
సౌతాఫ్రికా టీ20 లీగ్ నాలుగో ఎడిషన్ (2025-26) షెడ్యూల్‌ను క్రికెట్ సౌతాఫ్రికా (CSA) బుధవారం విడుదల చేసింది. తొలిసారి ఈ లీగ్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకుండా డిసెంబర్‌లో మొదలవుతుంది. ఈ లీగ్ డిసెంబర్ 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 25 మధ్యలో జరుగనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఎంఐ కేప్‌టౌన్ డర్బన్ సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. గత సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ పార్ల్ రాయల్స్‌తో పోటీతో సీజన్‌ను ఆరంభిస్తుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 27న జరుగనుంది.
🚨 HERE IS THE FULL SCHEDULE OF SA20 2025-26 🚨 pic.twitter.com/tbEIPOMHVk
— Johns. (@CricCrazyJohns) July 9, 2025
డిసెంబర్‌లో ఎందుకు..?
గత మూడు సీజన్లలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ తదుపరి సీజన్‌లో మాత్రం డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. దీని వెనుక బలమైన కారణం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాలో టీ20 వరల్డ్‌కప్ జరునుంది. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం కోసం క్రికెట్ సౌతాఫ్రికా తమ టీ20 లీగ్‌ను ముందుకు జరిపింది. ఐదో సీజన్ నుంచి లీగ్ మళ్లీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో మారుతుందని సీఎస్‌ఏ కమీషనర్ గ్రేమీ స్మిత్ తెలిపారు.
బిగ్‌బాష్ లీగ్‌తో క్లాష్
సౌతాఫ్రికా టీ20 లీగ్ డిసెంబర్‌కు ప్రీ పోన్ కావడంతో ఆసీస్‌లో జరిగే బిగ్‌బాష్ లీగ్‌తో క్లాష్ కానుంది. ఆ లీగ్ కూడా డిసెంబర్‌లోనే ప్రారంభమవుతుంది. బీబీఎల్ 2025-26 డిసెంబర్ 14న మొదలై వచ్చే ఏడాది జనవరి 25 వరకు సాగుతుంది.
ఛాంపియన్స్ లీగ్ పునఃప్రారంభం..?
2014 తర్వాత వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఛాంపియన్స లీగ్ 2026లో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లీగ్‌లో అన్ని దేశవాలీ లీగ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శనలు (విన్నిర్) చేసిన జట్లు పోటీపడతాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్ నుంచి కూడా ఓ జట్టు పోటీ పడే అవకాశం ఉంది.
పేరు మార్పు.. వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్
ఈ సారి ఛాంపియన్స్ లీగ్ పేరు కూడా మారనుందని తెలుస్తుంది. బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా నిర్వహించతలపెట్టిన ఈ లీగ్‌కు వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ అని నామకరణం చేయనున్నట్లు సమాచారం. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌ల్లో ఛాంపియన్లు ఈ లీగ్‌లో పాల్గొంటారని సమాచారం.