Top Stories
ప్రధాన వార్తలు

రెడ్‌బుక్ అమలులో ఆ సీఐ నంబర్ వన్!
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఆ సీఐ ఎప్పుడూ వివాదాల్లోనే మునిగి తేలుతుంటాడు. నా రూటే సప‘రేటు’ అంటూ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో నంబర్ వన్ ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నాడు. టీడీపీ ముఖ్య నేతల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించటం ఆయన ఉద్యోగం. పైకి ఖాకీ యూనిఫాం వేసుకున్నా, లోపల మాత్రం పసుపు చొక్కా ధరించిన పచ్చ కార్యకర్తలా రెచ్చిపోతుంటాడు. ఇదీ పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్‌స్టేషన్ సీఐ పొన్నూరు భాస్కరరావు వ్యవహారం. ఈయన తీరుపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఐదు నెలల క్రితం వరకు భాస్కరరావు గురజాల సీఐగా పని చేశారు. అప్పుడు ఆయనపై ఎన్నో ఆరోపణలొచ్చాయి. ఎమ్మెల్యే యరపతినేని ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తి సీఐ భాస్కర్. యరపతినేని ఏం చెబితే అది చేయడమే ఈయన డ్యూటీ. వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉండే నాయకులను టార్గెట్ చేయడం, వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చావ బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎవరైనా వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు మా వాళ్లను స్టేషన్‌కు తీసుకొచ్చారని అడగడానికి వెళితే ‘పోలీస్‌స్టేషన్‌కు మీరు రాకూడదు.. ఎందుకు వచ్చారు’ అంటూ ఆగ్రహిస్తారు. ఇలా వేధిస్తుండటంపై మీడియాలో కథనాలు రావడంతో సీఐ భాస్కర్‌ను గురజాల నుంచి బదిలీ చేశారు. అయితే యరపతినేని ఆశీస్సులతో పక్క స్టేషన్ అయిన దాచేపల్లి సీఐగా పోస్టింగ్ దక్కించుకున్నాడు. టీడీపీ నేత ప్రోద్బలంతో అక్రమ కేసు టీడీపీ అధికారంలోకి రావడంతో దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఉప్పుతల యల్లయ్య, కుమారుడు హరికృష్ణలపై అక్రమ కేసులతో వేధిస్తుండటంతో తెలంగాణ వెళ్లి డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో పండుగ అని వచ్చిన బీసీ యువకుడు హరికృష్ణపై టీడీపీ నేత షేక్ జానీబాష తన అనుయాయుడితో చెప్పించిన కట్టుకథతో పోలీసులు గురువారం ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు.కేసు పెట్టిన వ్యక్తికి ఎటువంటి రక్త గాయాలు లేవు, ఆసుపత్రిలో చికిత్స పొందలేదు. అయినా హరికృష్ణను పోలీసులు నిర్బంధించారు. పోలీసు వాహనంలో కాకుండా టీడీపీ నేత కారులో తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. కనీసం నడవలేని దుస్థితికి వచ్చేలా కొట్టడంతో గురువారం గురజాల కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. దీంతో గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. రూ.40 లక్షల కోసమే..!సాధారణ ఎన్నికల రోజున జరిగిన గొడవలో హరికృష్ణపై కేసు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఆ గొడవకు సంబంధించి టీడీపీ వాళ్లకు రూ.40 లక్షలు చెల్లించాలని సీఐ భాస్కర్ నేరుగా పంచాయితీ చేశాడు. టీడీపీ నేత జానీబాషా రూ.40 లక్షలు ఇస్తేనే కేసులో రాజీకి వస్తామని ఒత్తిడి చేశారు. దీంతో ప్రతి రోజు స్టేషన్‌కు పిలిపించి ఇబ్బంది పెట్టారు. సీఐ తీరుతో వైఎస్సార్సీపీ నేతలు విసుగు చెంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం సీఐ భాస్కర్ తీరును తప్పుపట్టింది. దీంతో పగబట్టిన భాస్కర్.. అక్రమ కేసులు బనాయించి ఎలాగైనా టీడీపీ నేతలకు రూ.40 లక్షలు ఇప్పించేందుకే ఇవన్నీ చేస్తున్నాడని హరికృష్ణ తల్లిదండ్రులు వాపోతున్నారు. కాగా, సీఐ భాస్కర్ తీరుపై గురజాల, దాచేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టులో మూడు కేసులు వేశారు. కూటమి నేతలు చేస్తున్న అక్రమ వ్యాపారాలు.. రంగురాళ్ల తవ్వకాలు, గ్రానైట్, ఇసుక తరలించే ముఠాతో సీఐ చేతులు కలిపారని పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. సొంత స్టేషన్‌కు బేడీలు వేసిన ఘనుడు» దాచేపల్లికి వచ్చాక కూడా ఆయనలో ఆవగింజంత మార్పు రాలేదు. కనీసం మీడియాను కూడా స్టేషన్లోకి రానివ్వడు. ఈయన అవినీతిపై మీడియాలో వరుస కథనాలు వస్తున్నా చర్యలు మాత్రం శూన్యం. ఉన్నతాధికారులు తననేమీ చేయలేరని సిబ్బందితో గొప్పలు చెబుతుంటాడు. » సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి గత నెల 17వ తేదీన దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఆమెను కలవడానికి వచ్చిన బంధువులు, న్యాయవాదులను పోలీస్ స్టేషన్లోకి రానివ్వలేదు. పైగా పోలీస్ స్టేషన్ గేట్లు వేసి తాళం బదులుగా బేడీలు వేశారు. ఇంత జరిగినా పోలీస్ ఉన్నతాధికారులు ఇదేంటని ఒక్క మాట మాట్లాడలేదు. »అరెస్ట్ చేసిన కృష్ణవేణిని గురజాల కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఆమె సీఐపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా తీవ్రంగా హింసించారని చెప్పారు. తాము చెప్పినట్లు వినకపోతే నీపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతాయని, ఆ కేసుల్లో నిన్ను రాష్ట్రం మొత్తం తిప్పుతామని బెదిరించారని వాపోయారు. తన భర్త రాజ్ కుమార్‌పై గంజాయి కేసు పెడతామని కూడా బెదిరించినట్లు న్యాయమూర్తి ఎదుట కృష్ణవేణి కన్నీరు మున్నీరైనట్టు సమాచారం

కొండంత అప్పు.. బాబు ‘సెల్ఫ్’ డప్పు!
కొండను సైతం అవలీలగా మోస్తానని గొప్పలు చెప్పుకున్న ఓ పెద్ద మనిషి తీరా బల ప్రదర్శన రోజు.. మీరు మోసుకొస్తే చాలు.. నేను మోసేస్తా..! అని జారుకున్నట్లుగా ఉంది సీఎం చంద్రబాబు తీరు! రైతులిచ్చిన భూముల్లో అన్నీ పోగా మిగిలే 8 వేల ఎకరాలను విక్రయించి రూ.లక్ష కోట్లతో అమరావతిని కట్టేస్తానని గతంలో నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అంత డబ్బు రావాలంటే స్మార్ట్ ప్రాజెక్టులు రావాలని.. అందుకోసం మరో 44 వేల ఎకరాలకుపైగా భూములను రాజధాని గ్రామాల్లో తీసుకోవాల్సి ఉంటుందని తాపీగా చెబుతున్నారు!! రూ.లక్ష కోట్లతో రాజధానిని నిర్మించడం అటుంచితే దాదాపు లక్ష ఎకరాల భూమిని మాత్రం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి, అమరావతి: ‘‘రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు... ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది..!’’ సీఎం చంద్రబాబు తరచూ వల్లించే మాటలివీ! కానీ.. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తుండగా ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6 వేల కోట్లను కేటాయించింది.రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని స్వయంగా సీఎం చంద్రబాబు గతనెల 16న కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించారు. అది కూడా ఇప్పటికే సేకరించిన 53,748 ఎకరాల్లో రాజధాని పనులు చేపట్టడానికే ఈ నిధులు అవసరమని తేల్చారు.తాజాగా స్మార్ట్ ప్రాజెక్టుల పేరుతో మరో 44,676.64 ఎకరాలను రాజధాని కోసం సమీకరించే దిశగా టీడీపీ కూటమి సర్కారు అడుగులు వేస్తోంది. ఇక అందులో నిర్మాణ పనులు చేపట్టి.. మొత్తం రాజధానిని పూర్తి చేయాలంటే అన్నీ కలిపి కనీసం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని.. ఇదంతా అప్పుగా తేవాల్సిందేనని అధికార వర్గాలు తేల్చి చెబుతున్నాయి. దీన్ని బట్టి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నదంతా సెల్ఫ్ డబ్బానేనని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ఆ అప్పు తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. రాజధానిపై లీకులు.. ఇన్సైడర్ ట్రేడింగ్! రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని.. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని దేవతల రాజధాని అమరావతిని తలపించే రీతిలో ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరాన్ని నిరి్మస్తానంటూ 2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతంపై వందిమాగధులకు ముందే లీకులిచ్చారు. ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ ద్వారా తన బినామీలు, సన్నిహితులు కారు చౌకగా రైతుల నుంచి భూములు కాజేశాక రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలను సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములతో కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217 చ.కి.మీ.) రాజధాని నిర్మాణం అంటూ హడావుడి చేశారు. కామధేనువు కాదు అప్పుల కుప్ప.. ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పులు ఓ చిన్న ఇల్లు కట్టాలన్నా ముందుగానే తగిన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటారు. అలాంటిది ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండానే (నిధులున్నాయో లేదో చూసుకోకుండా) 2016–19 మధ్య రాజధాని ప్రాంతంలో రహదారులు, మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ స్కీం లేఅవుట్ల అభివృద్ధి పనులను 55 ప్యాకేజీల కింద రూ.33,476.23 కోట్లకు అప్పగించారు. ఇందుకోసం సీఆర్డీఏ రూ.8,540.52 కోట్ల అప్పులు తెచ్చింది. అయితే 2019 మే నాటికి ఆ పనులకు రూ.5,428.41 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. మిగతా రూ.28,047.82 కోట్లతో పూర్తి చేయాల్సిన పనులను ఇప్పుడు రద్దు చేసి అంచనాలను అమాంతం పెంచేసింది. 2018–19 ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్, సిమెంటు, స్టీలు తదితర ధరలు పెద్దగా పెరగలేదు. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 50 నుంచి 105 శాతం పెంచేసి కొత్తగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని పనుల పేరుతో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు వెరసి రూ.31 వేల కోట్ల అప్పులు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఆర్డీఏ బాండ్ల ద్వారా మరో రూ.21 వేల కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే.. ఇప్పటికే ఏకంగా రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక 2025–26 బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.6 వేల కోట్లు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే.. అమరావతి కామధేనువు కాదు.. అప్పుల కుప్ప అన్నది స్పష్టమవుతోంది. మరి బాబు చెబుతున్న సెల్ఫ్ పైనాన్స్ మోడల్ ఎక్కడ ఉందన్నది ఆయనకే తెలియాలి! ఇకపోతే రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని గత నెలలో సీఎం చంద్రబాబు 16వ ఆర్థిక సంఘానికి ప్రజంటేషన్ ఇవ్వడం గమనార్హం. మరో 44,676.64 ఎకరాల సమీకరణ దిశగా.. భూ సమీకరణ కింద రైతుల నుంచి సేకరించిన భూమి, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయని.. ఆ భూమిని విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తాయని.. దాంతో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా స్మార్ట్ ప్రాజెక్టులు వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, అవి రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిరి్మంచాలని చెబుతున్నారు. అయితే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు లేవంటూ.. అందుకోసం తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల పరిధిలో 44,676.64 ఎకరాలను సమీకరించే దిశగా ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. ఇక ఆ భూముల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణంతోపాటు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటే సుమారుగా మరో రూ.80 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి పెరిగే ధరలను (ఎస్కలేషన్) పరిగణనలోకి తీసుకుంటే అన్నీ కలిపి రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని లెక్కగడుతున్నారు. అదంతా అప్పులు చేయాల్సిందే. వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందో ఊహించవచ్చు. ఆ అప్పు అంతా చివరకు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే మొత్తంతోనే తీర్చాల్సి ఉంటుందని తేటతెల్లమవుతోంది. అమరావతిపై బాబు డాబుసరి మాటలివిగో..‘రాజధానిగా అమరావతి కామధేనువు లాంటి ప్రాజెక్టు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. భూ సమీకరణ కింద తీసుకున్న భూములు.. రైతులకు అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లుతోసహా అన్ని పోనూ ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయి. వాటిని అమ్ముకుంటే భారీగా నిధులు వస్తాయి’ – 2020 ఆగస్టు 7న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు‘అమరావతి అందరికి ఆమోదయోగ్యమైంది. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అందరికీ ఇవ్వగా మిగిలే 8 వేల ఎకరాలకుపైగా భూములను అమ్ముకుంటే ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అక్కడ ఏ భవనం తాత్కాలికం కాదు.. అన్నీ శాశ్వత భవనాలే’ – 2020 ఆగస్టు 14న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు‘అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీ అని గతంలోనే చెప్పా. మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. ఇక్కడ సృష్టించే సంపదతో వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను చేపడతాం’ – 2024 జూన్ 19న సీఎం చంద్రబాబు‘అమరావతిలో రైతులిచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది’ – 2024 జూన్ 20న సీఎం చంద్రబాబు

ఒకే ఇంట్లో షెహన్షా, బాద్షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్
ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్షా (బచ్చన్) మరియు బాద్షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

యాభై సార్లయినా మోదీని కలుస్తా
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు..ఎన్నికలయ్యాక అభివృద్ధి చేయడమే లక్ష్యం.. కేంద్రం సహకారాన్ని తీసుకుంటాం.. ఎవరు ఏమనుకున్నా సరే.. మోదీని ఒక్కసారి కాదు 50 సార్లు అయినా కలుస్తాం..రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం..కావాల్సిన అనుమతులు తీసుకుంటాం.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసి మెలసి పనిచేసినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది.చెరువు మీద అలిగి కడుక్కోకుంటే ఎలా?..దిగిపోయిన ఆయన (కేసీఆర్) చెరువు మీద అలిగి ఫామ్ హౌస్‌లో పడుకుంటే ఏమైంది?.. ప్రజలు ఇంటికి పంపే పరిస్థితి వచ్చింది.. నేను అలాంటి తప్పులు చేయను.. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో రూ.494 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జహీరా బాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం ‘రాష్ట్ర ప్రజలు మాపై విశ్వాసంతో ఓట్లేసి గెలిపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేస్తూ పారదర్శక పాలన అందించడం ద్వారా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటాం. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమలు రావ డం ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఈ ఆదాయాన్ని పేదలకు పంచాలనే లక్ష్యంతో మేం పని చేస్తున్నాం. ప్రజలు మాకు అండగా నిలిస్తే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతాం. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడే విధంగా అబివృద్ధి చేస్తాం. ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్, మెట్రో, ఫార్మాసిటీ అన్నిటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే వరకు నిద్రపోను..’ అని రేవంత్ అన్నారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు అవకాశాలు ‘రాష్ట్రంలో మహిళలకు ఉచితబస్సు పథకం కోసం ఇప్పటికే రూ.5,500 కోట్లు ఖర్చు చేశాం. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి విద్యుత్ శాఖతో ఒప్పందాల ద్వారా తెలంగాణ మహిళలు అదానీ, అంబానీలతో పోటీ పడే స్థాయిలో అవకాశాలు కల్పిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మహిళలకే అప్పగించాం. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్‌లు ఇచ్చాం. ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకుని.. సోనియాగాంధీ నాయకత్వంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రూ.21 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..’ అని సీఎం చెప్పారు. యువత నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం.. ‘తెలంగాణ ఉద్యమంలో ముందున్న లక్షలాది మంది యువతకు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆయన కుటుంబంలో నలుగురికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. నేను సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి యువతలో మాపై ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 15 నెలల్లోనే రూ.3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం.వీటన్నింటికీ ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ప్రజలు ఆశ్విర్వదిస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో 25.55 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేశాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రైతుబరోసా ఆర్థిక సాయాన్ని రూ.12 వేలకు పెంచాం. భూమిలేని నిరుపేదలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలి ‘రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రతిపక్షాల సహకారం కూడా కావాలి. ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. రండి.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి.. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో సూచనలు ఇవ్వండి.. ఎక్కడైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాం..అలా కాకుండా అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తా.. లేకపోతే ఫాంహౌస్‌లో పడుకుంటానంటే ప్రజలే విచక్షణతో నిర్ణయం తీసుకుంటారు. నేను 20 ఏళ్లు ప్రజల గొంతుకై నిలిచా నేను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, జెడ్పీటీసీగా, ఎంపీగా.. ఇలా 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజూ సెలవు తీసుకోలేదు. ప్రజల సమస్యలకు గొంతుకనై పనిచేశా. నేను 20 ఏళ్లుగా ప్రజల పక్షాన పనిచేశాను కాబట్టే ప్రజలు నాకు సీఎంగా అవకాశం కల్పించారు. నా వద్దకు చిన్నోడు వచి్చనా.. పెద్దోడు వచి్చనా.. ఉన్నోడు వచి్చనా.. పేదోడు వచ్చినా.. అందరినీ కలిసి.. చేతనైన సాయం చేస్తున్నా..’ అని రేవంత్ చెప్పారు. సభలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీ సురేష్ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.ద్వాదశి సా.4.14 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: రేవతి ప.10.58 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: ఉ.8.44 నుండి 10.14 వరకు, శని త్రయోదశి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.30, సూర్యాస్తమయం: 6.23. మేషం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.వృషభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.మిథునం: శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పనులలో పురోగతి. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.కర్కాటకం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.సింహం: కుటుంబంలో సమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య: శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.తుల: ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ధనలబ్ధి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ లక్ష్యాలు ఫలిస్తాయి.వృశ్చికం: రుణాలు తీరుస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. దైవదర్శనాలు. ప్రముఖుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులు.ధనుస్సు: రాబడికి మించిన ఖర్చులు. బంధుమిత్రులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. పనులు కొన్ని విరమిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.మకరం: పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్తగా రుణయత్నాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.కుంభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.మీనం: చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం.

బెంగళూరుకు రైజర్స్ బ్రేక్
లక్నో: ‘ప్లే ఆఫ్స్’కు దూరమైన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ‘ప్లే ఆఫ్స్’ ఆశలపై నీళ్లుచల్లిన రైజర్స్... శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. శుక్రవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ 42 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టగా... అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (32 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో భయపెట్టినా... చివర్లో ఒత్తిడి పెంచిన రైజర్స్ ఫలితం రాబట్టింది. సన్‌రైజర్స్ కెపె్టన్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆరంభం నుంచే దంచుడు... ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రెండో ఓవర్లో హెడ్ ఫోర్‌తో ఖాతా తెరవగా... భువనేశ్వర్ వేసిన రెండో ఓవర్లో హెడ్ ఫోర్, అభిషేక్ 4, 6 బాదారు. మూడో ఓవర్లోనూ అభిషేక్ 4, 6 దంచగా... నాలుగో ఓవర్లో ఈ జోడీ 4, 6, 4 కొట్టింది. వీరిద్దరూ మూడు బంతుల వ్యవధిలో అవుట్ కాగా... పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ 71/2తో నిలిచింది. క్లాసెన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... ఇషాన్ కిషన్ నిలకడ కనబర్చాడు. సుయాశ్ శర్మ వేసిన 11వ ఓవర్లో అనికేత్ 6, 4, 6 కొట్టి కాసేపటికే ఔట్ కాగా... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (4) ప్రభావం చూపలేకపోయాడు. అభినవ్ మనోహర్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆఖర్లో బాదే బాధ్యత ఇషాన్ భుజాలకెత్తుకున్నాడు. 28 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న కిషన్... చివర్లో మరింత వేగం పెంచి సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఓపెనర్లు మినహా... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బెంగళూరు... భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవలేదు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో ఫోర్ కొట్టిన కోహ్లి, మూడో ఓవర్లో రెండు ఫోర్లు దంచాడు. నాలుగో ఓవర్ వేసిన హర్షల్‌కు అదే శిక్ష వేశాడు. కోహ్లి 7 ఫోర్లు కొట్టేవరకు ఒక్క బౌండ్రీ బాదలేకపోయిన సాల్ట్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి చాలెంజర్స్ 72/0తో నలిచింది. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన అనంతరం విరాట్ అవుట్ కాగా... పడిక్కల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న సాల్ట్ కాసేపటికి వెనుదిరగగా... జితేశ్ శర్మ, రజత్ పాటీదార్ జోరు కొనసాగించారు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 163/3తో నిలిచింది. విజయానికి 36 బంతుల్లో 69 పరుగులు అవసరమైన దశలో... బెంగళూరు బ్యాటర్లు తడబడటంతో పరాజయం తప్పలేదు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) సాల్ట్ (బి) ఇన్‌గిడి 34; హెడ్ (సి) షెఫర్డ్ (బి) భువనేశ్వర్ 17; ఇషాన్ కిషన్ (నాటౌట్) 94; క్లాసెన్ (సి) షెఫర్డ్ (బి) సుయాశ్ 24; అనికేత్ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 26; నితీశ్ రెడ్డి (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 4; అభినవ్ మనోహర్ (సి) సాల్ట్ (బి) షెఫర్డ్ 12; కమిన్స్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–54, 2–54, 3–102, 4–145, 5–164, 6–188. బౌలింగ్: యశ్ దయాళ్ 3–0–36–0; భువనేశ్వర్ 4–0–43–1; ఇన్‌గిడి 4–0–51–1; సుయాశ్ శర్మ 3–0–45–1; కృనాల్ పాండ్యా 4–0–38–1; షెఫర్డ్ 2–0–14–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫిల్ సాల్ట్ (సి) హర్షల్ (బి) కమిన్స్ 62; కోహ్లి (సి) అభిషేక్ (బి) హర్‡్ష దూబే 43; మయాంక్ (సి) ఇషాన్ (బి) నితీశ్ 11; పాటీదార్ (రనౌట్) 18; జితేశ్ శర్మ (సి) అభినవ్ (బి) ఉనాద్కట్ 24; షెఫర్డ్ (సి అండ్ బి) మలింగ 0; కృనాల్ (హిట్ వికెట్) (బి) కమిన్స్ 8; టిమ్ డేవిడ్ (సి) క్లాసెన్ (బి) మలింగ 1; భువనేశ్వర్ (బి) కమిన్స్ 3; యశ్ దయాళ్ (సి) అభిషేక్ (బి) హర్షల్ పటేల్ 3; ఇన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–80, 2–120, 3–129, 4–173, 5–174, 6–174, 7–179, 8–186, 9–187, 10–189.బౌలింగ్: కమిన్స్ 4–0–28–3; ఉనాద్కట్ 4–0–41–1; హర్షల్ పటేల్ 3.5–0–39–1; ఇషాన్ మలింగ 4–0–37–2; హర్‡్ష దూబే 2–0–20–1; నితీశ్ రెడ్డి 2–0–13–1. ఐపీఎల్లో నేడుఢిల్లీ X పంజాబ్‌వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

యాపిల్‌కు ట్రంప్ అల్టిమేటం
వాషింగ్టన్: ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలంటూ యాపిల్ కంపెనీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింతగా ఒత్తిడి పెంచారు. భారత్‌తో సహా మరెక్కడ ఉత్పత్తి చేసినా 25 శాతం దిగుమతి సుంకం తప్పదంటూ తాజాగా అల్టిమేటం జారీ చేశారు. ‘‘అమెరికాలో విక్రయించే ఐఫోన్లను ఇక్కడే తయారు చేయాలని యాపిల్ చీఫ్ టిమ్ కుక్కు ఎప్పుడో చెప్పా. భారత్‌లోనో, మరో దేశంలోనే తయారు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశా. కానీ ఆయన వినడం లేదు. అందుకే యాపిల్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధించాలని నిర్ణయించా’’ అని శుక్రవారం తన సొంత ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ వెల్లడించారు. టారిఫ్‌ల భారాన్ని తగ్గించుకునేందుకు ఐఫోన్ల తయారీని చైనా నుంచి భారత్‌కు మార్చాలని కుక్ నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా టారిఫ్ బాంబు పేల్చారు. గత వారం పశ్చిమాసియాలో పర్యటన సమయంలోనే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించడం తెలిసిందే. అమెరికా నిర్ణయంతో ఐఫోన్ల ధరలకు రెక్కలొచ్చే అవకాశం కన్పిస్తోంది. అదే జరిగితే ఫోన్ల అమ్మకాలు పడిపోయి సంస్థ లాభాలపై ప్రభావం పడనుంది. ట్రంప్ టారిఫ్‌లతో తలెత్తిన అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు ఎలా స్పందించాలో తెలియక అమెజాన్, వాల్‌మార్ట్ వంటి దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పటికే అయోమయంలో పడ్డాయి.ఈయూపై 50% బాదుడుయూరోపియన్ యూనియన్ (ఈయూ) పైనా ట్రంప్ మరోసారి టారిఫ్‌ల కొరడా ఝళిపించారు. ఈయూతో అమెరికా వాణిజ్య చర్చలు సజావుగా సాగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి అన్ని రకాల ఈయూ ఉత్పత్తులపైనా 50 శాతం టారిఫ్ అమల్లోకి రానుందని ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించారు. అమెరికాలో తయారు చేసే వస్తువులపై ఎలాంటి టారిఫ్‌లూ ఉండవని సెలవిచ్చారు. ఈయూ దిగుమతులపై 10% పన్ను కొనసాగాలని ట్రంప్ పట్టుబడుతుండగా పూర్తిగా ఎత్తేయాలని ఈయూ కోరుతోంది. ఈ సమయంలో ఆయన ఉన్నట్టుండి ఇలా టారిఫ్ బాంబు పేల్చారు. చైనా మీదా ఇలాగే టారిఫ్‌లను ఆయన 145 శాతానికి తీసుకెళ్లడం, చివరికి 30 శాతానికి తగ్గించడం తెలిసిందే.

సలహా కోరితే సమాధానమివ్వాలా?
మన రాజ్యాంగం వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాలను సూచిస్తుంది. రాజకీయ వర్గాలకు, ప్రతికూలమైన తీర్పులను ఎత్తి చూపడానికి ఒక సాధనం కావచ్చు. న్యాయ వ్యవస్థకు మాత్రం ఇదొక వేగుచుక్క. చట్టపర మైన ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరడానికి రాష్ట్రపతిని అనుమతించేదే ఆర్టికల్ 143. తాజాగా బిల్లులను పరిష్కరించడంలో గవర్నర్లు, రాష్ట్రపతి అధికారాలకు సంబంధించిన 14 ప్రశ్నలు వేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యాయసలహా కోరి దీన్ని ఉపయోగించారు.సాధారణ సందర్భాల్లో ఇది వివాదాస్పదం అయ్యేది కాదు. కానీ ఈ ప్రశ్నలు తమిళనాడు గవర్నర్ ఉదంతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పిన అంశాలనే తిరిగి పరిశీలించేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. రాష్ట్రపతి కోరుతున్న న్యాయ సలహా అనేది చట్టబద్ధమైన రాజ్యాంగ చర్యా లేదా సుప్రీం తీర్పును దొడ్డిదారిలో సమీక్షించే ప్రయత్నమా?కోర్టు సమాధానం చెప్పనక్కర్లేదు!ఇటీవల తమిళనాడు కేసు విషయంలో– మంత్రి మండలి సహాయం, సలహా ప్రకారమే గవర్నర్ పనిచేయాలనీ, బిల్లులను ఆమోదించే ప్రక్రియలో నిరవధికంగా ఆలస్యం చేయలేరనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతితో సహా రాజ్యాంగ అధికారులు జవాబుదారీతనం లేకుండా లేదా కాలపరిమితిని దాటి వ్యవహరించలేరని కూడా ఆ తీర్పు పేర్కొంది. ఈ తీర్పు ఫలితంతో కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి చెందింది. ఫలితంగా ఇప్పటికే కోర్టు సమాధానం ఇచ్చిన వాటికి దాదాపు సమానమైన ప్రశ్నలను సంధి స్తున్న రాష్ట్రపతి న్యాయ సలహాకు కేంద్రం మద్దతు ఇచ్చింది.ప్రజా ప్రాముఖ్యం కలిగిన చట్టపరమైన విషయాలపై సుప్రీంకోర్టు న్యాయ సలహాను, అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143 రాష్ట్రపతిని అనుమతిస్తుంది. కోర్టుకు మాత్రం అటువంటి న్యాయ సలహాకు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 1964లో ప్రత్యేక సూచన నం.1లోనూ, అయోధ్య వివాదంపై 1993లో ప్రత్యేక సూచన నం.1లోనూ మనం చూసినట్లుగా, న్యాయ సలహాను ఇవ్వకుండా తిరస్కరించే విచక్షణ న్యాయస్థానానికి ఉంది.కావేరీ జల వివాదాల కేసులో (1998లో ప్రత్యేక సూచననం.1), కోర్టు అప్పటికే ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయడానికి లేదారెండవ అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించ లేరని స్పష్టంగా పేర్కొంది. ‘రాజ్యాంగం ప్రకారం, అలాంటి అప్పీల్ అధికార పరిధి ఈ కోర్టుకు ఉండదు; ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి కూడా దానిపై సమీక్ష కోరలేరు... అటువంటి అధికారం ఆర్టికల్ 143లో ఉందనుకుంటే, అది న్యాయవ్యవస్థ స్వతంత్ర తలోకి తీవ్ర మైన చొరబాటు అవుతుంది’ అని నాడు కోర్టు నొక్కి చెప్పింది.పునఃపరిశీలన కోరుతున్నట్లయితే...రాష్ట్రపతి తాజాగా వేసిన 14 ప్రశ్నలు తమిళనాడు తీర్పులో ఇప్పటికే పరిష్కరించబడిన అనేక ప్రశ్నలను ప్రతిధ్వనిస్తాయి. గవర్నర్ ఒక బిల్లును అనేకసార్లు వెనక్కి ఇవ్వవచ్చా, లేదా ఆమోదం కోసం రాష్ట్రపతి నిర్దిష్ట కాలపరిమితికి కట్టుబడి ఉండాలా అనేవి వీటిలో ఉన్నాయి. వీటిని సుప్రీంకోర్టు అస్పష్టంగా వదిలివేయలేదు. అత్యంత స్పష్టతతో నిర్ణయం చెప్పేసింది. అందుకే రాష్ట్రపతి తాజా న్యాయ సలహా నివేదన నిజంగా స్పష్టతను కోరడం లేదనీ, పునఃపరి శీలన కోరుతోందనీ సూచిస్తుంది. అలా అయితే, ఇది చట్టపరమైన సమస్య కాదు. న్యాయవ్యవస్థ అంతిమం అనే పునాదినే ప్రశ్నిస్తోంది.2012లో 2జీ స్పెక్ట్రమ్‌పై న్యాయసలహా దీనికి ఒక ముఖ్యమైన మినహాయింపు. ఇక్కడ సుప్రీంకోర్టు మునుపటి తీర్పులోని అంశా లను స్పష్టం చేయడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించింది. కోర్టు 122 టెలికామ్ లైసెన్సులను రద్దు చేసిన తర్వాత, సహజ వనరులను కేటాయించడానికి వేలం మాత్రమే అనుమతించదగిన పద్ధతా అనే దానిపై నాటి కేంద్ర ప్రభుత్వం... సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాన్ని కోరింది. వేలం న్యాయమైన పద్ధతి అయినప్పటికీ, అది మాత్రమే రాజ్యాంగబద్ధమైన మార్గం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా, కోర్టు ఇచ్చిన ఈ స్పష్టత ప్రధానమైన తీర్పును భంగపరచలేదు. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. 2జీ విషయంలో, తన తీర్పును వెనక్కు తీసుకోవాలని కోర్టును ప్రభుత్వం అడగలేదు. కేవలం భవి ష్యత్ విధానంపై తనకు మార్గనిర్దేశం చేయాలని కోరింది.దీనికి విరుద్ధంగా, తాజాగా రాష్ట్రపతి కోరిన న్యాయ సలహా అనేది తమిళనాడు కేసు తీర్పులోని ప్రధాన విషయానికి వెళుతుంది. ఇది పరిణామాల వివరణ, లేదా భవిష్యత్ కేసులకు మార్గ దర్శకత్వం కోరదు. బదులుగా, కోర్టు ఇప్పటికే సమాధానం ఇచ్చిన ప్రశ్నలను తిరిగి లేవనెత్తుతుంది. దీన్ని అనుమతించడం అంటే సమీక్షను నియంత్రించే ఆర్టికల్ 137ను కార్యనిర్వాహక వర్గం దాటవేయవచ్చు. ఆర్టికల్ 143 ద్వారా కేసులను తిరిగి వ్యాజ్యం చేయవచ్చు. అది రాజ్యాంగపరంగా అనుమతించరానిది, అలాగే వ్యవస్థాగతంగా ప్రమాదకరమైనది.రాష్ట్రపతి కార్యాలయ గౌరవం నిలుపుతూనే...కోర్టుకు స్పందించాల్సిన బాధ్యత ఉందా? లేదు! ప్రత్యేక కోర్టుల బిల్లు కేసులో, కోర్టు ఒక సూచనకు సమాధానం ఇవ్వ డానికి నిరాకరించవచ్చనీ, కాకపోతే అలా చేయడానికి కారణా లను పేర్కొనాలనీ న్యాయస్థానం మాట. 2జీ కేసులో, న్యాయ సలహాను తిరస్కరించడానికి కోర్టు అనేక కారణాలను పొందు పర్చింది: (1) ప్రశ్నలను ఇప్పటికే పరిష్కరించి ఉంటే; (2) ప్రశ్నలు రాజకీయమైనవి అయితే; (3) అవి రాజ్యాంగ ప్రయోజనానికి ఉపయోగపడకపోతే; (4) అవి చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన సమస్యలను కలిగి ఉండకపోతే!తమిళనాడు తీర్పు స్పష్టంగా పరిష్కరించబడిన రాజ్యాంగ ప్రశ్నా విభాగంలోకి వస్తుంది. దీన్ని తిరిగి తెరవడం వల్ల న్యాయ నిర్ణయాల అంతిమత్వంపై సుప్రీం కోర్టుకు కాకుండా కార్య నిర్వాహక వర్గానికి ప్రాధాన్యతను కట్టబెట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ రాజకీయ నేపథ్యాన్ని విస్మరించలేము. అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోని గవర్నర్లు చట్టాలకు మోకాలడ్డేందుకు కాలయాపన వ్యూహాలను అనుసరించారు.ఇది రాజ్యాంగ ప్రశ్న కంటే ఎక్కువగా – రాజకీయంగా అడ్డుకొనే చర్య. ముఖ్యంగా రాజ్యాంగ సమీక్ష మార్గం ఎల్లప్పుడూ అందు బాటులో ఉన్నప్పుడు... రాష్ట్రపతి న్యాయ సలహాను సుప్రీంకోర్టు అంగీకరిస్తే, అది రాజకీయ ఒత్తిడికి లొంగి పోయినట్టు కనిపించే ప్రమాదం ఉంది. అయితే, కోర్టుకు ఇది క్లిష్టమైనదే. రాష్ట్రపతి కార్యాలయం పట్ల గౌరవాన్నీ, తన నిర్ణయాల సమగ్రతనూ కాపాడు కునే బాధ్యతను సమతుల్యం చేసుకోవాలి.ఈ న్యాయ సలహాను కోరడం నిజంగా తమిళనాడు కేసును తిరగదోడే ప్రయత్నమే అయితే, కోర్టు దానికి సమాధానం ఇవ్వడా నికి నిరాకరించాలి. న్యాయపరమైన తీర్పుల అంతిమత్వాన్ని తప్పించుకోవడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించలేమని స్పష్టంగా పేర్కొ నాలి. అయితే, భవిష్యత్ పాలన కోసం స్పష్టత అవసరమయ్యేఅంశాలు తీర్పులో ఉంటే, కోర్టు సమాధానం ఇవ్వడానికి ఎంచు కోవచ్చు. కానీ అది తన మునుపటి నిర్ణయానికి చెందిన అధికారాన్ని నీరుగార్చకుండా చూసుకోవాలి.ఆర్టికల్ 143 రాజకీయంగా తప్పించుకునే మార్గంగా కాకుండా చట్టపరమైన స్పష్టత కోసం ఒక సాధనంగా ఉద్దేశించబడింది. రాష్ట్రపతి కోరిన ఈ న్యాయ సలహాను పరిశీలన లేకుండా స్వీకరిస్తే, అది కోర్టు అధికారాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. కోర్టు రాజ్యాంగ వ్యాఖ్యాతగా మాత్రమే కాకుండా, దాని సంరక్షకురాలిగా కూడా వ్యవహరించాలి. సమాధానం ఇవ్వడానికి నిరాకరించడం అనేది రెండింటినీ కాపాడుకోవడానికి స్పష్టమైన మార్గం కావచ్చు.-వ్యాసకర్త సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-సంజయ్ హెగ్డే

శ్వేతసౌధంలో మళ్లీ ‘పంచాయితీ’
అతిథుల్ని పిలిచి బహిరంగంగా వాగ్యుద్ధానికి దిగటం ఏ రకంగా దౌత్యనీతి అవుతుందో, దాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడ నేర్చారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన దాన్ని కొనసాగించదల్చుకున్నారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాతో వైట్‌హౌస్‌లో తాజాగా సాగిన జగడం నిరూపిస్తోంది. మొన్న ఫిబ్రవరిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఇదే మాదిరి తగువు పెట్టుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో తప్పంతా ఉక్రెయిన్‌దే అన్నట్టు తేల్చి, దాన్ని వెంటనే నిలిపేయాలని ఒత్తిడి తెచ్చారు.అడుగడుగునా అవమా నిస్తూ మాట్లాడారు. మళ్లీ మూణ్ణెల్లకు అదే వైట్‌హౌస్‌లో ట్రంప్ ఆ డ్రామాకే తెరతీశారు. నిజానికి ఇరు దేశాల అధినేతలు కలుసుకుని చర్చించినాక వారిద్దరూ కలిసి మాట్లాడే మీడియా సంయుక్త సమావేశం లాంఛనప్రాయమైనది. నాలుగు గోడలమధ్యా నిర్మొహమాటంగా మాట్లాడుకున్నా, వాదులాడుకున్నా... మీడియా సమావేశంలో పరస్పరం ప్రశంసించుకోవటాలు, రెండు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాల విశిష్టతను అతిగా చూపించుకోవటాలు జరిగిపోతాయి. ఇందువల్లరెండు దేశాల్లోనూ అధినేతలకు ప్రశంసలు దక్కుతాయి. కానీ ఇలాంటివి ట్రంప్‌కు పట్టవు. ప్రపంచానికి తాను మకుటంలేని మహారాజునని, ఎవరినైనా ఏమైనా అనగలనని అమెరికా శ్వేతజాతి ఓటరు మహాశయులకు ఆయన చెప్పదల్చుకున్నారు.అందుకే అతిథులుగా వచ్చిన అధినేతలను కెమెరాల ముందు ఇష్టానుసారం మాట్లాడటం అల వాటు చేసుకున్నారు. పోనీ ఆయన నిలదీస్తున్న అంశాలు గొప్పవేమీ కాదు. వాటిల్లో చాలామటుకు నకిలీవీ... నిరాధారమైనవీ. సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరో పెట్టే తప్పుడు పోస్టింగులే వాటికి ఆధారం. ఉక్రెయిన్‌లో దేశాధినేతను మార్చి, ఆయన ద్వారా రష్యాను చీకాకుపెట్టి చివరకు అది రెచ్చిపోయి దాడిచేసే స్థితి కల్పించింది అమెరికాయే. అటు తర్వాత రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేయటానికి ప్రయత్నించి, ఉక్రెయిన్‌కు పెద్దయెత్తున ఆయుధాలు అమ్ముకున్నది అమెరికాయే. నాటో దేశాలను సైతం ఈ రొంపిలోకి దించింది కూడా ఆ దేశమే. జో బైడెన్ హయాంలో ఇవన్నీ జరిగినట్టు తెలిసినా, ట్రంప్ ఏమీ తెలియనట్టు నటించారు. ఉక్రెయిన్నే వేలెత్తి చూపారు. ఇప్పుడు రాంఫోసాతో సైతం అదే తరహాలో వ్యవహారం నడిపారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల ఊచకోత సాగుతున్నదనీ, వాటిల్లో చాలాభాగం బయటకు రావటం లేదనీ ట్రంప్ వాదించారు. ఒకప్పటి శ్వేతజాతి పాలనలో నల్లజాతీయులపై అఘాయి త్యాలు జరిగాయని ఒప్పుకుంటూనే ఇప్పుడు నల్లజాతి పాలనలో శ్వేతజాతీయుల్ని ఆ మాదిరేహింసిస్తున్నారని చెప్పుకొచ్చారు. మీ వద్ద ఆధారాలున్నాయా అని రాంఫోసా అడిగితే, లేవని అంగీ కరిస్తూనే ట్రంప్ ఒక వీడియో ప్రదర్శించారు. అందులో నల్లజాతి వామపక్ష నాయకుడు జూలియస్ మలేమా ‘శ్వేతజాతి ఆఫ్రికన్లను హతమార్చండ’ంటూ నినాదాలిస్తున్న దృశ్యాలు కనబడ్డాయి. మొత్తం గంటసేపు జరిగిన ఈ మీడియా సమావేశంలో రాంఫోసా ఎక్కడా ఆవేశానికి పోకుండాఎంతో సంయమనంతో ట్రంప్‌కు జవాబిచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి దక్షిణాఫ్రికాలో ఇప్పటికీ నాలుగింట మూడొంతుల వ్యవసాయ భూములు 8 శాతంకన్నా తక్కువ జనాభాగల శ్వేతజాతీయుల చేతుల్లో వున్నాయి. జనాభాలో 80 శాతంగా వున్న నల్లజాతీయులకు వ్యవసాయ భూముల్లో వాటా కేవలం 4 శాతం మాత్రమే. కానీ ట్రంప్ మాత్రం దక్షిణాఫ్రికా ప్రభుత్వం శ్వేతజాతీయుల భూముల్ని గుంజుకుని వాటిని నల్లజాతీయులకు పంచు తున్నదని ఆరోపించారు. శ్వేతజాతి దురహంకార పాలనలో నల్లజాతీయుల నుంచి అక్రమంగా చేజిక్కించుకున్న భూములు వెనక్కిప్పించాలని స్థానికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా అక్కడి ప్రభుత్వం అంగీకరించటం లేదు. దానికి బదులు స్వచ్ఛందంగా అమ్మటానికి సిద్ధపడే శ్వేత జాతీయులకు పలు రాయితీలిస్తున్నది. శ్వేతజాతి రైతుల ఊచకోత సాగుతున్నదన్న ట్రంప్ వాదన కూడా పూర్తి అబద్ధం. నేరాల రేటు చూస్తే ప్రపంచంలోనే దక్షిణాఫ్రికా ముందుంది. అక్కడ సగటున రోజుకు 72 హత్యలు జరుగుతాయి. ఆరుకోట్ల జనాభాగల ఆ దేశంలో హతుల్లో అత్యధికులు నల్లజాతీయులు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుడు 26,232 మంది హత్యకు గురైతే అందులో కేవలం 8 మంది మాత్రమే శ్వేతజాతి రైతులు. వాస్తవాలు ఇవికాగా ట్రంప్ వైట్‌హౌస్ వేదికగా ఒక దేశాధినేతపై ప్రపంచమంతా చూస్తుండగా దబాయించటం ఎంత దారుణం! నిజానికి రెండు దేశాలూ చర్చించి పరిష్కరించుకోవాల్సినవి చాలావున్నాయి. శ్వేతజాతి రైతుల ఊచకోత ప్రచారాన్ని నమ్మటంతో బైడెన్ హయాంలోనే నిధులు ఆపేశారు. ట్రంప్ వచ్చాక 25 శాతం సుంకాల విధింపును ప్రకటించారు. ఆ దేశంలోని సహజ వనరులపై ట్రంప్ కన్నుపడింది. వీటిపై అర్థవంతమైన చర్చలు జరగకుండానే తప్పుడు ప్రచారంపై వాదులాట సాగింది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న ఊచ కోతపై ధైర్యంగా అంతర్జాతీయ న్యాయస్థానం తలుపుతట్టింది దక్షిణాఫ్రికాయే. రాంఫోసా అదృష్టం బాగుండి ట్రంప్‌కు ఆ సంగతి గుర్తురాలేదు. లేకుంటే మరింతగా విరుచుకుపడేవారు. వర్తమాన ప్రపంచంలో పలు దేశాధినేతలు తప్పుడు సమాచారాన్నీ, వదంతుల్నీ ప్రచారంలో పెట్టి అధికారంలోకొచ్చినవారే. ఈ ఎత్తుగడలే మరోసారి అందలం ఎక్కిస్తాయని... రాజ్యాంగాన్ని సవరించి మూడోసారి అధ్యక్షుడు కావాలని కలగంటున్న ట్రంప్ విశ్వసిస్తున్నారు. ఇలాంటపుడు అమెరికాలో అడుగుపెట్టడానికీ, ట్రంప్‌తో చీవాట్లు తినటానికీ ఏ దేశాధినేతయినా ధైర్యం చేయగలరా?

ఎవరి అండతో ఈ దుర్మార్గాలు చేస్తున్నారు?
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులతో బరితెగించి వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు శిశుపాలుని మాదిరి పాపాలు చేస్తున్నారని, వీటిని ప్రజలు ఎంత మాత్రం క్షమించరని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఎల్లయ్య కుమారుడు హరికృష్ణ పట్ల దాచేపల్లి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై హింసకు పాల్పడడం ఎంత వరకు సమంజసం? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారాన్ని వీరికి ఎవరు ఇచ్చారు? హరికృష్ణపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? దాన్ని సమర్థించుకునేందుకు ఒక కట్టుకథ అల్లుతారా? స్వయంగా టీడీపీ నేత కార్లో హరికృష్ణను తరలించి, స్టేషన్లో తీవ్రంగా కొట్టి, సీఐ క్వార్టర్స్‌లో దాచి పెడతారా? హరికృష్ణ తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేయకపోతే అతడిని ఏం చేసేవారు? ఎవరి ఆదేశాలతో, ఎవరి అండతో ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు? ఇది రాజ్య హింస కాదా? ఇక పౌరులకు రక్షణ ఏముంటుంది? ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదంటారా? చట్టాన్ని, న్యాయాన్ని బేఖాతరు చేయడం కాదా? చంద్రబాబూ.. రెడ్‌బుక్ రాజ్యాంగంలో మీరు శిశుపాలుడి మాదిరి పాపాలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఎంత మాత్రం సహించరు. ఈ అంశాన్ని అన్ని వ్యవస్థల దృష్టికీ తీసుకెళ్తాం. హరికృష్ణకు న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టం’ అని ఆ పోస్ట్‌లో వైఎస్ జగన్ పేర్కొన్నారు.
రాజధాని రైతులకు ఇక్కట్లు నిజమే
హెడ్ టు హెడ్లో విజేతలు వీరే
పాక్ విమానాలపై గగనతల నిషేధం పొడిగింపు
పాక్–ఉగ్రవాదం లంకె.. సిందూర్‌తో బట్టబయలు: షా
రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల ఆందోళన
నేను చిప్స్ దొంగిలించలేదమ్మా
ఊరూరా బెల్ట్ దుకాణం.. ఇది కదా కుంభకోణం!
మందలా చేరికలు.. మందకొడి బోధన
విశాఖలో మరో ఇద్దరికి కరోనా
పాకిస్తాన్ ఆర్థిక దిగ్బంధం!
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కెప్టెన్‌గా బుమ్రా.. సుదర్శన్‌కు దక్కని చోటు!.. శార్దూల్‌కు ఛాన్స్!
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా
అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
జనం లేక వెలవెల.. తుస్సుమన్న టీడీపీ మినీమహానాడు
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఏలూరులో ఘరానా మోసగాడు
ఒకసారి భారత్‌కు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాడట సార్! ఓడించినందుకు!
చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
మంగళవారం రోల్ ఇక మర్చిపోండి: నటి రిక్వెస్ట్
మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
రాజధాని రైతులకు ఇక్కట్లు నిజమే
హెడ్ టు హెడ్లో విజేతలు వీరే
పాక్ విమానాలపై గగనతల నిషేధం పొడిగింపు
పాక్–ఉగ్రవాదం లంకె.. సిందూర్‌తో బట్టబయలు: షా
రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల ఆందోళన
నేను చిప్స్ దొంగిలించలేదమ్మా
ఊరూరా బెల్ట్ దుకాణం.. ఇది కదా కుంభకోణం!
మందలా చేరికలు.. మందకొడి బోధన
విశాఖలో మరో ఇద్దరికి కరోనా
పాకిస్తాన్ ఆర్థిక దిగ్బంధం!
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
కెప్టెన్‌గా బుమ్రా.. సుదర్శన్‌కు దక్కని చోటు!.. శార్దూల్‌కు ఛాన్స్!
'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి
తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్‌కి ఫిదా
అనసూయ ఇంట మరో శుభకార్యం.. వీడియో షేర్ చేసిన నటి!
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
రాజ్యాంగం, 'సుప్రీం' మధ్య విడదీయరాని బంధం - సీజేఐ జస్టీస్ బీఆర్ గవాయ్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
జనం లేక వెలవెల.. తుస్సుమన్న టీడీపీ మినీమహానాడు
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ
అంగరంగ వైభవంగా మానస వివాహం (ఫొటోలు)
ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఏలూరులో ఘరానా మోసగాడు
ఒకసారి భారత్‌కు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాడట సార్! ఓడించినందుకు!
చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
మంగళవారం రోల్ ఇక మర్చిపోండి: నటి రిక్వెస్ట్
మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
తండ్రైన కిరణ్ అబ్బవరం.. క్యూట్ పిక్ షేర్ చేసిన హీరో
సినిమా

విశాల్ పెళ్లి ఇంత ఆలస్యం కావడానికి కారణం ఎవరు..?
ప్రస్తుతం తమిళ నటుడు విశాల్ వయసు 50కి చేరువవుతోంది. నిజానికి అన్ని విధాలుగా బాగున్న ఓ వ్యక్తి అంత కాలం పాటు వివాహం కోసం ఆగడం అసాధారణమేననాలి. అందునా విశాల్... ఏ వయసుకా ముచ్చటను అచ్చంగా ఫాలో అయే అచ్చ తెలుగు సంప్రదాయ కుటుంబానికి చెందిన వాడు అనేది కూడా తెలిసిందే. పోనీ సినీనటుడిగా పరిగణనలోకి తీసుకున్నా, 40ఏళ్లకు కాస్త అటూ ఇటూగా పెళ్లి చేసుకోవడం రివాజు. మరోవైపు విశాల్, ధన్షికల మధ్య ప్రేమ ప్రయాణం కూడా ఈ నాటిది కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో... విశాల్ తన పెళ్లిని ఎందుకు ఇన్నేళ్ల పాటు వాయిదా వేశాడు?అయితే విశాల్ పెళ్లి ఆలస్యం కావడానికి ఆయన తీసుకున్న నిర్ణయమే కారణం. అది వ్యక్తిగత సమస్యల వల్ల కాదు, ఎవరిపైనా ప్రేమ లేకపోవడం వల్ల కూడా కాదు. అది ఒక భవన నిర్మాణంతో ముడిపడింది. ఆయన చేసుకున్న ప్రతిజ్ఞ తో ముడిపడింది. నడిగర్ సంఘం (దక్షిణ భారత కళాకారుల సంఘం)కు తమ భవన నిర్మాణం ఓ కల. ఎందరో కళాకారులకు, సాంకేతిక నిపుణులకు నిలయమైన తమిళనాట అందరికీ ఉపయుక్తమైన ఒక భవనం లేకపోవడం అనే లోటు తీరేందుకు ఓ విశాలమైన వసతి కావాలని ఎందరో కోరుకున్నారు. చాలా సార్లు ఆ భవన నిర్మాణం ప్రతిపాదనలు వచ్చినా రకరకాల కారణాల వల్ల పట్టాలెక్కలేదు.ఈ నేపధ్యంలోనే కొత్త నడిగర్ సంఘంకు ప్రధాన కార్యదర్శిగా విశాల్ ఎంపికయ్యాడు. అంతేకాదు భవనం పూర్తయ్యే వరకు తాను విశ్రమించబోనని ఆయన హామీ ఇచ్చాడు.నడిగర్ సంఘం భవన నిర్మాణ ప్రాజెక్టు తమిళ చిత్ర పరిశ్రమలో సినీ కార్యక్రమాలు కళాకారుల సమావేశాలకు ప్రత్యేక స్థలo లేకపోవడంతో ఈ భవనం నిర్మాణం చాలా ముఖ్యమైనదిగా మారింది. ఎట్టకేలకు కళాకారులకు ఉపయుక్తంగా ఉండే ఆధునిక సౌకర్యాలతో కూడిన ఒక అత్యుత్తమ భవన నిర్మాణానికి 2017లో శ్రీకారం చుట్టుకుంది. పరిశ్రమ దిగ్గజాలు రజనీకాంత్ కమల్ హాసన్ దీనికి పునాదిరాళ్లు వేశారు. విజయ్ కమల్ హాసన్ లు తమ వ్యక్తిగత నిధుల నుంచి రూ.1 కోటి చొప్పున విరాళంగా ఇచ్చారు, అలాగే మరో హీరో, నటుడు కార్తీ నిర్మాణాన్ని పర్యవేక్షించడంలో చురుకుగా పాల్గొన్నాడు, ఇలా ఎందరో ప్రముఖుల సహాయ సహకారాలు ఉన్నప్పటికీ... ఈ భవనం పదేపదే నిర్మాణ జాప్యాలను ఎదుర్కొంది. వ్యక్తిగతంగా భావోద్వేగాలను సైతం హీరో విశాల్ ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడిగా పెట్టాడని చెప్పొచ్చు. ఈ భవనం సాకారమయే వరకు తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టాలని కూడా అతను నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఆయన తమందరి కల నెరవేరేదాకా పెళ్లి చేసుకోనని శపధం చేశాడు. ఏమైతేనేం.. చెన్నై నడిబొడ్డున టి. నగర్, హబీబుల్లా రోడ్లో ఈ భవనాన్ని చలనచిత్ర పరిశ్రమ వివిధ రకాల అవసరాలను తీర్చగల బహుళార్ధక సాధక సినీ కేంద్రంగా భవనం రూపుదిద్దుకుంది. ఇందులో అవార్డు ఫంక్షన్ల కోసం 1000 సీట్ల ఆడిటోరియం, 800 సీట్ల వివాహ మందిరం, 300 సీట్ల చిన్న చిన్న సమావేశ మందిరాలు డిజైన్ చేశారు. భవనం దాదాపుగా సిద్ధమై ప్రతిజ్ఞ నెరవేరడంతో, విశాల్ పెళ్లికి సిద్ధమ్యాడు. నటి సాయి ధన్షికతో తన వివాహాన్ని ప్రకటించాడు, ఇది అన్ని రకాల ఊహాగానాలకు ముగింపు పలికింది. అయితే ఈ ప్రకటన వారి సన్నిహితులెవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే.. వారిద్దరూ 15 సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసనీ, బలమైన స్నేహ బంధాన్ని ప్రేమ గా మార్చుకున్నారని కూడా తెలుసు. ముఖ్యంగా తన జీవితంలోని కష్ట సమయాల్లో విశాల్ చూపిన అచంచలమైన మద్దతు తోడ్పాటును ధన్షిక చాలా కాలంగా ఆరాధించింది. పెళ్లి ప్రకటన సందర్భంగా విశాల్ తమ ఇద్దరి ప్రయాణం గురించి మాట్లాడాడు. తాను చేసిన ప్రతిజ్ఞను ప్రస్తావిస్తూ వివాహం గురించిప ఆలోచనను నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలనే ఆలోచన ఆపిందని ఆయన అంగీకరించాడు తనను నిజంగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ధన్షికను అభివర్ణించాడు ఇంత కాలం వేచి ఉన్నందుకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు.

విక్రమ్ సరసన క్రేజీ హీరోయిన్‌కు గోల్డెన్ ఛాన్స్
చిత్రపరిశ్రమలో వైవిధ్య భరిత కథాచిత్రాలకు కేరాఫ్ చియాన్ విక్రమ్. ఈయన తాను నటించే ప్రతి చిత్రంలోనూ కొత్తగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ఇటీవల తంగలాన్, వీర ధీర సూరన్ చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కాగా తాజాగా విక్రమ్ తన 63వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి మడోనా అశ్విన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు మండేలా, మావీరన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రాన్ని శాంతి పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సంస్థ ఇంతకుముందు శివకార్తికేయన్ కథానాయకుడిగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం. కాగా తాజాగా విక్రమ్ హీరోగా నిర్మించే చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇందులో విక్రమ్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే నటి ప్రియాంక మోహన్, అలాగే శ్రీనిధిశెట్టిలలో ఒకరు నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. కాగా తాజాగా లక్కీ కథానాయకి మీనాక్షి చౌదరిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కన్నడ బ్యూటీ ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో మంచి రేసింగ్‌లో ఉన్నారు. ఈమె ఇంతకు ముందు తమిళ్, తెలుగు భాషల్లో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించిన లక్కీ భాస్కర్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాగే వెంకటేష్ సరసన నటించిన తెలుగు చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా సూపర్ హిట్ అయింది. దీంతో ప్రస్తుతం ఈమె క్రేజీ కథానాయకిగా వెలుగొందుతున్నారు. కాగా మరోసారి తమిళంలో విక్రమ్‌తో జత కట్టడానికి రెడీ అవుతారా? అన్నది వేచి చూడాలి.

విజయ్ సేతుపతి 'ఏస్' సినిమా రివ్యూ
విజయ్ సేతుపతి నటించిన కొత్త సినిమా 'ఏస్' (Ace) థియేటర్స్‌లోకి వచ్చేసింది. రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రాన్ని ఆర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రంలో దివ్యా పిళ్లై, యోగిబాబు, అవినాశ్, పృథ్వీరాజ్, కీలక పాత్రలలో నటించారు. మే 23న బి. శివ ప్రసాద్ భారీ ఎత్తున తెలుగులో రిలీజ్ చేశారు. రీసెంట్గా మహారాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు ఏస్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలుసుకుందాం.కథబోల్ట్ కన్నన్ (విజయ్ సేతుపతి) జైలు నుంచి విడుదలై తన నేర గతాన్ని వదిలించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మలేసియాకు వస్తాడు. అక్కడ జ్ఞానందం (యోగిబాబు) ఆశ్రయం కల్పిస్తాడు. మలేషియాలో కల్పన (దివ్యా పిళ్లై) హోటల్ నడుపుతూ ఉంటుంది. ఆమె వద్దకు పనిలో చేరుతాడు బోల్డ్ కన్నన్.. ఈ క్రమంలో, తన పెంపుడు తండ్రి రాజా దొరై (బబ్లూ) నుండి ఇంటిని విడిపించుకోవడానికి డబ్బు కూడబెడుతున్న రుక్మిణి (రుక్మిణి వసంత్)తో కన్నన్ ప్రేమలో పడతాడు.అయితే, కల్పన తన హోటల్ కోసం తీసుకున్న లోన్ చెల్లించలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇలా తన ప్రేయసితో పాటు యజమాని కూడా డబ్బుల కోసం ఇబ్బందలు పడుతూ ఉంటారు. దీంతో తన స్నేహితుడు జ్ఞానందంతో కలిసి మలేసియాలో అక్రమ వ్యాపారాలు నడిపే ధర్మ (అవినాష్) వద్దకు డబ్బుల కోసం వెళ్తారు. అయితే, వడ్డీ కట్టడంలో ఆలస్యమైతే ప్రాణాలు తీసే ధర్మ ఉచ్చులో వారు చిక్కుకుంటారు.ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బోల్ట్ కన్నన్ ఎలా బయటపడతాడు..? నగరంలో జరిగిన అతిపెద్ద బ్యాంకు దోపిడీతో కన్నన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్నో సమస్యలను దాటుకుని తాను ప్రేమించిన రుక్మిణిని కన్నన్ పెళ్లి చేసుకుంటాడా..? తనపై నమోదైన నేరాల నుంచి ఎలా బయటపడుతాడు..? అసలు బోల్ట్ కన్నన్ గతం ఏమిటి? చివరికి అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?దర్శకుడు అరుముగకుమార్ కథ చెప్పడంలో ఒక ప్రత్యేకమైన శైలి తీసుకున్నాడు. సినిమాలోని పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోతారు. ప్రేక్షకుల ఊహకు అందేలానే కథనం సాగుతూ ఉన్నా కూడా ఎక్కడా అయితే బోర్ కొట్టదు. విజయ్ సేతుపతి డార్క్ కామెడీ, యోగిబాబు టైమింగ్, రుక్మిణి వసంత్ అందాలు ఆ లోపాల్ని కప్పి పుచ్చేస్తుంటాయి. అలా సినిమాను ఎంగేజింగ్‌గా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ముఖ్యంగా నెమ్మదిగా సాగే మొదటి అర్ధభాగం కాస్త నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత కథ స్పీడ్ అందుకుంటుంది. ప్రథమార్దం అంతా కథలోని పాత్రలను పరిచయం చేసేందుకే సరిపోతుంది. అసలు కథ మొదలు అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎప్పుడైతే హీరో తన వారి కోసం విలన్ డెన్‌కు ఎంట్రీ ఇస్తాడో అక్కడి నుంచి జోరు అందుకుంటుంది. బ్యాంక్‌లో దొంగిలించిన సొమ్ముతో హీరో ఎలా బయటపడతాడు..? ఆ నేరాల్లోంచి ఎలా తప్పించుకుంటాడు..? అనే పాయింట్లతో సెకండాఫ్ మరింత గ్రిప్పింగ్ తీసుకెళ్తాడు. క్లైమాక్స్‌లో హీరో చేత డైరెక్టర్ ఆడించే ఆట, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.ఎవరెలా చేశారంటే..?ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది. బోల్ట్ కన్నన్ పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడు. కేవలం ఆయన మాత్రమే చేయగలడు అనేలా పాత్ర ఉంటుంది. మొదటి సారి డార్క్ కామెడీని ఆయన పండించాడు. ఇక యోగి బాబు అయితే ఫుల్ లెన్త్గా నవ్విస్తాడు. రుక్మిణి వసంత్ ఇందులో తన గ్లామర్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. దివ్యా పిళ్లైకి ఓ మంచి పాత్ర దక్కింది. అవినాష్ విలనిజం మెప్పిస్తుంది. సాంకేతిక పరంగా కూడా సినిమా బాగుంటుంది. కెమెరామెన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. పాటలకు పెద్దగా కనెక్ట్ కాకున్నప్పటికీ మ్యూజిక్ బాగుంది. శామ్ సీఎస్ ఆర్ఆర్ మెప్పిస్తుంది. కాస్త ఎడిటింగ్‌లో మార్పులు చేసింటే ఇంకా బాగుండేది. విజయ్ సేతుపతి కోసం సినిమా చూడొచ్చు. ఎక్కడా కూడా ఎవరినీ నిరుత్సాహపరచడు.

పవన్ కల్యాణ్‌తో రామ్ చరణ్ సినిమా.. త్రివిక్రమ్ దర్శకుడు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ (2024) సినిమా విడుదలై ఏడాదిన్నర దాటినప్పటికీ, ఆయన తదుపరి చిత్రంపై స్పష్టత లేకపోవడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. మొదట్లో అల్లు అర్జున్‌తో పాన్-ఇండియా చిత్రం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, అది వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు 2026 వరకు పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో, త్రివిక్రమ్ సినిమా తాత్కాలికంగా వాయిదా పడినట్లు మొన్నటిదాక ప్రచారం జరిగింది. ఇప్పుడు మొత్తానికి ఈ చిత్రం ఉండకపోవచ్చని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. బన్నీ ప్రాజెక్ట్‌ని పక్కకు పెట్టి రామ్ చరణ్‌తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. వెంకీ చిత్రం తర్వాత...బన్నీ సినిమా వాయిదా పడడంతో త్రివిక్రమ్ ఈ గ్యాప్‌లో విక్టరీ వెంకటేశ్‌తో ఓ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడట. ఈ చిత్రం కథా చర్చలు పూర్తయి, మరికొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఇది పూర్తయిన తర్వాత బన్నీతో సినిమా చేస్తాడని మొన్నటి దాకా ప్రచారం జరిగింది. కానీ అది కూడా జరిగేలా లేదు. త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టుని పూర్తిగా పక్కకు పెట్టేసి.. రామ్ చరణ్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.పవన్ కోసం..పవన్ కల్యాణ్ చొరవతో రామ్ చరణ్ కోసం త్రివిక్రమ్ ఓ క్రేజీ కథను రెడీ చేశాడట. ఇటీవల ఈ కథను చరణ్‌కు చెప్పి ఒప్పించారట. ఈ చిత్రానికి త్రివిక్రమ్ సన్నిహితుడైన పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. పెద్ది చిత్రం పూర్తయిన వెంటనే చరణ్ త్రివిక్రమ్ సినిమాని సెట్స్‌పైకి వెళ్తుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. సుక్కు మూవీకి బ్రేక్!వాస్తవానికి పెద్ది తర్వాత చరణ్ .. సుకుమార్‌తో సినిమా చేయాల్సింది. ఇటీవల సుకుమార్ కూడా తన తదుపరి సినిమా చరణ్‌తోనే అని ప్రకటించాడు. కానీ పవన్ కల్యాణ్ కారణంగా చరణ్.. సుక్కు ప్రాజెక్టుని పక్కకు పెట్టి..త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రం తర్వాత సుకుమార్‌తో సినిమా చేయాలని భావిస్తున్నాడట. మరి సుక్కు అంతకాలం వెయిట్ చేస్తాడా లేదా మధ్యలో మరో హీరోని చూస్కొని సినిమా చేస్తాడా అనేది తెలియాల్సింది.
న్యూస్ పాడ్‌కాస్ట్

చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్... మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మృతి... ఇది అసాధారణ విజయం అంటూ స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

హామీలు నెరవేర్చలేకే రెడ్‌బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు

మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విచారణ పేరుతో వేధింపులు... న్యాయస్థానం తీర్పు బేఖాతరు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి పట్ల అభ్యంతకరంగా ఏపీ సిట్ తీరు

లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ
క్రీడలు

బెంగళూరుకు రైజర్స్ బ్రేక్
లక్నో: ‘ప్లే ఆఫ్స్’కు దూరమైన అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతోంది. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ‘ప్లే ఆఫ్స్’ ఆశలపై నీళ్లుచల్లిన రైజర్స్... శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. శుక్రవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ 42 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (48 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టగా... అభిషేక్ శర్మ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అనికేత్ వర్మ (9 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (32 బంతుల్లో 62; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (25 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో భయపెట్టినా... చివర్లో ఒత్తిడి పెంచిన రైజర్స్ ఫలితం రాబట్టింది. సన్‌రైజర్స్ కెపె్టన్ కమిన్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆరంభం నుంచే దంచుడు... ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రెండో ఓవర్లో హెడ్ ఫోర్‌తో ఖాతా తెరవగా... భువనేశ్వర్ వేసిన రెండో ఓవర్లో హెడ్ ఫోర్, అభిషేక్ 4, 6 బాదారు. మూడో ఓవర్లోనూ అభిషేక్ 4, 6 దంచగా... నాలుగో ఓవర్లో ఈ జోడీ 4, 6, 4 కొట్టింది. వీరిద్దరూ మూడు బంతుల వ్యవధిలో అవుట్ కాగా... పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ 71/2తో నిలిచింది. క్లాసెన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... ఇషాన్ కిషన్ నిలకడ కనబర్చాడు. సుయాశ్ శర్మ వేసిన 11వ ఓవర్లో అనికేత్ 6, 4, 6 కొట్టి కాసేపటికే ఔట్ కాగా... ఆంధ్రప్రదేశ్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (4) ప్రభావం చూపలేకపోయాడు. అభినవ్ మనోహర్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆఖర్లో బాదే బాధ్యత ఇషాన్ భుజాలకెత్తుకున్నాడు. 28 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న కిషన్... చివర్లో మరింత వేగం పెంచి సెంచరీకి 6 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఓపెనర్లు మినహా... పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బెంగళూరు... భారీ లక్ష్యం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం వెరవలేదు. తొలి రెండు ఓవర్లలో ఒక్కో ఫోర్ కొట్టిన కోహ్లి, మూడో ఓవర్లో రెండు ఫోర్లు దంచాడు. నాలుగో ఓవర్ వేసిన హర్షల్‌కు అదే శిక్ష వేశాడు. కోహ్లి 7 ఫోర్లు కొట్టేవరకు ఒక్క బౌండ్రీ బాదలేకపోయిన సాల్ట్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి చాలెంజర్స్ 72/0తో నలిచింది. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన అనంతరం విరాట్ అవుట్ కాగా... పడిక్కల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ (11) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న సాల్ట్ కాసేపటికి వెనుదిరగగా... జితేశ్ శర్మ, రజత్ పాటీదార్ జోరు కొనసాగించారు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 163/3తో నిలిచింది. విజయానికి 36 బంతుల్లో 69 పరుగులు అవసరమైన దశలో... బెంగళూరు బ్యాటర్లు తడబడటంతో పరాజయం తప్పలేదు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) సాల్ట్ (బి) ఇన్‌గిడి 34; హెడ్ (సి) షెఫర్డ్ (బి) భువనేశ్వర్ 17; ఇషాన్ కిషన్ (నాటౌట్) 94; క్లాసెన్ (సి) షెఫర్డ్ (బి) సుయాశ్ 24; అనికేత్ (సి) భువనేశ్వర్ (బి) కృనాల్ 26; నితీశ్ రెడ్డి (సి) కృనాల్ (బి) షెఫర్డ్ 4; అభినవ్ మనోహర్ (సి) సాల్ట్ (బి) షెఫర్డ్ 12; కమిన్స్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1–54, 2–54, 3–102, 4–145, 5–164, 6–188. బౌలింగ్: యశ్ దయాళ్ 3–0–36–0; భువనేశ్వర్ 4–0–43–1; ఇన్‌గిడి 4–0–51–1; సుయాశ్ శర్మ 3–0–45–1; కృనాల్ పాండ్యా 4–0–38–1; షెఫర్డ్ 2–0–14–2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: ఫిల్ సాల్ట్ (సి) హర్షల్ (బి) కమిన్స్ 62; కోహ్లి (సి) అభిషేక్ (బి) హర్‡్ష దూబే 43; మయాంక్ (సి) ఇషాన్ (బి) నితీశ్ 11; పాటీదార్ (రనౌట్) 18; జితేశ్ శర్మ (సి) అభినవ్ (బి) ఉనాద్కట్ 24; షెఫర్డ్ (సి అండ్ బి) మలింగ 0; కృనాల్ (హిట్ వికెట్) (బి) కమిన్స్ 8; టిమ్ డేవిడ్ (సి) క్లాసెన్ (బి) మలింగ 1; భువనేశ్వర్ (బి) కమిన్స్ 3; యశ్ దయాళ్ (సి) అభిషేక్ (బి) హర్షల్ పటేల్ 3; ఇన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–80, 2–120, 3–129, 4–173, 5–174, 6–174, 7–179, 8–186, 9–187, 10–189.బౌలింగ్: కమిన్స్ 4–0–28–3; ఉనాద్కట్ 4–0–41–1; హర్షల్ పటేల్ 3.5–0–39–1; ఇషాన్ మలింగ 4–0–37–2; హర్‡్ష దూబే 2–0–20–1; నితీశ్ రెడ్డి 2–0–13–1. ఐపీఎల్లో నేడుఢిల్లీ X పంజాబ్‌వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

ఆర్సీబీకి ఝులక్ ఇచ్చిన ఎస్ఆర్హెచ్.. టాప్-2 కష్టమే?
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు సన్‌రైజర్స్ హైదరాబాద్ బిగ్ షాకిచ్చింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైందిఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(62), విరాట్ కోహ్లి(43) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ మలింగ రెండు, ఉనద్కట్, దూబే, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్దానానికి పడిపోయింది. టాప్-2లో గుజరాత్,పంజాబ్ కొనసాగుతున్నాయి. ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో కిషన్ 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడితో పాటు అభిషేక్ శర్మ(17 బంతుల్లో 34), క్లాసెన్(24), హెడ్(17), అనికేత్ వర్మ(9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సుయాష్, ఎంగిడీ,భువనేశ్వర్, పాండ్యా తలా వికెట్ సాధించారు.చదవండి: WI vs IRE: వెస్టిండీస్ వీరుడి విధ్వంసం.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!

వెస్టిండీస్ వీరుడి విధ్వంసం.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!
డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో రెండో వన్డేలో వెస్టిండీస్ ఆటగాడు మాథ్యూ ఫోర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఎనిమిదో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఈ కరేబియన్ వీరుడు.. ఐర్లాండ్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ క్రమంలో ఫోర్డ్ కేవలం 16 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ వరల్డ్ రికార్డును ఫోర్డ్ సమం చేశాడు. 2015లో జోహన్నెస్‌బర్గ్‌లో వెస్టిండీస్‌పై ఏబీ డివిలియర్స్ 16 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.తాజా మ్యాచ్‌తో డివిలియర్స్‌తో సంయుక్తంగా ఫోర్డ్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 19 బంతులు ఎదుర్కొన్న ఈ విండీస్ ఆల్‌రౌండర్.. 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కీసీ కార్తీ(109 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 102 పరుగులు) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి352 పరుగులు చేసింది.వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన జాబితా ఇదేఏబీ డివిలియర్స్ - 16 బంతులు - దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ (2015)మాథ్యూ ఫోర్డ్ - 16 బంతులు - వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్ (2025)సనత్ జయసూర్య - 17 బంతులు - శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ (1996)కుశాల్ పెరెరా - 17 బంతులు - శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ (2015)మార్టిన్ గుప్టిల్ - 17 బంతులు - న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక (2015)లియామ్ లివింగ్‌స్టోన్ - 17 బంతులు - ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ (2015)చదవండి: IND vs ENG: టీమిండియా సారథిగా శుబ్‌మన్ గిల్ ఫిక్స్!.. వైస్ కెప్టెన్ ఎవరంటే?

రూ.25 లక్షలు మోసపోయిన దీప్తీ శర్మ..? సహచర క్రికెటర్‌పై కేసు నమోదు
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ ఇంట్లో చోరీ జరిగింది. అగ్రాలోని దీప్తీకి చెందిన ఫ్లాట్ నుంచి విలువైన వస్తువులను ఢిల్లీ ఉమెన్స్ క్రికెటర్ ఆరుషి గోయల్ దొంగతనం చేసినట్లు ఆమె సోదరుడు సుమిత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇండియన్ రైల్వేలో జూనియర్ క్లర్క్‌గా పనిచేస్తున్న ఆరుషి.. మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ తరపున దీప్తీతో కలిసి ఆడింది. అదేవిధంగా దీప్తీని ఆరుషి రూ.25 లక్షలు మోసం చేసిందని సుమిత్ శర్మ ఆరోపించాడు."తన సోదరి ఇంట్లో దొంగతనం జరిగిందని దీప్తీ సోదరుడు సుమిత్ శర్మ అగ్రాలోని సదర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారు. ప్రాథమిక విచారణ అనంతరం మేము పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశాము. అరుషి, దీప్తీ కలిసి ఒకే జట్టుకు ఆడడం ఇద్దరూ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.ఈ క్రమంలో ఆరుషీ కుటుంబ అత్యవసర పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను చూపుతూ దీప్తీ నుంచి పలుమార్లు నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మేము పూర్తి స్దాయి విచారణ జరుపుతామని" ఏసీపీ (ఆగ్రా సదర్), సుకన్య శర్మ తెలిపినట్లు టైమ్స్ ఇండియా తమ రిపోర్ట్‌లో పేర్కొంది.దీప్తీ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతోంది. ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు ప్రకటించిన భారత జట్టులో ఆమె సభ్యురాలిగా ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా హర్మాన్ ప్రీత్ సేన ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.చదవండి: పుజారా ఆల్‌టైమ్ భారత జట్టు ఇదే.. రోహిత్, పంత్‌కు నో ఛాన్స్?
బిజినెస్

జొమాటో కొత్త ఛార్జీలు: దూరాన్ని బట్టి బాదుడే..
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్.. జొమాటో కొత్త ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. నష్టాలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 4 కి.మీ కంటే ఎక్కువ దూరం డెలివరీ చేసే ఫుడ్ ఆర్డర్ల కోసం ''లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజు'' పేరుతో అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది.150 రూపాయల కంటే ఎక్కువ విలువైన ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. బుక్ చేసుకునే హోటల్/రెస్టారెంట్ దూరం 4 నుంచి 6 కి.మీ మధ్య ఉంటే రూ. 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ దూరం ఉంటే.. దూరాన్ని బట్టి అదనపు ఛార్జీ (రూ. 25, రూ. 35) మారుతుంది. ఈ ఛార్జీ మీరు ఎంత ధరకు ఫుడ్ బుక్ చేసుకున్నారు అనేదాని మీద ఆధారపడి ఉండదు.కోవిడ్-19 కి ముందు, జొమాటో 4-5 కి.మీ పరిధిలో ఉచిత డెలివరీని అనుమతించింది. మహమ్మారి తర్వాత, చాలా రెస్టారెంట్లు క్లోజ్ అయ్యాయి. దీంతో ఆ పరిమితిని 15 కి.మీ.లకు పొడిగించారు. తరువాత డెలివరీ ఫీజు వసూలు చేయడం మొదలు పెట్టింది. ఇప్పుడు దూరాన్ని బట్టి అదనపు ఫీజును వసూలు చేయాలని నిర్ణయించింది.ఇదీ చదవండి: గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?జొమాటో తీసుకున్న ఈ నిర్ణయం.. కస్టమర్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఛార్జీలను ఎప్పటికప్పుడు పెంచుతూ పోతుంటే.. ఫుడ్ కోసం ఖర్చు చేసే డబ్బుకంటే డెలివరీ కోసం చేసే ఖర్చు ఎక్కువవుతుందని కొందరు భావిస్తున్నారు. మొత్తం మీద జొమాటో నిర్ణయం వల్ల.. సంస్థ ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.

లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్న సమయంలో చాలా కంపెనీలు సరికొత్త EVలను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఏవి అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.టాటా హారియర్ ఈవీఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా సాగుతున్న.. టాటా మోటార్స్ జూన్ 3న హారియర్ ఈవీ లాంచ్ చేయనుంది. ఇది 500 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ ప్యాక్ పొందుతుందని సమాచారం. కంపెనీకి చెందిన ఇతర కార్ల మాదిరిగానే ఇది కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. ధర, బుకింగ్స్ వంటి వివరాలు తెలియాల్సి ఉంది.కియా క్లావిస్ ఈవీకియా మోటారు తన క్లావిస్ కారును ఈ రోజు (మే 23) రూ.11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అయితే దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి ఇంకా కొంచెం సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 400 నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: 24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్మహీంద్రా XUV 3ఎక్స్ఓ ఈవీఈ ఏడాది ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనున్న కంపెనీల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఉంది. ఈ కంపెనీ XUV 3ఎక్స్ఓ ఈవీని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు చాలా వరకు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. ఇది 456 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.మారుతి ఈ విటారామారుతి సుజుకి కూడా ఈ ఏడాది తన మొట్టమొదటి.. ఎలక్ట్రిక్ కారు ఈ విటారా లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించింది. ఇది సెప్టెంబర్ 2025 నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 48.8 కిలోవాట్ బ్యాటరీ, 61.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఆప్షన్స్ ఉండనున్నాయి.

రూ.94 లక్షలు దాటేసిన బిట్‌కాయిన్: తొలిసారి..
బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్ విలువ కూడా అమాంతం పెరుగుతూనే ఉంది. మొదటిసారి బిట్‌కాయిన్ విలువ 1,12,000 డాలర్లకు (రూ. 94 లక్షల కంటే ఎక్కువ) చేరింది. ఓవైపు మదుపర్ల నుంచి గిరాకీ.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దీని విలువ భారీగా పెరుగుతోంది.బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. గురువారం ప్రారంభ ఆసియా ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ 3.3 శాతం పెరిగి 1,11,878 డాలర్లను దాటేసింది. రెండవ స్థానంలో ఉన్న ఈథర్ విలువ కూడా 7.3 శాతం పెరిగింది. అమెరికా సెనేట్‌లో స్టేబుల్‌కాయిన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత బిట్‌కాయిన్ విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టోకు అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే బిట్‌కాయిన్ వాల్యూ ఆల్ టైమ్ గరిష్టాలకు నెమ్మదిగా కదులుతోందని.. ఫాల్కన్ఎక్స్ లిమిటెడ్‌లోని గ్లోబల్ కో-హెడ్ ఆఫ్ మార్కెట్స్ జాషువా లిమ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..మైఖేల్ సాయిలర్ అనుబంధ సంస్థ ఇప్పటికే.. 50 బిలియన్ డాలర్ల (రూ. 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ) విలువైన బిట్కాయిన్లను కొనుగోలు చేసింది. అంతే కాకుండా.. కన్వర్టిబుల్ బాండ్స్, ప్రిఫర్డ్ స్టాక్స్ వంటి అనేక కొత్త టెక్ కంపెనీలు కూడా వివిధ మార్గాల్లో బిట్కాయిన్లను కొనుగోలు చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో బిట్‌కాయిన్ విలువ మరింత భారీగా పెరుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది.

ఈసారి ఆర్బీఐ డివిడెండ్ అదుర్స్..? త్వరలో నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తన డివిడెండ్ చెల్లింపుల వివరాలను త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిగులు బదలాయింపులను నియంత్రించే ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్ (ఈసీఎఫ్ )ను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. రికార్డు స్థాయి అంచనాలతో ఈ ఏడాది డివిడెండ్ గత ఏడాది బదిలీ చేసిన రూ.2.1 లక్షల కోట్లను అధిగమించే అవకాశం ఉంది.రికార్డు స్థాయి డివిడెండ్ అంచనా2023-24లో ఆర్బీఐ చారిత్రాత్మకంగా రూ.2.1 లక్షల కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేసింది. ఇది 2022-23లో ఇచ్చిన రూ.87,416 కోట్లతో పోలిస్తే రెట్టింపు కంటే అధికంగా ఉండడం గమనార్హం. మే 23న ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో రాబోయే చెల్లింపులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. గతంలో చేసిన డివిడెండ్ చెల్లింపుల కంటే ఈసారి చెల్లింపులు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలకు మరింత మద్దతు ఇవ్వడాన్ని హైలైట్ చేస్తుంది.ఇదీ చదవండి: ప్రమోషన్స్‌పై వరుస ప్రకటనలు చేస్తున్న టాప్ ఐటీ కంపెనీకేంద్ర బడ్జెట్ 2025లో ఆర్బీఐ ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్ ఆదాయం రూ.2.56 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్ (ఈసీఎఫ్) ఆర్బీఐ నుంచి బదిలీ చేయదగిన మిగులును నిర్ణయిస్తుంది. బిమల్ జలాన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా 2019 ఆగస్టు 26న మొదటిసారి ఆమోదించబడిన ఈసీఎఫ్ ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో 6.5-5.5% వద్ద నిర్వహించే కంటింజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్‌బీఐ) ద్వారా తగినంత రిస్క్ ప్రొవిజనింగ్‌ను నిర్ధారిస్తుంది.
ఫ్యామిలీ

Hanuman Jayanti 2025 భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి
రాయదుర్గం: హనుమంతుడి జయంతిని ఆలయాల్లో గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జీపీఆర్ఏ క్వార్టర్స్‌లోని రాజరాజేశ్వరి సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామికి, గచ్చిబౌలోని శివసాయిక్షేత్రంలో ఆంజనేయస్వామికి, ఇందిరానగర్‌లోని ఇంటర్నేషనల్ శ్రీహనుమాన్ ధామ్ ఆశ్రమ్ ఆలయంలో, మధురానగర్, ఖాజాగూడ, నానక్‌రాం గూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, టెలికామ్నగర్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిõÙకాలు, అర్చనలు, ఆకుపూజ, ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇదిలావుండగా గచ్చిబౌలిలోని శివసాయిక్షేత్రంలో హనుమాన్ హోమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా ఆకుపూజ, వడమాలతో అలంకారం చేశారు. పెద్ద సంఖ్యలో స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. మియాపూర్‌లో.. మియాపూర్: మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణనగర్కాలనీ, మియాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే గాందీ, కార్పొరేటర్ శ్రీకాంత్‌తో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గాం«దీ, కార్పొరేటర్ శ్రీకాంత్‌ను సన్మానించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో ఆంజనేయస్వామిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. చుట్టు పక్కల కాలనీల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సుభాష్ చంద్రబోస్‌నగర్ కాలనీలో.. చందానగర్: హనుమాన్ జయంతి పురస్కరించుకొని మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్‌నగర్ కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గాంధీ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌యాదవ్, సాంబశివారావు, బృందరావు, అంకరావు, సత్యం, రామకృష్ణ, వెంకటేష్, రవి, అప్పలరాజు, ఆలయ కమిటి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ చర్య, భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి?
ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్శిటీ (Harvard University) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం తీసుకున్న చర్య దిగ్భ్రాంతికి గురి చేసింది. హార్వర్డ్, ట్రంప్ సర్కార్‌కు మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలోనే, ఫెడరల్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP) కింద అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధికారాన్ని రద్దు చేసిది. హార్వర్డ్ దాని SEVP స్థితిని పునరుద్ధరించాలని భావిస్తే, సంబంధిత పత్రాలను రూపొందించడానికి ఇతర డిమాండ్లను తీర్చడానికి 72 గంటల సమయం ఇచ్చింది. ట్రంప్ తాజా సంచలన నిర్ణయం అనేక మంది విదేశీ విద్యార్థులకు దెబ్బతీయనుంది.ముఖ్యంగా భారతీయ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. మరోవైపు ట్రంప్ నిర్ణయంపై హార్వర్డ్ యూనివర్శిటీ స్పందించింది.ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధించినట్టు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. US డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) గురువారం ప్రకటించిన ఈ నిర్ణయం, హార్వర్డ్‌లోని దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థుల భవిష్యత్తును నేరుగా ప్రమాదంలో పడేస్తుంది. వీరిలో భారతదేశం నుండి దాదాపు 800 మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లుహార్వర్డ్ రికార్డుల ప్రకారం, ప్రతీ సంవత్సరం 500 నుండి 800 మంది భారతీయ విద్యార్థులు మరియు స్కాలర్లు, వివిధ విభాగాలలో నమోదు చేసుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం, ప్రస్తుతం 788 మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్‌లో చదువుతున్నారు, వీరిలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్-స్థాయి ప్రోగ్రామ్‌లలో ఉన్నారు. ట్రంప్ పరిపాలన చర్యతో, ఈ విద్యార్థులు ఇప్పుడు అమెరికాలో చట్టబద్ధంగా ఉండాలనుకుంటే మరొక SEVP-సర్టిఫైడ్ సంస్థకు బదిలీ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే వీసా రద్దు , బహిష్కరణకు దారి తీయవచ్చు.హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (DHS) హార్వర్డ్‌పై జరుపుతోన్న విచారణలో భాగంగా తీసుకున్న చర్య అని ప్రకటించింది. ఈ మేరకు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోమ్ హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక అధికారిక లేఖను పంపించారు. ఈ లేఖలో, క్యాంపస్‌లోని విదేశీ విద్యార్థుల గురించి సమాచారం కోసం అమెరికా ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను పాటించడంలో హార్వర్డ్ విఫలమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేకంగా, క్యాంపస్‌లో జరిగిన నిరసనలకు సంబంధించిన క్రమశిక్షణా రికార్డులు, ఆడియోవిజువల్ డాక్యుమెంటేషన్‌ను విశ్వవిద్యాలయం సమర్పించ లేదని లేఖలో ఆరోపించింది. అలాగే ‘హార్వర్డ్‌లో హింసను, యూదు వ్యతిరేకతను ప్రోత్సహించడం, చైనా కమ్యూనిస్టు పార్టీతో కలిసి పనిచేయడం వల్ల ఈ చర్య తీసుకున్నాం. విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోవడం ఓ హక్కు కాదు.. అది ఓ అర్హత మాత్రమే” అని తెపారు. అంతేగాక, విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారి చెల్లించే అధిక ఫీజులతో ప్రయోజనం పొంది బిలియన్ డాలర్లు నిధులు సమ కూర్చుకుంటున్నారు, ఇది హక్కు, కాదు’ అనిఆమె పేర్కొన్నారు.మరోవైపు దీనిపై స్పందించిన హార్వర్డ్ యూనివర్సిటీ కక్షపూరిత చర్యగా అభివర్ణించింది. ట్రంప్ సర్కార్ నిర్ణయం చట్ట విరుద్ధమైందని వ్యాఖ్యానించింది. 140కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులకు ఆతిథ్యమిస్తూ ప్రపంచాన్ని వెలుగులో నింపేందుకు చేస్తున్న వారిని మా వర్సిటీలో కొనసాగించేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ చర్య చట్టబద్ధమైనదేనా?అమెరికా చట్టాల ప్రకారం, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విద్యార్థి వీసాలపై అధికార పరిధిని కలిగి ఉంటుంది. అలాగూ SEVPని పర్యవేక్షిస్తుంది. గతంలో నిష్ణాతులైన అధ్యాపకుల లేకపోవడం లేదా సంస్థను మూసివేయడం వంటి తీవ్రమైన పరిపాలనా లోపాలతో SEVP జాబితా నుండి కొన్నింటిని తొలగించినప్పటికీ, హార్వర్డ్ SEVP సర్టిఫికేషన్‌ను రద్దు చేయడం లాంటిది ఇంతకుముందెన్నడూ లేదని నిపుణులు వ్యాఖ్యానించారు.

మిస్ వరల్డ్ 2025: అందమొక్కటే కాదు..అందమైన మనసు కూడా..
మిస్ వరల్డ్ అంటే అందమొక్కటే కాదు, అందమైన మసను కూడా..!! మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సామాజిక సేవ అంశాన్ని, లక్ష్యాన్ని కొనసాగిస్తున్న వారే. ఇందులో భాగంగానే నగరంలోని సరూర్ నగర్ విక్టోరియా హోమ్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని చేరుకోవడానికి అవసరమైన సూచనలిచ్చారు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ 2025 పోటీదారులు విక్టోరియా హోమ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యార్థులతో గురువారం ముచ్చటించారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న 107 మంది పోటీదారులతో పాటు మాజీ మిస్ వరల్డ్ క్రిస్టినా కలసి విక్టోరియా హోమ్‌ను సందర్శించి ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. కష్టపడే తత్వం, విజ్ఞాన సముపార్జనతో పాటు విద్యలో రాణిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని చిన్నారులకు వివరించారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే పటిష్టమైన కలలు ఉంటేనే తమ లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. అనంతరం విక్టోరియా హోమ్ విద్యార్థినులకు బహుమతులతో పాటు వారికి నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులను మిస్ వరల్డ్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా విక్టోరియా హోమ్ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అలకించి అభినందించారు. అందాల తారలు.. ముచ్చటపడి ఆ చిన్నారులతో కలిసి ఆడారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ చైర్మన్ మోర్లే, పర్యాటక శాఖ డైరెక్టర్ హనుమంతు, రాచకొండ సీపీ, ఎస్సీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: రానూ.. బొంబైకి రానూ.. విభిన్న కళలతో అలరించిన సుందరీమణులు)

రానూ.. బొంబైకి రానూ.. !
హైదరాబాద్ నగరంలోని శిల్పకళా వేదికగా గురువారం నిర్వహించిన ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ 2025 వేదిక పై మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు విభిన్నకళారూపాలతో ఆకట్టుకున్నారు. ఈ టాలెంట్ కాంపిటీషన్ ఫినాలేలో తెలుగు సాంగ్ రాను బొంబైకి రాను అనే సాంగ్‌తో పలువురు ఉర్రూతలూగించారు. 24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు వారి దేశాలకు చెందిన విభిన్న కళలతో అలరించారు. దీంతో పాటు పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక అంశాలు, ఐస్ స్కేటింగ్, డ్యాన్సింగ్, డీజే ప్లేయింగ్ వంటి ప్రదర్శనలిచ్చారు. ఈ టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండోనేషియా (పియానో) మొదటి స్థానంలో నిలవగా, మిస్ కామెరూన్ (సింగింగ్) రెండో స్థానంలో, మిస్ ఇటలీ (బ్యాలే నృత్యం) మూడో స్థానంలో నిలిచారు. సంప్రదాయ శ్రీలంక సింహళీ నృత్యంతో అలరించారు మిస్ శ్రీలంక. ఒక్క రోజులో తన కోసం సంప్రదాయ డ్రెస్‌ను తన తల్లి డిజైన్ చేసి ఇచ్చినందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ టాలెంట్ గ్రాండ్ ఫినాలేలో భారతీయ కంటెస్టెంట్ మిస్ ఇండియా నందిని గుప్తా బాలీవుడ్ హిట్ సాంగ్ రామ్ లీలా సినిమాలోని దోల్ భాజే సాంగ్ ప్రేక్షకులు, జ్యూరీ సభ్యుల ప్రశంసలు అందుకున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో నందినీ గుప్తా చేసిన నృత్యం ఆద్యాంతం ఆక్టట్టుకుంది. చివరగా 24 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు అద్దాల మేడలున్నవే, రాను బొంబైకి రానూ.. అనే తెలుగు పాటలకు స్టెప్స్ వేస్తూ అదరగొట్టారు. (చదవండి: అమేజింగ్ అమ్మాయిలు)
ఫొటోలు


ఆసక్తికరమైన ‘పైనాపిల్’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)


Cannes 2025 : కాన్స్ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)


శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)


కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)


శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)


హైదరాబాద్‌లో ‘థగ్ లైఫ్’ చిత్రం మీడియా మీట్ (ఫొటోలు)


విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)


కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)


Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్ బ్యూటీలు (ఫొటోలు)


లిక్కర్ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్ ధ్వజం (చిత్రాలు)
అంతర్జాతీయం

అత్యంత శక్తివంతమైన క్షిపణిని ప్రయోగించిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా వైమానిక దళం అత్యంత శక్తివంతమైన అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) మినట్‌మ్యాన్–3ని బుధవారం ప్రయోగించింది. దేశానికి క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ప్రయోగించిన సమయంలో రీ–ఎంట్రీ వెహికల్ మాత్రమే అమర్చిన ఈ క్షిపణిలో ఎటువంటి ఆయుధాలు లేవని ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. రీ–ఎంట్రీ వెహికల్లో సాధారణంగా అణు వార్‌హెడ్‌ను ఉంచుతారు. గంటకు 15 వేల మైళ్లకంటే ఎక్కువ వేగంతో 4,200 మైళ్లు ప్రయాణించిన ఈ క్షిపణి మార్షల్ ఐల్యాండ్స్‌లోని యూఎస్ ఆర్మీ స్పేస్ అండ్ మిస్సైల్ డిఫెన్స్ కమాండ్‌లోని రొనాల్డ్ రీగన్ బాలిస్టిక్ డిఫెన్స్ టెస్ట్ ప్రాంతానికి చేరుకుంది. దేశ అణ్వాయుద సామర్థ్యాన్ని, సర్వసన్నద్ధతను చాటేందుకే ఈ పరీక్ష చేపట్టామని యూఎస్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ కమాండర్ జనరల్ థామస్ బుస్సెయిర్ చెప్పారు. ఇది రొటీన్‌గా చేపట్టే పరీక్ష మాత్రమే తప్ప, ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో చేపట్టిన చర్య కాదని యూఎస్ మిలటరీ స్పష్టం చేసింది.

భారత్‌కు అండగా ఉంటాం
అబుదాబీ/టోక్యో: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), జపాన్ ప్రకటించాయి. భారత్‌కు అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ అరాచకాలను, ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటాన్ని ప్రపంచ దేశాల నేతలకు తెలియజేయడానికి ఏర్పాటైన అఖిలపక్ష బృందాలు తమ కార్యాచరణ ప్రారంభించాయి. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని బృందం గురువారం యూఏఈ మంత్రి షేక్ నహ్యన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, డిఫెన్స్ కమిటీ చైర్మన్ అలీ అల్ నుయామీతోపాటు ఇతర నేతలతో అబుదాబీలో సమావేశమైంది. జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలో మరో బృందం జపాన్ రాజధాని టోక్యోలో జపాన్ విదేశాంగ మంత్రి తకాషీ ఇవాయాతోపాటు మరికొందరు నేతలతో భేటీ అయ్యింది. ఉగ్రవాదం అనేది కేవలం ఏదో ఒక దేశానికి పరిమితమైన సమస్య కాదని, మొత్తం ప్రపంచానికి ముప్పుగా మారిందని అలీ అల్ నుయామీ ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొత్తం మానవాళికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. జపాన్ మంత్రి ఇవాయా మాట్లాడుతూ... ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి సంతాపం ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఉద్ఘాటించారు. మరోవైపు డీఎంకే ఎంపీ కె.కనిమొళి నేతృత్వంలోని మరో అఖిలపక్ష బృందం రష్యాకు బయలుదేరింది. మొత్తం 33 దేశాలకు అఖిలపక్ష బృందాలను పంపించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అమెరికాలో ఇజ్రాయెల్ రాయబార సిబ్బందిపై కాల్పులు, ఇద్దరు మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఇజ్రాయెల్ రాయబార సిబ్బంది ఇద్దరు హత్యకు గురయ్యారు. నార్త్ వెస్ట్ డీసీలోని యూదుల మ్యూజియానికి సమీపంలో జరిగిన కాల్పుల్లో రాయబార సిబ్బంది అయిన సారా లిన్ మిల్గ్రిమ్, యారోన్ లిచిన్‌స్కీ అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికన్ యూదు అసోసియేషన్ ఇచ్చిన విందు నుంచి తిరిగి వెళ్తుండగా కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల అనంతరం నిందితుడు మ్యూజియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈవెంట్ సెక్యూరిటీ అతడిని వెంటనే అదుపులోకి తీసుకుంది. ఈ సమయంలో ‘ఫ్రీ పాలస్తీనా’ అని నినాదాలు చేశాడు. నిందితుడిని చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్‌గా గుర్తించారు. అతనికి గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. కాల్పుల్లో మరణించిన లిచిన్‌స్కీ రాయబార కార్యాలయంలో రీసెర్చ్ అసిస్టెంట్ కాగా, మిల్గ్రిమ్.. ఇజ్రాయెల్ ఎంబసీలో పనిచేస్తున్న అమెరికా పౌరురాలు. వారిద్దరూ త్వరలో నిశ్చితార్థం చేసుకోవాలనుకున్నారని అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యెచియల్ లెయిటర్ తెలిపారు. వచ్చేవారం జెరూసలేంలో సారాకి ప్రపోజ్ చేయాలని యారోన్ ప్లాన్ చేసుకున్నారని, ఈలోపే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నీచమైన ఉగ్రవాద చర్య: నెతన్యాహుఈ దాడిని అమెరికా, ఇజ్రాయెల్ నేతలు, అధికారులు ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. ఈ దాడిని యూదు వ్యతిరేక, నీచమైన ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. యువ జంటను కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ రాయబార సిబ్బందిపై కాల్పులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ‘యూదు వ్యతిరేకతతో చేసిన హత్యలని స్పష్టమవుతోంది. ఇలాంటి హత్యలు ఇప్పుడే అంతం కావాలి. ద్వేషం, రాడికలిజానికి అమెరికాలో స్థానం లేదు. బాధితుల కుటుంబాలకు నా సంతాపం. ఇలాంటివి జరగడం చాలా విచారకరం’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బంది హత్యను మేమూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పిరికితనం. యూదు వ్యతిరేక హింస. బాధ్యులను గుర్తించి న్యాయం ముందు నెలబడతాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ ప్రతినిధులు నిరంతరం ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని, అయినా ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి లొంగిపోదని ఆ దేశ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ అన్నారు.

ట్రంప్.. మళ్లీ అదే తీరు!
వాషింగ్టన్: కొన్ని వారాల క్రితం శ్వేతసౌధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మీడియా సాక్షిగా తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. సాదరంగా ఆహా్వనించి నిందారోపణల బురద కుమ్మరించడం అగ్రరాజ్యానికి ఏమాత్రం తగదని ఆనాడే ప్రపంచమీడియా తీవ్రంగా మందలించినా ట్రంప్ తన తెంపరితనాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదని బుధవారం మరోసారి రుజువైంది. వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటారనే ఆశతో వైట్‌హౌస్‌కు విచ్చేసిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసాకు ట్రంప్ ఆరోపణలతో స్వాగతం పలికారు. దక్షిణాఫ్రికాలో వేలాది మంది శ్వేతజాతి రైతులను వధించారని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో హతాశుడైన రమఫొసా వెంటనే తేరుకుని ట్రంప్‌కు దీటుగా బదులిచ్చారు. అసలేం జరిగిందంటే? శ్వేతసౌధంలో మీడియా సమక్షంలో సంయుక్తంగా మాట్లాడేందుకు రమఫొసా సిద్ధంకాగా ట్రంప్ మీడియాతో మాట్లాడటం వదిలేసి అక్కడే ఉన్న పెద్ద టెలివిజన్‌లో ఒక వీడియో చూపిస్తాం చూడండని అక్కడి వారందరినీ ఆదేశించారు. ‘‘శ్వేతజాతీయులను చంపేయండి. శ్వేతజాతి రైతులను కాల్చిచంపండి’’ అంటూ దక్షిణాఫ్రికాలో చిన్నపాటి కమ్యూనిస్ట్‌పార్టీ అయిన ఎకనమిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేత జూలియస్ మలేమా పాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. వీడియో ప్లే అవడం పూర్తయ్యాక ట్రంప్ రమఫొసాను ఉద్దేశించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ‘‘ దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు జాత్యహంకారానికి గురయ్యారనేది ఒట్టిమాట. వాస్తవానికి వేలాది మంది శ్వేతజాతి రైతులను ఊచకోత కోశారు. ఆ దేశంలో ఎన్నో ప్రాంతాలు శ్వేతజాతీయుల సమాధి దిబ్బలుగా మారాయి. శ్వేతజాతీయులు పీడనకు, వేదనకు గురయ్యారు. మీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో చాలా మంది శ్వేతజాతీయులు బతుకుజీవుడా అంటూ అమెరికాకు శరణార్థులుగా వలసవచ్చారు. వాళ్లకు మేం ఆశ్రయం కల్పించాం’’ అంటూ ట్రంప్ చెప్పుకుంటూ పోయారు. శ్వేతజాతీయుల అవస్థలు ఇవి అంటూ విదేశీ వార్తాసంస్థల్లో ప్రచురితమైన కథనాల జిరాక్స్ కాపీలను మీడియా ప్రతినిధులకు చూపించి రమఫొసాకు అందజేశారు. వీటికి సంజాయిషీ చెప్పాలని డిమాండ్‌చేశారు. ‘‘ అన్ని హత్యలే. దక్షిణాఫ్రికాలో ఎక్కడ చూసినా మరణాలే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ వైఖరితో ఒక్కసారిగా విసిగిపోయిన రమఫొసా పట్టరాని ఆగ్రహంతో ఉన్నాసరే సంయమనం పాటించారు. హుందాగా వ్యవహరిస్తూ సూటిగా మాట్లాడారు. ‘‘ అసలేంటీ వీడియో?. నేనెప్పుడూ ఈ వీడియో చూడలేదు. ఎక్కడిదీ వీడియో?. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం?’’ అంటూ ట్రంప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ దశాబ్దాలుగా జాత్యహంకారానికి, పీడనకు కోట్లాదిమంది నల్లజాతీయులు బాధితులయ్యారు. లెక్కలేనంత మంది బలయ్యారు. మా దేశంలో శ్వేతజాతీయుల ఊచకోత అనేది పూర్తిగా అబద్ధం. నిజానికి ఆఫ్రికనర్స్గా పిలిచే మైనారిటీ శ్వేతజాతీయులే చాన్నాళ్లు మా దేశాన్ని చెండుకు తిన్నారు. ఆఫ్రికన్ల దీనగా«థను వినే ఓపిక మీకు ఉంటే మా బాధ సరిగ్గా అర్థమవుతుంది.’’ అని రమఫొస సూటిగా సమాధానం ఇచ్చారు. ట్రంప్ చూపిన వీడియోలో ఒక రోడ్డు పక్కన చోట పెద్ద సంఖ్యలో సమాధులు ఉన్నాయి. అయితే ఇవి నిజమైన సమాధులు కావని, 2020లో ఖ్వజూలు–నటాల్ ప్రావిన్సులో ఒక రైతు జంట పొలంలో హత్యకు నిరసనగా ఏర్పాటుచేసిన నకిలీ సమాధులు అని కొందరు వాదించారు. ఉంటే ఇచ్చేవాడినే శ్వేతజాతి, నల్లజాతీయుల్లో ఎవరు పీడనకు గురయ్యారని ఓవైపు ట్రంప్, రమఫొసా వాదించుకుంటుంటే ఒక విలేకరి మధ్యలో కల్గజేసుకుని వందల కోట్ల రూపాయల విలువైన విమానాన్ని బహుమతిగా స్వీకరించడం ఎంత వరకు నైతికతగా అనిపించుకుంటుంది? అని ట్రంప్‌ను సూటి ప్రశ్న వేశారు. దీంతో చిర్రెత్తికొచ్చిన ట్రంప్.. ‘‘ నువ్వో చెత్త రిపోర్టర్‌వు. ఇంత కీలకమైన విషయంపై చర్చిస్తుంటే మధ్యలో నీ విమానం గోల ఏంటి?. నువ్వు అసలు ప్రశ్నలు అడగొద్దు’’ అని అతనిపై ట్రంప్ అరిచాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్‌ను కూల్ చేసేందుకు రమఫొసా మధ్యలో కలుగజేసుకున్నారు. ‘‘ ఖతార్ మాత్రమే కాదు. కావాలంటే మేం కూడా మీకు విమానాన్ని బహుమానంగా ఇస్తాం’’ అని అన్నారు. దీనికి ట్రంప్ వెటకారంగా బదులిచ్చారు. ‘‘ అగ్రరాజ్యమైన అమెరికాకే ఎయిర్‌ఫోర్స్‌వన్‌గా కొత్త విమానాన్ని ఇచ్చే దమ్ముంటే మీరూ ఇవ్వొచ్చు. నేను తీసుకునేందుకు రెడీ’’ అని అన్నారు. వెంటనే రమఫొసా ‘‘ అగ్రరాజ్యంగా ఉండి కూడా మీరు ఇంకొకరి నుంచి తీసుకునే స్థితిలో ఉన్నా.. ఇచ్చే స్థితిలో మేం లేము. మా వద్ద అసలు విమానమే లేదు’’ అని అనేసరికి అక్కడ ఉన్న వాళ్లంతా ఘొల్లున నవ్వేశారు.
జాతీయం

Be alert! మెట్రో రైళ్లలో అమ్మాయిల్ని క్లిక్‌మనిపించి..
క్రైమ్: మనకు తెలియకుండానే మన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షమవుతున్న రోజులివి. మరీ ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. వాళ్లలో కొందరు ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తుండడంతో నిందితులను సైతం పట్టుకోగలుగుతున్నారు. ఆ మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు రోడ్డు మీద వెళ్లే అమ్మాయిలను అసభ్యకరరీతిలో ఫొటోలు తీసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నడిపి ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంగళూరు మెట్రో రైళ్లలో అమ్మాయిలను ఫొటోలు తీసి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో బుధవారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆపై ఆ పోకిరీపై నజర్ వేశారు. చివరకు.. అతన్ని పట్టుకున్నట్లు బెంగళూరు పోలీసులు శుక్రవారం ప్రకటించారు. Bangalore Metro Clicks (@metro_chicks) పేరిట నడిపిన ఆ అకౌంట్లో వందల కొద్దీ అమ్మాయిల చిత్రాలు ఉన్నాయి. ఆ అకౌంట్‌కు ఐదు వేళ మంది ఫాలోవర్స్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అందులో ఉన్న మొత్తం ఫొటోలను తొలగించి.. అకౌంట్‌ను సైతం తొలగించారు. అయితే నిందితుడి వివరాలు వెల్లడించాల్సి ఉంది. తస్మాత్ జాగ్రత్త.. మీ చుట్టుపక్కలా ఇలాంటి కామాంధులు ఉండొచ్చు! జర జాగ్రత్త!!.

‘కోటా’ మరణాలపై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్, ఐఐటీ కోచింగ్ సెంటర్లకు అడ్డాగా ఉన్న రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఏడాది 14 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఏం చేస్తోంది?.. కోటాలో ఆత్మహత్యల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలను తేలికగా తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆత్మహత్యలపై సిట్ ఏర్పాటు చేశామని రాజస్థాన్ సర్కార్ తెలిపింది. తదుపరి విచారణ జులై 14కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా, రాజస్థాన్‌లో కోచింగ్ సెంటర్ హబ్‌గా పేరు పొందిన కోటాలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది.నిరుపేద కుటుంబాల నుంచి పిల్లలు చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోవడమో, తల్లిదండ్రులు చేసిన అప్పు వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది చాలా ఆందోళకరమైన విషయం అంటూ రాజస్థాన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయంటూ నిలదీసింది.

బెట్టింగ్ యాప్స్ స్మోకింగ్ కన్నా డేంజర్: కేఏ పాల్
సాక్షి, న్యూఢిల్లీ: బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పటికే వేల మంది చనిపోయారని, ఇకనైనా ఆ తరహా మరణాలు సంభవించకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్(Betting Apps) వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఆయన వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ బెంచ్ విచారించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేసింది. ఈ పరిణామంపై కేఏ పాల్(KA Paul) మీడియాతో మాట్లాడారు. ‘‘బెట్టింగ్ యాప్స్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.అవసరమైతే రాష్ట్రాలకు కూడా నోటీసులు పంపిస్తామని పేర్కొంది. బెట్టింగ్ యాప్‌ల వల్ల ఇప్పటికే వేల మంది చనిపోయారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని? ప్రశ్నిస్తూ సుప్రీం కోర్ట్ నోటీసులు జారీ చేసింది.. .. సిగరెట్ త్రాగితే హానికరం అని ఉంటుంది. స్మోకింగ్ కంటే మిలియన్ టైమ్స్ డేంజర్.. బెట్టింగ్ యాప్స్. దాదాపు 1,100 లకు పైగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ కోసం ప్రమోషన్ చేస్తున్నారు. బదులుగా కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల భవిష్యత్ లో ఆత్మహత్యలు జరక్కుండా చూడాల్సిన అవసరం ఉంది. మనీల్యాండరింగ్ జరగకుండా ఉండాలంటే.. బెట్టింగ్ యాప్ లను నిషేధించేలా కేంద్రం(Centre) చట్టం తీసుకురావాలి అని కేఏ పాల్ ఆకాంక్షించారు.ఇదీ చదవండి: అద్భుతమైన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు

మోదీపై రాహుల్ ఘాటు విమర్శలు.. జైశంకర్‌కు కొత్త పేరు
సాక్షి,ఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ విదేశాంగ విధానం కుప్పకూలిందని వ్యాఖ్యానించారు.ఈ మేరకు గురువారం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ప్రధాని మోదీపై ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ప్రకటనను ఎందుకు నమ్మారు?.కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతోంది. భారత దేశ గౌరవం విషయంలో మీరు ఎందుకు రాజీ పడ్డారు. పహల్గాం ఉగ్రదాడిపై భారత్‌కు మద్దతిస్తూ.. పాకిస్తాన్‌ను ఏ ఒక్క దేశం ఎందుకు ప్రశ్నించలేదు. భారత్-పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించమని ట్రంప్‌ను ఎవరు అడిగారు?’ అని నొక్కాణించారు.मोदी जी, खोखले भाषण देना बंद कीजिए।सिर्फ इतना बताइए:1. आतंकवाद पर आपने पाकिस्तान की बात पर भरोसा क्यों किया?2. ट्रंप के सामने झुककर आपने भारत के हितों की कुर्बानी क्यों दी?3. आपका ख़ून सिर्फ़ कैमरों के सामने ही क्यों गरम होता है?आपने भारत के सम्मान से समझौता कर लिया! pic.twitter.com/HhjqbjDsaB— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2025 ఈ సందర్భంగా దేశ విదేశాంగ విధానం కుప్పకూలిందని ఆరోపిస్తూ ఆ శాఖను నిర్వర్తిస్తున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్‌కు రాహుల్ కొత్త పేరు పెట్టారు. జైశంకర్ కాదని..జైచంద్ జైశంకర్ అని విమర్శించారు. జై శంకర్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. తాను పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. Will JJ explain:• Why has India been hyphenated with Pakistan?• Why didn’t a single country back us in condemning Pakistan?• Who asked Trump to “mediate” between India & Pakistan?India’s foreign policy has collapsed. https://t.co/m8q2lAFRm4— Rahul Gandhi (@RahulGandhi) May 23, 2025ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిణామలపై కాంగ్రెస్ నేతలు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను జైచంద్ జైశంకర్ అని సంబోధిస్తూ విమర్శిస్తున్నారు.దీంతో జైచంద్ జైశంకర్ పేరు ఎందుకు పెట్టారా అని పలువురు నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ప్రముఖ కవి పృథ్వీరాజ్ రాసో రాసిన ఓ కవిత నుంచి ఈ పేరును తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కవితలో రాజ్‌పుత్ పాలకుడు జైచంద్, మరొక రాజ్‌పుత్ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్‌కు వ్యతిరేకంగా ముహమ్మద్ ఘోరీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పబడింది. రాహుల్‌పై బీజేపీ విమర్శలుఅయితే, రాహుల్ కామెంట్స్‌పై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శలు గుప్పించారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయన నిర్లక్ష్య ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనతో రాహుల్ గాంధీ స్వభావం ఎలాంటిదో చెబుతోంది. రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ అంటే పడకపోవచ్చు. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిపై ఉపయోగించిన భాష దురదృష్టకరం’ అని మండిపడ్డారు.ఆపరేషన్ సిందూర్ ఎంత విజయవంతమైందో మనందరికీ తెలుసు. ప్రతి భారతీయుడు దాని గురించి గర్వపడుతున్నాడు.ప్రపంచం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అభినందిస్తోంది. మన ధైర్య సాయుధ దళాలను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదులను మాత్రమే కాకుండా ఉగ్రవాదాన్ని నిర్మూలించేలా ఆపరేషన్ సిందూర్‌తో సంకేతం పంపించామని’ భాటియా సూచించారు.
ఎన్ఆర్ఐ

జార్ఖండ్‌లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్‌లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్‌పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్‌కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్‌ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్‌లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్‌లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్‌లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్‌పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్‌గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్‌ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

ఎమ్మెల్యే ఆఫీసులో అత్యాచారపర్వం
యశవంతపుర(కర్ణాటక): మహిళను వివస్త్రను చేసి సహచరులతో అత్యాచారం చేయించారని బెంగళూరు రాజరాజేశ్వరినగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మునిరత్న, సహచరులు వసంత్, చెన్నకేశవ, కమల్‌పై అత్యాచారం కేసును ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు నమోదు చేశారు. 2023లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎమ్మెల్యే ఆఫీసులోనే అత్యాచారానికి పాల్పడారు. దీనితో పాటు అంటువ్యాధి సోకేలా వైరస్ ఇంజక్షన్ వేశారు. దీనివల్ల నాకు జబ్బు సోకిందని ఫిర్యాదులో తెలిపింది. పలు రకాలుగా అసభ్యంగా ప్రవర్తించారు అని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగినదానిని ఏకరువు పెట్టారు. ఫిర్యాదులో ఏముంది? ఆమె ఫిర్యాదులో తెలిపిన మేరకు.. నేను బీజేపీ మహిళ కార్యకర్తగా పని చేస్తున్నాను. మొదట రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని విడిపోయా, తరువాత జగదీశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని జీవిస్తున్నా. 2023లో ఎ1 నిందితుడు మునిరత్న నాపై పీణ్య పోలీసులచే వ్యభిచారం కేసు పెట్టించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తరువాత మునిరత్న సహచరులు, నిందితులు నందినిలేఔట్‌కు వసంత్, చన్నకేశవ, కమల్‌తో కలిసి ఆశ్రయనగరకు చెందిన సునీతబాయి ద్వారా నాపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసుస్టేషన్లో హత్యయత్నం కేసును నమోదు చేసి మళ్లీ జైలుకు పంపారు. 2023 జూన్ 11న నా ఇంటికి వచ్చి కేసులను మునిరత్న వాపస్ తీసుకొంటారని చెప్పారు. యశవంతపుర జేపీ పార్క్ వద్దనున్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాలని పిలుచుకెళ్లారు, ఆఫీసులో లైంగికదాడి చేశారు, తరువాత నా ముఖంపై మూత్రం పోశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎవరికైనా చెబితే కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించి మళ్లీ ఇంటి వద్ద వదిలిపెట్టారు అని తెలిపింది. ఆమె ఫిర్యాదుపై ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు విచారణ చేపట్టారు.

ఏలూరులో ఘరానా మోసగాడు
ఏలూరు టౌన్: ఏలూరు ప్రాంతానికి చెందిన ఒక ఘరానా మోసగాడు ఏకంగా బెంగుళూరు, హైదరాబాద్ నగరాలతో సహా ఏలూరు పరిసర ప్రాంతాల్లో అనేక మందిని మోసం చేసి భారీగా డబ్బులు కాజేశాడు. బంగారం బిస్కెట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశాల్లో ఉద్యోగాలు, తన కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించి కోట్ల నగదు కాజేశాడు. ఈ మోసగాడికి పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. పోలీసులు తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు నగర శివారు వట్లూరు ఇంద్రప్రస్థా కాలనీకి చెందిన సత్తెనపల్లి హరీష్ కుమార్ అలియాస్ రిషి, అలియాస్ రిషికుమార్ చాలా కాలంగా హైదరాబాద్‌లోని ప్రగతినగర్, మై హోమ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటూ చార్టర్డ్ అకౌంటెంట్, సొంతగా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉందని చెబుతూ ఆన్లైన్లో పలువురితో చాటింగ్ చేస్తూ పరిచయం చేసుకున్నాడు. ట్రేడ్ బిజినెస్ లోనూ అపారమైన అనుభవం ఉందని పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించేవాడు. ఈ క్రమంలోనే ఏలూరు శనివారపుపేటకు చెందిన ఓ వ్యాపారి పీ. సాయికుమార్ ఇతనికి పరిచయం కాగా విదేశాల్లో ఉద్యోగాలు, గోల్డ్ బిస్కెట్ల వ్యాపారం ఆశ చూపాడు. అతని మాటలు నమ్మిన సాయికుమార్ ఆన్లైన్ ద్వారా రూ. 1 కోటి నగదు చెల్లించాడు. అనంతరం తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేయటంతో సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం హరీష్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తీగ లాగితే డొంక కదిలిందితీగ లాగితే డొండ కదిలినట్లు హరీష్ చేసిన అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో హరీష్ కుమార్ నల్లజర్లకు చెందిన ఒక ఆక్వా వ్యాపారిని ఆన్లైన్లో పరిచయం చేసుకుని గోల్డ్ బిస్కెట్లు, ట్రేడ్ మార్కెట్లో లాభాలు ఇస్తానని నమ్మించి అతని వద్ద విడతల వారీగా రూ. 50 లక్షలు కాజేశాడు. బాధితుడు ఒత్తిడి చేయటంతో ఏలూరు ఇంద్రప్రస్థా కాలనీలో ఉన్న తన ఇల్లు బాధితుడికి అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. కానీ ఇల్లు అప్పచెప్పకుండా తన భార్య, తల్లి, మరదలను ఆ ఇంట్లోనే ఉంచుతూ ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించి ఇబ్బందులు పెట్టాడు. ఇక ఏలూరు శనివారపుపేటకు చెందిన మరో వ్యాపారి వద్ద రూ.2.50 కోట్లు కాజేశాడు. బెంగుళూరులో శశాంక్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతనికి బంగారు బిస్కెట్లు ఇస్తానని నమ్మబలికి రూ.62 లక్షలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బెంగుళూరు సైబర్ క్రైం పోలీసులు ఇటీవలే హరీష్ కుమార్‌ని అరెస్ట్ చేసి అక్కడ సెంట్రల్ జైల్లో ఉంచారు.అనంతరం హైదరాబాద్‌లో ఈ మోసగాడి చేతిలో రూ.1 కోటి 85 లక్షలకు మోసపోయిన రెనిల్ కుమార్ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బషీరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అతన్ని ఈనెల 4న పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. హరీష్ కుమార్‌పై తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేయటంతో అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. ఏలూరులోనే మరికొంతమంది బాధితులు మేమూ మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది.

ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
ఫిలింనగర్(హైదరాబాద్): ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి..మరో యువతితో తిరుగుతున్న యువకుడిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. అర్చిత్ పసుపులేటి అనే యువకుడు 2023 ఓ యువతిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ యువతితో సన్నిహితంగా ఉండడంతో గర్భందాల్చగా అబార్షన్ చేయించాడు. అనంతరం ఆమెను దూరం పెట్టాడు. ఇటీవల అర్చిత్ మరో యువతితో తిరుగుతున్నట్లు తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్చిత్‌తో పాటు అతని సోదరుడు, మామ, మరో ఇద్దరు స్నేహితులపై కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొంది. తనను మానసికంగా వేధిస్తుండడంతో పాటు ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా ప్రవర్తించారని, ఆర్థికంగా దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొంది. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టడమే కాకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు తోసేశారని, అర్ధరాత్రి రోడ్డుపై బలవంతంగా నడుచుకుంటూ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశానని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఆమె పోలీసులకు అందజేశారు. ఈ మేరకు పోలీసులు అర్చిత్‌తో పాటు సోదరుడు, మామ, మరో ఇద్దరిపై బీఎన్ఎస్ సెక్షన్ 69, 79, 89, 351 (3) కింద కేసు నమోదు చేశారు.

ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
ఘట్కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది. సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్‌షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు.
వీడియోలు


కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్


హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు


జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్


ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం


YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu


Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు


First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం


హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు


Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి


West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు