
శ్రీలంక స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. జూన్ 17న గాలే వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టెస్టు అనంతరం రెడ్ బాల్ క్రికెట్ నుంచి మాథ్యూస్ తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని మాథ్యూస్ శుక్రవారం వెల్లడించాడు.
"జూన్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్ అనంతరం రెడ్ బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే ఈ విషయాన్ని సెలక్టర్లకు తెలియజేశాను. అయితే వైట్ బాల్ ఫార్మాట్‌లో మాత్రం జట్టుకు అవరసమైనప్పుడు కచ్చితంగా సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాను.
ప్రస్తుతం మా టెస్టు జట్టులో చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. అందులో కొంతమంది భవిష్యత్తులో గొప్ప ఆటగాళ్లు అవుతారు. మరో టాలెంటెడ్ యంగ్ క్రికెటర్‌కు అవకాశమివ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాను.
గత 17 ఏళ్లగా శ్రీలంక క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నా కెరీర్ అంతటా మద్దతుగా నిలిచిన శ్రీలంక క్రికెట్‌కు, నా తోటి ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని మాథ్యూస్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. శ్రీలంక తరపున 118 టెస్టులు ఆడిన 44 సగటుతో 8167 పరుగులు చేశాడు. అదేవిధంగా అతడి పేరిట 33 వికెట్లు కూడా విన్నాయి.
2009లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేసిన మాథ్యూస్.. 34 టెస్ట్ మ్యాచ్‌ల్లో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతడు చివరగా శ్రీలంక తరపున టీ20 ప్రపంచకప్-2024లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.
చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. భారత స్టార్ పేసర్ ఔట్?
— Angelo Mathews (@Angelo69Mathews) May 23, 2025