breaking news
Tollywood
-
దేవుడిపై తప్పుడు ప్రచారం.. నటి మాధవీలతపై కేసు
నచ్చావులే, స్నేహితుడా తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసిన తెలుగమ్మాయి మాధవీలత ప్రస్తుతం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమెకు ఇప్పుడు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దేవుడిపై తప్పుడు ప్రచారం చేయడమే ఇందుకు కారణం.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)సోషల్ మీడియాలో సాయిబాబా అసలు దేవుడే కాదని తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేసినందుకుగానూ మాధవీలతపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఈమెతో పాటు పలువురు యూట్యాబర్లని ఆదేశించారు.నటి మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్స్ పెట్టిన పోస్టుల వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వీళ్లందరి సోషల్ మీడియా అకౌంట్స్‌పై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.(ఇదీ చదవండి: ఏపీలో పర్మినెంట్‌గా పెరగనున్న సినిమా టికెట్ ధరలు) -
ఏపీలో పెరగనున్న సినిమా టికెట్ ధరలు.. అది కూడా పర్మినెంట్‌గా!
మరో పదిరోజుల్లో సంక్రాంతి సినిమాల సందడి మొదలు కానుంది. దీంతో నిర్మాతల కోరికమేరకు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచడం చూస్తూనే ఉన్నాం. అయితే, ఏపీలో సింగిల్ థియేటర్లో ఇకనుంచి రూ. 50 టికెట్ ధర పెరగనుంది. ఇదే అంశం గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టికెట్ ధరల గురించి క్లారిటీ ఇచ్చారు.పవన్ కల్యాణ్‌తో చర్చలుసినిమా విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచాలని ప్రతిసారి ఏపీలో జీఓ తీసుకొస్తున్నాం అంటూ నిర్మాత నాగ వంశీ ఇలా అన్నారు. 'ఏపీలో ప్రతిసారి గరిష్టంగా టికెట్ ధర రూ. 50 మాత్రమే పెంచుకునేందుకు అనుమతి తెచ్చుకుంటున్నాం. కానీ, అఖండ-2, హరిహర వీరమల్లు వంటి సినిమాలకు మాత్రం రూ. 100 పెంచాం. తెలంగాణలో ఇప్పటికే మల్టీఫ్లెక్స్‌లలో రూ. 295 టికెట్ ధర ఉంది. సింగిల్ స్క్రీన్లలో రూ. 175 వరకు ఉంది. ఏపీలో కూడా ఇదే విధానం ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కోరాం. ఆయన ఈ అంశంపై పరిశీలిస్తున్నారు. తెలంగాణ మాదిరే ఏపీలో పర్మినెంట్ జీఓ వస్తే ప్రతిసారి రూ. 50 పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరే అవసరం ఉండదు. ఏపీలో కొన్ని సింగిల్ థియేటర్స్‌లలో టికెట్ ధర ఇప్పటికీ రూ. 100 ఉంది మాత్రమే. అదే విధంగా కొన్ని మల్టీఫ్లెక్స్‌లలో కూడా రూ. 150 ఉంది. ఇలాంటి వాటికి మాత్రమే రూ. 50 పెంచేందుకు జీఓ తెచ్చుకుంటున్నాం. మా ప్రతిపాదన ప్రకారం ఏపీలో కొత్త జీఓ తెస్తే.. ప్రతిసారి టికెట్ల రేట్లు పెంచాలంటూ ఎవరూ కూడా ప్రభుత్వాలను కోరరు.' అని చెప్పాడు.సింగిల్ థియేటర్ టికెట్ ధర రూ. 150కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇదే అంశం గురించి మాట్లాడారు. సినిమా విడుదలైన ప్రతిసారి బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని.., ఇకపై ఈ అంశంలో ఒక కొత్త విధానాన్ని రూపొందిస్తామని ఆయన అన్నారు. పాత జీఓ ప్రకారం.. సినిమా బడ్జెట్ ఆధారంగా టికెట్ రేట్లు పెంచుతూ వచ్చామన్నారు. ఇక నుంచి అలా కాకుండా సరికొత్త విధానాన్ని ప్లాన్ చేస్తున్నామన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఏపీలో ప్రతి సింగిల్ థియేటర్లో టికెట్ ధర రూ. 150 ఉంటుంది. చిన్న సినిమాకైనా సరే ఇదే రేటు ఉంటుంది. సినిమా బడ్జెట్ పెరిగింది అంటూ మళ్లీ ప్రభుత్వాన్ని కోరితే ఆ ధర కాస్త ఆకాశాన్ని అంటనుంది.చిన్న సినిమాలకి AP లో 50 పెంచుతున్నాం GO ద్వారా. దానికి కారణాలు ఇవి.అందుకే పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి, ఒక కమిటీ ఫార్మ్ చేసి పర్మినెంట్ GO వచ్చేలా జరుగుతుంది.- Naga Vamsi#AnaganagaOkaRaju Full interview youtube link : https://t.co/2RuecuqHJp@vamsi84 https://t.co/u8yhybkIxm pic.twitter.com/I2hwiXQWO8— idlebrain.com (@idlebraindotcom) December 29, 2025 -
రోజుల తరబడి నటించే మహానటులు ఇంకా పుట్టలేదు: ఇమ్మాన్యుల్
బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు ప్రముఖ నటుడు ఇమ్మాన్యుల్. 'జబర్దస్త్'తో కోట్లాదిమంది అభిమానాన్ని దండిగా గెలుచుకున్న ఇమ్మాన్యుల్.... బిగ్ బాస్‌లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. బిగ్ బాస్ అనుభవాన్ని తాను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని పేర్కొన్న ఇమ్మాన్యుల్... అందులో తనతో పాల్గొన్న సహ పార్టిసిపెంట్స్ తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన ప్రత్యేక అనుబంధం జీవితాంతం ఉంటుందని తెలిపాడు!!బిగ్ బాస్‌లో ప్రతి ఒక్కరూ నటిస్తారని అందరూ అనుకుంటారని, కానీ గంటల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని వివరించాడు. బిగ్ బాస్ జర్నీలో తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా "విజనరీ వౌస్" కి కృతజ్ఞతలు తెలిపాడు. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను తన కెరీర్ లో, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్ కు కంగ్రాట్స్ చెప్పిన ఇమ్మాన్యూల్... తనకు మొదటి స్థానం దక్కలేదనే అసంతృప్తి ఏ కోశానా లేదని అన్నాడు!! -
అల్లు శిరీష్ పెళ్లి ప్రకటన.. అన్నయ్య, వదినపై ప్రేమ
నటుడు అల్లు శిరీష్ కొత్త ఏడాదిలో తను ప్రేమించిన ప్రియురాలు నయనికతో ఏడడుగులు వేయబోతున్నాడు. అక్టోబర్‌లో వారిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా తన పెళ్లి తేదీని శిరీష్ ప్రకటించాడు. 2026 మార్చి 6న తన పెళ్లి జరుగుతుందని ఒక పాటతో చెప్పాడు. అల్లు అయాన్, ఆర్హలతో కలిసి చేసిన ఒక రీల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.సరదాగా ఉన్న ఆ వీడియోలో బాబాయ్ సంగీత్ ఎప్పుడు అంటూ అని వారు అడగ్గా.. మనం దక్షిణాది వాళ్లం కాబట్టి అలాంటి వేడుక ఉండదని శిరీష్ చెప్తాడు. కానీ, పెళ్లి ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం చెప్పలేదు. అల్లు అర్జున్- స్నేహారెడ్డిల వివాహం కూడా 2011 మార్చి 6నే జరిగింది. సెంటిమెంట్‌తో అదే తేదీని శిరీష్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.అల్లు శిరీష్- నయనిక స్నేహం మొదలైన కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. 2023లో వరుణ్‌తేజ్- లావణ్యల పెళ్లి సందర్భంగా హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్ తరపున శిరీష్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
‘ఓ అందాల రాక్షసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా పేరు, మనీ ఉపయోగించుకుని వదిలేశాడు.. బిగ్‌బాస్ 'ఇనయా' కన్నీళ్లు
కొన్ని కథలను వెండితెరపై చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతారు. ఒక్కోసారి అలాంటి జీవితాలే మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇదే కోవలో నటి, బిగ్‌బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా లైఫ్ ఉంది. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకెక్కింది ఇనయ. తర్వాత బిగ్‌బాస్ షోలోనూ అడుగుపెట్టింది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఇనయ సుల్తానా.. ఆ తర్వాత ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే, తనతో బ్రేకప్ అయిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ క్రమంలో ప్రియుడు చేసిన మోసాన్ని బయటపెట్టింది.సినిమాల మీద పిచ్చితో కన్నవారిని, ఇంటిని వదిలేసి సింగిల్‌గా తన జీవితాన్ని కొనసాగిస్తున్న ఇనయా.. గౌతమ్ కొప్పిశెట్టి అనే యువకుడితో ప్రేమలో పడింది. అతను యోగా ట్రైనర్, జిమ్ కోచ్ అని సమాచారం. తనతో కొద్దిరోజులు ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పినట్లు పేర్కొంది. అయితే, తనను ప్రియుడు మోసం చేశాడని ఆమె పేర్కొన్నారు. ఫిజికల్‌గా కూడా కలిశాం..'స్నేహంతో మొదలైన మా పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలం పాటు నాతో బాగానే ఉన్నాడు. మా ప్రేమ విషయం రెండు కుటుంబాలకు తెలుసు.. అందుకే సోషల్‌మీడియా ద్వారా అందరికీ తనను పరిచయం చేశాను. నాకు ఎవరూ లేరనుకున్న సమయంలో అతను పరిచయం అయ్యాడు. ఆపై ప్రేమలో పడ్డాం. కానీ, అతను కేవలం నా మనీ, పేరును మాత్రమే ఉపయోగించుకోవాలనుకున్నాడు. తనతోనే జీవితం అనకున్నాను కాబట్టి ఫిజికల్‌గా కూడా కలిశాం. అతని కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను. తను వ్యాపారం చేస్తానంటే భారీగా డబ్బు సాయం చేశాను. చివరకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న గొల్డ్ గాజులు కూడా తనకోసం అమ్మేశాను. దేవుడా.. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు (కన్నీళ్లు)..ఇప్పటికే ఎన్నో లక్షల రూపాయాలు ఇచ్చాను. నా బ్యాంక్ అకౌంట్ జీరో అయ్యాక వదిలేశాడు. ప్రస్తుతం రూ. 5 లక్షలకు పైగానే అప్పులో ఉన్నాను. ఎలాంటి పనిచేయకుండా ఇంట్లోనే ఉంటాడు. నేను షూటింగ్ వెళ్తున్నా సరే ఒకటే గొడవలు. నాపై అనుమానం పెంచుకున్నాడు. ప్రతిరోజు నరకంగా నా జీవితం మారింది. కేవలం మనీ కోసం మాత్రమే నన్ను ఉపయోగించుకున్నాడు. నేను ఏం చేసినా సరే తప్పుగానే చూస్తాడు. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా ఉండాలి అనిపించింది. విడిపోయాక రెండు నెలలు చాలా బాధపడ్డాను. ఇప్పుడు అలవాటు అయిపోయింది.మదం సినిమాలో అతనితోనే ఇంటిమేట్ సీన్.. ఆరోజే చచ్చిపోయానుమదం సినిమాలో ఇనయా కీలకమైన పాత్రలో నటించింది. జనవరి 1న ఈ మూవీ విడుదల కానుంది. ఇందులోఆమె చాలా బోల్డ్‌గా కనిపించనుంది. అయితే, ఇదే మూవీలో తనను మోసం చేసిన ప్రియుడు కూడా నటించాడని ఆమె తెలిపింది. తనతో బ్రేకప్ అయిన తర్వాత ఒక ఇంటిమేట్ సీన్లో ఇద్దరం కలిసి నటించామని ఆమె ఇలా చెప్పింది. మదం సినిమాలో మూడు ఇంటిమేట్ సీన్లు నాతోనే ఉన్నాయి. ఒక సీన్లో నా పర్సనే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని మొదట ఓకే చెప్పాను. తర్వాత మేము బ్రేకప్ అయ్యాం. అయితే, సినిమా కోసం అతనితోనే ఇంటిమేట్ సీన్లో నటించాను. ఆరోజు ఒక మనిషిగా చచ్చపోయాను. ఆరోజు నిద్ర కూడా పట్టలేదు. ఎందుకు బతుకుతున్నానా అనే ప్రశ్న కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. అని ఇనయా చెప్పింది. -
‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)
-
చీరకట్టుకున్నా భద్రత లేదు.. వీడియో షేర్ చేసిన 'చిన్మయి'
మహిళల దుస్తుల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల తర్వాత కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దుస్తుల అంశం ఏకంగా వర్గాల వారిగా దూషించుకునే స్థాయికి చేరుకుంది. మహిళల అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుందంటూ.. ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదని అసభ్యకరమైన భాషలో శివాజీ చెప్పాడు. దీంతో చిన్మయి, అనసూయ, నిధి అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్ లాంటి సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.తాజాగా చిన్మయి ఒక వీడియోను షేర్ చేశారు. మహిళల వస్త్రధారణ చక్కగా ఉన్నప్పటికీ కూడా భద్రత లేదంటూ సింగర్ చిన్మయి మరోసారి కౌంటర్ ఇచ్చింది. చీరకట్టులోనే గౌరవం ఉంటుందని చెబుతున్న వారి వ్యాఖ్యలకు వీడియోతో తనదైనశైలిలో పేర్కొన్నారు. కేరళకు చెందిన మహిళలు నిండుగా చీర కట్టుకుంటారని, దీంతో వారిని ఎవరూ ముట్టుకోరు, ఇబ్బంది పెట్టరు అని వచ్చిన కామెంట్‌కు చిన్మయి సమాధానం చెప్పింది. కేరళలోనే ఒక మహిళ పరిస్థితి ఇదీ అంటూ వీడియో పోస్ట్ చేసింది.“Women in Kerala never get abused nobody touches them because they wear Sari”Meanwhile. pic.twitter.com/mBPsrukScd— Chinmayi Sripaada (@Chinmayi) December 28, 2025 -
మళ్లీ మాతృగడ్డపై ప్రియాంక మోహన్
బహుభాషా నటీనటులకు అడ్వాంటేజ్ ఏమిటంటే ఏదో ఓ భాషలో అవకాశాలు వస్తూనే ఉండటం. అలా 2016లో వంద కథే హెల్లా అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన శాండిల్ వుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్. ఆ తరువాత తెలుగులో శ్రీకారం, నాని 'గ్యాంగ్ లీడర్' వంటి చిత్రాల్లో నటించే అవకాశాలను పొందారు.ఆ తరువాత వెంటనే కోలీవుడ్ ఆహ్వానించింది. ఇక్కడ డాక్టర్, డాన్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. సూర్య సరసన ఎదర్కుమ్ తుణిందవన్, ధనుష్‌తో కలిసి కెప్టెన్ మిల్లర్ చిత్రాల్లో నటించారు.అలా ఈమె చివరిగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించారు. అదేవిధంగా తెలుగులో ఓజీ చిత్రంలో నటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక మోహన్‌ను మళ్లీ మాతృభాష ఆహ్వానించింది. ఈమె చాలా గ్యాప్ తరువాత కన్నడంలో భారీ చిత్రంలో నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, యువ నటుడు డాలీ ధనుంజయ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్..ఇందులో నటి ప్రియాంక మోహన్ కథానాయకిగా నటిస్తున్నారు. వైశాక్ జే.ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంత్ ఎం.రావ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నటి ప్రియాంక మోహన్ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాను ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా నటనకు అవకాశం ఉన్న పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నట్లు ప్రియాంక మోహన్ పేర్కొన్నారు. -
కొత్త సినిమాలు.. కొత్తరకం ప్రమోషన్స్
ఒకప్పుడు సినిమా గురించి ఓ మాదిరిగా ప్రచారం చేసినా సరే థియేటర్లకు ప్రేక్షకుడు వచ్చేవాడు. యావరేజ్‌గా ఉన్నా గానీ చూసి ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు అలా కాదు రకరకాలుగా ప్రమోషన్స్ చేసినా సరే థియేటర్‌కి వచ్చేందుకు ప్రేక్షకుడు చాలా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ఒకటి కనిపిస్తుంది. కన్నడలో ఇది ఎక్కువగా ఉండగా.. తెలుగులోనూ కొన్ని మూవీస్ ఈ తరహా ప్రయత్నాలు చేసి హిట్ కొట్టాయనే చెప్పొచ్చు. ఇంతకీ ఏంటి విషయం?చిన్న సినిమాని ప్రేక్షకుడికి చేరువ చేయడం చాలా కష్టం. తమ సినిమాలో కంటెంట్ ఉందని, కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తామని చెబితే సరిపోదు. ఆ విషయాన్ని తాము చెప్పకుండా.. వేరే ప్రేక్షకులతోనే చెప్పిస్తున్నారు. అదే 'ఫ్రీ' పబ్లిసిటీ. అంటే రిలీజ్‌కి కొన్నిరోజుల ముందే కొందరు ఆడియెన్స్ కోసం ఉచితంగా షోలు వేస్తున్నారు. అలా సినిమా చూసిన వాళ్లు ఏదైతే చెబుతారో ఆ విషయాలతో మూవీ టీమ్ ప్రమోషన్ చేసుకుంటోంది. రీసెంట్ టైంలో కన్నడ చిత్రం '45'కి ఇలాంటి ప్రయత్నమే చేశారు. గతంలో 'చార్లీ 777'కి కూడా ఇలానే చేసి హిట్ కొట్టారనే విషయం మర్చిపోవద్దు.ఈ ఏడాది తెలుగులోనూ రిలీజైన లిటిల్ హార్ట్స్, కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు కూడా ఉచితంగా షోలు వేయలేదు గానీ విడుదలకు ముందే ప్రీమియర్స్ వేశారు. వాటిలో అద్భుతమైన కంటెంట్ ఉండేసరికి రిలీజ్ రోజు ఉదయానికి మౌత్ టాక్ బలంగా వినిపించింది. దీంతో చాలామంది ప్రేక్షకులు.. చిన్న సినిమాలు అయినా సరే వీటిని థియేటర్లకు వెళ్లి చూశారు. ఆదరించారు. వీటికి మంచి లాభాలు కూడా వచ్చాయి.అయితే ప్రీమియర్లు అన్ని సినిమాలకు వర్కౌట్ కావు. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' లాంటి మూవీకి ప్రీమియర్స్ అనేవి నెగిటివ్ కావడానికి చాలా కారణమయ్యాయి. ఎందుకంటే కంటెంట్‌పై చాలా నమ్మకం ఉండి ప్రీమియర్స్ వేస్తే.. తెల్లారేసరికి అది మౌత్ టాక్ రూపంలో ప్లస్ అవుతుంది. లేదంటే మాత్రం మొత్తానికే నెగిటివ్ కావడం గ్యారంటీ. దీనికి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పవన్ 'హరిహర వీరమల్లు'.రీసెంట్గా క్రిస్మస్కి రిలీజైన 'ఛాంపియన్'కి తప్పితే దాదాపు మిగతా తెలుగు సినిమాలకు ప్రీమియర్స్ వేశారు. ఉచితంగా టికెట్ గివ్ అవేలు కూడా ఇచ్చారు. అయినా సరే కంటెంట్ ఉన్న 'శంబాల' మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇన్నాళ్లు చిన్న సినిమాలకు సరైన ఆదరణ దక్కేది కాదు. రీసెంట్ టైంలో మాత్రం ఫ్రీగా స్క్రీనింగ్, ప్రీమియర్స్‌తో వస్తున్న మౌత్ టాక్ కలిసొస్తోంది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. -
ఐబొమ్మ రవి కేసులో మరో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యు మెంట్లు ఇమంది రవి దొంగిలించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రహ్లాద్ వెల్లేల పేరిట ఇమంది రవి.. పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు తేలింది.బెంగుళూరు నుంచి ప్రహ్లాద్‌ను పోలీసులు పిలిపించారు. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్‌ను పోలీసులు విచారించారు. రవి ఎవరో తనకు తెలియదని ప్రహ్లాద్ పోలీసులకు చెప్పాడు. అయితే, ప్రహ్లాద్ తన రూమ్ మేట్ అని గతంలో రవి.. విచారణలో చెప్పిన సంగతి తెలిసిందే. తన పేరుతో రవి పాన్, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్‌కు గురయ్యానంటూ ప్రహ్లాద్.. పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. రేపటితో(డిసెంబర్ 29, సోమవారం) ఐబొమ్మ రవి కస్టడీ ముగియనుంది.కాగా, ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. పలు విడతలుగా జరుపుతున్న విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబడుతున్నారు.సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా పలు ఆసక్తికర సంగతులను రవి వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే.. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను సైతం పైరసీ చేయగలిగానంటూ కస్టడీ విచారణలో సైబర్ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. -
ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో గెలిచింది వీళ్లే.. అధ్యక్షుడిగా సురేశ్ బాబు
హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ఆఫీస్‌లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియోలు.. ఈ నాలుగు విభాగాల కౌన్సిల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు దీని ఫలితాలు బయటకు వచ్చేశాయి.ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ పోటీపడ్డాయి. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు బలపరుస్తున్న 'ప్రోగ్రెసివ్ ప్యానల్' ఒకవైపు.. సి. కల్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న 'మన ప్యానెల్' మరోవైపు రేసులో నిలిచాయి. చివరకు ప్రొగ్రెసివ్ ప్యానెల్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు.నిర్మాతల సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు, మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందారు. స్టూడియో సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు, మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది, మన ప్యానెల్ నుంచి ఇద్దరు గెలిచారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది, మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించగా ఒకటి టై అయింది. ఓవరాల్‌గా 48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో 31 మంది, మన ప్యానెల్ లో 17 మంది గెలిచారు. తద్వారా ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది.ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. కార్యవర్గ పదవీకాలం ఈ ఏడాది జూలైలోనే ముగిసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు కొత్తవాళ్లు ఎన్నికయ్యారు. వీళ్లంతా 2027 జూలై వరకు పదవుల్లో కొనసాగనున్నారు. ఇప్పుడు ఎవరికి ఏ పదవి అనేది నిర్ణయించారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సురేశ్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా నాగవంశీ, సెక్రటరీగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్ ఎన్నికవగా.. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా భరత్ చౌదరి, స్టూడియో సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా కిరణ్ ఎన్నికయ్యారు. -
అద్భుతమైన కంటెంట్‌తో 'ఓ అందాల రాక్షసి' స్టోరీ
దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, షెరాజ్ మెహదీ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ అందాల రాక్షసి’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 2న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ మూవీని జనవరి 2న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాను. కొత్త ఏడాదిలో ఓ మంచి సినిమా వస్తుంది. ఈ మూవీలో కృతి వర్మ, విహాన్షి హెగ్డే, నేహా దేశ్ పాండే, అఖిల, గీతా రెడ్డి, స్నేహా, ప్రియా దేశ్ పాల్, సుమన్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ ఇలా చాలా మంది అద్భుతమైన పాత్రల్ని పోషించారు. మంచి కంటెంట్‌తో రాబోతోన్న ఈ సినిమా ఆడియెన్స్‌కి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. సందేశాత్మక కథతో ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇందులోని ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. అమ్మాయిలకు నచ్చే చిత్రం అవుతుంది’ అని అన్నారు.కథ, మాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు కథను, మాటల్ని రాశాను. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ మంచి ఫీల్‌తో బయటకు వస్తారు. నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని చేశాం. మా హీరో షెరాజ్ అద్భుతంగా నటించారు. డైరెక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోగా ఇందులో మ్యాజిక్ చేశారు. కృతి వర్మ హిందీలో చాలా ఫేమస్. విహాన్షి చాలా అద్భుతంగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. జనవరి 2న ఈ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు. -
వివాదంలో 'అక్షయ్ ఖన్నా'.. నిర్మాత నోటీసులు జారీ
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఏడాదిలో ఛావా, ధురందర్ చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు దక్కింది. అయితే, బాలీవుడ్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం -3’ నుంచి ఆయన ఆకస్మికంగా తప్పుకోవడంతో అక్షయ్ ఖన్నాకు నిర్మాత మంగత్ పాఠక్ నోటిసులు పంపినట్లు తెలుస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.హిందీ ‘దృశ్యం -2’లో అక్షయ్ ఖన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే పార్ట్-3లో కూడా ఆయనే నటించాలని ముందుగానే ఢీల్ సెట్ చేసుకున్నామని పాఠక్ చెప్పారు. ఆ మేరకు అక్షయ్ ఖన్నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చామన్నారు. అయితే, షూటింగ్ ప్రారంభం కావాల్సిన టైమ్‌లో అక్షయ్ ఖన్నా తమకు షాకింగ్ మెసేజ్ చేశాడని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను నటించడం లేదంటూ ఒక టెక్స్ట్ మెసేజ్ పంపినట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తనను సంప్రదించాలని ప్రయత్నం చేసినప్పటికీ అక్షయ్ అందుబాటులోకి రాకపోవడంతో చేసేదేమీ లేక చట్టపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందని నిర్మాత చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ కోసం అక్షయ్ ఖన్నా రూ. 22 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అక్షయ్ ఖన్నాకి సినిమా అవకాశాలు రానప్పుడు ‘సెక్షన్ 375’ మూవీతో మంగత్ పాఠక్ లైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాతే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘దృశ్యం 2’ భారీ విజయం అందుకోవడంతో ఛావా, ధురంధర్ వంటి సినిమాలు దక్కాయి. ఇదే విషయాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. -
చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!
-
సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే తెలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో ఆంధ్ర కింగ్ తాలూకా, బాహుబలి ద ఎపిక్, అష్టదిగ్బంధనం, రివాల్వర్ రీటా తదితర స్ట్రెయిట్ చిత్రాలతో పాటు వృత్త అనే డబ్బింగ్ బొమ్మ, ఏక్ దివానే కీ దివానియత్ అనే హిందీ మూవీ, స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్ రెండో వాల్యూమ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో రెండు తెలుగు సినిమాలు సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)అమ్మరాజశేఖర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, సుమన్ శెట్టి తదితరులు నటించిన హారర్ కామెడీ మూవీ 'సుగుణ'. 2024లో రిలీజైంది. కాకపోతే ఎప్పుడు థియేటర్లలోకి వచ్చి వెళ్లిందనే సరైన సమాచారం లేదు. ఇప్పుడీ మూవీ సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.గతేడాది రిలీజైన 'బాగుంది' అనే సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. రామ్ కుమార్ దర్శకుడు కాగా కిశోర్ తేజ, భవ్యశ్రీ, పద్మిని, పద్మజయంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీటి ట్రైలర్స్ చూస్తే ఏమంత పెద్ద గొప్పగా లేవు. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాయో చూడాలి?(ఇదీ చదవండి: ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్) -
ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్
కన్నడ హీరో సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఎందుకంటే సొంత భాషలో స్టార్ అయినప్పటికీ మన దగ్గర 'ఈగ'లో ప్రతినాయకుడిగా అదరగొట్టేశాడు. తర్వాత కూడా బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాడు. టాలీవుడ్‌లోనూ కాసోకూస్తో ఫేమ్ సొంతం చేసుకున్నాడు. అయితే తను ఇలా చేస్తున్నప్పటికీ మిగతా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు.. తమని సపోర్ట్ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: 'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్‌గా ప్రకటించిన విజయ్)'మిగతా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు పెద్దగా సపోర్ట్ దొరకట్లేదు. నేను, శివరాజ్ కుమార్, ఉపేంద్ర.. మిగతా భాషల్లో అతిథి పాత్రలు చేశాం. కాకపోతే ఆయా భాషల స్టార్స్ మాత్రం కన్నడలో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. నేను అయితే ఇతర భాషల్లో చేసిన అతిథి పాత్రలకుగానూ డబ్బులే తీసుకోలేదు. వ్యక్తిగతంగా మిగతా ఇండస్ట్రీలోని పలువురు హీరోలని నా మూవీలో అతిథి పాత్రలు చేయమని అడిగా. కానీ వాళ్లు ఆసక్తి చూపించలేదు' అని సుదీప్ చెప్పుకొచ్చాడు.సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మార్క్'. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. కాకపోతే డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే అనిపిస్తుంది. తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించారు కానీ తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు.(ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి) -
'ఛాంపియన్' కలెక్షన్స్.. జోష్ పెంచిన రోషన్
క్రిస్మస్ కానుకగా విడుదలైన ఛాంపియన్ సక్సెస్‌బాటలో నడుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకాంత్ తనయుడు రోషన్.. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్‌లో తన నటనతో రోషన్ మంచి మార్కులు అందుకున్నారు. దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ నిర్మించారు. ఇందులో రోషన్ సరసన అనస్వర రాజన్, సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది తదితరులు నటించారు.కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ‘ఛాంపియన్’’ అంటూ రివ్యూలు రావడంతో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటిరోజు రూ. 4.50 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. మూడురోజుల్లో రూ. 8.89 కోట్లు రాబట్టి క్రిస్మస్ విజేతగా దూసుకుపోతుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటించారు.మహానటి, సీతారామం వంటి భారీ విజయాల తర్వాత స్వప్న దత్ నిర్మించిన ఛాంపియన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, వారు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ పరంగా రాబట్టడం లేదు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ మూవీలో చూపించారు. హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దౌర్జన్యాలకు తెలంగాణలోని గ్రామాలు ఏ విధంగా వణికిపోయాయో ఇందులో చూపించారు. -
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్ డైెరెక్టర్ కూతురు.. వీడియో వైరల్!
ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్‌ను తీసుకొచ్చిన ఆయన రేంజ్‌కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లైఫ్ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్‌ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్‌ను సైతం కన్నీళ్లు పెట్టించింది.మారుతి కూతురు ఎమోషనల్ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు..@DirectorMaruthi Emotional avvadam tho valla Daughter of kuda challa Emotional ayindhi 🥲❤️#TheRajaSaab pic.twitter.com/ZkGVGBp4bU— Rebel Star (@Pranay___Varma) December 28, 2025 -
'శంబాల' బిగ్‌ప్లాన్.. వర్కౌట్ అయితే 'ఆది'కి ఫుల్ డిమాండ్
నటుడు ఆది సాయికుమార్ ఖాతాలో 'శంబాల' సినిమాతో హిట్ పడింది. సరైన విజయం కోసం ఆయన చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే శంబాల సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. బక్సాఫీస్ వద్ద సుమారు రూ. 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ హిందీలో కూడా విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది.తెలుగులో క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదలైన శంబాల చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ చిత్రాలకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉండటంతో జనవరి 1న హిందీ వర్షన్ విడుదల చేస్తున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సరైన ప్రచార వ్యూహంతో చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తే హిందీ బెల్ట్‌లో ఇలాంటి కంటెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. అయితే, నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎంత దూకుడుగా ప్రమోట్ చేస్తారో చూడాలి. శంబాల పార్ట్ -2 ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంది.శంబాల చిత్రాన్ని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఇందులో అర్చన అయ్యర్, స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. అయితే, దర్శకుడు చాలా అద్భుతంగా సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. సినిమా బాగుందని రివ్యూలు వచ్చినప్పటికీ కలెక్షన్స్ విషయంలో దూకుడు చూపించడం లేదు. -
మ్యూజిక్ డైరెక్టర్‌కు జోడీగా నటి 'కయదు లోహర్'
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఇమ్మోర్టల్ చిత్రం ఒకటి. ఇందులో ఆయనకు జంటగా కయదు లోహర్ నటిస్తున్నారు. కింగ్స్టన్ చిత్రం తరువాత జీవీ ప్రకాష్ కుమార్ నటిస్తున్న చిత్రం ఇది. అదేవిధంగా డ్రాగన్ చిత్రం తరువాత కయదులోహర్ నటిస్తున్న తమిళ చిత్రం కూడా ఇదే.. మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మిస్తున్నారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, అరుణ్ రాధాకష్ణన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు.టీజర్‌ను చూస్తుంటే ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథా చిత్రం అనిపిస్తోంది. ప్రేమతో పాటు అనూహ్య సంఘటనలు టీజర్లో కనిపిస్తాయి. ఏలియన్ లాంటి ఒక వింత మనిషి కూడా కనిపించడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. ఇమ్మోర్టల్ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. జీవీ కథానాయకుడిగా మంచి హిట్ చూసి చాలా కాలమైంది. మరి ఈ చిత్రం ఏ మాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి. -
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు
-
'మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి.. అంతే కానీ'.. శివాజీకి టాలీవుడ్ నిర్మాత కౌంటర్
టాలీవుడ్ నటుడు శివాజీ వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హీరోయిన్ల డ్రెస్సులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ యావత్ మహిళా లోకం ఒక్కసారిగా విరుచుకుపడింది. సినీతారలతో పాటు సామాన్యులు సైతం శివాజీపై విమర్శలు చేశారు. ఇటీవల దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై వల్గర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత తాను ఆ రెండు పదాలు మాత్రమే వాడకుండా ఉండాల్సిందని సారీ చెబుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇటీవల శివాజీ కామెంట్స్‌పై కేవలం మహిళలు మాత్రమే కాదు.. నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ రాం గోపాల్ వర్మ, నటుడు ప్రకాశ్ రాజ్ శివాజీ కామెంట్స్‌పై స్పందించారు. అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు.తాజాగా శివాజీ కామెంట్స్‌పై నిర్మాత ఎస్కేఎన్ తనదైన స్టైల్లో పంచ్‌లు వేశారు. పతంగ్ మూవీ సక్సెస్ మీట్‌కు హాజరైన ఎస్కేఎన్ హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడే హీరోయిన్ను చూసి మామూలు డ్రెస్ వేసుకొచ్చారేంటి?..మన తెలుగు అమ్మాయి కాస్తా గ్లామర్‌గా రావాల్సిందన్నారు. మన తెలుగు హీరోయిన్స్, తెలుగమ్మాయిలు మీకు ఏ డ్రెస్ కంఫర్ట్‌గా ఉంటే అదే వేసుకోండి.. ఏది కాన్ఫిడెంట్‌గా అదే వేసుకోండని అన్నారు. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినాల్సిన పని లేదన్నారు. ఏం జరిగినా మన మనసు మంచిదైతే బాగుంటామని.. మన ఇంటెన్షన్ బాగుంటే అంతా మంచే జరుగుతుంది.. అంతే తప్ప మన డ్రెస్సుల్లో ఉండదని పరోక్షంగా శివాజీకి కౌంటరిచ్చారు ఎస్కేఎన్. #Counterఎ డ్రెస్ కంఫర్ట్ గా ఉంటె వేసుకోండి ఎ డ్రెస్ కాన్ఫిడెంట్ గా ఉంటే వేసుకోండి. ఎ బట్టల సతి గాడి మాట వినకండి!!- #SKN @ #Patang Event pic.twitter.com/ye0Knl85uQ— Telugu Bit (@Telugubit) December 27, 2025 -
స్టేజ్ పైనే ఏడ్చిన దర్శకుడు మారుతి.. ఓదార్చిన ప్రభాస్
-
అరుపులు.. కేకలు.. ప్రభాస్ స్పీచ్ తో దద్దరిల్లిన ఈవెంట్
-
ప్రభాస్‌ను చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన డైరెక్టర్.. వీడియో వైరల్
ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మారుతి దర్శకధీరుడిపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళికి ప్రతి డైరెక్టర్ రుణపడి ఉన్నామని తెలిపారు. ఇవాళ చాలామంది పాన్ ఇండియా అని కాల్ ఎగరేసుకుని తిరుగుతున్నామంటే కారణం ఆయనే అన్నారు. నిజంగా టాలీవుడ్‌కు ఇది స్వర్ణయుగమని తెలిపారు.నా లాంటి మిడ్ రేంజ్ సినిమాలు తీసే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టారని మారుతి తెలిపారు. ఒక మిడ్ రేంజ్ హీరోని పాన్ ఇండియా హీరోగా చేసి ఒక పెద్ద కటౌట్ అందించారని అన్నారు. ఒక సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఎంతోమంది స్టార్స్‌ను తయారు చేసిన ఘనత ఆయనదేనన్నారు. అంతేకాకుండా హీరో ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు డైరెక్టర్ మారుతి. ఆయన ఒక శక్తి అని కొనియాడారు. నా వెనకాల ఉన్నది మామూలు శక్తి కాదు.. ఆయన కేవలం యాక్టింగ్ చేసి వెళ్లిపోవడం కాదు.. తన లైఫ్ పెట్టేశారని అన్నారు. సినిమాతో ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేమన్నారు. ఆ ప్రతి రూపమే ఇవాళ మన ఎదురుగా కూర్చుందని ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి పోటీలో నిలిచింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Emotional Moment ♥️😭#Prabhas𓃵 #Maruthi pic.twitter.com/HcS6TB1Gmc— Addicted To Memes (@Addictedtomemez) December 27, 2025 టాలీవుడ్‌కు ఇది స్వర్ణయుగం.టాలీవుడ్ డైరెక్టర్లంతా @ssrajamouli కి రుణపడి ఉన్నాము.. ఒక మిడ్ రేంజ్ హీరోని పాన్ ఇండియా హీరోగా చేసి మాకు ఇచ్చినందుకు – డైరెక్టర్ #Maruthi #Prabhas𓃵 #RajaSaab pic.twitter.com/0HPAVKG6CZ— greatandhra (@greatandhranews) December 27, 2025 -
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు.. రెండు ప్యానెళ్ల ఆసక్తికర పోటీ
ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శిలతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులు పోటీలో ఉన్నారు. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఓటు వేయనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఛాంబర్ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుత ఛాంబర్ కార్యవర్గ పదవి కాలం జూలై లోనే ముగిసిన పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఎన్నికయ్యే నూతన కార్యవర్గం జూలై 2027 పదవుల్లో వరకు కొనసాగుతారు. అధ్యక్ష పదవికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి దగ్గుబాటి సురేష్ బాబు.. మన ప్యానెల్ నుంచి నట్టి కుమార్ పోటీ పడుతున్నారు. ఈ సారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. చిన్న నిర్మాతలు అంతా మన ప్యానల్‌గా.. అగ్ర నిర్మాతలు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా ప్రోగ్రెసివ్ ప్యానల్‌గా పోటీ చేస్తున్నారు. మన ప్యానల్‌ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానల్‌ను అల్లు అరవింద్, దిల్ రాజు , సురేష్ బాబు బలపరుస్తున్నారు.గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల చిత్ర పరిశ్రమ సొమ్మును దోచుకుంటున్నారని చిన్న నిర్మాతల మన ప్యానెల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పదవుల కోసం కాదు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఎన్నికలని బడా నిర్మాతల ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యుల వాదిస్తున్నారు. -
సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ అవ్వాలి: ప్రభాస్
‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె డబ్బింగ్ చెబుతుంటే నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తుండిపోయా. ఈ సినిమాలో నాతోపాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ–మనవడి కథ’’ అని ప్రభాస్ తెలిపారు. ఆయన హీరోగా రూ పొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. శనివారం నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నేను, మారుతి కలిసినప్పుడు అన్నీ యాక్షన్ సినిమాలు అయిపోతున్నాయి... ఫ్యాన్ ్సని ఎంటర్టైన్ చేయాలన్నాను. ఫైనల్‌గా ఈ హారర్ కామెడీ సెట్ అయింది. నేనైతే మారుతిగారి రైటింగ్‌కి ఫ్యాన్ అయిపోయాను. క్లైమాక్స్‌ని పెన్ తో రాశావా? గన్ తో రాశావా? నిజం చెప్పు డార్లింగ్ (మారుతి). కొత్తపాయింట్ ఇది. ఈ సినిమాకి విశ్వప్రసాద్‌గారు హీరో. మూడేళ్లపాటు ఈ మూవీ తీసినప్పుడు.. అనుకున్న బడ్జెట్‌కంటే ఎక్కువ అవుతున్నా మేమైనా భయపడ్డాం కానీ ఆయన భయపడలేదు.. ఏంటి సార్ మీ ధైర్యం (నవ్వుతూ).ఈ మూవీ అనుకున్నప్పుడు తమన్ ఒక్కడే చేయగలడు... ఈ లెవల్ ఆర్ఆర్ చేయగలిగేవారు ఎవరున్నారు మనకి ఇండియాలో అనుకున్నాం. కెమెరామేన్ కార్తీక్‌గారు అద్భుతమైన వర్క్ చేశారు. రామ్–లక్ష్మణ్, సాల్మోన్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగదీశారు. మనకి పదిహేనేళ్ల తర్వాత వినోదం అందిస్తున్నారు మారుతిగారు. మరి... చూసుకోండి. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ అవ్వాలి... మా ‘ది రాజా సాబ్’ కూడా అయిపోతే ఇంకా హ్యాపీ. ఇక వెరీ ఇంపార్టెంట్. సీనియర్ సీనియరే (సంక్రాంతి పోటీలో ఉన్న సీనియర్స్).సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేం... సీనియర్స్ తర్వాతే మేం’’ అని చెప్పారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘రాజా సాబ్’ వెనక బలంగా నిలబడింది ఇద్దరు. ఒకరు ప్రభాస్‌గారు, మరొకరు విశ్వప్రసాద్‌గారు. ఈ సినిమా ఎవర్నీ నిరాశపరచదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌గారు ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. మేము సౌతాఫ్రికాలో చిన్న ఊరిలో షూటింగ్ చేస్తుంటే, అక్కడి వారికి కూడా ప్రభాస్‌గారు తెలియడం మమ్మల్ని సర్ప్రైజ్ చేసింది. రాజమౌళిగారు కష్టపడి చేసినపాన్ ఇండియా ప్రయత్నం మా అందరికీ ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో బిగ్గెస్ట్ స్టార్‌తో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. మూడేళ్లు కష్టపడి నిర్మించాం’’ అని పేర్కొన్నారు. క్రియేటివ్ ప్రోడ్యూసర్ ఎస్కేఎన్, నిర్మాత వై. రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్, నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని తదితరులుపాల్గొన్నారు. -
కొత్త సంవత్సరం... జోరుగా హుషారుగా...
క్యాలెండర్లో కొత్త సంవత్సరం కనిపించే సమయం ఆసన్నమైంది. అలాగే టాలీవుడ్ వెండితెర కూడా ప్రేక్షకులకు జోరుగా హుషారుగా సినిమాలు అందించేందుకు సిద్ధమైంది. ఆడియన్స్‌కు మస్త్ మజానిచ్చే సినిమాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. సో... జనవరిలో సినిమాల జాతర అనొచ్చు. మరి... న్యూ ఇయర్ రోజు ఏయే సినిమాలు రెడీ అవుతున్నాయి... సంక్రాంతి బరిలో నిలిచిన స్టార్స్ సినిమాలు, వాటి ఫైనల్ రిలీజ్ డేట్లపై ఓ లుక్ వేయండి.మీలాంటి యువకుడి కథ శ్రీనందు, యామినీ భాస్కర్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘సైక్ సిద్ధార్థ్’. ‘మీలాంటి యువకుడి కథ’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డిలతో కలిసి సురేష్‌ప్రోడక్షన్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబరు 12న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ డిసెంబరు 12న ‘అఖండ 2’ వంటి భారీ బడ్జెట్ సినిమా విడుదల కావడంతో ‘సైక్ సిద్ధార్థ్’ను జనవరి 1కి వాయిదా వేశారు. ఓ కుర్రాడి ప్రేమ, వ్యాపారం, వ్యాపారంలో అతని ఫెయిల్యూర్, అతని కెరీర్ వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నరసింహా, ప్రియాంకా, రెబెకా శ్రీనివాస్, సుకేష్, వాడేకర్ నర్సింగ్, బాబీ, సాక్షి ఆత్రీ చతుర్వేది ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.వన వీర అవినాష్ తిరువీధుల హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘వన వీర’. శంతను పత్తి సమర్పణలో అవినాష్ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తొలుత డిసెంబరు 26న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ క్రిస్మస్ ఫెస్టివల్‌కు ఆరేడు సినిమాలు విడుదలైన నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌ను జనవరి 1కి వాయిదా వేశారు.అలాగే ఈ సినిమాకు తొలుత ‘వానర’ అనే టైటిల్‌ను అనుకున్నారు. కానీ సెన్సార్ ఇబ్బందులు తలెత్తడం వల్ల ‘వన వీర’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నందు విలన్ రోల్ చేశారు. కోన వెంకట్, సత్య, ఆమని, ‘ఖడ్గం’ పృథ్వీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చారు. ఓ కుర్రాడి ప్రేమ, ఆ కుర్రాడి బైక్ దొంగతనం జరగడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలిసింది.సీఐడీ ఆఫీసర్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘త్రిముఖ’. ఈ సినిమాకు రాజేశ్ నాయుడు దర్శకత్వం వహించారు. శ్రీదేవి మద్దాలి, రమేశ్ మద్దాలి నిర్మించిన ఈ సినిమా జనవరి 2న రిలీజ్ కానుంది. యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, సీఐడీ ఆదిత్య శ్రీనివాస్, రాజేంద్రన్, అషు రెడ్డి ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. వరుస మిస్సింగ్ కేసులను సీఐడీ శివానీ రాథోడ్ ఎలా సాల్వ్ చేసింది? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం అని తెలుస్తోంది. ఈ చిత్రంలో శివానీగా సన్నీ లియోన్ నటించారు.చేయని తప్పుకు నిందిస్తే... బాలనటుడిగా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు. తాను తప్పు చేయకపోయినా ఊరు ఊరంతా హీరోని నిందిస్తే, ఆ హీరో తనపై పడిన నిందను ఎలా తుడిపేసుకున్నాడు? అనే కోణంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఎమ్. మమత, ఎమ్. రాజరాజేశ్వరిల సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి ఈ సినిమాను నిర్మించారు. రాకేశ్ మాధవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ది రాజా సాబ్ రెడీ జనవరి నెల అంటే సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ అంటే తెలుగు సినిమా పండగ. వెండితెరపై ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ అనే చెప్పవచ్చు. ఈ సంక్రాంతి ఫెస్టివల్ సమయంలో ముందుగా రాజా సాబ్‌గా ప్రభాస్ థియేటర్స్‌లోకి వస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపోందిన ఫ్యాంటసీ హారర్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. ఇందులో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించారు. ఈ హారర్ కామెడీ సినిమా ప్రధానంగా తాతా–మనవడి ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో తాతగా సంజయ్ దత్, మనవడిగా ప్రభాస్ నటించారని తెలిసింది. అలాగే వారసత్వపు ఆస్తి అనేది కూడా ఈ సినిమాలోని ప్రధాన కథాంశమని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్పష్టమౌతోంది. మన శంకర వరప్రసాద్‌గారు వస్తున్నారు చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ చిత్రంలో శంకర వరప్రసాద్‌గా చిరంజీవి టైటిల్ రోల్ చేయగా, శశిరేఖ పాత్రలో నయనతార నటించారు. ఈ సినిమాలో చిరంజీవి, నయనతారలు భార్యాభర్తలుగా కనిపిస్తారు. హీరో వెంకటేశ్ కీలక పాత్రలో నటించగా, క్యాథరీన్, వీటీవీ గణేశ్ ఇతర పాత్రల్లో నటించారు.ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఇన్వెస్టిగేషన్ డ్రామా ప్రధానాంశాలుగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేశ్ తొలిసారిగా సిల్వర్‌స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరి కాంబినేషన్లో ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ కూడా ఉంది. ఈ పాట అభిమానులకు వెండితెరపై ఓ ఫీస్ట్ అనే చెప్పవచ్చు. అలాగే చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఈ సినిమాలో విలన్స్‌పై చేసే ఫైట్ కూడా హైలైట్‌గా ఉండనుందని సమాచారం. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ సంక్రాంతి పండక్కి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నారు రవితేజ. ఆ విజ్ఞప్తి ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌కు వెళ్లాల్సిందే. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’. ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. హాస్యనటుడు సత్య, వెన్నెల కిశోర్, సునీల్ ఇతర కీలక పాత్రలో నటించారు. కిశోర్ తిరుమల డైరెక్షన్లో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో రామసత్య నారాయణ అనే పాత్రలో రవితేజ కనిపిస్తారు. రవితేజ, డింపుల్ హయతి భార్యా భర్తలుగా కనిపిస్తారు. ఆల్రెడీ వివాహం చేసుకున్న రామసత్యానారాయణ స్పెయిన్ వెళ్లడం, అక్కడ ఓ అమ్మాయి పరిచయం కావడం, అలా పరిచయమైన అమ్మాయి రామసత్యనారాయణ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయడం వంటి ఆసక్తికర, వినోదాత్మక సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. నారీ నారీ నడుమ మురారి! ఒకే ఆఫీసులో మాజీ ప్రేమికురాలు, ప్రజెంట్ లవర్ ఉంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో చూడొచ్చంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన ఈ వినోదాత్మక చిత్రం జనవరి 14 సాయంత్రం నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.రాజుగారి కథ ఏంటో! ‘అనగనగా ఒక రాజు’ అంటూ ఆడియన్స్‌కు థియేటర్స్‌లో వినోదాల విందు పంచబోతున్నాం అంటున్నారు నవీన్ పోలిశెట్టి. ఈ హీరో నటించిన ఈ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 14న రిలీజ్ కానుంది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ప్రేమ, పెళ్లి, హాస్యం, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ సినిమా తెరకెక్కింది. పెళ్లి నేపథ్యంలో వచ్చే సీన్స్, సాంగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుసాయని తెలిసింది. ఓం శాంతి శాంతి శాంతిః భార్యాభర్తల అనుబంధం, కుటుంబ విలువలు... వంటి అంశాలతో రూపోందిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి:’ ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించారు. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. సృజన్ ఎర్రబోలు, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్, కిశోర్, బాల సౌమిత్రి నిర్మించిన ఈ చిత్రం జనవరి 23న విడుదల కానుంది.ఇలా జనవరి నెలలో రిలీజ్ కానున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.⇒ 2025లో రీ రిలీజ్‌ల హవా జోరుగా సాగింది. చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, కొదమసింహం’, నాగార్జున ‘శివ’, మహేశ్‌బాబు ‘ఖలేజా’, ప్రభాస్ ‘వర్షం’ వంటి టాప్ హీరోల సినిమాల రీ–రిలీజ్లు బాగానే జరిగాయి. ఇక 2026 ఏడాది ప్రారంభంలోనే రీ–రిలీజ్‌ల హవా మొదలైపోయింది. వెంకటేశ్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ సినిమా 2026 జనవరి 1న రీ రిలీజ్ కానుంది.అలాగే మహేశ్‌బాబు హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మురారి’ 4కే వెర్షన్‌ను న్యూ ఇయర్ కానుకగా ఒక రోజు ముందుగానే... అంటే ఈ డిసెంబరు 31న రీ రిలీజ్ కానుంది. అంటే... జనవరి 1న కూడా ‘మురారి’ సినిమా థియేటర్స్‌లో ఉంటుంది. కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సోనాలీ బ్రిందే హీరోయిన్గా నటించారు. ఎన్. దేవీ ప్రసాద్, రామలింగేశ్వరరావు, గోపీ నందిగం ఈ సినిమాను నిర్మించారు.ఆల్కహాల్ వాయిదా?‘అల్లరి’ నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆల్కహాల్’. ఈ కామెడీ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ సినిమాకు మెహర్ తేజ్ దర్శకుడు. ఓ వ్యక్తి జీవితం ఆల్కహాల్ వల్ల ఏ విధంగా ప్రభావితమైంది? అతను ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఎలా ఉండేవాడు? ఆ తర్వాత అతని ప్రవర్తన ఏ విధంగా మారింది? అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. రుహానీ శర్మ, నిహరిక ఎన్.ఎమ్, సత్య, గిరీష్ కులకర్ణి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాను జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. మరి... జనవరి 1న ఈ సినిమా రిలీజ్ కాకపోతే అదే నెలలోనే మరో రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటిస్తారా? లేక వేరే నెలలో డేట్ ఫిక్స్ అవుతుందా? అనే విషయంపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.అనువాదాలూ రెడీఅనువాద సినిమాలు కూడా ఈ జనవరి నెలలో బాగానే ఉన్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాశ్‌రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. కేవీఎన్ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. అలాగే శివ కార్తీకేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ‘పరాశక్తి’ సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో శ్రీలీల, అధర్వ, ‘జయం’ రవి ప్రధాన పాత్రల్లో నటించారు.సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ లీడ్ ల్స్‌లో నటించిన ‘గత వైభవం’ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో రూపోందింది. ఈ సినిమా కన్నడ వెర్షన్ ఆల్రెడీ రిలీజ్ కాగా, తెలుగు వెర్షన్‌ను జనవరి 1న రిలీజ్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రేమ, పునర్జన్మ వంటి అంశాల నేపథ్యంలో పోందిన ఈ సినిమాకు సునీ దర్శకత్వం వహించారు. నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని అనువాద చిత్రాలు కూడా ఈ జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. – ముసిమి శివాంజనేయులు -
'బ్యాడ్ గాళ్స్' షోలు పెంచుతున్నాం: దర్శకనిర్మాతలు
రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బ్యాడ్ గాళ్స్'. ఫణి ప్రదీప్ దర్శకత్వం వహించాడు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. క్రిస్మస్ పండగకు థియేటర్లలోకి వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసింది.దర్శకుడు ఫణి ప్రదీప్(మున్నా) మాట్లాడుతూ .. 'బ్యాడ్ గాళ్స్' నిడివి విషయంలో చిన్నది కానీ కంటెంట్ విషయంలో చాలా పెద్దది. ఆడియెన్స్ మా మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పోటీలో వచ్చినా హిట్ కొడతామని మా నిర్మాతలు నమ్మారు. ఇప్పుడే అదే నిజమైంది. ప్రస్తుతం థియేటర్లు పెంచే పనుల్లో వాళ్లు ఉన్నారు. ఇది అమ్మాయిల కోసం తీసిన చిత్రం. జాతిరత్నాలు మూవీని అమ్మాయిలతో తీస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది అని చెప్పాడు. -
టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే సినిమాలు చూడకండి: ప్రకాశ్ రాజ్
టాలీవుడ్లో ఈ ఏడాది ఏదైనా ఓ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారంటే అది టికెట్ రేట్ల గురించే. పెద్ద సినిమాల రిలీజయ్యే ప్రతిసారి ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. కొన్నిసార్లు అయితే ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఇప్పటికే చాలా అభిప్రాయాలు వినిపించాయి. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మాత్రం టికెట్ ధరలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: చరణ్‌కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్)సీఐటీయూ మహాసభల కోసం వైజాగ్ వచ్చిన ఈ నటుడు.. మీడియాతో మాట్లాడారు. మహిళలపై శివాజీ చేసిన చిల్లర వ్యాఖ్యల గురించి ఘాటుగా స్పందించారు. పురుషుల వల్ల మహిళలకు తరతరాలుగా అన్యాయం జరుగుతోంది, ఓ వేదికపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ విషయంలో అనసూయకే సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఐబొమ్మ రవి దొంగతనం చేశాడని, అది ముమ్మాటికీ తప్పే అని చెప్పుకొచ్చాడు.ఇలా మాట్లాడుతున్న టైంలోనే.. సినిమా టికెట్ ధరలు ప్రేక్షకులకు భారంగా మారుతున్నాయి? దీనిపై మీ స్పందన ఏంటని ప్రకాశ్ రాజ్‌ని అడగ్గా.. అయితే సినిమాలు చూడకండి. ఎవరి వ్యాపారం వాళ్లది అని కుండబద్దలు కొట్టేశాడు. చూస్తుంటే ఈ వ్యాఖ్యలు కచ్చితంగా వివాదానికి దారితీసేలా ఉన్నాయి. ఎందుకంటే ప్రేక్షకుడిని థియేటర్‌కి ఎలా తీసుకురావాలా అని నిర్మాతలు ఆలోచిస్తుంటే.. ఈ నటుడు మాత్రం ఇలా ఆశ్చర్యకర కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా)"Don't watch Films if you think they're Expensive. Cinema is a Business."- #PrakashRaj pic.twitter.com/zYYgejLF96— Movies4u Official (@Movies4u_Officl) December 27, 2025 -
ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా
ఓ రాజ్యం ఉంది. అందులో రాజు, రాణి, మంత్రి, సైనికులు, ప్రజలు.. ఇలా అందరూ ఉన్నారు. రాజుకి అందరూ జేజేలు పలుకుతారు. కానీ సైనికులు లేకపోతే ఆయనకు విలువ ఎక్కడిది? ఇలా ఆలోచించేవాళ్లు ఎంతమంది? టాలీవుడ్ పరిస్థితి కూడా ఇలానే తయారైనట్లు కనిపిస్తోంది! రాజు లాంటి స్టార్ హీరోల మూవీస్‌ని పట్టించుకుంటున్న ప్రేక్షకుడు.. సైనికుడు లాంటి చిన్న సినిమాని లైట్ తీసుకుంటున్నాడు. ఇంతకీ దీనికి కారణమేంటి? ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?ఒకప్పుడు కూడా తెలుగులో స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లు సినిమాలు చేసేవారు. కానీ ఎప్పుడూ పెద్దా చిన్నా అని తేడా ఉండేది కాదు. తెలుగు మూవీ అని మాత్రమే అని మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో అప్పటినుంచి రోజురోజుకీ టాలీవుడ్లో చిన్న చిత్రాల పరిస్థితి అంతకంతకు దిగజారుతూ వచ్చింది. చూసే ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి.ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా మాత్రమే. దీంతో వీకెండ్ వస్తే చాలు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు. చిన్నపెద్దా మూవీస్ అన్నీ చూసేవారు. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు అనగానే ఎలానూ నెలరోజులకు ఓటీటీల్లోకి వచ్చేస్తాయిగా, ఇంట్లో చూసుకోవచ్చులే అని చాలామంది.. ముందే ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే మీడియం బడ్జెట్ చిత్రాల్ని థియేటర్లలో రిలీజ్ చేసినా సరే వాటికి పెద్దగా ఆదరణ ఉండట్లేదు.గీతా ఆర్ట్స్, సితార, మైత్రీ, ఎస్వీసీ లాంటి పెద్ద సంస్థలు నిర్మించే మీడియం బడ్జెట్ సినిమాలకు కాస్తోకూస్తో హైప్ ఉంటుంది. అందుకు తగ్గట్లే వాళ్లు ప్రమోషన్ చేస్తుంటారు. ఖర్చు విషయంలో అస్సలు వెనకాడరు. స్టార్స్‌తోనూ ప్రమోషన్స్ చేయిస్తారు. దీంతో ఆయా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వచ్చే చిత్రాలకు మాత్రం అంతో ఇంతో ఆదరణ దక్కుతోంది. మిగిలిన వాటి వైపు ఆడియెన్స్ చూడటమే గగనమైపోతోంది.మూవీ టీమ్ చేసే కొన్ని పనులు కూడా చిన్న సినిమాలని ప్రేక్షకులు లైట్ తీసుకునేలా చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కావడమే లేటు.. మా మూవీ తోపు, బంపర్ హిట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. కంటెంట్ ఉంటే పర్లేదు లేదంటే మాత్రం.. వీటిని చూసి నమ్మి, థియేటర్‌కి వెళ్లిన చాలామంది.. పలుమార్లు మోసపోయారు. ఇలా జరిగిన తర్వాత చిన్న సినిమా అంటే ఇంతే అని ఓ అభిప్రాయం వాళ్లకు కచ్చితంగా ఏర్పడుతుంది.చిన్న చిత్రాలంటే బడ్జెట్ తక్కువే. అందుకు తగ్గట్లే క్వాలిటీ, కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీల్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడు.. మన నిర్మాతలు తీసే రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలకు ఎందుకు వెళ్తాడు? ఈ విషయంపై దర్శకనిర్మాతలు కచ్చితంగా దృష్టిపెట్టాలి. రెగ్యులర్ కమర్షియల్, థ్రిల్లర్, హారర్ చిత్రాలు తీస్తే.. పరుగెత్తుకుని వచ్చి చూసేసే రోజులు కావివి. కామెడీ కావొచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావొచ్చు సమ్‌థింగ్ డిఫరెంట్ ఉంటేనే ఆడియెన్స్, థియేటర్‌కి వచ్చి చూస్తారు. లేదంటే కనీసం ఆ వైపు కూడా చూడరు.చిన్న సినిమాల్లో స్టార్స్ పెద్దగా ఉండరు. సదరు హీరో లేదా హీరోయిన్ కోసం థియేటర్‌కి వెళ్లి చూడాలా? అని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా అనుకుంటాడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఇంతింత టికెట్ రేట్లు పెట్టి చూస్తారు. వాటికే మొత్తం ఖర్చు పెట్టేస్తే చిన్న చిత్రాలు వచ్చినప్పుడు చూసేందుకు డబ్బులు ఎక్కడుంటాయి?ఈ వీకెండే తీసుకుందాం. ఒకటి రెండు కాదు అరడజనుకు పైగా చిన్న సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. వీటిలో ఒక్కదానికి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. మిగిలిన వాటికి మిక్స్డ్, నెగటివ్ టాక్ వచ్చింది. ఇలా ముకుమ్మడి విడుదల కూడా మీడియం బడ్జెట్ చిత్రాల్ని చంపేస్తోందని చెప్పొచ్చు. ఇలా చాలా చాలా అంశాలు టాలీవుడ్లో చిన్న సినిమాలకు రోజురోజుకీ శాపంగా మారుతున్నాయా అనిపిస్తోంది! -
నా భర్తను ఎందుకు లాగుతున్నారు?: అనసూయ ఫైర్
'ఎలుక తోకను తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు' ఈ సామెత శివాజీకి సరిగ్గా సెట్టవుతుంది. పురుషాహంకారంతో విర్రవీగే శివాజీ బిగ్‌బాస్ హౌస్‌లోనూ లేడీ కంటెస్టెంట్లపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కుతా.. అంటూ దారుణంగా మాట్లాడాడు. ఇప్పుడు దండోరా ఈవెంట్లోనూ హీరోయిన్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో చెబుతూ రాయడానికి వీల్లేని బూతు పదాలు ఉపయోగించాడు.ఎండగట్టిన అనసూయఆయన వైఖరిని ఎంతోమంది హీరోయిన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టారు. యాంకర్ అనసూయ అయితే.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో మా ఇష్టం.. మీరెవరు చెప్పడానికి అని తిరిగి ప్రశ్నించింది. అసలే మదమెక్కిన ఏనుగులా ప్రవర్తిస్తున్న శివాజీ అందరినీ వదిలేసి అనసూయను మాత్రం టార్గెట్ చేశాడు. కొందరు ఈ విషయంలో శివాజీకి వకాల్తా పుచ్చుకుని అనసూయపై మండిపడుతున్నారు.ట్రోలర్స్‌పై ఫైర్అలాంటివారికోసం తాజాగా అనసూయ ఓ పోస్ట్ పెట్టింది. కొందరు పనిగట్టుకుని నా మాటలను కావాలనే వక్రీకరించి, సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. నేను ఎవరికీ వెస్ట్రన్ దుస్తులు వేసుకోమని సూచించలేదు. నేను వేసుకునేలాంటి దుస్తులే ధరించాలని చెప్పలేదు. నా ఇష్టాయిష్టాలను ఎవరిపైనా రుద్దలేదు. నేను చెప్పిందల్లా ఒక్కటే.. ప్రతి మహిళకు తనకు నచ్చిన డ్రెస్‌లు వేసుకునే స్వేచ్ఛ ఉందన్నాను. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉంటాను.నా భర్తను ఎందుకు లాగుతున్నారు?నా మాటల్ని వక్రీకరించి నాపై విషప్రచారం చేస్తున్నారు. నా భర్తను, పిల్లల్ని ఇందులోకి లాగుతున్నారు. మగవాళ్లే కాదు, కొందరు ఆడవాళ్లు కూడా ఒక మహిళగా, తల్లిగా నా క్యారెక్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. కేవలం నేను వేసుకునే బట్టల్ని బట్టి నన్ను తప్పుపడుతున్నారు. మీరెంత విమర్శించినా నేను మరింత బలంగా నిలబడతాను. ఇప్పటికైనా మేల్కొనండి.. ఇకనైనా మీ చుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. హేటర్స్.. మీరు కూడా నా ఫ్యాన్సే!ఎవరి చేతిలోనో కీలుబొమ్మగా మారకుండా సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి. మీ మైండ్లోకి ఎలాంటివి ఎక్కిస్తున్నారో చెక్ చేసుకోండి. ఇది కేవలం బట్టలకు సంబంధించిన విషయం కాదు. స్వతంత్రంగా ఆలోచించే మహిళలను కంట్రోల్ చేయాలనుకుంటున్న పితృస్వామ్య భావజాలం గురించి! చివరగా.. నేను నచ్చకపోయినా నిరంతరం నన్ను గమనిస్తూ ఉన్నారంటే మీరు నా అభిమానుల కిందే లెక్క అని ట్రోలర్స్‌కు చురకలంటించింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) చదవండి: కూలీ మూవీపై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: దర్శకుడు -
బాక్సాఫీస్ వార్ స్టార్ట్! 1000 కోట్ల బ్లాక్ బస్టర్ పై ఫోకస్
-
అనసూయకు 'ప్రకాష్ రాజ్' ట్వీట్.. శివాజీకి 'వర్మ' కౌంటర్
మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పేర్కొన్నారు. ఈ అంశంలో శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన నటి అనసూయ, సింగర్ చన్మయిలను నెట్టంట ట్రోలింగ్‌కు దిగారు. దీంతో వారు కూడా గట్టిగానే తిరిగి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అనసూయకు మద్ధతుగా తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశారు.శివాజీ, అనసూయల మధ్య మొదలైన వివాదం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ ఇలా అన్నారు. సంస్కారి అని పిలవబడే వారిని మొరుగుతూనే ఉండనివ్వండి అంటూ అనసూయకు మద్ధతుగా పోస్ట్ చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి నీచమైన మనస్తత్వం ఇలా బయటపడుతుంది. ఇలాంటి అంశంలో ఇంకా బలంగా నిలబడాలని, అందుకోసం ఎప్పుడూ కూడా అండగా ఉంటామని అనసూయను ట్యాగ్ చేస్తూ పేర్కొన్నారు. శివాజీని రేపిస్ట్‌తో పోల్చిన ఆర్జీవీనటుడు శివాజీ వ్యాఖ్యలపై మరోసారి దర్శకుడు ఆర్జీవీ భగ్గుమన్నారు. ఏకంగా నిర్భయ కేసు రేపిస్టుతో శివాజీని పోల్చడమే కాకుండా మహిళలపై అతను చేసిన వ్యాఖ్యలను వర్మ షేర్ చేశారు. మహిళలపై నిర్భయ రేపిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఇలా ఉన్నాయి. ' రాత్రి 9గంటల తర్వాత పద్ధతిగల అమ్మాయి రోడ్ల మీద తిరగదు. అత్యాచారా కేసుల్లో ఆడవాళ్లదే ఎక్కువ తప్పుంది. ఇందులో మగవారి తప్పు ఎక్కడుంది..?' అని నిర్భయ రేపిస్ట్ పేర్కొన్నాడు.PR Sir ❤️💪🏻🙏🏻 https://t.co/2J11PKzqI5— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 27, 2025This says it all 👍💪 https://t.co/NK7i8ipiHb— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2025 -
మూడేళ్ల తర్వాత ఫ్యాన్స్ కోసం ప్రభాస్.. 'రాజా సాబ్' ప్రీ రిలీజ్ వేడుక ఎక్కడంటే..
ప్రభాస్-దర్శకుడు మారుతి కాంబినేషన్ సినిమా ‘ది రాజా సాబ్’.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికాలో టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నేడు (డిసెంబర్ 27)న సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ గ్రౌండ్లో జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా ఫ్యాన్స్ రానున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్బంగా ఇదే గ్రౌండ్లో 220 ఫీట్ల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.మీడియాకు పూర్తిగా దూరంగా ఉండే ప్రభాస్.. ఫ్యాన్స్ కోసం చాలా కాలం తర్వాత వేదికపైకి రానున్నారు. 'సలార్' సినిమాకు ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ అయింది. ఆ తర్వాత ‘కల్కి’ సినిమాకు మాత్రం బుజ్జిని పరిచయం చేస్తూ సందడిగా డార్లింగ్ కనిపించారు. కానీ, మరే ఈవెంట్లో ప్రభాస్ కనిపించలేదు. బహిరంగ వేదికలపై కనిపించడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు. తమ హీరోను చూసి చాలా ఏళ్లు అవుతుందని అభిమానులు కోరుతూ ఉండటంతో రాజా సాబ్ ఈవెంట్లో ఆయన పాల్గొనున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత ఎస్కేఎన్ కూడా తెలిపారు. ఈ లెక్కన సుమారు 3ఏళ్ల తర్వాత ప్రభాస్ పబ్లిక్ వేదికపైకి రానున్నారు. -
హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)
-
హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'సల్మాన్ ఖాన్' బర్త్‌డే వేడుకలో ధోనీ.. వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నేడు 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ వేడుకలు పాన్వెల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యుల మధ్య జరిగాయి. ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా పాల్గొన్నారు. వారిద్దరూ చాలాకాలంగా మంచి స్నేహితులు కావడంతో తన భార్య సాక్షి, కుమార్తె జివాతో కలిసి ధోనీ వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఫోటోగ్రాఫర్స్ ధోని కారును చుట్టుముట్టారు.సల్మాన్‌ఖాన్ పుట్టినరోజు వేడుకలో కేవలం తన కుటుంబ సభ్యులతో పాటు హైప్రొఫైల్ ఉన్న స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. భారత మాజీ కెప్టెన్ ధోనీ ఉదయం తన వాహనంలో వెళ్తుండగా ఫోటోగ్రాఫర్స్ వెంబడించారు. దీంతో ధోనీ కూడా సున్నితంగా తమ కారుకు దారి ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.#WATCH | Maharashtra | Former Captain of the Indian Cricket Team Mahendra Singh Dhoni leaves after attending actor Salman Khan's 60th birthday party at Panvel. pic.twitter.com/Sb7XA186Eo— ANI (@ANI) December 26, 2025 -
శివాజీ ‘దండోరా’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
పరారీలో 'రకుల్ ప్రీత్ సింగ్' సోదరుడు
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నరంలో రోజు రోజుకు డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (HNEW), మాసబ్ ట్యాంక్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్‌లో డ్రగ్స్ సబ్-పేడ్లర్లను అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా మాసబ్‌ట్యాంక్ పోలీసులు మరోసారి తెలంగాణ ‘ఈగల్ టీం’తో నిర్వహించిన దాడుల్లో భారీగా కొకైన్‌తో పాటు ప్రమాదకరమైన 43గ్రాముల ఎండిఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు జరిపిన ఈ ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ పేడ్లర్లను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారికి రెగ్యులర్ కస్టమర్ల లిస్ట్‌లో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడని తేలింది. వీరి నుంచి అతను రెగ్యులరర్గా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, విషయం తెలుసుకున్న అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా అతను సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారని తెలుస్తోంది. -
'ఛాంపియన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
'దండోరా'కు నష్టం.. వేడుకున్న శివాజీ
నటుడు శివాజీ, నవదీప్, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు నటించిన దండోరా సినిమా బాగుందని చాలామంది అంటున్నారు. కులవివక్ష గురించి దర్శకుడు మురళీకాంత్ చక్కగా చూపారని రివ్యూవర్లు కూడా చెబుతున్నారు. కానీ, థియేటర్లో మాత్రం పెద్దగా ప్రేక్షకులు కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం హీరోయిన్ల దుస్తుల గురించి ఆయన చేసిన డర్టీ కామెంట్సే.. సోషల్‌మీడియాలో ఆయన్ను సమర్థించిన వారందరూ వెళ్లి సినిమా చూసినా భారీ కలెక్షన్స్ వచ్చేవని కొందరు సెటైర్స్ కూడా వేస్తున్నారు. అయితే, తాజాగా దండోరా సినిమా చూడాలని ప్రేక్షకులను శివాజీ వేడుకున్నాడు.దండోరా సినిమా కోసం ప్రతి ఆర్టిస్టు ప్రాణం పెట్టి చేశారని శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే, తన వ్యక్తిగత విషయాల వైపు వెళ్లకుండా ఈ చిత్రాన్ని అందరూ ప్రమోట్ చేయాలని కోరాడు. ప్రతి ఒక్కరూ చూడండి. లేదంటే ఆ నింద తాను మోయాల్సి వస్తుందని తెలిపాడు. తనతో ఏదైన సమస్య ఉంటే మిగిలిన విషయాల గురించి మరోచోట మాట్లుడుకుందామని చెప్పాడు. కావాలంటే తాను కూడా థియేటర్‌కు వస్తానన్నాడు. ఏం మాట్లాడాలన్నా అందరం థియేటర్లోనే మాట్లాడుకుందామన్నాడు.అయితే, దండోరా చిత్ర దర్శకుడు మురళీకాంత్ ఇలా అన్నాడు. 'కొద్దిరోజుల క్రితం జరిగిన వేడుకలో దొర్లిన రెండు మూడు మాటల ఆధారంగా ఈ చిత్రాన్ని ఎవరూ జడ్జ్ చేయకండి. ఈ సినిమా కోసం నేను సుమారు మూడేళ్లు పైగానే కష్టపడ్డాను. నటీనటులు కూడా చాలా కష్టపడ్డారు. మా అందరి శ్రమకు ఫలితం తెరపై కనిపించింది. ఇప్పుడు చాలా సినిమాలు పోటీలో ఉన్నా సరే మా కథపై నమ్మకంతోనే భయపడకుండా సినిమా విడుదల చేశాం' అని దర్శకుడు అన్నారు.Worst fellow still living in 16th century, who thinks Women are subservient to Men I never saw any women advising how Men should dress publicly, why the fuck he can advise If he says similar thing is US, he would be thrown out of movies & public lifepic.twitter.com/cSIhwmo7vt— Ravi @ Prabhas Army (@RaviPrabhas333) December 26, 2025 -
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమితా బైజు ముఖ్యభూమికలు పోషించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ పిక్చర్స్ భారీ బడ్జెట్లో నిర్మించింది. హెచ్.వినోద్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 జనవరి 9వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ప్రస్తుతం ఆయన తమిళగ వెట్రికళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీంతో జననాయకన్ చిత్రాన్ని తన రాజకీయ జీవితానికి తోడ్పడేలా రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. దీంతో జననాయకన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలు ఇప్పటికే విడుదలై విజయ్ అభిమానుల్లో జోష్‌ను నింపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 27న చెన్నైలో కాకుండా మలేషియాలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. విజయ్ సతీమణి పాల్గొంటారా? జననాయకన్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై నుంచి పలువురు సినీ ప్రముఖులు మలేషియాకు వరుస కట్టారు. ముఖ్యంగా దర్శకుడు అట్లి, నెల్సన్ తదితరులు మలేషియాకు మలేషియాకు వెళ్లారు. నటుడు విజయ్ కూడా తన తల్లి శోభ చంద్రశేఖర్, బంధువు, గాయని పల్లవి వినోద్ తదితరులు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి మలేషియాకు చేరుకున్నారు. అదేవిధంగా విజయ్ భార్య సంగీత, కొడుకు జెసన్ సంజయ్ కూడా మలేషియాకు వెళ్లారు. అయితే వీరు జననాయకన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నటుడు విజయ్ ఆయన భార్య సంగీత మధ్య సఖ్యత లేదంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాంటిది సంగీత ఆమె కొడుకు, కూతురు దివ్య సాషా జననాయక్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటే ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి తెరదించినట్లు అవుతుంది. -
మాస్ సాంగ్ కమింగ్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ కలిసి ఓ మాస్ సాంగ్‌లో చిందేశారు. మరి... వారి డ్యాన్స్‌లు ఏ రేంజ్లో ఉన్నాయో తెలియాలంటే ఈ నెల 30 వరకూ వేచి చూడాల్సిందే. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో హీరో వెంకటేశ్ ముఖ్యపాత్ర పోషించారు.అర్చన సమర్పణలో సాహు గార΄ాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ 2026 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘మీసాల పిల్ల...’, ‘శశిరేఖ..’పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం చిరంజీవి, వెంకటేశ్ ఓ మాస్ నంబర్‌కి డ్యాన్స్ చేశారు. ఈపాట ప్రోమోని నేడు రిలీజ్ చేసి, పూర్తిపాటని ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ కమింగ్ అంటూ చిరంజీవి, వెంకటేశ్ డ్యాన్స్ చేస్తున్న పోస్టర్ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
చిన్న సినిమాలు థియేటర్లలోకి ఎప్పుడొచ్చి వెళ్తాయో కూడా తెలీదు. ఒకవేళ కంటెంట్ బాగున్నా సరే స్టార్స్ లేకపోవడం ప్రేక్షకులు కూడా చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించారు. వీటిలో కొన్ని తర్వాత ఎప్పుడో ఓటీటీలోకి వస్తుంటాయి. ఇప్పుడు అలానే ఓ తెలుగు మూవీ కూడా దాదాపు రెండేళ్ల తర్వాత స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులు చూడొచ్చు?సూర్య భరత్ చంద్ర, విషిక హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ 'అష్టదిగ్బంధనం'. 2023 సెప్టెంబరులో థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే దీని గురించి ప్రేక్షకులు పెద్దగా తెలియలేదు. ఇన్నాళ్లకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో ఉచితంగా చూసే అవకాశం రావొచ్చు.(ఇదీ చదవండి: కాబోయే భర్తతో సెలబ్రేషన్.. పెళ్లిపై హీరోయిన్ క్లారిటీ)'అష్టదిగ్బంధనం' విషయానికొస్తే.. ప్రజా సంక్షేమ పార్టీ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు అలియాస్ రాములన్న దగ్గర శంకర్, నర్సింగ్ అనే రౌడీషీటర్స్ పనిచేస్తుంటారు. వచ్చే ఎన్నికల్లో నర్సింగ్, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని రాములన్న ప్రకటిస్తాడు. దీంతో శంకర్‌కి అసూయ ఏర్పడుతుంది. తాను కూడా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని రాములన్నతో చెప్పగా.. రూ.50 కోట్లు ఇస్తే సీటు ఇస్తానని అంటాడు. దీంతో శంకర్.. బ్యాంకు దోపిడీ చేయాలనుకుంటాడు. తన మనుషులతో కలిసి పక్కా ప్లాన్ వేస్తాడు.మరి శంకర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఇతడి స్కెచ్‌లో హీరో హీరోయిన్లు ఎలా ఇరుక్కున్నారు? గౌతమ్(సూర్య భరత్ చంద్ర) గతమేంటి? ఎలక్షన్ ఫండ్ అని రాములన్న ఇచ్చిన రూ.100 కోట్లని శంకర్ ఎక్కడ దాచాడు? ఆ డబ్బు ఎవరు ఎలా కొట్టేశారు? అసలు 'అష్టదిగ్భంధనం' ప్లాన్ వేసిందెవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
హారర్ మూవీ 'అమరావతికి ఆహ్వానం' గ్లింప్స్ చూశారా?
ప్రస్తుతం హారర్ సినిమాల హవా నడుస్తోంది. ఈ ఏడాది విడుదలైన అన్ని హారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించాయి. ప్రస్తుతం అదే తరహాలో ఉత్కంఠభరితమైన కథ, కథనంతో రూపొందిన చిత్రం అమరావతికి ఆహ్వానం. శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. డైరెక్టర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మధ్య ప్రదేశ్‌లోని పలు లొకేషన్స్‌లో షూటింగ్స్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షలతో పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. మా సినిమా టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాత్రలకి ప్రాధాన్యత ఉండేలా దర్శకుడు మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నాయి అన్నారు.దర్శకుడు జివికె మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో రిలీజైన అన్ని హారర్ సినిమాలు మంచి విజయం సాధించాయి. అదే తరహాలో మరో డిఫరెంట్ కథాశంతో వస్తోన్న చిత్రం అమరావతికి ఆహ్వానం. సీనియర్ సినిమాటోగ్రాఫర్ జె ప్రభాకర్ రెడ్డి గారి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయి. పద్మనాబ్ బరద్వాజ్ గారి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్స్‌లో ఆడియన్స్‌ని హారర్ మూడ్ క్యారీ చేసే విధంగా చేస్తుంది అన్నారు. -
మీనా కూతురు ఇప్పుడెలా ఉందంటే? ఫొటో వైరల్
హీరోయిన్ మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ తదితర హీరోలతో వరస సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ లీడ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. ఈమె కూతురు కూడా ఐదేళ్లకే బాలనటిగా చేసింది. ప్రస్తుతం చదువుకుంటోంది. అయితే మీనా కూతురి లేటేస్ట్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.క్రిస్మస్ సందర్భంగా సెలబ్రిటీలు చాలామంది తమ ఇంట్లో సెలబ్రేషన్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. మీనా కూతురు నైనిక కూడా తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన చాలామంది అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా అని అనుకుంటున్నారు. ప్రస్తుతం నైనిక వయసు 14 ఏళ్లు. ఐదేళ్ల వయసున్నప్పుడు దళపతి విజయ్ 'తెరి' (తెలుగులో పోలీసోడు) మూవీలో బాలనటిగా చేసింది. తర్వాత మరేం మూవీస్ చేయలేదు. ఇప్పుడు మాత్రం హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.మీనా విషయానికొస్తే.. 1982లో 'నెంజంగళ్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టింది. తమిళ దిగ్గజ హీరో శివాజీ గణేశన్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించేది. 1990లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అప్పటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. చంటి, అల్లరిపిల్ల, అల్లరి మొగుడు, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం తదితర మూవీస్‌తో ఫేమ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా వెంకటేశ్‌తో చాలా సినిమాలు చేసింది. View this post on Instagram A post shared by Nainika Pilla (@nainika_ted) -
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. క్రేజీ అప్డేట్!
-
రెండో బిడ్డకు జన్మనిచ్చిన 'దేవర' నటి
బుల్లితెర నటి చైత్రరాయ్ గుడ్‌న్యూస్ చెప్పింది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తొమ్మిదో పెళ్లిరోజు సందర్భంగా ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మా జీవితాల్లో ఓ అద్భుతం జరిగింది. మాకు రెండోసారి దేవుడి ఆశీస్సులు లభిచాయి. మా కుటుంబంలోకి మరో చిన్ని యువరాణి అడుగుపెట్టింది.9వ పెళ్లిరోజు.. పరిపూర్ణంమా పెళ్లయి తొమ్మిదేళ్లవుతోంది. మా ఆయన ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా! మేమిద్దరం ఇప్పుడు నలుగురమయ్యాం. ఈ పెళ్లిరోజుతో మా కుటుంబం పరిపూర్ణమైంది అని రాసుకొచ్చింది. ఈ మేరకు చిన్న బుజ్జాయి రాకను తెలియజేస్తూ తన చిట్టి చేతి ఫోటో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు చైత్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్స్.. సినిమాకాగా చైత్ర రాయ్.. కన్నడతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసింది. అష్టాచమ్మా సీరియల్‌తో తెలుగులో పేరు తెచ్చుకుంది. అత్తో అత్తమ్మ కూతురో, దట్ ఈజ్ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు వంటి పలు సీరియల్స్‌లో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీలోనూ యాక్ట్ చేసింది. ఈ నటి 2016లో ఇంజనీర్ ప్రసన్న శెట్టిని పెళ్లి చేసుకుంది. వీరికి 2021లో కూతురు నిష్క శెట్టి పుట్టింది. ఇప్పుడు ఆ చిన్నారితో ఆడుకునేందుకు మరో బుజ్జి పాప వచ్చేసింది. View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17)చదవండి: సంజనాను ఆంటీ అనేసిన శివాజీ -
ఎన్నికల కోసం 'దిల్ రాజు' మాయ మాటలు: నట్టి కుమార్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. డిసెంబర్ 28న హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ఆఫీస్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియోలు ఈ నాలుగు సెక్టార్ల కౌన్సిల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఈ ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. ఎన్నికల నిర్వహణాధికారిగా దుర్గాప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే, ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ మధ్యే వార్ ఉండనుంది. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు బలపరుస్తున్న 'ప్రోగ్రెసివ్ ప్యానల్' ఒకవైపు ఉంటే.. సి. కళ్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న 'మన ప్యానెల్' మరోవైపు రేసులో వుంది. ఈ క్రమంలో తాజాగా మన ప్యానెల్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు.మన ప్యానెల్ నుంచి చదలవాడ శ్రీనివాసరావు ఇలా అన్నారు. ఆదివారం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఛాంబర్లో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్లాలి. గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమ అదుపు తప్పింది. గిల్డ్ అని పెట్టి ఇష్టారీతిన కొందరు వ్యవహరిస్తున్నారు. 20 రోజుల పాటు కార్మికులకు పనిలేకుండా చేశారు. నిజానికి గిల్డ్ సభ్యులే సినిమా చిత్రీకరణలు ఆపారు. వారు తమ స్వార్దంగా వ్యవహరించడంతోనే ఇబ్బందులు వచ్చాయి. ఛాంబర్ సభ్యుల పేరుతో ముఖ్యమంత్రులతో ఫోటోలు దిగాలనే ఆలోచనతో మాత్రమే వారు ఉన్నారు. చిత్ర పరిశ్రమ బాగు అనేది వారికి పట్టలేదు. సీఎం రేవంత్‌రెడ్డి యోగ్యులు కాబట్టి కార్మికుల సమస్యను పరిష్కరించారు. వాస్తవానికి ఫిల్మ్ ఛాంబర్ చేయాల్సిన పనిని సీఎం పూర్తి చేశారు. చిన్న హీరోలను బతకనివ్వడం లేదు. క్యూబ్, యుఎఫ్ఓ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. చిత్రపురికి సమస్య వస్తే చిన్న నిర్మాతలమే సపోర్ట్‌గా నిలిచాం. వారందరే మన ప్యానెల్ తరపున పోటీ చేస్తున్నాం. అందరికీ అర్ధరాత్రి కూడా అందుబాటులో ఉంటాం.' అని ఆయన అన్నారు.రామానాయుడు ఇంటిని పబ్‌కి ఇచ్చారు: సి కల్యాణ్ కామెంట్స్ప్రోగ్రెసివ్ ప్యానల్ (దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు) పేరుతో మన వారసత్వం మన స్వాభిమానం అంటూ ఏదో ప్రకటనలు వేశారు. నిజానికి వారికి ఎలాంటి స్వాభిమానం లేదు. వారు వ్యక్తిగత లాభం కోసం ఏదైనా చేస్తారు. మేము మొదటి నుంచి చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉన్నాం. వాస్తవానికి వారిని రెండేళ్ల క్రితం మేము సపోర్ట్ చేసి గెలిపించాము. చదలవాడ నాడు అందరం కలిసి వెళదామని చెప్పటంతోనే సపోర్ట్ చేశాం. కానీ, పదవుల్లోకి వచ్చి కూర్చొన్నారు తప్ప పరిశ్రమ కోసం ఏమీ చేయలేదు. వారి నుంచి చిన్న సినిమాలకు ఎలాంటి సపోర్ట్ లేదు. గిల్డ్ సభ్యులు చెప్పెవన్నీ అబద్దాలే. దామోదర్ ప్రసాద్ కార్మికులకు ఏమి చెయలేకపొయాడు. గిల్డ్ ప్రొడ్యూసర్స్ కోసం మాత్రం చాలా చేశాడు. కామెడీగా లేబర్ కమీషనర్ వద్దకు నిర్మాతలు వెళ్లటం వీరి హయాంలోనే జరిగింది. విభజించు పాలించు అన్నట్టుగా గిల్డ్ సభ్యులు వ్యవహారశైలి ఉంది. ఛాంబర్ బిల్డింగ్ గురించి ఐకానిక్ టవర్ అంటూ కామన్సెన్స్ లేకుండా గిల్డ్ సభ్యులు మాట్లాడుతున్నారు. అది ఏ ఒక్కరిది కాదు. దాంట్లో మనం అద్దెకు ఉంటున్నాం. అది సినిమా ఇండస్ట్రీది కానేకాదు. సెకెండ్ ఫ్లోర్లో కొందరికి ఆఫీస్‌లు ఉన్నాయి కాబట్టి స్వార్దం కోసం ఎదెదో మాట్లాడుతున్నారు. ఫిలిం నగర్ సోసైటీ ఆస్తి అది. రామానాయుడు నివశించిన ఇంటిని పబ్‌కి ఇచ్చారు. బాధగా ఉంది. చిన్న నిర్మాతలందరు మన ప్యానెల్ వైపే ఉన్నారు. సినీ కార్మికులు, కృష్ణానగర్ ఆర్టిస్ట్‌లు బతకాలంటే చిన్న సినిమాలే ముఖ్యం. ఓటిటి విషయంలోనూ గిల్డ్ వారు మాయామాటలు చెప్పారు. టిక్కెట్ రేట్లు అడిగేది వారే.. వాటికి వ్యతిరేకం అనేది కూడా వారే కావడం విశేషం. నాలుగు సెక్టార్స్‌లలో మన ప్యానెల్ ఉంది. ఓట్లేసి గెలిపించండి' అని కల్యాణ్ అన్నారుదిల్ రాజు చెప్పేవి అన్నీ మాయ మాటలే: నిర్మాత నట్టికుమార్'గిల్డ్ నుంచి చిత్ర పరిశ్రమలోని వారికి ఎలాంటి సపోర్ట్ లేదు. గెలిచినవారు మీటింగ్‌లకు కూడా రాలేదు. పదిమంది స్వార్దం కోసం గిల్డ్ డబ్బు వాడారు. మేము 1600 మంది సభ్యుల మెడిక్లెయిమ్ కోసం కృషి చేశాం. దిల్ రాజు ఎన్నికలు కోసం మాయ మాటలు చెప్పారు. అతనికి చేతకాక ఏడాది తరువాత దిగిపోయారు. నాగవంశీ మాత్రం సినిమాలు తీయని వారికి ఎందుకు మెడిక్లెయిమ్ ఇవ్వాలని అంటాడు. సీనియర్లపై గౌరవం ఉండాలి. చిన్న సినిమాలకు థియేటర్స్ కావాలని ఎప్పటినుంచో అడుగుతున్నాం. ఛాంబర్ పదవుల్లో ఉండి.. వారి స్వార్దం కోసమే దామోదర్ ప్రసాద్ పని చేశారు. మన ప్యానెల్ తరపున మెడిక్లెయిమ్‌తో పాటు చిన్న సినిమాకు ఐదో షో ఉండేలా కృషి చేస్తాం. చిత్రపరిశ్రమలో దిల్ రాజు, వంశీ, సుప్రియ ఎవరికైనా సాయపడ్డారా..?' అంటూ నట్టి కుమార్ ప్రశ్నించారు. -
తగ్గేదేలే.. అనసూయ గారూ.. తొందరలోనే నీ ఋణం తీర్చుకుంటా
-
X లోకి ప్రభాస్ ఎంట్రీ ఫిక్సయ్యిందా..!
-
శివాజీ డర్టీ 'సామాను' గోల 'పెద్ది'పై పడిందా..?
'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్లు కొంచెం డ్రెస్ సెన్స్ పాటించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రామ్‌చరణ్ పెద్ది సినిమాను కూడా తాకుతున్నాయి. ఇంతకీ శివాజీ ఏమన్నాడంటే.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందంటూ.. మీ అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదమ్మా అని సూక్తులు చెప్పాడు. అయితే, సామాజిక కార్యకర్తలతో పాటు సినీ రంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తనతప్పు తెలుసుకుని సారీ చెప్పాడు.అయితే, శివాజీ చేసిన డర్టీ సామాను వ్యాఖ్యలు అటు తిరిగి ఇటు తిరిగి పెద్ది సినిమాపై పడ్డాయి. రీసెంట్గా భారీ హిట్ అయిన చికిరి పాట తెరపైకి వచ్చింది. ఈ సాంగ్‌లో కూడా 'సరుకు సామాను' అనే పదాలను రచయిత వాడారు. పనిలో పనిగా ఇందులో ఉన్న మరికొన్ని ఇలాంటి పదాలే బయటకు తవ్వారు. ఈ పాటలో ఒకచోట 'ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే 'దీనక్క'.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా' అంటూ రాసుకుంటూ పోయాడు. సరుకు సామాను అనే పదాన్ని వాడుకలో ఉపయోగిస్తాం కదా అని కొందరు పక్కన పెడితే.. దీనక్క అనేది అభ్యంతరంగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో శివాజీతో పాటు పెద్ది సాంగ్ రచయితను కూడా ఏకిపారేస్తున్నారు.రవితేజ నటించిన మాస్ జాతరలో కూడా ఇలాంటి పదాలే కనిపించాయి. శ్రీలీలతో 'ఓలే ఓలే' సాంగ్ కోసం స్టెప్పులేసిన రవితేజ కూడా ఆ పాటకు అభ్యంతరం చెప్పలేదు. చెప్పలేని పదాలతో ఎక్కడపడితే అక్కడ బూతులతో రెచ్చిపోయారు. ఓ ఇంటర్వ్యూలో కూడా మేకర్స్ ఆ పాటను సమర్థించుకోవడం మరింత నీచం. శివాజీ వ్యాఖ్యల తర్వాత ఇలాంటి డర్జీ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి సాంగ్స్, డైలాగ్స్ వచ్చినప్పుడు శివాజీ అడ్డుచెప్పలేదు ఎందుకు.. అతని వ్యాఖ్యలను సమర్థించే వారు ఈ డర్టీ సంప్రదాయాన్ని కూడా మెచ్చుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.“సరుకు సామాను”………ఈ సాంగ్‌లో వాడారు కదా, అప్పుడు కూడా అందరూ రియాక్ట్ అయ్యారా?జస్ట్ అనిపించింది… ఎవరు అయినా రియాక్ట్ అయితే మంచిదే……#justasking pic.twitter.com/dQJJu6pcvF— 9iMedia (@9iMediaNews) December 23, 2025 -
క్రిస్మస్ వేడుకల్లో సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
రవితేజ, బింబిసార డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్..?
-
శ్రీకాంత్ తనయుడి ఛాంపియన్.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.(Champion Movie Box Office Collections)తొలిరోజే ఛాంపియన్ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.4.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు ఛాంపియన్ మూవీ పోస్టర్‌ను పంచుకుంది. కాగా.. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్‌పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు.A HOUSEFULL festive day at the cinemas ❤️🔥People’s #CHAMPION opens big with 4.5 CRORE+ worldwide GROSS on Day 1 💥Experience the historic journey on the big screen now.@IamRoshanMeka @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1 @MickeyJMeyer @AshwiniDuttCh… pic.twitter.com/jL0uSEGcjm— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 26, 2025 -
‘డైమండ్ డెకాయిట్’ మూవీ హీరోయిన్ మేఘన (ఫొటోలు)
-
స్టార్ హీరో సినిమా వేడుక.. మలేషియాకు ఫ్యాన్స్ క్యూ
చెన్నై ఎయిర్పోర్ట్ కిటకటిలాడుతుంది. మలేషియాకు వెళ్లే విమానాలు ఫుల్ అయిపోయాయి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? విజయ్ 'జన నాయగన్' కోసం. తమిళ టాప్ హీరో విజయ్ నటించిన ఈ మూవీ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్ స్టేడియం (Bukit Jalil Stadium)లో డిసెంబరు 27న జన నాయగన్ మూవీ వేడుక నిర్వహించనున్నారు. దీంతో తమిళనాడు నుంచి ఆయన ఫ్యాన్స్ భారీగా మలేషియాకు ప్రయాణం అయ్యారు. దీంతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ కోసం భారీగా క్యూ కట్టేశారు.మలేషియాలో తమిళ సినిమాలకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా విజయ్‌కు, విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆడియో వేడుకను అక్కడ నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకర్షించవచ్చని మేకర్స్ ప్లాన్ చేశారు. బుకిట్ జలీల్ స్టేడియం దక్షిణాసియాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటి. ఇందులో 90వేల మందికి పైగా సీటింగ్ సామర్థ్యం ఉంది. ఈ కార్యక్రమంలో విజయ్‌తో పాటు చిత్ర యూనిట్, సంగీత దర్శకుడు అనిరుధ్ పాల్గొననున్నారు. దీంతో ఇప్పటికే టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. ఈ వేడుకను పూర్తిగా సినిమా, సంగీతానికే పరిమితం చేయాలని మలేషియా పోలీసులు ఇప్పటికే స్పష్టమైన నియమాలు పెట్టారు. రాజకీయ ప్రసంగాలు, చిహ్నాలు అక్కడ కనిపించకూడదని నిషేధించారు. Crowd at Chennai Airport Immigration 🤯 — Only for #JanaNayagan Audio Launch 🔥 pic.twitter.com/dtW5hlsvgO— VCD (@VCDtweets) December 26, 2025 -
టాలీవుడ్ లవ్ బర్డ్స్.. న్యూ ఇయర్ పార్టీకి రెడీ..!
టాలీవుడ్ ప్రేమ జంటల్లో విజయ్- రష్మిక జోడీ గురించి మనందరికీ సుపరిచితమే. చాలా ఏళ్లుగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాదిలోనే నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. పరోక్షంగానైతే హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరలైంది.ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన, రష్మిక మందన్నా మైసా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేశాయి. అయితే ప్రస్తుతం షూటింగ్‌కు కాస్తా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా క్రిస్మస్, న్యూ ఇయర్ ఉండడంతో ఈ జంట వేకేషన్ ప్లాన్ చేశారు. నూతన ఏడాది వేడుకల కోసం ఫారిన్ ట్రిప్‌కు బయల్దేరారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెకేషన్ ట్రిప్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే విజయ్, రష్మిక హైదరాబాద్ విమానాశ్రయంలో విడివిడిగా కనిపించారు. దీంతో వీరిద్దరు కలిసే వేకేషన్‌కు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.పెళ్లి గురించి ఇటీవల రష్మికతో ప్రస్తావించగా.. సమయం వచ్చినప్పుడు తానే అందరికీ చెప్తానని తెలిపింది. నిశ్చితార్థ వార్తలను కొట్టిపారేయలేదు.. అలాగని డైరెక్ట్‌గా చెప్పలేదు నేషనల్ క్రష్. ఇటీవలే ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం మైసా చిత్రంలో నటిస్తోంది. గతంలో విజయ్, రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. -
'అమ్మ' పేరుతో మోసం.. జీవీ ప్రకాష్‌కు నెటిజన్ల మెసేజ్‌లు
దక్షిణాదిలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాష్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎవరైనా సాయం చేయమని తనని కోరితే వెంటనే స్పందిస్తారు కూడా.. గతంలో విపత్కర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఆర్థిక సాయం చేయమని కోరితే ఆయన దాతృత్వ వైఖరి చాలాసార్లు చూపించారు. దురదృష్టవశాత్తు, ఆయన చేస్తున్న సాయం ఆన్లైన్ మోసానికి గురి చేసింది. దీంతో ప్రకాష్ రూ. 20 వేలు పోగొట్టుకున్నారు.ఎం జరిగిందంటే..?ఎక్స్ పేజీలో @prasannasathis అనే ప్రొఫైల్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి జీవీ ప్రకాష్‌ను మోసం చేశాడు. చాలా కాలం క్రితం మరణించిన ఒక వృద్ధ మహిళ ఫోటోను షోషల్‌మీడియాలో పోస్ట్ చేసి, ఆమె తన తల్లి అని పేర్కొన్నాడు. ఆపై తన తండ్రి కూడా చాలా ఏళ్ల క్రితమే బాధ్యత లేకుండా కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తల్లి మాత్రమే కుటుంబాన్ని చూసుకుంటుందని కట్టుకథ అల్లాడు. అయితే, ఆమె కూడా మరణించారని తన అంత్యక్రియలను పూర్తి చేయడానికి తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూ ఆర్థిక సహాయం చేయాలని జీవీ ప్రకాష్‌ను కోరాడు.ఆ వ్యక్తి చెప్పిన స్టోరీకి చలించిపోయిన జీవీ ప్రకాష్ వెంటనే రూ. 20 వేలు గూగుల్ పే చేశారు. అయితే, కొందరు నెటిజన్లు ఆ ఫోటోను డీకోడ్ చేశారు. గూగుల్ ద్వారా ఆ ఫోటో చాలా ఏళ్ల క్రితం నాటిదని పేర్కొన్నారు. ఒక ఫేక్ స్టోరీ చెప్పి మోసం చేశాడని జీవీ ప్రకాష్‌కు మెసేజ్‌లు పంపారు. దీంతో వెంటనే అతని నెంబర్‌కు కాల్ చేసినప్పటికీ రెస్పాండ్ కాలేదని ప్రకాష్ చెప్పుకొచ్చారు. అమ్మ పేరు చెప్పుకొని సాయం కోరి ఇలా మోసం చేయడం ఏంటి అంటూ నెటిజన్లు భగ్గుమన్నారు. అడిగిన వెంటనే సాయం చేసిన ప్రకాష్‌ను మెచ్చుకుంటున్నారు. ఇలాంటి మోసాలు చూసిన తర్వాత సాయం చేసే వ్యక్తులు కూడా మరోసారి ముందుకు రారని గుర్తుచేస్తున్నారు.நானும் தங்கச்சியும் என்ன பண்ணுவது தெரியமால் உல்லோம் எங்களுக்கு இறுதி சடங்கு பண்ணுவதாருக்கு உதவி பண்ணுங்க அண்ணா @gvprakash 🙏🏻🥲 https://t.co/iXJWnwQpR6— Mom Little King.♥️ (@prasannasathis) December 25, 2025pic.twitter.com/TRfgsdw6wA— G.V.Prakash Kumar (@gvprakash) December 25, 2025 -
ఈ ఏడాది మధుర జ్ఞాపకాలను షేర్ చేసిన సమంత.. (ఫోటోలు)
-
‘శంబాల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రాజ్‌తో పెళ్లి తర్వాత తొలి క్రిస్మస్.. ఫోటోలు పంచుకున్న సమంత..!
టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుపుకుంది. రెండో పెళ్లి తర్వాత చేసుకున్న మొదటి క్రిస్మస్ ఇదే కావడంతో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పాటు ఈ ఏడాది తన ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని సంతోషం వ్యక్తం చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి జరిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ ఏడాదిలో తన మధుర జ్ఞాపకాలను సైతం పోస్ట్ చేసింది. ఇటీవలే సామ్ రెండో సారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.రాజ్ నిడిమోరుతో ఏడడుగులు..సమంత ఇటీవలే రెండో పెళ్లి చేసుకుంది. రూమర్స్‌ని నిజం చేస్తూ 'ద ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లోని లింగ భైరవి దేవి సన్నిధిలో ఈ శుభాకార్యం జరిగింది. అయితే 'భూత శుద్ధి ఆచారం' పద్దతిలో ఈ పెళ్లి వేడుక జరిగింది. డిసెంబర్ 1న, కేవలం30 మంది అతిథులతో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
75 ఏళ్ల బామ్మగా ఒకప్పటి స్టార్ హీరోయిన్
వైవిధ్య భరిత కథ చిత్రాలను నిర్మించడంలోనూ, టాలెంటెడ్ కళాకారులను ప్రోత్సహించడంలోనూ ముందుండే నటుడు శివ కార్తికేయన్.. తన ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త చిత్రం తాయ్ కిళవి. ఈ చిత్రం ద్వారా శివ కుమార్ మురుగేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించిన రాధికా శరత్‌కుమార్.. ఈ మూవీలో ఉసిలంపట్టి గ్రామం కట్టుబాటులో నివసించే 75 ఏళ్ల బామ్మగా ఆమె కనిపించనున్నారు. ఆమె కుటుంబం, ఆ ఊరి ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, సమస్యలు తదితర అంశాలకు వినోదాన్ని జోడించి తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఈషా విజయాన్ని అడ్డుకోలేరు: వంశీ నందిపాటి
‘‘ఈషా’ చిత్రానికి హైదరాబాద్‌లో 26 ప్రీమియర్స్ వేస్తే హౌస్‌ఫుల్ అయ్యాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మౌత్ టాక్ బాగుంది. వసూళ్లు బాగున్నాయి. అయితే మా సినిమాని కొందరు టార్గెట్ చేసి, పెయిడ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమా మీద ఇలా జరగడం దారుణం. ఎవరు ఎన్ని చేసినా మా సినిమా విజయాన్ని అడ్డుకోలేరు’’ అని వంశీ నందిపాటి పేర్కొన్నారు.త్రిగుణ్, అఖిల్‌రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ–‘‘పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న మా సినిమాని కావాలని బ్యాడ్ చేయడం మంచిది కాదు. నా మూవీని డ్యామేజ్ చేసిన ఎవర్నీ వదలను’’ అన్నారు. ‘‘మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే సోషల్ మీడియాలో టార్గెట్ చేసి సినిమాను బ్యాడ్ చేస్తున్నారు’’ అన్నారు బన్నీ వాసు. నిర్మాత హేమ వెంకటేశ్వరరావు మాట్లాడారు. -
రాజే యువరాజే...
క్రిస్మస్ పండగని పురస్కరించుకుని ‘ది రాజా సాబ్’ మూవీ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘రాజే యువరాజే...’ అంటూ సాగే పాట ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ పాటకు తమన్ సంగీతం అందించారు. ప్రభాస్ క్రిస్మస్ పండగ సెలబ్రేషన్స్ కోసం ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధీ అగర్వాల్‌తో ప్రేయర్ చేయించుకోవడం వంటివి ఈ ప్రోమోలో చూపించారు.త్వరలోనే పూర్తి పాటని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే జనవరి 9న విడుదల కానుంది. -
హిట్ స్టెప్
ఫస్ట్ స్టెప్ హిట్ స్టెప్ అయితే ఆ ఆనందమే వేరు. 2025లో అలా తొలి అడుగులోనే విజయం సాధించిన దర్శకులు అరడజనుకు పైనే ఉన్నారు. హారర్, కామెడీ, థ్రిల్, ఫ్యామిలీ, లవ్... ఇలా ఒక్కో దర్శకుడు ఒక్కో జానర్‌ని ఎంచుకుని, హిట్ అయ్యారు. 2025లో ‘హిట్ డైరెక్షన్’లో కెరీర్ ఆరంభించిన ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.⇒ మన చట్టాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, లేకపోతే ఆ చట్టాలను ఆయుధాలుగా చేసుకుని బలహీనులను కొందరు బలవంతులు ఏ విధంగా ఇబ్బందిపెడతారనే అంశంతో రూపొందిన చిత్రం ‘కోర్ట్’.పోక్సో చట్టం నేపథ్యంలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం ద్వారా పరిచయమైన హీరో, హీరోయిన్ హర్‡్ష రోషన్, శ్రీదేవికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. లాయర్‌గా ప్రియదర్శి మంచి మార్కులు కొట్టేశారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదలైంది. ⇒ యూత్‌ఫుల్ మూవీస్ ఆడియన్స్‌కు నచ్చాయంటే, కలెక్షన్స్‌కు కొదవే ఉండదు. అందుకు తాజా ఉదాహరణ ‘లిటిల్ హార్ట్స్’. ఈ రొమాంటిక్ కామెడీ మూవీతో దర్శకుడు సాయి మార్తాండ్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు. చదువు పెద్దగా అబ్బని ఓ అబ్బాయి, అమ్మాయి లాంగ్‌టర్మ్ కోచింగ్‌లో చేరి, ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అన్న పాయింట్‌తో ‘లిటిల్ హార్ట్స్’ సినిమా తీశారు సాయి మార్తాండ్. ఈ చిత్రంలో మౌళి తనుజ్ హీరోగా, శివానీ నాగారం హీరోయిన్గా నటించారు. ‘90స్’ బయోపిక్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాకు ఓ నిర్మాత. సెప్టెంబరు 5న ఈ చిత్రం విడుదలైంది. ⇒ కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా నీరజ కోన పాపులర్ అని తెలిసిందే. ఆమె దర్శకురాలిగా పరి చయం అయిన చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో సరోగసీ అనే సెన్సిబుల్ పాయింట్‌ను, ముగ్గురు వ్యక్తుల మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్‌స్టోరీని, వారి మానసిక సంఘర్షణను వెండితెరపై బాగా చూపించారు నీరజ. సిద్ధు జొన్నగలడ్డ హీరోగా, రాశీ ఖన్నా, శ్రీ నిధిశెట్టి హీరోయిన్లుగా టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 17న విడుదలైంది. మహిళా దర్శకుల సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో నీరజ కోన పరిచయమై, హిట్ సాధించడం హర్షించదగ్గ విషయం. ⇒ పెద్ద వ్యాపారవేత్త అయిన కృష్ణకి (సాయికుమార్) అల్లర చిల్లరగా తిరిగే మాస్ కొడుకు కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) ఎంసెట్‌లో ర్యాంక్ సాధించకపోగా, అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. డొనేషన్ చెల్లించి మరీ కేరళలోని ఓ కాలేజ్‌లో మెడిసిన్ చదివించేందుకు కొడుకుని చేర్పిస్తాడు తండ్రి. అక్కడ కుమార్, మెర్సీ జాన్ (యుక్తి తరేజా) ప్రేమలో పడతారు. పెద్దలు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపుతారు. అదే సమయంలో మెర్సీకి ఉన్నపోస్ట్ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీఎస్టీడీ) వ్యాధి గురించి కుమార్‌కి తెలుస్తుంది. ఆ వ్యాధి పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు జైన్స్ నాని. రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ మూవీ అక్టోబరు 18న విడుదలైంది. ఈ కథను నేర్పుగా డీల్ చేసి,ప్రేక్షకులతో చేత శెభాష్ అనిపించుకున్నారు జైన్స్ నాని. ⇒ 2004లో తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ ఘటన నేపథ్యంలో దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డప్పు మేస్త్రీగా పని చేసే రాజు (అఖిల్ రాజ్), అదే ఊరికి చెందిన ప్రభుత్వ ఆస్పత్రి కాంపౌండర్ వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) కూతురు రాంబాయి (తేజస్విని) ప్రేమలో పడతారు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తుడితోనే తన కూతురి పెళ్లి చేస్తానని తేల్చి చెబుతాడు వెంకన్న. రాజు, రాంబాయిల కథ చివరికి ఏమైంది? అనేది ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రకథ. సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు నవంబరు 21న విడుదల చేయగా, సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు భారీ వసూళ్లను సాధించింది. సున్నితమైన కథని తన టేకింగ్, మేకింగ్ స్టైల్‌తో సాయిలు కంపాటి అందరి దృష్టినీ ఆకర్షించారు. ⇒ బైరాన్‌పల్లి సంఘటన ఆధారంగా కాల్పనిక కథతో దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన చిత్రం ‘చాంపియన్’. ఈ కథ గురించి చె΄్పాలంటే... రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు బైరాన్‌పల్లి ప్రజలుపోరాటం చేస్తుంటారు. మరోవైపు సికింద్రాబాద్‌లో పుట్టి, పెరిగిన మైఖేల్ సి. విలియమ్స్ (రోషన్) ఫుట్‌బాల్ ప్లేయర్. ఇంగ్లాండ్ వెళ్లి, ఆడాలనేది అతని కల. అనుకోని పరిస్థితుల్లో బైరాన్‌పల్లి గ్రామం చేస్తున్నపోరాటంలోకి అడుగుపెడతాడు మైఖేల్. ఇంగ్లాండ్ వెళ్లాలనుకున్న అతని కల నెరవేరిందా? అనేది కథ. మూడేళ్ల గ్యాప్ తర్వాత హీరోగా రోషన్ రీ – ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అతనికి ప్లస్ అయింది. ఈ కథని ప్రదీప్ అద్వైతం భావోద్వేగంగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ బ్యానర్స్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న విడుదలైంది. ⇒ వెయ్యేళ్ల చరిత్ర ఉన్న శంబాల ఊరి నేపథ్యంలో 1980 దశకంలో సాగే కథతో ‘శంబాల’ చిత్రాన్ని తెరకెక్కించారు యుగంధర్ ముని. శంబాల ఊరిలో జరిగే అనూహ్యమైన సంఘటనల తాలూకు మిస్టరీని ఛేదించడానికి యువ శాస్త్రవేత్త విక్రమ్ (ఆది) ఆ ఊరికి వెళతాడు. విజ్ఞానం వర్సెస్ శాస్త్రం, దైవ శక్తులు వర్సెస్ మూఢనమ్మకాలు.... వంటి రిస్కీ కథాంశాన్ని ఎన్నుకున్న యుగంధర్ ముని కన్విన్సింగ్‌గా చెప్పడం అభినందనీయం. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేశారు. డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదలైంది. ⇒ ‘పెద్దజాతి, చిన్న జాతి అన్న తేడాల్లేవ్... మనందరం ఒక్కటే’ అన్న సందేశాన్ని నినదిస్తూ థియేటర్స్‌లో ‘దండోరా’ వేశారు దర్శకుడు మురళీకాంత్. జీవితంలో తనకు ఎదురైన అనుభవానికి అక్షరరూపం ఇచ్చి.. అగ్రవర్ణాలు, అణగారిన వర్గాల మధ్య నేటికీ ఉన్న తారతమ్యాలు, కుల వివక్ష, ప్రేమ, పరువు హత్యలు..వంటి అంశాలను మేళవించి ‘దండోరా’ సినిమా తీశారు మురళీకాంత్.అగ్రవర్ణానికి చెందిన ఓ వ్యక్తి, తను చేసిన తప్పును తాను తెలుసుకుని, పశ్చాత్తాప పడితే, ఆ ఆగ్రవర్ణ కులపెద్దలు అతని మరణం పట్ల ఎలాంటి వివక్ష చూపించారు? అనే పాయింట్‌ను ‘దండోరా’ సినిమాలో చూపించారు. ఇలా తన ప్రతిభను తానే దండోరా వేసుకున్నారు. శివాజీ, నందు, మౌనికా రెడ్డి, నవదీప్, రవికృష్ణ, రాధ్య, బింధు మాధవి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. ము΄్పానేని రవీంద్ర బెనర్జీ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 25న ఈ చిత్రం విడుదలైంది. ⇒ పంతంగులపోటీ నేపథ్యంతో రూపొందిన తాజా సినిమా ‘పంతగ్’. ఈ యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రంతో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ఈ సినిమాలోని లీడ్ రోల్స్‌లో నటించారు. యూత్‌పుల్ ఎంటర్టైనర్ మూవీగా ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ సినిమాను విజయ్‌కుమార్ అన్నే, సంపత్, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్స్‌లో విడుదలైంది.⇒ తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘రామం రాఘవం’తో ధన్‌రాజ్, రవితేజ నటించిన ‘మాస్ జాతర’ చిత్రంతో భాను భోగవరపు,‘అల్లరి’ నరేశ్ ‘12ఏ రైల్వేకాలనీ’తో నాని కాసరగడ్డ, రాజ్ తరుణ్ క్రైమ్ కామెడీ ‘పాంచ్ మినార్’తో రామ్ కడుమల, కిరణ్ అబ్బవరం ఇంటెన్స్ లవ్‌స్టోరీ ‘దిల్ రుబా’తో విశ్వకరుణ్, ప్రియదర్శి ‘ప్రేమంటే..?’తో నవనీత్ శ్రీరామ్ వంటి నూతన దర్శకులు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. -
గ్లామర్‌కు నో.. ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా చేయాలనుంది!
సొంతం సినిమాతో గుజరాతీ బ్యూటీ నమిత కెరీర్ ప్రారంభమైంది. జెమిని, ఐతే ఏంటి!, నాయకుడు, బిల్లా, సింహా సినిమాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అనేక సినిమాలు చేసింది. 2010 తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనేలేదు. మిగతా భాషల్లోనూ ఐదారు సినిమాలు చేసి వదిలేసింది.గతంలో తప్పులుతాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన నమిత.. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. గతంలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయనని చెప్తోంది. అందుకోసమే కొన్ని కథలు నచ్చకపోతే ఎటువంటి మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నానంది. గ్లామరస్ పాత్రల్ని చేయాలనుకోవడం లేదని, పవర్ఫుల్ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.అలాంటి పాత్రలు చేయాలనుందిఉదాహరణకు రజనీకాంత్ పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలనుందని మనసులో మాట బయటపెట్టింది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నీలాంబరి పాత్ర కోసం మాట్లాడుకుంటున్నారని.. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుందని చెప్పింది. విద్యాబాలన్, రాధికా ఆప్టే.. కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారని.. వాళ్లలాగే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మరి నమిత ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి! -
ప్రియా ప్రకాశ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. మీరా జాస్మీన్ ఫెస్టివ్ వైబ్స్..!
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ప్రియా ప్రకాశ్..ఉదయ్‌పూర్ కోటలో బాలీవుడ్ భామ మౌనీ రాయ్..హీరోయిన్ మెహరీన్ క్రిస్మస్ లుక్స్..క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్ నటి రవీనా టాండన్..ఫెస్టివల్ వైబ్స్‌లో హీరోయిన్ మీరా జాస్మిన్.. View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mahe Ayyappan (@maheswari_actress) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
బిగ్‌బాస్ ఇనయా సుల్తానా థ్రిల్లర్ మూవీ.. సెన్సార్ పూర్తి..!
హర్ష గంగవరపు, ఇనయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి నటించిన థ్రిల్లర్ మూవీ మదం. ఈ చిత్రానికి వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్య దేవర రవీంద్ర నాథ్, రమేష్ బాబు కోయ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 1న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది సెన్సార్ బోర్డ్. కాగా.. ఈ సినిమాకు కథ, సంభాషణలను రమేష్ బాబు కోయ అందించారు. ఈగల్ ఫేమ్ డేవ్జాండ్ (DavZand) సంగీతం అందించారు. ఈ న్యూ ఇయర్‌కు ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు థియేటర్లకు రానుంది. -
సంతలో పశువులు అనుకున్నారా?.. ఇండిగో తీరుపై వీకే నరేశ్ ఆగ్రహం..!
హైదరాబాద్ విమానాశ్రయంలో సినీనటుడు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో విమానయాన సంస్థ సిబ్బందితో గొడవకు దిగారు. విమానం వద్దకు తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను పశువుల్లా తీసుకెళ్లడంపై ఆయన మండిపడ్డారు. తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థ నిర్లక్ష్యపూరిత తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్లో ఫోటోలు పంచుకున్నారు.నరేశ్ తన ట్వీట్లో రాస్తూ..'ఇండిగో ఎయిర్‌లైన్స్ బస్సు ప్రయాణం చిత్ర హింసకు గురిచేసింది. విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి సాక్ష్యమిదే. మమ్మల్ని పశువుల్లా ఒక లారీలో ఎక్కించినట్లు విమానం వద్దకు తీసుకెళ్లారు. అందులో వృద్ధులు, చక్రాల కుర్చీలలో ఉన్న కొందరు నిలబడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎక్కువ మందిని ఎక్కించవద్దని నేనే గట్టిగా అరిచా. బస్సులకు ఒక నిర్దిష్ట పరిమితి ఉండాలి. వృద్ధుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలి. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి నా న్యాయ బృందంతో మాట్లాడుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో నరేశ్ మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.The bus torture chambers of INDIGO airlines are excruciating reminders of the airline monopoly. Thy had loaded us like cattle in a lorry (twice the capacity )with senior citizens , some in wheel chairs struggling to stand ( seen in the back ground ) . I had screamed at the top of… pic.twitter.com/JzcOvsLlul— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) December 23, 2025 -
దేశం విడిచి వెళ్లాలనుకున్నాం.. ఏడ్చేసిన నందు
తెలుగు నటుడు, యాంకర్ నందు ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లవుతోంది. అయినా ఇప్పటికీ తనకు సరైన సక్సెస్ లేదు. ఆ ఒక్క విజయం కోసం ఏళ్లకొద్దీ పరితపిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో సెకండ్ హీరోగా చేసిన నందు తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ మంచి విజయం మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పుడితడు సైక్ సిద్దార్థ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఉన్నచోటే ఆగిపోయా..ఈ చిత్రం 2026 జనవరి 1న విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నందు తన కష్టాల్ని తల్చుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. నందు మాట్లాడుతూ.. నాతో కలిసి నటించిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రియదర్శి, విజయ్ దేవరకొండ.. వీళ్లంతా ఎక్కడికో వెళ్లిపోయారు. నేను మాత్రం ఉన్నచోటే ఉండిపోయాను. లోపం నాలోనే ఉంది. అది ఈ మధ్యే తెలుసుకున్నాను.లోపం నాలోనే..కథలో లోపాలున్నాయని తెలిసినా సరే.. డబ్బు వస్తుందన్న ఆశతో సినిమాలు ఒప్పేసుకునేవాడిని. అలా నన్ను నేనే మోసం చేసుకున్నాను. దానివల్ల వీడి సినిమాలన్నీ ఇంతేరా.. అన్న మార్క్ పడిపోయింది. దాన్నుంచి బయటకు రావడానికే మూడునాలుగేళ్లు సమయం తీసుకుని మంచి సినిమా చేశాను.చేదు సంఘటనలుసవారి మూవీ తర్వాత పెద్ద బ్యానర్లో హీరోగా సినిమా ఆఫర్ చేశారు. అనుపమ హీరోయిన్ అన్నారు. అంతా ఓకే అనుకున్నాక సడన్‌గా నా స్థానంలో మరొకర్ని తీసుకున్నారు. కానీ, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మరో సంఘటనలో ఏం జరిగిందంటే.. ఒక పెద్ద నిర్మాత తన కొడుకును హీరోగా పెట్టి మూవీ తీశారు. హీరోతోపాటు సమాన ప్రాధాన్యత ఉన్న పాత్ర నాకిచ్చారు. పైసా తీసుకోకుండా రెండున్నర నెలలు షూటింగ్ చేేశాను. ఘోర అవమానంతీరా ఓ డిస్ట్రిబ్యూటర్ మూవీ చూసి నాకెందుకు అంత ప్రాధాన్యతనిచ్చారని అడిగారట! దాంతో నాకు ఒక్కమాటైనా చెప్పకుండా నా సీన్స్ అన్నీ ఎత్తేశారు. అది తెలియక ఆడియో లాంచ్‌కు పిలవకపోయినా వెళ్లాను. అక్కడికి వెళ్లాక కనీసం నేను ముందు వరుసలో కూర్చునేందుకు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు చాలా బాధపడ్డాను.తల్లితోడుగా చెప్తున్నా..అనవసరమైన విషయాల్లో నా పేరు ఇరికించినప్పుడైతే కుమిలిపోయాను. తల్లితోడుగా చెప్తున్నా.. అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామా? అని గీత, నేను అనుకున్నాము. వేరే దేశం వెళ్లి ఏదైనా హోటల్లో పని చేసుకుందాం అని గీతయే ముందుగా అడిగింది. తను సక్సెస్ఫుల్ స్టార్ సింగర్.. అయినా సరే నాకోసం తన కెరీర్ వదిలేసి, వేరే దేశం వెళ్లి హోటల్లో పనిచేసుకుందామంది. అది ఇప్పుడు తల్చుకున్నా ఏడుపొస్తుంది. ఏడ్చేసిన నందునేను ఈ ఫీల్డ్‌లో లేకపోతే నాపై అలాంటి రూమర్సే రావు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చినవారిని బలిపశువును చేస్తారు. ఈ విషయం జనాలకు తెలియదు. లేనిపోనివాటిలో నన్ను ఇరికిస్తే బిల్డింగ్ పై నుంచి దూకేస్తానంది అమ్మ. అలా నేను చేయని తప్పుకు వార్తల్లో నా పేరు రావడం చూసి ఇంట్లో అందరూ నలిగిపోయారు అని చెప్తూ నందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. -
మోహన్ లాల్ వృషభ మూవీ రివ్యూ.. ఆడియన్స్‌ను మెప్పించిందా?
టైటిల్: వృషభనటీనటులు: మోహన్ లాల్, సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, అజయ్ తదితరులుదర్శకత్వం: నందకిశోర్విడుదల తేదీ..డిసెంబర్ 25, 2025మలయాళ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రియుల గుండెల్లో నిలిచిపోయారు. ఈ ఏడాది తుడురమ్, ఎంపురాన్-2, హృదయపూర్వం చిత్రాలతో అలరించారు. తాజాగా మోహన్ లాల్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓకేసారి తెలుగు, మలయాళ భాషల్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.వృషభ కథేంటంటే..గత జన్మలు కూడా ఉన్నాయని మనందరం వింటుంటాం. అయితే ఆ జన్మలో మనం ఎలా పుట్టాం.. అసలేం జరిగింది కేవలం ఊహాజనితమే. అసలు గత జన్మలు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. అయితే ఆ రెండు జన్మలను ఓకేసారి చూపిస్తూ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అందించే చిత్రమే మోహన్ లాల్ వృషభ.ఈ కథ రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు ఓ మహిళ పెట్టే శాపంతో మొదలవుతుంది. గత జన్మలో జరిగిన సంఘటనలతో ఈ కథను ప్రారంభించాడు. బిజినెస్‌లో ఆదిదేవ వర్మ(మోహన్ లాల్) కింగ్. ప్రతి ఏడాది ఉత్తమ బిజినెస్‌మెన్‌గా అవార్డ్ ఆయనకు రావాల్సిందే. అలా ఇది నచ్చని మరో వ్యాపారవేత్త అవార్డ్ బహుకరించే రోజే ఆదిదేవ వర్మపై దాడికి ప్లాన్ చేస్తాడు. కానీ ఆది దేవ వర్మ కుమారుడు తేజ్(సమర్జీత్ లంకేశ్) ఎంట్రీతో ఆ ప్లాన్ తిప్పికొడతాడు. అలా వర్తమానంలో తండ్రీ, తనయులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తేజ్ పెళ్లి చేసుకోవాలనేది తండ్రి బలమైన కోరిక. ఈ విషయాన్ని పదే పదే తన కొడుకుతో చెబుతుంటాడు.అదే సమయంలో గత జన్మ అనుభవాలతో ఆది దేవ వర్మ సతమతమవుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న తేజ్ తండ్రి కోసం మంచి సైక్రియాటిస్ట్ను కలవాలనుకుంటాడు. ఇదే క్రమంలో దామిని(నయన్ సారిక) అతనికి పరిచయం అవుతుంది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలా ఇద్దరు కలిసి ఆదిదేవ వర్మ సమస్యకు పరిష్కారం కోసం బయలుదేరతారు. నాన్నకు ఉన్న ప్రాబ్లమ్ గురించి ఇంట్లో పనిచేసే వంటమనిషి పప్పు.. తేజ్‌తో ఓ ఆసక్తికర విషయం చెబుతాడు. ఇది విన్న తేజ్ తండ్రికి చెప్పకుండానే వెంటనే సొంత గ్రామమైన దేవనగరికి బయల్దేరతాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. అసలు తేజ్ ఆ ఊరికి ఎందుకు వెళ్లారు? తండ్రి కోసం వెళ్లిన తేజ్ ఎందుకలా మారిపోయాడు. అసలు తండ్రీ, కొడుకుల మధ్య ప్రతీకారానికి కారణమేంటి? ఆది దేవ వర్మకు గత జన్మలో అసలేం జరిగింది? ఆ జ్ఞాపకాలు ఇంకా ఎందుకు వెంటాడుతున్నాయి? అసలు ఆ మహిళ పెట్టిన శాపం ఏంటి? అనేది తెలియాలంటే వృషభ చూడాల్సిందే.ఎలా ఉందంటే..మామూలుగా గత జన్మలో ఏం జరిగింది అనేది మొదట చూపించి కథను మొదలెడతాం. అలానే గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్)కు జరిగిన సంఘటనలను పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు. గత జన్మలో రాజా విజయేంద్ర వృషభ అసమాన యోధుడిగా తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. తన సామ్రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడుకుంటూ ఉంటాడు అయితే వృషభ చేసిన పొరపాటు వల్ల ఓ మహిళ ఆయనకు శాపం పెడుతుంది. అదే శాపం వర్తమానంలోనూ ఆదిదేవ వర్మ(మోహన్ లాల్)ను వెంటాడుతుంది. అయితే కుమారుడి కోసం తాపత్రయ పడుతున్న ఆదిదేవకు..దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ పాతదే కావొచ్చు. కానీ స్క్రీన్ ప్రజెంట్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. తాను అనుకున్నట్లుగానే కథను ప్రేక్షకులను పరిచయం చేశాడు. ప్రారంభంలోనే రాజుకు పెట్టే శాపం రివీల్ చేసి ఆసక్తి క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వర్తమానంలోకి తీసుకెళ్లాడు. తండ్రి, కుమారుల మధ్య బాండింగ్.. కొడుకు కోసం తండ్రి.. తండ్రి కోసం కుమారుడు పడే తపన చూపించాడు. అమ్మాయితో పరిచయం కావడం.. వెంటనే ఇద్దరి మధ్య లవ్.. చకాచకా ఓకే చెప్పడం.. అలా కథను చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఫస్ట్ హాప్ మొత్తం ఆదిదేవ వర్మ(మోహన్ లాల్), సమర్జీత్ లంకేశ్(తేజ్)ల బాండింగ్.. దామినితో లవ్‌లో పడడం అంతా రోటీన్‌గా సాగుతుంది. తేజ్ ఎప్పుడైతే తండ్రి సొంత గ్రామమైన దేవనగరి గ్రామానికి వెళ్లాడో అక్కడి నుంచే కథలో వేగం పుంజుకుంది. ఫస్ట్ హాఫ్‌లో కథ ప్రేక్షకుడి ఊహకందేలానే సాగుతుంది. కానీ అలా ప్రేక్షకుడు కథలో లీనమవ్వగానే.. ఇంటర్వెల్‌కు ముందు ఇచ్చే ట్విస్ట్ అస్సలు ఊహించలేరు. ఆ బిగ్ ట్విస్ట్ థియేటర్లో చూసి సగటు ప్రేక్షకుడు షాకవ్వాల్సిందే. అలా ప్రథమార్థాన్ని వర్తమానంతోనే ముగించాడు. సెకండాఫ్‌లో గత జన్మలో జరిగిన పరిణామాలు.. రాజా విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) త్రిలింగ రాజ్యం గురించే ఉంటుంది. ఆ రాజ్యంలో జరిగే సంఘటనలు చుట్టే తిరుగుతుంది. కానీ త్రిలింగ రాజ్యంలోని స్ఫటిక లింగం దొంగతనం చేసేందుకు వచ్చిన హయగ్రీవా(సమర్జీత్ లంకేశ్) వస్తాడు. ఆ తర్వాత వృషభ రాజుకు.. హయగ్రీవాకు మధ్య జరిగే పోరాటం సెకండాఫ్‌లో హైలెట్. ఆ యుద్ధ ఫైట్ సీన్లో జరిగిన సంఘటన తర్వాతే ఈ కథ ఏంటనేది ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అప్పటిదాకా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. సెకండాఫ్‌లో అలీ కామెడీ కొద్దిసేపే అయినా నవ్వులు తెప్పించింది. ఇందులో గత జన్మకు.. వర్తమానానికి ముడిపెట్టడం వల్ల ప్రేక్షకుడిని కాస్తా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. గత జన్మ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ కథలో క్లైమాక్స్‌లో ఫుల్ ఎమోషన్ క్రియేట్ చేశాడు. తండ్రీ, తనయుల మధ్య పోరాటాన్ని భావోద్వేగానికి ముడిపెడుతూ మలిచిన తీరు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఈ కథలో ప్రేక్షకుడి ఊహకందని బిగ్ ట్విస్ట్‌లు ఇచ్చాడు డైరెక్టర్. కథలో కొత్తదనం లేకపోయినా విజువల్స్, స్క్రీన్ ప్లేతో సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నారు. ఆడియన్స్‌కు ఎక్కడా బోరింగ్ అనిపించకుండా కథను ముందుకు తీసుకెళ్లడం ప్లస్. భారీ ఫైట్స్ లేకున్నా..కథకు తగినట్లుగా ప్లాన్ చేశాడు.ఎవరెలా చేశారంటే..మోహన్ లాల్ ఆదిదేవ వర్మగా, రాజా విజయేంద్ర వృషభగా రెండు పాత్రల్లో తనలోని టాలెంట్‌తో ఆకట్టుకున్నారు. సమర్జీత్ లంకేశ్ యంగ్ హీరోగా అదరగొట్టేశాడు. గత జన్మ హయగ్రీవా పాత్రలో డిఫరెంట్‌గా కనిపించాడు. నయన సారిక తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్, వినయ్ వర్మ, అలీ, అయప్ప పి.శర్మ, కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. బీజీఎం అంత కాకపోయినా ఫర్వాలేదనిపించింది. సామ్ సీఎస్ నేపథ్యం సంగీతం బాగుంది. కృతి మహేశ్ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ వీకెండ్లో ఓ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే వృషభ చూడాల్సిందే. -
టాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అల్లు అర్జున్, ఎన్టీఆర్.. మధ్యలో త్రివిక్రమ్?
ఒకరు చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కొత్తేం కాదు. ఒకసారి వేరే హీరో అనుకున్న తర్వాత లేదు లేదు మళ్లీ పాత హీరోతోనే మూవీ చేయడం లాంటివి మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్లో అదే జరగనుందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తద్వారా అల్లు అర్జున్, ఎన్టీఆర్, త్రివిక్రమ్ మరోసారి హాట్ టాపిక్ అయిపోయారు. ఇంతకీ ఏంటి విషయం?అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో లాంటి హిట్స్ పడ్డాయి. అలా వీళ్లిద్దరూ కలిసి మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారని ఏడాది-ఏడాదిన్నర క్రితం తెగ మాట్లాడుకున్నారు. అదో భారీ మైథలాజికల్ సబ్జెక్ట్ అనే టాక్ బయటకొచ్చింది. లెక్క ప్రకారం 'పుష్ప 2' తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో ఈ మూవీ చేస్తారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ తన కొత్త మూవీ అనౌన్స్ చేశాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా తారక్‌తో ఈ ప్రాజెక్ట్ చేస్తారని న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ)ఇందుకు తగ్గట్లే ఎన్టీఆర్ కూడా 'ద గాడ్ ఆఫ్ వార్' పుస్తకం పట్టుకుని ఒకటి రెండుసార్లు కనిపించాడు. నిర్మాత నాగవంశీ కూడా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో భారీ ఎత్తున ఈ సినిమా ఉండబోతుందన్నట్లు పరోక్షంగా ట్వీట్స్ చేశాడు. తాజాగా ఓ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా మాట్లాడిన నిర్మాత బన్నీ వాసు.. కొన్ని సందర్భాల్లో సినిమాలు చేతులు మారుతుంటాయని అన్నాడు. ఇది బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమేనని నెటిజన్ల అంటున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో కొత్త మూవీస్ ఏం లేవు. అట్లీది వేసవికల్లా పూర్తవుతుంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్‌తోనూ బన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో బన్నీతో చేసేవారిలో ఎవరు ముందు ఎవరు వెనక అనేది చూడాలి? పరిస్థితులు చూస్తుంటే త్రివిక్రమ్.. మరోసారి తారక్‌కి హ్యాండ్ ఇచ్చాడా అనిపిస్తుంది. గతంలో 'ఆర్ఆర్ఆర్' తర్వాత కూడా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మూవీ ప్రకటించారు. కానీ దాన్ని పట్టాలెక్కించలేకపోయారు.(ఇదీ చదవండి: 17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి.. ఎవరీ అనస్వర) -
మళ్లీ అదే మాట.. శివాజీ నోటి దూల
-
'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్
టాలీవుడ్ నటి అనసూయ మరో పోస్ట్ చేసింది. ఇప్పటికే శివాజీ కామెంట్స్‌కు కౌంటరిచ్చిన అనసూయ తాజాగా ట్వీట్ చేసింది. ఇది కేవలం మహిళల గురించి మాత్రమే కాదని తెలిపింది. పాత తరాలు నేర్చుకున్నవి, అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొంతమంది పురుషులు, మహిళలు కూడా నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది.అనసూయ తన ట్వీట్లో రాస్తూ..' కొంతమంది పురుషులు, మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇది అందరి పురుషుల గురించీ లేదా అందరి మహిళల గురించీ కాదు.. కానీ నేను పురుషులు.. మహిళలు.. అందరికీ విన్నపం చేస్తున్నాను.. దయచేసి విస్తృతంగా ఆలోచించండి.. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని' తెలిపింది.ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని తెలిపింది. ఒకరికొకరం శక్తినివ్వాలి.. మద్దతుగా నిలవాలి.. మన విలువ మన ఎంపికల నుంచే వస్తుంది.. మరే దానితో కాదని హితవు పలికింది. అంతేకాకుండా కొంతమంది మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. మీ పని బాధ్యతతో చేయాలి.. ఈ విధమైన మహిమాపరచడం (గ్లోరిఫికేషన్) సమంజసం కాదని ట్వీట్లో రాసుకొచ్చింది.I need to say this..కొంతమంది పురుషులు.. ఇంకా కొంతమంది మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ…— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 25, 2025 -
17 ఏళ్లకే తల్లి పాత్ర.. 'ఛాంపియన్'తో ఇప్పుడు తెలుగులోకి
పట్టుమని పాతికేళ్లు లేవు. అయితేనేం సొంత భాషలో హీరోయిన్గా స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఆపై బాలీవుడ్‌లోనూ ఓ మూవీ చేసింది. ఇప్పుడు 'ఛాంపియన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇంతకీ ఈ మలయాళ బ్యూటీ ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ డీటైల్స్ ఏంటి?పైన చెప్పిందంతా కూడా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ గురించే. కేరళలోని కరివెల్లూరులో పుట్టిన ఈమెకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ 15 ఏళ్ల వయసులో 'ఉదాహరణం సుజాత' అనే మూవీలో మంజు వారియర్ కూతురిగా నటించింది. 2019లో వచ్చిన 'తన్నీర్ మథన్ దినంగళ్' చిత్రం అనస్వరకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇదే ఏడాది వచ్చిన 'అధ్యరాత్రి'లో ఈమె తల్లి, కూతురిగా ద్విపాత్రాభినయం చేసింది. ఈ రోల్స్ చేసేనాటికి ఈమె వయసు 17 ఏళ్లే కావడం విశేషం.(ఇదీ చదవండి: హారర్ సినిమా 'ఈషా' రివ్యూ)2022లో వచ్చిన 'సూపర్ శరణ్య' సినిమా అనస్వరకు చాలా పేరు తీసుకొచ్చింది. ఇందులోనే మమిత బైజు కూడా యాక్ట్ చేసింది. ఇదే ఏడాది తమిళంలోకి 'రాంగీ'తో ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే వర్కౌట్ కాలేదు. 2023లో 'యారియన్ 2'తో బాలీవుడ్‌కి కూడా పరిచయమైంది. ఇది కూడా కలిసి రాలేదు. దీంతో తమిళ, హిందీలో మరో చిత్రంలో నటించలేదు. కేవలం మలయాళానికి మాత్రమే పరిమితమైపోయింది.2023లో వచ్చిన 'నెరు' సినిమాతో అనస్వర ఎంత మంచి నటి అనేది అందరికీ తెలిసింది. కళ్లు లేని అమ్మాయిగా, తనపై అత్యాచారం చేసివాడిని పట్టించే పాత్రలో అదరగొట్టేసింది. ఈ మూవీకిగానూ ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డ్స్ ఈమెని వరించాయి. గతేడాది వచ్చిన 'గురువాయూర్ అంబలనడయిల్', ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'రేఖాచిత్రం' ఈమెలోని ప్రతిభని మరింత బయటపెట్టాయి.శ్రీకాంత్ కొడుకు హీరోగా చేసిన 'ఛాంపియన్'తో అనస్వర.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. కానీ అంతకంటే ముందే తెలుగు ప్రేక్షకులకు ఈమె పరిచయం. నెరు, రేఖాచిత్రం, సూపర్ శరణ్య తదితర చిత్రాల్ని ఓటీటీల్లో మనోళ్లు ఇప్పటికే చూశారు. వాళ్లందరికీ ఈ బ్యూటీ టాలెంట్ ఏంటనేది తెలుసు. అందం, అమాయకత్వం, డ్యాన్స్.. ఇలా అన్నీ అదరగొట్టే ఈమెకు 'ఛాంపియన్' ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'దండోరా' సినిమా రివ్యూ) -
ఒక్కమాటలో శివాజీకి ఇచ్చిపడేసిన హెబ్బా
-
హైదరాబాద్‌లో ఘనంగా టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
హీరోయిన్ తమన్నా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'అంత పెద్ద మాటలొద్దు సార్.. మేం చిన్నపిల్లలం కాదు'..: శివాజీకి అనసూయ కౌంటర్
టాలీవుడ్ నటుడు శివాజీని వదిలే ప్రసక్తే లేదంటోంది మహిళా లోకం. తన కామెంట్స్‌ను సమర్థించుకోవడమే కాకుండా ఎవరికీ భయపడనంటూ ఇవాళ ప్రెస్మీట్లో రెచ్చిపోయారు. ఒకవైపు సారీ చెబుతూనే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ ఓ రేంజ్లో తనకు తానే ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా యాంకర్, నటి అనసూయ పేరు ప్రస్తావిస్తూ కౌంటర్ ఎటాక్ చేశారు. తాను అభద్రతాభావంతో ఉన్నది నిజమేనమ్మా.. మీ రుణం కూడా త్వరలోనే తీర్చుకునే అవకాశం రావాలని దేవుడిని కోరుకుంటున్నా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ కామెంట్స్ మరో కొత్త వివాదానికి తెరతీశాయి.ఇవాళ దండోరా మూవీ ప్రెస్మీట్లో శివాజీ తనపై చేసిన కామెంట్స్‌పై అనసూయ స్పందించింది. అతి వినయం దుర్త లక్షణం అనేది నాకు చిన్నప్పటి నుంచే తెలుసని వెల్లడించింది. ఈ రోజు వీడియోలు చూస్తుంటే పెద్దవాళ్లు చెప్పింది కరెక్టే అనిపిస్తోందని తెలిపింది. ఈ రోజు ఆయన ప్రెస్మీట్లో విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. ఒక నార్సిస్ట్కు ఉండే లక్షణం ఇదే.. చేతగానితనం వల్లే ఇలాంటి మాటలు వస్తాయని అన్నారు. ఫేక్ ఫెమినిజం అనేది ఎక్కడా లేదండి.. మగాళ్లతో పాటు ఆడవాళ్లకు కూడా సమాన హక్కులు ఉండాలన్నదే ఫెమినిజం అని తెలిపింది.అనసూయ మాట్లాడుతూ..' సెల్ఫ్ కంట్రోల్ లేనివాళ్లు, ఇన్ సెక్యూరిటీ వల్లే ఇలా మాట్లాడతారు. అందుకే పాపం సింపతీ కార్డ్ వాడేస్తున్నారు. నేనేందుకు అందులోకి లాగాను? మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే? నేను కూడా హీరోయినే సార్.. మిమ్మల్ని ఇలానే బట్టలు వేసుకోవాలని మీకు ఎవరైనా చెబుతున్నారా? మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలనే చెప్పేంత చిన్నపిల్లలం కాదు. మీరు నన్ను లాగలేదు. కానీ కలెక్టివ్‌గా లాగారు. మీరు ఏదైతే బలంగా చెబుతున్నారో.. నేను కూడా అదే చెబుతున్నా. మీరే తెలివి గలవాళ్లు అనుకుంటే..సృష్టికి మూలమైన మాకు ఎంత ఉండాలి. మరణశిక్ష వేయండి అన్నారు. అలాంటివి వద్దు సార్. నిజంగానే మీకు ఆడవాళ్లపై గౌరవం ఉంటే.. ఏంట్రా అడవి జంతువుల్లా మీద పడటం.. ఆ అమ్మాయి అంత అందగా ఉంది. ఆమెను గౌరవించడని మగవాళ్లకే చెప్పండి' అని గట్టిగా ఇచ్చిపడేసింది.అనసూయ మాట్లాడుతూ..'మీరన్నట్లు నేను జాలి పడలేదు.. నా రుణం తీర్చుకునే అవకాశం దొరకాలి అన్నారు. నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నా భర్త నాకు సపోర్ట్‌గా ఉన్నారు. ఎంతోమంది నా తోటి సహచరులు అండగా ఉన్నారు. మీలాంటి వాళ్ల మద్దకు నాకస్సలు అవసరం లేదు సార్. మీరు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచింది' అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. నా గురించి సోషల్ మీడియాలో ఏం వాగినా.. వల్గర్ కామెంట్స్ చేసినా లీగల్ నోటీసులు వస్తాయని హెచ్చరించింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
శివాజీ వల్గర్ కామెంట్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన రాజాసాబ్ బ్యూటీ..!
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌పై ది రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ స్పందించింది. లులు మాల్లో జరిగిన సంఘటన తర్వాతే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పడంపై నిధి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. బాధితురాలిదే తప్పని నిందించడం మానిపులేషన్ అవుతుందని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇవాళ ప్రెస్ మీట్లో శివాజీ లులు మాల్లో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. నిధి అగర్వాల్‌కు అలా జరిగిన తర్వాతే తాను ఈ కామెంట్స్ చేశానని సమర్థించుకున్నారు.అంతకుముందు దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లను ఉద్దేశించి చీప్ కామెంట్స్ చేశారు. ఈవెంట్లకు ఎలా పడితే అలా డ్రెస్సులు వేసుకోవద్దని.. అంతా బయటికి కనిపించేలా రావొద్దంటూ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై సినీతారలతో పాటు యావత్ మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాంకర్ అనసూయతో పాటు సింగర చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా శివాజీకి కౌంటరిచ్చారు. ఈ కామెంట్స్‌పై తెలంగాణ మహిళా కమిషన్ సైతం శివాజీకి నోటీసులు జారీ చేసింది.క్షమాపణలు చెప్పిన శివాజీ..తన కామెంట్స్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో శివాజీ క్షమాపణలు కోరాడు. తాను ఆ రెండు పదాలు వాడకుండా ఉండాల్సిందని.. అంతేకానీ నా ఉద్దేశం మాత్రం కరెక్ట్ అంటూ సమర్థించుకున్నారు. కేవలం ఆ రెండు పదాల వల్లే సారీ చెబుతున్నానంటూ వీడియోను రిలీజ్ చేశాడు. -
'అనసూయ నీ రుణం తీర్చుకుంటా'.. శివాజీ మరోసారి వ్యంగ్య కామెంట్స్..!
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్ తీవ్ర దుమారానికి దారితీశాయి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లు డ్రెస్సులను ఉద్దేశించి మాట్లాడారు. మీ బాడీ అంతా బయటికి కనపడేలా డ్రెస్సులు వేసుకోవద్దని కామెంట్స్ చేశారు. అదే సమయంలో హీరోయిన్లను ఉద్దేశించి అసభ్యకరమైన పదాలు వాడారు. దీంతో శివాజీ కామెంట్స్‌పై టాలీవుడ్ సినీతారలతో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.టాలీవుడ్ నటి అనసూయ సైతం శివాజీ కామెంట్స్‌పై స్పందించింది. ఈ బాడీ నీది కాదు.. మాది అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో శివాజీ అభద్రతా భావంతో ఉన్నారంటూ మరో ట్వీట్ చేసింది. మిమ్మల్ని చూస్తుంటే జాలీగా ఉందని కూడా రాసుకొచ్చింది.అయితే ఇవాళ దండోరా టీమ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో శివాజీ ఈ అంశంపై మాట్లాడారు. తాను ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. ఆ రెండు పదాలు వాడడం నా తప్పేనని.. నా ఉద్దేశంలో మాత్రం కరెక్ట్ అని సమర్థించుకున్నారు. అదే సమయంలో యాంకర్ అనసూయకు కౌంటరిచ్చారు. అసలు ఈ వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అసలు మీరెందుకు వచ్చారు అనసూయ గారు ? నేను ఏమైనా మిమ్మల్ని అన్నానా అండి? మీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. వాస్తవానికి ఆమె పేరునే కాదు.. తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని.. హీరోయిన్లు అంటూ మాత్రమే మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు.శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. నేను చేసిన కామెంట్స్‌పై ఆడపడచులందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరుగుతుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉంది. మీరు నామీద జాలి చూపించారు కదా. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.అసలు శివాజీ ఏమన్నారంటే.. ?శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు. కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు'అన్నాడు.అసలు మీరెందుకు వచ్చారు అనసూయ గారు ? నేను ఏమైనా అన్నానా మిమ్మల్ని ? - Actor Sivaji pic.twitter.com/urw4aUrniQ— Telugu Chitraalu (@CineChitraalu) December 24, 2025 -
ఎవరికీ భయపడను! శివాజీ మరో సంచలన వీడియో
-
టాలీవుడ్ చిన్న చిత్రాలు.. సూపర్ హిట్స్.. అందువల్లే సక్సెస్..!
టాలీవుడ్లో ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలతో చిన్న చిత్రాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. భారీ తారాగణ, పెద్ద బడ్జెట్ సినిమాలకు కలెక్షన్స్ వస్తాయి. మరి చిన్న సినిమాల సంగతేంటి? అగ్రతారలు లేకపోయినా సినిమాలకు ఆదరణ దక్కడం అంతా ఈజీ కాదు. కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద రాణిస్తాయి. లేకపోతే వారం రోజుల్లోనే కనుమరుగవుతుంటాయి. కానీ కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు మాత్రం ఈ ఏడాది సత్తా చాటాయి. ఈ ఏడాదిలో పెద్ద స్టార్స్ లేకుండానే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టిన వచ్చిన ఆ చిన్న సినిమాలేవో ఓ లుక్కేద్దాం.కోర్ట్ మూవీ..ఈ ఏడాది సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో కోర్టు ఒకటి. మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన కోర్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఓ చిన్న సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. హీరో నాని నిర్మించిన ఈ మూవీ.. అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష రోషన్-శ్రీదేవి జంటగా అలరించారు. రామ్ జగదీశ్ అనే కొత్త దర్శకుడు తీసిన ఈ చిత్రంలో పోక్సో చట్టం గురించి ప్రస్తావించారు. ఈ మూవీ కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే.. దాదాపు రూ. 55 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.8 వసంతాలు..ఈ ఏడాగి సినీ ప్రియులను అలరించిన ప్రేమ కథా చిత్రం '8 వసంతాలు'. ఈ ఏడాది జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా మాత్రం ఓటీటీలో అదరగొట్టింది. 8 వసంతాల డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు.లిటిల్ హార్ట్స్..ఈ ఏడాది సూపర్ హిట్‌గా నిలిచిన మరో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా నటించిన ఈ చిత్రం థియేటర్ల వద్ద అదరగొట్టిది. కేవలం మౌత్ టాక్‌తో పుంజుకుని ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు.మ్యాడ్ స్క్వేర్..గతంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్. ఈ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఉగాదికి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఫస్ట్ పార్ట్ అంతా సూపర్ హిట్ కాకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సుమారు రూ. 65 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రల్లో మెప్పించారు.రాజు వెడ్స్ రాంబాయి..ఇటీవలే రిలీజైన సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు దాదాపు రూ. 15 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని సాయిలు కంపటి దర్శకత్వంలో తెరకెక్కించారు.అరిఈ ఏడాది విడుదలై మంచి విజయం సాధించిన మరో చిన్న సినిమా అరి. అంతర్గత శత్రువులుగా పరిగణించే అరిషడ్వర్గాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్ రాబట్టింది. ‘పేపర్‌బాయ్’ లాంటి సెన్సిబుల్ సినిమాను తెరకెక్కించిన జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వినోద్ వర్మ , అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. అరిషడ్వర్గాల్ని జయించడం ఎలాగో, మనిషి మార్పు ఎప్పుడు ఎలా సాధ్యమవుతుందో ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. -
ఆ సంఘటన చూశాకే మాట్లాడా.. అదే నేను చేసిన తప్పు: శివాజీ
దండోరా మూవీ ఈవెంట్లో తాను కామెంట్స్‌పై నటుడు శివాజీ మాట్లాడారు. మహిళల దుస్తులపై మాట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆ రెండు పదాలు తాను వాడకుండా ఉండాల్సిందని తెలిపారు. అంతేకానీ ఎవరినీ ఉద్దేశించి నేను ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. నా కంటే ఎంతోమంది నోరు జారారని.. కానీ వాళ్లెవరినీ ఇంతలా అడగడం లేదన్నారు. అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు రియాక్ట్ కావడంలో తప్పేం లేదన్నారు.శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. టీవీలు చూస్తున్న ఆడపడచులందరికీ నమస్కారం. దండోరా ఈవెంట్లో నేను మాట్లాడిన రెండు పదాల వల్ల సారీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదు. నా 30 ఏళ్ల కెరీర్లో ఎలా జరిగిందో జరిగిపోయింది. దానికి మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరిగితుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉందమ్మా. మీరు నామీద జాలి చూపించారు. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.మహిళల కట్టుబాట్లపై ఎంతోమంది ప్రవచనకారులు ఇప్పటికే ఎంతోమంది వెల్లడించారు. ఇటీవల లులు మాల్లో నిధి అగర్వాల్‌ను చూశాకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. నేను ఎవరినీ ఇలాంటి డ్రెస్సులు వేసుకోండని ఎవరికీ చెప్పలేదని అన్నారు. సినిమా వల్లే యువత పాడవుతున్నారనే మాట రాకూడదనే అలా చెప్పానని తెలిపారు. సమాజంలో ఏది జరిగినా సినిమాల వైపే వేలు చూపిస్తున్నారని అన్నారు. నేను వాడినా ఆ రెండు పదాలు తప్ప.. నా ఉద్దేశం అది కాదన్నారు. ఈ వివాదం తర్వాత తనకు నిద్ర పట్టలేదన్నారు. దండోరా మూవీ రిలీజ్ అవుతున్నందుకు మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనాలనే ప్రెస్‌మీట్‌కు వచ్చానని శివాజీ తెలిపారు. ఈ సినిమా ఒక మంచి స్టోరీ అని.. కులాలు, అసమానతలపై వస్తోన్న ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. -
రిటైర్ అయ్యా కదా.. తెలుగు సినిమాలపైనే నా ఫోకస్!
చాలామందికి సినిమాలకే కాలక్షేపం. కాస్త సమయం దొరికితే చాలు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తుంటారు. తాను కూడా అదే కోవలోకి వస్తానంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. తాజాగా అతడు హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రో లీగ్ (టీపీఎల్)ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.డబ్బింగ్ మూవీస్ చూస్తా..మీరు సౌత్ ఇండియన్ సినిమాలు చూస్తారా? అన్న ప్రశ్నకు అవునని తలూపాడు. తెలుగు, తమిళ భాషలు అర్థం కానప్పటికీ ఆయా సినిమాలను హిందీ డబ్బింగ్లో చూస్తానని సెహ్వాగ్ చెప్పాడు. పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్‌ను హిందీలో చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక నేను చాలా ఖాళీ సమయం దొరికింది. నా ఫేవరెట్ హీరోఅప్పుడు నేను టాలీవుడ్ స్టార్స్ అయిన మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు ఎక్కువగా చూడటం మొదలుపెట్టాను. నా ఫేవరెట్ తెలుగు హీరో మహేశ్‌బాబు. ప్రభాస్ బాహుబలి సినిమానైతే ఎన్నోసార్లు చూశాను అని చెప్పుకచ్చొఆడు. ఇకపోతే వీరూ ఫేవరెట్ హీరో మహేశ్‌బాబు ప్రస్తుతం వారణాసి సినిమాతో బిజీగా ఉన్నాడు.సినిమాఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ప్రభాస్ అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. ప్రభాస్ విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్, హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: వితికా షెరుకు ప్రమోషన్ -
'గీతూ రాయల్' దెబ్బకు దిగొచ్చిన సంజన
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ పూర్తి అయినప్పటికీ ఏదో రకంగా ట్రెండింగ్‌లోనే కొనసాగుతుంది. ఎపిసోడ్‌కు సంబంధించిన పలు వీడియోలను కంటెస్టెంట్స్ షేర్ చేసుకుంటూ మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో నటి సంజన గల్రానీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో బిగ్‌బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్, రివ్యూవర్స్ ఆదిరెడ్డి, గీతూ రాయల్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన వీడియోను షేర్ చేసింది. దీంతో గీతూ రాయల్ గట్టిగానే కౌంటర్‌గా ఇచ్చింది. సంజనకు సంబంధించిన ఒక వీడియోను తన స్టోరీస్‌లో పంచకుంది. అయితే, కొద్దిసేపటి తర్వాత సంజన తన తప్పును తెలుసుకుని తన పోస్ట్‌ను తొలగించడంతో.. రీతూ రాయల్ కూడా తను చేసిన పోస్ట్‌ను రిమూవ్ చేసింది.సంజన ఏం చేసింది..?బిగ్‌బాస్ రివ్యూవర్ మహిధర్ చేసిన ఒక వీడియోను మొదట సంజన షేర్ చేసింది. ఆ వీడియోలో సంజన బిగ్‌బాస్ కంటెంట్ క్రియేటర్ అంటూ అతను పేర్కొన్నాడు. ఆపై తనూజ, ఇమ్ము, డీమాన్ పవన్‌ల ఆట గురించి ప్రస్తావించాడు. అయితే, కేవలం రివ్యూవర్ల వల్లనే కల్యాణ్ హైలెట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. దానిని కొందరు ట్రోలర్స్ వైరల్ చేశారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, రీతూ రాయల్ కల్యాణ్ కోసం ఓట్ల బిచ్చగాళ్లు మాదిరిగా క్రియేట్ చేసి ఉన్న ఒక ఫోటోను ఆ వీడియోకు కలిపారు. అదే వీడియోను సంజన షేర్ చేయడంతో గీతూ రాయల్‌కు చిర్రెత్తుకొచ్చింది. దీంతో వెంటనే తనదైన స్టైల్లో గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇంకేముంది సంజన తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఇంతలోనే ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అయిపోయింది.సంజనకు గీతూ రాయల్ కౌంటర్డ్రగ్స్ కేసులో నటి సంజనపై ఆరోపణలు అంటూ వచ్చిన ఒక వీడియో క్లిప్‌ను గీతూ పోస్ట్ చేసింది. ఇదీ నిజమా అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సంజన గల్రానీ డ్రగ్స్ కేసు 2020లో కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. రెండు నెలల తర్వాత ఆమెకు బెయిల్ లభించింది. ఇదే కేసులో సుప్రీం కోర్టు కూడా కొద్దిరోజుల క్రితమే నోటీసులు జారీ చేసింది.#GeetuRoyal status on #Sanjana #BiggBossTelugu9 pic.twitter.com/kLMBYZfGBe— TeluguBigg (@TeluguBigg) December 24, 2025 -
‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్ హెబ్బా పటేల్ (ఫొటోలు)
-
ప్రమోషన్ పొందిన వితికా షెరు
బిగ్‌బాస్ ఫేం, నటి వితికా షెరు గుడ్‌న్యూస్ చెప్పింది. పెద్దమ్మగా ప్రమోషన్ పొందినట్లు వెల్లడించింది. వితికా చెల్లెలు కృతికా తాజాగా పండంటి కుమారుడికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. బాబు పుట్టిన శుభవార్తను అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. హీరోయిన్గా కెరీర్తెలుగమ్మాయి వితిక హీరోయిన్గా టాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టింది. సినిమాలు చేస్తున్న సమయంలోనే హీరో వరుణ్ సందేశ్‌తో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. జంటగా బిగ్‌బాస్ షో మూడో సీజన్‌కు సైతం వెళ్లొచ్చారు. పెళ్లయిన తర్వాత కూడా చెల్లి కృతికకు పెళ్లి చేసే బాధ్యతను తనే తీసుకుంది వితికా.చెల్లి పెళ్లి చేసిన వితికాఅక్కగా దగ్గరుండి 2022లో చెల్లి పెళ్లి చేసింది. కొద్ది నెలల క్రితమే కృతిక గర్భం దాల్చగా ఇటీవల తనే ఘనంగా సీమంతం కూడా చేసింది. ఇది చూసినవాళ్లంతా ఇలాంటి అక్క ప్రతి ఇంట్లో ఉండాలని వితికాపై ప్రశంసలు కురిపించారు. ఇకపోతే కృతిక - కృష్ణ దంపతులకు మంగళవారం (డిసెంబర్ 23న) బాబు పుట్టగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Krithika Sheru (@krithikasheru) -
'ఇమ్మిగ్రేషన్ టు ఎవ్రీవన్ బుక్' ఆవిష్కరణ వేడుకలో నటి అనన్య నాగళ్ల
-
కల్యాణ్ విజయం వెనుక 'బిగ్‌బాస్' రివ్యూవర్స్.. ?
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. పైనల్ ఎపిసోడ్ ముగిసి విజేతగా ప్రకటించినా సరే కల్యాణ్, తనూజ పేర్లు నెట్టింట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అయితే, ఒక విజేతకు రావాల్సిన మైలేజ్‌ను ఎన్నడూ లేని విధంగా తనూజ కూడా హైజాక్ చేసింది. వాస్తవంగా 10 వారాల పాటు ఎలాంటి ఓటింగ్ పోల్స్ చూసినా సరే తనూజనే విన్నర్‌గా కనిపించేది. కానీ, ఆ తర్వాత సీన్ మారిపోయింది. హఠాత్తుగా ఓటింగులో దూసుకొచ్చాడు కల్యాణ్ పడాల.. తనూజ వెనుకబడిపోయింది. దీంతో CRPF జవాను కల్యాణ్ బిగ్‌బాస్ 9 విజేత అయ్యాడు. అయితే, కల్యాణ్ విజయంలో రివ్యూవర్ల పాత్ర ఎక్కువ ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఆపై మరికొందరు టీవీ యాక్టర్స్ కూడా తనూజ గురించి నెగటివ్‌గా చెప్పడంతోనే ట్రోఫీ జారిపోయిందనే వాదన కూడా ఉంది. మరికొందరు మాత్రం అగ్నిపరీక్ష-2 కోసం బిగ్‌బాస్ టీమ్ ప్లాన్ చేస్తుందని అందుకే ఒక కామనర్‌ను కావాలనే గెలిపించారనే వాదన కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కామెంట్లతో కల్యాణ్‌లో కూడా గెలుపు సంతోషం లేకుండా పోయింది.అర్జునుడిలా కల్యాణ్.. కృష్ణుడి స్థానంలో గీతూబిగ్బాస్ రివ్యూవర్లు ఆదిరెడ్డి, గీతూ రాయల్ సపోర్ట్ కల్యాణ్‌కు పుష్కలంగా దొరికిందని కొందరు నెటిజన్లు డీకోడ్ చేశారు. వారిద్దరితో పాటు మరికొందరు రివ్యూవర్లు కూడా కల్యాణ్‌కు పీఆర్ మాదిరిగా మారిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గీతూ రాయల్ మొదటి నుంచి ప్రతి ఎపిసోడ్‌ను చక్కగా రివ్యూ చెప్పింది. కానీ, ఫైనల్‌కు వచ్చేసరికి కల్యాణ్‌కు ఓటు వేయాలంటూ తనకు అనుకూలంగానే వీడియోలు పోస్ట్ చేసింది. ముమ్మాటికీ గీతూ ఇక్కడ తప్పు చేసిందనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక రివ్యూవర్ ఎప్పుడూ కూడా ఒక కంటెస్టెంట్ కోసం స్టాండ్ తీసుకోకూడదని చెబుతున్నారు. ఈ విధానం రాబోయే సీజన్లలో వారు చెప్పే రివ్యూలకు క్రెడిబులిటీ ఉండదని పేర్కొంటున్నారు. ఈ పాయింట్‌ను గీతూ గ్రహించలేకపోయిందని చెప్పాలి. పైగా కల్యాణ్ గెలిచిన తర్వాత షేర్ చేసిన ఒక పోస్టర్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఒక రథంపై ఆర్జునుడి స్థానంలో కల్యాణ్ ఉంటే.. కృష్ణుడి స్థానంలో గీతూ రాయల్ ఉండేలా క్రియేట్ చేసిన పోస్టర్‌ను ఆమె షేర్ చేసింది. దీంతో ఇంతకంటే నీతితక్కువ పని ఏమైనా ఉంటుందా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.మొదటిసారి గాడి తప్పిన ఆదిరెడ్డిబిగ్బాస్ రివ్యూ చెప్పడంలో ఆదిరెడ్డి దిట్ట... తను చెప్పే స్టైల్‌కు చాలామంది ఫిదా అయిపోతారు. బిగ్‌బాస్ ఎపిసోడ్‌కు ఉన్నంత రేంజ్లో ఆదిరెడ్డి రివ్యూకు ఉంటుంది. ముఖ్యంగా అతని రివ్యూ తీరు మన పక్కింటి అబ్బాయి చెబుతున్నంత దగ్గరగా ఉంటుంది. ఏ సీజన్లో లేని విధంగా ఈసారి ఆదిరెడ్డిపై కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కల్యాణ్ గెలుపు కోసమే రివ్యూలు చేశాడంటూ నెటిజన్లు వేల కొద్ది కామెంట్లు చేశారు. వాస్తవంగా అతని రివ్యూలు కూడా కల్యాణ పక్షం వైపే ఉన్నాయని సులువుగా అర్థం అవుతుంది. తనూజ ఏం చేసినా సరే తప్పు అనేలా చెప్పడం.. ఆదే టైమ్‌లో కల్యాణ్ ఏం చేయకున్నా సరే తోపు, తురుం అంటూ ఎలివేషన్ ఇవ్వడంతో బజ్ క్రియేట్ అయిపోయింది. చాలామంది రివ్యూవర్లు కూడా ఆదిరెడ్డిని కాపీ కొట్టి తమ స్టైల్లో రివ్యూ షేర్ చేశారు. అలా అని ఆదిరెడ్డి డబ్బులకు అమ్ముడుపోయాడని చెప్పడం తప్పే.. తను అనుకుంటే ఏదైన కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ చేస్తే ఏడాదికి కోట్లలో సంపాదించగలడు. కానీ, మొదటిసారి తన రివ్యూలు గాడి తప్పాయని విమర్శలు రావడంతో తన క్రెడిబులిటికి ఒక మచ్చలా మిగిలిపోనుంది.కల్యాణ్ గెలుపులో ఐదుగురుబిగ్బాస్ 9 ట్రోఫీ కల్యాణ్ అందుకున్న తర్వాత తన స్నేహితులు శ్రీజ, ప్రియలను కలుసుకున్నాడు. ఆ సమయంలో కల్యాణ్‌తో శ్రీజ ఇలా అంటుంది. 'ఐదుగురు అమ్మాయిలు సపోర్ట్ చేయడం వల్ల కల్యాణ్ గెలిచాడు.' అంటూ ఓపెన్‌గా చెబుతుంది. అయితే ముగ్గురు ఉన్నారని మరో ఇద్దరు అందుబాటులో లేరని తెలుపుతుంది. ఆ ఐదుమంది పేర్లను కూడా నెటిజన్లు రివీల్ చేస్తున్నారు. శ్రీజ, ప్రియ, గీతూ రాయల్, సత్య, రేష్మి అంటూ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.#KalyanPadala fans should accept the fact that Kalyan won BB and good name using sympathy card Army card caste card language card region card etc but he is lossing very thing just because this 5 evil and negitive mindsets around him.accept the fact#BiggBossTelugu9 #Thanuja pic.twitter.com/a4czq9IMub— santhosh (@Santhoshh_99) December 23, 2025 View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) View this post on Instagram A post shared by Geetu Royal (@geeturoyal_) -
మైసా నుంచి సర్ప్రైజ్.. రష్మిక రప్పారప్పా..
ఈ ఏడాది బాక్సాఫీస్‌ను రప్ప రప్పా ఆడించేసింది రష్మిక మందన్నా.. తను హీరోయిన్గా నటించిన ఛావా, థామా, కుబేర, ద గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలు వందల కోట్లు రాబట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మైసా అనే లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేస్తోంది. బుధవారం (డిసెంబర్ 24న) ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. "నా బిడ్డ సచ్చిందన్నారు. కానీ మట్టే వణికిపోయింది.. నా బిడ్డ రక్తాన్ని దాసలేక, గాలే ఆగిపోయింది.. దాని ఊపిరి మోయలేక, అగ్గే బూడిదైంది.. మండుతున్న నా బిడ్డని సూడలేక.." అన్న సంభాషణతో వీడియో మొదలైంది. నా బిడ్డను సంపలేక సావే సచ్చిపోయింది.. నా బిడ్డ ఎవరో తెలుసా.. అంటూ రష్మికను పవరల్ఫుల్ లేడీ వారియర్‌గా చూపించారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిలింస్ నిర్మిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2026లో విడుదల కానుంది. -
'దండోరా' మూవీ ఈవెంట్లో మెరిసిన హీరోయిన్ బింధుమాధవి (ఫొటోలు)
-
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్'.. క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్
'బాహుబలి: ది ఎపిక్' ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియాను ఊపేసిన బాహుబలి ప్రాంఛైజ్ రెండు సినిమాలు పదేళ్ల తర్వాత ఒక్కటిగా 'బాహుబలి: ది ఎపిక్’ పేరుతో అక్టోబర్ 31న విడుదలైన విషయం తెలిసిందే. ప్రభాస్- ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి రెండు భాగాలు సంచలన విజయం సాధించాయి. అయితే, బాహుబలి ది ఎపిక్ పేరుతో 3 గంటల 40 నిమిషాల నిడివితో మరోసారి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.'బాహుబలి: ది ఎపిక్' నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్టిక్స్ (NETFLIX) తన లిస్ట్‌లో చేర్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సత్తా చాటింది. ఏకంగా రూ. 55 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రీరిలీజ్ చిత్రాలలో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కథేంటి..?బాహుబలి కథ అందరికి తెలిసిందే. థియేటర్స్‌తో పాటు టీవీ, ఓటీటీల్లో ఇప్పటికే చాలా సార్లు చూసే ఉంటారు. మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి(రమ్యకృష్ణ) ప్రాణత్యాగం చేసి మహేంద్ర బాహుబలి(ప్రభాస్)ని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి.. అవంతిక(తమన్నా)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు. అక్కడ బంధీగా ఉన్న దేవసేన(అనుష్క శెట్టి) తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. బంధీగా ఉన్న దేవసేన తన తల్లి అని.. భళ్లాలదేవుడు(రానా) కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపిచాడనే విషయం తెలుస్తుంది. కట్టప్ప (సత్యరాజ్) సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి బళ్లాల దేవుడిని అంతం చేస్తాడు. -
మహేష్ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్
-
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
బిగ్‌బాస్ సీజన్-9లో కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన మర్యాద మనీష్ రెండో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కానీ, తనూజ మీద తను చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. నామినేషన్స్ ప్రక్రియ కోసం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మనీష్.. తనూజ గురించి చెప్తూ 'ముద్దు మాటలతో చెవిలో మందార పూలు పెడుతున్నారు' కొంతమంది అంటూ డైలాగ్ కొట్టాడు. దీంతో అతనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఫైనల్ ఎపిసోడ్లో తనూజ కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ మనీష్ చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని పేర్కొంది. దీంతో తాజాగా మనీష్ క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ చేశాడు.ఎవరైనా క్వీన్‌పై దాడి చేస్తారు.. 'ప్రియమైన తనూజ పుట్టస్వామి మీ ఆట గురించి ఎక్కడ ప్రారంభించాలి, ఏమి చెప్పాలి! 105 రోజులుగా, ఇంత తెలివైన, అద్భుతమైన ఆటను బయటకు తీయడం దాదాపు అసాధ్యం. కానీ, దానిని మీరు సాధించారు. మీరు చేసిన పోరాటం ఎప్పటికీ మరిచిపోలేరు. మీరు ఎల్లప్పుడూ ఈ సీజన్లో నా టాప్- 5 లిస్ట్‌లో ఉన్నారు. నేను కూడా కొన్నిసార్లు మీకు ఓటు వేసాను. నాకు చెస్ అంటే చాలా ఇష్టం. చెస్‌లో క్వీన్ బలమైనదిగా ఉంటుంది. అక్కడ ఆట గెలవడానికి అందరూ ముందుగా క్వీన్‌పై దాడి చేయాలి అనుకుంటారు. క్వీన్ పోతే గేమ్ కుడా పోయినట్లే. నేను తిరిగి హౌస్‌లోకి వచ్చినప్పుడు.. మీతో నా ఆట ఆడవలసి వచ్చింది. ఎందుకంటే మీరు క్వీన్ ఆపై ఈ సీజన్లో బలమైన ఆటగాళ్ళలో ఒకరు. ఇంటి లోపలే కాదు.. బయట కూడా మీరు బలంగానే ఉన్నారు.బహిరంగ క్షమాపణకానీ, మీరు ఫైనల్ వేదికపై నా మాటలకు చెడుగా భావించారని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఆ సమయంలో నాకు మైక్ దొరికితే షోలోనే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పేవాడిని. కానీ, అవకాశం రాలేదు. అయితే, నిన్ను కలిసినప్పుడు నేను మొదట చేసిన పని క్షమాపణలు చెప్పడమే..! కానీ. మరోసారి ఇలా బహిరంగంగా క్షమాపణ చెప్పడం కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మనమందరం చేసినదంతా ఆట కోసమే! క్షమాపణ చెప్పడం ద్వారా ఎవరూ చిన్నవారు లేదా పెద్దవారు కాలేరు. ఆరోగ్యకరమైన రేపటి కోసం హృదయపూర్వక హస్తాన్ని అందిస్తున్నట్లు అవుతుంది! ఇదే సమయంలో మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 9వ రోజు నేను ఇంట్లో చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. మీరు దానిని గ్రహించి నాతో మాట్లాడారు. ఇవన్నీ ఎప్పటికీ మరిచిపోలేను. BB అభిమానులు చివరి వరకు గుర్తుంచుకునే ఆటను మీరు ఆడారు! ఆపై మీరు చాలా మందిని గెలుచుకున్నారు.' అంటూ తనూజతో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ మనీష్ పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Maryada Manish (@maryada.manish) -
‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
శ్రుతిహాసన్ ట్రైన్ వచ్చేస్తుంది..
కోలీవుడ్‌లో చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం 'ట్రైన్'.. విజయ్ సేతుపతి, నటి శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం ఇది. యూగీసేతు, నరేన్, సంపత్ రామ్ ముఖ్యపాత్రలు పోషించారు. నటుడు నాజర్, వి.క్రియేషన్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాపులర్ దర్శకుడు మిష్కిన్ తెరకెక్కిస్తున్నారు. ఈయన చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ట్రైన్ చిత్రం కూడా అదేవిధంగా ఉంటుందని భావించవచ్చు. ఇది విజయ్‌సేతుపతి, శ్రుతిహాసన్ రేర్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం. ఇందులో విజయ్‌సేతుపతి, శ్రుతిహాసన్‌ల గెటప్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. శ్రుతిహాసన్ ఇటీవల వైవిధ్య భరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య సలార్, ఆ తరువాత రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ చిత్రాల్లో ఈమె పాత్రలు అంతకు ముందు నటించిన పాత్రలకు భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. అదేవిధంగా ట్రైన్ చిత్రంలో కూడా శ్రుతిహాసన్ గెటప్ కొత్తగా ఉంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తాజాగా అప్డేట్ను యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈచిత్ర సింగిల్సాంగ్ను తాజాగా విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో త్వరలోనే ట్రైన్ చిత్రం తెరపైకి రానుందని సమాచారం. మరో విషయం ఏమిటంటే తాజాగా విడుదలైన పాటను శ్రుతిహాసన్ పాడడం విశేషం. వచ్చే ఏడాది ప్రారంభంలోనే తెలుగు, తమిళ్లో విడుదల కానుంది. -
ఇదేం చెత్త వాగుడు: శివాజీపై పలువురి ఫైర్
‘‘చాలా బాగుందమ్మా (యాంకర్ని ఉద్దేశించి) ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. ఇంకో విషయం చెబుతున్నాను. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా... ఏమీ అనుకోవద్దు హీరోయిన్లందరూ. మీరు అనుకున్నా నాకు భయం లేదు. లాగి పెట్టి, పీకుతాం మనం. అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ ఉంటారు... కానీ ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? కాస్త మంచివి వేసుకోవచ్చు కదా... బాగుంటావు అని అనాలనిపిస్తుంది కానీ అనలేం. అంటే... స్త్రీకి స్వేచ్ఛ లేదా అంటారు.నేనిలా మాట్లాడితే... పెద్ద పెద్దోళ్లంతా సీక్త్రి స్వేచ్ఛ లేదని అంటారు. స్వేచ్ఛ అనేది అదృష్టం. మన గౌరవం మన దేశ భాషల నుంచే పెరుగుతుంది. ప్రపంచ వేదికల్లో కూడా చీర కట్టుకున్నవారికే విశ్వ సుందరి కిరీటం వచ్చింది’’ అంటూ సోమవారం సాయంత్రం జరిగిన ‘దండోరా’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. అమ్మాయిల దేహాన్ని ‘సామాను’ అనడం... ‘దరిద్రపు...’ అంటూ బహిరంగంగా అనడం పట్ల పాపులర్ యాంకర్–నటి అనసూయ, గాయని–అనువాద కళాకారిణి చిన్మయి, ప్రముఖ స్త్రీవాది కొండవీటి సత్యవతి స్పందించారు.అలాగే, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు స్వప్న దత్, సుప్రియ, నటి–నిర్మాత లక్ష్మీ మంచు, దర్శకురాలు నందినీ రెడ్డి, పాపులర్ యాంకర్ ఝాన్సీ తదితరులు శివాజీ నుంచి క్షమాపణ కోరాలంటూ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కి లేఖ రాశారు. ‘‘శివాజీ... ఏమిటా చెత్తవాగుడు’’ అంటూ సత్యవతి నిప్పులు చెరిగారు. ‘‘ఏంటా ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనా’’ అంటూ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శివాజీ హీరోయిన్లకు అనవసరమైన సలహా ఇచ్చాడు. వాళ్ల సామాను కవర్ చేసుకోవడానికి చీరలు కట్టుకోమంటున్నాడు.అతనేమో జీన్స్, హుడీలు వేసుకుంటాడు. మరి... భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి, ధోతీలు కట్టుకోవచ్చుగా’’ అని చిన్మయి అతని మాటలను ఖండించారు. ‘‘శివాజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం... ఒకరి ప్రవర్తనతో గౌరవం లభిస్తుంది కానీ ధరించే దుస్తులతో కాదు... మహిళలు గౌరవించబడాలి’’ అంటూ ప్రముఖ హీరో మంచు మనోజ్ ఓ లేఖ వెలువరించారు. ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున దుమారం రేగడంతో మంగళవారం సాయంత్రం ‘క్షమాపణ’ చెబుతూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.శివాజీ మట్టెలు ధరించాలి: చిన్మయి‘‘తెలుగు నటుడు శివాజీ నటీమణులను ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ వంటి అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారు తమ ‘సామాను’ను కప్పుకోవడానికి చీరలు ధరించాలని అనవసరమైన సలహాలు ఇస్తున్నాడు. శివాజీ ఒక అద్భుతమైన సినిమాలో విలన్ గా నటించి, చివరికి ఇన్సెల్ బాయ్స్‌కు హీరోగా మారిపోయాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే... వృత్తిపరమైన ప్రదేశాల్లో శివాజీ ‘దరిద్రపు...’ వంటి పదాలను ఉపయోగిస్తున్నాడు. శివాజీ జీన్స్, హుడీ ధరిస్తాడు. అయితే అతను ధోతీలు మాత్రమే ధరించి, భారతీయ సంస్కృతిని పాటించాలి... బొట్టు పెట్టుకోవాలి. అతను వివాహితుడని తెలిసేలా కంకణం, మెట్టెలు ధరించాలి. ఇక్కడ (ఫిల్మ్ ఇండస్ట్రీని ఉద్దేశించి కావొచ్చు) మహిళలను చూసే విధానం బాగాలేదు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా గాయని చిన్మయి స్పందించారు.పరిశ్రమ మౌనం వహించడం ఆందోళనకరం‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేస్తున్న వంద మందికిపైగా మహిళా నిపుణుల తరఫున మేము ఈ లేఖ రాస్తున్నాం’’ అంటూ నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీ లక్ష్మీ అంటూ ‘మా’కి లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ⇒ ‘మా’ సభ్యునిగా ఉన్న శివాజీ ‘దండోర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, బహిరంగ వేదికపై హీరోయిన్ల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు అనుచితమైనవి మాత్రమే కాదు... ముఖ్యంగా సినిమా పరిశ్రమ నుండి ప్రయోజనం పొందుతున్నవాళ్లూ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులూ చేసినప్పుడు చాలా హానికరం. అతను ఉపయోగించిన ‘సామాన్లు, దరిద్రపు’ వంటివి అవమానకరమైన వి. అంతేకాదు... నటీమణులను బెదిరించినట్లు అయింది. ఇది బీఎన్ఎస్ 509 సెక్షన్ ప్రకారం మహిళలను అవమానించడంగా పరిగణించబడుతుంది. ఇది శిక్షార్హమైన నేరం. శివాజీ నుంచి బహిరంగ, షరతులు లేని క్షమాపణ కోరుతున్నాం.. లేకుంటే మేం తీవ్ర చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. మహిళల దుస్తులు, చీర లేదా ఇతరత్రా డ్రెస్సింగ్‌పై ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదు. ఆధునిక, సృజనాత్మక పరిశ్రమలో దీనికి స్థానం లేదు. మహిళలు నిజమైన బెదిరింపులను ఎదుర్కొంటున్నప్పుడు పరిశ్రమ మౌనం వహించడం కూడా ఆందోళనకరమైనది. నటీమణులు నిధీ అగర్వాల్, సమంత ఇటీవల మూక దాడులకు గురైనప్పుడు సామూహిక ఆగ్రహం, జవాబుదారీతనం లేకపోవడం ఆందోళనకరమైనది.మహిళల భద్రతను గౌరవాన్ని ఉల్లంఘించినప్పుడు నిశ్శబ్ద ప్రతిస్పందన ఎందుకు ఉంది? క్షమాపణకు మించి మేము ‘మా’ నుండి స్పష్టమైన, జవాబుదారీతనం, చర్యను కోరుతున్నాం. ‘మా’ అసోసియేషన్ వెంటనే ఈ కింది చర్యలను రూపొందించి అమలు చేయాలని అభ్యర్థిస్తున్నాం.⇒ కేవలం క్షమాపణలు మాత్రమే కాదు. ఈ విషయాలపై కూడా ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ’ జవాబుదారీతనం వహిస్తుందని అనుకుంటున్నాము. అలాగే ‘మా’ అసోసియేషన్ ఈ క్రింది అంశాలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. వాయిస్ ఆఫ్ ఉమెన్ ప్రతినిధులు – నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీలక్ష్మిఇదిలా వుంటే... శివాజీ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణిగింది అన్నట్లుగా ‘మా’ ఓ ప్రకటన విడుదల చేసింది.నీ ఒంట్లో ఇంత కొవ్వేందిఏమిటా చెత్త వాగుడు శివాజీ? నువ్వేమో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ మా మా గురించి అవాకులు చవాకులు పేలతావా నీ ఒంట్లో ఇంత కొవ్వేంది మా బట్టల గురించి వాగడానికి నువ్వెవడివిచెప్పులు తేవాలాచెర్నాకోలా తేవాలానిన్ను తన్ని తగలెయ్యడానికిఅడ్డమైన వాళ్ళూ చెడ్డీలేసుకుని బయలుదేరుతారు సిగ్గూ ఎగ్గూ వదిలేసి అయినా నువ్వెవడివి మా గురించి తీర్పులు చెప్పడానికి మర్యాదగా చెంపలేసుకుని సారీ చెప్పు గుంజీళ్ళు తీసి మోకాళ్ళ మీద కూర్చుని క్షమాపణ అడుగు ఇంకెప్పుడూ ఇలా వాగనని నీకు నువ్వు ప్రమాణం చేసుకో మా జోలికొస్తే ఖబడ్దార్ బండకేసి ఉతికి ఆరేస్తాం. – కొండవీటి సత్యవతి ఎడిటర్, భూమిక, స్త్రీవాద పత్రికఅలా అనడానికి ఎంత ధైర్యం?: అనసూయశివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అనసూయ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్య విశేషాలు ...⇒ నా లైఫ్‌లో హీరోల ఫ్యాన్స్ పేరుతో చేసిన ట్రోల్స్‌లో ముఖ్యంగా మూడు ఉన్నాయి. ఒకటి ‘అత్తారింటి దారేది’ (ఆ సినిమాలో స్పెషల్ సాంగ్‌ని గ్రూపుతో చేయలేనని రిజెక్ట్ చేశారు), రెండోది ‘అర్జున్ రెడ్డి’ (ఈ మూవీ పబ్లిక్ ఫంక్షన్లో ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు), మూడోది అంతకుముందు ‘గంగోత్రి’ (ఆ సినిమాలో అల్లు అర్జున్ తనకు నచ్చలేదని చెప్పడం). అయితే అప్పట్లో మెచ్యుర్టీ లేకుండా, లౌక్యం లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన మాటలు అవి.కానీ ఎవరి మీదా అయిష్టంతోనో, హిడెన్ ఎజెండాతోనో మాట్లాడిన మాటలు కావు. అప్పుడు నన్ను చాలా అగౌరవపరిచారు... పర్సనల్‌గా టార్గెట్ చేస్తూ, మెసేజ్‌లు పెట్టారు. అయితే నన్ను బాధపెట్టే విషయం ఏంటంటే... ఫ్యాన్స్ పేరుతో ట్రోల్స్ చేస్తున్నప్పుడు, అరాచకాలు చేస్తున్నప్పుడు ఎవరి ఫ్యాన్ అని వారు చెప్పుకుంటారో ఆ స్టార్ ఒక్క మాట చెబితే బాగుండేది. కానీ అలా ఎప్పుడూ జరగలేదు.⇒ తొలి ప్రాధాన్యం కుటుంబానికే...నాకు సినిమానే జీవితం కాదు... యాక్టింగ్ అంటే ఇష్టం... అంతే. నా తొలి ప్రాధాన్యం నా కుటుంబానికే. అందరూ ఆదర్శంగా తీసుకునేలా నా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటాను. అందుకే కెరీర్‌కన్నా ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇస్తాను. అవకాశాల కోసం ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ అలా చేసి, అవకాశాలు తెచ్చుకుంటే నాకు తృప్తిగా ఉండదు.⇒ రెబల్ అనుకున్నా ఫర్వాలేదుపిరికిగా ఉండే స్త్రీలనే మగవాళ్లు టార్గెట్ చేస్తారు. బోల్డ్‌గా ఉండే అమ్మాయిల గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తారు. ‘ఫేక్ ఫెమినిజమ్’ అని, ‘అటెన్షన్ సీకింగ్’లో భాగంగా ఇలా మాట్లాడుతున్నానని కూడా అంటారు. అయినా ‘నో ప్రాబ్లమ్’. నేను ఉమెన్‌ని కోరేది ఒక్కటే. పిరికిగా ఉండొద్దు. ధైర్యంగా బతకాలి. ‘రెబల్’ అనుకున్నా ఫర్వాలేదు... మన జోలికి ఎవరూ రారు.⇒ ఆ జంతువులతో జాగ్రత్తమనం అడవికి వెళ్లామనుకోండి... జంతువుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం జాగ్రత్తలు తీసుకుంటా కదా. అలాగే సమాజంలోని మగాళ్ల రూపంలో ఉండే కొన్ని జంతువులు ఉన్న చోట మనం (మహిళలు) ఉండాల్సినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మగవాళ్లల్లో మంచివాళ్లు చాలామంది ఉన్నారు. కానీ జంతువుల్లా ఉండేవాళ్లతో జాగ్రత్త. ఎందుకంటే వాళ్లు మనుషులు కాదు... సంస్కారం ఉండదు. జంతువులు కాబట్టి రెచ్చిపోతారు. అలాంటివాళ్లు ఉన్న చోట నా జాగ్రత్తలో నేను ఉంటాను. ⇒ మా అత్తగారింట్లో నన్ను అర్థం చేసుకున్నారుమా ఆయన బిహారీ. మా పెళ్లప్పటికి నేను సినిమా ఇండస్ట్రీలో లేను. మా అత్తగారింట్లో ‘గూంఘట్’ (ముసుగు) కల్చర్ ఉంది. కానీ నేను అలా ముసుగు వేసుకోవాలని వాళ్లు ఆశించలేదు. నేను మోడ్రన్‌గా ఉంటాను. అయితే నా వస్త్రధారణకు, నా మనస్తత్వానికి ఏమాత్రం సంబంధం లేదని మా మామగారు గ్రహించారు. నన్ను కూతురిలా చూసుకుంటారు. మా ఆయన నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. మా ఇంట్లో నా చుట్టూ అలాంటి మగవాళ్లు ఉన్నారు. వేరే అమ్మాయిల జీవితాల్లోనూ ఇలా మంచి మగవాళ్లు ఉండాలన్నది నా ఆశ.⇒ ధోతీ కట్టుకుని ఉండగలరా?వస్త్రధారణ అనేది కంపర్ట్ కోసమే. ఇప్పుడు మగవాళ్ల దుస్తులు గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో పూజలు చేసినప్పుడు పట్టు ధోతీ కట్టుకుని చేస్తారు కదా... పూజ అయిపోగానే తీసేసి, ‘షార్ట్స్’ వేసుకుంటారు. మరి... ధోతీ కట్టుకుని గంటలు గంటలు ఉండమంటే వాళ్లు ఉంటారా? ఉండరు... ఎందుకంటే ధోతీ వారికి సౌకర్యం కాదు. మరి అమ్మాయిలు వాళ్ల కంఫర్ట్ గురించి ఆలోచించకూడదా? అయినా చీర కట్టుకో అంటారు... అసలు చీర కంటే ‘ఎక్స్పోజింగ్’ వేరే ఏ డ్రెస్‌లో ఉంటుంది?⇒ అసలు ఆ పదం ఏంటి?‘సామాను’ అనే పదం ఏంటి? ఆడవాళ్ల శరీర భాగాలను అలాపోల్చడానికి ఎంత ధైర్యం ఉండాలి? పైగా బహిరంగ వేదిక మీద ‘దరిదప్రు....’, ‘సామాను’ అనే పదాలు వాడటం ఎంత ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనే ధైర్యమా? వాళ్లకి కూతుళ్లు లేరా? అయినా వేరేవాళ్లకు తగ్గట్టుగా మన వస్త్రధారణ ఉండాలా? నేనేదో రెబలియస్‌గా మాట్లాడటం లేదు. అమ్మాయిలు కుక్కిన పేనులా ఉండాలని సీక్రెట్ ఎజెండాతో కొందరు మగవాళ్లు రూల్స్ పెట్టారు. కానీ, అమ్మాయిలను గౌరవించే మగవాళ్లు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రపంచంలో మంచి భాగస్వాములుగా ఉండే మగవాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లని చూసినప్పుడల్లా ఆ జంతువుల్లాంటి మగవాళ్లు ఇలా ఎందుకు ఉండటంలేదు అనిపిస్తుంటుంది.⇒ అక్కడ క్రైమ్ రేట్ తక్కువఅమ్మాయిలు ధరించే దుస్తులే వారికిప్రోటెక్షన్ అంటే... అస్సలు కానే కాదు. నా కుటుంబంలో ఉన్న మగవాళ్లు ప్రోటెక్ట్ చేస్తారు... కానీ రక్షణ పేరుతో కంట్రోల్ చేయాలనుకోలేదు. కొన్ని దేశాలు ఉన్నాయి... అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. ధరించే దుస్తులతో సంబంధం లేదు. ఆ దేశాల్లో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మరి... మనకు ఎందుకీ పక్షపాతం?నాకు ఇద్దరు మగపిల్లలున్నారు. ఒక తల్లిగా వాళ్లకి మంచి ప్రపంచం ఉండాలని కోరుకుంటాను. చేతకాని మగవాళ్లందరూ ఆడవాళ్లను హర్ట్ చేస్తుంటారు. అందుకే మా అబ్బాయిలు నాకంటే ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ధైర్యంగా ఉండే మగవాళ్లు హర్ట్ చేయాలనుకోరు. వాళ్లకి ఇన్‌సెక్యూర్టీ ఉండదు కాబట్టి. -
ఈషా కథ విని షాక్ అయ్యాను: అఖిల్ రాజ్
‘‘శ్రీనివాస్ మన్నెగారు చెప్పిన ‘ఈషా’ కథ విన్నప్పుడు షాకింగ్‌గా అనిపించింది. సినిమాలో ట్విస్టులు, సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌కి మంచి అనుభూతినిచ్చే మూవీ ఇది. హారర్, థ్రిల్లర్ సినిమాలు చూసేవారికి మా సినిమా కొత్త అనుభూతినిస్తుంది’’ అని అఖిల్ రాజ్ తెలిపారు. త్రిగుణ్, అఖిల్ రాజ్ హీరోలుగా, హెబ్బా పటేల్, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు.ఈ సినిమాని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. అఖిల్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘రాజు వెడ్స్ రాంబాయి’ కంటే ముందు ఒప్పుకున్న సినిమా ‘ఈషా’. నేను చేసిన ‘సఖియా’ అనే వెబ్ సిరీస్ గ్లింప్స్ చూసి, దర్శకుడు శ్రీనివాస్‌గారు నన్ను ఆడిషన్ చేసి, ఈ చిత్రంలో వినయ్ పాత్రకి ఎంపిక చేశారు. అయితే ముందుగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ విడుదలైంది. ఆ సినిమాలో నేను చేసిన రాజు పాత్రకి పూర్తి వైవిధ్యంగా ఉండే వినయ్ పాత్రను ‘ఈషా’లో చేశాను. దామోదర ప్రసాద్ సమర్పణ అనగానే ఎలాగైనా ఈ సినిమాలో భాగం కావాలనిపించింది. ఆయన, హేమ వెంకటేశ్వరరావుగార్లు రాజీ పడకుండా ఈ మూవీ నిర్మించారు. సినిమా పట్ల క్లారిటీ ఉన్న దర్శకుడు శ్రీనివాస్‌గారు. వంశీ నందిపాటి, బన్నీవాసుగార్లు ‘ఈషా’ విషయంలోనూ సక్సెస్ అవుతారని నమ్ముతున్నాను. ప్రస్తుతం తరుణ్ భాస్కర్, అనుపమగార్లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాను’’ అని చెప్పారు. -
శంబాలతో సక్సెస్ కొడతాను: ఆది సాయికుమార్
‘‘రాజశేఖర్, మహీధర్ రెడ్డిగార్లకు నిర్మాతలుగా ‘శంబాల’ తొలి చిత్రమైనా ఎంతో ప్యాషన్‌తో నిర్మించారు. అయితే కథపై నమ్మకంతో నా మార్కెట్‌కి మించి ఎక్కువగానే బడ్జెట్ పెట్టారు. కానీ ఎక్కడా వృథా ఖర్చు చేయలేదు. ఈ నెల 25న చాలా సినిమాలు వస్తున్నాయి...పోటీ బాగా ఉండంతో ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ‘శంబాల’ ఔట్పుట్ పట్ల యూనిట్ అంతా చాలా సంతృప్తిగా ఉన్నాం’’ అని ఆది సాయికుమార్ చెప్పారు. ఆయన హీరోగా, అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. అలాగే డిసెంబరు 23న ఆది పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ పంచుకున్న విశేషాలు... ⇒ ‘శంబాల’ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ నుంచి మా మూవీపై మంచి బజ్ ఏర్పడింది. దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేసిన టీజర్, ప్రభాస్, నానీగార్లు విడుదల చేసిన ట్రైలర్స్ ఆడియన్స్‌లో మా మూవీ పట్ల మంచి బజ్ తీసుకొచ్చాయి. ఈసారి మంచి విజయాన్ని అందుకోబోతున్నామనే నమ్మకం ఉంది. మా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. 80వ దశకంలో వచ్చే కథ కాబట్టి లుక్స్ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాం... అందుకే కాస్ట్యూమ్స్‌ని చాలా సెలెక్టివ్‌గా తీసుకున్నాం. మా సినిమాలో అద్భుతమైనపోరాట సన్నివేశాలున్నాయి. రాజ్‌కుమార్ మాస్టర్ బాగా చూపించారు.⇒ ‘శంబాల’ అనే ప్రాంతం ఉందా? లేదా అనేది ఎవరికీ తెలీదు. మన పురాణాల ప్రకారం శంబాలకి ఓ మంచి గుర్తింపు ఉంది. ఆ టైటిల్ చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ‘కల్కి’ తర్వాత శంబాల పేరు మరింత ఎక్కువగా ట్రెండ్ అయింది. ఈ మూవీ కోసం యుగంధర్గారు చాలా కష్టపడ్డారు... ఆయన పెద్ద డైరెక్టర్ అవుతారు. శ్రీచరణ్ పాకాల ఆర్ఆర్ చూసి అందరం షాక్ అయ్యాం. సినిమా చూసిన తర్వాత అందరూ నేపథ్య సంగీతం గురించి మాట్లాడుకుంటారు. ప్రస్తుతం ఆడియన్స్‌కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇలాంటి జానర్లను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ‘శంబాల’ లాంటి చిత్రాన్ని థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్‌ను ఎంజాయ్ చేస్తారు.⇒ క్రిస్మస్ అనేది మంచి సీజన్. శ్రీకాంత్‌గారి ఫ్యామిలీతో మాకు మంచి బాండింగ్ ఉంది. రోషన్ తో నాకు మంచి పరిచయం ఉంది. మా ‘శంబాల’తో పాటు రోషన్ నటించిన ‘చాంపియన్’ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇక ఇన్నేళ్ల నా కెరీర్ పట్ల పూర్తిగా సంతృప్తిగా లేను. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ‘శంబాల’తో సక్సెస్ కొడుతున్నాను. ఆ తర్వాత కూడా మంచి కథలు ఎంచుకుంటాను. నేను నటించిన ‘సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్’ సినిమా చాలా బాగా వచ్చింది.. ఇంకా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. ఆ సినిమా త్వరలో విడుదలవుతుంది. -
కథ విన్నారా?
హీరో రవితేజ, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ సైన్స్ ఫిక్షన్ కథను రవితేజకు వశిష్ట వినిపించారని, ఈ కథ నచ్చి, సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారట వశిష్ట. అలాగే తనకు ‘కిక్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డితోనూ రవితేజ ఓ సినిమాకి చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఈ కథ కూడా విన్నారని తెలిసింది. ఇంకా ‘మ్యాడ్, మ్యాడ్ 2’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వంలోనూ రవితేజ ఓ సినిమా కమిట్అయినట్లుగా వార్తలున్నాయి. రవితేజ కొత్త సినిమా కబురు ఏ దర్శకుడితో ఉంటుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ (వర్కింగ్ టైటిల్)తో రవితేజ బిజీగా ఉన్నారు. అలాగే ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. -
రాజమౌళి-మహేశ్ బాబు వారణాసి.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది..!
రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్‌ను గ్లోబ్ ట్రాటర్ పేరుతో గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు.ఈ ఏడాదిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వారణాసికి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. వారణాసి అద్భుతమైన షెడ్యూల్ పూర్తి చేశాను.. ఇది నాలో నటుడి ఆకలి తీర్చిందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన రాజమౌళికి ధన్యవాదాలు..మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో కలిసి పనిచేయడం చాలా ఉత్సాహంగా అనిపించింది.. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.ప్రకాశ్ రాజ్ రోల్ అదేనా?అయితే ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ రోల్‌పై టాలీవుడ్లో చర్చ నడుస్తోంది. ఈ మూవీలో మహేశ్ బాబు తండ్రిగా కనిపించనున్నారని టాక్. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో ప్రకాశ్ రాజ్ రోల్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా.. ప్రకాశ్ రాజ్ గతంలో రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు చిత్రంలో నటించారు. Wrapped up a wonderful schedule of #Varanasi .. a joy to the hungry actor within me .. thank you @ssrajamouli @urstrulyMahesh @PrithviOfficial @priyankachopra ❤️❤️❤️ it was exhilarating to work with you all .. can’t wait to resume the next schedule 🥰🥰🥰— Prakash Raj (@prakashraaj) December 23, 2025 -
'రాజుగారి పెళ్లిరో'.. వెడ్డింగ్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి సంక్రాంతి బరిలో నిలిచాడు. ఆయన హీరోగా వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని మారి దర్శకత్వంలో తెరకెక్కించారు.తాజాగా రిలీజైన రాజు గారి పెళ్లిరో అంటూ సాగే పాట ప్రోమో మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 26న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతమందిస్తున్నారు. -
మహిళలపై శివాజీ కామెంట్స్.. ఆ రెండు ఒక్కటి కాదు: యాంకర్ సుమ
నటుడు శివాజీ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ యాంకర్ సుమ కనకాల స్పందించింది. మహిళలకు రక్షణ కల్పించడం.. ఆంక్షలు పెట్టడం ఒక్కటి కాదని తెలిపింది. ఇటీవలే తాను ఎకో అనే మూవీ చూశానని వెల్లడించింది. సినీ ఇండస్ట్రీలో ఇటీవల నిధి అగర్వాల్, సమంతకు జరిగిన సంఘటనలు మనకు హెచ్చరికలాంటివని సుమ తెలిపింది. ఇలాంటివీ చూస్తుంటే మహిళలకు భద్రత, గౌరవం ఎక్కడుందని ఆమె ప్రశ్నించింది. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని వదిలేయడం అంటే ఇంకా పెంచి పోషించడమేనని యాంకర్ రాసుకొచ్చారు. ఈ సంఘటనలను మహిళలు ప్రశ్నిస్తూనే ఉంటారని సుమ తన పోస్ట్‌లో స్పష్టం చేసింది. హీరోయిన్ల దుస్తులపై శివాజీ కామెంట్స్..శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడారు. నటీమణుల దుస్తులపై ఆయన కామెంట్స్ చేశారు. సామాన్లు కనపడేలా డ్రెస్సులు ధరించొద్దని.. చీరలోనే అందంగా ఉంటారని వెటకారంగా అన్నారు. అదే సమయంలో కొన్ని అసభ్యకర పదాలు వాడారు. దీంతో శివాజీ చేసిన కామెంట్స్‌పై అనసూయ, చిన్మయితో సహా పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికీ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశాడు శివాజీ.Recently watched a film called eko which says Protection and restriction are not the same. pic.twitter.com/5ozSvvYUhq— Suma Kanakala (@ItsSumaKanakala) December 23, 2025 -
దెబ్బకు దిగి వచ్చిన శివాజీ.. ఎట్టకేలకు క్షమాపణలు..!
టాలీవుడ్ నటుడు శివాజీ క్షమాపణలు కోరారు. మహిళల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఆ రెండు మాటలు అనకుండా ఉండాల్సిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. సారీ చెబుతూ ట్విటర్ వేదికగా వీడియోను రిలీజ్ చేశాడు. వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. 'హలో అండి.. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో ఇబ్బందులు పడిన సందర్భంలో నాలుగు మంచి మాటలు చెబుతూనే రెండు అన్‌పార్లమెంటరీ పదాలు వాడాను. నేను మాట్లాడింది అందరు అమ్మాయిల గురించి కాదు.. హీరోయిన్స్ బయటికి వెళ్లినప్పుడు దస్తులు బాగుంటే మంచిదనే ఉద్దేశం. ఏదేమైనా రెండు పదాలు వాడకుండా ఉండాల్సింది. స్త్రీ అంటే మహాశక్తి. ఒక అమ్మవారిలా అనుకుంటా. ఈ కాలంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఆ విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఒక ఊరి భాష మాట్లాడాను. అది చాలా తప్పు. నా ఉద్దేశం మంచిదే కానీ.. ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు మంచి ఉద్దేశమే తప్ప.. అవమానపరచాలి.. కించపరచాలి అనే ఉద్దేశం లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు.. అలాగే మహిళలు తప్పుగా భావిస్తే మీ అందరికీ నా క్షమాపణలు' అంటూ వీడియోలో కోరాడు. I sincerely apologise for my words during the Dhandoraa pre-release event last night.@itsmaatelugu pic.twitter.com/8zDPaClqWT— Sivaji (@ActorSivaji) December 23, 2025 -
సందీప్ కిషన్ కోలీవుడ్ మూవీ.. తెలుగు టీజర్ వచ్చేసింది.!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న లేటేస్ట్ కోలీవుడ్ మూవీ సిగ్మా. ఈ చిత్రంతో దళపతి తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని యాక్షన్ కామెడీ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్‌తో పాటు అడ్వెంచరస్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైట్ సీన్స్, విజువల్స్ ఈ సినిమాపై అంచనాలు మరించ పెంచుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ, మగలక్ష్మి, షీలా రాజ్‌కుమార్, కమలేష్, కిరణ్ కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
హీరోయిన్ల దుస్తులపై కామెంట్స్.. శివాజీకి బిగ్ షాక్..!
టాలీవుడ్ సినీయర్ నటుడు శివాజీకి బిగ్ షాక్ తగిలింది. హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను చేసిన కామెంట్స్‌పై వివరణ కోరుతూ శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. శివాజీ మాట్లాడిన మాటలను తెలంగాణ మహిళా కమిషన్ లీగల్ టీమ్ పరిశీలించిందని చైర్పర్సన్ నేరెళ్ల శారద వెల్లడించారు.శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. సినీ నటులు మహిళల గురించి మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా సరే మహిళల గురించి అవమానకరంగా, అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద వార్నింగ్ ఇచ్చారు.సామాన్లు అంటూ కామెంట్స్.. కాగా.. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన శివాజీ హీరోయిన్లు డ్రెస్‌లను ఉద్దేశించి మాట్లాడారు. దుస్తుల విషయాన్ని చెబుతూ కొన్ని అసభ్యకరమైన పదాలు వాడారు. సామాన్లు అంటూ వెటకారంగా కామెంట్స్ చేశారు. దీనిపై ఇప్పటికే అనసూయతో పాటు చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ కామెంట్స్‌పై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సైతం క్షమాపణలు చెప్పారు. ఈ టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. -
హీరోయిన్లపై శివాజీ చిల్లర వ్యాఖ్యలు.. సారీ చెప్పిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హీరోయిన్ల డ్రెస్‌లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో శివాజీపై మహిళ నటీమణులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిన్మయి శ్రీపాద, అనసూయ శివాజీ కామెంట్స్‌పై తమదైన శైలిలో స్పందించారు. సినీతారలతో పాటు నెటిజన్స్ సైతం శివాజీపై మండిపడుతున్నారు. ఈ టాపిక్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి అసభ్యకర రీతిలో శివాజీ మాట్లాడిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. శివాజీ పేరును ప్రసావించకుండానే ఆయన తరఫున క్షమాపణలు కోరుతూ నోట్ రిలీజ్ చేశారు. నిన్న రాత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రస్తుత ఈ నాగరిక సమాజం మహిళల నిర్ణయాల, ఇష్టాలు, వారి హక్కులను పరిరక్షిస్తుందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.మంచు మనోజ్ తన నోట్లో ప్రస్తావిస్తూ.. 'హీరోయిన్ల దుస్తులపై ఇలాంటి ప్రకటన చేయడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మహిళలు ఇలాంటి దుస్తులే మాత్రమే వేసుకోవాలి అని చెప్పడం ఏ మాత్రం సహించేది కాదు. వారి గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాత్రమే తెలుస్తుంది. దుస్తుల ఆధారంగా కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చర్చలకు తావులేదు. ప్రజల అభిప్రాయం కోసం ఎవరు కూడా దుస్తులు ధరించరు. మహిళలను అగౌరవ పరిచేలా సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలకు నేను క్షమాపణ కోరుతున్నా. మహిళలను వస్తువుల్లా చూడొద్దు. ఇలాంటి కామెంట్స్ వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మహిళలకు గౌరవం, హోదా, సమానత్వం మనందరం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం అవసరం' అని రాసుకొచ్చారు. Came across some deeply disappointing comments last night. A civilised society protects women’s rights instead of policing their choices. #RespectWomen #RespectYourself pic.twitter.com/ym3CmPsxgD— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 23, 2025 -
నువ్వు బొట్టు, మెట్టెలు పెట్టుకొని తిరుగు! శివాజీకి చిన్మయి కౌంటర్
-
డ్యాన్స్ తో డామినేట్ చేస్తున్న రోషన్
-
బూతుల్ని జనాలకు అలవాటు చేస్తున్నారా?
సినిమా అనేది ఓ మాధ్యమం. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తారా సందేశం ఇస్తారా అనేది హీరోలు, దర్శకనిర్మాతల ఇష్టం. సమాజానికి మంచి చేయకపోయినా పర్లేదు గానీ చెడు మాత్రం చేయకూడదు. కానీ గత కొన్నాళ్ల నుంచి చూసుకుంటే మాత్రం ఈ విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా మాట్లాడుకునే బూతుల్ని పలు సినిమాల్లో యదేచ్ఛగా వాడేస్తున్నారు. మరి వీటిని జనాలకు అలవాటు చేయాలనుకుంటున్నారా? లేదంటే అసలేం చేద్దామనుకుంటున్నారు?(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)తెలుగు సినిమాలు కొన్నాళ్ల ముందు వరకు మరీ అంత కాకపోయినా కాస్త పద్ధతిగా ఉండేవి. ఫ్యామిలీ, కామెడీ స్టోరీలతో తీసిన మూవీస్ ఎప్పటికప్పుడు వస్తుండేవి. ఆడియెన్స్ కూడా చాలావరకు కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లేవారు. కానీ లాక్డౌన్, ఓటీటీల రాకతో ట్రెండ్ మారిపోయింది. నిజంగానే మారిందా లేదంటే దర్శకనిర్మాతలు పరిస్థితులకు తగ్గట్లు మార్చేస్తున్నారా అనేది ఇక్కడ అర్థం కాని విషయం.ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్ లాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. కాబట్టి నచ్చిన డైలాగ్స్ నచ్చిన సీన్స్ పెట్టకోవచ్చు. అందుకే 'మీర్జాపుర్' లాంటి సిరీస్‌లు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సిరీస్ చాలా ఇంటెన్స్ సబ్జెక్ట్‌తో తీశారు. కానీ బూతులు, యాక్షన్ సన్నివేశాలు దారుణంగా ఉంటాయి. ఈ తరహా కంటెంట్ ఇష్టపడేవాళ్లు వీటిని చూశారు. మిగిలిన వాళ్లు లైట్ తీసుకున్నారు. ఓటీటీ కంటెంట్ వేరు సినిమా కంటెంట్ వేరు. కానీ ఈ రెండింటి మధ్య గీత చెరిగిపోతున్నట్లు అనిపిస్తుంది.(ఇదీ చదవండి: హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై)ఎందుకంటే ఈ ఏడాది మార్చిలో నాని 'ద ప్యారడైజ్' సినిమా అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటివి చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోయారు. కానీ చివరలో ఉపయోగించిన ఓ బూతు పదం విని షాకయ్యారు. తల్లిని దూషించేలా ఉండే ఆ పదాన్ని సినిమాలో ఏ సందర్భంలో ఉపయోగించారో తెలీదు కానీ ప్రమోషనల్ వీడియోలో పెట్టడం మాత్రం అవసరమా అనే కామెంట్స్ కొన్ని వినిపించాయి. తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'రౌడీ జనార్థన' టైటిల్ వీడియో లాంచ్ చేశారు. ఇందులోనూ రక్తపాతం, చివరలో బూతుపదాన్ని పెట్టారు.తెలంగాణ కల్చర్ అంటే పలువురు దర్శకులు మందు తాగడాన్ని చూపించినట్లు.. మాస్ సినిమాలనగానే కొందరు డైరెక్టర్స్, బూతుల్ని యదేచ్ఛగా వాడేస్తున్నారు. ఈ రెండు చిత్రాలే కాదు గతంలో ఇదే విజయదేవరకొండ 'అర్జున్ రెడ్డి'లోనూ బూతులు ఉంటాయి. విశ్వక్ సేన్ 'ఫలక్‌నుమా దాస్'లోనూ అలాంటి డైలాగ్స్ వినిపిస్తాయి. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ దర్శకనిర్మాతలు బూతుల్ని జనాలకు అలవాటు చేసే పనిలో ఉన్నారా అనే సందేహం రావడం గ్యారంటీ!(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్
-
హీరోయిన్లపై శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. చిన్మయి స్ట్రాంగ్ రిప్లై
కొందరు సెలబ్రిటీలు మైక్ పట్టుకుంటే నోరు అదుపులో ఉండదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తుంటారు. తాము చెప్పదలుచుకున్నది మంచి విషయమే కావొచ్చు. కానీ ఎలా చెబుతున్నమనేది కూడా ముఖ్యమే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే నటుడు శివాజీ.. సోమవారం జరిగిన 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ హీరోయిన్ల డ్రస్సింగ్ స్టైల్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మరీ ముఖ్యంగా రెండు బూతు పదాల్ని స్టేజీపై బహిరంగంగా అనడం చర్చనీయాంశమైంది. స్పందించిన సింగర్ చిన్మయి.. ఆగ్రహంతో ట్వీట్ చేసింది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)శివాజి ఏమన్నాడంటే?'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు' అని శివాజీ అన్నాడు. అయితే ఇందులో ఓ బూతు పదంతో పాటు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకునే సామాను అనే చిల్లర పదం ఉపయోగించడం ఇక్కడ వివాదాస్పదమైంది.సింగర్ చిన్మయి రెస్పాన్స్ శివాజీ పబ్లిక్‌గా స్టేజీపై చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించింది. 'తెలుగు నటుడు శివాజీ.. బూతు పదాలతో హీరోయిన్లకు అనవసర సలహా ఇచ్చాడు. ఆయా పదాల్ని ఎక్కువగా పోకిరీలు ఉపయోగిస్తారు. ఓ అద్భుతమైన సినిమాలో శివాజీ విలన్‌గా నటించాడు. తద్వారా పోకిరీలకు హీరో అయిపోయాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే పబ్లిక్‌గా ఇలాంటి పదాలు వాడటం. ఆయనేమో జీన్స్, హూడీ వేసుకున్నాడు. మరి ఆయన చెప్పిన దానిబట్టి చూస్తే ధోతీ కట్టుకుని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలిగా. ఒకవేళ ఆయనకు పెళ్లయి ఉంటే బొట్టు, మెట్టెలు కూడా పెట్టుకోవాలి. అసలు మహిళలని ఇక్కడ ఎలా చూస్తున్నారో అర్థమవుతోంది' అని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు) -
విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'దండోరా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మాస్ రౌడీ జనార్ధన
విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ డ్రామా సినిమాకు ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్ ఖరారైంది. ఈ చిత్రంలో కీర్తీసురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 డిసెంబరులో విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని సోమవారం నిర్వహించారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ జనార్ధన’ కోసం విజయ్‌తో తొలిసారిగా ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. 1980 దశకం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది.ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్లో విజయ్ కనిపించబోతున్నాడు. తను ఇప్పటి వరకు ఇంత మాస్, బ్లడ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చెప్పారు. ‘‘నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానినే. నేను అభిమానించే కీర్తీ సురేష్, ‘దిల్’ రాజుగార్లతో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్ర కథ ఎంత బాగుందో, ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడటం కూడా అంతే బాగుందని రాజుగారు అనేవారు’’ అని తెలిపారు రవికిరణ్ కోలా. శిరీష్, ప్రోడక్షన్ డిజైనర్ డినో శంకర్, కెమెరామేన్ ఆనంద్ సి. చంద్రన్ మాట్లాడారు. -
శంబాలపై పాజిటివ్ వైబ్ ఉంది: కిరణ్ అబ్బవరం
‘‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమాలో ధర్మపాత్ర కోసం సాయి కుమార్‌గారిని కలిసినప్పుడు ఆయన మాకు చేసిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన వల్లే నా కెరీర్ బాగుందనుకుంటూ ఉంటాను. ‘శంబాల’ చిత్రంపై ముందు నుంచి పాజిటివ్ వైబ్ ఉంది.. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ మూవీతో ఆదిగారికి మంచి విజయం రావాలి’’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరోలు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, అశ్విన్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్, నిర్మాతలు నవీన్ యెర్నేని, టీజీ విశ్వ ప్రసాద్, మైత్రి శశిధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచు మనోజ్ మాట్లాడుతూ–‘‘చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు.. మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు’’ అన్నారు.‘‘సాయికుమార్‌గారి కొడుకుని అని చెప్పుకోవడాన్ని గర్వంగా భావిస్తాను’’ అని ఆది సాయికుమార్ తెలిపారు. ‘‘ఈ చిత్రంతో ఆదికి మంచి విజయం దక్కాలి’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘శంబాల’తో ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం, టీమ్‌కి విజయోత్సాహం రావాలని కోరుకుంటున్నాను’’ అని నటుడు సాయికుమార్ చెప్పారు. ‘‘నా టీమ్ సపోర్ట్ వల్లే సినిమాను ఇంత గొప్పగా తీశాను’’ అని యుగంధర్ ముని పేర్కొన్నారు. -
ఫుల్ వయొలెంట్‌గా విజయ్ దేవరకొండ.. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూశారా?
కింగ్డమ్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పుల్ యాక్షన్ మూవీ రౌడీ జనార్ధన. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీనివ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూస్తే ఈ చిత్రంలో ఫుల్ వయొలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.ఈ గ్లింప్స్‌లో ఫైట్ సీన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. 'ఈ కళింగపట్నంలో ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. రౌడీ జానార్ధన' అనే డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారని టాక్. -
జగపతిబాబు ఇంట శుభకార్యం.. ఇలా రివీల్ చేశాడేంటి?
టాలీవుడ్ నటుడు జగపతిబాబు గుడ్ న్యూస్ చెప్పారు. తన రెండో కూతురి పెళ్లి అయిపోయిందని ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఏఐతో రూపొందించిన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కుమార్తె పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు రివీల్ చేయకపోవడం గమనార్హం.కాగా.. జగపతిబాబు తెలుగులో హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన జగపతిబాబు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండో ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నారు. సినిమాలతో పాటు ప్రముఖ టాక్ షో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 'జయమ్ము నిశ్చయమ్మురా' పేరుతో ప్రసారం అవుతోన్న షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది మిరాయి చిత్రంతో అలరించిన జగ్గుభాయ్..ప్రస్తుతం రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
'మనకొక మగతోడు కావాలి..' బోల్డ్‌గా బ్యాడ్ గర్ల్స్ ట్రైలర్
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఇటీవల రిలీజైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా బ్యాడ్ గర్ల్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిన నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిన తర్వాత ఎలా మారిపోయారనే అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని ఫుల్ కామెడీతో ఎమోషన్స్ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మించారు. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. -
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పిటిషన్లు.. హైకోర్ట్ కీలక ఆదేశాలు.!
సెలబ్రిటీలు వరుసగా తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలు పిటిషన్స్ వేయగా.. అదే బాటలో టాలీవుడ్ హీరోలు నడుస్తున్నారు. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో జూనియర్ ఎన్టీఆర్,పవన్ కల్యాణ్ తమ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లు వేశారు. తమ ఫోటోలు వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం ,తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.వీరిద్దరి పిటిషన్లపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ చేపట్టింది. పవన్ కళ్యాణ్,జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. తప్పుడు వార్తలు,మార్ఫింగ్ ఫోటోలతో అవమానకరంగా పోస్టులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఫ్లిప్ కార్ట్,అమెజాన్, ఎక్స్,గూగుల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని ప్రతివాదులు కోర్టుకు తెలిపారు. తొలగించని లింకులపై ఆదేశాలు జారీ చేసేముందు వినియోగదారుడి వాదనలు వినాలని కోర్టు అభిప్రాయపడింది. అభిమానుల ఖాతాలో పోస్టులు అని ఇన్స్టాగ్రామ్ ప్రత్యేకంగా స్పష్టం చేయాలని కోర్టు సూచించింది. ఈ విషయాన్ని గూగుల్ తమ ఖాతాదారులకు తెలియజేయాలని .. లేదా ఖాతాను నిలిపివేయాలని హైకోర్టు తెలిపింది. వీటికి సంబంధించిన బీఎస్ఐ, ఐపీ అడ్రస్‌లు, లాగిన్ వివరాలు 3 వారాల్లో అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది. -
రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం.. గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. తాజాగా థియేటర్లలో రిలీజైన 'గుర్రం పాపిరెడ్డి' మూవీలో జడ్జి పాత్రలో అలరించారు. ఇప్పుడు ఆయన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. తానే స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)రాష్ట్రపతి ముర్ము గత మూడురోజులుగా హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో సేదదీరారు. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన బ్రహ్మానందం.. ఈమెని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. శాలువాతో బ్రహ్మీని సత్కరించారు. ప్రతిగా బ్రహ్మానందం తన స్వహస్తాలతో లిఖించిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ముర్ముకు బహుకరించారు.హాస్యనటుడిగా చాలా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం.. తీరిక సమయాల్లో చాలా బొమ్మలు గీస్తుంటారు. వాటిని పలువురు తెలుగు సెలబ్రిటీలకు బహుమతులుగా ఇచ్చారు. ఇప్పుడు అలానే రాష్ట్రపతికి తను గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని బహుకరించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: తల్లికి ఇచ్చిన చివరిమాట.. టాలీవుడ్ విలన్లో ఈ కోణం ఉందా?) -
ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)
-
ఈ ఏడాది టాలీవుడ్ కలెక్షన్స్ ఢమాల్.. సత్తా చూపని తెలుగు సినిమా
కొద్దిరోజుల్లో టాలీవుడ్ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. అయితే, 2025లో బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ వాటా రేంజ్ ఎంత అనేది తెలుసుకోవాలని చాలామంది ఆసక్తితో ఉంటారు. గత కొన్నేళ్లుగా హిందీ చిత్రసీమ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. కానీ, ఈ ఏడాదిలో సత్తా చాటింది. ధురందర్, ఛావా, సైయారా వంటి మూడు సినిమాలే సుమారు రూ. 2,500 కోట్ల కలెక్షన్స్‌కు దగ్గర్లో ఉన్నాయి. అయితే, ఈ ఏడాది టాలీవుడ్ పరిస్థితి చెప్పుకోతగినంత రేంజ్లో లేదు. అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాల్లో ఓజీ మాత్రమే ఉంది. అదే గతేడాదిలో అయితే పుష్ప2, కల్కి, దేవర, హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు టాప్- 10లో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు ఏకంగా రూ. 3600 కోట్లు రాబట్టాయి. దీంతో గతేడాది ఇండియన్ సినిమా మార్కెట్లో తెలుగు పరిశ్రమ వాటానే ఎక్కువగా ఉంది. 2024లో టాలీవుడ్ మొత్తం ప్రపంచవ్యాప్త వసూళ్లు సుమారు రు. 7,924 కోట్ల గ్రాస్ ఉంది.2025లో మరింత ఉత్సాహంతో భారతీయ సినీ పరిశ్రమ అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో మెత్తం భాషలలో కలిపి దేశవ్యాప్తంగా 1546 సినిమాలు విడుదలయ్యాయి. అన్ని సినిమాలు రూ. 12,604 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి. నెట్ పరంగా చూస్తే రూ. 10696 కోట్లుగా ఉంది. అయితే, కేవలం హిందీ పరిశ్రమ నుంచి ఈ ఏడాది 231 సినిమాలు విడుదలైతే రూ. 4,639 కోట్ల గ్రాస్ వచ్చింది. తర్వాతి స్థానంలో టాలీవుడ్ ఉంది. తెలుగులో విడుదలైన 274 సినిమాలకు గాను రూ. 2,551 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాతి స్థానంలో తమిళ ఇండస్ట్రీ రూ. 1,533 కోట్ల గ్రాస్‌తో ఉంది. కన్నడ రూ. 1,100 కోట్లు, మలయాళం రూ. 919 కోట్లతో వరుసగా ఉన్నాయి.బాలీవుడ్లో సత్తా చూపని తెలుగు సినిమాఈ ఏడాదిలో తెలుగు సినిమా కలెక్షన్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. కనీసం రూ. 500 కోట్లు రాబట్టిన సినిమా ఒక్కటీ లేదు. ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మాత్రమే రూ. 300 కోట్ల కలెక్షన్స్‌తో టాప్‌లో ఉన్నాయి. తర్వాత మిరాయ్, డాకు మహారాజ్, హిట్, కుబేర వంటి చిత్రాలు మాత్రమే కాస్త మెప్పించాయి. అయితే, ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ నిరాశపరిచింది. రూ. 500 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని అందరూ అనుకుంటే ఆశించినంత రేంజ్లో రీచ్ కాలేదు. ఆపై హరిహర వీరమల్లు, కింగ్డమ్, ఘాటీ, మాస్ జాతర, అఖండ-2 వంటి సినిమాలు కూడా అదే బాటలో నిలిచాయి. ఫైనల్‌గా 2025 టాలీవుడ్‌కు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించిన సినిమాలు పడలేదు. -
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)
-
సీనియర్ హీరోలతో జోడీ.. అది మ్యాటరే కాదంటున్న బ్యూటీ
కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్.. అమిగోస్ మూవీతో తెలుగుతెరకు పరిచయమైంది. ఆ వెంటనే నా సామిరంగ మూవీలో నాగార్జునతో జతకట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే హీరో రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో భాగంగా చిట్‌చాట్ నిర్వహించింది.సీనియర్ హీరోలతో జోడీ..ఈ కార్యక్రమంలో ఆషికాకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి సీనియర్ హీరోలతో జతకడుతున్నారు.. మీ వయసుకు తగ్గ పాత్రలు రావట్లేదని ఫీలవుతున్నారా? అని ఓ విలేఖరి అడిగాడు. అందుకు ఆషిక మాట్లాడుతూ.. ఒక నటిగా ఎన్ని విభిన్న పాత్రల్లో నటించాలనేదానిపైనే ఫోకస్ పెడతాను. ఏజ్ గ్యాప్‌పై ఓపెనైన బ్యూటీభర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ఈ జనరేషన్‌కు తగ్గట్లుగా యంగ్, మోడ్రన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా సామిరంగా మూవీలో పరిణతి ఉన్న పాత్రలో నటించాను. భిన్న పాత్రలు చేయాలనే ఆ సినిమా ఒప్పుకున్నాను. సీనియర్ హీరోలతో నటించినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. పాత్ర నచ్చినప్పుడు ఏజ్ గ్యాప్ గురించి పట్టించుకోను. సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న విషయాలను నేను లెక్క చేయను. కథలో నా పాత్ర ఎంత బలంగా ఉందనేది మాత్రమే ఆలోచిస్తాను అని ఆషిక చెప్పుకొచ్చింది.చదవండి: శోభిత, సమంతతో నాగచైతన్య -
ఫాన్స్ అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డ సామ్
-
‘పతంగ్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
శోభిత, సమంతతో నాగచైతన్య.. ఫోటో వైరల్
అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ జంట ఇటీవలే మొదటి పెళ్లిరోజును సింపుల్‌గా జరుపుకున్నారు. ఫస్ట్ యానివర్సరీ రోజు తమ పెళ్లిరోజు వీడియోను అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ కలిసున్న ఫోటోలను తరచూ కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వదులుతూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తుంటారు. అయితే ఈసారి చై-శోభితతో పాటు సమంత కూడా కలిసున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఫ్యామిలీ ఫోటోఅవును, చై, శోభిత, సమంత.. ముగ్గురూ కలిసి సెల్ఫీకి పోజిచ్చారు. కాకపోతే ఇక్కడ సమంత అంటే హీరోయిన్ సామ్ కాదులెండి. శోభిత సోదరి! ఆమె పేరు కూడా సమంతనే కావడంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. చై మాజీ భార్య పేరు, మరదలి పేరు ఒకటే కావడంతో ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది.చై వైవాహిక జీవితంహీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత.. ఏ మాయ చేసావే మూవీలో తొలిసారి జంటగా నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమను పెద్దలు కూడా ఒప్పుకోవడంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. క్యూట్ కపుల్‌గా కనిపించే ఈ జంట మధ్య తర్వాత తెలియని అగాధం ఏర్పడింది. దీంతో నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ 2021లో విడాకులు తీసుకున్నారు.రెండో పెళ్లితర్వాత చై.. హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2024 డిసెంబర్ 4న వీరి వివాహం జరిగింది. అటు సమంత కూడా కొంతకాలంగా ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడిపింది. 2025 డిసెంబర్ 1న ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చింది. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో సామ్-రాజ్ రెండో పెళ్లి చేసుకున్నారు. #NagaChaitanya seen with his wife #Sobhita and her sister #Samantha pic.twitter.com/FxOsh9ldFS— Milagro Movies (@MilagroMovies) December 21, 2025 -
ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఓడినా.. రెమ్యునరేషన్లో 'ఇమ్మాన్యుయేల్' అదుర్స్
బిగ్‌బాస్ తెలుగు 9 అసలైన విజేత ఇమ్మాన్యుయేల్ అని సోషల్‌మీడియాలో చాలామంది అంటుంటారు. ఈ సీజన్లో తను చాలామంది అభిమానాన్ని సంపాదించుకున్నాడని కామెంట్ల రూపంలో అర్థం అవుతుంది. ఈ సీజన్ ప్రతి ఎపిసోడ్లో ఎక్కువ స్క్రీన్ షేర్ చేసుకుంది ఇమ్మాన్యుయేల్నే కావడం విశేషం.. కమెడియన్‌గా అడుగుపెట్టిన తను హీరోగా నిలిచాడని బిగ్‌బాస్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు. తనకు ట్రోఫీ దక్కలేదు. కానీ, ప్రేక్షకుల గుండెల్లో విజేతగా నిలిచాడు. హౌస్‌లో ఉన్నంత వరకు తనకు దగ్గరైన వాళ్లు తప్పు చేసినా సరే.. మంచివైపే నిల్చున్నాడు. తనవారు తప్పు చేస్తే అంతే ధీటుగా నిలదీశాడు. తనమన బేధం లేకుండా ఆనందాన్ని అందరికీ పంచుతూ ఈ సీజన్ ఎంటర్టైనర్గా నిలవడమే కాకుండా ఆటలో ఒక పోరాట యోధుడిని కూడా చూపించాడు. కానీ, 4వ స్థానంతో సరిపెట్టుకున్న ఇమ్ము అసలైన విజేత అంటూ సోషల్‌మీడియాలో (Social Media) పోస్టులు పెడుతున్నారు.రెమ్యునరేషన్ ఎంత..?బిగ్‌బాస్‌లో ఇమ్మానుయేల్ (Immanuel) 15 వారాల పాటు కొనసాగారు. తన జర్నీ చివరి వరకు కూడా ప్రేక్షకులను నవ్వించాడు. ఏడిపించాడు.. అలరించాడు. గతంలో కమెడియన్స్ చాలామంది బిగ్‌బాస్‌లోకి వచ్చారు. కానీ, ఇమ్ము మాత్రం బలమైన మార్క్ చూపాడు. అయితే, ఇమ్ము తన రెమ్యునరేషన్‌కు మించి కంటెంట్‌ను ప్రేక్షకులకు ఇచ్చాడు. బిగ్‌బాస్ నుంచి వారానికి రూ. 2.6 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే బిగ్‌బాస్ నుంచి మొత్తంగా రూ. 40 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్లో భరణి, సంజనలు రెమ్యునరేషన్లో టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఇమ్ము ఉన్నాడు. -
జూబ్లీహిల్స్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)
-
నటి సమంతకు చేదు అనుభవం..
హైదరాబాద్‌లో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమంతకు చేదు అనుభవం ఎదురైంది. సమంత ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. కొద్దిరోజుల్లోనే సమంత ఒక కార్యక్రమం కోసం వస్తున్నడంతో ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో భద్రతా సిబ్బంది ఆమెను కారు వరకు తీసుకెళ్లడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సెలబ్రిటీల పట్ల పెరుగుతున్న ఈ వెర్రి అభిమానంపై నెట్టింట తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. చదువుకున్న యువతనే ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తున్నడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం కోసం పట్టుచీరలో ఎంతో హుందాగా వెళ్లిన సమంత.. ఆ కార్యక్రమం ముగించుకుని కారు వైపు వెళ్తుండగా చాలామంది ఆమెను చుట్టుముట్టారు. దీంతో భద్రతా సిబ్బంది అతికష్టంతో ఆమెను సురక్షితంగా కారు వరకు చేర్చారు. అక్కడికి వచ్చిన వారిని అదుపు చేయడం కూడా వారికి కష్టంగా మారింది. వారి మధ్యలో సమంత నడవలేని పరిస్థితి ఉన్నప్పటికీ ఆమె చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ లులూ మాల్లో నిధి అగర్వాల్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 'ది రాజా సాబ్' సినిమా సాంగ్ ఈవెంట్ నుంచి ఆమె తిరిగి వెళ్తుండగా తనకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తనపై చేతులు కూడా వేయడంతో నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిధి కూడా ఇదే ఘటనపై ఈవెంట్ నిర్వాహుకులను తప్పుబట్టింది. వరుసుగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో కొందరు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ కూడా ఉండదా..? అంటూ భగ్గుమంటున్నారు. అభిమానం హద్దులు దాటుతోందని విమర్శలు వస్తున్నాయి. Why do some fans in the South still struggle with boundaries, even after the Rajasaab incident? Passion is great, but respect and personal space matter too.#SamanthaRuthPrabhu pic.twitter.com/FgIqH51OCg— Cineholic (@Cineholic_india) December 21, 2025 -
హిట్ దర్శకుడితో ధనుష్ సినిమా.. షూటింగ్ పూర్తి
వరుస విజయాలతో బిజీగా ఉన్న నటుడు ధనుష్. ఈయన నటించిన ద్విభాషా చిత్రం కుబేర మంచి విజయంతోపాటు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదేవిధంగా ధనుష్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఇడ్లీ కోడై చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఇటీవల ఆయన నటించిన హిందీ చిత్రం తేరే ఇష్క్ మే చిత్రం సక్సెస్ అయ్యింది. తాజాగా ధనుష్ నటిస్తున్న చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇది ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 54వ చిత్రం అన్నది గమనార్హం. తమిళ హిట్ మూవీ 'పోర్ తొళిల్'తో గుర్తింపు పొందిన దర్శకుడు విఘ్నేష్ రాజా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై డి.ఐసరిగణేష్ నిర్మిస్తున్నారు. మమితాబైజూ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు కేఎస్.రవికుమార్, కరుణాస్, పృథ్వీ పాండిరాజన్, జయరాం, సురాజ్ వెంజరముడు ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను చెన్నై, రామనాథపురం, దిండిక్కల్, పరమకుడి ప్రాంతాల్లో పూర్తిచేసినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధనుష్, మమితాబైజూ చిత్ర యూనిట్ శనివారం కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఇలాంటి సినిమాలనే కోరుకుంటున్నారు: నాని
‘‘శంబాల’ మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ఇలాంటి జానర్ సినిమాలనే కోరుకుంటున్నారు. ఇలాంటి చిత్రాల్ని టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా కరెక్ట్‌గా తీస్తే ఎలాంటి ఇం పాక్ట్‌ను క్రియేట్ చేస్తాయో ఇది వరకే చూశాం. ‘శంబాల’తో ఆదికి మంచి విజయం దక్కాలి’’ అని హీరో నాని తెలి పారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది.ఈ మూవీ ట్రైలర్‌ని నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్లో వచ్చే ఇంగ్లిష్ సాంగ్ చాలా స్టైలిష్‌గా ఉంది.. అదిరిపోయింది. ఆది చాలా ఏళ్ల నుంచి నాకు తెలుసు. మంచి నటుడు, డ్యాన్సర్. మంచి నటుడికి ఓ మంచి సినిమా పడితే ఎలా ఉంటుందో చె΄్పాల్సిన పని లేదు. ‘శంబాల’ పెద్ద హిట్ అవ్వాలి.. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని చె΄్పారు. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్, యుగంధర్ ముని, రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి పాల్గొన్నారు. -
టాప్-5 నుంచి 'సంజన' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి సంజనా గల్రానీ టాప్- 5 నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రన్నర్‌గా ఆమె నిలిచారు. నటుడు శ్రీకాంత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సంజన 105 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. మొదట ఆమె టాప్-5లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే, కోడిగుడ్లు దొంగతనం చేసి నెట్టింట వైరల్ అయిపోయింది. అలా తన ఆట నెటిజన్లకు సులువుగా చేరిపోయింది. ఆ తర్వాత తల్లీకొడుకు బంధంతో ఇమ్మానుయేల్‌తో కనెక్ట్ అయిపోయింది. ఈ క్రమంలో ఇమ్ము నామినేషన్‌కు రాకపోవడంతో అతని అభిమానులు కూడా సంజనకు ఓట్లు వేస్తూ కాపాడారు. దీంతో సంజన సులువుగా టాప్-5 వరకు చేరుకుంది.సంజన ఆటలో ఇమ్ము చాలా కీలకం. అయితే, ఆమె చివరి వారాల్లో మాట్లాడిన తీరు, ఆట ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. బిగ్‌బాస్‌లో ఆమె ప్రయాణం ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేసిందో సంజన జర్నీ వీడియో చూస్తే అర్థం అవుతుంది. సంజనలోని ఫన్నీ, ఎమోషనల్, గొడవలు వంటి వాటిని బాగా బాగా చూపించారు.సంజన రెమ్యునరేషన్సంజన ఇప్పటికే సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. దీంతో ఆమె రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. టాప్-5 ఉన్నవారందరి రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో సంజన గల్రానీ బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తం 15 వారాలు కొనసాగారు. ఆమెకు రోజుకు 40 వేల వరకు రెమ్యునరేషన్ వచ్చినట్లు టాక్. అంటే ఒక వారానికి సుమారుగా రూ. 2.80 లక్షలు ఉంటుంది. అలా 15 వారాలు బిగ్ బాస్‌లో ఉన్నారు. దీంతో సుమారుగా రూ. 42 లక్షల వరకు పారితోషికాన్ని సంజన తీసుకున్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్‌లో టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ నగర వేదికగా టాలీవుడ్ ప్రో లీగ్ (TPL) అధికారికంగా ప్రారంభమైంది. ఈబీజీ గ్రూప్ ఆధ్వర్యంలో సరికొత్త క్రికెట్ లీగ్ ఆరంభమైంది. ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ ప్రో లీగ్‌కు హానరరీ చైర్మన్‌గా దిల్‌రాజు వ్యవరించనున్నారు. క్రికెట్-సినిమా రంగాల కలయికగా ఈ లీగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా తదితరులు హాజరయ్యారు.ఇక సినిమా రంగం నుంచి హాజరైన పలువురిలో మురళీ శర్మ, ఆశిష్ విద్యార్థి, అనిల్ రావిపూడి, నాగవంశీ, బన్నీ వాసు, వైవా హర్ష, రాశీఖన్నా తదితరులు ఉన్నారు. * * * -
తల్లికి ఇచ్చిన చివరిమాట.. టాలీవుడ్ విలన్లో ఈ కోణం ఉందా?
'తిన్నమా పడుకున్నామా తెల్లరిందా' ఈ డైలాగ్ చెప్పగానే చాలామంది గుర్తొచ్చేది సాయాజీ షిండే. 'పోకిరి' మూవీలో పోలీస్ పాత్రలో తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీతో స్టార్డమ్ తెచ్చుకున్న ఇతడు.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, కన్నడ భాషల్లో గత మూడు దశాబ్దాలుగా నటిస్తూనే ఉన్నాడు. తండ్రి, పోలీస్, విలన్.. ఇలా రకరకాలుగా మనందరికీ పరిచయమే. కానీ సాయాజీలో ఎవరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం పక్కా.స్వతహాగా నటుడే అయినప్పటికీ సాయాజీ షిండే.. ప్రకృతిని విపరీతంగా ప్రేమిస్తారు. ఎంతలా అంటే తల్లికి ఇచ్చిన చివరిమాట కోసం లక్షలాది చెట్లు నాటారు. ఇప్పటికీ నాటుతూనే ఉన్నారు. ఓసారి తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా అమ్మ 97 ఏళ్లు బతికింది. ఆమెకు 93 ఏళ్ల వయసున్నప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ పేరుపై ఎప్పటికీ నిలిచిపోయే కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నా. అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. త్రాసులో ఓవైపు అమ్మని కూర్చోబెట్టి.. మరోవైపు ఆమె బరువుకు సరితూగినన్నీ విత్తనాలతో ప్రపంచమంతా మొక్కలు నాటాలనుకున్నాను. ఎప్పుడైతే అవి చెట్లుగా మారి పూలు, పళ్లు వస్తే.. అందులో అమ్మని చూసుకోవచ్చని ఈ కార్యక్రమం చేపట్టాను. నాకు కన్నతల్లి, భూమాత ఇద్దరూ ఒకటే. ఎందుకంటే తల్లి మనల్ని నవమాసాలు కనిపెంచుతుంది. చెట్టు మనకు ప్రాణవాయువు ఇచ్చి బ్రతికిస్తుంది. కాబట్టి చెట్లకంటే సెలబ్రిటీలు ఎవరూ ఉండరు అని నేను నమ్ముతా అని అన్నారు.సాయాజీ షిండే.. తల్లి మరణానంతరం ప్రకృతి ప్రేమికుడిగా మారారు. 'సహ్యాద్రి దేవరాయి' అనే సంస్థని 2015లో స్థాపించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా చెట్లు నాటడం, పర్యావరణాన్ని కాపాడటం తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. తద్వారా పర్యావరణంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. ఇప్పటివరకు అయితే 29 ప్రాంతాల్లో ఏకంగా ఆరున్నర లక్షల వరకు విత్తనాలు, చెట్లు నాటినట్లు తెలుస్తోంది. గతంలో ఓసారి నాసిక్‌లో డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా 1800 చెట్లని కొట్టేందుకు సిద్ధమవగా షిండే విపరీతంగా పోరాడారు. చివరగా ఇందులో విజయం సాధించారు కూడా.అలానే విద్యార్థుల్లోనూ పర్యావరణంపై అవగాహన కల్పించడంలో భాగంగా 'ఓ విద్యార్థి ఓ చెట్టు' అనే నినాదంతో పారశాలల్లో పిల్లలకు తన సంస్థ ద్వారా ప్రకృతి, చెట్ల పెంపకంపై షిండే అవగాహన కలిగిస్తున్నారు. ఏదేమైనా నటుడిగా ఎన్నో వైవిధ్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. రాబోయే తరాల కోసం ఇలాంటి ప్రయత్నం చేస్తుండటం నిజంగా మెచ్చుకోదగిన విషయం. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి చాలామందికి తెలియదనే చెప్పొచ్చు. -
'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ గానీ దక్షిణాదిలోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అయితే రిలీజై రెండున్నర వారాలు దాటిపోయినా సరే ఇప్పటికీ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ గురించి అస్సలు సౌండ్ లేదు. ఇంతకీ మన దగ్గర రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు?పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ చిత్రాల్ని కూడా తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేసి వదులుతున్నారు. షారుఖ్, సల్మాన్, ఆమిర్ మూవీస్ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు డబ్బింగ్ కూడా ఒకేసారి రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవి తక్కువే. కొన్ని సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా ఫీలవుతుంటారు.(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)ఈ ఏడాది ఫిబ్రవరిలో విక్కీ కౌశల్ 'ఛావా' మూవీ రిలీజైంది. తొలుత హిందీలో తీసుకొచ్చినప్పటికీ.. కాస్త ఆలస్యంగా అయినా సరే తెలుగులో రిలీజ్ చేశారు. తొలి వారం దాటేలోపే ఇది చేసి ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత రీచ్ ఉండేదనేది చాలామంది అభిప్రాయం. దీని విషయంలో చేసిన తప్పే ఇప్పుడు 'ధురంధర్' విషయంలోనూ మేకర్స్ చేస్తున్నారు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్'.. బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. చాలామంది తెలుగు మూవీ లవర్స్ దీన్ని ఒరిజనల్ వెర్షన్ చూసేశారు. మిగిలిన వాళ్లలో చాలామంది మాత్రం తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.గత శుక్రవారమే(డిసెంబరు 19) ఇది తెలుగులో రిలీజ్ అయిపోతుందని సోషల్ మీడియాలో చాలా హడావుడి నడిచింది. తీరా చూస్తే అది రూమర్ అని తేలిపోయింది. ఈ వారమూ వచ్చే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే ఛాంపియన్, దండోరా, శంబాల, వృషభ, పతంగ్, ఈషా, బ్యాడ్ గర్ల్జ్, మార్క్.. ఇలా లైన్లో చాలానే థియేటర్ మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు వస్తే 'ధురంధర్'కి స్పేస్ దొరకడం కష్టం.మైత్రీ మూవీ మేకర్స్.. 'ధురంధర్' తెలుగు డబ్బింగ్‌ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 1వ తేదీని చూస్తున్నారట. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది కూడా జరగకపోతే మాత్రం తెలుగు ఆడియెన్స్.. ఓటీటీలోకి వచ్చాక చూసుకోవాల్సిందే. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. (ఇదీ చదవండి: టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్) -
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
బిగ్‌బాస్ తెలుగు 9 విజేత ఎవరు అనే సస్పెన్స్ సోషల్‌మీడియాలో కొనసాగుతుంది. కొన్ని గంటల్లో అధికారికంగా హోస్ట్ నాగార్జున ప్రకటించనున్నారు. కానీ, వికీపీడియాలో విజేత ఎవరు అనేది లిస్ట్‌తో సహా ప్రకటించింది. ఓటింగ్ ప్రకారం కల్యాణ్, తనూజలలో ఒకరు విజేత అవుతారని బలంగా వార్తలు వస్తున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్ 105రోజుల పాటు ఉండాలని కష్టపడ్డారు. కానీ, ఫైనల్‌గా 5మంది మాత్రమే చివరి వరకు బరిలో ఉన్నారు. నేడు రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ ఎవరు అందుకుంటారో తేలనుంది.బిగ్‌బాస్ విజేత తనూజ అని, రన్నర్‌గా కల్యాణ్ నిలిచారంటూ వికీపీడియా అప్డేట్ చేసింది. అందుకు సంబంధించిన లిస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అధికారికంగా ప్రకటన రాకుండానే ఇలా విన్నర్ పేరును తెలపడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే, వికీపీడియా అనేది ప్రపంచంలో ఎవరైన సరే ఒక గ్రూప్‌గా ఏర్పడి కలిసి రాసే, సవరించగలిగే ఒక ఉచిత ఆన్లైన్ విజ్ఞాన సూచక మాత్రమే. దీనిని వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీపీడియాకు అధికారికంగా ఎలాంటి సంబంధాలు బిగ్‌బాస్ టీమ్‌తో ఉండవు.బిగ్‌బాస్ -9 విజేతగా నిలిచిన కల్యాణ్బిగ్బాస్9 విజేతను అధికారికంగా కల్యాణ్ పడాల అంటూ హౌస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో వికీపీడియాలో వచ్చిన అప్డేట్ పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. దీంతో వికీపీడియా కూడా కొంత సమయం తర్వాత దానిని సవరిస్తూ మరో లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో కల్యాణ్ విజేతగా పేర్కొంది. -
టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్
టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది టికెట్ల రేట్ల అంశమే. పెద్ద సినిమాలు రిలీజైన ప్రతిసారి దీని గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. రీసెంట్గా 'అఖండ 2' వచ్చినప్పుడు కూడా రేట్ల పెంపుపై హైకోర్టు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరే ఈ విషయం వదిలిస్తే ఇప్పుడు టాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి.. ఇదే అంశంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయమే బెటర్ అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంటున్నారని చెప్పుకొచ్చారు.'ఓటీటీల రాకతో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అద్భుతమైన కంటెంట్ వాటిలో దొరుకుతోంది. డబ్బున్నవాడు ఓటీటీలో మూవీస్ చూస్తుంటే.. డబ్బులేనివాడు టీవీలో చూస్తున్నాడు. ఒకప్పుడు సినిమా అనేది ఏకైక ఎంటర్టైన్మెంట్ సాధనం. కానీ ఇప్పుడు చాలా ఉన్నాయి. అందులోనూ సినిమా.. చాలా ఖరీదైన ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది. జగన్ మోహన్ రెడ్డి గారు అప్పట్లో టికెట్ రేట్లు తగ్గిస్తే వీళ్లందరూ వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు వాస్తవానికి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మాట్లాడినప్పుడు.. ఆ రేట్లే బెటర్ సర్, కనీసం జనాలు థియేటర్లకు వచ్చేవారు అని నాతో అన్నారు''ఈ రోజుల్లో సరసమైన ధరలకు తక్కువ రేట్లకు సినిమా చూపిస్తామని చెప్పుకోవడం పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయింది. ఇంకొన్నాళ్లకు 1+1 ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని.. జంటగా వచ్చి సినిమా చూడొచ్చని, గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి సినిమా చూడొచ్చని బోర్డులు పెట్టినా పెట్టొచ్చు. మనం చెప్పలేం. అలాంటి పరిస్థితి వచ్చేసింది' అని బీవీఎస్ రవి తన అభిప్రాయాన్ని చెప్పారు.ఈయన చెప్పినది చూస్తే జరుగుతున్నది, జరగబోయేది ఇదే కదా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైంలో రిలీజైన లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు రూ.99 టికెట్ అనే ప్రచారం చాలా ప్లస్ అయింది. ఇప్పటికైనా టాలీవుడ్ దర్శకనిర్మాతలు టికెట్ రేట్ల విషయంలో పునారాలోచన చేసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ప్రేక్షకుడు.. థియేటర్‌కి పూర్తిగా దూరమయ్యే అవకాశముంది. -
వారణాసి బడ్జెట్ అన్ని కోట్లా?.. ప్రియాంక చోప్రా క్రేజీ ఆన్సర్!
దర్శకధీరుడు రాజమౌళి- ప్రిన్స్ మహేశ్‌బాబులో కాంబోలో వస్తోన్న అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఈ మూవీ టైటిల్ ప్రకటించేందుకే భారీ ఈవెంట్ నిర్వహించారు. గ్లోబ్‌ట్రాటర్ పేరుతో ఈవెంట్‌ని నిర్వహించి వారణాసి టైటిల్ రివీల్ చేశారు. వీరి కాంబినేషన్లో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. అయితే ఈ మూవీ బడ్జెట్‌పై ఇప్పటికే టాలీవుడ్లో చర్చ మొదలైంది. రాజమౌళి అంటేనే భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్కు రూ.600 కోట్లు ఖర్చు పెట్టిన రాజమౌళి.. ఈ సినిమాకు అంతకుమించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అడ్వెంచరస్ మూవీకి దాదాపు 1200 కోట్లకు పైగానే వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే ఇది అధికారికంగా ప్రకటించపోయినా వెయ్యి కోట్లకు పైగానే ఉండొచ్చని సినీ విశ్లేషకుల అంచనా.ఈ క్రమంలో ప్రియాంక చోప్రా వారణాసి బడ్జెట్‌పై ఆసక్తికర సమాధానం చెప్పింది. ది కపిల్ శర్మ షోకు హాజరైన ప్రియాంకను ఫన్నీ ప్రశ్న అడిగాడు కపిల్ శర్మ. వారణాసి మూవీ బడ్జెట్ రూ.1300 కోట్లు అని విన్నాం. కానీ మీరు ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యాక అది కాస్తా డబుల్ అయిందని తెలిసింది. ఇది నిజమేనా?అని ప్రియాంకను అడిగారు. దీనికి హీరోయిన్ స్పందిస్తూ.. అంటే బడ్జెట్లో సగం డబ్బులు నా ఖాతాలోకి వచ్చాయని చెబుతున్నారా? అంటూ ఫన్నీగా సమాధానమిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Priyanka chopra about #Varanasi on Kapil Sharma show pic.twitter.com/6kgkusKaGf— Sunaina🦋 (@Sunaina_speaks) December 20, 2025 -
ఆది సాయికుమార్ మిస్టరీ థ్రిల్లర్.. ఆసక్తిగా శంబాల ట్రైలర్
ఆది సాయి కుమార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ 'శంబాల'. ఈ సినిమాకు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజులు నిర్మించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్‌ను అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు'.. అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే ఓ గ్రామంలో జరిగిన మిస్టరీ సంఘటనలతో తెరకెక్కించినటలు తెలుస్తోంది. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, మధునాదన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాలసంగీతమందించారు. -
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తోన్న రెండో చిత్రం ఛాంపియన్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌లో అంచనాలు పెంచేసింది. రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ పీరియాడికల్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనస్వర రాజన్ తెలుగు ఇండస్ట్రీని గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.తెలుగులో తాను చూసిన మొదటి సినిమా రామాయణం ఆధారంగా వచ్చిన శ్రీరామరాజ్యం అని తెలిపింది. మా నానమ్మ ఆ సినిమా చూస్తుంటే చూశానని వెల్లడించింది. అయితే అది తెలుగు మూవీ అని నాకప్పుడు తెలియదని పేర్కొంది. ఆ తర్వాత మలయాళంలో డబ్ చేసిన అల్లు అర్జున్ సినిమాలు ఎక్కువ చూసేదాన్ని అనస్వర రాజన్ తెలిపింది. అప్పుడు అల్లు అర్జున్ తెలుగు హీరో అని నాకు తెలియదు.. ఆయనను మలయాళ హీరోనే అనుకున్నానని పంచుకుంది. రామ్ చరణ్ మగధీర సినిమా చూశాకే నాకు తెలుగు చిత్రాలు, యాక్టర్స్ గురించి తెలిసిందని కామెంట్స్ చేసింది. అప్పటి వరకు నేను తెలుగు సినిమాలను చూస్తున్నానని నాకే తెలియదని అనస్వర చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో చంద్రకళ పాత్ర అనే పాత్రలో అలరించనుంది.కాగా.. అనస్వర రాజన్ ప్రస్తుతం తెలుగులో ఇట్లు మీ అర్జున అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఛాంపియన్ కంటే ముందే నేను ఒప్పుకున్న సినిమా ఇదేనని ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా.. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఛాంపియన్ మూవీ తెరకెక్కించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. -
పెద్ది మూవీతో బాక్సాఫీస్ క్లాష్.. ది ప్యారడైజ్ నిర్మాత ఏమన్నారంటే?
నాని హీరోగా వస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల-నాని కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ది ప్యారడైజ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో కమెడియన్ సంపూర్ణేశ్ బాబు బిర్యానీ పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత సుధాకర్ చెరుకూరి రిలీజ్ డేట్‌పై అడిగిన ప్రశ్నకు స్పందించారు.ఇప్పటికే ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 26న పెద్దిని రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న పెద్ది మూవీ కూడా మార్చి 27 రోజున రిలీజవుతోంది. ఒక్క వ్యవధిలోనే రెండు పెద్ద సినిమాలు రానుండడంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పేలే లేదు. దీంతో ది ప్యారడైజ్‌కు రామ్ చరణ్ పెద్ది మూవీతో క్లాష్ తప్పదా? లేదా లాస్ట్‌లో విడుదల తేదీని మారుస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.దీనిపై నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పందించారు. మేము సాధ్యమైనంత త్వరగా మూవీని కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నామని వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయితే తప్పకుండా మార్చి 26నే ది ప్యారడైజ్ రిలీజ్ అవుతుందన్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద నాని వర్సెస్ రామ్ చరణ్ తప్పలా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే అప్పటికల్లా ఏదో ఒక మూవీ పోస్ట్‌పోస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. రిపోర్టర్: #Peddi తో #Paradise క్లాష్ తప్పదా? లేదా లాస్ట్‌లో మారుస్తారా?ప్రొడ్యూసర్ #SudhakarCherukuri: మార్చి 26న రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాం. అంతా పూర్తి అయితే మార్చి 26నే వస్తాం. pic.twitter.com/23VOD188Ao— greatandhra (@greatandhranews) December 20, 2025 -
మూడేళ్లలో చాలా నేర్చుకున్నాను: రోషన్
‘‘నా సినిమాల కథలను ముందు నేనే వింటాను. నాకు నచ్చిన స్క్రిప్ట్స్ గురించి నాన్నతో (నటుడు శ్రీకాంత్) చర్చిస్తాను. నాన్న పూర్తి కథ వినరు కానీ స్టోరీ లైన్ వింటారు. అయినప్పటికీ కథ, సినిమాల ఎంపికలో తుది నిర్ణయాన్ని నాకే వదిలేస్తారు. ‘చాంపియన్’ సినిమా కథ కూడా ఒక లైన్లా విన్నారు’’ అని రోషన్ చెప్పారు. ఆయన హీరోగా, అనస్వరా రాజన్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘చాంపి యన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. సి. అశ్వినీదత్, జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ బ్యానర్స్‌పై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా రోషన్ పంచుకున్న విశేషాలు. ⇒ నిజానికి హీరోలందరూ 25 ఏళ్లు ఏజ్‌లోనే ఇండస్ట్రీకి వస్తారు. నేను 21 ఏళ్లకే వచ్చేశాను. ‘పెళ్లి సందడి’ (2021) సినిమా తర్వాత నేను బ్రేక్ తీసుకున్నట్లు అనిపిస్తుంది కానీ, కమ్ బ్యాక్ ఇవ్వడానికి ఇదే సరైన వయసు. ఈ విరామం తీసుకోవడం కూడా పూర్తిగా నా నిర్ణయమే. యాక్టింగ్ అంటే హ్యూమన్ ఎమోషన్స్ తెలియాలి... దానికి ఒక మెచ్యూరిటీ కావాలి. ఈ మూడేళ్లలో చాలా ట్రావెల్ చేశాను... ఆ విధంగా చాలా నేర్చుకున్నాను. ⇒ 1948లో జరిగే కథ ‘చాంపియన్’. చరిత్రలో బైరాన్ పల్లి గురించి చాలామందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి ‘చాంపియన్’ కథని చూపించడం జరిగింది. ఇండియాకి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, హైదరాబాద్‌కి స్వాతంత్య్రం రాని రోజుల్లో జరిగిన కథ ‘చాంపియన్’. నాపాత్ర ప్రాపర్ హైదరాబాదీ... అందుకోసం ఆ యాస స్పష్టంగా నేర్చుకున్నాను. ఈ మూవీ కోసం ప్రదీప్‌గారు, స్వప్నగారు, ఆర్ట్ డైరెక్టర్ తోటగారు ప్రతిదీ పరిశోధించారు. పీటర్ హెయిన్స్‌గారు అద్భుతమైన యాక్షన్ డిజైన్ చేశారు. షూటింగ్లో నాకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. ⇒ మా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రామ్‌చరణ్ అన్న నా గురించి, మా టీమ్, సినిమా గురించి అంత బాగా మాట్లాడటం హ్యాపీ అనిపించింది. అఖిల్ అన్న కూడా నాకు మంచి ఫ్రెండ్. అలాగే తమన్ అన్న... మేమందరం కలిసి క్రికెట్ ఆడతాం. బడ్జెట్ విషయంలో నిర్మాతలు రాజీ పడకుండా ‘చాంపియన్’ నిర్మించారు. నేను చాలా మొహమాటంగా ఉంటాను. ‘కొంచెం ఓపెన్‌గా ఉండు, మాట్లాడు’ అని నాగ్ అశ్విన్‌గారు చె΄్పారు. ⇒ నేను క్రికెటర్, మా చెల్లి డాక్టర్, మా తమ్ముడు ఐఏఎస్ కావాలనుకున్నారు నాన్న. నాకు కూడా క్రికెటర్ కావాలనే ఉండేది. అయితే నటుడయ్యాను. నా కొత్త సినిమాల ప్రకటన తర్వలోనే ఉంటుంది. ఇకపై రెండు సంవత్సరాలకి కనీసం మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను.


