Live Updates
రాహుల్, ప్రియాంక గాంధీ విడుదల
రాహుల్, ప్రియాంక గాంధీ విడుదల
- ఛత్రసాల్ స్టేడియం పీఎస్ నుంచి రాహుల్ విడుదల
- మందిర్‌మార్గ్ పీఎస్ నుంచి ప్రియాంక విడుదల
- పోలీసుల అదుపులో ఉన్న కాంగ్రెస్ నేతలంతా విడుదల
మండిర్ మార్గ్ పీఎస్‌కు సోనియా గాంధీ
- ఢిల్లీ:
మందిర్‌మార్గ్ పీఎస్‌కు సోనియా గాంధీ - ప్రధాని నివాసం దగ్గర ధర్నాలో అరెస్టయిన ప్రియాంక
- ప్రియాంకను మందిర్ మార్గ్ పీఎస్‌కు తరలించిన పోలీసులు
పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత
- ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ధర్నా
- చర్చలకు ఆహ్వానించిన కేంద్రం
- నీట్‌పై పార్లమెంట్‌లో చర్చించాలన్న రాహుల్ డిమాండ్‌కు అంగీకరించిన కేంద్రం
- వెనువెంటనే మాట మార్చిన రాహుల్ గాంధీ
- రాహుల్ ధర్నాను భగ్నం చేసిన పోలీసులు
రాహుల్‌తో చర్చలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్
- పార్లమెంట్‌లో చర్చించేందుకు మేం సిద్ధమని చెప్పాం
- కానీ డిమాండ్లపై రాహుల్ మాట మారుస్తున్నారు
- ఇప్పుడేమో ధర్మంద్ర రాజీనామా పట్టుబడుతున్నారు
- మళ్లీ కొత్తగా రెండు డిమాండ్లు పెట్టడం సరికాదు
कुछ समय पहले, यह ज्ञात हुआ कि कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष, श्री मल्लिकार्जुन खड़गे और उनके साथ अन्य वरिष्ठ नेता, जैसे कि श्री राहुल गांधी, श्रीमती प्रियंका गांधी इत्यादि अकस्मात ही अकबर रोड़ के समीप एक स्थान पर अपने समर्थकों के साथ धरने पर बैठ गयेहैं। सरकार ने इस वरिष्ठ…
— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 21, 2026
ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్‌లో ర్యాలీ
- హైదరాబాద్‌ను తాకిన ఢిల్లీ సెగ
- సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు భారీ చేరుకున్న విద్యార్థులు
- ఢిల్లీ విద్యార్థుల మద్దతుగా భారీ ర్యాలీ
- ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్
చలో లోక్‌భవన్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
ప్రెస్‌క్లబ్ నుంచి లోక్‌భవన్‌కు బయల్దేరిన విద్యార్థులు

రాత్రంతా ధర్నా చేసే యోచనలో రాహుల్
ఢిల్లీ:
- రాత్రంతా ధర్నా చేసే యోచనలో రాహుల్ గాంధీ
- ఆందోళనలో పాల్గొనాలని రాహుల్ గాంధీ పిలుపు
- మోదీ సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు
- విద్యార్థుల గొంతులను నొక్కాలని చూడొద్దు: రాహుల్
అమిత్ షాతో జితేంద్ర సింగ్ భేటీ
ఢిల్లీ
- అమిత్ షాతో జితేంద్ర సింగ్ సమావేశం
- రాహుల్ డిమాండ్లపై చర్చ
- కేంద్రం ముందు కాంగ్రెస్ ఐదు డిమాండ్లు
- ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సిందేనన్న రాహుల్
- నీట్ అంశపై పార్లమెంట్‌లో చర్చ జరగాలనేది మరో డిమాండ్
- నీట్ పేపర్ లీక్‌పై హోంమంత్రి సమాధానం చెప్పాలి
- నీట్ పేపర్ లీక్‌లో ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
- నిన్న జరిగిన లాఠీచార్జ్‌పై విచారణ జరపాలి
ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్
- ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం
- గంటన్నర నుంచి మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నా
- నిన్న విద్యార్థులపై లాఠీచార్జ్‌కు వ్యతిరేకంగా ఆందోళన
మోదీ, ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్
- మోదీ, ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్
- రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చర్చలు
- ఆందోళన విరమించాలని రాహుల్‌ను కోరిన జితేంద్ర సింగ్
- నీట్ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలన్న రాహుల్
- నిన్న జరిగిన లాఠీచార్జ్‌పై విచారణ జరిపించాలన్న రాహుల్
- స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ కదిలేది లేదన్న కాంగ్రెస్
- రాహుల్ డిమాండ్లపై అమిత్‌షాతో చర్చించనున్న జితేంద్ర సింగ్
ఢిల్లీలో తీవ్ర ఉద్రికత్త
- ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ నేతల ధర్నా
- విద్యార్థులపై లాఠీచార్జ్‌కు వ్యతిరేకంగా నిరసన
- ధర్నాలో పాల్గొన్న ఖర్గే, రాహుల్, ప్రియాంక, కేసీ
- చేతులకు తాళ్లు కట్టుకుని కాంగ్రెస్ నేతల నిరసన
- ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్
- కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం
- ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
మెదాంత ఆస్పత్రికి వాంగ్‌చుక్ తరలింపునకు ఢిల్లీ హైకోర్టు అనుమతి
- మెదాంత ఆస్పత్రిలో వాంగ్‌చుక్ చికిత్సకు ఢిల్లీ హైకోర్టు అనుమతి
- తన ఇష్టమైన ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ఆయనకు హక్కు ఉంది
- కోరుకున్న ఆస్పత్రిలోనే చికిత్స పొందాటనుకోవడం సరైనదే
- ప్రస్తుతం సప్ధర్‌జంగ్‌లో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్
Hyd: గాంధీభవన్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
హైదరాబాద్:
- గాంధీ భవన్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు
- ఓబీసీ సెల్ కన్వీనర్ కేతురి వెంకటేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
- నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
కూతురి ఫొటోను చేతిలో పట్టుకుని రాజేశ్ మాల్ పోరాటం
కార్గిల్ యుద్ధ వీరుడు రాజేశ్ మాల్‌కు తన కూతురు గత నెలలో ఆత్మహత్య
కూతురి ఫొటోను చేతిలో పట్టుకుని రాజేశ్ మాల్ పోరాటం
సీజేపీ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్న రాజేశ్ మాల్
ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే నిరసనలు ఎక్కడ జరిగినా పాల్గొంటా
నా కూతురు రియా కుమారి థాపా ఫొటోను అక్కడకు తీసుకెళ్తాను
వారు విన్నా వినకపోయినా నా కూతురి గొంతుకగా నేనే నిలుస్తా:రాజేశ్ మాల్
పొలిటికల్ టర్న్ తీసుకున్న సీజేపీ మార్చ్?
- సీజేపీ ‘చలో సంసద్’లో ట్విస్ట్
- పలువురికి గాయాలు కావడంతో జంతర్ మంతర్ వద్దే కొనసాగుతున్న నిరసన
- రాజకీయ రంగు పులుముకున్న కాక్రోచ్ నిరసనలు.
- ఆందోళనల్లో గాయపడిన విద్యార్థులను పరామర్శించేందుకు నేతల ఆస్పత్రుల బాట
- కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన సీజేపీ కార్యకర్తల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
- అనంతరం ఢిల్లీలోని లేడీ హార్డింగ్ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు.
- కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి చేరుకుని గాయపడిన విద్యార్థులను కలిశారు.
- ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆస్పత్రికి వెళ్లి గాయపడిన ఆందోళనకారులను పరామర్శించారు.
- కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
- విద్యార్థులపై టియర్ గ్యాస్, లాఠీచార్జి చేయడాన్ని ఖర్గే ఖండించారు.
- సీజేపీ నిరసనలపై పార్లమెంట్‌లో చర్చకు అవకాశం ఇవ్వడం లేదని.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
- గాయపడిన విద్యార్థులు, పోలీసుల ఘర్షణల నేపథ్యంలో సీజేపీ మార్చ్ ఇప్పుడు కేంద్రం-ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరుగా మారింది.
CJP పార్లమెంట్ మార్చ్.. జేపీ నడ్డా RML ఆస్పత్రికి
- కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికు చేరుకున్నారు.
- ఆస్పత్రి డైరెక్టర్, సీనియర్ వైద్యులతో సమావేశమై అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
- CJP పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆందోళనకారులను నడ్డా పరామర్శించనున్నారు.
- నిరసనల సమయంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.
- ఢిల్లీలో జరిగిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి ఆస్పత్రి సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధాని మోదీపై రాహుల్ ఫైర్
- సీజేపీ నిరసనపై స్పందించిన రాహుల్‌గాంధీ
- CJP ఆందోళనల్లో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిపై రాహుల్ గాంధీ ఆగ్రహం
- విద్యార్థులపై పోలీసులు దారుణంగా లాఠీచార్జి చేశారు
- విద్యా రంగ సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేస్తే తప్పేంటి?
- సమస్యలు పరిష్కరించాల్సింది పోయి లాఠీ చార్జి చేస్తారా?
- విద్యార్థులను కొట్టడం పూర్తిగా “అన్-ఇండియన్” చర్య
- పోలీసుల చర్యపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
- నిన్నటి ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
- విద్యార్థులపై బలప్రయోగం చేయడం సరికాదని అన్నారు.
- CJP నిరసనలో జరిగిన పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు.
- విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం వినాలని సూచించారు.
న్యాయమైన ప్రశ్నలు అడిగితే లాఠీలతో కొట్టారు: రాహుల్ గాంధీ
- నీట్ అంశంపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు
- పార్లమెంట్‌లో రెండో రోజు సేమ్ సీన్ రిపీట్
- మధ్యాహ్నాం దాకా వాయిదా పడ్డ ఉభయ సభలు
- ప్రతిపక్ష ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి విపక్ష నేత రాహుల్ గాందీ
- యువత న్యాయమైన ప్రశ్నలు అడిగినందుకే లాఠీలతో కొట్టారు: స్పీకర్‌తో రాహుల్ గాంధీ
- యువత భవిష్యత్తుపై పార్లమెంట్‌లో చర్చ జరగకపోతే ఎలా?: స్పీకర్‌తో రాహుల్ గాంధీ
- సీజేపీ నిరసన.. నీట్ అంశంపై చర్చ జరిగేలా చూడండి : స్పీకర్‌తో రాహుల్ గాంధీ
సీజేపీ నేతలతో చర్చలు సరైన దిశలో: రిజిజు
- ఆందోళనకారులతో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి
- సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటన
- వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చకూడదని సూచన
- అన్ని వర్గాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి
- చర్చల ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం
శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తాం: CJP
- నిన్నటి పరిణామాల తర్వాత కూడా శాంతియుత మార్గంలో పోరాటం కొనసాగిస్తామని నేతల ప్రకటన
- విద్యార్థుల సమస్యల పరిష్కారం వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం
- నీట్ పేపర్ లీక్‌పై న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని వెల్లడి
- ఆందోళనకారులపై పోలీసుల చర్యలను CJP ఖండించింది
- గాయపడిన విద్యార్థులకు అండగా ఉంటామని నేతలు తెలిపారు
- నిన్నటి ఘర్షణల్లో 60 మందికి గాయాలయ్యాయన్న సీజేపీ
సీజేపీ డిమాండ్ సరైందే: ప్రియాంక గాంధీ వాద్రా
- సీజేపీ నిరసనలకు ప్రియాంక గాంధీ మద్దతు
- నీట్ వివాదంపై కేంద్రంపై ప్రియాంక విమర్శలు
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌కు మద్దతు
- మంత్రి బాధ్యత వహించాల్సిందే: ప్రియాంక
- యువత సమస్యలను ప్రభుత్వం వినాలని డిమాండ్
- నిరసనకారులతో ప్రధాని మాట్లాడాలని సూచన
- యువత భవిష్యత్‌ను నాశనం చేయొద్దని హితవు
- పోలీసుల బలప్రయోగంపై ప్రియాంక ఆగ్రహం
- శాంతియుత నిరసనలపై కఠిన చర్యలు సరికాదని వ్యాఖ్యలు
- నీట్ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని డిమాండ్
- విద్యా వ్యవస్థలో బాధ్యత తీసుకోవాలని కేంద్రానికి సూచన
- ప్రభుత్వం యువత, పేదలు, రైతుల పట్ల వ్యతిరేకంగా ఉందని ఆరోపణ
- ‘వ్యవస్థను సరిచేసుకోండి’ అంటూ కేంద్రానికి ప్రియాంక సూచన
- యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగాలని పిలుపు
- సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని వ్యాఖ్య
On Police absolute brutality during the youth protest yesterday....
Congress MP @priyankagandhi ji has stayed, "I think it's absolutely disgusting. This is no way. These are young people. They have a genuine problem. We all know what that problem is. They want a bright future for… pic.twitter.com/nvVJutdA8h— Harmeet Kaur K 🇮🇳 (@iamharmeetK) July 21, 2026
నీట్ వ్యవహారంపై మోదీ స్పందన
- నీట్ లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన
- పార్లమెంట్ సమీపంలో కొనసాగుతున్న నిరసనలు
- జంతర్ మంతర్‌కు చేరుకున్న యువత
- నీట్ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మోదీ
- ఎన్టీయే పార్లమెంటరీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు
- విద్యార్థులు నష్టపోకుండా పరీక్ష నిర్వహించాం
- కారకులకు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నాం
- లీకేజీకి పాల్పడ్డవాళ్లు జైల్లో ఉన్నారు
- భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది
పూర్తి కథనం కోసం 👉 వాళ్లు జైల్లో ఉన్నారు!
పార్లమెంట్ బయటా.. లోపలా.. హైడ్రామా
ఢిల్లీలో సీజేపీ చలో సంసద్ టెన్షన్
నిన్నంతా బయట నిరసనల హోరు..
లోపల వ్యూహాలు, చర్చలు..
పార్లమెంట్‌లో ఏం జరిగిందంటే..
🔹 ఉదయం నుంచే..
CJP ‘చలో సంసద్’ మార్చ్ నేపథ్యంలో పార్లమెంట్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీలో అడుగడుగునా బారికేడ్లు, పోలీసు బలగాలు మోహరించాయి.
🔹 10 గంటలకు మొదలైన పార్లమెంట్ సందడి
వర్షాకాల సమావేశాల తొలిరోజు ఎంపీలు పార్లమెంట్‌కు చేరుకున్నారు. అయితే చట్టాలు, రాజకీయాల కంటే.. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులపైనే ఎక్కువ చర్చ జరిగింది.
🔹 పార్లమెంట్‌లోనూ రెండు భిన్న వాదనలు
CJP ఆందోళనపై ప్రతిపక్ష ఎంపీలు మద్దతు ధోరణి ప్రదర్శించగా.. ఎన్డీఏ నేతలు మాత్రం నిరసనల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
🔹 ఎస్పీ వ్యూహం.. మహిళా ఎంపీల నిరసన
ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, అయోధ్య ఎంపీ అవధేశ్ ప్రసాద్ మధ్య చర్చలు జరిగాయి. అనంతరం డింపుల్ యాదవ్ నేతృత్వంలో మహిళా ఎంపీలు ప్లకార్డులతో పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు.
🔹 కేంద్రం అప్రమత్తం.. వరుస భేటీలు
ఆందోళన తీవ్రత పెరగడంతో కేంద్ర ప్రభుత్వం వ్యూహరచన ప్రారంభించింది. అమిత్ షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ మధ్య కీలక చర్చలు జరిగాయి.
🔹 CJP ప్రతినిధులతో జేపీ నడ్డా భేటీ
ఉదయం 11.50 గంటల సమయంలో CJP ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా అందించాలని నడ్డా సూచించారు.
🔹 12.30 గంటలకు పార్లమెంట్‌లో హైటెన్షన్
బయటి పరిస్థితులపై భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. CISF సిబ్బంది హడావుడిగా కదిలారు. విజయ్ చౌక్ వైపు ఉన్న పార్లమెంట్ గేటును కొద్దిసేపు మూసివేశారు.
🔹 భద్రత కట్టుదిట్టం.. ఎంపీల్లో ఉత్కంఠ
పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా బలగాలు ఆయుధాలతో మోహరించాయి. వాకీటాకీల ద్వారా సమాచారం చేరవేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించారు.
🔹 కొద్దిసేపటికే సాధారణ పరిస్థితులు
మధ్యాహ్నం 1.10 గంటలకు పార్లమెంట్ గేట్లు తిరిగి తెరిచారు. ప్రధాని కాన్వాయ్ వెళ్లిపోయింది. ఎంపీల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.
🔹 అమిత్ షా కార్యాలయంలో కీలక మంతనాలు
ధర్మేంద్ర ప్రధాన్ పలుమార్లు అమిత్ షాను కలిశారు. దాదాపు నాలుగు గంటల పాటు ప్రభుత్వ తదుపరి చర్యలపై చర్చలు కొనసాగాయి.
🔹 ప్రియాంక గాంధీ స్పందన
మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ ఎంపీలతో బయటకు వచ్చిన ప్రియాంక గాంధీ.. ఆందోళనకారులపై టియర్ గ్యాస్, లాఠీచార్జ్ చేయడాన్ని ప్రశ్నించారు. విద్యా సమస్యలపై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
🔹 సాయంత్రం మరో కీలక పరిణామం
CJP ప్రతినిధులు తమ మూడు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేపీ నడ్డాకు అందించారు.
🔹 ప్రభుత్వం విజ్ఞప్తి
ఆందోళన విరమించి సాధారణ పరిస్థితులు నెలకొనేలా సహకరించాలని జేపీ నడ్డా CJP నేతలను కోరారు.
🔹 ఢిల్లీలో రెండు దృశ్యాలు.. ఒకే రోజు
పార్లమెంట్ బయట నినాదాలు, నిరసనలు కొనసాగుతుండగా.. లోపల వ్యూహాలు, చర్చలు సాగాయి. CJP ఆందోళనతో ఢిల్లీ రోడ్లపైనే కాదు.. పార్లమెంట్ గదుల్లోనూ హైడ్రామా కనిపించింది.
గాయపడ్డ కాక్రోచ్‌లకు పరామర్శ
- ఢిల్లీలో కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన
- జంతర్ మంతర్‌కు పోలీసుల దాడిలో గాయపడిన వాళ్లు
- పరామర్శించిన సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే
- జంతర్‌మంతర్‌కు భారీగా చేరుకుంటున్న యువత
- మరికాసేపట్లో మార్చ్ ఉండే అవకాశం
- అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది
మళ్లీ ఉద్రిక్తత
- ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు
- మరోసారి పార్లమెంట్ ముట్టడికి సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు
- జంతర్ మంతర్ వద్ద హైడ్రామా
- అడ్డుకుంటున్న పోలీసులు.. తోపులాట.. తీవ్ర వాగ్వాదం
- పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలర్ట్
- కేంద్రం తమకు హామీ ఇచ్చిందన్న సీజేపీ ప్రతినిధులు
- కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసేదాకా ఉద్యమం ఆగదంటున్న కాక్రోచ్‌లు
కాక్రోచ్ డిమాండ్లు.. కేంద్రం ఏం చెబుతుందో?
కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లపై ఇంకా స్పందించని కేంద్రం
నిన్న జేపీ నడ్డాను కలిసిన CJP నేతలు
మూడు డిమాండ్లతో వినతిపత్రం సమర్పణ
డిమాండ్లను సంబంధిత స్థాయిలో చర్చిస్తామని సీజేపీకి హామీ ఇచ్చిన నడ్డా
నేడు నిర్ణయం వెలువడే అవకాశం?!
సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన
- సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన
- తన నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టీకరణ.
- యువ నేతలకు పార్లమెంట్‌లో ఎంపీలను కలిసే అవకాశం కల్పించే వరకు లేదంటే వారు ఆసుపత్రికి వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానన్న వాంగ్‌చుక్
- సప్దర్‌గంజ్ ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్
నిరసన కొనసాగిస్తామని CJP ప్రకటన
జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న ఆందోళనకారులు
నిరసన కొనసాగుతుందని CJP ప్రకటన
శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని నేతల స్పష్టీకరణ
నిన్న టెంట్లు తీసేయాలని ఢిల్లీ పోలీసుల ఆదేశం
CJP Protest: संसद चलो मार्च में आए छात्रों का जनसैलाब देख दंग रह जाएंगे. दिल्ली पुलिस छात्रों पर लगातार लाठियां बरसा रही थी. आंसू गैस के गोले दाग रही थी. बावजूद छात्र बैरिकेड दर बैरिकेड का चक्रव्यूह तोड़ संसद की तरफ़ कूच कर रहे थे. pic.twitter.com/QO6lGWYk5L
— News Pinch (@TheNewspinch) July 20, 2026


