశిస్తూ.. ‘‘భారత్‌లో మీరు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నేను అచ్చుగుద్దినట్లు ఇండోనేసియాలో అమలుచేసేందుకు ప్రయత్నిస్తుంటా. ఎన్నో పథకాలను కాపీ చేశా. ఇది బహిరంగంగా చెప్పడానికి ఏమాత్రం సంకోచించను’’ అని అన్నారు.విస్తరణవాదానికి దూరంగా ప్రగతిపథానికి దగ్గరగా ఇదే భారత్ పంథా: మోదీ జకార్తా: భారత్ ఎల్లవేళలా అభివృద్ధి పథంలోనే పయనిస్తోందని, ఏనాడూ విస్తరణవాదం వైపు మొగ్గుచూపలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఇండోనేసియా పార్లమెంట్లో అక్కడి చట్టసభ సభ్యులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ఇరుదేశాల మైత్రి మరింతగా విస్తరించాలి. 140 ఏళ్ల భారతీయులు, 29 కోట్ల ఇండోనేసియన్ల ఉమ్మడి శ్రేయస్సు కోసం ముందడుగువేద్దాం. స్వేచ్ఛాయుత, పారదర్శకమైన, సమ్మిళిత ఇండో–పసిఫిక్ కోసం భారత్ ఎల్లప్పుడూ కృషిచేస్తుంది. ఇండో–పసిఫిక్‌లో స్వేచ్ఛావాణిజ్యాన్ని భారత్ కోరుకుంటోంది. భారత్ ఏనాడైనా అభివృద్ధి బాటనే అనుసరిస్తుంది. రాజ్య విస్తరణవాదం వైపు అస్సలు నడవదు’’అంటూ దక్షిణచైనా సముద్రంలో చైనా ఆధిపత్యం, ఆగ్నేయాసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. -
మోదీ ఖాతాలో మరో పురస్కారం.. "భారతీయులకు దక్కిన గౌరవం"
జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది.ఇండోనేషియా అత్యున్నత పురస్కారం 'బింతాంగ్ ఆదిపూర్ణ'ను ఆదేశ అధ్యక్షుడు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేతుల మీదుగా (మంగళవారం) పీఎం మోదీ అందుకున్నారు. ఈ అవార్డు కోట్లాదిమంది భారతీయులకు దక్కిన గౌరవమని మోదీ పేర్కొన్నారు.భారత్-ఇండోనేషియా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారమైన 'బింతాంగ్ ఆదిపూర్ణ' ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రిఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ..."ఈ ఉదయం నాకు ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని ఎంతో ఆప్యాయతతో అందించారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయులకు దక్కినది... ఇది ఇండోనేషియా ప్రజల సెంటిమెంట్‌కు, భారత్-ఇండోనేషియాల మధ్య ఉన్న చారిత్రాత్మక, సన్నిహిత సంబంధాలకు ప్రతీక. ఈ సందర్భంగా అధ్యక్షుడు ప్రబోవో జీకి, ఇండోనేషియా ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని పీఎం మోదీ పేర్కొన్నారు.విదేశాంగ శాఖ స్పందనవిదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ అవార్డును "భారత్-ఇండోనేషియా స్నేహానికి దక్కిన నివాళి" గా అభివర్ణించారు. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా చేయడంతో పాటు, భారత్ - ఆసియాన్ సంబంధాలను బలోపేతం చేయడానికి పీఎం మోదీ చేసిన నిరంతర కృషికి ఈ పురస్కారమే నిదర్శనమని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.'బింతాంగ్ ఆదిపూర్ణ' పురస్కార చరిత్రఈ అవార్డును 1959 లో ఇండోనేషియా ప్రభుత్వం ప్రారంభించింది. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యున్నతమైన పురస్కారం. ఇండోనేషియా రిపబ్లిక్ యొక్క ఐక్యత, నిరంతర వృద్ధి, శ్రేయస్సు కోసం అసాధారణమైన సేవలు అందించిన వ్యక్తులకు ఈ అత్యున్నత గౌరవాన్ని అందజేస్తారు. -
తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ 2028.. అసలు గేమ్ మొదలైందా?
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ఆరంభించింది. ప్రధాని మోదీనే ఇందుకు శ్రీకారం చుట్టారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొద్ది రోజుల క్రితం తెలంగాణలో పర్యటించి వివిధ సభలలో పాల్గొన్నారు. ఆయన చేసిన ప్రసంగాలు గమనిస్తే.. 2028 శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలన్న సంకల్పం కనిపిస్తుంది. ఆయన కొత్తగా అధ్యక్షుడు అయినందున భవిష్యత్తులో వచ్చే ఎన్నికలన్నీ ఆయన సామర్థ్యానికి పరీక్షలు అవుతాయి. జయాపజయాలపై పూర్తిగా ఆయనదే బాధ్యత కాకపోవచ్చు. కాని సహజంగానే ఆయనపై అందరి దృష్టి ఉంటుంది.నితిన్ చేసిన ప్రసంగాలలో కొన్ని కీలక అంశాలు కనిపిస్తాయి. పశ్చిమబెంగాల్లో మాదిరే విజయం సాధించాలని, అందుకోసం ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. తెలంగాణలో గెలుపుపై ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తే తప్పుకాదు. కాని మతపరమైన అంశాలతో ప్రజలను రెచ్చగొట్టడం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో లక్షల ఓట్ల తొలగింపు వంటివి జరుగుతాయా అన్న సందేహం వస్తుంది.బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండవచ్చు. కాని దానికి మించి బీజేపీ కేంద్రంలో తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి మమతను ఉక్కిరిబిక్కిరి చేయడానికి యత్నించింది. తన చేతిలో ఉండే సీబీఐ, ఈడి వంటి సంస్థలను విచ్చలవిడిగా టీఎంసీనేతలపై ప్రయోగించిందన్న విమర్శలు వచ్చాయి. తెలంగాణలో కూడా ఇలాంటి వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందా? అంటే లేదని చెప్పడం కష్టమే.గత పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో ఎనిమిది సీట్లను సాధించి బీజేపీ సంచలనం సృష్టించింది. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ బాగా బలహీనపడినట్లు కనిపించినా, తర్వాత యధా ప్రకారం ఆ పార్టీ అగ్రనేతలు బాగా యాక్టివ్ అయి టూర్లు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు సాగిస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. మాచ్ పిక్సింగ్ చేసుకుంటే తప్ప బీజేపీ అధికారంలోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఆ సంగతి ఎలా ఉన్నా, తెలంగాణలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా అది బీజేపీకి ప్లస్ అవుతుందన్న నమ్మకం ఇంకా రా లేదు.జనంలో ఉన్న ఒక అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యే ప్రధాన పోటీ ఉండవచ్చనిపిస్తుంది. అందుకే ఒక నెల రోజులలో తెలంగాణలో బీజేపీకి అనుకూల పరిస్థితులు తయారు కావాలని నితిన్ నబీన్ పార్టీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయాలు సాధించాలని ఆయన నిర్దేశించారు. ఇందుకోసం రాష్ట్ర బీజేపీ నేతలు కలిసికట్టుగా ఎంత దూకుడుగా వెళతారు? కేంద్రంలో తమకు ఉన్న అధికారాన్ని ఇక్కడ కూడా ఏ మేరకు ప్రయోగిస్తారు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను ఎదగనీయకుండా చేయడానికి ప్రత్యేక ప్రణాళికను ఏమైనా అమలు చేస్తారా? అన్నది చర్చనీయాంశం అవుతుంది.ఈ క్రమంలో బీజేపీ ఒంటరి పోరుకే సిద్ధపడవచ్చని ఆ పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దికాలం క్రితం ఇదే మాట ఓపెన్‌గా చెప్పారు. ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న పొత్తులు కొనసాగిస్తారా? లేక అక్కడ కూడా ఒంటరిగా ఎదగడానికి యత్నిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా బీజేపీ ఇక్కడ ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో దాని మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అన్న చర్చ వస్తుంది. పెద్దగా బలం లేకపోయినా, ఆ పార్టీలకు ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు గురుశిష్యులుగా పేరొందారు.కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సభలో కర్నాటక ముఖ్యమంత్రి డీ.కే శివకుమార్‌తో కలిసి చంద్రబాబు, రేవంత్‌లు పాల్గొన్నారు. డీ.కే మాట్లాడుతూ తాము ముగ్గురం కలిసి చరిత్ర సృష్టించబోతున్నామని వ్యాఖ్యానించారు. రేవంత్‌ను చంద్రబాబు పొగిడారు. తెలంగాణ అభివృద్ది కోసం రేవంత్ బాగా కష్టపడుతున్నారని, తెలంగాణ ప్రాజెక్టుల కోసం రేవంత్ రాజీ పడరని ప్రశంసించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న సమయంలో బీజేపీ మిత్రుడైన చంద్రబాబు ఇలా కాంగ్రెస్ నేతను మెచ్చుకోవడం ఆసక్తికరమైన అంశమే. దీనిపై ఏమి మాట్లాడాలో బీజేపీ తెలంగాణ నేతలకు అర్థం కావడం లేదు. అందుకే ఏపీకే తమ మితృత్వం పరిమితమని, ఇక్కడ టీడీపీ తన సొంత వ్యూహం అమలు చేయవచ్చని వారు చెబుతున్నారు.మరో వైపు రేవంత్ రెడ్డి తనకు టీడీపీతో ఉన్న సంబంధాలను వాడుకుంటూ ఆ పార్టీకి కాస్తో, కూస్తో ఉన్న క్యాడర్‌ను, అభిమానులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి యత్నిస్తున్నారు. టీడీపీతో పాటు ఒక సామాజికవర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. టీడీపీ వారు కూడా కాంగ్రెస్‌కే మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ అధికార ప్రతినిదులు బహిరంగంగానే అకనాలెడ్జ్ చేస్తూ, టీడీపీ తమకే మద్దతు ఇస్తుందని టీవీ చర్చలలో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నగరపాలక సంస్థల ఎన్నికలు పలు రాజకీయ పరిణామాలకు కీలకంగా ఉండవచ్చు. ఈ ఫలితాల ప్రభావం భవిష్యత్తులో తెలంగాణ శాసనసభ ఎన్నికలపై పడే అవకాశం ఉంది.చంద్రబాబు వ్యూహాత్మకంగా రేవంత్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానంతో పరోక్ష స్నేహం కొనసాగిస్తున్నారని, అలాగే చంద్రబాబు ద్వారా రేవంత్ బీజేపీ అగ్ర నాయకత్వంతో సంబంధాలు పెట్టుకోగలిగారన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ఉంది. అయితే దీనికి ఇప్పటికిప్పుడు ఆధారాలు కనిపించకపోవచ్చు. కాకపోతే ప్రధాని మోదీ తన సభలో రేవంత్‌ను ఉద్దేశించి తమతో కలిసి పనిచేయాలని అంటూ చేసిన వ్యాఖ్యలను కొందరు ఉదహరిస్తుంటారు. అంతేకాక రేవంత్‌కు మోదీ అప్పాయింట్మెంట్ ఇచ్చే విధానాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తుంటారు.కాగా ఇటీవల మెట్రో రైల్ వివాదంలో రేవంత్ కోరిక మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చలు జరిగేలా చూశారు. అయినా మెట్రో రుణం విషయం కాని, రెండో దశ గురించి కాని స్పష్టత రాలేదు. రేవంత్‌కు సహకరిస్తున్నట్లు కనిపిస్తూనే బహుశా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బీజేపీ ఈ వ్యూహం అమలు చేస్తోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని నితిన్ మండిపడ్డారట. ఒకవైపు అలాంటి ప్రాంతీయ పార్టీలతో జతకడుతూ, మరోవైపు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వినే జనం ఆశ్చర్యపోవల్సిందే.వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని వీరు చెబుతారు. కాని అదే వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో మితృత్వం చేస్తుంటారు. అవకాశవాద రాజకీయాలకు బీజేపీ అతీతం కాదని చెప్పడానికి ఇవన్ని ఉదాహరణలే అవుతాయి. ఏది ఏమైనా తన అధికారాన్ని అడ్డు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై వేదింపులు, అక్రమ కేసులు, సీబీఐ, ఈడి సంస్థల దాడులు వంటివి చేయకుండా ఫెయిర్ రాజకీయం చేసి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాని ప్రస్తుత బీజేపీ నాయకత్వం అలాంటి నిబద్దత కలిగిన రాజకీయం చేస్తోందా అన్నదే ప్రశ్న.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు
జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో భేటీ అయ్యారు. జకార్తాలోని అధ్యక్ష భవనం ‘ఇస్తానా మెర్డెకా’ వద్ద ప్రధానికి సైనిక వందనంతో ఘన సాంప్రదాయ స్వాగతం లభించింది. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన ఒక కీలక అడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ పర్యటన పరస్పర నమ్మకాన్ని, స్నేహాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు.రెండు దేశాల మధ్య రక్షణ, సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. భారతదేశ ఎన్నికల విధానానికి లభించిన గుర్తింపుగా, ఇండోనేషియా కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను రూపకల్పన చేయడానికి భారత్ సహకరించనుంది. అలాగే, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో విజయవంతంగా నిరూపితమైన భారత ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ సాంకేతికతను చూసి, భారత్ నుండి ‘అస్త్రా’ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఇండోనేషియా ఆసక్తి చూపింది. కీలక ఖనిజాల సరఫరాను మెరుగుపరిచేందుకు ఇండోనేషియాలో ఉక్కు, నికెల్, అరుదైన భూ అయస్కాంతాల తయారీకి భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల నిల్వలను పెంచుకునేందుకు ఇండోనేషియాకు భారత్ మరిన్ని మిస్సైల్ బ్యాటరీలను సరఫరా చేయనుంది. వ్యూహాత్మక మలక్కా జలసంధికి సమీపంలో, భారత్ కు చెందిన గ్రేట్ నికోబార్ పోర్టు ప్రాజెక్టుకు కేవలం 100 మైళ్ల దూరంలో ఉన్న 'సబాంగ్' రేవు అభివృద్ధిపై ఇరు దేశాలు ముందడుగు వేశాయి.ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ మూడు దేశాల అధికారిక పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా ఇండోనేషియా చేరుకున్న భారత ప్రధాని మోదీకి సైనిక, సంప్రదాయ స్వాగతం లభించింది. 2018లో ఉభయ దేశాల మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’గా మార్చిన తర్వాత ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇదే తొలిసారి. భారత ప్రధాని విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి వాయుసేన యుద్ధ విమానాలు ఆయనకు రక్షణగా ఎస్కార్ట్ ఇచ్చాయి. అనంతరం విమానాశ్రయంలో అధ్యక్షుడు ప్రబోవో స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు.రక్షణ, సముద్ర తీర భద్రతతో పాటు ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు వంటి కీలక అంశాలు ఇరు దేశాల చర్చల ఎజెండాలో ఉన్నాయి. ‘మహాసాగర్’విధానం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని మోదీ పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రముఖ యునెస్కో వారసత్వ కట్టడమైన ప్రాంబనన్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు.Addressing the joint press meet with President Prabowo Subianto of Indonesia.@prabowo https://t.co/LrvzAuUjzi— Narendra Modi (@narendramodi) July 7, 2026 ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారంప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ’ లభించింది. మంగళవారం జకార్తాలోని ఇస్తానా మెర్డెకా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ ప్రతిష్టాత్మక పతకాన్ని పీఎం మోదీకి బహూకరించి గౌరవించారు. ఇండోనేషియా దేశ ఐక్యత, నిరంతర అభివృద్ధి, శ్రేయస్సు కోసం విశేష సేవలు అందించిన వ్యక్తులకు 1959 నుంచి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తున్నారు.#WATCH | Jakarta, Indonesia: Prime Minister Narendra Modi recieves a ceremonial welcome in Jakarta. PM Modi will hold bilateral discussions with President Prabowo today. (Source: ANI/DD) pic.twitter.com/I4vccGkNRt— ANI (@ANI) July 7, 2026 -
యుద్ధవిమానాలు తోడ్కొని రాగా..
జకార్తా: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. మిత్రదేశ సారథికి సాదర స్వాగతం పలికేందుకు అత్యంత అధునాతన యుద్ధవిమానాలను ఎదుర్కోలుకు పంపింది. సోమవారం ఢిల్లీ నుంచి బయల్దేరిన మోదీ విమానం ఇండోనేసియా గగనతలంలోకి రాగానే ఆ దేశానికి చెందిన ఎఫ్–16, సుఖోయ్–30 యుద్దవిమానాలు ఎదురొచ్చి మరీ సాదరంగా జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయానికి దారిచూపించాయి. ఫైటర్జెట్లు ఎస్కార్ట్‌గా వెంట రావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేస్తూ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు.గగనతలం మొదలు ఎయిర్పోర్ట్ దాకా ఇండోనేసియా ప్రభుత్వం చేసిన సాదర స్వాగత కార్యక్రమం తన మనసును హత్తుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ప్రధాని మోదీకి ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోబో సుబియంతో సాదరస్వాగతం పలికారు. నలుగురు మంత్రులతో కలిసి వచి్చమరీ ఆయన ప్రధానిని ఆప్యాయంగా హత్తుకుని కుశల ప్రశ్నలువేశారు. మంగళవారం సుబియంతో, మోదీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టతే లక్ష్యంగా కీలక రంగాల్లో సహకారం, వాణిజ్యంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.ఇరుదేశాల బంధాన్ని 2018లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించాక మోదీ ఇక్కడకు రావడం ఇదే తొలిసారి. ‘‘మంగళవారం సుబియంతోతో కలిసి యోగ్యకర్త నగరంలోని దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ప్రభానన్ను దర్శించుకుంటా. ఇది ఇరుదేశాల సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబించనుంది. భారతీయులతోనూ మాట్లాడబోతున్నా. విదేశంలో భారతీయులు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. విదేశంలో ఉంటూ భారత ప్రగతికి వీళ్లంతా కృషిచేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. భారతీయ సంగతి తమ ఘన విజయాల ద్వారా భారత బంధాన్ని ప్రపంచ దేశాలతో బలపరుస్తున్నారు’’అని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. నృత్య ప్రదర్శన, తోలు బొమ్మలాట.. ఎయిర్పోర్ట్ నుంచి తాను బసచేయబోయే హోటల్‌కు చేరుకోగానే అక్కడే వేచి ఉన్న భారతీయులు మోదీకి స్వాగతం పలికారు. వాళ్లతో మోదీ కొద్దిసేపు మాట్లాడి షేక్‌హ్యాండ్ ఇచ్చి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా రామయణ గాథను కళాత్మకంగా వివరిస్తూ కళాకారులు ప్రదర్శించిన ఇండోనేసియా సంప్రదాయక తోలుబొమ్మలాట ‘వయాన్గ్ కులిత్’ను మోదీ తిలకించారు. సమన్వయ గ్రూప్ చేసిన భరతనాట్యం నృత్య ప్రదర్శననూ ప్రధాని ఆసక్తిగా చూశారు.బౌద్ధమతంలోని త్రిరత్న(బుద్ధ, ధామ, సంఘ)ను వివరిస్తూ విహార ధర్మరత్న బృందంచేసిన ప్రదర్శన తననెంతో ఆకట్టుకుందని మోదీ ఆ కళాకారులను పొగిడారు. భారత్ యాక్ట్ ఈస్ట్ ఆసియా, మహాసాగర్ విజన్‌లో భాగంగా మోదీ సోమవారం మూడు దేశాల పర్యటన మొదలెట్టారు. ఇండోనేసియా పర్యటన తర్వాత అటునుంచి మోదీ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనిస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లి ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తోనూ చర్చలు జరపనున్నారు. -
జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు
జపాన్ ప్రధాని సనాయే తకాయిచీ భారత పర్యటన రెండు ప్రత్యేక నేపథ్యాల మధ్య జరిగింది. ఒకటి ఆర్థికమైనది, మరొకటి రక్షణ పరమైనది. ఈ రెండు నేపథ్యాలు ఇరు దేశాలకూ వర్తించేవే. అదే సమయంలో ఒకటి గుర్తించాలి. ఆర్థికమైన వర్తింపు ఉభయులకూ సమానమే కాగా, రక్షణ కోణంలో కొన్ని సామ్యాలతో పాటు కొన్ని తేడాలున్నాయి. ప్రధాని మోదీ, తకాయిచీ మధ్య ఢిల్లీలో ఈ నెల 2న జరిగిన చర్చలు, ఒప్పందాలు కూడా ఈ పరిస్థితులన్నింటిని ప్రతిఫలించాయి. వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, వాటి అభివృద్ధి ప్రయత్నాలు ఎప్పుడూ ఉండేవే. ఆర్థిక వ్యవస్థల రీత్యా ప్రముఖమైనవి అయిన ఇండియా, జపాన్ వంటి దేశాల మధ్య ఇవి ఇంకా బహు ముఖంగా ఉంటాయి. ఆ మేరకు వేర్వేరు రంగాలలో వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు ఎల్లప్పుడూ ఉన్నవే. అటువంటి స్థితిలో కొత్తగా ఏర్పడిందంటున్న ప్రత్యేక నేపథ్యం ఏమిటి?ప్రత్యేక నేపథ్యంఈ ప్రశ్నకు సమాధానం చర్చల అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఉంది. అది, ‘‘నేటి అనిశ్చిత పరిస్థితుల మధ్య ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను రెండు దేశాలు పూర్తిగా అర్థం చేసుకోవటం. దానిని దృష్టిలో ఉంచు కుని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్ మ్యాప్‌ను రూపొందించటం’’. నేటి అనిశ్చిత పరిస్థితులన్నవి కేవలం ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తినవి కావు. భారత్, జపాన్‌లతో పాటు ప్రపంచానికంతా అటువంటి ఒడిదుడుకులు ఉక్రెయిన్ యుద్ధంతో నాలుగేళ్ల క్రితం మొదలై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు, కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల మీదుగా ఇరాన్ యుద్ధం వరకు సాగివస్తున్నాయి. ఇవి స్థూలంగా పైకి కనిపించేవి. కొంత లోతుకు వెళితే,ప్రపంచ ఆర్థిక రంగానికి అనిశ్చితిని సృష్టిస్తున్న పరిణామాలు మరికొన్ని ఉన్నాయి. అవి, రెండవ ప్రపంచ యుద్థం తర్వాత బ్రెట్టన్‌వుడ్స్ వ్యవస్థలతో మొదలై ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యాలను, ఆర్థిక సంస్కరణలను సులభతరం చేసిన నియమ నిబంధనలు ఇటీవల కొద్ది సంవత్సరాలుగా భంగపడుతుండటం. ఆ వ్యవస్థలను, నిబంధనలు సృష్టించిన దేశాలే వాటిని బలహీన పరుస్తుండటం. వాటి ప్రతికూల ప్రభావాలు మధ్యమ స్థాయి దేశాలపై అట్లుంచి, మొదటి 10 స్థానాలలో గల భారత, జపాన్ వంటి ఆర్థిక వ్యవస్థలకు సైతం అనిశ్చితిని కల్పిస్తున్నది. ఇది ఇరాన్ యుద్ధంతో మరింత తీవ్రమైంది. ఇండియా, జపాన్ గత అక్టోబర్‌లో తకాయిచీ అధికారానికి రాక ముందు కూడా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మోదీ ప్రభుత్వంపై ఇతరత్రా ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు గాక. కానీ, వేర్వేరు దేశాలతో, ప్రాంతీయ ఆర్థిక కూటములతో వీలైనన్ని ఆర్థిక ఒప్పందాల కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు అనిశ్చితులు ఉండగా, మరొకవైపు ఈ పోటీ ప్రపంచం, దేశంలో అంతర్గతంగా ఎదురవుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఈ విధా నాల వెనుక ముప్పేటగా పనిచేస్తున్నాయని చెప్పాలి. అసమ వాణిజ్యంజపాన్ పరిస్థితి భారత్ కన్న కొంత మెరుగైనప్పటికీ పైన పేర్కొన్న పరిణామాల మధ్య సమస్యలు తప్పటం లేదు. వాటికి ఇటీవల మరొకటి తోడవుతున్నది. అది, చైనాతో పెరుగుతున్న వివాదాలు. తైవాన్ విషయమై తకాయిచీ వైఖరికి ఆగ్రహించిన చైనా, పలు విధాలైన చర్యలతో జపాన్ ఆర్థిక రంగాన్ని వీలైనంత కుంటుపరచటం మొదలు పెట్టింది. మరొకవైపు ఇండో–పసిఫిక్ రక్షణ బాధ్యతల నుంచి అమెరికా కనీసం పాక్షికంగా ఉపసంహరించుకుంటూ ఆ బరువును ఆ ప్రాంతంలోని జపాన్ తదితర మిత్ర దేశాలపై మోపుతుండటంతో జపాన్ సైనిక వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక భారాలన్నీ మోసేందుకు తకాయిచీ ప్రభుత్వం ఆసియా నుంచి యూరప్ వరకు వేర్వేరు దేశాలతో శరవేగంగా ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటున్నది. ఈ విధంగా ఆర్థిక అనిశ్చితులు, వాటిని తట్టుకునే చర్యలన్నవి భారత్, జపాన్‌లకు ఒకే విధంగా ఉన్నట్లు గమనించవచ్చు. కనుక, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో 2వ తేదీన జరిగిన ఆర్థిక ఒప్పందాలన్నీ హర్షించవలసినవే. ఒప్పంద వివరాలు వెంటనే తెలియరాలేదు గానీ తకాయిచీ వెంట సుమారు 100 జపనీస్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు రావటాన్ని బట్టి చర్చలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో ఊహించవచ్చు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్వయంగా చెప్పిన దానిని బట్టి, రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంలో 100కు పైగా వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. వాటివల్ల జపాన్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది గాక వచ్చే పదేళ్లలో రెట్టింపు జపనీస్ కంపెనీలను, 10 ట్రిలియన్ల జపనీస్ యెన్ పెట్టుబడులను (మారకం విలువ 1 రూపాయికి 1.69 యెన్లు) ఆకర్షించటం లక్ష్యమన్నారు. ఇండియాలో ఇప్పటికే 1,400కు పైగా జపాన్ కంపెనీలు, 5,000కు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ సంఖ్యలు రెట్టింపు కావటం ఎట్లున్నా, ఇరువురు ప్రధానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో ఎంత విస్తరిస్తే అంత మేలు కలుగుతుంది. అదే సమయంలో భారత ప్రభుత్వంపై కొన్ని పెద్ద బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సాలీనా ఎగుమతి దిగుమతుల విలువ 27 బిలియన్ డాలర్ల మేర ఉంది. అది సంతృప్తి కరమైనదే. కానీ, ఇండియా ఎగుమతులు కేవలం 6 బిలియన్లు, దిగుమతులు 21 బిలియన్లు (మూడున్నర రెట్లు) అంటే ఆ వివరాలు ఎంత అసంతృప్తికరమైనవో వేరుగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పుకోవాలంటే, భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 6వ ర్యాంకుకు చేరినప్పటికీ, సాలీనా వాణిజ్య లోటు 10 బిలియన్ డాలర్లకు మించి ఉంది. జరగాల్సిన కృషిఆర్థిక రంగానికి సంబంధించి జపాన్ ప్రధానితో జరిగిన చర్చలలో చమురు తదితర ఇంధన భద్రతలు, ప్రత్యామ్నాయ ఇంధ నాలు, అరుదైన లోహాలు, ఖనిజాల ప్రస్తావనలు అనివార్యంగా వచ్చాయి. వాటికి అనుబంధంగా ఇండో–పసిఫిక్ సముద్ర మార్గాల ద్వారా స్వేచ్ఛాయుత రవాణాకు అవకాశాలను కల్పించుకోవటం. ఈ నిర్దిష్టమైన అంశాలన్నీ ఇండియా, జపాన్‌లతో పాటు అన్ని దేశాలలో చర్చలు జరుగుతున్నవే. అయితే ఇవి ఎంత కీలకమైనవో అంత క్లిష్టమైనవి కూడా. వీటి గురించి ఎవరికి వారు అంతర్గత కృషి చేయటం, ఇతరుల సహకారంతో సామరస్య పరిష్కారాలు కనుగొనటం రెండూ అవసరం. ఈ కొత్త పరిస్థితులలో ఆ ప్రయత్నాలు లోగడ కన్నా ఎక్కువగా జరగక తప్పదు. చర్చలలో ప్రస్తావనకు వచ్చిన మరొక కీలకాంశం రక్షణ. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఇండో–పసిఫిక్ ద్వారా సముద్రయానాలు. ఇది రెండు దేశాలకు సంబంధించినది. రెండు, ఈ మార్గాలలో, అంతకన్నా ఎక్కువగా పసిఫిక్‌లో చైనాను కట్టడి చేసే విషయం. ఈ విధమైన కట్టడి అవసరం ఇండియాకు పరిమిత స్థాయిలో ఉండగా, జపాన్‌కు, దానిని తమ సమగ్ర వ్యూహంలో భాగంగా చేసుకున్న అమెరికాకు అపరిమిత స్థాయిలో ఉంది. అమెరికా ఇటీవల ‘క్వాడ్’ ప్రత్యక్ష బాధ్యతల నుంచి నెమ్మదిగా తగ్గుతూ జపాన్, ఆస్ట్రేలియాల బాధ్యతను పెంచుతుండటంతో కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ బాధ్యతను తలకెత్తుకున్న తకాయిచీ రక్షణ వ్యయాన్ని పెంచుతూ, పలుదేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ రక్షణ విషయాలైతే ఢిల్లీలో ‘చర్చకు’ వచ్చాయి గానీ, ‘ఒప్పందాలు’ లేకపోవటం ఇండియా విధానాలకు అనుగుణమైనదేనని చెప్పాలి. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ నెల 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మోదీ పర్యటించనున్నారు. జులై 6 నుంచి 8 వరకు ఇండోనేషియాలో పర్యటించనున్న ప్రధాని.. బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు ఒప్పందంపై చర్చలు జరపనున్నారు. ఇండో - పసిఫిక్ రీజియన్‌లో వ్యూహాత్మక సమన్వయంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.ప్రధాని మోదీ.. తొలుత సోమవారం ఇండోనేసియాకు చేరుకుంటారు. 2016 తర్వాత మోదీ ఆ దేశానికి వెళ్తుండడం ఇదే మొదటిసారి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఇండోనేసియా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సముద్ర భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంటోతో మోదీ సమావేశమవుతారు. ఇరుదేశాల సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇండో–పసిఫిక్‌లో సము ద్ర సహకారాన్ని, సరఫరా గొలుసులను పటిష్టం చేయడం, ఆర్థిక మరియు వ్యూహాత్మక సంబంధాలు, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, తయారీ రంగంలో సహకారం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై చర్చించే అవకాశం ఉంది.ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమీక్షిస్తారు. రాజధాని జకార్తాలో ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ అవుతారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోనేసియాలోని ప్రఖ్యాత ప్రాంబనన్ ఆలయాన్ని మోదీ దర్శించుకుంటారు. మోదీ ఇండోనేసియా పర్యటన ముగించుకున్న తర్వాత వెంటనే ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించబోతున్నారు. ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు సుబియాంటో గత సంవత్సరం భారత్‌లో పర్యటించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి మూడు రోజులపాటు ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించబోతున్నారు. ఆయన తొలుత సోమవారం ఇండోనేసియాకు చేరుకుంటారు. 2016 తర్వాత మోదీ ఆ దేశానికి వెళ్తుండడం ఇదే మొదటిసారి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఇండోనేసియా మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఈ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సముద్ర భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంటోతో మోదీ సమావేశమవుతారు. ఇరుదేశాల సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇండో–పసిఫిక్‌లో సము ద్ర సహకారాన్ని, సరఫరా గొలుసులను పటిష్టం చేయడం, ఆర్థిక మరియు వ్యూహాత్మక సంబంధాలు, కీలక ఖనిజాలు, స్వచ్ఛ ఇంధనం, తయారీ రంగంలో సహకారం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలపై చర్చించే అవకాశం ఉంది.ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వారు సమీక్షిస్తారు. రాజధాని జకార్తాలో ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ అవుతారు. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండోనేసియాలోని ప్రఖ్యాత ప్రాంబనన్ ఆలయాన్ని మోదీ దర్శించుకుంటారు. మోదీ ఇండోనేసియా పర్యటన ముగించుకున్న తర్వాత వెంటనే ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించబోతున్నారు. ఇండోనేసియా ప్రస్తుత అధ్యక్షుడు సుబియాంటో గత సంవత్సరం భారత్‌లో పర్యటించారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
దేశ ఐక్యత–ప్రగతికి అంకితమైన జీవితం
ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి ఇదొక ప్రత్యేక దినం. అంతులేని సాహసానికి, భరతమాతపై అత్యంత ఆరాధన భావనకు కాలాతీత నిదర్శనంగా నిలిచిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజే. ఆధునిక భారతంలో మేధస్సు, ప్రజాసేవ, నైతిక విశ్వాసమనే లక్షణాల అద్భుత సమ్మేళనం ఇంతగా మూర్తీభవించిన ఆయన వంటి నాయకులు దేశంలో చాలా అరుదు. ఆయన సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ సకల సౌఖ్యాలనూ వదులుకుని త్యాగం, జాతి సేవ దిశగా ఆయన అంతరాత్మ నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సమస్యలు వంటివి కమ్ముకున్న నాటి కల్లోల కాలంలో ఒక మూగ ప్రేక్షకునిగా మిగిలిపోవడం తగదని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రస్థానంలో ఆయన తొలుత పసికందుగా ఉన్న బిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోయారు. ఆత్మార్పణడా‘‘ ముఖర్జీ ప్రజా జీవనాన్ని అన్నింటికన్నా ఎక్కువగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే– అవిభాజ్య భారత్ దిశగా ఆయన దీక్ష. దేశ విభజన సంక్షోభ సమయాన పశ్చిమ బెంగాల్ భారత్‌లో అంతర్భాగంగా ఉండాలని ఆయన ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆనాడు దృఢంగా నిలబడిన ఆయన విశ్వాసమే కొన్నేళ్ల తర్వాత ఆయనను జమ్మూకాశ్మీర్ వైపు నడిపింది. ఆ క్రమంలో జైలుపాలైనా ఆ జీవితం ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చలేక పోయింది. కారాగార ఏకాంతం ఆయనను ఎంతమాత్రం కుంగదీయలేదు. ఏ ప్రజల ఆశయాన్ని తనదిగా చేసుకున్నారో వారికి అత్యంత దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం హఠాత్తుగా ముగిసింది. ఆచార్య వినోబా భావే చెప్పినట్లు– తాను విశ్వసించిన ఆదర్శం కోసం డా‘‘ ముఖర్జీ ఆత్మార్పణకు వెనుదీయలేదు. అటుపైన ఎన్నో ఏళ్ల తర్వాత 2019లో ఆర్టికల్ 370, 35 (ఎ)ల రద్దు ఆయన అమరత్వానికి అత్యంత సముచిత నివాళి అనడంలో సందేహం లేదు.భారతీయతకు పెద్దపీటఆయన ఎప్పుడూ దేశానికే ప్రథమ స్థానమిచ్చారు. భారతీయ విలువలకే పెద్ద పీట వేశారు. తదనుగుణమైన సంస్థలకు రూపమివ్వడం ద్వారా ఆయన ఈ లక్ష్యం సాధించారు. అత్యంత పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉప కులపతి అయ్యారు. తనదైన శైలిలో, దేశభక్తి, భవిష్యత్ దృక్పథంతో కూడిన అనేక సానుకూల మార్పులు తెచ్చారు. ఓ సారి విద్యావేత్తల సదస్సులో ప్రసంగించిన సందర్భంగా– ‘భవిష్యత్ గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా విద్యా సంస్థలను చిన్న చూపు చూడటం తగదు. స్థానిక సంస్థలు, పురపాలక, రాష్ట్ర, కేంద్ర చట్టసభలను నడిపించగల ఉద్దండులుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దాలి. అదే తరహాలో ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక తదితర జనజీవన ప్రాధాన్య రంగాల వ్యవహారాలను నడిపించగల సమర్థులుగా తయారు చేయాలి’ అని కుండబద్దలు కొట్టారు. అప్పట్లో ‘భారతీయ జనసంఘ్’ను రపుదిద్దాలని డా‘‘ ముఖర్జీ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాభవం ఉచ్ఛస్థాయిలో ఉన్న సమĶæన మనవైన సాంస్కృతిక మూలాలకు కట్టుబడుతూనే దేశ ప్రగతి కోసం గళం విప్పే ప్రత్యామ్నాయ స్వరం ఒకటి అవసరమని ఆయన భావించారు. అది ఓ చిన్న దివ్వెలాంటిదైనా పరవాలేదని భావించారేమో అన్నట్లుగా దాని చిహ్నంగా ‘మట్టి దీపం’ గుర్తును ఆయన ఎంచుకోవడం గమనార్హం. పారిశ్రామిక విధానానికి పునాది ఆయనకు దేశ ప్రగతిపై గల అవగాహన ఎంతటిదో భారత తొలి పరిశ్రమలు–పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన పదవీకాలం వెల్లడిస్తుంది. ఒక రాజనీతిజ్ఞుడిగా, నిజాయితీ, మానవతా దృక్పథం కలగలసిన నాయకుడుగా ఆయన సామర్థ్యం స్పష్టమవుతుంది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింధ్రీ ఫెర్టిలైజర్ ప్లాంట్, పటిష్ట పారిశ్రామిక విధానం వంటి మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతానికి పునాదులు వేశారు. అదే సమయంలో భారత సంప్రదాయ బలాలు నిర్లక్ష్యానికి గురికాకుండా చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళారంగం వంటి వాటికీ ఆయన మద్దత్తు ఇచ్చారు. ఈ సందర్భంగా నేనొక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తున్నాను. స్వావలంబనపై విస్పష్ట దార్శనికతతో డా‘‘ ముఖర్జీ స్థాపించిన సింధ్రీ కర్మాగారాన్ని అనేక దశాబ్దాల పాటు దేశాన్నేలిన పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఆ కార్యక్రమంలో పాల్గొనడం నా జీవితంలోని అత్యంత ప్రత్యేక క్షణాలలో ఒకటిగా నిలిపోయిందంటే అతిశయోక్తి కాబోదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి డా‘‘ ముఖర్జీ ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ పురోగమన బాధ్యత రాజకీయ విభేదాలకు అతీతమనే సత్యాన్ని విశ్వసించి పండిట్ నెహ్ర మంత్రిమండలిలో చేరారు. ఆ పదవిలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవలందించారు. కానీ, జాతీయ ప్రాధాన్యంగల అంశాల్లో భిన్న మార్గం సముచితమని భావించిన వేళ గౌరవప్రదంగా పదవిని త్యజించారు. దేశానికి ఏది అవసరమో దానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలకు పూర్తి నిబద్ధతతో అంకితమయ్యారు. పండిట్ నెహ్రూ 75 ఏళ్ల కిందటే భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడితో సమానమైన తొలి రాజ్యాంగ సవరణను తెచ్చారు. దాన్ని డా‘‘ ముఖర్జీ నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ మనోభావన ఏమిటో ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అదే పూర్తిగా సరైనదని కూడా నిరూపితమైంది. అలనాడు... 75 ఏళ్ల కిందట తొలి సవరణ తెచ్చిన వారే 1975లో ఎమర్జన్సీకి కూడా కారకులయ్యారు. సేవామూర్తిమానవతా వాదాన్ని సమున్నతంగా నిలపడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. బెంగాల్లో 1943నాటి అత్యంత ఘోరమైన కరవు విజృంభించినపుడు ఆయన బాధితుల సేవలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం అనేక స్వచ్ఛంద వంటశాలలు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేలా అవిరళ కృషి చేశారు. ప్రజల దుఃస్థితి చూసి నిలువెల్లా చలించిపోయిన ఆయన, వలస పాలకుల నిర్దాక్షిణ్య వైఖరిని తీవ్రంగా నిరసించారు. ‘పంచషేర్ మన్వంతర్’ పేరిట తాను రాసిన పుస్తకంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతకుముందు 1942లో మేదినీపూర్‌ను ఒక మహా తుఫాను వణికించినపుడు పరిస్థితుల పునరుద్ధరణ దిశగా ఆయన కృషికి విస్తృత ప్రశంసలు లభించాయి.ఆ రోజుల్లో కలకత్తాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యువతను ఉద్దేశించి మాట్లాడుతూ– ‘మీరు ఏ పని చేపట్టినా శ్రద్ధగా, క్షుణ్ణంగా, అర్థవంతంగా చేయండి. ఏ పనినీ అర్ధాంతరంగా వదిలేయకండి. అరకొర ఫలితంతో సంతృప్తి చెందకండి. మీ అత్యుత్తమ కృషితో సత్ఫలితం సిద్ధించే దాకా పట్టువీడకండి’ అని ఆయన పిలుపునిచ్చారు. దేశం ఇవాళ వికసిత భారత్ స్వప్న సాకారం దిశగా పురోగమిస్తున్న తరుణాన... ఆయన ప్రగాఢంగా విశ్వసించిన శక్తియుత, సమైక్య, ఆత్మవిశ్వాసపూరిత, కరుణార్ద్ర దేశ నిర్మాణానికి నిత్యం కృషి చేయడమే ఆయనకు మనం అర్పించగల అత్యుత్తమ నివాళి. ఈ నేపథ్యంలో యువత నేటి సందర్భానికి తగినట్లు డా‘‘ ముఖర్జీ ఆశయాలకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నరేంద్ర మోదీభారత ప్రధాని -
ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించాం. పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించాం. ప్రధాని మోదీ వెల్లడి
-
ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం
పాచ్పద్రా/జోధ్‌పూర్: ఈ శతాబ్దంలో అతిపెద్ద ప్రపంచ ఇంధన సంక్షోభాల్లో ఒకదానిని మనం విజయవంతంగా అధిగమించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చురుకైన ప్రభుత్వ విధానాలు, వైవిధ్యమైన ఇంధన వనరులు, బలమైన దౌత్య సంబంధాల ద్వారా పౌరులపై ఆర్థిక భారాన్ని చాలావరకు తగ్గించామని తెలిపారు. ఇంధన సంక్షోభం కారణంగా ప్రధాన దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని వెల్లడించారు. ఇంధనం విషయంలో కొన్ని శక్తులు ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడంలో నిమగ్నమయ్యాయని విమర్శించారు. రాజకీయ క్రీడలు సాగాయని అన్నారు. కానీ, ప్రజలకు ఉపశమనం కల్పించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆ శక్తుల పథకం పారలేదని, తీవ్ర నిరాశలో కూరుకుపోయాయని ఎద్దేవా చేశారు. సంక్షోభాన్ని మనం అధిగమించిన తీరు చరిత్రలో ఒక అపూర్వమైన అధ్యాయంగా గుర్తుండిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ శనివారం రాజస్తాన్‌లో పర్యటించారు. బలోత్రాలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ–పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని సృష్టించిందని గుర్తుచేశారు. అనేక శక్తివంతమైన దేశాలు ఇంధన కొరతతో సతమతమయ్యాయని అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడం, మన వనరులను సమతుల్యంగా ఉపయోగించడం, దౌత్య బలాన్ని సానుకూలంగా వినియోగించుకోవడం ద్వారా ఈ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నామని స్పష్టంచేశారు. గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీని ఏప్రిల్ 21న మోదీ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండగా, 20న జరిగిన అగి్నప్రమాదం వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. రెండు నెలల్లోనే మరమ్మతులు పూర్తి చేసినందుకు అధికారులను మోదీ అభినందించారు. చమురు సామర్థ్యంలో నాలుగో స్థానం అనేక అభివృద్ధి చెందిన దేశాలు చమురు శుద్ధి సామర్థ్యాన్ని పెంచుకోవడంలో విఫలమైనప్పటికీ.. భారతదేశం మాత్రం ఆ సామర్థ్యాన్ని గణనీయంగా విస్తరింపజేసుకుంది. గత 50 ఏళ్లలో అమెరికా కొత్తగా చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించలేదు. ఐరోపా శుద్ధి సామర్థ్యం నానాటికీ తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం అయిల్ రిఫైనరీ సామర్థ్యం పరంగా భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశంగా అవతరించింది. ఈ సామర్థ్యం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్ల ఏప్రిల్ నుంచి జూన్ మధ్య మన దేశ చమురు కంపెనీలు రూ.75,000 కోట్లకు పైగా నష్టాలను చవిచూశాయి.అయితే, ఆ భారాన్ని ప్రభుత్వమే భరించింది. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. ఇంధనాన్ని కోటా పద్ధతిలో పంపిణీ చేశారు. మన దేశంలో ఒక్కరోజు కూడా అలాంటి పరిస్థితి తలెత్తలేదు. కొందరు మాత్రం చమురు విషయంలో వదంతులు వ్యాప్తి చేశారు. ప్రజలను భయపెట్టారు, రాజకీయ క్రీడలు ఆడారు. కానీ, వారు సఫలం కాలేకపోయారు. సంక్షోభ సమయంలో మనం తీసుకున్న ప్రతి కీలక నిర్ణయం చరిత్రలో భాగం అవుతుంది. భారత్ విఫలం కావాలని కోరుకున్నవారికి చివరకు పరాభవమే మిగిలింది. ‘ఉడాన్’తదుపరి దశ ప్రారంభం ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాంతీయ అనుసంధాన పథకం ‘ఉడాన్’తదుపరి దశను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. అలాగే జోధ్‌పూర్ విమానాశ్రయంలో రూ.480 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త టెరి్మనల్ భవనాన్ని ప్రారంభించారు. సవరించిన ఉడాన్ పథకాన్ని ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుకు రాబోయే పదేళ్లలో దాదాపు రూ.29,000 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. రూ. 2,000 సిలిండర్ రూ. 950కే లభిస్తోంది మన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 70 శాతం దిగుమతుల ద్వారానే తీరుతోంది. ఆ సరఫరాలలో సుమారు 90 శాతం ఎల్పీజీ హార్మూజ్ జలసంధి గుండా గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. హార్మూజ్‌లో ఆటంకాలు మొదలైన తర్వాత దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్టంగా పెంచాలని ప్రభుత్వం తక్షణమే నిర్ణయించింది. పారిశ్రామిక గ్యాస్ ఉత్పత్తి స్థానంలో ఎల్పీజీ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చాం. ఏడు రోజుల్లోనే రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సంక్షోభ సమయంలో ఎల్పీజీ ఉత్పత్తి 54,000 మెట్రిక్ టన్నులు పెరిగింది.ఎల్పీజీకి దేశీయ డిమాండ్ అదుపులో ఉండేలా పీఎన్జీ కనెక్షన్లు వేగంగా విస్తరించేలా ప్రభుత్వం ఏకకాలంలో చర్యలు తీసుకుంది. చాలా తక్కువ సమయంలోనే 11 లక్షలకు పైగా గృహాలకు పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చాం. పెరుగుతున్న ధరల భారం నుంచి గృహ వినియోగదారులకు రక్షణ కల్పించాం. ఒక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,000 వరకు ఉంటుంది. కానీ, నేడు అది రూ.950కే లభిస్తోంది. హార్మూజ్‌లో ముడి చమురు మార్గాలకు అంతరాయం కలగడంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 120 డాలర్లకు పెరిగాయి.ఆ సమయంలో ఇతర దేశాల నుంచి ఇంధన దిగుమతులను గణనీయంగా పెంచాం. 40కిపైగా దేశాల నుంచి దిగుమతులు చేసుకున్నాం. ఈ మార్పునకు భారత్ అనుసరించిన దౌత్యమే కారణం. లీటర్‌కు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి, పౌరులపై భారం పెరగకుండా చర్యలు చేపట్టాం. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణలు, ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఎరువుల సరఫరాపై ప్రభావం పడింది. ఆ ప్రతికూల పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. వ్యక్తి లేదా దేశం స్వయం సమృద్ధిని సాధించినప్పుడే వారి ఆత్మగౌరవం ఉన్నత స్థాయిలో ఉంటుంది’’అని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. సెమీకండక్టర్, ఏఐ రంగాల్లో అవకాశాలు వదులుకోవద్దు సంపూర్ణ సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యం: మోదీఅహ్మదాబాద్: ఉత్పత్తులు, విడిభాగాల నుంచి సెమీకండక్టర్ల వరకు మొత్తం విలువైన ఎల్రక్టానిక్స్ వ్యవస్థను భారత్ నిర్మిస్తోందని, ఇదే ‘వికసిత్ భారత్’కు రోడ్‌మ్యాప్ అని ప్రధాని మోదీ అన్నారు. శనివారం గుజరాత్‌లోని సనంద్‌లో సీజీ సెమీ ఔట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్(ఓఎస్ఏటీ) కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సెమీకండక్టర్, కృత్రిమ మేధ(ఏఐ) రంగాలు లెక్కలేనన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని, దీన్ని భారతీయ యువత వదులుకోవద్దని కోరారు.మనం కేవలం చిప్‌లను తయారు చేయడమే కాకుండా ఏఐ, రోబోటిక్స్, తదుపరి తరం సాంకేతిక విప్లవాన్ని వేగవంతం చేయబోతున్నామని చెప్పారు. మన యువత ‘మేడ్ ఇన్ ఇండియా’చిప్‌లను ఉపయోగించబోతున్నారని తెలిపారు. యువత సామర్థ్యం, ప్రతిభపై తమకు అచంచలమైన విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు కొత్త పారిశ్రామిక విప్లవం సంభవించినా, అది యువతకు అత్యధిక సంఖ్యలో అవకాశాలను కల్పిస్తుందని గుర్తుచేశారు.మనదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ విస్తరణ రాత్రికి రాత్రే జరగలేదని, గత దశాబ్ద కాలంగా చోటుచేసుకున్న ఎల్రక్టానిక్స్ విప్లవంలో ఇది తదుపరి దశ అని వివరించారు. దేశంలో చిప్ డిజైన్ నుంచి తయారీ, ప్యాకేజింగ్ వరకు సంపూర్ణ సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.ఆ్రస్టేలియా పర్యటన వేళ దాడి చేస్తామని మోదీకి బెదిరింపు దర్యాప్తు ముమ్మరం చేసిన ఆస్ట్రేలియా పోలీసులుమెల్బోర్న్: ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భా రత ప్రధాని మోదీకి తాజాగా ఒక ఆన్లైన్ బెదిరింపు వచి్చంది. మెల్బోర్న్ నగరంలోని ప్రఖ్యా త మార్వెల్ స్టేడియంలో జరగబోయే సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో అక్కడ దాడి చేస్తామంటూ సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు వెంటనే ముమ్మర దర్యాప్తు ఆరంభించారు.ఈ పోస్ట్‌తో సంబంధం ఉన్న అబూ ముస్తాఫా ఐడీతో ఉన్న ఐపీ అడ్రస్‌ను కనుగొన్నామని వెల్లడించారు. ఈనెల 9వ తేదీన ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ’కార్యక్రమం ఆ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ స్టేడియంనుద్దేశిస్తూ అబూ ముస్తాఫా యూజర్‌నేమ్ నుంచి ఈ పోస్ట్ చేశారు. ‘‘స్టేడియం పైకప్పును మూసేస్తే ఉత్తమం అనుకుంటున్నా. లేదంటే ఆయన తన మృత్యుదేవతను చూసేందుకే ఇక్కడికి వచ్చినట్లు అవుతుంది’’అని ఆ పోస్ట్‌లో హెచ్చరించారు. ఇది కేవలం బెదిరింపు సందేశమా లేదంటే గతంలో ఈ ఐపీ అడ్రస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు నేర చరిత్ర ఉందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
మోడీ వల్లే బంగారం రేట్లు పడిపోతున్నాయా ?
-
ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపులు
ఆస్ట్రేలియా పర్యటన వేళ.. ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.. ఆసీస్ పర్యటనకు ముందు మోదీకి ఆన్లైన్లో బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 9న ఆ దేశ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లనున్న క్రమంలో.. ఆస్ట్రేలియా వస్తే చంపేస్తామంటూ వచ్చిన వార్నింగ్‌పై ఆ దేశ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.జులై 9న మార్వెల్ స్టేడియంలో జరగాల్సిన ‘మెల్బోర్న్ మీట్స్ మోదీ (Melbourne Meets Modi) కమ్యూనిటీ ఈవెంట్‌ను ప్రకటిస్తూ ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్ట్ కింద ఈ బెదిరింపు కామెంట్ ప్రత్యక్షమైంది. అబు ముస్తఫా అనే పేరుతో ఉన్న ఖాతా నుండి వచ్చిన ఆ కామెంట్లో ‘ఈ కార్యక్రమం జరిగే సమయంలో స్టేడియం రూఫ్ టాప్‌లను (పైకప్పును) మూసివేయడం మంచిది. లేదంటే ఆయన తన మరణం కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లు లెక్క’’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ బెదిరింపులపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ (AFP)కి ఫిర్యాదు అందినట్లు ది ఆస్ట్రేలియా టుడే తెలిపింది.ఈ పోస్ట్‌కు సంబంధించిన ఐపీ (IP) అడ్రస్‌ను ర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై పలు కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ పర్యటనలో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనడంతో పాటు.. మెల్బోర్న్ సమావేశంతో సహా పలు కమ్యూనిటీ ఈవెంట్లలో కూడా పాల్గొననున్నారు. పర్యటనకు వచ్చే ఇతర దేశాల ప్రభుత్వాధినేతలకు వచ్చే బెదిరింపులను ఆస్ట్రేలియా చట్టం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుంది. హై-ప్రొఫైల్ అంతర్జాతీయ పర్యటనల భద్రతా ప్రణాళికలో ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్, స్టేట్ పోలీస్, స్పెషలిస్ట్ ప్రొటెక్టివ్ సెక్యూరిటీ యూనిట్లతో సహా పలు సంస్థలు భాగస్వామ్యమవుతాయి. -
ఆ సంక్షోభంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
బాలోత్రా: రాజస్థాన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిని అధిగమిస్తూ.. బాలోత్రా జిల్లా పచ్‌పద్ర వద్ద ఏర్పాటు చేసిన మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను మోదీ ప్రారంభించారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో సుమారు రూ. 79,450 కోట్లకు పైగా పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేశారు.సుమారు రూ. 1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. జోధ్‌పూర్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. సవాలు ఎంత పెద్దదైనా.. ఊహించనిదైనా సరే.. భారత్ తన సంకల్పం నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ విధానాలతో పాటు బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కారణంగా సంక్షోభం నుంచి భారత్ తక్కువ భారంతో బయటపడిందని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంధన సరఫరాలో పెద్దగా సవాళ్లు ఎదురు కాలేదన్న మోదీ.. ప్రజలపై ఎటువంటి అదనపు భారం పడకుండా చూశామన్నారు. జోధ్‌పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభం దేశ అభివృద్ధి ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు అని.. ఇది మార్వార్ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు పెద్ద పీట వేస్తుందని ప్రధాని అన్నారు. -
దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రారంభం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని.. బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర ప్రాంతంలో దేశంలోని తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-పెట్రోకెమికల్ సముదాయాన్ని ప్రారంభించారు. ఇది దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో కొత్త అధ్యాయంగా నిలిచింది. ఈ సముదాయం భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు దేశీయ పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా మారనుంది.ఈ రిఫైనరీని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను రూ. 79,450 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నులు. అదనంగా ఏడాదికి 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గి, దేశీయంగా పెట్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ పెరుగుతుంది. దీనివల్ల దేశ ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుంది. అంతే కాకుండా.. ఈ రిఫైనరీ ఆధారంగా ఇక్కడ పెట్రోకెమికల్, ప్లాస్టిక్ పార్క్ అభివృద్ధి చెందనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడి స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. ఈ ప్రాజెక్టు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దీంతో రాజస్థాన్ రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందనుంది.#WATCH | Balotra, Rajasthan | Prime Minister Narendra Modi flags off refinery production tankers from the Greenfield Refinery-cum-Petrochemical Complex, developed as a joint venture between Hindustan Petroleum Corporation Limited (HPCL) and the Rajasthan Government, which PM Modi… pic.twitter.com/YHAZSdihQE— ANI (@ANI) July 4, 2026 -
జపాన్‌తో ‘మిత్రలాభం’
శిఖరాగ్ర సమావేశాలకు దౌత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. రెండు దేశాల మధ్య ఆ స్థాయి సమావేశం జరిగిందంటే ఆ దేశాల అధినేతలు నేరుగా మాట్లాడుకుని, సంక్లిష్ట సమస్యల పరిష్కార సాధనకు కృషి చేస్తున్నారనీ, ఈ క్రమంలో ఎంతో జాప్యం చోటు చేసుకునే అధికారస్వామ్య ప్రమేయాన్ని అధిగమించదల్చుకున్నారనీ అర్థం. జపాన్ ప్రధాని సనే తకాయిచి మన దేశంలో మూడు రోజులు పర్యటించి శుక్రవారం వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర సమావేశం జరిపారు. ఈ పర్యటనలో కృత్రిమ మేధ(ఏఐ), ఇంధనం, రక్షణరంగం, ఖనిజాల వెలికితీత తదితర రంగాల్లో 17 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో రక్షణ సాంకేతికతల్లో అత్యంతాధునికమైన ‘యూనికార్న్’ ప్రాజెక్టు ఒప్పందం అన్నివిధాలా ప్రత్యేకమైనది. యుద్ధ నౌకలపై వేర్వేరు అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహ కమ్యూనికేషన్, రాడార్, నావిగేషన్, రేడియో కమ్యూని కేషన్ వంటి పనుల కోసం విడివిడిగా యాంటెన్నాలుంటాయి. యుద్ధసమయాల్లో ఇవి చిక్కులు తెస్తాయి. శత్రువుల రాడార్లకు సులభంగా దొరికిపోతాయి. యూనికార్న్ సాంకే తికతలో ఈ యాంటెన్నాలన్నీ ఒకే ఒకదాన్లో ఒదిగిపోతాయి. శత్రు నౌకలకు చిక్కకుండా, వాటి ఆనుపానుల్ని తెలుసుకోవటంలో దీని పని తీరు అద్భుతం. వచ్చిపడే క్షిపణుల్ని చాలా ముందే పసిగట్టడం, ఎదురుదాడికి అవకాశం ఇవ్వటం దీని ప్రత్యేకత. ఈ యూనికార్న్ మాస్ట్‌లను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ద్వారా దేశీయంగా తయారు చేసేందుకు జపాన్ సంసిద్ధత తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం రక్షణ ఎగుమతుల జోలికి పోవద్దని జపాన్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవలే తకాయిచీ సడలించారు.అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాలు, పశ్చిమాసియాలో ఏర్పడిన అనిశ్చితిరెండు దేశాలనూ సమంగా పీడిస్తున్నాయి. ఈ దశలో పరస్పర సహకారం మరింతగా పెరిగితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చునన్న అభిప్రాయం రెండు దేశాలకూ ఉంది. జపాన్‌తో మన సంబంధాలు విలక్షణమైనవి. రెండు దేశాల సంబంధాలను అభివర్ణించ టానికి దౌత్యంలో కొన్ని విశేషణాలుంటాయి. సహజమైన, ప్రత్యేకమైన, విశ్వసనీయ మైన, అనివార్యమైన... వంటివి అందులో కొన్ని. జపాన్‌తో మన సంబంధాల స్థాయిని తెలియజేయటానికి చాలామంది దౌత్యనిపుణులు వీటిని ఉపయోగిస్తారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం. ఎంత మెరుగైన సంబంధాలున్నా అవి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందాన ఉన్నాయి. ఇరుదేశాలమధ్యా సుహృద్భావం ఉంది. వేరే దేశాలతో ఏర్పర్చుకునే సంబంధాలకుండే రాజకీయ పరిమితులు కూడా ఇక్కడ లేవు. చైనాతో ఇరు దేశాలకూ ఉండే సమస్యలవల్ల వాటి మధ్య సాన్నిహిత్యానికి అవకాశాలెక్కువ. కానీ ఆసంబంధాలు తగినంతగా ఎదగలేదు. ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి చాన్నాళ్లవుతున్నా వ్యాపార సంబంధాలు అంతంతమాత్రం. ద్వైపాక్షిక వాణిజ్యం 2,748 కోట్ల డాలర్లున్నా అందులో మన ఎగుమతుల విలువ కేవలం 600 కోట్ల డాలర్లు. మిగిలిందంతా జపాన్ నుంచి మనకొచ్చే దిగుమతుల వాటాయే. మన దేశానికి 1991 వరకూ జపాన్ అధికారిక అభివృద్ధి సాయం(ఓడీఏ) కింద ఆర్థిక సాయం అందించేది. ఢిల్లీ మెట్రో, ఈశాన్య రాష్ట్రాల సరుకు రవాణా కారిడార్ వంటి మౌలిక సదుపాయాల్లో జపాన్ ముద్ర ఉంది. కానీ పెట్టుబడులు పెట్టడంలో, వాణిజ్య విస్తరణ అంతంతమాత్రం. మన దేశంలో జపాన్ పెట్టుబడులు 4,000 కోట్ల డాలర్లు. కానీ తరచు లడాయివుండే చైనాలో దాని పెట్టుబడులు 13,000 కోట్ల డాలర్ల పైమాటే. చిన్న దేశం వియత్నాంలో కూడా జపాన్ 8,000 కోట్ల డాలర్ల మదుపు పెట్టింది. మన దేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థలు 1,400 మించవు. ఇందుకుభిన్నంగా థాయ్‌లాండ్‌లో జపాన్ సంస్థల సంఖ్య 6,000. మన మొత్తం వ్యాపార కార్యకలాపాల్లో జపాన్ కంపెనీల వాటా ఒక శాతం. అందులో కూడా ఆటోమొబైల్ వాటాయే అధికం. మన జనరిక్ మందులపై జపాన్‌లో అనేక రకాల ఆంక్షలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మన ఫార్మా రంగం ఎన్నో విజయాలు సాధిస్తున్నా అక్కడ సమస్యలు తప్పడం లేదు. ఇలాంటి అవరోధాలు అధిగమించగలిగితే ఇరు దేశాల సంబంధాలూ మరింత మెరుగైన స్థాయికి చేర తాయి. తకాయిచీ పర్యటన ఆ దిశగా మంచి ముందడు గని చెప్పుకోవచ్చు.


