
భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నాడు. తన అద్బుత బ్యాటింగ్‌తో టీమిండియా నయా వాల్‌గా పేరు గాంచాడు. అయితే ఫామ్ లేమితో సతమతవుతున్న పుజారా కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉటున్నాడు.
ఈ మధ్య కాలంలో కామెంటేర్‌గా కూడా పుజారా అవతారమెత్తాడు. ఇప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కొనసాగుతున్న ఈ సౌరాష్ట్ర ఆటగాడు.. భారత సెలక్టర్ల నుంచి పిలుపు వస్తే రీ ఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా స్పోర్ట్స్ తక్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా తన ఆల్ టైమ్ ఇండియా టెస్ట్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు.
చతేశ్వర్ తన ఎంచుకున్న జట్టులో ఓపెనర్లగా దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లకు అవకాశమిచ్చాడు. అయితే పుజారా మూడో స్ధానంలో తనకు కాకుండా ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్‌కు చోటు ఇచ్చాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలకు ఛాన్స్ దక్కింది.
ఆరో స్దానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను పుజారా ఎంపిక చేశాడు. ఇక వికెట్ కీపర్‌గా పంత్‌కు కాకుండా లెజెండరీ ఎంఎస్ ధోని అతడు సెలక్ట్ చేశాడు. స్పిన్నర్లగా అనిల్ కుంబ్లే, అశ్విన్.. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, కపిల్ దేవ్‌లకు పుజారా చోటిచ్చాడు. కాగా పుజారా ఎంపిక చేసిన జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, గ్రేట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు చోటు దక్కకపోవడం గమనార్హం.
పుజారా ఆల్-టైమ్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ (వికెట్‌కీపర్), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్ మరియు జస్ప్రీత్ బుమ్రా.