
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు సన్‌రైజర్స్ హైదరాబాద్ బిగ్ షాకిచ్చింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై 42 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది
ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(62), విరాట్ కోహ్లి(43) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ మలింగ రెండు, ఉనద్కట్, దూబే, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్దానానికి పడిపోయింది. టాప్-2లో గుజరాత్,పంజాబ్ కొనసాగుతున్నాయి.
ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో కిషన్ 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు అభిషేక్ శర్మ(17 బంతుల్లో 34), క్లాసెన్(24), హెడ్(17), అనికేత్ వర్మ(9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సుయాష్, ఎంగిడీ,భువనేశ్వర్, పాండ్యా తలా వికెట్ సాధించారు.
చదవండి: WI vs IRE: వెస్టిండీస్ వీరుడి విధ్వంసం.. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!