
ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగే ఐదు టెస్టుల (ENG vs IND) సిరీస్‌కు ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు భారత్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) దూరమయ్యే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. టెస్టు మ్యాచ్‌లో షమీ సుదీర్ఘ స్పెల్స్ వేయలేడని బీసీసీఐ (BCCI) వైద్యబృందం చెప్పినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ అధికారి ఒకరు.. షమీ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున నాలుగు ఓవర్లు వేశాడు. షమీ ఒక రోజులో పది ఓవర్ల కంటే ఎక్కువ ఓవర్లు వేస్తాడా.. అన్న విషయం బోర్డుకు, సెలెక్టర్లకు తెలియదు. ఇంగ్లండ్‌లో టెస్టుల్లో పేసర్లు ఎక్కువ స్పెల్స్ వేసే అవసరం ఉండొచ్చు. అక్కడి పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా పేసర్లే వికెట్లు తీస్తారు. అందుకే మేం ఎలాంటి ఛాన్స్‌లు తీసుకోలేం అని నేషనల్ మీడియాకు చెప్పుకొచ్చారు.
మరోవైపు.. ఇంగ్లండ్ సిరీస్‌కు మరో 20 రోజులే సమయంలో షమీపై (BCCI) వైద్యబృందం కూడా ఓ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. షమీ టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్ వేయలేడని బీసీసీఐ వైద్యబృందం యాజమాన్యానికి చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడిని జట్టులోకి తీసుకుంటే.. ఐదు టెస్టులూ ఆడే అవకాశాలు చాలా తక్కువని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ షమీని టెస్టు సీరిస్‌కు ఎంపిక చేయకపోతే అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం లభించవచ్చు. షమీ టెస్టుల్లో చివరిసారిగా ఓవల్‌లో ఆస్ట్రేలియాపై 2023 WTC Finalలో ఆడిన సంగతి తెలిసిందే.
🚨 NO SHAMI IN ENGLAND TOUR 🚨
- Mohammed Shami is unlikely to play in the Test series against England. (Devendra Pandey/Express Sports). pic.twitter.com/tjIlRHFgR7— Tanuj (@ImTanujSingh) May 23, 2025
ఇదిలాఉండగా.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ.. భారత జట్టును శనివారం ప్రకటించనుంది. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో.. ఎవరికి సారథ్య బాధ్యతలు అప్పగిస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. రోహిత్, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి భారత జట్టు ఎంపిక ఉండనుంది అనే చర్చ నడుస్తోంది. ఇక టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా పోటీలో ఉన్నారు. కోహ్లీ, రోహిత్.. స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.