75 రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ | Pm Modi Launches 75 Redeveloped Rail Stations From Jalandhar | Sakshi
Sakshi News home page

75 రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

Jul 17 2026 6:59 PM | Updated on Jul 17 2026 7:09 PM

Pm Modi Launches 75 Redeveloped Rail Stations From Jalandhar

జలంధర్: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (శుక్రవారం) జలంధర్ నుండి రూ. 5,470 కోట్ల విలువైన రైల్వే, రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అమృత్‌ భారత్‌ స్కీమ్‌లో భాగంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జలంధర్‌ స్టేషన్‌లో రైలు ప్రయాణికులతో ప్రధాని మోదీ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోని రాయనపాడు, మంగళగిరి, హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు.

అమృత్ భారత్ పథకంలో రూ.35 కోట్లతో రాయనపాడు స్టేషన్ ఆధునికీకరించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. చండీగఢ్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం, హర్యానాలోని జింద్‌లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్‌ రైలును మోదీ ప్రారంభించారు. అనంతరం జలంధర్ చేరుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డేరా సచ్‌ఖండ్ బల్లాన్‌ను సందర్శించిన తర్వాత ప్రధాని మోదీ జలంధర్‌లో పర్యటించడం ఇది రెండోసారి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement