Corporate
-
టెక్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'వైభవ్ తనేజా' భారీ సంపాదన పొంది వార్తల్లో నిలిచారు. 2024లో ఈయన సంపాదన ఏకంగా 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 11.94 వేలకోట్ల కంటే ఎక్కువ). ఇది మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల'.. గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్'ల కంటే చాలా ఎక్కువ.2024లో సుందర్ పిచాయ్ సంపాదన 10.73 మిలియన్ డాలర్లు కాగా, సత్యనాదెళ్ళ సంపాదన 79.106 డాలర్లు. దీన్ని బట్టి చూస్తే.. వైభవ్ తనేజా సంపాదన (139.5 మిలియన్ డాలర్లు) చాలా ఎక్కువ అని స్పష్టమవుతోంది. అంతకు ముందు 2020లో నికోలాకు చెందిన కిమ్ బ్రాడీ 80.6 మిలియన్ డాలర్ల సంపాదనతో కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. దీనిని వైభవ్ అధిగమించారు.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికటెస్లాలో తనేజా బేసిక్ శాలరీ 400000 డాలర్లు (రూ. 3.4 కోట్లు). అయితే స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ వంటి ఇతర ప్రయోజనాల కారణంగా ఈయన సంపాదన గణనీయంగా పెరిగింది.ఎవరీ వైభవ్ తనేజా?ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసిన వైభవ్ తనేజా.. టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ అండ్ రిటైల్ రంగాలకు సంబంధించిన మల్టిపుల్ కంపెనీలలో 17 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. ఈయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెన్సీని కూడా పూర్తి చేశారు. 2017లో టెస్లా కంపెనీలో కార్పొరేట్ కంట్రోలర్‌గా.. చేరిన వైభవ్ తనేజా సీఎఫ్ఓ వరకు ఎదిగారు. -
జీతం పెంచలేదని ఉద్యోగం మానేసిన మహిళ.. తర్వాత..
కంపెనీలో జీతం పెంచనందుకు ఉద్యోగం మానేసిన ఓ మహిళకు తిరిగి ఆ సంస్థ యాజమాన్యం పిలుపు అందించింది. గతంలో తాను డిమాండ్ చేసిన దానికంటే అధికంగా వేతనం చెల్లిస్తామని చెప్పింది. దాంతోపాటు పదోన్నతి ఇస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ పోస్ట్ రెడ్డిట్‌లో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది.రెడ్డిట్ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. యూఎస్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్న మహిళ తన జీతం పెంచాలని మేనేజ్మెంట్కు వేడుకుంది. వేతన పెంపునకు చాలా కాలంగా వేచి చూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. జీతం కోసం అడిగిన ప్రతిసారి ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయడం లేదని, తగినంత అనుభవం లేదని, ఎదగడానికి ఇంకా సమయం పడుతుందని, ప్రస్తుతం తమకు బడ్జెట్ లేదని.. యాజమాన్యం చెబుతూ వచ్చింది. ఈ కారణాలతోనే నెలలు సాగదీశారు. దీన్ని తట్టుకోలేక ఆమె ఉద్యోగాన్ని వదిలేసింది.ఆరు నెలల తర్వాత, తాను వెళ్లిపోయినప్పటి నుంచి కంపెనీ పరిస్థితులు దిగజారాయి. దాంతో తనను తిరిగి కంపెనీలోకి రావాలని యాజమాన్యం వేడుకుంది. తాను ముందుగా డిమాండ్ చేసిన 15 శాతం కంటే అధికంగా 40 శాతం వేతనంలో పెంపు ఇస్తామని కంపెనీ పేర్కొంది. కానీ దానికి ఆమె విముఖత చూపడంతో 55 శాతం వేతన పెంపుతోపాటు పదోన్నతి ఇస్తామని తెలిపింది. ఈ వ్యవహారంపై మహిళ స్పందిస్తూ.. తాను కంపెనీలో ఎంతో కమిట్మెంట్తో పని చేశానని చెప్పారు. పనిలో మెరుగైన ఉద్యోగుల సామర్థ్యాలను సంస్థలు తక్కువ అంచనా వేయకూడదని తెలిపారు. చివరకు కంపెనీ ఆఫర్‌ను అంగీకరించినట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగిఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అందులో ఓ వ్యక్తి ‘ఇది చాలా సంతోషకర విషయం. ప్రతిభ కలిగిన ఉద్యోగులను సంతోషంగా ఉంచడానికి కంపెనీలు ఏమీ చేయడం లేదు. జీతాల పెంపు వల్ల కంపెనీలకు చాలా తక్కువే ఖర్చు అవుతుంది. కానీ వేతన పెంపు వల్ల ఉత్సాహంతో పని చేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి’ అన్నారు. -
హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
సరైన పూచీకత్తు లేకుండా బంగారు రుణాలు మంజూరు చేసిన కేసులో ఇద్దరు ఎస్బీఐ ఉద్యోగులపై కేసు నమోదైంది. వడ్డీతో కలిసి సుమారు రూ.2.2 కోట్ల మేరకు మోసానికి పాల్పడినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని రాంనగర్ ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ డి.సునీల్ ఫిర్యాదుమేరకు పోలీసులు ఇద్దరు ఉద్యోగులతోపాటు మరో 18 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.ఫిర్యాదులోని వివరాల ప్రకారం, ఎస్బీఐలో సర్వీస్ మేనేజర్‌గా పని చేస్తున్న గుగ్లోత్ జైరాం నాయక్ క్యాష్ ఇన్ఛార్జ్ చీర్లా రుతుపవన్తో కలిసి విధులను దుర్వినియోగం చేశారు. సరైన పూచీకత్తు లేకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరుల పేరిట నకిలీ బంగారు రుణాలను మంజూరు చేశారు. ఇందులో మరో 18 మంది పాత్ర ఉంది. ప్రధాన నిందితుడు నాయక్ తన పదవిని దుర్వినియోగం చేశాడని, అంతర్గత విచారణలో నిందితుడు చేసిన మోసం బయటపడిందని ఆరోపిస్తూ మే 15న బ్రాంచి మేనేజర్ సునిల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.చెల్లుబాటయ్యే పూచీకత్తు లేకుండా, బ్యాంకు విధానాలను ఉల్లంఘించి ఈ రుణాలను ప్రాసెస్ చేసి ఆమోదించారని తెలిపారు. క్యాష్ ఆపరేషన్స్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ, అతను ఉద్దేశపూర్వకంగా ప్రామాణిక బ్యాంకు మార్గదర్శకాలను పట్టించుకోలేదని చెప్పారు. ఈ మోసంతో అక్రమంగా పోగు చేసిన రూ.2.2 కోట్ల నిధులను వివిధ వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసి ఎల్లారెడ్డిగూడలోని ఓ ప్రైవేటు సంస్థకు మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగివడ్డీతో సహా రూ.2.2 కోట్ల బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఇటీవల లిఖితపూర్వక వాంగ్మూలంలో నాయక్ అంగీకరించినట్లు బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) నిందితులపై సెక్షన్ 316(5) (ప్రభుత్వ ఉద్యోగి, లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత ఉల్లంఘన), 318(4) (మోసంతో ఆస్తి పంపిణీని ప్రేరేపించడం), ఆర్ / డబ్ల్యూ 61 (2) (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ మోసం ఇటీవల అంతర్గత ఆడిట్లో వెలుగు చూడడం గమనార్హం. ప్రధాన నిందితుడు నాయక్, రుతుపవన్ను అరెస్టు చేశారు. మిగతా నిందితుల పాత్రను పరిశీలిస్తున్నామని సీసీఎస్ అధికారి ఒకరు తెలిపారు. -
హైరేంజ్లో హైదరాబాద్
దశాబ్దాల చరిత్రను ఇముడ్చుకున్న హైదరాబాద్ చారిత్రక నగరం మరెన్నో చరిత్రలు తిరగరాస్తూ దూసుకుపోతోంది. అటు ఐటీ ఇటు రియల్టీ మరోవైపు ఫార్మా, ఇంకోవైపు సినిమా.. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురేలేదు అన్నట్టు ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఈ దూకుడు ఇలాగే కొనసాగనుందని, దేశంలోనే మన సిటీ అగ్రగామిగా అవతరించనుందని జేఎల్ఎల్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక వెల్లడించిన విశేషాల్లో కొన్ని.. – సాక్షి, సిటీబ్యూరోదేశంలో అభివృద్ధి కేంద్రంగా నగరం స్థిరపడుతోంది. పలు రంగాల్లో ప్రగతితో పాటు ప్రణాళికా బద్ధమైన మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరించిన అంతర్జాతీయ స్థాయి జీవనశైలి కారణంగా నగరంలో నివాస, వాణిజ్య గిడ్డంగుల విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి కొనసాగుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, నగరంలో వచ్చే 3–4 సంవత్సరాల్లో లక్ష కొత్త నివాస యూనిట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధాన రిటైల్ కంపెనీలు నగరంలో తమ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.ఐటీ నుంచి స్టార్టప్స్ దాకా..నగరంలో ఐటీ/ఐటీఈఎస్ రంగం సిటీ దూకుడుకు దోహదం చేస్తున్న ప్రధానమైన డ్రైవర్‌గా నిలుస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నగరం 32 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ ఎగుమతులతో దేశంలోనే రెండో స్థానాన్ని సాధించింది. ఇక్కడ 4 వేలకు పైగా స్టార్టప్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశంలోని మొత్తం గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాల్లో 15.6 శాతం భాగస్వామ్యంతో నగరం ముందంజలో నిలిచింది. అలాగే, దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో(జీసీసీఎస్) 17 శాతం నగరంలో ఉన్నాయి.హైదరాబాద్‌కి ఈ ఊపు ఎందుకు..?‘హైదరాబాద్‌లో 17 శాతం గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు(జీసీసీఎస్) ఉండటం దేశీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన మలుపు కాగా ఈ కేంద్రాల నాణ్యత, పరిధి నగర స్థిరాభివృద్ధికి అండగా నిలుస్తాయి,’ అని ప్రముఖ ఆర్బర్ ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థాపకుడు చిరాగ్ మెహతా అన్నారు. జేయుఎస్‌టివో రియల్ ఫిన్ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పుష్పమిత్ర దాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రానున్న రెండేళ్లలో ఏడాదికి 17–19 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని జోడించనుందని, అలాగే, గిడ్డంగుల సామర్థ్యాన్ని మరో 4 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పెంచనుందనీ తెలిపారు.ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్న అంశాల్లో ఆయన అభిప్రాయం ప్రకారం, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ఒక సంతులిత ఆర్థిక వ్యవస్థను నిర్మించగలిగింది. ఇది ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్ ఇలా భిన్న రంగాల్లో వృద్ధిని చూపిస్తోంది. మెగా మాస్టర్ ప్లాన్ 2050, ముచెర్ల 4.0 ఐటీ హబ్, మెట్రో రైలు విస్తరణ వంటి ప్రణాళికలు నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా బెంగళూరుతో పోలిస్తే స్తిరాస్తి ధరలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యంగా మారిందని అన్నారు. ‘నాణ్యమైన వసతులు, తక్కువ ధరలతో వ్యాపారం నిర్వహించాలనుకునే సంస్థలకు హైదరాబాద్ గొప్ప అవకాశం. పలు రంగాల్లో సమతులిత అభివృద్ధి కనిపిస్తుండటంతో పాటు మౌలిక వసతుల పురోగతికి పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చు’ అని దాస్ అన్నారు. ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగిఆఫీస్ స్పేస్‌కి డిమాండ్.. మెరుస్తున్న మాల్స్2019 నుంచి ఇప్పటి వరకు 78.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ల గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాన్ని నగరం జోడించగా, 2024లో 7.31 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని ఆక్రమించడం జరిగిందని జేఎల్ఎల్ పేర్కొంది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 6.1 శాతం అధిక వృద్ధిగా తేల్చింది. నగరంలోని గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ స్థలం 9.86 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా లెక్కించింది. ఇక నగరంలో రానురానూ ఖాళీ స్థలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఆరోగ్యకరమైన డిమాండ్‌కి సంకేతంగా భావించవచ్చు. మరోవైపు డేటా సెంటర్ల సామర్థ్యం కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో 23 మెగావాట్ల మేరకు పెరగనుంది. తద్వారా హైదరాబాద్ ఒక ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా మారనుంది. దీని సామర్థ్యం 2020 మొదటి అర్ధభాగంలో 32ఎం.డబ్ల్యూ నుంచి 2025 నాటికి నాలుగు రెట్లు పెరిగి 130ఎం.డబ్ల్యూకు చేరుకుంటుంది. -
కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగి
పని ప్రదేశంలో ప్రతికూల వాతావరణం కారణంగా రాజీనామా చేయవలసి వచ్చిందని మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లతికా పాయ్ ఆరోపిస్తూ కంపెనీపై సివిల్ దావా వేశారు. రూ.35.3 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తనను ఉద్దేశపూర్వకంగా రాజీనామా చేయించారని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు మే 7న ఈ కేసును విచారించి బెంగళూరులోని సిటీ సివిల్ కోర్టుకు తరలించింది. దీనిపై జూన్ 9న బెంగళూరులో విచారణ జరగనుంది.స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎక్స్‌పర్ట్‌గా కంపెనీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాయ్ జులై 2024లో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ పార్ట్నర్స్ కంట్రీ హెడ్‌గా పాయ్ ఉన్నారు. తాను నాయకత్వం వహించిన ఫ్లాగ్షిప్ స్టార్టప్ ఇనిషియేటివ్ ‘హైవే టు ఏ 100 యూనికార్న్స్’పై గతంలో కంపెనీ అంతర్గత దర్యాప్తు నిర్వహించింది. తరువాత ఎనిమిది నెలలపాటు తనపై బెదిరింపులకు పాల్పడినట్లు పాయ్ ఆరోపించారు. 2019లో మైక్రోసాఫ్ట్ వెంచర్ క్యాపిటల్ వ్యవహారాల్లో పక్షపాతంగా ఉంటున్నారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు పాయ్పై అభియోగాలు నమోదయ్యాయి. దాంతో దర్యాప్తు నిర్వహించి పాయ్ ఎలాంటి తప్పు చేయలేదని తేలడంతో 2021లో పదోన్నతి పొందారు.ఇదీ చదవండి: ‘రూ.కోట్లున్నా మాకొద్దీ వ్యాపారం..’ మారుతున్న దృక్పథంతర్వాత కొంత కాలానికి న్యాయ సంస్థ మోర్గాన్ లూయిస్ అండ్ బోకియస్ 2024 మార్చిలో రెండో దఫా దర్యాప్తును ప్రారంభించింది. అయితే మైక్రోసాఫ్ట్ విధానానికి విరుద్ధంగా 2024లో ఒక కీలక ఇంటర్వ్యూను రికార్డ్ చేయకుండా విచారణ నిర్వహించారని పాయ్ పేర్కొన్నారు. వీటిపై తన అభ్యంతరాలను కంపెనీ వ్యతిరేకించిందని చెప్పారు. ఆమెను కీలక పదవుల నుంచి తొలగించి ‘ట్రబుల్‌మేకర్’గా ముద్ర వేశారని తెలిపారు. 2020 సైబర్ బుల్లీయింగ్ కేసులో మైక్రోసాఫ్ట్ తగిన చర్యలు తీసుకోలేదని పాయ్ ఆరోపించారు. మైక్రోసాఫ్ట్ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సహకారం సందేహాస్పదంగా ఉందని ఆమె అన్నారు. -
ఫ్లైట్ జర్నీ.. 1.43 కోట్ల మంది విమానమెక్కారు
న్యూఢిల్లీ: దేశీయంగా ఏప్రిల్‌లో 1.43 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1.32 కోట్లతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 8.45 శాతం పెరిగింది. మార్కెట్ వాటాపరంగా చూస్తే 64.1 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఎయిరిండియా గ్రూప్ (27.2 శాతం), ఆకాశ ఎయిర్ (5 శాతం), స్పైస్‌జెట్ (2.6 శాతం) ఉన్నాయి. 2025 జనవరి–ఏప్రిల్ మధ్యకాలంలో దేశీ విమానయాన సంస్థలు 5.75 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నెలవారీ రిపోర్టులో వెల్లడించింది. వార్షికంగా చూస్తే ఈ సంఖ్య 9.87 శాతం, నెలవారీగా చూస్తే 8.45 శాతం పెరిగినట్లు వివరించింది. సమయ పాలనపరంగా (ఓటీపీ) చూస్తే 80.8 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. 77.5 శాతం ఓటీపీతో ఆకాశ ఎయిర్, 72.4 శాతంతో ఎయిరిండియా గ్రూప్ .. ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. స్పైస్‌జెట్ సమయ పాలన అత్యంత కనిష్ట స్థాయిలో 60 శాతంగా నమోదైంది. -
‘రూ.కోట్లున్నా మాకొద్దీ వ్యాపారం..’ మారుతున్న దృక్పథం
భారతదేశంలో తరతరాలుగా వస్తున్న కుటుంబ వ్యాపారాల దృక్పథంలో మార్పులు వస్తున్నాయి. భారతీయ పారిశ్రామికవేత్తలు 79% మంది తమ వ్యాపారాలను వారి కుటుంబ సభ్యులకు బదిలీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ అది వెంటనే జరిగిపోవాలని అనుకోవడం లేదని హెచ్ఎస్బీసీ సర్వే తెలిపింది. అయితే అలా యోచిస్తున్న మొత్తం పారిశ్రామికవేత్తల్లో 45% మంది ప్రస్తుతం సమర్థంగా కొనసాగుతున్నవారు ఉన్నారు. 55% మంది మొదటితరం వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరిలో 35% మంది విభిన్న తరాలకు చెందినవారు ఇకపై వారి పిల్లలు తమ సంస్థలను నడపబోరేమోనని చెబుతున్నారు. వారసత్వ బాధ్యతల కంటే వారి పిల్లలు వ్యక్తిగత ఆకాంక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు.మొత్తంగా కేవలం 7 శాతం మంది భారతీయ వారసులు మాత్రమే కుటుంబ వ్యాపారాన్ని బాధ్యతగా కొనసాగించాలని భావిస్తున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇది చైనాలో 60%గా ఉంది. భారతీయ యువత తమ ముందున్న వ్యాపార వారసత్వాలకు కట్టుబడి ఉండటం కంటే వారి అభిరుచులకు అనుగుణంగా ఉండే కెరియర్లను ఎంచుకునేందుకు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలియజేస్తుంది. దేశంలో మొత్తంగా పారిశ్రామికవేత్తలు తమ వారసత్వానికి వ్యాపార బాధ్యతలు కట్టబెడితే సుమారు 1.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన సంపద బదిలీ జరుగుతుందని సర్వే తెలిపింది. ఇది దేశ జీడీపీలో 1/3వ వంతు ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్గ్లోబలైజేషన్, సాంకేతిక పురోగతి, వైవిధ్యమైన కెరియర్ అవకాశాలు వేగంగా విస్తరిస్తున్నందున చాలా మంది యువ కుటుంబ సభ్యులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇది వారి సొంత స్టార్టప్‌లను ప్రారంభించేందుకు దోహదం చేస్తుంది. వృత్తిపరమైన కెరియర్లను కొనసాగించడం లేదా పూర్తిగా భిన్నమైన పరిశ్రమల్లో పనిచేసేందుకు వీలు కల్పిస్తుందని కొందరు భావిస్తున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్‌కు నష్టాలు.. అవకతవకల ఎఫెక్ట్!
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో లాభాలనువీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 2,329 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఖాతాల అవకతవకలతో ప్రొవిజన్లు పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది. 2023–24 ఇదే కాలంలో రూ. 2,349 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు కొంతమంది ఉద్యోగుల పాత్రపై అనుమానాలతో బ్యాంక్ బోర్డు దర్యాప్తు ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలకు ఖాతాల మోసాలపై నివేదించమని బ్యాంక్‌ను ఆదేశించింది. ఖాతాల లోపాలు, మైక్రోఫైనాన్స్ పోర్ట్‌ఫోలియోలో మోసం, బ్యాలెన్స్షీట్లో పొరపాటు అంశాలతో బ్యాంక్ సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అంతర్గత ఆడిట్‌కు ఆదేశించడం తెలిసిందే. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇండస్ఇండ్ నికర లాభం 71% పడిపోయి రూ. 2,576 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ. 8,977 కోట్ల లాభం సాధించింది. ప్రొవిజన్లు రూ. 3,885 కోట్ల నుంచి రూ. 7,136 కోట్లకు పెరిగాయి.ప్రొవిజనింగ్ జూమ్ క్యూ4లో ఇండస్ఇండ్ బ్యాంక్ రూ. 2,522 కోట్లమేర ప్రొవిజనింగ్ చేపట్టింది. అంతక్రితం క్యూ4లో ఈ పద్దు రూ. 950 కోట్లు మాత్రమే. 2023–24 క్యూ4లో రూ. 12,199 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో రూ. 1,979 కోట్లమేర ఖాతాలలో లోపం, మైక్రోఫైనాన్స్ బిజినెస్‌లో రూ. 674 కోట్ల వడ్డీ తప్పుగా నమోదు చేసినట్లు అంతర్గత ఆడిట్లో గుర్తించడం, బ్యాలెన్స్షీట్లో రూ. 595 కోట్ల ఇతర ఆస్తుల అక్రమ పద్దు తదితరాలను బ్యాంక్ మార్చిలో వెల్లడించింది.ఏప్రిల్ 29న సీఈవో సుమంత్ కథ్పాలియా, డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా రాజీనామా చేశారు. దీంతో బ్యాంక్ బోర్డు కార్యకలాపాల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటు చేసింది. 2025 జూన్30లోగా కొత్త సీఈవో ఎంపికకు వీలుగా ప్రతిపాదనలు పంపమని బ్యాంక్‌ను ఆర్బీఐ ఆదేశించినట్లు ఇండస్ఇండ్ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఇండస్ఇండ్ షేరు 1.4% క్షీణించి రూ. 771 వద్ద ముగిసింది. -
ఇండిగో లాభం ‘హై’జంప్
న్యూఢిల్లీ: దేశీ విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 3,067 కోట్లను అధిగమించింది. ఇది క్యూ4లో కంపెనీ సాధించిన రికార్డ్ లాభంకాగా.. ఇందుకు విమాన ప్రయాణికులు పెరగడం సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 1,895 కోట్లు ఆర్జించింది. ఇండిగో బ్రాండ్ విమాన సర్వీసుల కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 18,505 కోట్ల నుంచి రూ. 23,098 కోట్లకు ఎగసింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ప్రయాణికుల జోరు మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇండిగో నికర లాభం రూ. 7,258 కోట్లను అధిగమించింది. విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే దాదాపు రూ. 8,868 కోట్ల లాభం ఆర్జించింది. గతేడాది 11.8 కోట్లమంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేసినట్లు సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. కాగా.. క్యూ4లో ఇండిగో ప్రయాణికుల టికెట్ ఆదాయం 25% జంప్‌చేసి రూ. 19,567 కోట్లను దాటింది. అనుబంధ విభాగాల ఆదాయం 25 శాతం అధికమై రూ. 2,153 కోట్లకు చేరింది. మొత్తం నగదు నిల్వలు రూ. 48,170 కోట్లను అధిగమించగా.. విమానాల సంఖ్య 400ను దాటింది. ఇండిగో షేరు బీఎస్ఈలో 0.4% లాభంతో రూ. 5,466 వద్ద ముగిసింది. -
తయారీలో భారత్ ముందడుగు
న్యూఢిల్లీ: తయారీ రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఎంతో ఆకర్షణీయంగా మార్చిందని ఎస్అండ్పీ గ్లోబల్ అధ్యయనం పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు దీర్ఘకాలంలో భారత్‌కు ప్రయోజనం కలిగిస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఎస్అండ్పీ గ్లోబల్ రీసెర్చ్ అధ్యయన నివేదికను విడుదల చేసింది.అభివృద్ధి చెందుతున్న పరిణామాలు, వాణిజ్య సవాళ్లకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలు మారుతున్నందున.. ఈ అవకాశాన్ని భారత్ సది్వనియోగం చేసుకుని తన తయారీ వృద్ధిని వేగవంతం చేసుకోగలదని, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో మరింత బలంగా అనుసంధానం కాగలదని ఈ నివేదిక అంచనా వేసింది. స్థానికంగానే విడిభాగాల సమీకరణ, తుది మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా ఉండడం, ప్రాంతీయ అనుసంధానత పెంచుకోవడం ద్వారా భారత్ తయారీ రంగం మరిన్ని అదనపు పెట్టుబడులను ఆకర్షించొచ్చని సూచించింది.భారత్ అత్యాధునిక టెక్నాలజీ సామర్థ్యాలను, తయారీ పోటీతత్వాన్ని పెంచుకోవడం ద్వారా తయారీలో అదనపు ఉపాధి అవకాశాలను కల్పించొచ్చని పేర్కొంది. సరఫరా వ్యవస్థ వైవిధ్యంలో భాగంగా మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో భారత్‌కు ప్రయోజనం లభిస్తుందని వివరించింది. 2024–25లో భారత జీడీపీ వృద్ధి నిదానించినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్టు గుర్తు చేసింది.భారత వృద్ధిలో ఎగుమతులపై ఆధారపడడం మోస్తరుగానే ఉన్నట్టు తెలిపింది. ఈ సానుకూలత వల్లే అంతర్జాతీయ వాణిజ్యం, టారిఫ్ విధానాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న మార్పుల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని పేర్కొంది. భారత స్థూల జీడీపీలో తయారీ విలువ 17.2 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ఇటీవలి తయారీ పీఎంఐ గణాంకాలు పటిష్టంగా ఉండడాన్ని ప్రస్తావించింది. -
కలరా వ్యాక్సిన్ మూడో దశ విజయవంతం
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్ బయోటెక్ కలరా వ్యాక్సిన్ పరీక్షల్లో పురోగతి సాధించింది. 1800 మందిపై నిర్వహించిన మూడో దశ క్లినికల్ అధ్యయనంలో తమ ఓరల్ కలరా వ్యాక్సిన్ హిల్‌కోల్ విజయం సాధించందని, పెద్దలు, పిల్లలలో కలరాకు సంబంధించిన ఒగావా, ఇనాబా సెరోటైప్స్ రెండింటికీ వ్యతిరేకంగా పనిచేసిందని భారత్ బయోటెక్ తెలిపింది.కలరా అనేది విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా కలిగించే అతిసార వ్యాధి. కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల ఇది సంక్రమిస్తుంది. ఏటా 28.6 లక్షల కేసులు నమోదవుతుండగా 95,000 మరణాలు సంభవిస్తున్నాయని అధ్యయనాలు అంచనా వేశాయి. ఓరల్ కలరా వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 10 కోట్ల డోసుల డిమాండ్ ఉందని, కేవలం ఒక తయారీదారు మాత్రమే వాటిని సరఫరా చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడిందన్నారు. హైదరాబాద్, భువనేశ్వర్‌లోని భారత్ బయోటెక్ కేంద్రాలు 20 కోట్ల డోసుల హిల్కోల్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది.ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిని 18 ఏళ్లు పైబడిన పెద్దలు, 5 నుండి 18 సంవత్సరాలలోపు పిల్లలు, సంవత్సరం నుండి ఐదేళ్లలోపు చిన్నపిల్లలు మూడు గ్రూపులుగా విభజించి వ్యాక్సిన్ ప్రయోగించారు. అధ్యయన ఫలితాలు సైన్స్ డైరక్ట్ అనే వ్యాక్సిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. హిల్కాల్ వ్యాక్సిన్ ఒగావా, ఇనాబా సెరోటైప్లకు వ్యతిరేకంగా విబ్రియోసిడల్ యాంటీబాడీలను 4 రెట్లు అధికంగా తయారు చేసింది.ఈ అధ్యయన ఫలితాలు కఠినమైన పరిశోధన, సమగ్ర క్లినికల్ ట్రయల్స్, నమ్మదగిన క్లినికల్ డేటాతో వ్యాక్సిన్లను తీసుకొస్తున్న తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. సమర్థవంతమైన, అందుబాటు ధరల్లో వ్యాక్సిన్లను అందించడంలో తమ నిబద్ధత నిరంతరం కొనసాగుతుందన్నారు. -
అనుమతులు ఆలస్యం కారాదు: ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: నియంత్రణపరమైన అనుమతుల్లో జాప్యం అనిశ్చితికి దారితీయడంతోపాటు, వాణిజ్యపరమైన ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కఠినమైన పర్యవేక్షణ కొనసాగిస్తూనే వేగవంతమైన, పోటీకి హాని చేయని సులభ అనుమతులు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 16వ వ్యవస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతారామన్ పాల్గొని మాట్లాడారు.సమర్థతను పెంచే పోటీని ప్రోత్సహిస్తూ సరళీకరణ స్ఫూర్తిని కాపాడడంలో, ఆవిష్కరణలు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంలో సీసీఐ కీలక సంస్థగా అవతరించినట్టు మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ విధానాలు, చట్టాలు, నియంత్రణలు సైతం అవరోధాలుగా మారి పోటీని ప్రభావితం చేయరాదన్నారు. నేటి వేగవంతమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నియంత్రపరమైన అనుమతుల్లో జాప్యం అనిశ్చితులకు దారితీస్తాయని, సకాలంలో వాణిజ్య కార్యకలాపాలకు అవరోధం కల్పిస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతిమంగా లావాదేవీల ప్రయోజనానికి నష్టం కలిగిస్తాయన్నారు.‘‘ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తున్నప్పుడు.. నియంత్రణ సంస్థల చురుకుదనం, సన్నద్ధతను ఇన్వెస్టర్లు గమనిస్తారు’’అని మంత్రి పేర్కొన్నారు. న్యాయపోరాటం, పరిష్కారానికి పట్టే సమయం లేక నియంత్రణ సంస్థలు తక్కువ పారదర్శకంగా ఉండే పరిస్థితుల్లో చర్చలు సంక్లిష్టంగా మారే అవకాశముంటుందన్నారు.అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ చర్చలు నిర్వహిస్తున్న తరుణంలో మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. స్వేచ్ఛాయుత, పారదర్శక మార్కెట్ కేవలం ఆర్థిక అవసరాల కోసమే కాకుండా, ప్రజాస్వామికంగానూ అవసరమేనన్నారు. ఎగుమతులు, ఇంధన, పర్యావరణ సవాళ్ల మధ్య దేశీ వృద్ధి చోదకాలపై ఎక్కువగా ఆధారపడుతున్నప్పుడు నియంత్రణలు, స్వేచ్ఛ మధ్య సరైన సమతూకం అవసమని అభిప్రాయపడ్డారు. -
దుబాయ్‌లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
దుబాయ్‌కు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ రాత్రికి రాత్రే గల్లంతైంది. రూ.కోట్ల కొద్దీ ఇన్వెస్టర్ల సొమ్ముతో ఆచూకీ లేకుండా మాయమైంది. దుబాయ్ లోని బిజినెస్ బేలోని క్యాపిటల్ గోల్డెన్ టవర్‌లో అప్పటి వరకూ ఆ కంపెనీ ఉన్న ఆఫీస్ బయట ఒక బకెట్, అందులో ఒక మాప్, చెత్త సంచి మాత్రమే కనిపించాయి. కొన్ని వారాల క్రితం ఈ స్థలంలో గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ కార్యాలయం ఉండేదని, అదే ఇప్పుడు అదృశ్యమైనట్లు కనిపిస్తోందని ఖలీజ్ టైమ్స్ నివేదిక తెలిపింది.గల్లంతైన సంస్థ..గత నెల వరకు గల్ఫ్ ఫస్ట్ దుబాయ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని క్యాపిటల్ గోల్డెన్ టవర్ 302, 305 సూట్ లలో సుమారు 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. ఔత్సాహిక ఇన్వెస్టర్లను సంప్రదించడం, ఫారెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించడం వారి పని.క్యాపిటల్ గోల్డెన్ టవర్లోని ఆ రెండు గదులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఫోన్ లైన్లు తెగిపోయి ఫ్లోర్లు దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. తాళాలు తిరిగి ఇచ్చి, అన్నీ క్లియర్ చేసి హడావుడిగా వెళ్లిపోయారని క్యాపిటల్ గోల్డెన్ టవర్ సెక్యూరిటీ గార్డు ఒకరు మీడియాకు తెలిపారు. ఇప్పుడు రోజూ జనం వచ్చి వారి గురించి అడుగుతున్నారని చెప్పారు.నష్టపోయిన భారత ఇన్వెస్టర్లుగల్ఫ్ ఫస్ట్ బాధితుల్లో భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు బాధితులు చెబుతున్నారు. కేరళకు చెందిన మహ్మద్, ఫయాజ్ పొయిల్ గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ బ్యాంకర్స్ ద్వారా 75,000 డాలర్లు అంటే రూ.64 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేసి మోసపోయారు.మరో భారతీయ ఇన్వెస్టర్ అయితే ఏకంగా 2,30,000 డాలర్లు భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లు నష్టపోయారు. ఇన్వెస్ట్ చేసే సయమంలో కంపెనీ రిలేషన్షిప్ మేనేజర్ తనతో తన మాతృ భాష కన్నడంలో మాట్లాడారని చెప్పుకొచ్చారు. మొదట చిన్న చిన్న లాభాలను చూపించి డబ్బును ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించిన కంపెనీ ఆ తర్వాత ఉపసంహరణలకు వీలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించారని బాధితుడు పేర్కొన్నారు.కంపెనీ సిబ్బంది తనతో మాట్లాడేటప్పుడు గల్ఫ్ ఫస్ట్, సిగ్మా-వన్ పేర్లను మార్చి మార్చి చెప్పారని, అవి రెండూ ఒకే కంపెనీగా ఉన్నాయని 50,000 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) నష్టపోయిన మహమ్మద్ అనే మరో ఇన్వెస్టర్ వివరించారు. రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు సిగ్మా-వన్ క్యాపిటల్ కు డీఎఫ్ఎస్ఏ లేదా ఎస్సీఏ అనుమతి లేదని నిర్ధారించారు. -
ఆర్బీఐ మరో విడత రేట్ల కోత.. 6.5% మించి వృద్ధి!
న్యూఢిల్లీ: ఆర్బీఐ త్వరలోనే మరో విడత రేట్ల కోతను చేపడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ అంచనా 6.5 శాతం మించి వృద్ధి రేటు నమోదవుతుందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) సెక్రటరీ జనరల్, సీఈవో రంజిత్ మెహతా అభిప్రాయపడ్డారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ) అందుబాటు ధరలపై రుణాలు, టెక్నాలజీ, మార్కెట్ అవకాశాల పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.ఈ అంశాలను ఆర్బీఐ తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. కనుక సమీప కాలంలోనే మరో విడత రేట్ల కోత ఉంటుందని అంచనా వేశారు. జూన్ 4–6 మధ్య ఆర్బీఐ ఎంపీసీ తదుపరి సమీక్ష జరగనుండడం గమనార్హం. ఎస్ఎంఈ మార్కెట్ సెంటిమెంట్ ఇండెక్స్ విడుదల కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ సూచీ మార్చితో ముగిసిన త్రైమాసికంలో సానుకూలంగా ఉండడం గమనార్హం. 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఉన్న 50 స్థాయిలోనే మార్చిలోనూ కొనసాగింది. ఎస్ఎంఈ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మాత్రం 57.7 పాయింట్లతో బలంగా నమోదైంది. -
ఒకే కంపెనీలో 50,000 మందికి ప్రమోషన్
గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ జూన్ 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ సైకిల్‌ను ప్రకటించింది. ఇందులో భారతదేశంలో 15,000 మంది ఉన్నారు. ఐటీ కన్సల్టింగ్ డిమాండ్ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులపై పరిశీలన పెరగడంతో ఈ ప్రమోషన్లలో ఆరు నెలలపాటు జాప్యం జరిగింది. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు నిలిచిపోయిన ప్రమోషన్లను జూన్‌లో ప్రకటిస్తామని తెలిపింది. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ వివరాలు వెల్లడించింది.సాంప్రదాయంగా యాక్సెంచర్ డిసెంబరులో ప్రమోషన్లను ప్రకటించింది. కానీ క్లయింట్ డిమాండ్, బడ్జెట్‌కు అనుగుణంగా ప్రమోషన్ చెల్లింపులు లేకపోవడంతో ఆ సైకిల్‌ను జూన్‌కు మార్చారు. స్థిరమైన వార్షిక షెడ్యూల్ ప్రకారం కాకుండా వ్యాపార అవసరాల ఆధారంగా ఉద్యోగులను ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమోషన్లు భారతదేశంలో 15,000, యూరప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (ఈఎంఈఏ) దేశాల్లో 11,000, అమెరికాలో 10,000గా ఉండనున్నాయి.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!అధిక వృద్ధి రంగాల్లోని ఉద్యోగులకు మూల వేతన పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే బోనస్, ఈక్విటీ ఆధారిత పరిహార నిర్ణయాలను 2025 డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ విధానం యాక్సెంచర్ పనితీరును, ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేయడానికి అనుమతిస్తుందని చెబుతున్నారు. 2023లో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ప్రపంచ ఆర్థిక సవాళ్లకు సమర్థంగా ప్రతిస్పందించడానికి, మారుతున్న కస్టమర్ డిమాండ్లకు అనుగుణంగా కంపెనీ 19,000 ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. ఆర్థిక వివేకాన్ని పాటిస్తూ ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని పెంపొందించేలా కొత్త ప్రమోషన్ వ్యూహాన్ని రూపొందించింది. -
టెలిగ్రామ్ సీఈఓ.. ‘దేశం విడిచి వెళ్లకూడదు’
ముందస్తు అనుమతి లేకుండా టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఫ్రాన్స్ విడిచి వెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌తో చర్చల కోసం అమెరికా వెళ్లాలని దురోవ్ ఇటీవల అధికారులను విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అభ్యర్థనను పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తోసిపుచ్చింది.పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం, దురోవ్ ప్రతిపాదిత యూఎస్ పర్యటనను ఉటంకిస్తూ ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు ‘ఈ పర్యటనకు కచ్చితంగా వెళ్లాలనేలా ఎలాంటి కారణాలు లేవు’ అని ఇటీవల తీర్పు ఇచ్చారు. 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో అరెస్టయినప్పటి నుంచి దురోవ్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన అడ్డంకులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అరెస్టు చేసినప్పటి నుంచి ఆయనను కఠినమైన చట్టపరమైన నియంత్రణలో ఉంచారు. దురోవ్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న టెలిగ్రామ్‌లో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన తనపై ఆరు క్రిమినల్ అభియోగాలు మోపారు.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!టెలిగ్రామ్ సీఈఓపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్‌ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటివి ఉన్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్‌కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు. ఫ్రాన్స్ అధికారులు 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో దురోవ్‌ను అరెస్టు చేశారు. -
మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..
విత్తనాలు వ్యవసాయ పరిశ్రమకు కీలకం. ఆహార ఉత్పత్తి, సుస్థిరత, వాణిజ్య లాభదాయకతలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. విత్తన ఉత్పత్తి రంగంలో నిత్యం విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు అతీతంగా బయోటెక్ ఆవిష్కరణలు, స్థిరమైన పద్ధతుల ద్వారా వీటిని ఉత్పత్తి చేసి రైతన్నలకు అధిక దిగుబడులు ఇవ్వాలని శాస్త్రవేత్తలు, కంపెనీలు, ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార డిమాండ్ పెరగడంతో విత్తన పరిశ్రమలో పెట్టుబడులు, పరిశోధనలు, మార్కెట్ పోటీ పెరుగుతోంది.మార్కెట్ ఇలా..అధిక దిగుబడి, వాతావరణ మార్పులు, పంటలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2030 నాటికి ప్రపంచ వ్యవసాయ విత్తన మార్కెట్ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. బేయర్ క్రాప్ సైన్స్, సింజెంటా, కోర్టెవా అగ్రిసైన్స్, యూపీఎల్.. వంటి ప్రధాన సంస్థలు ఈ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే సేంద్రీయ, స్వదేశీ విత్తనాల ఉత్పత్తులపై అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లు దృష్టి సారిస్తున్నాయి.వ్యాపార ధోరణులుబయోటెక్, జీఎం విత్తనాలు: జన్యుమార్పిడి (జెనటికల్లీ మాడిఫైడ్-జీఎం) విత్తనాలను తెగుళ్లు, కరువు, వ్యాధులను తట్టుకేనేందుకు ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి దిగుబడిని మెరుగుపరుస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. వీటి నియంత్రణ, వినియోగదారుల ప్రాధాన్యతల చుట్టూ వివాదాలు ఉన్నప్పటికీ జన్యుమార్పిడి విత్తనాలు ఏటా బిలియన్ల ఆదాయాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి.హైబ్రిడ్ విత్తనాలు: అధిక ఉత్పాదకత కోసం రూపొందించిన హైబ్రిడ్ విత్తనాలను వ్యవసాయంలో విరివిగా వాడుతున్నారు. ఇవి రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాయి.సేంద్రీయ, సుస్థిర విత్తనాలు: సుస్థిర వ్యవసాయం పెరగడంతో సేంద్రీయ విత్తనాలు ప్రజాదరణ పొందుతున్నాయి. పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారులను, నియంత్రణ సంస్థలను ఇవి ఆకర్షిస్తున్నాయి.శీతోష్ణస్థితిని తట్టుకునే విత్తనాలు: వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో కీలకమైన వేడిని, వరదలను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు పరిశోధనలో పెట్టుబడులు పెడుతున్నాయి.ఈ-కామర్స్, డైరెక్ట్-టు-ఫార్మర్ సేల్స్: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రైతులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి అధిక నాణ్యత విత్తనాలను పొందడానికి వీలు కలుగుతుంది. మధ్యవర్తులపై ఆధారపడటాన్ని ఈ ప్లాట్‌ఫామ్‌లు తగ్గిస్తున్నాయి.పెట్టుబడి, లాభదాయకతవిత్తన కంపెనీలు ప్రత్యేక జన్యు పరీక్షలపై పేటెంట్లను పొందుతున్నాయి. దీని ద్వారా మేధో సంపత్తి హక్కులను అందిపుచ్చుకుంటూ దీర్ఘకాలిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అదనంగా ప్రభుత్వ సబ్సిడీలు, పరిశోధన గ్రాంట్లు, కార్పొరేట్ భాగస్వామ్యాల ద్వారా కంపెనీలు వాటి మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. వ్యవసాయ వృద్ధిని అందిపుచ్చుకోవాలని చూస్తున్న ఇన్వెస్టర్లు కృత్రిమ మేధ ఆధారిత బ్రీడింగ్ పద్ధతుల్లో నైపుణ్యం కలిగిన విత్తన ఉత్పత్తి స్టార్టప్‌లపై ఆసక్తి చూపుతున్నాయి. భారత విత్తన మార్కెట్ 2025 నాటికి 3.82 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. 2030 నాటికి ఇది 5.01 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో మొత్తం సాగు విస్తీర్ణంలో హైబ్రిడ్ విత్తనాలు 80.6%గా ఉన్నాయి.సవాళ్లురెగ్యులేటరీ ఆంక్షలు: జన్యుమార్పిడి విత్తనాల ఆమోదానికి సంబంధించి నియమాలు దేశాన్ని బట్టి మారుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది.అధిక పరిశోధన ఖర్చులు: కొత్త విత్తన వంగడాలను అభివృద్ధి చేయడానికి విస్తృతమైన పరిశోధన అవసరం అవుతుంది. ఇది విత్తన ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది.సరసమైన ధరలు: నాణ్యమైన విత్తనాలను చిన్న, సన్నకారు రైతులకు సరసమైన ధరలకు అందేలా చూడటం సవాలుగా మారుతుంది. దీనికితోడు బ్లాక్‌లో విత్తనాలు విక్రయించే మాఫియా ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లువ్యవసాయ విత్తనాలను బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా నిరోధించడానికి ప్రభుత్వ యంత్రాంగం, సాంకేతిక పరిష్కారాలు, రైతుల్లో అవగాహన కల్పిచడం కీలకం. విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లకు కచ్చితమైన సర్టిఫికేషన్ ప్రమాణాలు ఉండేలా చూడాలి. నకిలీ విత్తన విక్రయాలకు కఠిన శిక్షలు అమలు చేయాలి. విత్తన ధ్రువీకరణకు క్యూఆర్ కోడ్లు, ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఉపయోగించాలి. తక్కువ దిగుబడులు, తెగుళ్ల బెడద, చట్టపరమైన సమస్యలు వంటి బ్లాక్ మార్కెట్ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలి. -
దానశీలురు ఈ కార్పొరేట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్.. టైమ్ మ్యాగజైన్ టాప్–100 దాతృత్వ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. విభిన్న కార్పొరేట్ వ్యవస్థాపకులు, దాతృత్వవాదులు సామాజిక అవసరాలకు నిధులు ఎలా కేటాయించిస్తున్నారో ఇది తెలియజేస్తుందని టైమ్ మ్యగజైన్ పేర్కొంది.ఇదీ చదవండి: పక్క దేశంలో స్టార్‌లింక్ పాగాదేశంలో అత్యధికంగా ముకేశ్, నీతా అంబానీ 2024లో రూ.407 కోట్లను విరాళంగా ఇచ్చారు. ప్రేమ్‌జీ 2013లో విప్రో కంపెనీలోని 29 బిలియన్ డాలర్ల షేర్లను విరాళంగా ప్రకటించడాన్ని గుర్తు చేసింది. సంప్రదాయ విరాళానికి అదనంగా విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో సేవలు అందించే 940 సంస్థలకు ప్రేమ్‌జీ 2023–2024 సంవత్సరాల్లో 109 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. 2023లో జెరోదా నిఖిల్ కామత్, నితిన్ కామత్ తమ సంపదలో 25 శాతాన్ని సమాజం కోసం ప్రకటించడాన్ని టైమ్ మ్యాగజైన్ గుర్తుచేసింది. -
హిందాల్కో లాభం జూమ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 66 శాతం జంప్‌చేసి రూ. 5,284 కోట్లను తాకింది. దేశీ అమ్మకాలు పుంజుకోవడం, ముడివ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 3,174 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 55,994 కోట్ల నుంచి రూ. 64,890 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 10,155 కోట్ల నుంచి రూ. 16,002 కోట్లకు జంప్ చేసింది. మొత్తం ఆదాయం రూ. 2,15,962 కోట్ల నుంచి రూ. 2,38,496 కోట్లకు బలపడింది. ఈఎంఐఎల్ మైన్స్‌కు ఓకే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినట్లు హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ పేర్కొన్నారు. ఇందుకు నిలకడైన నిర్వహణ సామర్థ్యం, వ్యయ నియంత్రణకుతోడు అన్ని బిజినెస్‌లకు నెలకొన్న డిమాండ్ దోహదపడినట్లు తెలియజేశారు. ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ సొంత అనుబంధ సంస్థ ఈఎంఐఎల్ మైన్స్ మినరల్ రిసోర్సెస్ కొనుగోలుకి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు హిందాల్కో పేర్కొంది. బంధా కోల్ బ్లాకు లీజ్ హక్కులు కలిగిన ఈఎంఐఎల్ మైన్స్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది.హిందాల్కో షేరు బీఎస్ఈలో 0.7% బలపడి రూ. 663 వద్ద ముగిసింది. -
మెడికల్ ఇంప్లాంట్.. ఫుల్ డిమాండ్..!
ముంబై: ఆర్థోపెడిక్, కార్డియాక్ ఇంప్లాంట్ల వ్యాపారం 2027–28 నాటికి 4.5–5 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.42,500 కోట్లు) విస్తరిస్తుందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశీయంగా బలమైన డిమాండ్‌కు తోడు, ఎగుమతులు క్రమంగా పెరుగుతుండడాన్ని ప్రస్తావించింది. ఆర్థోపెడిక్, కార్డియాక్ ఇంప్లాంట్ల వ్యాపారం (ఎగుమతులు సహా) 2024 మార్చి నాటికి 2.4–2.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్‌లో తలసరి ఆదాయం పెరుగుతుండడం, ఆరోగ్య సంరక్షణపై అవగాహనలో మార్పు, వృద్ధ జనాభా పెరుగుతుండడం, ఆరోగ్య సదుపాయాల విస్తరణ, ఆరోగ్య బీమా కవరేజీ విస్తృతి ఇవన్నీ ఈ రంగం వృద్ధికి సానుకూలిస్తాయని కేర్ఎడ్జ్ నివేదిక వివరించింది.ఇటీవలి సంవత్సరాల్లో బహళజాతి ఇంప్లాంట్ కంపెనీల కంటే దేశీ తయారీదారులే ఎక్కువ వృద్ధి చెందుతున్నట్టు పేర్కొంటూ.. పోటీతో కూడిన ధరలకుతోడు సామర్థ్యాలను సమకూర్చుకోవడాన్ని గుర్తు చేసింది. ఇంప్లాంట్లకు సంబంధించి బలమైన టెక్నాలజీ సామర్థ్యాలు అవసరమని.. ఈ విభాగాన్ని ప్రధానంగా విదేశీ ఎంఎన్‌సీలే శాసిస్తున్నట్టు తెలిపింది.అయితే దిగుమతులను భారత్ క్రమంగా తగ్గించుకుంటున్నట్టు.. దేశీ ఇంప్లాంట్ తయారీదారులు ఏటా 28 శాతం చొప్పున 2023–24 వరకు వరుసగా నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధిని సాధించినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో అమ్మకాలు ఏటా 12 శాతం పెరిగినట్టు పేర్కొంది. ప్రభుత్వ ప్రాయోజిత బీమా పథకాల్లో పాల్గొనడంతోపాటు పోటీ ధరల ఫలితంగా విదేశీ ఎంఎన్సీల కంటే భారతీయ కంపెనీలే అమ్మకాల్లో అధిక వృద్ధిని నమోదు చేస్తున్నట్టు వివరించింది.ఎగుమతుల్లోనూ సత్తా..గడిచిన కొన్నేళ్ల నుంచి భారత ఇంప్లాంట్ తయారీ కంపెనీలు విదేశీ ఎంఎన్‌సీలను స్థానిక మార్కెట్లో సవాలు చేయడమే కాకుండా ఎగుమతుల మార్కెట్లోనూ గట్టి పోటీనిస్తున్నట్టు కేర్ఎడ్జ్ నివేదిక వెల్లడించింది. ఇంప్లాంట్ మార్కెట్లో ఉన్న అవకాశాల నేపథ్యంలో జైడస్ లైఫ్ సైన్సెస్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ తదితర బడా ఫార్మా కంపెనీలు ఇంప్లాంట్ల తయారీ, పంపిణీపై పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించినట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న వాణిజ్యం, టారిఫ్‌ల అనిశ్చితులు, ధరలపై పరిమితుల విధింపు, నియంత్రణలను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. గుండెలో స్టెంట్లు, మోకాళ్ల చిప్పలు ఇవన్నీ కూడా ఇంప్లాంట్ల కిందకే వస్తాయి. -
ఆప్తమిత్రునికి రూ.588 కోట్లు!.. రతన్ టాటా వీలునామా
రతన్ టాటా పేరు వినగానే.. దిగ్గజ పారిశ్రామిక వేత్త, దాతృత్వానికే లెక్కకు మించిన డబ్బు వెచ్చించే దయాశీలి అని గుర్తొస్తుంది. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా వ్యవహరించిన ఈయన (రతన్ టాటా) కన్నుమూసిన తరువాత.. ఈయన ఆస్తి ఎవరికి చెందుతుంది?, వీలునామాలో ఎక్కువ వాటా ఎవరికి కేటాయించారు? అనేవి ప్రశ్నలు చర్చనీయాంశంగా మారిపోయింది.ఇప్పటికి వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ కోసం ఎక్కువ మొత్తంలో.. రతన్ టాటా వెచ్చించారని తెలిసింది. అంతే కాకుండా తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుమీద కొంత ఆస్తిని.. జిమ్నీ నావల్ టాటాకు.. జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించినట్లు తెలిసింది.అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. రతన్ టాటా ఆప్తమిత్రుడు, తాజ్ హోటల్స్ గ్రూప్ మాజీ డైరెక్టర్ అయిన 77 ఏళ్ల 'మోహిని మోహన్ దత్తా'కు తన మిగిలిన మొత్తం ఎస్టేట్‌లో మూడింట ఒక వంతు వాటా (సుమారు రూ. 588 కోట్లు) ఇచ్చినట్లు సమాచారం. కుటుంబ సభ్యురాలు కాకుండా భారీ మొత్తంలో రతన్ టాటా ఆస్తిని పొందిన ఏకైక వ్యక్తి మోహిని మోహన్ దత్తా.రతన్ టాటాకు చెందిన రూ. 3,900 కోట్ల విలువైన ఎస్టేట్‌ను సుమారు 20 మందికిపైగా పంచగా.. అందులో దత్తా వారసత్వ విలువపై కొందరు సందేహం వ్యక్తం చేశారు. అయితే వీలునామాలో ఉన్న 'నో కాంటెస్ట్' క్లాజ్ కారణంగా.. వీలునామాను ఎవరైనా వ్యతిరేకిస్తే వారి వాటా రద్దు అవుతుంది.ఎవరీ మోహినీ మోహన్ దత్తా?మోహినీ మోహన్ దత్తా జంషెడ్‌పూర్‌లో బాగా స్థిరపడిన వ్యాపారమైన స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. 2013లో స్టాలియన్ ట్రావెల్ ఏజెన్సీని టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన తాజ్ సర్వీసెస్‌తో విలీనం చేశారు. స్టాలియన్‌లో దత్తా కుటుంబానికి 80 శాతం వాటా ఉండగా, మిగిలిన 20 శాతం వాటా టాటా ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది. మరో విషయం ఏమిటంటే మోహినీ దత్తా థామస్ కుక్ మాజీ అసోసియేట్ కంపెనీ అయిన టీసీ ట్రావెల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.ఇదీ చదవండి: పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపురతన్ టాటా - మోహినీ మోహన్ దత్తా సంబంధంకొన్ని నివేదికల ప్రకారం.. మోహినీ మోహన్ దత్తా, రతన్ టాటాతో దీర్ఘకాల అనుబంధాన్ని కొనసాగించారు. టాటా వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధాల గురించి బహిరంగ చర్చలలో ఆయన పేరు ప్రముఖంగా లేకపోయినా, టాటా కుటుంబంతోపాటు ప్రైవేట్ సర్కిల్లోని ఎంపికచేయదగ్గ వ్యక్తులలో మోహినీ మోహన్ దత్తా ఒకరుగా ఉన్నారు. రతన్ టాటా టాటా తన జీవితంలో ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారని దత్తా స్వయంగా అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. -
ఈజ్ మై ట్రిప్ సీఈఓను విచారించిన ఈడీ
మహదేవ్ బెట్టింగ్‌యాప్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈజ్ మై ట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టిని విచారిస్తున్నట్లు తెలిపింది. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో పిట్టి ప్రమేయం ఉందని ఈడీ అనుమానిస్తోంది. ఈ వ్యవహారంతో స్టాక్ మానిప్యులేషన్, మనీలాండరింగ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.నిషాంత్ పిట్టిపై ఆరోపణలు..అసోసియేట్ ల్యాప్‌టాప్ నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలు ద్వారా పిట్టిని అక్రమ బెట్టింగ్ ప్లాట్ ఫామ్ అయిన స్కై ఎక్స్ఛేంజ్కు ఏజెంట్‌గా గుర్తించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా మహదేవ్ బెట్టింగ్‌యాప్ ఆపరేటర్లతో సంబంధం ఉన్న డొల్ల కంపెనీలకు ఈజ్ మై ట్రిప్ చెల్లింపులు చేసిందని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ పిట్టి నివాసంలో సోదాలు నిర్వహించి రూ.7 లక్షలు స్వాధీనం చేసుకుంది. స్టాక్ ధరలను తారుమారు చేయడం, చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడం లక్ష్యంగా ఉన్న బిగ్ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ లావాదేవీలు జరిగాయని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పెట్టుబడుల్లో బాద్షా ఈ దేవరపిట్టి ప్రతిస్పందననిషాంత్ పిట్టి ఈ ఆరోపణలను ఖండిస్తూ ఈడీ సూచించిన వ్యక్తులు, కంపెనీల గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. 2017 నుంచి ఈజ్ మై ట్రిప్ ఏ సంస్థలకు చెల్లింపులు చేయలేదని, పారదర్శకత, చట్టబద్ధమైన కార్యకలాపాలకు తమ సంస్థ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నానని, అన్ని ఆర్థిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తెలిపారు. -
పెట్టుబడుల్లో బాద్షా ఈ దేవర
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటనలో ప్రతిభ కనబరచడంతోపాటు పెట్టుబడులపై ఆసక్తి ఉన్న తెలివైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతున్నారు. వెండితెర ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టినప్పటికీ, అతడి ఆర్థిక చతురత, వ్యూహాత్మక పెట్టుబడులు వ్యాపార మొఘల్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా..డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అతీతంగా ఆకట్టుకునే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సుమారు రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం సహా ఆయన ఆస్తులు విభిన్న రంగాల్లో విస్తరించాయి. ఎన్టీఆర్ విలాసవంతమైన జీవనశైలికి, ఆర్థిక విజయానికి నిదర్శనంగా రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, పోర్షే, లంబోర్ఘిని ఉరుస్ వంటి హై-ఎండ్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు.సంపదను పెంచుకోవాలని, వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎన్టీఆర్ వ్యాపార మనస్తత్వం ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. రియల్ ఎస్టేట్, ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లగ్జరీ అసెట్స్‌లో ఎన్టీఆర్ విజయవంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్లు తమ వనరులన్నింటినీ ఒకే రంగంలో పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. అందుకు బదులుగా స్థిరమైన ఆర్థిక వృద్ధి కోసం బహుళ పరిశ్రమల్లో ఇన్వెస్ట్ చేయాలనే అందులో దాగిఉంది.ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసుజూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ ఎండార్స్మెంట్లలో కొన్ని..మలబార్ గోల్డ్ & డైమండ్స్అప్పీ ఫిజ్బోరో ప్లస్ పౌడర్జాండు బామ్నవరత్న ఆయిల్ -
మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసు
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 2.1 కోట్లకు డిమాండ్ నోటీసు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించకపోతే అసెట్స్‌తో పాటు బ్యాంకు ఖాతాలు కూడా అటాచ్ అవుతాయంటూ హెచ్చరించింది. గీతాంజలి జెమ్స్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల మీద 2022 జనవరిలో విధించిన జరిమానాను చోక్సీ చెల్లించకపోవడంతో ఈ నోటీసు జారీ అయింది. గీతాంజలి జెమ్స్ సీఎండీ అయిన చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14,000 కోట్లు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018లో వారు దేశం నుంచి పరారయ్యారు. 2019లో బ్రిటన్‌లో అరెస్టయిన మోదీ ప్రస్తుతం అక్కడి జైల్లో ఉండగా, చోక్సీ బెల్జియంలో అరెస్టయ్యారు.ఇదీ చదవండి: ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోతఇటీవల అరెస్ట్భారత సీబీఐ అధికారుల కోరిక మేరకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని ఇటీవల బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.14,000 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలున్నాయి. దాంతో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు గతంలో విశ్వప్రయత్నాలు చేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈమేరకు భారత్‌లోని ఉన్నతాధికారులకు లంచాలు కూడా ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి. -
ఎస్బీఐ ఎఫ్డీ రేట్లలో కోత
దేశంలోనే దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల (0.20 శాతం) మేర తగ్గించింది. ఈ నిర్ణయం ఈ నెల 16 నుంచే అమల్లోకి వచ్చింది. బ్యాంక్ వెబ్సైట్లో ఉంచిన సమాచారం మేరకు.. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు కాలవ్యవధి డిపాజిట్లపై గరిష్టంగా 6.7 శాతం రేటు ఇకమీదట లభించనుంది.మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్లపై రేటు 6.55 శాతం అమల్లోకి వచ్చింది. 5–10 ఏళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 6.30 శాతానికి తగ్గింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఎఫ్డీలపై 6.5 శాతం రేటు అమలవుతుంది. అమృత్ వర్ష్(444 రోజుల డిపాజిట్)పై రేటు 7.05 శాతం నుంచి 6.85 శాతానికి తగ్గింది. ఇదీ చదవండి: యాప్ ఒక్కటే.. సేవలు బోలెడు!60 ఏళ్లు నిండిన, 80 ఏళ్లు నిండిన వృద్ధులకు ఎప్పటి మాదిరే వడ్డీ రేటులో అదనపు ప్రయోజనం కొనసాగనుంది. గత నెలలోనూ ఎస్బీఐ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10–25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం గమనార్హం. ఆర్బీఐ ఇప్పటివరకు రెండు విడతల్లో కలిపి అర శాతం మేర రెపో రేటును తగ్గించడంతో ఈ మేరకు డిపాజిట్ రేట్లను బ్యాంక్‌లు సర్దుబాటు చేస్తుండడం గమనార్హం. -
సుప్రీం కోర్టులో వొడాఫోన్ పిటిషన్ డిస్మిస్
న్యూఢిల్లీ: ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీల నుంచి మినహాయింపు కోరుతూ వొడాఫోన్, ఎయిర్టెల్, టాటా టెలీసరీ్వసెస్ దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీం కోర్టు తోసిపుచ్చుంది. ఒక బహుళ జాతి కంపెనీ ఇలాంటి పిటీషన్ వేయడం తమను షాక్‌కి గురి చేసిందని వ్యాఖ్యానించింది. ఒకవేళ ప్రభుత్వం తనంతట తాను ఏదైనా సహాయం చేయదల్చుకుంటే న్యాయస్థానం జోక్యం చేసుకోబోదని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. టెలికం సంస్థలు లైసెన్సింగ్, స్పెక్ట్రం వినియోగ ఫీజుల కింద నిర్దిష్ట మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం టెలికం సేవలతో పాటు టెల్కోలకు వచ్చే ఇతరత్రా వనరుల నుంచి కూడా వచ్చే ఆదాయాన్ని వాటి మొత్తం ఆదాయంగా (ఏజీఆర్) నిర్వచిస్తూ, దాని ప్రాతిపదికగా చెల్లింపులు జరపాలంటూ ప్రభుత్వం, న్యాయస్థానం గతంలో సూచించడం వివాదానికి దారి తీసింది. ఏజీఆర్‌పరమైన బకాయిలను తప్పుగా లెక్కించడం వల్ల తమపై ఆర్థిక భారం గణనీయంగా పెరిగిపోతుందని, దీన్ని మినహాయించాలని లేదా పునఃసమీక్షించాలని న్యాయస్థానాన్ని టెల్కోలు ఆశ్రయించాయి. రూ. 30,000 కోట్ల బాకీల నుంచి మినహాయింపునివ్వాలంటూ వొడాఫోన్ కోరింది. గత ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వం సహాయం చేయలేకపోతోందన్న పిటీషనర్ వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచి్చంది. జూలై వరకు వాయిదా వేయాలని లేదా ఉపసంహరించుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్ధనలను పక్కన పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా సహాయం చేయదలిస్తే న్యాయస్థానం అడ్డుకోబోదని స్పష్టం చేసింది. -
ఎస్బీఐ లాభాలకు యోనో దన్ను
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ లాభాలకు డిజిటల్ విభాగం గణనీయంగా తోడ్పాటు అందిస్తోంది. ఈ విభాగం చిన్నదే అయినప్పటికీ భారీగా ప్రయోజనాలను చేకూర్చుతోందని మార్కెటింగ్ గురు, దేశీ ఫిలిప్ కోట్లర్గా పేరొందిన రాజేంద్ర శ్రీవాస్తవ విశ్లేషించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ రూ. 70,901 కోట్ల లాభం ప్రకటించింది. నికరలాభంపరంగా గ్లోబల్ టాప్ 100 కంపెనీల్లో మన దేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీల సరసన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నిల్చింది. ఎస్బీఐ ఈ ఘనత సాధించడంలో, 2017లో బ్యాంక్ ఆవిష్కరించిన డిజిటల్ ప్లాట్‌ఫాం ’యూ ఓన్లీ నీడ్ వన్’ (యోనో) యాప్ కూడా కీలక పాత్ర పోషించిందని శ్రీవాస్తవ తెలిపారు. కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే యూజర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సేవలు అందించేందుకు లక్షల మంది ఉద్యోగులు, వేల సంఖ్యలో బ్రాంచీలను ఉపయోగించడం కన్నా డిజిటల్ విభాగాన్ని ఇంకా సమర్ధవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి పెడితే మరింత ప్రయోజనం లభించగలదని తెలిపారు. ‘ఎస్బీఐలో దాదాపు 50 కోట్ల ఖాతాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఇంత మందికి సేవలందిస్తున్న అగ్రగామి బ్యాంకు. కానీ ఈ ఖాతాదారుల్లో 7.4 కోట్ల మంది మాత్రమే (సుమారు 14 శాతం మంది) యోనో యూజర్లు ఉన్నారు. ఈ చిన్న విభాగమే ఎస్బీఐ లాభాలకు దన్నుగా నిలుస్తోంది. తక్కువ మార్జిన్, అధిక సర్వీస్ వ్యయాలు ఉండే ఖాతాలు 37 కోట్ల పైగా ఉంటున్నాయి. అందరికీ ఆర్థిక సేవలు అందించాలన్న నినాదం కింద ప్రారంభించిన చాలా మటుకు ఖాతాల్లో బ్యాలెన్సులు తక్కువగా ఉంటున్నాయి. లేదా వినియోగంలోనే ఉండటం లేదు. వీటి వల్ల నిర్వహణ వ్యయాల భారం అధికంగా ఉంటోంది‘ అని శ్రీవాస్తవ వివరించారు. యోనోకు మరింత ప్రాధాన్యమివ్వాలి .. రికార్డు లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఎస్బీఐ పీబీ నిష్పత్తి (ప్రైస్–టు–బుక్) ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే తక్కువగా 1.4 స్థాయిలో ఉందని శ్రీవాస్తవ చెప్పారు. అదే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.8), ఐసీఐసీఐ బ్యాంకుల (3.3) మార్కెట్ వేల్యుయేషన్ అధిక స్థాయిలో ఉంటోందని వివరించారు. ఇవి డిజిటల్ మాధ్యమాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటూ, కార్యకలాపాల వ్యయాల భారాన్ని తక్కువ స్థాయికి పరిమితం చేసుకోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఆర్థిక పనితీరు కన్నా, వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోలేకపోవడం వల్లే దేశీ మార్కెట్లో పోటీ సంస్థలతో పోలిస్తే ఎస్బీఐ పీబీ నిష్పత్తి డిస్కౌంట్లో ఉంటోందని శ్రీవాస్తవ విశ్లేíÙంచారు. ఈ నేపథ్యంలో యోనోను సమర్ధంగా వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఆధార్, యూపీఐ, ఇంటర్నెట్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీలాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడి, గ్రామీణ ప్రాంతాల వారు కూడా మొబైల్ ఫోన్స్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న పరిస్థితుల్లో భౌతిక శాఖల విషయంలో బ్యాంకు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.మరిన్ని ముఖ్యాంశాలు..→ ఫిన్‌టెక్ విప్లవానికి స్పందనగా 2017లో ప్రారంభించిన యోనో ఇప్పుడు ఎస్బీఐ వృద్ధి వ్యూహానికి మూలస్తంభంగా మారింది. ప్రైవేట్ దిగ్గజాలు, ఫిన్‌టెక్ స్టార్టప్‌లకు దీటుగా 7.4 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ. 3.2 లక్షల కోట్ల రుణాల వితరణకు ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడింది. రోజువారీగా యోనోలో లాగిన్స్ 1 కోటి పైగా ఉంటాయి. ప్రస్తుతం ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి 65 శాతం లావాదేవీలు దీని ద్వారానే జరుగుతున్నాయి. యోనో కేవలం బ్యాంకింగ్కే పరిమితం కాకుండా వివిధ సర్వీసులు అందిస్తోంది. దీని ద్వారా ఖాతాలు తెరవొచ్చు, మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు, బీమా పాలసీలు కొనుగోలు చేయొచ్చు, ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు, రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రభుత్వ సర్వీసులను కూడా పొందవచ్చు. → వ్యయ–ఆదాయ నిష్పత్తి, కస్టమర్లను దక్కించుకునేందుకు చేసే వ్యయాలు, అసెట్స్‌పై రాబడులు తదితర అంశాల విషయంలో డిజిటల్ బ్యాంకులు ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంకులకు మించి నిలకడగా రాణిస్తున్నాయి. భారత్‌లో పేటీఎం, ఫోన్‌పే, జీరోధాలాంటి ఫిన్‌టెక్ సంస్థలు ఒక్కసారిగా ఎగిశాయి. వాటికి భిన్నంగా ఎస్బీఐకి భారీ స్థాయి, విశ్వసనీయత, రెగ్యులేటరీ సంస్థ నుంచి మద్దతులాంటి సానుకూలాంశాలు ఉన్నాయి. ఆర్థిక సమ్మిళితత్వానికే కాకుండా పోటీపడి, రాణించేందుకు కూడా వీటిని బ్యాంకు ఉపయోగించుకోవాలి. → శాఖల నెట్వర్క్, ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయకుండానే మార్కెట్ క్యాపిటలైజేషన్ను రెట్టింపు చేసుకునే సామర్థ్యం ఎస్బీఐకి ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు యాప్‌ను మరింత చేరువ చేసి, యోనో యూజర్లను పెంచుకోవాలి. → కాస్తంత పెట్టుబడులు పెడితే, కస్టమర్లను డిజిటల్ యూజర్లుగా మార్చుకోవచ్చు. తద్వారా సేవల వ్యయాలను తగ్గించుకోవచ్చు. పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని శాఖలు, ఏటీఎంలువంటి ఆర్వోఐ (పెట్టుబడిపై రాబడి) తక్కువ స్థాయిలో ఉండే భౌతిక మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దశలవారీగా తగ్గించుకోవావాలి. అలాగే, నిద్రాణ స్థితిలో ఉన్న ఖాతాలు, లేదా లో–బ్యాలెన్స్ ఖాతాలకు సంబంధించి నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవాలి. యోనో ద్వారా మరిన్ని ఉత్పత్తులను విక్రయించవచ్చు. యోనోను అనుబంధ సాధనంగా కాకుండా కస్టమర్లకు చేరువయ్యేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక చోదకంగా పరిగణించాలి. -
4 మెయిల్స్, 15 కాల్స్, 45 మెసేజస్: ఇంటర్వూ క్యాన్సిల్
సాధారణంగా ఒక ఉద్యోగానికి అప్లై చేసుకుంటే.. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేదా ఆ కంపెనీకి చెందిన రిక్రూటర్ కాల్ చేయడం జరుగుతుంది. అయితే ఓ అభ్యర్థి.. తనకు పదేపదే కాల్స్ వస్తున్నాయని, ఏకంగా ఒక గ్లోబల్ కంపెనీ ఇంటర్వ్యూనే వద్దనుకున్నాడు. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకున్నాను అనే శీర్షికతో.. ఓ రెడ్డిట్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో.. సోమవారం నుంచి బుధవారం మధ్య, రిక్రూటర్ నాలుగు ఈమెయిల్స్ పంపారు, 15 ఫోన్ కాల్స్ చేశారు. 45 టెక్స్ట్ మెసేజస్ చేశారు. కొన్ని మెసేజస్ రాత్రి 10 గంటల సమయంలో కూడా వచ్చాయి. అప్పటికే రిక్రూటర్‌తో మూడుసార్లు మాట్లాడాను, అవసరమైన మొత్తం సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా షేర్ చేశాను. నేను బిజీగా ఉన్నప్పుడు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఒకసారి నాకు వచ్చిన ఫోన్ నెంబరుకు తిరిగి కాల్ చేస్తే.. మరెవరో సమాధానం ఇచ్చారు. దీంతో నాకు వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది.వాళ్ళ ప్రవర్తనతో ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకోవాలనిపించింది. ఆ తరువాత నేరుగా ఇంటర్వ్యూ చేసేవారికి ఈ మెయిల్ చేసాను. రిక్రూటర్‌ను బ్లాక్ చేయడానికి ముందు కూడా నాకు రెండు కాల్స్ వచ్చాయని ఆ ఉద్యోగార్థి (అభ్యర్థి) పేర్కొన్నారు. వల్ల ప్రవర్తన నన్ను అతిపెద్ద కంపెనీలలో ఒకదానికి పూర్తిగా దూరం చేసిందని పేర్కొన్నారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. రిక్రూటర్ మోసగాడేమో అని ఒకరు సందేహపడగా.. వారు రిక్రూటర్‌గా కాకుండా టెలిమార్కెటర్గా ఉండి ఉంటే బాగుండేదని మరొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక -
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
మీరు తరచుగా రైలులో ప్రయాణిస్తుంటారా? అందులోనూ వెయిటింగ్ లిస్ట్ టికెట్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారా? అయితే మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన అప్డేట్ ఒకటి ఉంది. ఇండియన్ రైల్వే తాజాగా ఒక పెద్ద మార్పు చేసింది. స్లీపర్ క్లాస్ టికెట్లు ఇకపై ఖాళీగా ఉన్నప్పటికీ ఫస్ట్ ఏసీకి అప్‌గ్రేడ్ అవ్వవు. ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు ఒక వేళ సీట్లు అందుబాటులో ఇతర క్లాస్‌లలో సీట్లు కేటాయించేవారు. ఇకపై ఆ సౌకర్యం ఉండదు.ఆటో అప్‌గ్రేడ్ విధానం ఎలా పనిచేస్తుందో తాజగా జారీ చేసిన సర్క్యులర్‌లో రైల్వే బోర్డు స్పష్టం చేసింది. మీరు ఒక నిర్దిష్ట తరగతిలో టికెట్ బుక్ చేసుకుంటే అందులో సీట్లు అందుబాటులో లేకపోతే మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది. ఒకవేళ ఇతర ఉన్నత తరగతులలో లభ్యత ఉంటే మీ సీటు ఆటోమేటిక్‌గా ఆ క్లాస్‌లోకి అప్‌గ్రేడ్ అవుతుంది. అయితే ఇది రెండు తరగతులకు మాత్రమే.సీట్ల అప్‌గ్రేడ్ ఇలా..స్లీపర్ క్లాస్ ప్రయాణీకులకు, అప్‌గ్రేడ్ కొత్త క్రమం ఇలా ఉంటుంది.. 2S → 3E → 3A → 2A → 1Aఅయితే 2ఏ ప్రయాణీకులను మాత్రమే 1ఏ (ఫస్ట్ ఏసీ)గా అప్ గ్రేడ్ చేయవచ్చని భారతీయ రైల్వే స్పష్టం చేసింది. మీరు స్లీపర్ లేదా 3ఈలో ఉంటే ఇకపై ఫస్ట్ ఏసీకి అప్‌గ్రేడ్ కాలేరు.సీటింగ్ క్లాస్ కోచ్‌లతో అప్‌గ్రేడ్ క్రమం ఇలా ఉంటుంది.. 2S → VS → CC → EC → EV → EAఇక్కడ కూడా సీసీ (చైర్ కార్) టికెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈసీ, ఈవీ లేదా ఈఏ వంటి ప్రీమియం తరగతులకు అప్ గ్రేడ్ అయ్యేందుకు అర్హులు. అలాగే సీటింగ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌లకు మధ్య ఎలాంటి అప్‌గ్రేడ్‌కు అవకాశం ఉండదు.అప్‌గ్రేడ్ కోసం ఏమైనా చేయాలా?ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ‘ఓకే విత్ ఆటో అప్‌గ్రేడ్’ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ "యస్" క్లిక్ చేస్తే, మీ టిక్కెట్ అర్హత అప్‌గ్రేడ్‌కు పొందుతుంది. "నో" ఎంచుకుంటే, అప్‌గ్రేడ్ కాదు. ఒక వేళ మీరు ఏ ఆప్షన్‌నూ ఎంచుకోకపోతే సిస్టమ్ దానిని డిఫాల్ట్‌గా "యస్" గా తీసుకుంటుంది. -
అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్
బాల్య ప్రేమికులు,గత ఏడాది జూలైలో వివాహం బంధంలోకి అడుగపెట్టిన లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ షాపింగ్‌లో సందడిగా కనిపించారు. జియో ప్లాజాలో భార్య రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ ఆదివారం షాపింగ్ చేయడం సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. అంబానీ అప్డేట్ పేజీ ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.అనంత్ , రాధిక జియో వరల్డ్ ప్లాజా ప్రాంగణంలో షాపింగ్ చేశశారు. జియో వరల్డ్ ప్లాజాలోని భద్రతా సిబ్బంది వెంటరాగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి అయ్యి దాదాపు ఏడాది కావస్తున్నా కొత్తజంటలా జియో షాపింగ్ మాల్లో సందడి చేశారు. అనంత్ కాల్లో బిజీగా ఉండగా, రాధిక చేయి పట్టుకుని ఉల్లాసంగా నడుస్తు, విలాసంగా కనిపించింది. అనంత్ నేవీ బ్లూ షర్ట్, త్రీ-ఫోర్త్స్ బ్లాక్ షార్ట్స్, బ్లాక్ సాక్స్, బ్లూ షూస్ ధరించాడు. ఇక అంబానీ చోటీ బహూ ఎప్పటిలాగానే తన సింపుల్ స్టైల్‌ను చాటుకుంది. రాధిక తెల్లటి స్లీవ్‌లెస్ క్రాప్ టాప్ ధరించి, గిరిజాలజుట్టును అలా వదిలేసి సైడ్ బ్యాగ్ వేసుకుని చాలా క్యాజువల్ స్టైల్లో కనిపించింది.అయితే జంట దేని కోసం షాపింగ్ చేశారో స్పష్టంగా తెలియదు. ఫ్యాన్స్‌కి మాత్రం అనంత్-రాధిక షాపింగ్ వీడియో తెగ నచ్చేసింది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..! దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ తన చిన్ని నాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను గత ఏడాది జైలూ12న పెళ్లాడాడు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో వివాహ వేడుకలు జరిగాయి. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బిలియనీర్లు హాజరైన సంగతి తెలిసిందే. -
అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుకు రిలయన్స్ ఏర్పాట్లు
భూటాన్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు రిలయన్స్ పవర్ ఆ దేశానికి చెందిన గ్రీన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 500 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.2,000 కోట్ల పెట్టుబడితో భూటాన్ పెట్టుబడి సంస్థ డ్రక్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్(డీహెచ్ఐ)తో కలిసి జాయింట్ వెంచర్((50-50)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.క్లీన్ ఎనర్జీ విస్తరణభూటాన్ చాలాకాలంగా జలవిద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా నిలుస్తుంది. ఈ రంగం దాని ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదం చేస్తుంది. అయినప్పటికీ సౌర విద్యుత్‌ను విస్తరిస్తూ పునరుత్పాదక ఇంధన రంగాన్ని వైవిధ్యపరచడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. సౌరశక్తిని పెంచుకోవడం ద్వారా భూటాన్ మరింత స్థిరమైన ఇంధన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ప్రయత్నిస్తోంది.ఇదీ చదవండి: భూమార్గాల ద్వారా దిగుమతులపై భారత్ నిషేధంరిలయన్స్ పవర్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులను సమీకరిస్తోంది. ఈ జాయింట్ వెంచర్ ప్రాంతీయ ఇంధన భద్రతను పెంచుతుందని, సంప్రదాయ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, దక్షిణాసియాలో భూటాన్‌ను క్లీన్ ఎనర్జీ హబ్‌గా నిలుపుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఎగసిన కంపెనీల మార్కెట్ విలువ..
న్యూఢిల్లీ: బుల్ మళ్లీ రంకెలేస్తుండటంతో మార్కెట్ కళకళలాడుతోంది. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 3.6 శాతం జంప్ చేయడంతో దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువలు కూడా భారీగా ఎగబాకాయి. మార్కెట్ క్యాప్ పరంగా అత్యంత విలువైన 10 కంపెనీల్లో 9 దిగ్గజాలు రూ.3.35 లక్షల కోట్లను జత చేసుకున్నాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు దూకుడుతో మార్కెట్ విలువ రూ.1.06 లక్షల కోట్లు ఎగసి, రూ. 19.71 లక్షల కోట్లకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.46,303 కోట్లు, టీసీఎస్ రూ.43,688 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.34,281 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.34,029 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.32,730 కోట్లు, ఐటీసీ రూ.15,142 కోట్లు, ఎస్బీఐ రూ.11,111 కోట్లు, హెచ్‌యూఎల్ రూ.11,054 కోట్లు చొప్పున మార్కెట్ విలువను పెంచుకున్నాయి.అయితే, భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ మాత్రం రూ.19,330 కోట్లు తగ్గింది. అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. తర్వాత ర్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.14.80 లక్షల కోట్లు), టీసీఎస్ (రూ.12.89 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.10.36 లక్షల కోట్లు), భారతీ ఎయిర్టెల్ (రూ. 10.34 లక్షల కోట్లు), ఎస్బీఐ (రూ.7.06 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.6.6 లక్షల కోట్లు), బజాజ్ ఫైనాన్స్ (రూ.5.69 లక్షల కోట్లు), హెచ్‌యూఎల్ (రూ.5.59 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.5.45 లక్షల కోట్లు) ఉన్నాయి. -
వజ్రాలను మించిపోయిన స్మార్ట్ఫోన్లు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల ఎగుమతులు మంచి జోరు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాకు ఐదు రెట్లు, జపాన్‌కు నాలుగు రెట్లకు మించి స్మార్ట్ఫోన్ల ఎగుమతులు గత మూడేళ్లలో పెరిగినట్టు ప్రభుత్వ డేటా తెలియజేస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలను వెనక్కి నెట్టేసి ఎగుమతుల్లో టాప్ స్థానానికి స్మార్ట్ఫోన్లు చేసుకున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 24.14 బిలియన్ డాలర్ల విలువైన (రూ.2.05 లక్షల కోట్లు) స్మార్ట్ఫోన్ల ఎగుమతులు నమోదయ్యాయి. 2023–24లో 15.57 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోల్చి చూస్తే 55 శాతం పెరిగాయి. 2022–23లో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 10.96 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా యూఎస్, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్ దేశాలకు భారత స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో అధిక వృద్ధి నమోదైంది. ఒక్క అమెరికాకే గత ఆర్థిక సంవత్సరంలో 10.6 బిలియన్ డాలర్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు జరిగాయి. 2023–24లో 5.57 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2022–23లో అమెరికాకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 2.16 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. జపాన్ విషయంలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. 2022–23లో జపాన్‌కు స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 120 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2024–25లో 520 మిలియన్ డాలర్లకు పెరిగాయి. తయారీ, ఎగుమతులకు కేంద్రం దేశ అగ్రగామి ఎగుమతుల్లో స్మార్ట్ఫోన్లు కూడా చేరినట్టు, పెట్రెలియం ఉత్పత్తులు, వజ్రాల ఎగుమతులను మొదటిసారి అధిగమించినట్టు వాణిజ్య శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముఖ్యంగా గత మూడేళ్లలో బలమైన వృద్ధి నమోదైనట్టు.. దీంతో అంతర్జాతీయంగా స్మార్ట్ఫోన్ల తయారీ, ఎగుమతులకు భారత్ ప్రధాన కేంద్రంగా అవతరించినట్టు చెప్పారు. పీఎల్ఐ కింద స్మార్ట్ఫోన్ల తయారీకి కేంద్రం రాయితీలు ఇస్తుండడం తెలిసిందే. ఇక నెదర్లాండ్స్‌కు గత ఆర్థిక సంవత్సరంలో 2.2 బిలియన్ డాలర్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు జరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 1.07 బిలియన్ డాలర్లతో పోలి్చతే రెట్టింపయ్యాయి. ఇటలీకి సైతం 720 మిలియన్ డాలర్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 1.26 బిలియన్ డాలర్లకు పెరిగాయి. చెక్ రిపబ్లిక్కు 650 మిలియన్ డాలర్ల నుంచి 1.17 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్ల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో పెరిగినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది. -
365 రోజుల వ్యాలిడిటీ: వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేస్తుంటే.. దేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ అయిన వోడాఫోన్ ఐడియా మాత్రం ఖరీదైన ప్లాన్ (రూ. 4999) ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ఖరీదైనది అయినప్పటికీ.. ఆఫర్స్ కూడా బోలెడన్ని ఉన్నాయని తెలుస్తోంది.వోడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ.4,999 వ్యాలిడిటీ.. 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. తరచుగా రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తొలగించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ఏడాది పాటు.. రోజుకి 100 ఎస్ఎమ్ఎస్లు పంపుకోవచ్చు. అయితే డేటా రోజుకు 2 జీబీ మాత్రమే. అపరిమిత వాయిస్ కాల్స్ యధావిధిగా లభిస్తాయి.ఎస్ఎమ్ఎస్లు, డేటా, వాయిస్ కాల్స్ మాత్రమే కాకుండా.. Vi MTV, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5, ప్లేఫ్లిక్, Fancode, Aaj Tak, Manoramax వంటి అనేక ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత సభ్యత్వాలు లభిస్తాయి.వోడాఫోన్ ఐడియా రూ. 4999 ప్లాన్ అపరిమిత ప్రయోజనాల విషయానికి వస్తే.. ఇందులో వీకెండ్ డేటా రోల్ ఓవర్, డేటా డిలైట్స్, హాఫ్ డే అన్లిమిటెడ్ డేటా వంటివి ఉన్నాయి. రోజుకి 2జీబీ డేటా అయినప్పటికీ హాఫ్ డే అన్లిమిటెడ్ డేటా కింద.. ప్రతిరోజూ అర్ధరాత్రి నుండి మధ్యాహ్నం వరకు అపరిమిత డేటా అందుబాటులో ఉంటుంది. ఇది సగం రోజు వినియోగాన్ని కవర్ చేస్తుంది. ఈ ప్లాన్ వారాంతపు డేటా రోల్‌ఓవర్‌ను కూడా కలిగి ఉంది, అంటే ఉపయోగించని ఇంటర్నెట్ డేటాను వారంలోని చివరి రెండు రోజుల్లో తీసుకెళ్లి ఉపయోగించవచ్చు. -
కొత్త మార్కెట్‌కు తెరలేపిన ఆర్బీఐ నిర్ణయం
మొబైల్ వాడకం కోవిడ్–19 తరువాత భారత్‌లో గణనీయంగా పెరిగింది. డేటా ఫర్ ఇండియా 2025 ఫిబ్రవరి నివేదిక ప్రకారం.. ఈ విషయంలో 10–19 ఏళ్ల వయసువారు ముందంజలో ఉన్నారు. మొబైల్ వినియోగంలో నైపుణ్యత పట్టణ ధనిక వర్గం పిల్లలకే పరిమితం కాలేదు. గ్రామాల్లోనూ పెరిగింది. ఇప్పటికే మైనర్లు పరిమితులతో కూడిన మొబైల్ వాలెట్స్, పాకెట్ మనీ డిజిటల్ వాలెట్స్, యూపీఐ సర్కిల్‌ను విరివిగా వాడుతున్నారు. 10 ఏళ్లకుపైబడిన మైనర్లు వారి సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను వ్యక్తిగతంగా తెరిచి, నిర్వహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే అనుమతించింది. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు మరింత ఊపందుకుంటాయని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్కేంద్ర ప్రభుత్వ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్–2024 (అసర్) నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని 14–16 ఏళ్ల వయసున్న 75 శాతంపైగా పిల్లలు డిజిటల్ హోమ్ వర్క్‌ను పూర్తి చేయడానికి స్మార్ట్ఫోన్లను విజయవంతంగా వినియోగిస్తున్నారు. విద్య, వినోద అంశాలతోపాటు, యూపీఐ పేమెంట్లకు కూడా స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఈ వాస్తవిక పరిస్థితికి అద్దం పడుతోంది. అంతేకాదు డిజిటల్ పేమెంట్స్ రంగంలో కొత్త మార్కెట్‌కు తెరలేపింది. భవిష్యత్ కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు బ్యాంకులకు మార్గం ఏర్పడింది. మైనర్లను బ్యాంకింగ్ వైపునకు తీసుకురావడానికి ఫిన్ టెక్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.తల్లిదండ్రులు/సంరక్షకుల ద్వారా మైనర్లకు బ్యాంక్ ఖాతా తెరిచే అవకాశం ఇప్పటికే ఉంది. అయితే మైనర్లు వ్యక్తిగతంగా ఖాతాను నిర్వహించడం వల్ల గతంలో లేని పలు అదనపు ప్రయోజనాలు ఇప్పుడు ఉన్నాయి. సొంత ఖాతా ఉంటే యూపీఐ చెల్లింపులు సులభం అవుతాయి. అంతేకాదు, తరచూ చిన్నపాటి కొనుగోళ్లు జరిపే 14–18 ఏళ్ల పిల్లలు ఈ మార్పు వల్ల ప్రయోజనం పొందుతారు. స్కూల్ లేదా ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి చేరేందుకు బైకులను యాప్‌ల ద్వారా బుక్ చేసుకోవడం, క్యాంటీన్లో ఆహారం, స్టేషనరీ కొనుక్కోవడం.. ఇలాంటి వాటికి వీలవుతుంది. దీనివల్ల మైనర్లు చేసే డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయనేది సుస్పష్టం. కాగా, యువత రుణం అందుకోవడం, పెట్టుబడుల విషయంలో డిజిటల్ వేదికలు పెను మార్పులు తెచ్చాయి. చిన్నచిన్న రుణాలకు యువ కస్టమర్లు పెద్ద ఎత్తున ఫిన్ టెక్ కంపెనీలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల తలుపు తడుతున్నారు.ఇప్పటికే మైనర్ల కోసం..బ్యాంకులు ఇప్పటికే.. తల్లిదండ్రులతో కలిసి సంయుక్తంగా నిర్వహించే మైనర్ ఖాతాలకు అనుసంధానించిన డెబిట్ కార్డులు, మొబైల్ యాప్స్‌ను అందిస్తున్నాయి. అలాగే 13–18 ఏళ్ల వయసున్న వారి కోసం గూగుల్ పే వాలెట్స్ వంటి పరిమితులతో ఉపయోగించే మొబైల్ వాలెట్స్, బ్యాంక్ ఖాతా అవసరం లేని జూనియో, ఫ్యామ్‌పే, ఫైప్ తదితర పాకెట్ మనీ డిజిటల్ వాలెట్స్ కూడా మైనర్ల కోసం కొలువుదీరాయి. ప్రాథమిక యూపీఐ వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతా నుంచి యూపీఐ సర్కిల్ ఫీచర్ ద్వారా ద్వితీయ వినియోగదారు లావాదేవీలు నిర్వహించవచ్చు. ద్వితీయ వినియోగదారుకు స్వంత బ్యాంక్ ఖాతా లేకపోయినా.. ప్రాథమిక వినియోగదారు తరపున చెల్లింపులు చేయవచ్చు. పరిమితులు, అనుమతులను నిర్ధేశించడం ద్వారా ప్రాథమిక వినియోగదారుడు ఈ లావాదేవీలను నియంత్రించవచ్చు.ఆర్థిక అక్షరాస్యతలో..ఆర్బీఐ 2023లో చేపట్టిన సర్వేలో పెద్దవారితో పోలిస్తే 30 ఏళ్లలోపు వారిలో ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉందని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సర్వే–2019 ప్రకారం 18–29 ఏళ్ల వయసువారిలో 30 శాతం మందికి మాత్రమే ఆర్థిక అక్షరాస్యత ఉంది. 10 ఏళ్లకు పైబడ్డ మైనర్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి అనుమతించడం ఆర్థిక అక్షరాస్యత పెంచే కార్యక్రమాల్లో ఒకటిగానే చూడాలన్నది నిపుణుల భావన. సొంత ఖాతాకు, ఆర్థిక లావాదేవీలకు చిన్నతనంలోనే యాజమాన్య హక్కులు దక్కడం వల్ల అవసరాలకు తగ్గట్టుగా నిధులు కేటాయించడంతోపాటు డబ్బులు దాచుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. -
కన్ఫర్మ్ తత్కాల్ టికెట్ దక్కాలంటే.. 5 సూత్రాలు
రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ఇక పండుగల సమయంలో అయితే రైలు ప్రయాణీకుల సంఖ్య చాలా రెట్లు పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో కన్ఫర్మ్ టికెట్ పొందాలంటే చాలా కష్టపడాలి. అప్పటికప్పుడు ప్రయాణాలు చేసేవారి కోసం తత్కాల్ బుకింగ్ (Tatkal ticket) ఆప్షన్ ఉన్నప్పటికీ కన్ఫర్మ్ టికెట్ దక్కడం అంత సులభం కాదు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు కొన్ని చిట్కాలను తెలియజేస్తున్నాం. వీటిని పాటిస్తే మీరు ఇతరులకన్నా చాలా వేగంగా తత్కాల్ టికెట్లను బుక్ చేయవచ్చు. తద్వారా కన్ఫర్మ్ టికెట్ లభించే అవకాశం ఉంటుంది.👉 ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండిరైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసే ముందు మీ ఇంటర్నెట్ కనెక్షన్ సక్రమంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. తత్కాల్ టికెట్ చేస్తున్నప్పుడు 1-2 నిమిషాల సమయం కూడా లభించదు. అటువంటి పరిస్థితిలో మీ ఇంటర్నెట్ కనెక్షన్లో అంతరాయం కలిగితే టికెట్ బుకింగ్ ఆలస్యమై కన్ఫర్మ్ టికెట్ దక్కే అవకాశం ఉండదు.👉 సరైన సమయంలో లాగిన్ అవ్వాలితత్కాల్ బుకింగ్ చేసుకోవాలంటే సరైన సమయంలో లాగిన్ అవ్వాలి. ఏసీ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, స్లీపర్ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి బుకింగ్ ప్రారంభానికి 2-3 నిమిషాల ముందుగానే లాగిన్ అవ్వాలి.👉 మాస్టర్ లిస్ట్ సిద్ధం చేసుకోండిఐఆర్సీటీసీలో కస్టమర్లకు మాస్టర్ లిస్ట్ అనే ప్రత్యేక ఫీచర్ అందుబాటులో ఉంది. ఇందులో ప్రయాణీకుల వివరాలను బుకింగ్ చేయడానికి ముందే నింపి సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఇది బుకింగ్ చేసేటప్పుడు సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.👉 యూపీఐ పేమెంట్తత్కాల్ బుకింగ్ సమయంలో టికెట్ మొత్తాన్ని చెల్లించేందుకు క్రెడిట్, డెబిట్ కార్డులకు బదులుగా యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. దీంతో ప్రక్రియ వేగంగా పూర్తయి కన్ఫర్మ్ టికెట్ మీ సొంతమవుతుంది.👉 రైళ్లను ఎంచుకోవడంబుకింగ్ చేసే ముందు తత్కాల్ టికెట్లు పొందడానికి ఎక్కువ అవకాశం ఉన్న రైళ్లను ఎంచుకోవాలి. లాంగ్ జర్నీ రైళ్లకు బదులుగా మీరు ప్రయాణించాల్సిన స్టేషన్ల మధ్య మాత్రమే తిరిగే రైళ్లను ఉదాహరణకు ప్రత్యేక రైళ్లు ఎంచుకుంటే కన్ఫర్మ్ టిక్కెట్లు పొందే అవకాశాలు ఎక్కువుంటాయి. -
భారత్.. మంచి కాఫీలాంటి మార్కెట్!
‘కొండ ప్రాంతాల్లో పంట. బాగా మగ్గిన కాఫీ చెర్రీస్ సేకరణ, గ్రేడింగ్ సైతం చేతితోనే.. భారత్ మినహా ప్రపంచంలో మరెక్కడా ఈ ప్రత్యేకత లేదు. అంతేకాదు నాణ్యతలోనూ మనది విశిష్ట స్థానమే. అందుకే ఖరీదైన ‘స్పెషాలిటీ కాఫీ’లభించే దేశాల జాబితాలో భారత్ నిలిచింది. కొన్ని ఎస్టేట్స్‌లో పండిన కాఫీ 100 శాతం ప్రీమియంతో అమ్ముడైన సందర్భాలు ఎన్నో. యూరప్‌కు చెందిన దిగ్గజ బ్రాండ్స్‌కు మన కాఫీయే కావాలని చెబుతారు. ఉత్పత్తిలో ప్రపంచంలో 7వ స్థానంలో నిలిచిన భారత్‌లో 2023–24లో 3,74,200 టన్నుల కాఫీ పండింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియులు భారతీయ అరోమాను ప్రతిరోజూ ఆస్వాదిస్తున్నారు. నాణ్యత, పోటీ ధర, సర్వీస్‌తో భారత కాఫీ అంతర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం మరింత పెరిగితే కాఫీ రంగంలో మన దేశం అద్భుతాలు సృష్టిస్తుంది’అంటారు ప్రైవేట్ లేబుల్ కాఫీ తయారీలో ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు చల్లా రాజేంద్ర ప్రసాద్. ఆయనింకా ఏమన్నారంటే.. -సాక్షి, స్పెషల్ డెస్క్వినియోగం పెరిగింది గతంలో భారత్‌లో కాఫీ వినియోగం ఏటా 50 టన్నులు మాత్రమే. నేడు 1,25,000 టన్నుల స్థాయికి చేరుకున్నాం. ఉత్పత్తి అధికం అయితే కాఫీ వినియోగం పెరుగుతుంది. దేశీయంగా 10,00,000 టన్నుల కాఫీ విక్రయించేంతగా అవకాశాలు ఉన్నాయి. 1960–70 ప్రాంతంలో ఇన్స్టంట్ కాఫీ తయారీ సామర్థ్యం కేవలం 1,600 టన్నులు మాత్రమే. ఇప్పుడు ఏకంగా 70,000 టన్నులతో ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచాం. ఇందులో సీసీఎల్ వాటా 40,000 టన్నులు. అన్ని కంపెనీలకూ రెండింతలు ఉత్పత్తి చేయగల అదనపు సామర్థ్యం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని కాఫీకి విలువ జోడించడం ద్వారా ప్రపంచ పటంలో భారత్ నిలిచింది. ఇన్స్టంట్ కాఫీలో బ్రెజిల్ 90,000 టన్నులు, యూరప్ దేశాలు 80,000 టన్నులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఒక్క అరకులోనే..: ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, పన్నులు లేవు.. అందుకే కాఫీ ఉత్పత్తిలో వియత్నాం 20–25 ఏళ్లలో ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. మనదేశంలోనూ కాఫీ పంటకు అనువైన ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో 5,000 టన్నులు పండుతోంది. దీనిని 1,00,000 టన్నుల స్థాయికి చేర్చవచ్చు. కావాల్సిందల్లా ప్రభుత్వ ప్రోత్సాహమే. స్థానికులకు ఉపాధి అవకాశాలతోపాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అనుబంధ కంపెనీలూ వస్తాయి. 5–10 ఏళ్లు కష్టపడితే చాలు. కాఫీ స్టార్టప్స్..: యువ వ్యాపారవేత్తలు త్వరితగతిన డబ్బులు అందుకోవాలని చూస్తున్నారు. ఇదే సమస్యకు కారణం. సుస్థిరత, దీర్ఘకాల కోసం వ్యాపార సంస్థలు ప్రణాళిక చేసుకోవాలి. ఏ స్టార్టప్ అయినా, ఉత్పాదన ఏదైనా.. వినూత్నంగా ఉంటేనే నిలదొక్కుకుంటాయి. కాఫీ రంగంలోనూ ఎన్నో స్టార్టప్స్ వచ్చాయి. నాణ్యతలో స్థిరత్వం లేదు. ఆహార సంబంధ వ్యాపారంలో అపార అవకాశాలు ఉన్నాయి. ప్రజల సగటు ఆదాయం పెరిగింది. వినియోగదార్లు ఆహారాన్ని ఆస్వాదించడంలో ప్రయోగాలకు సిద్ధపడుతున్నారు. అప్పు తీర్చే వరకు విస్తరణ వద్దు.. ఏ కంపెనీ అయినా అప్పు తీర్చేవరకు విస్తరణ చేపట్టకపోవడమే మంచింది. అప్పు తీసుకుని మొహం చాటేయడం మంచి పద్ధతి కాదు. వ్యాపారవేత్తలు తమ వైఫల్యాన్ని ఒప్పుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ ఉండాల్సిందే. లాభంలో 50 శాతం ఆదా చేయాల్సిందే. ఈజీ మనీ అనే ఆలోచనే రాకూడదు. నా చిన్ననాటితో పోలిస్తే నేటి సమాజంలో ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోయాయి. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం తగ్గింది. తల్లిదండ్రులు అంటే దేవుడి తరువాతి స్థానం. అలాంటిది ఇప్పుడు యాంత్రికంగా జీవిస్తున్నారు. కల్చర్ సైతం మారిపోయింది. డబ్బుకు ఒక దశ తరువాత విలువ ఉండదు. మనసు స్వచ్ఛంగా ఉండాలి. డబ్బు విషయంలో దురాశ సమస్యలను తెచి్చపెడుతుంది.ప్రభుత్వ జోక్యం ఉండరాదు.. కంపెనీల కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే బాగుంటుంది. లైసెన్స్ రాజ్ ఉండకూడదు. నిబంధనలు పెట్టడం వరకే ప్రభుత్వం పరిమితం కావాలి. కంపెనీలు తప్పు చేశాక ప్రభుత్వం రావడం కాదు.. తప్పు చేయక ముందే ప్రభుత్వం మేల్కొనాలి. దేశంలోని కోర్టుల్లో 75 శాతం ప్రభుత్వ వ్యాజ్యాలే. 100కు పైగా దేశాల్లో... ప్రారంభించిన కొన్నాళ్లకే నష్టాలు ఎదురైనా.. కంపెనీని తిరిగి గాడిలో పెట్టి కాఫీ ప్రపంచంలో తెలుగువారి సత్తా చాటుతున్న తొలితరం వ్యాపారవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్. స్వచ్ఛంద కార్యక్రమాల కోసం రూ.కోట్లు వెచి్చస్తున్న పెద్ద చేయి ఆయనది. ఉస్మానియా వర్సిటీ నుంచి 1975లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్యాకేజింగ్ మెటీరియల్, ట్యూబ్స్, డక్ట్స్, ఐటీ, రియల్టీ, నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. 1989 నుంచి కాఫీ వ్యాపారంలో ఉన్నారు. ఔత్సాహిక యువతను భుజం తట్టి వ్యాపారం వైపు ప్రోత్సహిస్తున్నారు. భారత కాఫీ బోర్డు సభ్యుడిగా నాలుగుసార్లు, ప్రత్యేక ఆహ్వానితుడిగా ఒకసారి పనిచేశారు. ఇంటర్నేషనల్ ఇన్స్టంట్ కాఫీ మాన్యుఫ్యాక్చరర్స్ నుంచి 2019లో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. సీసీఎల్ ప్రొడక్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,160 కోట్లకుపైనే.100కిపైగా దేశాల్లోని విభిన్న బ్రాండ్స్‌కు కాఫీ సరఫరా చేస్తోంది. సొంత బ్రాండ్ అయిన ‘కాంటినెంటల్ కాఫీ’కి మంచి డిమాండ్ ఉంది. -
గాల్లో విమానం.. పైలట్ లేకుండా ప్రయాణం!
గాల్లో విమానం.. 200 మందికి పైగా ప్రయాణికులు.. కానీ పైలట్ లేడు.. పరిస్థితి తలుచుకుంటేనే గుండె జలదరిస్తోంది కదా.. బలహీనమైనవారైతే పై ప్రాణాలు పైనే పోతాయి! స్పెయిన్ కు వెళ్తున్న ఓ విమానంలో ఇలాగే జరిగింది. ఆ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న వారంతా కొన్ని నిమిషాలపాటు వణికిపోయారు. తర్వాత ఏం జరిగిందీ.. ప్రయాణికులు ఎలా బయటపడ్డారన్నదీ.. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన గురించి జర్మనీ వార్తా సంస్థ డీపీఏ తాజాగా తెలిపింది.గత ఏడాది స్పెయిన్ కు వెళ్తున్న లుఫ్తాన్సా విమానం కో పైలట్ స్పృహ తప్పి పడిపోయినా 10 నిమిషాల పాటు అలాగే ప్రయాణించిందని డీపీఏ వెల్లడించింది. 2024 ఫిబ్రవరి 17న ఫ్రాంక్ఫర్ట్ నుంచి స్పెయిన్‌లోని సెవిల్లెకు ఎయిర్‌బస్ ఏ321 విమానం బయలుదేరింది. ఫ్టైట్ కెప్టెన్ రెస్ట్ రూమ్‌కు వెళ్లిన సమయంలో కాక్‌పిట్‌లో ఒక్కడే ఉన్న కో పైలట్ స్పృహ తప్పి పడిపోయాడని స్పానిష్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ సీఐఏఐఏసీ నివేదికను ఉటంకిస్తూ డీపీఏ వివరించింది.అలా 199 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఈ విమానం పైలట్ లేకుండానే 10 నిమిషాల పాటు ఎగిరింది.దర్యాప్తు నివేదిక గురించి తమకు తెలుసని, తమ సొంత ఫ్లైట్ సేఫ్టీ విభాగం కూడా దర్యాప్తు జరిపిందని లుఫ్తాన్సా డీపీఏకు తెలిపింది. అయితే దర్యాప్తు ఫలితాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదని డీపీఏ తెలిపింది.తర్వాత ఏం జరిగింది?అపస్మారక స్థితిలో ఉన్న కో-పైలట్ అనుకోకుండా నియంత్రణలను ఆపరేట్ చేసినప్పటికీ చురుకైన ఆటోపైలట్ కారణంగా విమానం కుదుపులు లేకుండా గాల్లో స్థిరంగా ఎగరగలిగింది. ఈ సమయంలో వాయిస్ రికార్డర్ కాక్ పిట్ లో వింత శబ్దాలను రికార్డ్ చేసిందని, అవి తీవ్రమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితికి అనుగుణంగా ఉన్నాయని డీపీఏ నివేదించింది.ఫ్లైట్ కెప్టెన్ రెస్ట్ రూం నుంచి వచ్చి కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు రెగ్యులర్ డోర్ ఓపెనింగ్ కోడ్ ను ఎంటర్ చేయడానికి ప్రయత్నించాడు. ఇది కాక్ పిట్ లో బజర్ ను ప్రేరేపిస్తుంది. దీంతో కో-పైలట్ డోర్ తెరుస్తారు. కానీ లోపల ఉన్న కో పైలట్ నుంచి స్పందన లేదు. ఇలా అయిదు సార్లు ప్రయత్నించినా ఫలితం లేదు. క్రూ సిబ్బంది ఒకరు ఆన్‌బోర్డ్ టెలిఫోన్ ద్వారా కో పైలట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించారు.అయినా కో పైలట్ స్పందించలేదు. దీంతో చేసేదేమీ లేక కెప్టెన్ చివరి ఎమర్జెన్సీ కోడ్ టైప్ చేశాడు. అది కెప్టన్ స్వయంగా తలుపు తెరవడానికి అనుమతిస్తుంది. అయితే డోర్ ఆటోమేటిక్ గా తెరుచుకునేలోపు స్పృహలోకి వచ్చిన కో పైలట్ లోపలి నుంచి డోర్ ఓపెన్ చేశారు. తర్వాత మాడ్రిడ్ లో విమానాన్ని ల్యాండింగ్ చేసి అక్కడ అతన్ని ఆసుపత్రికి తరలించారు. -
ఎస్బీఐ-అపోలో కొత్త క్రెడిట్ కార్డు.. బెనిఫిట్స్ ఇవే..
న్యూఢిల్లీ: ప్రముఖ క్రెడిట్ కార్డుల జారీ సంస్థ ఎస్బీఐ కార్డ్, దిగ్గజ రిటైల్ ఫార్మసీ చెయిన్ అపోలో హెల్త్‌కో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అపోలో ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ కార్డ్‌ను ఆవిష్కరించాయి. ఈ కార్డ్ ద్వారా అపోలో ఫార్మసీతో పాటు అపోలో 24/7 యాప్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు పొందవచ్చు. ఫార్మసీ ఉత్పత్తులు, ఆరోగ్య పరీక్షలు, ఇతర పలు రకాల సేవలకు చెల్లింపులు చేయొచ్చు.అపోలో ఎస్బీఐ సెలెక్ట్ క్రెడిట్ కార్డును రూపే, మాస్టర్‌కార్డ్ ప్లాట్‌ఫామ్స్‌పై తీసుకొచ్చారు. ఈ కార్డ్ ద్వారా ఎంపిక చేసిన హెల్త్, వెల్నెస్ ఉత్పత్తుల కొనుగోలుపై 25 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చు. అలాగే అపోలో 24|7 యాప్, రిటైల్ స్టోర్లలో కొనుగోలుపై రివార్డ్స్ పాయింట్స్‌గా 10 శాతం, హెల్త్ క్రెడిట్స్ రూపంలో 15 శాతం వరకూ తిరిగి పొందవచ్చు. అలాగే వెల్కమ్ గిఫ్ట్ కింద రూ.1,500 విలువ చేసే ఇ–గిఫ్ట్ వోచర్ లభిస్తుంది.అపోలో 24|7 యాప్, ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్లలో డిజిటల్‌గా ఈ అపోలో ఎస్బీఐ సెలెక్ట్ క్రెడిట్ కార్డును పొందవచ్చు. అలాగే కొన్ని ఎంపిక చేసిన అపోలో ఫార్మసీ స్టోర్లలో వ్యక్తిగతంగానూ వీటిని తీసుకోవచ్చు. ఈ కార్డ్ వార్షిక ఫీజు రూ.1499. దీనికి ట్యాక్స్‌లు అదనం.సంవత్సరానికి రూ.3 లక్షలకు మించి ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మినహాయింపు పొందవచ్చు. -
హైదరాబాద్‌లో మెట్‌లైఫ్ టెక్నాలజీ హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమా సంస్థ మెట్‌లైఫ్ తాజాగా హైదరాబాద్, పుణెలో టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేసింది. ఇవి సొల్యూషన్స్ డెలివరీని మెరుగుపర్చడంతో పాటు సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ మేగ్రైషన్, ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణ మొదలైన అంశాల్లో తోడ్పాటు అందిస్తాయని కంపెనీ తెలిపింది.ఈ రెండింటితో పాటు నోయిడా, జైపూర్‌లో ఇప్పటికే ఉన్న హబ్‌లతో కలిపి భారత్‌లో తమ కార్యకలాపాల విభాగాన్ని మెట్‌లైఫ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (ఎంజీసీసీ)గా వ్యవహరించనున్నట్లు వివరించింది. కంపెనీ వృద్ధికి దోహదపడటంతో ఉద్యోగులకు అవకాశాలను మెరుగుపరచే సాంకేతికత ఆధారిత సర్వీసులు, పరిష్కారాలపై తమ దృష్టి నిరంతరం ఉంటుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఆశిష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. -
జియో యూజర్లకు శుభవార్త: రూ.100 రీఛార్జ్‌తో ఎన్నో బెనిఫిట్స్!
భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులతో అగ్రగామిగా ఉన్న టెలికాం ఆపరేటర్ రిలయన్స్ 'జియో'.. రూ.100 ప్లాన్‌లో రూ.299 విలువైన ఓటీటీ బెనిఫిట్స్ అందించే ఒక కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ముఖ్యంగా మొబైల్ లేదా టీవీలో స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించే వినియోగదారుల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రూ.100 ప్లాన్జియో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.100 ప్లాన్.. సాధారణంగా రూ.299 ప్లాన్‌లో కనిపించే ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం డేటా 5 జీబీ మాత్రమే. జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్లపై ఎక్కువ ఖర్చు చేయకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ వంటి వాటిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.బేస్ ప్లాన్ రీఛార్జ్ తప్పనిసరిజియో వినియోగదారులు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. 100 రూపాయల ప్లాన్ ద్వారా బెనిఫిట్స్ పొందాలంటే.. జియో నంబర్లో యాక్టివ్ బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుని ఉండాల్సిందే. బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోకుండా.. రూ. 100 రీఛార్జ్ ద్వారా ప్రయోజనాలను పొందలేరు. -
ఎపిటోరియా ఫార్మా ‘ఆరో అస్త్ర’ కోర్సు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా తమ అనుబంధ సంస్థ ఎపిటోరియా ద్వారా ‘ఆరో అస్త్ర – పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ ఇన్ లీడర్షిప్ (సీఎల్పీ)’ ప్రోగ్రాంను ఆవిష్కరించింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీతో (ఐఎంటీహెచ్) జట్టు కట్టింది.ఈ కోర్సు ఆరు నెలల పాటు ఉంటుంది. ఆరు మాడ్యుల్స్ కింద 13 రోజుల పాటు క్లాస్రూమ్ సెషన్లు ఉంటాయి. స్వీయ, బృంద, వ్యాపార అభివృద్ధికి సహాయపడుతూ, వృత్తి నిపుణులను నాయకులుగా తీర్చిదిద్దడంపై ప్రధానంగా దృష్టి పెట్టే విధంగా ఈ కోర్సు ఉంటుందని అరబిందో ఫార్మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యూఎన్‌బీ రాజు తెలిపారు. -
ప్రభుత్వం ఆదుకోకుంటే ’దివాలా’నే..
న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి తమకు సకాలంలో మద్దతు లభించకపోతే ఈ ఆర్థిక సంవత్సరం తర్వాత కార్యకలాపాలను కొనసాగించే పరిస్థితి ఉండదని టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) వెల్లడించింది. ప్రభుత్వ మద్దతు, బ్యాంకుల నుంచి రుణాలు లభించక, పెట్టుబడులు పెట్టలేక, తమ సంస్థ (దివాలా పరిష్కార ప్రక్రియ కోసం) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించాల్సి వస్తుందని పేర్కొంది.అలాంటి పరిస్థితే వస్తే స్వల్ప వ్యవధికైనా సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిన పక్షంలో నెట్వర్క్, స్పెక్ట్రం అసెట్స్ విలువ పడిపోతుందని టెలికం శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో వీఐఎల్ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. దీని వల్ల 20 కోట్ల మంది యూజర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.ఈ నేపథ్యంలో ఏజీఆర్ బాకీలు, స్పెక్ట్రం బాకీల కేంద్రం కొంత సహాయం అందించాలని ముంద్రా పేర్కొన్నారు. ప్రభుత్వం సకాలంలో మద్దతునిస్తే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుతున్న 30,000 మందికి, 60 లక్షల మంది పైగా షేర్హోల్డర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
ఎయిర్‌టెల్‌లో రూ.13 వేల కోట్లు వాటా విక్రయం..
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో సుమారు 1.2 శాతం వాటా విక్రయించినట్లు సింగ్టెల్ తెలిపింది. ఈ డీల్ విలువ దాదాపు 2 బిలియన్ సింగపూర్ డాలర్లని (దాదాపు 1.5 బిలియన్ డాలర్లు/రూ.13 వేల కోట్లు) పేర్కొంది. అసెట్ పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసుకోవడం, వాటాదారులకు మరింత మెరుగైన రాబడులు అందించడం కోసం ఈ లావాదేవీ చేపట్టినట్లు వివరించింది.డీల్ అనంతరం ఎయిర్‌టెల్‌లో సింగ్టెల్ వాటా 28.3 శాతానికి తగ్గింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌కి ప్రస్తుత షేర్హోల్డర్లు, కొత్త ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిందని సింగ్టెల్ తెలిపింది. దాదాపు 2 దశాబ్దాలుగా ఎయిర్‌టెల్‌లో సింగ్టెల్ వ్యూహాత్మక ఇన్వెస్టరుగా కొనసాగుతోంది. బీఎస్ఈలో భారతి ఎయిర్టెల్ షేరు 2.8% క్షీణించి రూ. 1,814 వద్ద క్లోజయ్యింది. -
డెడ్‌లైన్ దగ్గరపడుతోంది.. క్లెయిమ్స్ దాఖలు చేయండి
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) ఇన్వెస్టర్లు తమ క్లెయిమ్‌లను దాఖలు చేసేందుకు గడువు తేదీ అయిన జూన్ 2 దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపరులు త్వరపడాలని, సత్వరం క్లెయిమ్‌లను ఫైల్ చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది.దీనిపై సహాయం కోసం ఎన్ఎస్ఈని సంప్రదించవచ్చని లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 266 0050కి కాల్ చేయొచ్చని (ఐవీఆర్ ఆప్షన్ 5), లేదా defaultisc@nse.co.in ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయొచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. కేఎస్‌బీఎల్ తమ క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి భారీగా నిధులు సమీకరించడం, వాటిని సొంత అవసరాల కోసం ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించడం తెలిసిందే. -
ఇండస్ఇండ్ లో మళ్లీ కలకలం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో మరో అకౌంటింగ్ లోపం బైటపడింది. తమ ఖాతాల్లో ‘నిర్దిష్ట ఆధారాలు లేని’ రూ. 595 కోట్ల బ్యాలెన్స్‌ను అంతర్గత ఆడిట్ విభాగం (ఐఏడీ) గుర్తించినట్లు బ్యాంక్ తెలిపింది. స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంకు ఇచ్చిన సమాచారం ప్రకారం, ప్రజా వేగు నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆడిట్ కమిటీ ‘ఇతర అసెట్స్’, ‘ఇతర లయబిలిటీస్’ ఖాతాల్లో లావాదేవీలపై విచారణ జరిపింది. మే 8న ఐఏడీ సమర్పించిన నివేదిక బట్టి, ‘ఇతర అసెట్స్’ కింద ఎలాంటి ఆధారాలు లేని రూ. 595 కోట్ల మొత్తం నమోదైంది. దీన్ని జనవరిలో ‘ఇతర లయబిలిటీల’ కింద సర్దుబాటు చేసినట్లుగా రికార్డయ్యింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో మొత్తం రూ. 674 కోట్లు, వడ్డీ ఆదాయం కింద ఖాతాల్లో తప్పుగా రికార్డు అయినట్లు, జనవరి 10న దీన్ని పూర్తిగా రివర్స్ చేసినట్లు బ్యాంకు వివరించింది ఈ మొత్తం వ్యవహారంలో కీలక ఉద్యోగుల పాత్రపై కూడా ఐఏడీ విచారణ జరిపినట్లు బ్యాంకు తెలిపింది. అంతర్గత విధానాలను పటిష్టం చేయడం, అవకతవకలకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవడం మీద బోర్డు దృష్టి పెట్టినట్లు వివరించింది. డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అకౌంటింగ్ లోపాల కారణంగా సంస్థ నికర విలువపై 2.35 శాతం మేర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందంటూ ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం సుమారు రూ. 1,979 కోట్ల మేర ఉండొచ్చని, ఈ అంశంపై దర్యాప్తు చేసిన ఏజెన్సీ పీడబ్ల్యూసీ ఒక నివేదికలో పేర్కొంది. వివిధ స్థాయిల్లో చోటు చేసుకున్న అవకతవకలను, తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ఇప్పటికే సీఈవో సుమంత్ కథ్పాలియా, డిప్యూటీ సీఈవో అరుణ్ ఖురానా రాజీనామా చేశారు. కొత్త ఎండీ, సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు కార్యకలాపాల పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటైంది. అకౌంటింగ్ అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు గ్రాంట్ థార్న్‌టన్‌ను బ్యాంకు నియమించుకుంది. అకౌంటింగ్లో అవకతవకల వార్తలతో శుక్రవారం ఉదయం బ్యాంక్ షేర్లు ఒక దశలో 6 శాతం క్షీణించినప్పటికీ తర్వాత కోలుకుని ఒక మోస్తరు లాభంతో ముగిశాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు ఉదయం సెషన్లో 5.7% క్షీణించి రూ. 735.95కి తగ్గింది. చివరికి 0.26% పెరిగి రూ. 782.30 వద్ద క్లోజయ్యింది. -
ఉన్నదంతా ఇచ్చేస్తున్న జుకర్‌బర్గ్!
ప్రపంచ కుబేరులు అపర దానకర్ణులుగా మారుతున్నారు. తమ సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ టెక్ దిగ్గజం మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకారం.. మెటా సీఈవో తన సంపదలో 90 శాతానికి పైగా దానధర్మాలకు ఇచ్చేస్తున్నారు.సుదీర్ఘకాలంగా పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న బిల్ గేట్స్ ఫార్చ్యూన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలను పంచుకున్నారు. జుకర్‌బర్గ్ దాతృత్వ సంస్థ చాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ ను ఆయన తీవ్రమైన ఉద్దేశానికి సంకేతంగా పేర్కొన్నారు. జుకర్ బర్గ్ దాతృత్వ ప్రణాళికలను ప్రస్తావిస్తూ, "అతను చాలా మంచి ప్రారంభానికి వెళ్తున్నాడు" అని బిల్ గేట్స్ అన్నారు. తామిద్దరం తరచుగా దాతృత్వానికి సంబంధించిన అంశాలను మాట్లాడుకుంటామన్నారు.మార్క్ జుకర్‌బర్గ్, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ తమ జీవితకాలంలో 99 శాతం ఫేస్బుక్ షేర్లను విరాళంగా ఇస్తామని హామీ 2015లోనే ప్రకటించారు.అప్పటి నుంచి వారి ఫౌండేషన్ విద్య, వైద్యం, సైన్స్ రంగాల్లో ప్రాజెక్టులపై పనిచేస్తోంది.దాతృత్వ దృశ్యం ఎలా మారుతోందో గేట్స్ ఎత్తిచూపారు. వారెన్ బఫెట్, మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తో కలిసి తాను 2010లో ప్రారంభించిన గివింగ్ ప్లెడ్జ్ క్యాంపెయిన్ ద్వారా తమ సంపదలో అధిక భాగాన్ని దాతృత్వానికి ఇచ్చేందుకు టెక్ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
కెనడా, అమెరికా మార్కెట్లోకి హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కెనడా, అమెరికా ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. ఈ మేరకు కెనడా సంస్థ చార్జ్ పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్యూర్ కంపెనీ తెలిపింది.ఈ భాగస్వామ్యంతో ప్యూర్ అధునాతన ఎనర్జీ స్టోరేజ్ ప్రొడక్ట్ లైన్ ను కో-బ్రాండింగ్ అరేంజ్మెంట్ ద్వారా కెనడా, అమెరికాలోని వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ఉత్పత్తులు రెసిడెన్షియల్, కమర్షియల్ నుంచి గ్రిడ్ స్కేల్ అప్లికేషన్స్ వరకు ఉంటాయని పేర్కొంది.తమకున్న పటిష్టమైన తయారీ సౌకర్యాలతో బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో లోతైన నైపుణ్యాన్ని సాధించామని, తమ మా సృజనాత్మక, మన్నికైన, నమ్మదగిన ఇంధన నిల్వ ఉత్పత్తులకు యూఎస్, కెనడా మార్కెట్లలో విస్తృత ఆమోదం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు ప్యూర్ ఫౌండర్, ఎండీ నిశాంత్ దొంగరి అన్నారు. -
సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు లాభాలు.. షేర్లకు డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం వృద్ధితో రూ. 342 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 288 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,621 కోట్ల నుంచి రూ. 2,946 కోట్లకు ఎగసింది.వాటాదారులకు బ్యాంక్ బోర్డు షేరుకి రూ. 0.4 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం 22 శాతం జంప్‌చేసి రూ. 1,303 కోట్లను తాకింది. 2023–24లో రూ. 1,070 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు బీఎస్ఈలో 4 శాతం ఎగసి రూ. 28 వద్ద ముగిసింది. -
ఆఫీస్‌కు రాకపోతే వేరే ఉద్యోగం చూసుకోండి..
రిమోట్ వర్క్.. అదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా మంది ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఓపక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు ఉద్యోగాన్ని చూసుకుంటున్న వారికి ఈ విధానం చాలా అనువుగా ఉంటోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ రిమోట్ వర్క్ విధానం నెమ్మదిగా తొలగిపోతోంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి.సౌకర్యవంతమైన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడినవారు ఆఫీసులకు తిరిగివెళ్లడానికి ఇష్టపడటం లేదు. చాలా కంపెనీలు ఉద్యోగులను బలవంతంగానైనా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇలాగే ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించడం ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఎలా బెడిసికొట్టిందో.. ఉద్యోగులు ఏం చేశారో చెబుతూ ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తి రెడ్డిట్‌లో షేర్ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారంది.ఆఫీస్‌కు రాకపోతే ఏం చేస్తారు?కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసిన కంపెనీ.. ఆ సమయంలో చాలా మందిని రిమోట్ వర్క్ విధానంలోనే నియమించుకుంది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందరూ క్రమంగా ఆఫీసులకు రావాలని యాజమాన్యం ఆదేశించింది. అసలు సమస్య ఏంటంటే.. దాదాపు చాలా మంది రిమోట్ వర్క్ విధానంలోనే ఉద్యోగాల్లో చేరారు. కొంత మంది తమ ప్రాంతాలకు మకాం మార్చారు. ఇప్పుడు వీళ్లకు ఎటువంటి ఆర్థిక సహకారం అందించకుండా ఏడాదిలోగా ఆఫీసులకు వచ్చేయాలని కంపెనీ చెబుతోంది.దీంతో ఉద్యోగులు గందరగోళంలో పడిపోయారు. ఈక్రమంలో కంపెనీ వైడ్ టౌన్ హాల్ సమావేశంలో ఆఫీస్‌కు రావడానికి అయిష్టంగా ఉన్నవారికి మినహాయింపులేమైనా ఉంటాయా అని ఓ ఉద్యోగి నేరుగా సీఈవోనే అడిగేశారు. దానికి సీఈవో స్పందిస్తూ "మీరు ఇంటి నుండి పని చేయాలనుకుంటే, వేరే చోట ఉద్యోగం చూసుకోండి" అంటూ బదులిచ్చారు. దీంతో అవాక్కైన ఉద్యోగులు ఆన్లైన్ కాల్స్‌లోకి రావడం మానేశారు. చాలా మంది వెంటనే రాజీనామా చేశారు. ఎక్కువ మంది వెళ్లిపోవడంతో కంపెనీకి షాక్ తగిలింది. క్యూసీ ఉద్యోగులతోనే యాప్ డెవలప్మెంట్ చేయించాల్సి వచ్చింది. -
ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన లోహాల్లో బంగారం ఒకటి. బంగారాన్ని వేలాది సంవత్సరాలుగా ఐశ్వర్యానికి, హోదాకు ప్రతిరూపంగా పరిగణిస్తూ వస్తున్నారు. బంగారం మంచి విద్యుత్ వాహకం. దీని ఉపయోగాలు ఎలా ఉన్నా మృదువైన, అరుదైన, సులభంగా ఆకృతులు చేసేందుకు అనువైన ఈ లోహాన్ని ముఖ్యంగా ఆభరణాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. డిమాండ్ కారణంగా బంగారం విలువ అంతకంతకూ పెరుగుతూ అత్యంత ఖరీదైన లోహంగా మారింది. అందుకే దీన్ని పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. శతాబ్దాలుగా మాంద్యం సమయంలో మంచి పెట్టుబడి మార్గంగా బంగారం కొనసాగుతోంది.ఈ దేశం బంగారు భూమిఘనాను బంగారు భూమి అంటారు. ఈ ప్రదేశం పశ్చిమ ఆఫ్రికాలో ఉంది. వైవిధ్యమైన బంగారు వనరులు, అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం కారణంగా అరబ్ వ్యాపారులు ఘనాకు ఆ పేరు పెట్టారు. బంగారం ఈ ప్రాంత అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారింది.అంతేకాకుండా జపాన్ లోని సాడో ద్వీపాన్ని కూడా ఎడో కాలంలో బంగారు భూమిగా పిలిచేవాళ్లు. ఎందుకంటే ఈ ప్రదేశం ఆ సమయంలో జపాన్ మొత్తం బంగారు ఉత్పత్తిలో దాదాపు సగం ఉత్పత్తి చేసేది. అపారమైన సంపదకు, బంగారానికి నిలయంగా ఉండే ఇండోనేషియాలోని ఒకప్పటి శ్రీవిజయ నగరాన్ని కూడా బంగారు ద్వీపంగా పరిగణించేశాళ్లు.👉ఇది చదవారా? బంగారం మాయలో పడొద్దు..టాప్ 10 అతిపెద్ద బంగారం ఉత్పత్తి దేశాలువరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే టాప్ 10 దేశాల జాబితా ఇలా ఉంది. దేశం బంగారం ఉత్పత్తి (టన్నులు)1 చైనా 378.22 రష్యన్ ఫెడరేషన్ 321.83 ఆస్ట్రేలియా 293.84 కెనడా 191.95 యునైటెడ్ స్టేట్స్ 166.76 ఘనా 135.17 ఇండోనేషియా 132.58 పెరూ 128.89 మెక్సికో 126.610 ఉజ్బెకిస్తాన్ 119.6 -
టీసీఎస్ ఘనత: వరల్డ్ టాప్ 50 బ్రాండ్లలో..
ప్రముఖ్ ఐటీ దిగ్గజం 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) కాంటర్ బ్రాండ్జెడ్ మోస్ట్ వాల్యూయబుల్ గ్లోబల్ బ్రాండ్స్ 2025 నివేదికలో.. ప్రపంచవ్యాప్తంగా 100 అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. న్యూయార్క్‌లో కాంటార్ నిర్వహించిన స్పెషల్ 20వ ఎడిషన్ వేడుకలో.. టీసీఎస్ బ్రాండ్ వాల్యూ 57.3 బిలియన్ డాలర్లకు (రూ. 4.89 లక్షల కోట్లు) చేరుకుంది. ఇది గత ఏడాదికంటే 28 శాతం ఎక్కువని తెలుస్తోంది.మొమెంటమ్ ఐటీఎస్ఎంఏ నిర్వహించిన స్వతంత్ర బ్రాండ్ ఆడిట్లో ప్రపంచవ్యాప్తంగా 95 శాతం మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు టీసీఎస్ బ్రాండ్‌ను గుర్తించారని తేలింది. పరిశ్రమ రంగాలలో ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్లను కలిగి ఉన్న జాబితాలో.. TCS ప్రపంచవ్యాప్తంగా 45వ స్థానంలో ఉంది. ఇది కంపెనీ వేగవంతమైన వృద్ధిని సూచిస్తుంది. బ్రాండ్ విలువ, ఈక్విటీలో ఈ పెరుగుదల కంపెనీ నిరంతర బ్రాండ్ నిర్మాణ ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది.ఈ సందర్భంగా కాంటర్ బ్రాండ్జెడ్ హెడ్ మార్టిన్ గెరిరియా అధిపతి మాట్లాడుతూ.. సరైన పెట్టుబడి, వ్యూహాత్మక దృష్టితో.. బ్రాండ్లు తమ యజమానులకు మంచి వృద్ధిని అందించగలవు. టీసీఎస్ ఈ ఏడాది చూపిన పనితీరు, ఏఐ సామర్థ్యాలను విస్తృతంగా వినియోగించుకోవడం వంటికి దీని వృద్ధికి దోహదపడ్డాయి. టీసీఎస్ చేపడుతున్న కార్యక్రమాలే సంస్థ బలమైన గుర్తింపుకు కారణమైందని ఆయన అన్నారు.ప్రపంచ టాప్ 50 బ్రాండ్లలో టీసీఎస్ ఒకటిగా చేరిన సందర్భంగా కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ 'అభినవ్ కుమార్' మాట్లాడుతూ.. 20 సంవత్సరాలుగా కాంటార్ బ్రాండ్జెడ్ ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లను గుర్తించింది. పరిశ్రమలో మాకు ఉన్న బ్రాండ్ నాయకత్వంతో పాటు.. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బ్రాండ్లలో TCS బ్రాండ్‌కు ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. సంస్థ వృద్ధికి దోహదపడిన నా సహోద్యోగులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. -
బోనస్ మరీ ఇంత తక్కువా!.. టెక్ దిగ్గజం ఎందుకిలా చేస్తోంది
భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'ఇన్ఫోసిస్' బోనస్ విషయంలో ఉద్యోగులకు షాకిచ్చింది. క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితుల కారణంగా.. 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు 65 శాతం మాత్రమే బోనస్ చెల్లించనున్నట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత త్రైమాసికం (మూడో త్రైమాసికం)లో 80 శాతం బోనస్ అందించిన కంపెనీ.. రెండో త్రైమాసికంలో 90 శాతం బోనస్ చెల్లింది.2025 ఆర్ధిక సంవత్సరం రెండు, మూడు త్రైమాసికాలలో కంపెనీ ఉద్యోగులకు చెల్లించిన బోనస్.. నాల్గవ త్రైమాసికంలో చెల్లించనున్న బోనస్‌తో పోలిస్తే క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. పర్ఫామెన్స్ బోనస్ మే 2025 సైకిల్లో ప్రాసెస్ అవుతుందని తెలుస్తోంది.ఇక ఇన్ఫోసిస్ ఆఖరి త్రైమాసిక ఫలితాల విషయానికి వస్తే.. కంపెనీ లాభాలో అంతకు ముంది ఏడాది నాల్గవ త్రైమాసికం ఫలితాలతో పోలిస్తే 12 శాతం తగ్గి రూ. 7033 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం కంపెనీ నాల్గవ త్రైమాసిక ఫలితాల్లో సంస్థ లాభం రూ. 7696 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంత క్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్ సాధించింది.ఇదీ చదవండి: వారానికి 90 గంటల పని!.. ఆయనతో పనిచేయడం నా అదృష్టంనియామకాలుటెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని కంపెనీ సిఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది. -
వారానికి 90 గంటల పని!.. ఆయనతో పనిచేయడం నా అదృష్టం
ఎలాన్ మస్క్ అనగానే.. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు అని అందరూ చెబుతారు. అయితే ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ, వారానికి ఈయన ఎన్ని గంటలు పనిచేస్తారో తెలిస్తే.. తప్పకుండా అవాక్కవుతారు. ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.టెస్లాలోని ఏఐ సాఫ్ట్వేర్ వైస్ చైర్మన్ 'అశోక్ ఎల్లుస్వామి' ఒక పాడ్‌కాస్ట్‌లో ఎలాన్ మస్క్‌తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ.. ఆయన కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం భయపడని వ్యక్తి అని అభివర్ణించారు. అద్భుతమైన ఊహ, దూరదృష్టి కలిగిన మస్క్ వారానికి 80 గంటల నుంచి 90 గంటలు పనిచేస్తారని పేర్కొన్నారు.నేను ప్రతివారం మస్క్‌ను కలుస్తాను. అతను చాలా తెలివైనవాడు, భవిష్యత్తును చాలా ముందుగానే అంచనా వేయగలడు. అతని దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అతను రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం భయపడడు. కష్టపడి పనిచేసే తత్త్వం ఉన్న మస్క్.. చాలా సరదాగా ఉంటారని అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?2014లో టెస్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరిన ఎల్లుస్వామి.. దశాబ్దానికి పైగా కంపెనీలో ఉన్నారు. 2024లో AI సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొంది.. మస్క్‌తో కలిసి పనిచేస్తూ, కృత్రిమ మేధస్సులో టెస్లా వృద్ధికి దోహదపడుతున్నారు.Tesla's VP of AI Software Ashok Elluswamy on what it's like to work with Elon Musk: "I meet with him every week. He is really smart in the sense that he can predict the future very early; He works really hard. Easily 80-90 hours per week. I feel fortunate to work for him. He is… https://t.co/dB5l6EbxEx pic.twitter.com/qLPB0v0hUd— Sawyer Merritt (@SawyerMerritt) May 14, 2025 -
కంపెనీలకు కలిసొచ్చిన యుద్ధం
భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో పాక్ యుద్ధ విమానాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టిన విధానం ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు కలిసొచ్చే అంశంగా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న యుద్ధ వ్యూహాలు, పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలతో భారతదేశ డ్రోన్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ విస్తరిస్తోంది. ఇందులో భాగంగా దేశీయ కంపెనీలు యుద్ధం, భద్రతా అవసరాలను తీర్చే వేగవంతమైన ఆవిష్కరణలవైపు అడుగులు వేస్తున్నాయి. ఇది ఆయా కంపెనీల్లో పెట్టుబడులు ఆకర్షించి, సమర్థంగా వాటిని ఖర్చు చేసేందుకు వీలవుతుందని నిపుణులు భావిస్తున్నారు.డ్రోన్ వార్ఫేర్లో ఆవిష్కరణలుశత్రు డ్రోన్లు నిరంతర భద్రతకు ముప్పుగా మారడంతో బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్, కెప్లర్, జెబు ఇంటెలిజెంట్ సిస్టమ్స్ వంటి సంస్థలు అడ్వాన్స్డ్ డిటెక్షన్, జామింగ్, న్యూట్రలైజేషన్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నాయి. సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రదేశాలు, పౌర మౌలిక సదుపాయాలను రక్షించడానికి ఇవి పరిష్కారాలు అందిస్తున్నాయి.ఇదీ చదవండి: మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?కొత్త టెక్నాలజీలపై దృష్టిఇటీవల యుద్ధంలో తక్కువ ఖర్చుతో కూడిన అధిక ప్రభావవంతమైన డ్రోన్ల పాత్రను భారత సాయుధ దళాలు గుర్తించాయి. ఇది కంబాట్ యూఏవీలు, నిఘా డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థల్లో పెట్టుబడులను వేగవంతం చేసేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశ డ్రోన్ రంగం 2019 నుంచి 40 మిలియన్ డాలర్లకు పైగా నిధులను ఆకర్షించింది. ఇది తదుపరి తరం సైనిక సాంకేతికతపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని సూచిస్తుంది. ఆధునిక యుద్ధాన్ని తట్టుకోగల కచ్చితమైన పేలోడ్లను మోసుకెళ్లే డ్రోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇది స్టార్టప్‌ల వృద్ధికి తోడ్పడుతుంది. స్మార్ట్, డిస్ట్రిబ్యూటెడ్ డిఫెన్స్ సొల్యూషన్స్, రియల్ టైమ్ బ్యాటిల్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలపై కంపెనీ దృష్టి సారిస్తున్నాయి. -
రూ.3,076 కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
భారతదేశ సెమీకండక్టర్ మిషన్‌కు గణనీయమైన ప్రోత్సాహంగా ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో రూ.3,076 కోట్ల సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రూ.76,000 కోట్ల ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా ఉంది.సెమీకండక్టర్లు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలకు కీలకంగా మారాయి. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్స్, పారిశ్రామిక పరికరాలు.. వంటి ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్‌లో వీటి వాడకం అనివార్యం అయింది. తాజాగా ఆమోదం పొందిన ప్రాజెక్ట్ సెమీకండక్టర్ డిస్ప్లే డ్రైవర్ చిప్ తయారీపై దృష్టి పెడుతుంది. ఈ డిస్ప్లే డ్రైవర్ చిప్ అనేది స్క్రీన్లపై చిత్రాలు ఎలా కనిపిస్తాయో నియంత్రించే కీలకమైన భాగం.దేశీయ అవసరాలు తీర్చేలా..నెలకు 20,000 వేఫర్ల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ నెలకు 36 మిలియన్ చిప్స్ ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. డిస్ప్లే డ్రైవర్ చిప్‌లకు సంబంధించి 40% దేశీయ డిమాండ్‌ను తీర్చగలదని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?డిజిటల్ భవిష్యత్తు5జీ, ఏఐ, ఐఓటీ, స్మార్ట్ మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలకు సెమీకండక్టర్ పరిశ్రమ కీలకం. భారతదేశం గ్లోబల్ సెమీకండక్టర్ పవర్‌హౌజ్‌గా మారేందుకు అడుగులు వేస్తున్న తరుణంగా జెవార్ ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాలు సాంకేతికత వృద్ధితోపాటు దేశానికి ఆర్థిక వృద్ధికి తోడ్పడుతాయని నిపుణులు అంటున్నారు. -
టాటా కంపెనీల దూకుడు.. ఎగసిన లాభాలు
ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 25 శాతం ఎగసి రూ. 1,306 కోట్లను అధిగమించింది. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక బిజినెస్‌ల పటిష్ట పనితీరు ఇందుకు తోడ్పాటునిచ్చాయి.అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 1,046 కోట్ల లాభం మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 16,464 కోట్ల నుంచి రూ. 17,447 కోట్లకు బలపడింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2.25 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. జులై 7న చెల్లించనుంది.కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 4,280 కోట్ల నుంచి రూ. 4,775 కోట్లకు పుంజుకుంది. మొత్తం ఆదాయం రూ. 63,272 కోట్ల నుంచి రూ. 66,992 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 2 శాతం లాభంతో రూ. 397 వద్ద ముగిసింది.టాటా క్యాపిటల్ లాభం హైజంప్త్వరలో ఐపీవోకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్న టాటా క్యాపిటల్ మార్చి త్రైమాసికానికి రూ.1,000 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.765 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం ఇదే కాలంలో 50 శాతం వృద్ధితో రూ.7,478 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.4,998 కోట్లుగా ఉంది.2024–25 ఆర్థిక సంవత్సరంలో టాటా క్యాపిటల్ లాభం రూ.3,665 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2023–24) లాభం రూ.3,327 కోట్లతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. ఆదాయం రూ.18,715 కోట్ల నుంచి రూ.28,313 కోట్లకు చేరుకుంది. గత నెలలో టాటా క్యాపిటల్ సెబీ వద్ద ఐపీవో పత్రాలను దాఖలు చేయడం తెలిసిందే.2 బిలియన్ డాలర్ల నిధులను (రూ.17వేల కోట్లు) సమీకరించాలనుకుంటోంది. సెబీ ఆమోదం లభిస్తే అతిపెద్ద ఐపీవోల్లో ఒకటి కానుంది. టాటా క్యాపిటల్‌లో టాటా సన్స్‌కు 92.83 శాతం వాటా ఉంది. అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా ఆర్బీఐ నుంచి టాటా క్యాపిటల్ గుర్తింపు కలిగి ఉంది. -
రూ. 11140 కోట్ల షేర్ అమ్మేస్తున్న రిలయన్స్
ముంబై: దేశీ పెయింట్స్ దిగ్గజం ఏషియన్ పెయింట్స్‌లో తనకున్న 4.9 శాతం వాటాలను విక్రయించడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ వాటా విలువ దాదాపు రూ. 11,140 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఏకమొత్తంగా ఒకేసారి లేదా పలు డీల్స్ ద్వారానైనా ఈ లావాదేవీని నిర్వహించేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీవోఎఫ్‌ఏ)ను నియమించుకున్నట్లు సమాచారం.అయితే, ప్రస్తుత మార్కెట్ ధర కంటే డిస్కౌంట్‌కే ఆఫర్లు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎప్పుడో 17 ఏళ్ల క్రితం 2008 జనవరిలో రిలయన్స్ ఈ వాటాలను రూ. 500 కోట్లతో కొనుగోలు చేసింది. దానితో పోలిస్తే ప్రస్తుత ధర ప్రకారం దాదాపు 24 రెట్లు లాభాన్ని కంపెనీ అందుకోనుంది.పెయింట్స్ పరిశ్రమలో పోటీ తీవ్రం కావడంతో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరం 59 శాతం నుంచి 52 శాతానికి తగ్గింది. అలాగే గత ఏడాది వ్యవధిలో షేరు విలువ సుమారు 19 శాతం పైగా క్షీణించింది. దేశీయంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఏషియన్ పెయింట్స్ అంతర్జాతీయంగా 8వ స్థానంలో ఉంది. 15 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. -
బీమా వ్యాపారంలోకి అపోలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హెల్త్‌కో తాజాగా బీమా సర్వీసుల వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. కార్పొరేట్ ఏజంటుగా వ్యవహరించేందుకు అనుబంధ సంస్థ అపోలో 24/7 ఇన్సూరెన్స్ సరీ్వసెస్‌కు అనుమతులు రావడంతో వచ్చే రెండు నెలల్లో తమ ప్లాట్‌ఫాం ద్వారా ఆరోగ్య, జీవిత, జనరల్ బీమా పథకాలను విక్రయించనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఇప్పటికే ఎనిమిది బీమా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మరో నాలుగింటితో సంప్రదింపులు జరుగుతున్నాయని అపోలో హెల్త్‌కో సంస్థ సీఈవో మధివణన్ బాలకృష్ణన్ తెలిపారు. తొలి ఏడాది రూ. 80–100 కోట్ల ప్రీమియంను అంచనా వేస్తున్నట్లు వివరించారు. మరోవైపు, ఒక దిగ్గజ సంస్థతో కలిసి కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. ముందస్తుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించుకునేలా ప్రోత్సహించే క్రమంలో అలి్టమేట్ హెల్త్ చాలెంజ్‌ను ప్రవేశపెట్టినట్లు బాలకృష్ణన్ చెప్పారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనట్లు తేలితే వైద్యపరీక్షల ఫీజులను పూర్తిగా వాపసు పొందవచ్చని వివరించారు. -
ఎయిర్‌బీఎన్‌బీ యాప్‌లో సరికొత్త ఫీచర్లు
ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు బస సౌకర్యాలు కల్పించే ఎయిర్‌బీఎన్‌బీ తమ యాప్‌లో సరికొత్తగా మార్పులు చేసింది. కేవలం వసతి సౌకర్యాలు మాత్రమే కాకుండా మరిన్ని కొత్త సర్వీస్‌లను జోడించింది.సర్వీసెస్ కింద ఎయిర్‌బీఎన్‌బీ యూజర్లు ఇప్పుడు మసాజులు, హెయిర్‌కట్స్, వ్యక్తిగత శిక్షణ సెషన్లు, చెఫ్ తయారుచేసిన భోజనం వంటి సేవలను యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది దేశాల్లోని 100 నగరాల్లో ఈ సేవలను అందిస్తున్నారు.ఇక ఇక్స్పీరియన్సెస్ పేరుతో సాంస్కృతిక, మ్యూజియం టూర్స్, అవుట్ డోర్, వాటర్ స్పోర్ట్, వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వంటి అనుభవాలను పర్యాటకులు ఆనందివచ్చు. అలాగే ఫుడ్ టూర్స్, వంట తరగతులు, ఆర్ట్ వర్క్ షాప్ లు, షాపింగ్, వ్యాయామం, ఆరోగ్యం, బ్యాటీ ఇక్స్పీరియన్సెస్ పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 1,000 నగరాల్లో ఈ ప్లాట్‌ఫామ్‌పై ఈ అనుభవాలను ప్రారంభిస్తున్నారు.ఎయిర్ బీఎన్‌బీలో తమ బసలో భాగంగా వినియోగదారులు సేవలు, అనుభవాలను బుక్ చేసుకోవచ్చని, వాటిని స్వతంత్రంగా కూడా బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బీఎన్బీ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ వెర్షన్లతో పాటు వెబ్ వెర్షన్ కు ఈ అప్ డేట్స్ ను అందిస్తున్నారు. -
ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. హైదరాబాద్‌లోనూ..
అత్యాధునిక సాంకేతికతలతో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌ల జారీని భారత ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ప్రారంభించింది. ఇప్పుడున్న సంప్రదాయ డిజైన్లోనే మరింత అత్యాధునిక భద్రతను జోడిస్తూ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (PKI) ఎన్క్రిప్షన్తో వీటిని రూపొందించింది. గతేడాది ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం(PSP) వర్షన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని జారీ చేస్తోంది.ఎక్కడెక్కడ?ప్రస్తుతం నాగ్‌పూర్, రాయపూర్, భువనేశ్వర్, గోవా, జమ్మూ, అమృత్సర్, సిమ్లా, జైపూర్, చెన్నై, సూరత్, హైదరాబాద్, రాంచీ నగరాల్లో ఈ-పాస్‌పోర్ట్‌లను పైలట్ విధానంలో జారీ చేస్తున్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవలే గత మార్చి నెలలో చెన్నైలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం వీటి జారీని ప్రారంభించింది. ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే 2025 మార్చి 22 నాటికి 20,729 ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యాయి.ఏమిటి ఈ-పాస్‌పోర్ట్ ప్రత్యేకత?భారతీయ ఈ-పాస్‌పోర్ట్ కవర్లో యాంటెనా, చిన్న రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) చిప్‌ను అనుసంధానం చేస్తారు. పాస్‌పోర్ట్ హోల్డర్ బయోమెట్రిక్, వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఈ చిప్ ద్వారా మెరుగైన భద్రత, వేగవంతమైన వెరిఫికేషన్ లభిస్తుంది. ఈ-పాస్‌పోర్ట్‌ను దాని ముందు కవర్ కింద ముద్రించిన ప్రత్యేకమైన బంగారు రంగు చిహ్నం ద్వారా గుర్తించవచ్చు. చిప్ లోని సున్నితమైన డేటా దుర్వినియోగం కాకుండా పబ్లిక్ కీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (పీకేఐ) ఎన్క్రిప్షన్ వ్యవస్థ రక్షిస్తుంది.తప్పనిసరా?ప్రస్తుతం ఉన్న పాస్ పోర్టులను ఈ-పాస్‌పార్ట్‌లుగా మార్చుకోవడం తప్పనిసరి కాదు. అవి గడువు ముగిసే వరకు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టులకు మారడం స్వచ్ఛందం. అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సాంకేతిక ఆధారిత, భద్రత-కేంద్రీకృతంగా మారుతున్న నేపథ్యంలో భారత్ కూడా ఈ-పాస్‌పోర్టులను జారీ చేస్తోంది.ఈ-పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు ఇలా..నాగ్‌పూర్, చెన్నై, జైపూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో పౌరులు ఇప్పుడు ఆన్లైన్లో ఈ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని నిర్దిష్ట పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలులేదా ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల నుండి వీటిని తీసుకోవచ్చు.🔸 దరఖాస్తు చేసుకోవడానికి పాస్‌పోర్ట్ సేవా ఆన్లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి.🔸 ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఐడీని ఉపయోగించి లాగిన్ కావాలి.🔸 "అప్లై ఫర్ ఫ్రెష్ పాస్‌పోర్ట్/ రీ-ఇష్యూ పాస్‌పోర్ట్" ఆప్షన్ ఎంచుకోండి.🔸 మీరు కొత్తగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తుంటే "ఫ్రెష్" ఎంచుకోండి. ఇప్పటికే ఉన్నవారు "రీఇష్యూ" ఎంచుకోండి.🔸అపాయింట్ మెంట్ తీసుకుని ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి.🔸 అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు మీ దరఖాస్తు రసీదును ప్రింట్ లేదా సేవ్ చేయవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ ధృవీకరణను సమర్పించవచ్చు.🔸 నిర్ణీత తేదీలో, మీరు ఎంచుకున్న పాస్‌పార్ట్ కార్యాలయానికి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లండి. -
హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల్లోకి మహిళలు.. పురుషులను మించి..
ముంబై: అన్ని రంగాల్లో పురుషుల ఆధిపత్యానికి చెక్ చెబుతూ మహిళలు పురోగమిస్తున్నారు. తాజాగా హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ పరిశ్రమలోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. గతేడాది ఈ రంగంలో ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 26 శాతం పెరిగినట్లు జాబ్ పోర్టల్ వర్క్‌ఇండియా ఒక నివేదికలో తెలిపింది.హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు 19 శాతమే పెరిగినట్లు పేర్కొంది. ఇక పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం మహిళల నుంచి దరఖాస్తులు పెరిగినట్లు వివరించింది. తృతీయ శ్రేణి పట్టణాల నుంచి కూడా అప్లికేషన్లు వస్తున్నప్పటికీ, ప్రథమ శ్రేణి మార్కెట్లలోనే ఎక్కువగా ఉద్యోగాలు ఉంటున్నట్లు వర్క్‌ఇండియా తెలిపింది.పురుషులకు మాత్రమే పరిమితమైన రంగాల్లోకి మహిళలు ప్రవేశించే కొద్దీ భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ను పునర్విర్వచించే మార్పులు చోటు చేసుకుంటున్నాయని వర్క్‌ఇండియా సీఈవో నీలేష్ దుంగార్వాల్ తెలిపారు. పోర్టల్‌లో మొత్తం మీద టెక్ ఉద్యోగాల పోస్టింగ్స్ 11 శాతం పెరగ్గా, హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ లిస్టింగ్స్ మాత్రం 26 శాతం ఎగిసినట్లు వివరించారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెరిగాయ్...
భారత టెలికాం రంగంలో కాంట్రాక్టు ఉద్యోగుల సగటు నెలవారీ వేతనం పెరిగింది. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ .24,609 లుగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి సగటు జీతం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ .25,225 కు చేరినట్లు టీమ్ లీజ్ సర్వీసెస్ తాజా డేటా సూచిస్తోంది.నివేదిక ప్రకారం.. భారత టెలికాం పరిశ్రమ 2025లో ఒప్పంద శ్రామిక శక్తి విస్తరణలో మందగమనాన్ని చవిచూసింది. అదే సమయంలో తమ కార్యాచరణ అవసరాల కోసం యువ ప్రతిభావంతులపై పెట్టుబడులనూ కొనసాగిస్తోంది.నివేదికలోని మరన్ని వివరాలు🔹కాంట్రాక్టు ఉద్యోగుల్లో 18 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. 🔹2024-25 ఆర్థిక సంవత్సరంలో అసోసియేట్ స్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగాల వృద్ధి 11.9 శాతానికి తగ్గింది.🔹అట్రిషన్ స్థాయిలు కాలక్రమేణా సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయి. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 50.8 శాతం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50.3 శాతంగా నమోదైంది. 🔹కాంట్రాక్ట్ అసోసియేట్లలో ఎక్కువ మంది తమ కెరీర్ ప్రారంభ దశలో ఉన్నవారే. 60 శాతం మందికి రెండు సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉంది.‘ఈ డేటా టెలికాం రంగ శ్రామిక శక్తి వ్యూహంలో స్థిరమైన పునఃసమీక్షను ప్రతిబింబిస్తుంది. నియామకాలు మరింత ఆచితూచి చేస్తున్నప్పటికీ, డైనమిక్, కస్టమర్-ఫేసింగ్, టెక్నికల్ ఉద్యోగాలకు తగిన యువ, విద్యావంతులైన అభ్యర్థులను తీసుకోవడంపై బలమైన దృష్టి కొనసాగుతోంది" అని టీమ్‌లీజ్ సర్వీసెస్ స్టాఫింగ్ సీఈవో కార్తీక్ నారాయణ్ అన్నారు. -
ఈసారి 7,000 మంది బలి?
అగ్రగామి సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 7,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు సీఎన్‌బీసీ తెలిపింది. ఇప్పటికే 2023 నుంచి కంపెనీ సుమారు 10,000 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు పేర్కొంది. కృత్రిమ మేధ(ఏఐ) ఆవిష్కరణలపై సంస్థ గణనీయంగా పెట్టుబడులు పెంచుతోంది. ఈమేరకు కార్యకలాపాలను క్రమబద్ధీకరించే విస్తృత వ్యూహంలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో సుమారు 3 శాతం మందిని తొలగించనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించలేదు.తక్కువ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు ఇటీవల రెండు ఆప్షన్లు ఇచ్చేలా మైక్రోసాఫ్ట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒకటి.. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్(పనితీరు మెరుగుదల కార్యక్రమం-పీఐపీ). ఇందులో భాగంగా కఠినమైన లక్ష్యాలను అంగీకరించి, అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగులు వృత్తిపరంగా తమనుతాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. రెండోది.. కంపెనీ ఆఫర్ చేసిన ప్యాకేజీని తీసుకొని కంపెనీ నుంచి నిష్క్రమించడం. స్వచ్ఛందంగా వైదొలగాలనుకునే ఉద్యోగులకు కంపెనీ 16 వారాల వేతనాన్ని అందిస్తోంది. అయితే ఈ రెండు ఆప్షన్స్‌లో దేన్ని ఎంచుకుంటారనే దానిపై ఉద్యోగులు ఐదు రోజుల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని గతంలో తెలిపింది.ఇదీ చదవండి: వేడి పుట్టిస్తున్న చల్లని ఏసీపీఐపీ సమయంలో పేలవమైన పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులపై రెండేళ్లపాటు తిరిగి సంస్థలో చేరకుండా నిషేధం విధిస్తూ ఈ విధానం నిర్ణయం తీసుకుంది. పనితీరు తక్కువగా ఉన్న సిబ్బందిని మైక్రోసాఫ్ట్‌లోని ఇతర ప్రాజెక్ట్‌ల్లో బదిలీ చేయకుండా కూడా ఈ విధానం పరిమితులు విధించింది. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన, పారదర్శకమైన సర్వీసులు అందించడానికి, జవాబుదారీతనం, పనితీరును బలోపేతం చేయడానికి ఈ కొత్త చర్యలు రూపొందించినట్లు కంపెనీ ప్రతినిధులు గతంలో తెలిపారు. -
వేడి పుట్టిస్తున్న చల్లని ఏసీ
భారత ఎయిర్ కండిషనర్(ఏసీ) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. సంవత్సరానికి 1.4 కోట్ల యూనిట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయని అంచనా. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం, ప్రజల డిస్పోజబుల్ ఆదాయాలు(ఖర్చులన్నీ పోను మిగులు ఆదాయాలు) అధికమవ్వడం ఏసీల కొనుగోళ్లకు ఒక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రజలు వీటిని లగ్జరీ వస్తువుగా కాకుండా, అవసరంగా భావిస్తున్నారని చెబుతున్నారు. ఏసీల కొనుగోళ్లలో పెరుగుదల కంపెనీలకు శుభపరిణామమే అయినా ఇతర అంశాలకు సంబంధించి తీవ్ర సవాళ్లను ఎత్తి చూపుతుంది.పెరుగుతున్న డిమాండ్దేశంలో ఎక్కువ మంది ప్రజలు నగరాలకు తరలివెళ్తున్నారు. వారి ఆదాయాలు మెరుగుపడటంతో ఏసీ కొనుగోళ్లకు మెగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఏసీలు కలిగి ఉన్నవారు కొత్త టెక్నాలజీ వర్షన్ మోడళ్లకు అప్డేట్ అవుతున్నారు. దాంతో వీటి డిమాండ్ పెరుగుతోంది. ఏసీని కొంత మంది మధ్య తరగతి ప్రజలు స్టేటస్ సింబల్‌గా కూడా చూస్తున్నారు. ఇటీవల వేసవిలో వాతావరణ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రికార్టు స్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి. వీటి వల్ల ఏసీ లగ్జరీ నుంచి అవసరంగా మారుతోంది.ఫైనాన్సింగ్ కంపెనీలు సైతం ఏసీ కొనుగోళ్లను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో సులువైన నెలవారీ వాయిదా పద్ధతులను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇది కూడా ఏసీల అమ్మకాలు పెరిగేందుకు కారణమవుతుంది. 2050 నాటికి రెసిడెన్షియల్ ఏసీల వినియోగం ప్రస్తుతం కంటే తొమ్మిది రెట్లు అధికమవుతుందని, దీనివల్ల విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.సవాళ్లు..దేశంలో అధికశాతం బొగ్గు ఆధారిత విద్యుత్‌నే వినియోగిస్తున్నారు. సంప్రదాయ విద్యుత్ తయారీ స్థానంలో పునరుత్పాదక ఇంధన తయారీని అభివృద్ధి చేస్తున్నా ఇంకా ఆమేరకు ప్రయత్నాలు కొంతమేరకే ఫలితాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకైతే వేసవి కాలంలో ఎక్కువగా వాడే ఏసీలకు అవసరమయ్యే అధిక విద్యుత్‌ను బొగ్గు మండించడం ద్వారానే తయారు చేస్తున్నారు. ఇది భారత విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఏసీల్లో నుంచి వెలువడే గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు వాతావరణానికి హాని కలిగిస్తున్నాయి. ఇది వాతావరణ మార్పులను తీవ్రతరం చేస్తుంది.ఇదీ చదవండి: చేతిలో పట్టుకున్నా.. పట్టుకోనట్టే!పరిష్కారాలు..పునరుత్పాదక ఇంధన తయారీని పెంచాలి. సౌర, పవన విద్యుత్‌ను పెంచడం ద్వారా బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు. తక్కువ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ (జీడబ్ల్యూపీ) రిఫ్రిజిరెంట్లతో కూడిన హై స్టార్ రేటెడ్ ఏసీలను వాడాలి. ఏసీల్లో ఇన్నోవేటింగ్ కూలింగ్ టెక్నాలజీస్‌ను ఉపయోగించాలి. ఇళ్లల్లో వెంటిలేషన్ పెంచడానికి అర్బన్ ప్లానింగ్ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి ఏసీపై ఆధారపడటాన్ని పరిమితం చేయాల్సి ఉంది. -
పేటీఎమ్‌లో రూ.2,104 కోట్ల బ్లాక్‌డీల్
ఫిన్‌టెక్ చైనా దిగ్గజం యాంట్ గ్రూప్ తాజాగా దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్‌లో 4 శాతం వాటా విక్రయించింది. పేటీఎమ్ బ్రాండ్ కంపెనీలో వాటాను షేరుకి రూ. 823–826 ధరల శ్రేణిలో దాదాపు రూ. 2,104 కోట్లకు అమ్మివేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 2.55 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది.ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలుబీఎస్ఈ బల్క్ డీల్ వివరాల ప్రకారం గోల్డ్‌మన్ శాక్స్(సింగపూర్) 37.35 లక్షల షేర్లు(0.59% వాటా) కొనుగోలు చేసింది. షేరుకి రూ. 823 సగటు ధరలో ఇందుకు రూ. 307.4 కోట్లు వెచ్చించింది. ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఈ లావాదేవీల తదుపరి పేటీఎమ్‌లో యాంట్ గ్రూప్ వాటా 9.85% నుంచి 5.85%కి తగ్గింది. బల్క్ డీల్స్ నేపథ్యంలో పేటీఎమ్ షేరు నిన్న బీఎస్ఈలో 1.1 శాతం నష్టంతో రూ. 857 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 864–823 మధ్య కదలాడింది. -
మెప్పించని టాటా మోటార్స్
ఆటో రంగ టాటా గ్రూప్ దిగ్గజం టాటా మోటార్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 51 శాతం క్షీణించి రూ. 8,556 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ.17,528 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,19,033 కోట్ల నుంచి రూ. 1,19,503 కోట్లకు స్వల్పంగా బలపడింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 28,149 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. 2023–24లో రూ. 31,807 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,34,016 కోట్ల నుంచి రూ. 4,39,695 కోట్లకు ఎగసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆటోమోటివ్ బిజినెస్ ప్రస్తుతం రుణరహితంగా మారినట్లు కంపెనీ సీఎఫ్‌వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. కంపెనీ విడదీతకు వాటాదారులు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: ఐబీఎం హెచ్ఆర్లో ఏఐ!జేఎల్ఆర్ ఓకేక్యూ4లో లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 2 శాతం నీరసించి 7.7 బిలియన్ పౌండ్లను తాకినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. పూర్తి ఏడాదికి దాదాపు యథాతథంగా 29 బిలియన్ పౌండ్ల టర్నోవర్ సాధించినట్లు తెలియజేసింది. యూఎస్, యూకే మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య డీల్ జేఎల్ఆర్కు సానుకూలమని పేర్కొంది. ఐదేళ్ల కాలంలో 18 బిలియన్ పౌండ్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు తెలియజేసింది. కాగా.. క్యూ4లో టాటా మోటార్స్ స్టాండెలోన్ నికర లాభం 35 శాతం క్షీణించి రూ. 1,382 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం రూ. 20,260 కోట్ల నుంచి రూ. 19,999 కోట్లకు స్వల్పంగా నీరసించింది. -
ఎయిర్టెల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 రెట్లు జంప్‌చేసి రూ. 11,022 కోట్లను తాకింది. వన్‌టైమ్ పన్ను లబ్ధి, టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ప్రభావం చూపాయి. కొన్ని పన్నుసంబంధిత అంశాలలో రూ. 5,913 కోట్లు అందుకుంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 2,072 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 27% ఎగసి రూ. 47,876 కోట్లను అధిగమించింది.అంతక్రితం క్యూ4లో రూ. 37,599 కోట్ల టర్నోవర్ సాధించింది. దేశీ(స్టాండెలోన్) ఆదాయం 29% జంప్‌చేసి రూ. 36,735 కోట్లయ్యింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 17% మెరుగుపడి రూ. 245ను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 209గా నమోదైంది. 66 లక్షల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు జత కలసినట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. దేశీ యూ జర్ల సంఖ్య 42.4 కోట్లకు చేరింది. 15 దేశాలలో విస్తరించిన కార్యకలాపాల ద్వారా 59 కోట్ల మంది యూజర్లున్నారు. డేటా కస్టమర్ల సంఖ్య 77%కి చేరింది. సగటున నెలకు మొబైల్ డేటా వినియోగం 21% ఎగసి 25.1 జీబీని తాకింది. పూర్తి ఏడాదికి సైతం మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎయిర్టెల్ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 33,556 కోట్లకు చేరింది. 2023–24లో కేవలం రూ. 7,467 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతంపైగా పుంజుకుని రూ. 1,72,985 కోట్లను తాకింది. 2023–24లో రూ. 1,49,982 కోట్ల టర్నోవర్ మాత్రమే నమోదైంది. నికర రుణ భారం రూ. 1.94 లక్షల కోట్ల నుంచి రూ. 2.03 లక్షల కోట్లకు పెరిగింది. క్యూ4లో పెట్టుబడి వ్యయాలు రూ. 12,553 కోట్ల నుంచి రూ. 14,401 కోట్లకు ఎగశాయి. అదనంగా 3,300 టవర్లను ఏర్పాటు చేసింది. పూర్తి ఏడాదికి పెట్టుబడి వ్యయాలు రూ. 33,242 కోట్లుగా నమోదయ్యాయి.ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 3 శాతం నష్టంతో రూ. 1,821 వద్ద ముగిసింది. -
ఇంటిగ్రేటెడ్ సస్టైనబిలిటీ సొల్యూషన్స్: లక్ష్యాలు ఇవే..
భారతీయ వ్యాపార రంగంలో పర్యావరణ అనుకూల మార్పులు తీసుకురావడానికి రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ (ReSL) ఒక కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. ‘ఇంటిగ్రేటెడ్ సస్టైనబిలిటీ సొల్యూషన్స్’ (ISS) పేరుతో ప్రారంభించిన ఈ వేదిక, నెట్ జీరో, ఈఎస్జీ (పర్యావరణ, సామాజిక, పాలన), సర్క్యులర్ ఎకానమీ వంటి లక్ష్యాలను చేరుకోవడానికి భారతీయ పరిశ్రమలకు అన్ని విధాలా సహాయం చేస్తుంది.పర్యావరణ, సుస్థిరత్వ పరిష్కారాల సంస్థగా ఉన్న రీ సస్టైనబిలిటీ, వ్యాపారాలు తమ కార్యకలాపాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడి విధానాలలో సుస్థిరత్వాన్ని పూర్తిగా కలిపేలా ఈ వేదికను రూపొందించింది. గతంలో సమర్థవంతమైన సుస్థిరత్వ అమలుకు అడ్డంకిగా ఉన్న సమస్యలను ఐఎస్ఎస్ సమర్థవంతంగా పరిష్కరిస్తుంది.ఇకపై వేర్వేరు అవసరాల కోసం వేర్వేరు సంస్థలను సంప్రదించాల్సిన అవసరం లేకుండా, వ్యాపారాలు తమ సుస్థిరత్వ ప్రణాళికను అమలు చేయడానికి ఒకే నమ్మకమైన భాగస్వామిపై ఆధారపడవచ్చు. ఈ వేదిక ద్వారా ప్రాథమిక వ్యూహ రచన, చట్టపరమైన సమస్యల పరిష్కారం నుండి మౌలిక సదుపాయాల అభివృద్ధి, వనరుల పునరుద్ధరణ, కార్యకలాపాల నిర్వహణ, ఈఎస్జీ నివేదికల తయారీ వరకు అన్ని రకాల సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. 11 దేశాలలో 99 కంటే ఎక్కువ కార్యాలయాలు, దేశంలోని అతిపెద్ద పర్యావరణ నిపుణుల బృందం ISSకు సహకారం అందిస్తున్నాయి.అందించే ముఖ్యమైన సేవలు..* సుస్థిరత్వం, ఈఎస్‌జీకి సంబంధించిన సలహాలు, అనుమతులు* పర్యావరణపరమైన అంశాల పూర్తి స్థాయి పరిశీలన, పరిష్కార సేవలు* పర్యావరణ మౌలిక సదుపాయాల ఏర్పాటు పరిష్కారాలు* కార్యకలాపాలు, నిర్వహణలో సహాయం* కర్బన ఉద్గారాల తగ్గింపు* వనరుల పునరుద్ధరణ, సర్క్యులర్ ఎకానమీ పరిష్కారాలు* సుస్థిరత్వ నివేదికల తయారీ* అందుబాటులో డిజిటల్, విశ్లేషణ సాధనాలు * పర్యావరణ అనుకూల పెట్టుబడులు, అమలు నమూనాలుఈ సందర్భంగా రీ సస్టైనబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ & గ్రూప్ సీఈఓ మసూద్ మాలిక్ మాట్లాడుతూ... అనేక కంపెనీలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత కార్యక్రమాలను అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ISS అనే ఈ కొత్త వేదిక వారికి ఒకే చోట సమగ్రమైన సలహా, అమలు, పర్యవేక్షణ సేవలను అందిస్తుందని ఆయన తెలిపారు. దీని ద్వారా కంపెనీలు తమ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చనన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ.. నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. -
ఆర్థిక భద్రతకు టర్మ్ ఇన్సూరెన్స్: అధ్యయనంలో వెల్లడైన విషయాలు
డిజిటల్ ప్రపంచంలో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ, భారతదేశంలోని యువతరం, అంటే జెన్ Z, ఆర్థిక భద్రత విషయంలో మాత్రం ఎంతో ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తోంది. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ఒక కొత్త అధ్యయనంలో ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. దీర్ఘకాలిక భద్రత, తక్కువ ధర, సులభమైన విధానాల కారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ వారికి ఒక ముఖ్యమైన ఆర్థిక సాధనంగా మారుతోంది.'కొత్త తరం అలవాట్లు, సంప్రదాయ విలువలు: ఆర్థిక ప్రణాళికలపై జెన్ Z తీరు' అనే పేరుతో 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు గల ఉద్యోగం చేస్తున్న జెన్ Z యువతపై ఈ పరిశోధన చేశారు. ఈ తరం టెక్నాలజీతో పాటు భద్రతకు కూడా సమానమైన ప్రాముఖ్యత ఇస్తోంది. టర్మ్ ఇన్సూరెన్స్‌ను వారు కేవలం ఒక రక్షణగా మాత్రమే కాకుండా, తమ ఆర్థిక భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా భావిస్తున్నారు.ముఖ్యమైన విషయాలుటర్మ్ ఇన్సూరెన్స్‌కు అధిక ప్రాధాన్యం: పెరుగుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు, తక్కువ ధరలో అందుబాటులో ఉండటం వల్ల జెన్ Z టర్మ్ ప్లాన్లను ఎక్కువగా ఎంచుకుంటోంది. 31 శాతం మంది టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది ఇతర జీవిత బీమా పాలసీల కంటే ఎక్కువ. ప్రతి నలుగురిలో ఒకరు టర్మ్ ఇన్సూరెన్స్‌తో పాటు సంపదను పెంచే ప్లాన్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్న వారిలో 57 శాతం మంది నెలకు రూ. 2,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.ముందస్తు రిటైర్మెంట్ ఆలోచనలు: జెన్ Z తరం వీలైనంత త్వరగా పదవీ విరమణ చేయాలని కోరుకుంటోంది. ఆర్థిక స్వాతంత్ర్యం సాధించి, త్వరగా రిటైర్ అవ్వాలనే సిద్ధాంతంపై వారి ఆసక్తి పెరుగుతోంది. దీనివల్ల వారు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గత తరాల వారిలా కాకుండా, 18 శాతం మంది ఇప్పటికే రిటైర్మెంట్ మరియు పెన్షన్ ప్లాన్ల గురించి ఆలోచిస్తున్నారు.ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాముఖ్యత: జెన్ Z ఆరోగ్యం, సంక్షేమం వంటి ప్రయోజనాలు లేని ఆర్థిక సాధనాలపై ఆసక్తి చూపడం లేదు. జీవిత బీమా సంస్థను ఎన్నుకునేటప్పుడు 60 శాతం మంది ఆరోగ్య ప్రయోజనాలు అందించే వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలతో పోలిస్తే పురుషులు (65 శాతం) వెల్నెస్ ప్రయోజనాలకు ఎక్కువ విలువ ఇస్తున్నారు.టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గిరీష్ జె. కల్రా మాట్లాడుతూ, జెన్ Z డిజిటల్ తరం వారైనప్పటికీ, దీర్ఘకాలిక భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్ వంటి వాటిని ఎంచుకుంటున్నారని చెప్పారు. ఆర్థిక భద్రత, ఆరోగ్యం మరియు ముందస్తు రిటైర్మెంట్ ప్రణాళికలపై దృష్టి పెడుతూ వారు తమ భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నారని ఆయన అన్నారు.జెన్ Z ఎక్కువగా ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పటికీ, ఆర్థిక విషయాల్లో మాత్రం విశ్వసనీయమైన వాటికి ప్రాధాన్యత ఇస్తోంది. 53 శాతం మంది బీమా పాలసీల కోసం ఏజెంట్లు లేదా బ్యాంక్ సలహాదారులపై ఆధారపడుతున్నారు. అయితే, 25 శాతం మంది సోషల్ మీడియా నుండి కూడా ఆర్థిక సలహాలు తీసుకుంటున్నారు. జెన్ Z తరం చిన్న వయస్సులోనే ఆర్థిక విషయాల్లో మెరుగైన అవగాహన కలిగి ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్‌ను ముందుగానే తీసుకోవడం, రిటైర్మెంట్ కోసం ప్రణాళికలు వేసుకోవడం, సంపదతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారు భవిష్యత్తులో దేశ ఆర్థిక ప్రణాళికలను మారుస్తున్నారు. -
ఐబీఎం హెచ్ఆర్లో ఏఐ!
కార్పొరేట్ కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం గణనీయంగా పెరుగుతోంది. అంతర్గత ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి, రోజువారీ పనులను తగ్గించేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీ ఐబీఎం తన హెచ్ఆర్ (మానవ వనరుల) సిబ్బందిలో కొంత భాగాన్ని ఏఐ వ్యవస్థలతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఏఐ కొంతమంది హెచ్ఆర్ ఉద్యోగుల పనిని రీప్లేస్ చేస్తుందని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాధనాల వైపు కంపెనీ ఎక్కువగా మొగ్గు చూపుతుందని సంస్థ సీఈఓ అరవింద్ కృష్ణ చెప్పారు.కంపెనీలు అంతర్గత ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, మాన్యువల్ పనులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కృత్రిమ మేధపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు ఈ ధోరణి వల్ల తెలుస్తుంది. ఐబీఎం హెచ్ఆర్ విభాగంలో పూర్తిస్థాయి ఏఐ వాడకానికి సంబంధించి నిర్దిష్ట కాలపరిమితిని తెలియజేయనప్పటికీ, ఇప్పటికే 200 ఉద్యోగులను తొలగించినట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. హెచ్ఆర్ ఉద్యోగాల తగ్గింపు అంటే కంపెనీ మొత్తంగా ఆ విభాగంలోని ఉద్యోగులను పూర్తిగా తొలగిస్తున్నట్లు కాదు. ఆటోమేషన్ ప్రక్రియలకు అనుగుణంగా ఏఐను వాడుతున్నారు. హెచ్ఆర్లో ఇతర విభాగాల్లో ఉద్యోగులు యథావిధిగా పని చేస్తారు. వాస్తవానికి ఐబీఎం మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇటీవల పెరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, మార్కెటింగ్, సేల్స్ వంటి విభాగాల్లో ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో సమస్యా పరిష్కారం, ఇంటర్ పర్సనల్ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి.ఈ సందర్భంగా వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడిన కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ.. సంస్థలో కొన్ని పనులను ఆటోమేట్ చేయడం వల్ల ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వనరులు సమకూరుతున్నాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌ను కొన్ని ఎంటర్ప్రైజ్ వర్క్‌ఫ్లోలపై ఉపయోగించడం వల్ల కార్యకలాపాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. ఇతర విభాగాల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్ఆర్లోని ప్రస్తుత ఏఐ వ్యవస్థలు అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు.ఇదీ చదవండి: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలుడేటాను క్రమబద్ధీకరించడం, ఈమెయిల్స్ పంపడం లేదా అంతర్గత అభ్యర్థనలను ప్రాసెస్ చేయడం వంటి పనులను స్వతంత్రంగా నిర్వహించగల ఏఐ సాఫ్ట్వేర్ సాధనాల వాడకం వేగంగా పెరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముడిపడి ఉన్న ఉద్యోగాల కోత అన్ని విభాగాల్లో ఇంకా విస్తృతంగా లేనప్పటికీ, కొన్ని కంపెనీలు టెక్నాలజీని ఎలా సమర్థంగా ఉపయోగించాలో అన్వేషిస్తున్నాయి. ఈమేరకు నిధులను ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి. -
జెన్సోల్ ఇంజినీరింగ్ ప్రమోటర్ల రాజీనామా
సంక్షోభంలో చిక్కుకున్న జెన్సోల్ ఇంజినీరింగ్ సంస్థ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ తమ పదవులకు రాజీనామా చేశారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మధ్యంతర ఉత్తర్వుల మేరకు వారు కంపెనీ నుంచి తప్పుకున్నారు. అన్మోల్ సింగ్ జగ్గీ ఎండీగా, పునీత్ సింగ్ జగ్గీ హోల్‌టైమ్ డైరెక్టరు పోస్టులకు రాజీనామా చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలియజేసింది. అలాగే, వారిద్దరూ ఇకపై వివిధ కమిటీల్లో సభ్యులుగా కూడా ఉండబోరని పేర్కొంది. నిధుల మళ్లింపు, గవర్నెన్స్ లోపాల ఆరోపణలపై సెబీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జెన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్‌లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్‌లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని గత నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో రూ.848 కోట్ల పెట్టుబడిజెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది. -
క్విక్ కామర్స్ కంపెనీలో కీలక పెట్టుబడులు
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహవ్యవస్థాపకులు మోతీలాల్ ఓస్వాల్, రామ్‌దేవ్ అగర్వాల్ తాజాగా క్విక్‌కామర్స్ కంపెనీ జెప్టోలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. విడిగా 5 కోట్ల డాలర్లు(రూ.424 కోట్లు) చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెకండరీ లావాదేవీ ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి. వీటి విలువ 10 కోట్ల డాలర్లు(రూ.848 కోట్లు)గా ఉంది.మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరో 25 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న జెప్టో తాజా లావాదేవీ ద్వారా దేశీ యాజమాన్య వాటా పెంపువైపు సాగుతున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం దేశీ యాజమాన్యానికి కంపెనీలో 42% వాటా ఉంది. ఇతర లావాదేవీల ద్వారా ఐపీవో కంటే ముందే వాటాను 50%కిపైగా పెంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..2024 ఆగస్ట్‌లో సాధించిన 5 బిలియన్ డాలర్ల విలువలో లావాదేవీలు నమోదైనట్లు వెల్లడించాయి. కాగా.. మోతీలాల్ ఓస్వాల్ ఆధ్వర్యంలో ఎడిల్వీజ్, హీరో ఫిన్‌కార్ప్ తదితర సంస్థలు 25 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమకూర్చనున్నట్లు సమచారం. తదుపరి దశలో భాగంగా 25 కోట్ల డాలర్ల పెట్టుబడికి జూన్‌లో తెరతీయనున్నట్లు తెలుస్తోంది. -
రూ.3959 కోట్లు ఇన్వెస్ట్మెంట్.. రూ.36855 కోట్ల రాబడి
న్యూఢిల్లీ: నౌకరీ.కామ్ మాతృ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ కొన్నేళ్లుగా స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. ప్రధానంగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, పీబీ ఫిన్‌టెక్ (పాలసీబజార్)లో పెట్టుబడులు భారీ రాబడి అందించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, చైర్మన్ సంజీవ్ బిక్చందానీ తాజాగా పేర్కొన్నారు.గతేడాది (2024–25) ఫలితాల విడుదల సందర్భంగా వాటాదారులకు రాసిన లేఖలో ఈ అంశాలను వివరించారు. 2007లో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లకు తెరతీసినట్లు తెలియజేశారు.వివిధ ప్లాట్‌ఫామ్‌లపై గత 15 ఏళ్ల కాలంలో రూ. 3,959 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలియజేశారు. ప్రస్తుతం వీటి అసలు విలువ దాదాపు 10 రెట్లు ఎగసి రూ. 36,855 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ప్రధానంగా జొమాటోలో రూ. 484 కోట్లు, పాలసీబజార్‌లో రూ. 591 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
టీసీఎస్ కొత్త ఆఫీస్: నెల అద్దె ఎన్ని కోట్లంటే..
దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) చెన్నైలోని ఓజోన్ టెక్నో పార్క్‌లో దాదాపు 6,30,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీనికి నెలవారీ అద్దె రూ. 2.8 కోట్లు అని.. రియల్ ఎస్టేట్ డేటా అనలిటికల్ సంస్థ ప్రాప్‌స్టాక్ ద్వారా తెలిసింది.చెన్నైలోని నవలూర్లో టీసీఎస్.. ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. అద్దె 2025 మార్చి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ స్థలాన్ని ప్లాటినం హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 10 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. దీని కోసం టీసీఎస్ రూ. 25.5 కోట్లు డిపాజిట్ చేసినట్లు సమాచారం. అద్దె నెలకు చదరపు అడుగుకు రూ. 45 చొప్పున చెల్లించాల్సి ఉంది. అయితే ప్రతి మూడు సంవత్సరాల తర్వాత అద్దె 12 శాతం పెరుగుతుంది. అయితే ఈ విషయంపై టీసీఎస్ అధికారికంగా స్పందించలేదు.చెన్నైలో ఇతర వాణిజ్య రియల్ ఎస్టేట్ లావాదేవీలు➤జనవరి 2025లో వాల్‌మార్ట్.. చెన్నైలో 4.6 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని నెలకు రూ. 3.26 కోట్ల అద్దెకు లీజుకు తీసుకున్నట్లు ప్రాప్‌స్టాక్ యాక్సెస్ చేసిన పత్రాల ద్వారా తెలిసింది. ఈ ఆఫీస్ స్థలం ఇంటర్నేషనల్ టెక్ పార్క్‌లో ఉంది. కంపెనీ దీనికోసం రూ.19.55 కోట్లు డిపాజిట్ చేసింది.ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం..➤మార్చిలో, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా.. చెన్నైలోని తన ఇండియా ప్రధాన కార్యాలయాన్ని బాగ్మనే కన్స్ట్రక్షన్స్కు రూ. 612 కోట్లకు విక్రయించింది. ఈ ఆస్తి చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్(OMR)లోని తోరైపక్కంలో ఉంది. ఇది నగరంలోని కీలకమైన ఐటీ కారిడార్లలో ఒకటి. ఈ ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం వహించిన జేఎల్ఎల్ ధృవీకరించింది.➤గత ఏడాది ఆగస్టులో, ఐటీ సేవల దిగ్గజం LTI మైండ్‌ట్రీ.. చెన్నైలోని మనపక్కం శివారులో 5.85 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని రూ.3.98 కోట్ల నెలవారీ అద్దెకు లీజుకు తీసుకుంది. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల అన్ని టెలికాం ఆపరేటర్లను వినియోగదారుల ప్రయోజనం కోసం.. వాయిస్ కాలింగ్, ఎస్ఎమ్ఎస్ సేవలను కలిగి ఉన్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలకు ప్రతిస్పందనగా, రిలయన్స్ జియో ఎటువంటి డేటా ప్రయోజనాలను అందించకుండా.. కాలింగ్, ఎస్ఎమ్ఎస్ వంటి వాటికోసం మాత్రమే రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్లు (రూ.458, రూ.1958) ప్రత్యేకంగా వాయిస్ కాల్స్ & టెక్స్ట్ మెసేజస్ వంటివి మాత్రమే అవసరమయ్యే వారికి ఉపయోగపడతాయి. అంటే ఈ ప్లాన్లలో డేటా లభించదు.రూ.458 ప్లాన్ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే ఉంటుంది. వ్యాలిడిటీ సమయంలో అపరిమిత వాయిస్ కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు, నేషనల్ రోమింగ్ వంటివి లభిస్తాయి. అంతే కాకుండా.. జియో సినిమా, జియో టీవీ, జియోకు సంబంధించిన యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?రూ. 1,958 ప్లాన్ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లు, నేషనల్ రోమింగ్ సేవలు ఉన్నాయి. వీటితో పాటు.. వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ యాక్సెస్‌ను పొందుతారు. కొత్త ప్లాన్ల తీసుకొచ్చిన జియో.. రూ. 479, రూ. 1899 ప్లాన్లను నిలిపివేసింది. -
10 వారాల్లో రూ.16,700 కోట్లు తెచ్చారు..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కెనరా బ్యాంక్ ఉద్యోగులు అద్భుతమైన ఘనత సాధించారు. బ్యాంక్ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో పది వారాల్లో రూ.16,700 కోట్లు సమీకరించారు. డిపాజిట్ల వృద్ధి లేమితో సతమతమవుతున్న కెనరా బ్యాంకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బ్యాంకులో పనిచేసే 82,000 మంది సిబ్బందిని నిధుల సమీకరణకు వెళ్లాలని కోరింది.పీటీఐ నివేదిక ప్రకారం.. ఇటీవల పెరిగిన డిపాజిట్ల ఉపసంహరణతో బ్యాంకింగ్ వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కెనరా బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ ఉద్యోగులందరికీ డిపాజిట్ల సేకరణకు పిలుపునిచ్చింది. 2024 జనవరి 26న ప్రారంభమైన ఈ డ్రైవ్‌కు సిబ్బంది మనస్ఫూర్తిగా సహకరించారు.‘బ్యాంక్ డిపాజిట్లను పెంచడానికి సహకరించాలని మొత్తం 82,000 మంది సిబ్బందిలో ప్రతిఒక్కరికీ పిలుపునిచ్చాం. కాసా (కరెంట్, సేవింగ్స్ అకౌంట్) లేదా రిటైల్ టర్మ్ డిపాజిట్ రూపంలో ఒక్కొక్కరూ రూ.10 లక్షలు తీసుకురావాలని కోరాం' అని కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె సత్యనారాయణ రాజు తెలిపారు.సీడీ నిష్పత్తి విషయంలో కెనరా బ్యాంక్ 80 శాతం పరిమితిని చేరుకునే అంచున ఉందని ఆయన తెలిపారు. పీరియడ్ ఎండ్ లో అధిక సంఖ్యలో డిపాజిట్లు పెట్టడం ఈ డ్రైవ్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. కాసా బ్యాలెన్స్ లలో కూడా స్థిరత్వం ఉన్నందున ఈ డ్రైవ్ మొత్తం వ్యాపారానికి సహాయపడిందని పేర్కొన్నారు. ఈ డ్రైవ్ కారణంగా కెనరా బ్యాంక్ బల్క్ డిపాజిట్లపై ఆధారపడటం కూడా తగ్గిందని ఆయన అన్నారు. అధిక వ్యయ రుణాల వాటా 25 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందని వివరించారు. -
ఏ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారంటే..
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో భౌగోళిక రాజకీయ మార్పుల కారణంగా భారతదేశ రక్షణ సాంకేతిక రంగాన్ని పెట్టుబడిదారులు అవకాశంగా చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం బలమైన విధాన మద్దతు, వేగవంతమైన సాంకేతిక పురోగతి ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్రం దృష్టి సారించడం, పరిశ్రమ ఆవిష్కరణలు, వ్యూహాత్మక పరిష్కారాలకు భారత్ గ్లోబల్ హబ్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు ఈ రంగంపై ఆసక్తిగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.పెట్టుబడుల వృద్ధికి కారణాలుదేశీయ రక్షణ తయారీని బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ చర్యల వల్ల వివిధ కంపెనీలతో ఇటీవల 253 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకోవడంతో రూ.53,439 కోట్ల పెట్టుబడులు సమకూరే అవకాశం ఉంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేయడం వల్ల రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడిదారులకు భారత్ ఆకర్షణీయంగా మారుతోంది.సాంకేతికత అభివృద్ధిసివిలియన్, మిలిటరీ అప్లికేషన్లకు సర్వీసులు అందించే డ్యుయల్-యూజ్ టెక్నాలజీలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. నిఘా, వ్యూహాత్మక కార్యకలాపాల కోసం స్వయంప్రతిపత్తి కలిగిన డ్రోన్ల తయారీ సంస్థలపై దృష్టి సారిస్తున్నారు. రియల్ టైమ్ ముప్పును గుర్తించడం కోసం ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలను రూపొందించే కంపెనీలను గుర్తిస్తున్నారు. సముద్ర భద్రత, అన్వేషణ కోసం అండర్ వాటర్ డ్రోన్లు, అధునాతన డిఫెన్స్ ఇమేజింగ్, ఇంటెలిజెన్స్ కోసం హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాల వంటి వాటిపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ అంతరించనుందా..?కంపెనీల తీరుడిఫెన్స్ టెక్ స్టార్టప్‌లు డీప్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ), మాడ్యులర్ టెక్నాలజీ, రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాధాన్యత ఇస్తూ దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉన్నాయి. కంపెనీలు తక్కువ ఖర్చుతో సుస్థిరమైన, కృత్రిమ మేధ ఆధారిత రక్షణ పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నాయి. -
బస్సులో వస్తావా? ఉద్యోగం లేదు పో..
జాబ్ ఇంటర్వ్యూకు బస్సులో వచ్చిన యువతికి ఉద్యోగం లేదు.. ఏమీ లేదు పో.. అంటూ ఓ కంపెనీ వెనక్కి పంపేసింది. తనకు ఎదురైన ఈ షాకింగ్ అనుభవాన్ని ఆ యువతి ప్రొఫెషనల్ సామాజిక వేదిక రెడ్డిట్ ద్వారా పంచుకున్నారు. తన అర్హతలు, నైపుణ్యాలు చూడకుండా కేవలం తాను ప్రజా రవాణాను ఉపయోగించినందుకు ఇంటర్వ్యూ నుంచి పంపించేశారని ఆమె వాపోయారు.యువతి రెడ్డిట్ పోస్ట్ ప్రకారం.. బస్సు దిగి కంపెనీ భవనంలోకి నడిచి వస్తున్న ఆమెను సెక్యూరిటీ కెమెరాల్లో గమనించిన హైరింగ్ మేనేజర్.. ఇంటర్వ్యూ మొదలవ్వగానే ఆమె అర్హతలు లేదా అనుభవం గురించి కాకుండా మొదట ఆమె బస్సులో రావడం గురించే అడిగాడు. ప్రజా రవాణాను ఉపయోగించినందుకు అసహనం వ్యక్తం చేసిన ఆయన అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగానూ కామెంట్ చేశాడు. ఎర్రగా ఉన్న ఆమె జుట్టును "అన్ ప్రొఫెషనల్" అని వ్యాఖ్యానించాడు.అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే.. "ఇప్పుడే ఇంటర్వ్యూకు వెళ్లొచ్చాను. నేను కంపెనీ భవనం వైపు నడిచిరావడం కెమెరాల్లో చూశానని బాస్ చెప్పారు. నీకు మంచి ట్రాన్స్పోర్ట్ లేదా అని అడిగారు. ప్రజా రవాణాను ఉపయోగించకూడదని చెప్పి కొన్ని నిమిషాలు మందలించాడు. నన్ను ఎవరూ నియమించుకోరని, తానైతే ఇలాంటి వారికి అస్సలు జాబివ్వనని చెప్పాడు. ఎందుకంటే వారు సమయానికి రారు. ఇక నా ఎర్రటి జుట్టు గురించి ఫిర్యాదు చేయడం కొనసాగించాడు. అది నన్ను అన్ ప్రొఫెషనల్ గా మార్చింది అన్నాడు. ఇంటర్వ్యూ ప్రశ్నలు అడగలేదు. తమకు చాలా మంది అభ్యర్థులు ఉన్నారని, షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను పంపించేశారు."అయితే ఇంతకీ సదరు కంపెనీ ఏది.. అనుచితంగా ప్రవర్తించిన ఆ హైరింగ్ మేనేజర్ పేరేంటి అన్నది ఆమె వెల్లడించలేదు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్ట్‌కు చాలా మంది యూజర్లు ప్రతిస్పందించారు. అలా ప్రవర్తించిన ఆ మేనేజర్ తీరును తప్పుబట్టారు. ఆమెకు మద్దుతుగా నిలిచారు. -
టైటాన్ కొత్త ఆటోమేటిక్ వాచీలు
ముంబై: వాచీల తయారీ సంస్థ టైటాన్ సరికొత్త ఆటోమేటిక్స్ కలెక్షన్ శ్రేణిని ప్రవేశపెట్టింది. ఫీనిక్స్, నెక్సస్, గోల్డెన్ హార్ట్ తదితర వాచీల్లో ఆకర్షణీయమైన స్కెలిటల్ డయల్స్ ఉంటాయని సంస్థ తెలిపింది. అలాగే, డ్యుయల్ ఫినిష్ సాలిడ్ లింక్ స్ట్రాప్‌లు, 21 జ్యుయల్ బేరింగ్లు మొదలైన ప్రత్యేకతలతో వీటిని రూపొందించినట్లు టైటాన్ వాచెస్ మార్కెటింగ్ హెడ్ అపర్ణ రవి తెలిపారు. వీటి ధర శ్రేణి రూ. 18,325 నుంచి రూ. 22,150 వరకు ఉంటుంది. -
అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?
భారతదేశంలో దాదాపు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 200 కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది.ఇదీ చదవండి: సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?మామిడి తోట పెట్టడానికి కారణం1997లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకోవలసి వచ్చింది. అలాంటి సమయంలో అక్కడ మామిడి తోటను ఏర్పాటు చేయడం జరిగింది. అదే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోటగా గుర్తింపు తెచ్చింది. ఈ మామిడి తోట ద్వారా ఏడాదికి రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. -
‘వేద’ మా అమ్మ పేరు.. ‘వేదాంత’ నా కంపెనీ పేరు..
వేదాంత గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ తన తల్లి స్ఫూర్తితో సాధారణ వ్యక్తి నుంచి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. బీహార్‌లోని పాట్నాలో జన్మించిన అగర్వాల్, కెరీర్ ఆరంభంలో విఫలమైనప్పుడు నిరాశకు గురయ్యారు. అప్పుడు అమ్మే అండగా నిలిచింది. గుండెల్లో ధైర్యం నింపింది. మాతృ దినోత్సవం సందర్భంగా ఈ తల్లీకొడుకుల అనుబంధం గురించి తెలిపేదే ఈ కథనం..విజయవంతమైన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభ రోజులు పరీక్షగానే ఉంటాయి. ఎవరు అవమానించినా, హేళన చేసినా ఈ పరీక్షలో వారికి తోడుగా నిలిచేది తల్లి మాత్రమే. అలాగే అనిల్ అగర్వాల్‌కూ అమ్మ అండగా నిలిచింది. విజయం వైపు నడిపించింది. “అనిల్.. ముందుకు సాగు.. తలుపులు తెరుచుకుంటాయి” అని తన తల్లి చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటారాయన.ఈ మాటలు ఆయనలో సంకల్పాన్ని నింపాయి. వేదాంతను స్థాపించి భారత జీడీపీలో 1.4% వాటా సాధించే సంస్థగా నిలిపారు.ప్రస్తుతం వేదాంత ఒక పెద్ద మార్పును చేస్తోంది. 83% ఆమోదంతో డీమెర్జర్‌కి క్రెడిటర్స్ ఆమోదం లభించింది. దీనివల్ల సంస్థ ఐదు స్వతంత్ర విభాగాలుగా విడిపోతుంది. సెప్టెంబర్ 2025 నాటికి ఎన్సీఎల్టీ ఆమోదంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అగర్వాల్ ఆశిస్తున్నారు. ఈ డీమెర్జర్ షేర్‌హోల్డర్ల విలువను పెంచి, రుణ భారాన్ని తగ్గిస్తుంది. గత ఐదేళ్లలో వేదాంతలో పెట్టుబడులు 4.7 రెట్ల రాబడిని ఇచ్చాయి.వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతపై కూడా అగర్వాల్ దృష్టి ఉంది. అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ ద్వారా నడిచే నంద్ఘర్ కార్యక్రమం బాల్య విద్యను ప్రోత్సహిస్తుంది. మదర్స్ డే సందర్భంగా, తల్లుల పాత్రను గౌరవిస్తూ తన తల్లి స్ఫూర్తిని తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నారు అనిల్ అగర్వాల్. ఈమేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు.‘మొదటిసారి, ‘మదర్స్ డే’ రోజున అమ్మ లేదు!అమ్మ అంటే కేవలం శరీరం మాత్రమే కాదు… ఆమె మీ ఉనికే. ఆమె శరీర రూపంలో మనతో లేకపోయినా, ఆమె ఆత్మ శ్వాస మనతోనే ఉంటుంది.కాలం, దేవుడి కృపగా మారి కన్నీళ్లను ఆరబెడుతుంది. అంతులేని బాధను సానుకూల శక్తిగా మార్చి మనకు బతకడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది.విచారం, కాలంతో పాటు శక్తిగా మారుతుంది, ఎందుకంటే మీ ప్రేమ నిజమైనది.ఉదయం లేచినప్పుడు ఏదో భక్తి గీతం, ఆలోచించకుండానే నోటిలోకి వచ్చినట్లు, అలాగే అమ్మ జ్ఞాపకం మనసులో వెలుగును నింపుతూ ఉంటుంది.ఖాదీ బట్టల వాసన లేదా అగరబత్తి సుగంధంలో తరచూ అమ్మ ఉనికిని అనుభవిస్తాను.మా అమ్మకు ఇంగ్లీష్ రాదు, కానీ లండన్‌లో ఉంటూ ఆమె ఇంగ్లీష్ వాళ్లతో చక్కగా సంభాషించేది. భావనల భాషకు పదాల అవసరం ఎప్పుడూ ఉండదు.పెద్ద నిర్ణయం తీసుకునే ప్రతిసారీ ఒక క్షణం ఆగిపోతాను. అమ్మ ఆశీర్వాదం కావాలన్నట్లు అనిపిస్తుంది.‘వేద’ నా అమ్మ పేరు.“వేదాంత” అక్కడి నుండే పుట్టింది.నా విజయం నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రసాదమే.అమ్మ జ్ఞాపకానికి ఒక నిర్దిష్టమైన రోజు అవసరం లేకపోయినా, ఇలాంటి ఒక రోజును నిర్ణయించడం నాకు చాలా సానుకూల ఆలోచనగా అనిపిస్తుంది. ప్రపంచమంతా ఒక మాటగా కలిసి ఈ రోజును అమ్మకు అంకితం చేస్తోంది. ఇది చాలా మంచి విషయం.‘మదర్స్ డే’ సందర్భంగా ప్రతి అమ్మకు నా నమస్కారం!’ -
స్విగ్గీకి ‘క్విక్’గా వచ్చిన నష్టాలు.. 3 నెలల్లో డబుల్!
ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టం రెట్టింపై రూ. 1,081 కోట్లను తాకింది. క్విక్కామర్స్పై భారీ పెట్టుబడులు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 555 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,046 కోట్ల నుంచి రూ. 4,410 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు మరింత అధికంగా రూ. 3,668 కోట్ల నుంచి రూ. 5,610 కోట్లకు పెరిగాయి. ఫుడ్ డెలివరీ విభాగంలో స్థూల ఆర్డర్ విలువ 18 శాతం అధికమై రూ. 7,347 కోట్లకు చేరినట్లు స్విగ్గీ వెల్లడించింది. నిర్వహణ లాభం(ఇబిటా) ఐదు రెట్లు ఎగసి రూ. 212 కోట్లను తాకింది. స్విగ్గీ స్మార్ట్ సగటు ఆర్డర్ విలువ 13 శాతం మెరుగుపడి రూ. 527కు చేరగా.. 316 డార్క్ స్టోర్లను జత కలుపుకుంది.కాగా స్విగ్గీ ప్రధాన పోటీదారు ఈ మధ్యనే ఎటర్నల్‌గా పేరు మార్చుకున్న జొమాటో నికర లాభాలు కూడా భారీగా పడిపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో సంస్థ నికర లాభాలు 78 శాతం పతనమై రూ39 కోట్లతో సరిపెట్టుకుంది. సంస్థ రెవెన్యూ 64 శాతం పెరిగి రూ.5,833 కోట్లుగా చోటు చేసుకుంది. కంపెనీ వ్యయాలు 68 శాతం పెరిగి రూ.6,104 కోట్లకు చేరడంతో లాభాల్లో తగ్గుదల చోటు చేసుకున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. -
1,600 డీల్స్.. వీసీ పెట్టుబడుల జోరు..
న్యూఢిల్లీ: రెండేళ్ల పాటు నెమ్మదించిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ–వీసీ) పెట్టుబడులు గతేడాది మళ్లీ జోరందుకున్నాయి. 9 శాతం పెరిగి 43 బిలియన్ డాలర్లకు చేరాయి. సుమారు 1,600 డీల్స్ నమోదయ్యాయి. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ), బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన ’ఇండియా ప్రైవేట్ ఈక్విటీ రిపోర్ట్ 2025’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.ఆసియా–పసిఫిక్‌లోకి వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో దాదాపు ఇరవై శాతం భారత్‌లోకి ప్రవహించాయని రిపోర్ట్ వివరించింది. తద్వారా ఈ ప్రాంతంలో పీఈ–వీసీ ఇన్వెస్ట్మెంట్లకు రెండో అతి పెద్ద గమ్యస్థానంగా భారత్ స్థానం మరింత పటిష్టమైందని తెలిపింది. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వంపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ఇన్వెస్టర్లు పెట్టుబడుల ద్వారా స్వల్ప వాటాలతో సరిపెట్టుకోకుండా సంస్థలను పూర్తిగా కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. 2022లో నమోదైన పీఈ డీల్స్ విలువలో సంస్థల కొనుగోళ్ల ఒప్పందాల వాటా 37 శాతంగా ఉండగా 2024లో 51 శాతానికి పెరిగింది. వివిధ రంగాలవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన అసెట్స్‌లో నియంత్రణాధికారాలను చేజిక్కించుకోవడంపై ఇన్వెస్టర్లు మరింతగా దృష్టి పెడుతుండటాన్ని ఇది సూచిస్తోంది. గతేడాది వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు 16 శాతం వాటా దక్కించుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే డీల్ విలువ 70 శాతం పెరిగింది. ఆర్థిక సేవల విభాగం 25 శాతం వృద్ధి చెందింది. 14 డీల్స్ నమోదయ్యాయి. వీటిలో 100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే డీల్స్ ఏడు ఉన్నాయి. హెల్త్‌కేర్ విభాగంలోకి కూడా గణనీయంగా నిధులు వచ్చాయి. హెల్తియం వంటి భారీ మెడ్‌టెక్ లావాదేవీల దన్నుతో ఒప్పందాల పరిమాణం 80 శాతం పెరిగింది. ఫార్మా సీడీఎంవోల్లోకి పెట్టుబడులు పెరిగాయి. పెర్ఫీషియంట్ (3 బిలియన్ డాలర్లు), ఆల్టిమెట్రిక్ (900 మిలియన్ డాలర్లు), జీఈబీబీఎస్ (865 మిలియన్ డాలర్లు) లాంటి భారీ డీల్స్ ఊతంతో ఐటీ ఆధారిత సర్వీసులు, ఐటీ రంగం 300 శాతం మేర అసాధారణ వృద్ధి కనపర్చింది. ఇన్వెస్టర్లు పలు సంస్థల నుంచి నిష్క్రమించడంలోనూ ఆసియా–పసిఫిక్‌లోని ఇతర మార్కెట్లను భారత్ అధిగమించింది. ఇలాంటి డీల్స్ విలువ 33 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మెరుగ్గా ఉన్న ఈక్విటీ మార్కెట్లలో తమ వాటాలను విక్రయించడం ద్వారా వైదొలగడం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దేశీయంగా నిధుల సమీకరణ 2024లో కొత్త గరిష్టాలకు చేరింది. కేదార క్యాపిటల్ 1.7 బిలియన్ డాలర్ల నిధులు, క్రిస్‌క్యాపిటల్ 2.1 బిలియన్ డాలర్లు సమీకరించాయి. పటిష్టమైన జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ప్రైవేట్ వినియోగం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడటం, పాలసీలపరంగా సానుకూల చర్యలు మొదలైన అంశాల తోడ్పాటుతో 2025పై అప్రమత్తతతో కూడుకున్న ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. -
ఐటీలో ‘చిన్న’ హిట్టు.. ‘పెద్ద’ యావరేజు..
గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని పలు స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీలు గణనీయంగా రాణించాయి. పెద్ద సంస్థలను మించిన పనితీరును కనపర్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసుల సంస్థలు అటు క్యూ4లోను ఇటు పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ అదరగొట్టాయి. కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెక్సావేర్ టెక్నాలజీస్, ఎంఫసిస్ వంటి సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం నుంచి 32 శాతం వరకు ఆదాయ వృద్ధి సాధించాయి.మరోవైపు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌టెక్‌లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి మాత్రం సుమారు 4 శాతానికే పరిమితమైంది. పైపెచ్చు విప్రో ఆదాయం రెండు శాతం క్షీణించింది. జనవరి–మార్చి త్రైమాసికంలోను ఇదే తరహా ఫలితాలు కనిపించాయి. సీక్వెన్షియల్‌గా కోఫోర్జ్ ఆదాయం 4.7 శాతం పెరిగి రూ. 3,410 కోట్లకు, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఆదాయం 12.4 శాతం వృద్ధితో రూ. 2,982 కోట్లకు చేరాయి. భారీ డీల్స్‌ను దక్కించుకున్నప్పటికీ పెద్ద కంపెనీలు మిశ్రమ ఫలితాలు కనపర్చాయి. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.కొత్త టెక్నాలజీలు, నాయకత్వం దన్ను.. చిన్న కంపెనీలు మెరుగ్గా రాణించడానికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. జెన్‌ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను వేగవంతంగా అందిపుచ్చుకోవడం, ప్రాజెక్టులను సత్వరం ఎగ్జిక్యూట్ చేయగలగడం, స్థిరమైన నాయకత్వం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. జెన్‌ఏఐలాంటి విప్లవాత్మకమైన టెక్నాలజీలనేవి, పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా తమను తాము మల్చుకోగలిగే చిన్న సంస్థలకు అవకాశంగా, ప్రస్తుతమున్న భారీ సంస్థలకు కొంత సవాలుగా మారొచ్చని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (కేఐఈ) ఒక నివేదికలో తెలిపింది.వ్యయాలను తగ్గించే కొత్త టెక్నాలజీలను వెనువెంటనే అందించేలా తమ సర్వీస్ పోర్ట్‌ఫోలియోలను పునర్‌వ్యవస్థీకరించుకోవడమనేది పెద్ద సంస్థలకు కాస్త సవాలుగా ఉంటుందని పేర్కొంది. వాటి భారీ పరిమాణమే ఇందుకు కారణమని వివరించింది. అదే మధ్య స్థాయి కంపెనీలు, దీర్ఘకాలికంగా వ్యూహాత్మక ప్రయోజనాలు పొందేందుకు స్వల్పకాలికంగా ఆదాయాన్ని పణంగా పెట్టేందుకు సాహసం చేయడానికి వీలుంటుందని వివరించింది. స్థిరమైన నాయకత్వం కూడా కంపెనీల పనితీరులో కీలక పాత్ర పోషిస్తోంది.చాలా మటుకు మధ్య స్థాయి కంపెనీల సీఈవోలు అయిదేళ్లకు పైగా కొనసాగుతుండటం వల్ల విజన్, ఎగ్జిక్యూషన్ నిలకడగా ఉంటోంది. పెద్ద కంపెనీల లీడర్‌షిప్‌లలో మాత్రం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023 జూన్‌లో టీసీఎస్ సీఈవోగా కె. కృతివాసన్ నియమితులు కాగా, 2023 డిసెంబర్లో టెక్ మహీంద్రాకు మోహిత్ జోషి, 2024 ఏప్రిల్‌లో విప్రోకు కొత్త సీఈవోగా శ్రీనివాస్ పల్లియా నియమితులయ్యారు.ఈసారీ జోరు .. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ చిన్న, మధ్య స్థాయి సంస్థల జోరు కొనసాగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. స్థిర కరెన్సీ ప్రాతిపదికన కోఫోర్జ్‌లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి 16.4 శాతం స్థాయి నుంచి 20.8 శాతానికి పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్డర్లు పెద్ద సంఖ్యలో లభిస్తుండటం, అలాగే డీల్స్ పరిమాణం కూడా భారీ స్థాయిలో ఉండటం ఇందుకు దోహదపడొచ్చని పేర్కొన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.56 బిలియన్ డాలర్ల మెగా డీల్ కుదుర్చుకున్న ఏకైక దేశీ కంపెనీగా కోఫోర్జ్ నిల్చిందని వివరించాయి.అమెరికాకు చెందిన సేబర్‌కు 13 ఏళ్ల పాటు సర్వీసులు అందించేందుకు ఈ కాంట్రాక్టు ఉపయోగపడనుంది. మరోవైపు, పెద్ద కంపెనీలే కాస్త అనిశ్చితి ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీల్స్ బాగానే ఉంటున్నా, అమెరికాలో టారిఫ్లపరమైన అనిశ్చితులు, డిస్క్రిషనరీ వ్యయాల విషయంలో క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం వంటి అంశాలతో స్థూలఆర్థిక పరిస్థితులపై ఆందోళన నెలకొనడం ఇందుకు కారణం.ఎఫ్‌ఎంసీజీలోనూ అదే తీరు.. నీల్సన్ఐక్యూ నివేదిక ప్రకారం వినియోగదారుల బడ్జెట్‌కి అనుగుణమైన ఉత్పత్తులను అందించడంలో పెద్ద బ్రాండ్లకు చిన్న బ్రాండ్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో ఇవి 17.8 శాతం మేర వృద్ధి సాధించాయి. మిడ్ సైజ్ సంస్థలు 14.6 శాతం మేర పెరిగాయి. దాదాపు రూ. 5 లక్షల కోట్ల దేశీ ఎఫ్ఎంసీజీ మార్కెట్లో చిన్న, మధ్య స్థాయి సంస్థల వాటా సుమారు 35 శాతం ఉంటుంది. లో బేస్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త మెరుగుపడటం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం తదితర అంశాలు వీటికి సానుకూలంగా నిల్చాయి.మరోవైపు, రూ. 5,000 కోట్లకు పైగా రెవెన్యూ ఉండే దిగ్గజాలు క్యూ4లో 6.4 శాతం మాత్రమే వృద్ధి కనపర్చాయి. బడా కంపెనీల ఉత్పత్తుల ధరలు 4.7 శాతం పెరగ్గా, అమ్మకాల పరిమాణం 1.7 శాతంగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ధరలు 0.3 శాతం తగ్గగా అమ్మకాల పరిమాణం ఏకంగా 8.1 శాతంగా నమోదైంది. నివేదిక ప్రకారం.. చిన్న ప్యాక్‌లు, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం దన్నుతో జనవరి–మార్చి త్రైమాసికంలో ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగం 11 శాతం వృద్ధి చెందింది. -
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
ముంబై: ప్రభుత్వరంగ కెనరా బ్యాంక్ రుణ రేట్లను తగ్గించింది. ఏడాది కాలపరిమితికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9% చేసినట్లు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీనితో వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు భారం తగ్గనుంది.ఇక, ఒకరోజు ఎంసీఎల్ఆర్ 8.20%, ఒక నెల, మూడు, ఆరు నెలల కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ 8.25% – 8.80 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కొత్త రేట్లు మే 12 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. ఆర్బీఐ గత నెల రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరుశాతానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
ఎస్బీఐ జనరల్ కొత్త ఇన్సూరెన్స్ పాలసీ
ముంబై: ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కొత్తగా ఎస్బీఐ జనరల్ ఫ్లెక్సీ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. సొంతిల్లు లేదా అద్దె ఇంటికి సంబంధించి సమగ్రమైన బీమా రక్షణను ఈ ప్లాన్ అందిస్తుందని ఎస్బీఐ జనరల్ తెలిపింది. కస్టమర్లు తమ అవసరాలకు అనుకూలంగా దీన్ని తీసుకోవచ్చని పేర్కొంది.ఇంట్లోని విలువైన వస్తువులతోపాటు.. ప్రత్యామ్నాయ వసతి కోసం అయ్యే వ్యయాలు, ఇంట్లో చోరీల నుంచి రక్షణ ఇలా అన్ని రకాల రక్షణలు ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉంటాయి. ఫైర్ కవర్ ఒక్కటి తప్పనిసరిగా ఉంటుంది. మిగిలినవి పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రీమియంతో 20 ఏళ్లకు రక్షణ పొందొచ్చని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. -
అందాలతో అలరిస్తూ.. వ్యాపారాలు పెంచుతూ..
తెలంగాణ రాష్ట్రం 2025 సంవత్సరానికిగాను మిస్ వరల్డ్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తుంది. మే 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. కేవలం ఇది ఒక ప్రతిష్ఠాత్మక అందాల పోటీ మాత్రమే కాదు. స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు దోహదపడే కార్యక్రమం. వినోదం, స్పాన్సర్‌షిప్‌లు, పర్యాటకం, డొనేషన్స్‌ను సమ్మిళితం చేసే శక్తివంతమైన ప్రపంచ వ్యాపార నమూనా. 130కిపైగా దేశాల నుంచి అందగత్తెలు, జడ్జీలు, కార్యక్రమాన్ని ఎండార్స్ చేసే కంపెనీల ప్రతినిధులు విచ్చేస్తారు. ఈ ఈవెంట్ చుట్టూ జరిగే వ్యాపార ధోరణులను విశ్లేషిద్దాం.స్పాన్సర్‌షిప్‌లు, బ్రాండ్ భాగస్వామ్యాలుఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ కంపెనీలతో సహా ప్రధాన బ్రాండ్లు గ్లోబల్ విజిబిలిటీ కోసం ఈ ఈవెంట్‌ను ఉపయోగించుకుంటున్నాయి. ప్రఖ్యాత కాస్మెటిక్ దిగ్గజాలు, ఆభరణాల డిజైనర్లు, లగ్జరీ ఫ్యాషన్ హౌజ్‌ల పోటీదారులు ఈవెంట్ సెగ్మెంట్లను స్పాన్సర్ చేస్తూ హై-ప్రొఫైల్ మార్కెటింగ్ అవకాశాన్ని అందుకోవచ్చు.బ్రాడ్‌కాస్టింగ్, మీడియా హక్కులుఈ అందాల పోటీని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసేందుకు ప్రత్యేక ప్రసార హక్కుల కోసం నెట్వర్క్ సంస్థలు పోటీ పడుతుంటాయి. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, పే-పర్-వ్యూ మోడల్స్, ప్రకటనలు, స్పాన్సర్షిప్ ఇంటిగ్రేషన్ల ద్వారా ఆదాయాన్ని సంపాదించవచ్చు.పర్యాటకంఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇతర దేశాల ప్రముఖులు హైదరాబాద్ రానున్నారు. దాంతో స్థానికంగా ఆతిథ్య రంగం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా సేవలు, స్థానిక వ్యాపారాలు గణనీయంగా ప్రయోజనం పొందుతాయి. స్థానిక పర్యాటకం, సాంస్కృతిక సంపదను అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఈ ఈవెంట్‌ను ఉపయోగించుకుంటారు.టికెట్ అమ్మకాలు, వీఐపీ ప్యాకేజీలుప్రీమియం సీటింగ్, లగ్జరీ అనుభవాలు, గాలా డిన్నర్లతో మిస్ వరల్డ్ ఈవెంట్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఇది టికెట్ ఆదాయానికి దోహదం చేస్తుంది. వీఐపీలు, స్పాన్సర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై భారీ జరిమానాబ్రాండ్ ప్రమోషన్మిస్ వరల్డ్ ఈవెంట్లో సుందరీమణులు ధరించే బ్రాండెడ్ దుస్తులు, యాక్సెసరీల ద్వారా కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కో-బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునేందుకు ఈ ఈవెంట్‌ను ఉపయోగించుకుంటారు. -
ఎస్బీఐ, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై భారీ జరిమానా
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిబంధనలు పాటించలేదనే కారణంతో ప్రముఖ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై జరిమానా విధించింది. ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడానికి, నిర్దేశించిన మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండేలా ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.బ్యాంకుల రుణాలు, అడ్వాన్స్‌లు, అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కస్టమర్ ప్రొటెక్షన్‌కు సంబంధించిన అంశాలు, కరెంట్ అకౌంట్ ఖాతాలు ఓపెన్ చేయడంలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. దాంతో ఎస్బీఐకి రూ.1.72 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.1 కోటి జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. ఈ జరిమానాలు బ్యాంకింగ్ రంగంలో మరింత జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి దిద్దుబాటు చర్యగా పనిచేస్తాయని పేర్కొంది.ఇదీ చదవండి: సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంబ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావంరెగ్యులేటరీ నిబంధనల అమలు ఆర్థిక సంస్థలపై ఆర్బీఐ కఠినమైన పర్యవేక్షణను ప్రతిబింబిస్తుంది. అంతర్గత నియంత్రణలను బలోపేతం చేయడానికి, కస్టమర్ రక్షణ యంత్రాంగాలను మెరుగుపరచడానికి బ్యాంకులను ప్రోత్సహిస్తుంది. ఈ చర్యలు ఇతర బ్యాంకులకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయని కొందరు భావిస్తున్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని, వాటిని పాటించడంలో లోపాలను నివారించాలని కోరుతున్నారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు సరిహద్దు రాష్ట్రాల్లోని తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇరు దేశాల పరస్పర దాడులకు ప్రతిస్పందనగా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఈవై ఇండియా సూచించింది. యుద్ధ కార్యకలాపాలు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ఎన్సీఆర్, ఛండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్‌లోని సిబ్బంది ఈ మేరకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.డెలాయిట్, కేపీఎంజీ, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా సహా ఇతర ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అత్యవసరం కాని ప్రయాణాలపై ఆంక్షలు విధించామని, సరిహద్దు రాష్ట్రాల్లోని ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే సూచించారు. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్లలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్ విధించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాస్మతి బియ్యం ధరల పెరుగుదలకు యుద్ధం కారణం..?సమస్యాత్మక జిల్లాల్లో తాత్కాలిక పాఠశాలల మూసివేతలు, విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన పలు డ్రోన్లు, క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి. -
దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సరఫరాకు ఒప్పందం
దీర్ఘకాలిక పునరుత్పాదక ఇంధన సరఫరా కోసం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఏఎం గ్రీన్ ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సీఐఎల్ సోలార్, పవన శక్తి ద్వారా ఏఎం గ్రీన్ ఉత్పత్తి చేయబోతున్న గ్రీన్ అమ్మోనియా సౌకర్యాలకు 4,500 మెగావాట్ల కార్బన్ రహిత శక్తిని సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఒప్పందంపై సీఐఎల్ జీఎం (ఈ అండ్ ఎం) సుదర్శన్ బోరా, ఏఎం గ్రీన్ బిజినెస్ డెవలప్మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శతన్షు అగర్వాల్ ఇరు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో సంతకాలు చేశారు.దేశవ్యాప్తంగా భారీ పునరుత్పాదక ఇంధన విస్తరణ జరపాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా గుజరాత్, రాజస్థాన్‌ల్లో సోలార్ పవర్ కెపాసిటీని 2,500 మెగావాట్ల నుంచి 3,000 మెగావాట్ల వరకు పెంచాలని నిర్ణయించారు. 1,500 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని 2,000 మెగావాట్లకు విస్తరించాలని చూస్తున్నారు. ఇందుకోసం దక్షిణ భారతదేశంలో అనువైన స్థలాలను అన్వేషిస్తున్నారు. ఈమేరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు రూ.25,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఏఎం గ్రీన్ ఈ పునరుత్పాదక శక్తిని పంప్డ్ హైడ్రో స్టోరేజీతో అనుసంధానిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ ఉత్పత్తి సౌకర్యాలకు స్థిరమైన గ్రీన్ ఎనర్జీ సరఫరాను ఇది నిర్ధారిస్తుంది. గ్రీన్కో గ్రూప్ ప్రమోటర్లు స్థాపించిన ఏఎం గ్రీన్ 2030 నాటికి ఏటా 5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక ఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్‌కు సమానం. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యంలో 20%గా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: ఐటీఆర్ దాఖలుకు 5 ప్రధాన అంశాలుఈ సందర్భంగా సీఐఎల్ సుస్థిరమైన ఎనర్జీని సరఫరా చేసేందుకు కట్టుబడి ఉందని సంస్థ ఛైర్మన్ పీ.ఎం.ప్రసాద్ తెలిపారు. భారతదేశ ఇంధన తయారీలో బొగ్గు కీలక భాగంగా ఉన్నప్పటికీ, సీఐఎల్ గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈమేరకు కంపెనీ చురుకుగా పనిచేస్తోందని పేర్కొన్నారు. గ్రీన్కో అండ్ ఏఎం గ్రీన్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి ఈ ప్రాజెక్టుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఇతర గ్రీన్ మాలిక్యూల్స్ తయారీలో గణనీయంగా ఖర్చు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్-ఫ్రీ, పునరుత్పాదక ఇంధన సరఫరాదారుగా ఉన్న సీఐఎల్తో జతకట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్‌ను వెంటనే నిలిపేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ప్రస్తుతానికి వారం రోజులపాటు లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి మ్యాచ్‌లకు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్ 2025ను నిలిపివేయడం ప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లలో ఆందోళనలకు కారణమవుతుంది. ప్రకటనల ఆదాయంలో 35% తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. లీగ్ వాయిదా పడడం వల్ల మార్కెటింగ్ ప్రణాళికలకు అంతరాయం కలిగినట్లు తెలియజేస్తున్నారు.బ్రాడ్కాస్టర్లు, బ్రాండింగ్ కంపెనీల ఆందోళనభారతదేశంలో అత్యంత లాభదాయకమైన క్రీడా ఈవెంట్లలో ఐపీఎల్ ఒకటి. ఇది మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షిస్తోంది. భారీ ప్రకటనల ఆదాయాన్ని సృష్టిస్తోంది. మార్కెటింగ్ కీలకంగా మారిన ఈ లీగ్ పునఃప్రారంభించకపోతే జియోహాట్‌స్టార్ వంటి బ్రాడ్కాస్టర్లు రూ.2,000 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. చాలా బ్రాండ్లు ఐపీఎల్ వాణిజ్య ప్రకటనల కోసం గణనీయంగా బడ్జెట్ కేటాయించాయి. అధిక వ్యూయర్షిప్ ద్వారా రాబడిని పెంచాలని నిర్ణయించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారు తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని నివారించడానికి కొత్త వ్యూహాలతో ముందుకుసాగాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.జట్లు, ఫ్రాంచైజీలపై ప్రభావంప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లకు మించి ఈ వాయిదా నిర్ణయం నేరుగా ఐపీఎల్ ఫ్రాంచైజీలపై ప్రభావం చూపుతుంది. సెంట్రల్ రెవెన్యూ పూల్‌పై ఆధారపడే జట్లు తమ సంపాదనలో 20% క్షీణతను చూడవచ్చని కొందరు అంటున్నారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో అనిశ్చితి కారణంగా అనేక ఫ్రాంచైజీలు స్పాన్సర్షిప్లను, టిక్కెట్ల అమ్మకాల ద్వారా సమకూరే ఆదాయాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఇండియా-యూఎస్ వయా యూరప్భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో లీగ్ నిలిపివేతకు జాతీయ ప్రయోజనాలే కారణమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పేర్కొంది. తొలుత వారం రోజుల విరామం ప్రకటించినప్పటికీ, అప్పటివరకు యుద్ధం సమసిపోనట్లయితే ఇది మరింతకాలం పోడిగించే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యం అయితే లీగ్‌ను రద్దు చేసుకోవచ్చని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. -
ఏటీఎంల మూసివేత వదంతులు.. బ్యాంకుల స్పష్టత
భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఏటీఎంలను మూసివేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఖండించాయి. ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో సజావుగానే పని చేస్తున్నాయని, వాటిలో తగినన్ని నగదు నిల్వలు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశాయి. డిజిటల్ సేవలు కూడా సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి.‘మా ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, డిజిటల్ సేవలు అన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి‘ అని ఎస్బీఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ధ్రువీకరించుకోకుండా ఏ వార్తలను విశ్వసించొద్దంటూ కస్టమర్లకు సూచించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మొదలైనవి కూడా ఇదే తరహా మెసేజీలను పోస్ట్ చేశాయి.కాగా ఏటీఎంల మూసివేత అంటూ వచ్చిన వార్తా కథనాలను ప్రభుత్వ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం తనిఖీ చేసి అవి పూర్తిగా ఫేక్ అని తేల్చేసింది. భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలోని ఏటీఎంలపై రాన్సమ్వేర్ దాడి కారణంగా మూడు రోజులపాటు సర్వీసులు పని చేయవన్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వచ్చాయి. -
ఎల్ఐసీ కొత్త సర్వీసు.. వాట్సాప్ నుంచే..
ప్రభుత్వ రంగ భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపులు మరింత సులభతరంగా మారాయి. పాలసీల ప్రీమియంను వాట్సాప్ నుంచే సులభంగా చెల్లించే సదుపాయాన్ని ఎల్ఐసీ ప్రారంభింంది. ఎల్ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న పాలసీదారులు.. 8976862090 వాట్సాప్ నంబర్ ద్వారా తమ పాలసీలకు సంబంధిం చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు తెలుసుకోవచ్చు.అక్కడి నుంచే నేరుగా యూపీఐ/నెట్‌బ్యాంకింగ్/కార్డు ద్వారా ప్రీమియం చెల్లింపులు చేయొచ్చని ఎల్ఐసీ ప్రకటించింది. రశీదును సైతం పొందొచ్చని పేర్కొంది. కొత్త సదుపాయం ద్వారా పాలసీదారులు ఉన్న చోట నుంచే చెల్లింపులు చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి తెలిపారు. ఎల్ఐసీ పోర్టల్‌పై ఇప్పటి వరకు 2.2 కోట్ల మంది పాలసీదారులు రిజిస్టర్ చేసుకుని ఉండగా, వీరందరికీ నూతన సేవ సౌకర్యాన్ని ఇవ్వనుంది. -
స్టార్టప్‌లకు మరింత సాయం
న్యూఢిల్లీ: ‘క్రెడిట్ గ్యారంటీ స్కీమ్’ (సీజీఎస్) సవరణతో స్టార్టప్‌లకు రుణ వితరణ సులభతరం అవుతుందని.. పరిశోధన, అభివృద్ధికి (ఆర్అండ్డీ) మరింత ఆర్థిక సాయం లభిస్తుందని, గొప్ప టెక్నాలజీ ఆవిష్కరణకు ఊతం లభిస్తుందని కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) పేర్కొంది. సవరించిన సీజీఎస్ఎస్కు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో ఒక్కో స్టార్టప్‌కు హామీతో కూడిన రుణ వితరణ పరిమితి రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరిగింది. ఇదంతా కూడా హామీలేని రుణమే. ‘‘ఈ పథకం విస్తరణతో స్టార్టప్‌లకు రుణ వితరణ రిస్‌్కలు మరింత తగ్గుతాయి. ఆర్అండ్డీ, ప్రయోగాలు, అత్యాధునిక ఆవిష్కరణలు, సాంకేతికతలను సృష్టించడానికి కావాల్సిన ఆర్థిక మద్దతు లభిస్తుంది’’అని డీపీఐఐటీ ప్రకటించింది. స్టార్టప్‌కు ఇచ్చే రుణాలు రూ.10 కోట్ల వరకు ఉంటే వాటికి ప్రభుత్వ హామీ 85 శాతంగా, అంతకుమించిన రుణాలకు 75 శాతంగా ఉంటుందని తెలిపింది. దేశంలో స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా 2016 జనవరి 16న కేంద్రం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టడం తెలిసిందే. ఇందులో భాగంగానే 2022 అక్టోబర్ 6న సీజీఎస్ఎస్ పథకాన్ని తీసుకొచి్చంది. స్టార్టప్‌లకు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్బీఎఫ్సీలు మంజూరు చేసే రుణ సదుపాయాలకు నిర్దేశిత మేర ప్రభుత్వం హామీ కల్పించింది. ఈ ఏడాది జనవరి నాటికి 1.61 లక్షల స్టార్టప్‌లను ప్రభుత్వం గుర్తించడం గమనార్హం. -
వాటా విక్రయానికి యస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ)సహా పలు ప్రయివేట్ రంగ బ్యాంకులు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న యస్ బ్యాంక్‌లో కొంతమేర వాటా విక్రయించనున్నాయి. తద్వారా జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) మొత్తం 20 శాతం వాటా సొంతం చేసుకోనుంది. ఒక్కో షేరుకి రూ. 21.50 ధరలో ఇందుకు రూ. 1,483 కోట్లు వెచ్చించనుంది. వెరసి దేశీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద లావాదేవీగా ఈ వాటా విక్రయం నమోదుకానున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఎస్ఎంబీసీకి యస్ బ్యాంక్‌లో 13.19 శాతం వాటా ఎస్బీఐ విక్రయించనుంది. డీల్ విలువ రూ. 8,889 కోట్లు. ఈ బాటలో ఇతర బ్యాంకులు యాక్సిస్, బంధన్, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా ఉమ్మడిగా 6.81 శాతం వాటా అమ్మనున్నాయి. వీటి విలువ రూ. 4,594 కోట్లు. ఫలితంగా యస్ బ్యాంక్‌లో అతిపెద్ద వాటాదారుగా ఎస్ఎంబీసీ అవతరించనుంది. 2020 మార్చిలో యస్ బ్యాంక్ పునర్నిర్మాణ పథకంలో భాగంగా 2020 మార్చిలో ఎస్బీఐసహా 7 ప్రయివేట్ రంగ బ్యాంకులు ఇన్వెస్ట్ చేశాయి. సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(ఈసీసీబీ) యస్ బ్యాంక్‌లో 13.19 శాతం వాటాకు సమానమైన 413.44 కోట్ల షేర్లను విక్రయించేందుకు అనుమతించినట్లు ఎస్బీఐ పేర్కొంది. యస్ బ్యాంక్‌లో ప్రస్తుతం ఎస్బీఐ 24 శాతం వాటా కలిగి ఉంది. 13 శాతంపైగా వాటా అమ్మకం ద్వారా రూ. 8,889 కోట్లు అందుకోనుంది. ఇతర బ్యాంకులలో హెచ్డీఎఫ్సీ 2.75 శాతం, ఐసీఐసీఐ 2.39 శాతం, కొటక్ మహీంద్రా 1.21 శాతం, యాక్సిస్ 1.01 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ 0.92 శాతం, ఫెడరల్ 0.76 శాతం, బంధన్ 0.7 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. తదుపరి దశ వృద్ధికి తాజా లావాదేవీ దోహదపడనున్నట్లు యస్ బ్యాంక్ ఈ సందర్భంగా పేర్కొంది. కాగా.. ఇందుకు ఆర్బీఐ, సీసీఐ తదితర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది. టాప్–2లో జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థ ఎస్ఎంబీసీ 2 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. తద్వారా జపాన్‌లో రెండో పెద్ద బ్యాంకింగ్ కార్పొరేషన్‌గా నిలుస్తోంది. దేశీయంగా ప్రధాన విదేశీ బ్యాంకులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా సొంత అనుబంధ సంస్థ, డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీ.. ఎస్ఎంఎఫ్జీ ఇండియా క్రెడిట్ కంపెనీని నిర్వహిస్తోంది. వాటా చేతులు మారుతున్న వార్తలతో యస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 10 శాతం జంప్‌చేసి రూ. 20 వద్ద ముగిసింది. -
మొదలైన రెండో దశ హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్: వివరాలు
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL)కు చెందిన సీఎస్ఆర్ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ (HMIF), తన హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ చొరవ ద్వారా నంద్యాల జిల్లాలోని 115 చెంచు గిరిజన కుటుంబాలను జీవనాధార వ్యవసాయం నుంచి స్థిరమైన వ్యవసాయ అటవీప్రాంతానికి మార్చడం ద్వారా వారికి సాధికారత కల్పించింది.అక్టోబర్ 2022లో హ్యుందాయ్ ప్రారంభించిన ఈ చొరవ స్థిరమైన వ్యవసాయ అటవీప్రాంతం, భూమి, నీటి నిర్వహణ & సామర్థ్య నిర్మాణ జోక్యాలను సమగ్రపరచడం ద్వారా నంద్యాల జిల్లాలోని చెంచు లక్ష్మీ గూడెం, నరపురెడ్డి కుంట, బైర్లూటీ, నాగలూటీ గ్రామాలలో విస్తరించి ఉన్న చెంచు కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచింది.మొదటి దశలో.. బోరు బావులు, బిందు సేద్యం ద్వారా ఉద్యానవన తోటలను అభివృద్ధి చేయడానికి సంహరించింది. ఇందులో భాగంగానే ఆదాయ ఉత్పత్తి కోసం మొత్తం 250 ఎకరాల భూమిని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో అటవీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి.. పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించింది. దీంతో వారి ఆదాయం కూడా పెరిగింది.నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని 20 గ్రామాలలోని గిరిజన.. అణగారిన కుటుంబాలకు పర్యావరణం & స్థిరమైన జీవనోపాధిని అందించడానికి దాని ఆగ్రోఫారెస్ట్రీ చొరవ రెండవ దశను హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ ఈ రోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ITDA) అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏజీ నాయక్, ఐటీడీఏ డివిజనల్ హార్టికల్చర్ ఆఫీసర్ కే. చందన.. HMIF అధికారులు ప్రాజెక్ట్ నేమ్ బోర్డును ఆవిష్కరించి.. లబ్ధిదారులకు మొక్కలను అందజేశారు. -
ఇండియా-యూఎస్ వయా యూరప్
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడం ఎయిరిండియాకు కొత్త రూట్లలో తమ కార్గో విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది. కార్గో సర్వీసుల్లో భాగంగా యూరప్ మీదుగా యూఎస్, కెనడాకు విమానాలను నడపవలసి వస్తుంది. అయితే పాకిస్థాన్ మీదుగా కాకుండా చుట్టూ తిరిగి అమెరికా వెళ్తుండడంతో కార్గో రవాణాకు ఎక్కువ సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఫలితంగా ఇంధన వినియోగం పెరుగుతున్నట్లు పేర్కొంది. అందుకు కొన్ని నాన్‌స్టాప్ విమానాలు, వన్-స్టాప్ విమానాలను నడుపుతున్నట్లు చెప్పింది.ఆపరేషనల్ మార్పులుముంబై-న్యూయార్క్ విమాన సర్వీసులను నాన్ స్టాప్ సర్వీసులకు పునరుద్ధరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీ-అమెరికా/కెనడా విమానాలు వియన్నా లేదా కోపెన్ హాగన్‌లో ఇంధనం నింపుకుంటున్నాయని చెప్పింది. ఢిల్లీ-యూఎస్ మార్గంలో నాన్‌స్టాప్ విమానాల్లో ఇంధనం సాధారణంగా 90-130 టన్నుల వరకు ఖర్చవుతుంది. కానీ వన్-స్టాప్ విమానాలు ఈ ఇంధన భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దాంతోపాటు ఎక్కువ సరుకు రవాణాకు వీలుంటుంది.కార్గో సామర్థ్యం పెంపుయూరప్గుండా ప్రయాణించే వన్-స్టాప్ విమానాలు నాన్‌స్టాప్ విమానాల కంటే 2-3 రెట్లు అధికంగా కార్గోను మోసుకెళ్లగలవని కంపెనీ తెలిపింది. దాంతో ఈమేరకు కొన్ని నాన్‌స్టాఫ్, నాన్ స్టాఫ్ విమానాలను నడుపుతున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?పెరుగుతున్న మామిడి ఎగుమతులుదేశంలో ఉత్పత్తవుతున్న మామిడి ఎగుమతులు పెరుగుతున్నాయి. దాంతో కార్గో అవసరాలు అధికమయ్యాయి. గత వారం ఎయిరిండియా వన్ స్టాప్ విమానాల ద్వారా 20 టన్నుల మామిడిని అమెరికాకు ఎగుమతి చేశారు. ఈ సీజన్లో తమ సంస్థ ఇప్పటికే 350 టన్నుల మామిడి పండ్లను రవాణా చేసిందని కేబీ ఎక్స్‌పోర్ట్స్ సీఈఓ కౌశల్ కఖర్ పేర్కొన్నారు. జూన్ నాటికి ఇది 1,200 టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. రీ-రూట్ చేసిన కొన్ని సంస్థల విమానాలు వాటి ప్రయాణాల్లో అసౌకర్యాన్ని ఎదుర్కొంటుండగా, ఎయిరిండియా కార్గో ఆదాయాన్ని పెంచుకోవడానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది. -
పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై టెన్షన్.. ఆయిల్ కంపెనీ క్లారిటీ
భారత్-పాకిస్థాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత వస్తుందేమోనన్న ఆందోళనతో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను ముందే కొని నిల్వ చేసుకునేందుకు దేశంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూ కడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) స్పష్టత ఇచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.ఈ మేరకు ఐఓసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఒక పోస్ట్ చేసింది. "భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంధనం, ఎల్పీజీ మా అన్ని అవుట్లెట్లలో సమృద్ధిగా అందుబాటులో ఉంది" అని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్ వద్ద ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, తమ సరఫరా మార్గాలు సజావుగా పనిచేస్తున్నాయని తెలిపింది. వినియోగదారులు అనవసర ఆందోళనతో పెట్రోల్ బంక్‌లకు పోటెత్తవద్దని సూచించింది.ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ భయాందోళనలు నెలకొన్నాయి.#IndianOil has ample fuel stocks across the country and our supply lines are operating smoothly.There is no need for panic buying—fuel and LPG is readily available at all our outlets.Help us serve you better by staying calm and avoiding unnecessary rush. This will keep our…— Indian Oil Corp Ltd (@IndianOilcl) May 9, 2025 -
సరిహద్దు రాష్ట్రాల్లోనే భారీగా బ్యాంకు డిపాజిట్లు..
భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ పరిస్థితులు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నాయి. పాకిస్తాన్‌పై ఓవైపు మెరుపుదాడులతో విరుచుకుపడుతూనే మరోవైపు సరిహద్దు వెంబడి ఆ దేశం చేస్తున్న దాడులను భారత్ సైనిక దళాలు తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వం హై అలర్ట్ కొనసాగుతోంది. అయితే ఈ సరిహద్దు రాష్ట్రాల్లోనే గణనీయమైన డిపాజిటర్ బేస్ ఉండటంతో బ్యాంకింగ్ రంగం ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుంది.జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తాజా గణాంకాల ప్రకారం.. భారతదేశ మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 12.81 శాతం అంటే రూ .26.21 లక్షల కోట్లు ఆ అయిదు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. ఇక అప్పుల విషయానికి వస్తే మొత్తం అడ్వాన్సులలో 13.41 శాతం అంటే రూ .22.13 లక్షల కోట్లు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి.జమ్ముకశ్మీర్‌లో..ఘర్షణకు కేంద్ర బిందువైన కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అస్థిర నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)తో సహా పాకిస్థాన్‌తో 3,323 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. జమ్ముకశ్మీర్ బ్యాంకుల్లో రూ.1.49 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇవి దేశ డిపాజిట్లలో 0.73 శాతం. అడ్వాన్సులు రూ .73,879 కోట్లు. మొత్తం అడ్వాన్స్లలో 0.45 శాతం.పంజాబ్‌లో..భారత్‌లో మరో ముఖ్యమైన సరిహద్దు రాష్ట్రం పంజాబ్. ఇది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ తో 547 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. దేశంలోని మొత్తం డిపాజిట్లలో 3 శాతం అంటే రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఈ రాష్ట్రం నుంచి ఉన్నాయి. ఇక రూ.5.35 లక్షల కోట్ల మేర (3.24 శాతం) రుణాలను ఇక్కడి బ్యాంకులు వితరణ చేశాయి.రాజస్థాన్పాకిస్థాన్ లోని సింధ్, పంజాబ్ ప్రావిన్సుల వెంబడి 1,035 కిలోమీటర్ల ఎడారి సరిహద్దు కలిగిన రాజస్థాన్ లో రూ.6.98 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు (3.41 శాతం), రూ.6.25 లక్షల కోట్లు (3.79 శాతం) అడ్వాన్సులు ఉన్నాయి.గుజరాత్సర్ క్రీక్, రాన్ ఆఫ్ కచ్ వెంబడి పాకిస్తాన్ తో 508 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్ ఈ రాష్ట్రాలలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంది. ఇక్కడి బ్యాంకుల్లో రూ.10.8 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు (5.27 శాతం), రూ.9.45 లక్షల కోట్లు (5.73 శాతం) రుణాలు ఉన్నాయి.హిమాచల్ ప్రదేశ్పాకిస్తాన్ తో నేరుగా సరిహద్దును పంచుకోనప్పటికీ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లకు దగ్గరగా ఉండటం వల్ల హిమాచల్ ప్రదేశ్ కూడా ఉద్రిక్తతల వలయంలో ఉంది. దేశ డిపాజిట్లలో 0.4 శాతం అంటే రూ.81,840 కోట్లు, అడ్వాన్సుల్లో 0.2 శాతం అంటే రూ.32,736 కోట్లు ఇక్కడి బ్యాంకులకు ఉన్నాయి. -
ఐటీలో ఒక్కో ఉద్యోగి వల్ల ఆదాయం ఎంతంటే..
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో 2025 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతి ఉద్యోగి ద్వారా సమకూరే ఆదాయం(రెవెన్యూ పర్ ఎంప్లాయి-ఆర్పీఈ) పెరిగింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల ద్వారా సమకూరే ఆదాయం ఏడేళ్ల గరిష్టాన్ని తాకినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. మెరుగైన వనరుల వినియోగం, ఆటోమేషన్, కార్యాచరణ సామర్థ్యాల ద్వారా ఇది సాధ్యమైందని కంపెనీలు తెలిపాయి. కాగా, ఇటీవల సంస్థల త్రైమాసిక లాభాలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఒక్కో ఉద్యోగి ద్వారా 2024-25లో ఏయే సంస్థకు ఎంత సమకూరిందో కింద తెలుసుకుందాం.టీసీఎస్: 49,638 డాలర్లు(సుమారు రూ.41.67 లక్షలు) గతేడాది కంటే ఇది 2.7 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్టాన్ని చేరింది. టీసీఎస్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 6,07,979.ఇన్ఫోసిస్: 59,575 డాలర్లు(సుమారు రూ.50 లక్షలు). గతంలో కంటే 1.8% పెరిగి ఏడేళ్ల గరిష్టానికి చేరింది. ఇన్ఫోసిస్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 3,17,240.హెచ్‌సీఎల్ టెక్: 61,946 డాలర్లు (సుమారు రూ.51.9 లక్షలు). గతంలో కంటే 6.2% పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 2,27,000.విప్రో, టెక్ మహీంద్రా రెండూ ఆర్‌పీఈలో క్షీణతను నమోదు చేశాయి.క్రమబద్ధీకరించిన కార్యకలాపాలు, సమర్థవంతంగా ప్రాజెక్ట్‌ల అమలు, అధునాతన ఆటోమేషన్ వ్యూహాల కారణంగా ఆర్‌పీఈలో మెరుగుదల కనిపించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, లేఆఫ్స్ పేరుతో ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగులను తొలగించడంతోనే కంపెనీలకు ఇలా ఆర్పీఈ పెరిగినట్లు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?కంపెనీలకు లాభాలు ఉన్నప్పటికీ ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ రంగం సవాళ్లు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఐటీ సేవలకు డిమాండ్ మందగించడం, వ్యయ ఒత్తిళ్లు, లేఆఫ్స్ ఆందోళనలు భవిష్యత్ రాబడులపై ప్రభావం చూపనున్నాయని కొందరు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలతో ఐటీ సంస్థలు స్కిల్ డెవలప్మెంట్, ఆటోమేషన్, కాస్ట్ ఎఫిషియెన్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. -
60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?
శరవేగంగా మారుతున్న భారత కార్పొరేట్ ప్రపంచంలో 60 ఏళ్ల వరకు హాయిగా పనిచేయాలనే ఆలోచన మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. ఈ రోజుల్లో వృత్తి నిపుణులు పని వాతావరణంలో చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దాంతో యువ ఉద్యోగుల్లో 45 ఏళ్లు వచ్చేవరకే రిటైర్ అవ్వాలనే ధోరణి పెరుగుతోంది. అయితే ఇది ఆదోళన కలిగించే అంశమని కొందరు నిపుణులు భావిస్తున్నారు.ఈ సందర్భంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, అడ్వైజర్ సార్థక్ అహుజా మాట్లాడుతూ..‘ఉద్యోగుల్లో ఈ మార్పు వాస్తవమే. ఇది ఆందోళన కలిగించే అంశం. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 45 ఏళ్లకు మారుతుండడంతో భారతీయ కార్పొరేట్లలో ఆందోళన కలిగించే అంశం. ఇది మంచి పద్ధతి కాదు. లీగల్ లేదా వైద్యం వంటి రంగాల్లో పని చేస్తున్న వృత్తి నిపుణుల వయసు పెరిగే కొద్దీ ఎక్కువ గౌరవం, అధిక వేతనం అందుతాయి. అదే సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్, టెక్ వంటి కార్పొరేట్ ఉద్యోగాలు ఇందుకు పూర్తి విరుద్ధం. వయసు పెరిగేకొద్దీ పనితీరు కాస్త తగ్గుతుంది. కొత్త టెక్నాలజీలకు అలవాటుపడే మనస్తత్వం ఉండదు. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ముఖ్యంగా టెక్నాలజీ వంటి విభాగాల్లో 40 ఏళ్ల పైబడినవారు పనికిరారని చాలా కంపెనీలు భావిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువ‘40 ఏళ్లు పైబడినవారు నైపుణ్యం లేనివారు కాదు. వారు యువ ప్రతిభావంతుల మాదిరి చురుకుగా ఉండకపోవచ్చు. కానీ వారి అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా కంపెనీలు వీరిని పూర్తిగా తొలగించడం లేదు. అయితే కంపెనీల్లో కొత్త విభాగాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మాత్రం వీరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లు పైబడిన వారికి మెరుగైన నైపుణ్యాలు ఇచ్చేందుకు అప్ స్కిల్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది’ అని అహుజా వివరించారు. -
విమానాశ్రయాల్లోకి నో ఎంట్రీ.. నిజమేనా?
ఢిల్లీ: భారత్-పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనేక ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో ఒకటే ఎయిర్ పోర్టుల్లోకి నో ఎంట్రీ వార్త. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లోకి ప్రవేశంపై నిషేధం విధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఒక పోస్ట్ చేసింది. "ఫేక్ న్యూస్ అలర్ట్. భారతదేశం అంతటా విమానాశ్రయాల్లోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయి. ఆ వార్తులు ఫేక్. ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు" అని పేర్కొంది.ఎయిర్‌పోర్టులకు ముందే చేరుకోవాలిభద్రతా తనిఖీల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం మూడు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని పలు విమానయాన సంస్థలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రభుత్వం ఆమోదించిన ఫోటో ఐడీ కార్డులను వెంట తీసుకెళ్లాలని సూచించాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాలలో మెరుగైన భద్రతా చర్యల కారణంగా, ప్రయాణానికి కనీసం 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ఆకాాశ ఎయిర్ లైన్స్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. స్పైస్ జెట్ కూడా ఇదే విధమైన అడ్వైజరీని జారీ చేసింది. 🛑 Fake News AlertSocial media posts are claiming that entry to airports across India banned#PIBFactCheck:❌ This claim is #FAKE✅ Government has taken no such decision pic.twitter.com/MoaUcQqO2d— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025 -
సాయుధ దళాల వీరత్వానికి గర్విస్తున్నా: ముఖేష్ అంబానీ
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలను చూసి గర్విస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ డి అంబానీ పేర్కొన్నారు. భారతదేశం అన్ని రకాల ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిలుస్తుందని ఆయన తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహసోపేతమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో, భారత సాయుధ దళాలు సరిహద్దు అవతలి నుండి వచ్చే ప్రతి రెచ్చగొట్టే చర్యకు కచ్చితత్వం, అసమాన శక్తితో ప్రతిస్పందించాయని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడంలో భాగంగా రిలయన్స్ కుటుంబం ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. -
ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 45 శాతం క్షీణించి రూ. 701 కోట్లకు పరిమితమైంది. డిమాండ్ తగ్గడంతోపాటు, పోటీ తీవ్రత ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,275 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 8,731 కోట్ల నుంచి రూ. 8,359 కోట్లకు స్వల్పంగా(4 శాతం) వెనకడుగు వేసింది. మొత్తం వ్యయాలు రూ. 7,277 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 20.55 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. విదేశీ అమ్మకాలు వీక్ క్యూ4లో ఇతర ఆదాయంతో కలిపి ఏషియన్ పెయింట్స్ మొత్తం టర్నోవర్ 5 శాతం తక్కువగా రూ. 8,459 కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలు 2 శాతం నీరసించి రూ. 800 కోట్లకు పరిమితమయ్యాయి. ఇథియోపియా, ఈజిప్్టలలో కరెన్సీ విలువ క్షీణించడం, బంగ్లాదేశ్‌లో ఆర్థిక సవాళ్లు ఇందుకు కారణమైనట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 1.3 శాతం బలహీనపడి రూ. 2,303 వద్ద ముగిసింది. -
జీ ఎంటర్టైన్మెంట్ పటిష్ట పనితీరు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024–25) మార్చి త్రైమాసికంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ పటిష్ట పనితీరు చూపించింది. నికర లాభం ఎన్నో రెట్ల వృద్ధితో రూ.188 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి లాభం కేవలం రూ.13 కోట్లుగానే ఉంది. వ్యయ నియంత్రణకు తీసుకున్న సమర్థవంతమైన చర్యలు ఫలితమిచ్చాయి. ఆదాయం కేవలం 1.6 శాతం వృద్ధితో రూ.2,185 కోట్ల నుంచి రూ.2,220 కోట్లకు చేరింది. సబ్స్క్రిప్షన్ ఆదాయం, ఇతర అమ్మకాలు, సేవలు మార్చి త్రైమాసికంలో వృద్ధిని నడిపించినట్టు కంపెనీ తెలిపింది.ప్రకటనల వాతావరణం బలహీనంగా ఉన్నప్పటికీ లాభదాయకత పెంచుకున్నట్టు పేర్కొంది. ప్రకటనల ఆదాయం 27 శాతం తగ్గిపోయింది. జీ సినీ అవార్డుల కార్యక్రమం వాయిదా వేయడం, క్రీడలతో కూడిన రద్దీ కేలండర్‌ను కారణాలుగా తెలిపింది. సబ్‌్రస్కిప్షన్ ఆదాయం 4 శాతం పెరిగి రూ.986 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు 4.2 శాతం తగ్గి రూ.1,958 కోట్లకు పరిమితమయ్యాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు 1 శాతానికి పైగా లాభపడి రూ.111 వద్ద ముగిసింది. -
Operation Sindoor: వెనక్కి తగ్గిన రిలయన్స్.. ట్వీట్ వైరల్
ఆపరేషన్ సిందూర్ కోసం రిలయన్స్ కంపెనీ ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేసిందని వస్తున్న వార్తలపై సంస్థ స్పందించింది. ''ఆపరేషన్ సిందూర్'' అనే పదాన్ని ట్రేడ్‌మార్క్ చేసే ఉద్దేశ్యం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ అయిన జియో స్టూడియోస్ అనుమతి లేకుండా ఒక జూనియర్ వ్యక్తి అనుకోకుండా దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్.. దాని వాటాదారులందరూ చాలా గర్వంగా ఉన్నారు. ఉగ్రవాదం అనే దుష్టత్వానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న రాజీలేని పోరాటమే ఈ ''ఆపరేషన్ సిందూర్" అని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: నెలకు వారం రోజులే పని: ఏడాదికి రూ.66 లక్షల సంపాదనఉగ్రవాదంపై పోరాడుతున్న భారత ప్రభుత్వానికి, సాయుధ దళాలకు రిలయన్స్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇండియా ఫస్ట్ అనే నినాదానికి మేము కట్టుబడి ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది.ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తులుమే 7న ఉదయం 10:42 గంటల నుంచి సాయంత్రం 6:27 గంటల మధ్య, 'ఆపరేషన్ సిందూర్' కోసం నాలుగు వేర్వేరు ట్రేడ్‌మార్క్ దాఖలు అయ్యాయి. ఇందులో రిలయన్స్ మాత్రమే కాకుండా.. ముంబై నివాసి ముఖేష్ చెత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెర్హ్, ఢిల్లీలోని న్యాయవాది అలోక్ కొఠారి ఉన్నారని బార్ అండ్ బెంచ్ నివేదించింది. అయితే ఇప్పుడు ట్రేడ్‌మార్క్ దాఖలు రిలయన్స్ కంపెనీ ఉపసంహరించుకుంది. మిగిలినవాళ్లు ఉంసంహరించుకున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.Media StatementReliance Industries has no intention of trademarking Operation Sindoor, a phrase which is now a part of the national consciousness as an evocative symbol of Indian bravery.Jio Studios, a unit of Reliance Industries, has withdrawn its trademark application,…— Reliance Industries Limited (@RIL_Updates) May 8, 2025 -
నెలకు వారం రోజులే పని: ఏడాదికి రూ.66 లక్షల సంపాదన
నెల మొత్తం పనిచేసినా జీతాలు సరిగ్గా ఇవ్వని సంస్థలు చాలానే ఉన్నాయి. అయితే నెలకు కేవలం వారం రోజులు మాత్రమే పనిచేస్తూ.. ఓ వ్యక్తి ఏడాదికి 66 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.నేను సంవత్సరానికి రూ. 66 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. ఉద్యోగం విషయంలో చాలా ఖచ్చితంగా, సమర్థవంతంగా ఉంటాను. అయితే నెలకు వారం రోజులు మాత్రమే పనిచేస్తాను. మిగిలిన సమయం మొత్తం టీవీ షోలు చూడటం, పాడ్‌కాస్ట్‌లు వంటివి చూడటం వంటివి చూస్తానని రెడ్దిట్ యూజర్ పేర్కొన్నాడు.నేను ఉద్యోగంలో చేరినప్పుడు చాలా వెనుకబడి ఉండేవాడిని. ఆ తరువాతనే అన్నీ నేర్చుకున్నాను. పనిచేయడం వేగంగా నేర్చుకున్నాను. నేను నిమిషానికి 75 పదాలు టైప్ చేయగలిగాను. ఎటువంటి తప్పులు లేకుండా పనిచేయగలిగాను. నా పనికి సంబంధించి ఎవరూ కంప్లైంట్స్ చేయలేదు. నేను మా కంపెనీలో బెస్ట్ ఎంప్లాయిగా నిలిచాను. క్లయింట్లతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. నా పనిని నేనే పూర్తి చేస్తాను. అయితే వారం రోజులు మాత్రమే పనిచేస్తానని ఆ వ్యక్తి స్పష్టం చేసాడు.నేను కూడా ఒకప్పుడు చాలా చదివేవాడిని. ఒక సంవత్సరంలో 200 పుస్తకాలు చదివాను. నాకు ఇష్టమైన ప్రతి అంశంపై లోతుగా పరిశోధన చేసాను. మరి ఇప్పుడు.. నాకు బోర్ కొడుతోంది. ప్రతిదీ సరిగ్గా చేయడం మంచిదని నేను అనుకున్నాను. తక్కువ పనిలోనే ఎక్కువ సాధిస్తున్నాను. అయితే ఏదో ఒక విధంగా నేను కష్టపడుతున్నప్పుడు కంటే ఇప్పుడు అధ్వాన్నంగా ఉన్నాను. ఇది సరైనది కాదని చెప్పాడు.ఇదీ చదవండి: రైల్వే టికెట్‌తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలుఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు మా పరిస్థితి కూడా ఇలాగే ఉందని అన్నారు. ఇంకొందరు పనిలో తీరిక లేకుండా పోతోందని నిరాశను వ్యక్తం చేశారు. -
‘హిందీ నేర్చుకుని ఉంటే రూ.లక్ష కోట్లు సంపాదించేవాడిని’
దేశ టెలికం పరిశ్రమలో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన పారిశ్రామికవేత్త ఆయన. సొంతంగా రెండు ఐలాండ్లు.. విదేశాలలో వందల కోట్ల విలువైన విలాస భవనాలతో రాజభోగం అనుభవించిన ఎయిర్‌సెల్ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తర్వాత కాలం కలిసిరాక నష్టాలలో కూరుకుపోయి దివాళా తీశారు. జీవితంలో ప్రతిఒక్కరికీ గతంలో చేసిన పొరపాట్ల గురించి పశ్చాత్తాపం ఉంటుంది. అప్పుడా తప్పు చేయకపోయింటే బాగుండు అని అనుకుంటుంటారు. శివశంకరన్ కూడా అలాంటి పశ్చాత్తాపాలనే వ్యక్తం చేశారు.రెండే తప్పులుదివాళా తీసిన సెల్యులార్ ఆపరేటర్ ఎయిర్ సెల్ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ ఇటీవల తనలో ఇంకా ఉన్న పశ్చాత్తాపాల గురించి నోరు విప్పారు. రణ్వీర్ అల్లాబాడియాతో కలిసి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఈ పారిశ్రామికవేత్త రూ.7,000 కోట్లు కోల్పోయి తిరిగి పుంజుకున్న తన ప్రయాణం గురించి వెల్లడించారు. తన జీవితకాల అదృష్టాన్ని పోగొట్టిన రెండు చిన్న తప్పులను బయటపెట్టారు. అవి ఒకటి హిందీ నేర్చుకోకపోవడం, మరొకటి తన కెరీర్ ప్రారంభంలో ఢిల్లీ లేదా ముంబై వంటి ప్రధాన నగరాలకు మకాం మార్చకపోవడం.హిందీ నేర్చుకుని ఉంటే..తాను హిందీ నేర్చుకుని ఉంటే 140 కోట్ల మంది భారతీయులను ఆకర్షించేవాడినని శివశంకరన్ అన్నారు. కచ్చితంగా రూ.లక్ష కోట్లు సంపాదించేవాడిని. భౌగోళికం, భాష తనను భారతదేశ అధికార కారిడార్ల నుంచి ఎలా దూరం చేశాయో స్వయంకృషితో ఎదిగిన ఈ బిజినెస్ టైకూన్ వివరించారు.అప్పు ఎప్పుడూ చేయలేదు'నేను ఎప్పుడూ అప్పులు చేయాలనుకోను. నేను డబ్బును ఆకర్షిస్తాను" అని శివశంకరన్ అన్నారు. 68 ఏళ్ల జీవితంలో తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ రూ.100 కూడా అప్పు తీసుకోలేదన్నారు. వ్యవస్థాపక ప్రవృత్తి, బిజినెస్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ అతిపెద్ద డీల్స్ చేజారడానికి కారణం తనకు దూరదృష్టి లేకపోవడం కాదని, బహుశా కనెక్షన్ లేకపోవడం వల్ల కావచ్చునని వెల్లడించాడు.రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులుదివాలా దాఖలు చేయడానికి ముందు తన అత్యంత ఖరీదైన కొనుగోళ్లను కూడా శివశంకరన్ వెల్లడించాడు. రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టానని, ప్రపంచవ్యాప్తంగా అనేక ఇళ్లు కొన్నానని చెప్పారు. సీషెల్స్ లో తనకు రెండు ద్వీపాలు ఉండేవని, వాటిని ఇప్పుడు అమ్మేశానని వెల్లడించారు. రిపబ్లిక్ ఆఫ్ శివ పేరుతో సొంత దేశంలా ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉండాలని ఈ దీవులను కొనుగోలు చేశానని చెప్పారు. అన్ని ఖండాల్లో నివాసం ఉండాలనే కోరికతో సీషెల్స్, అమెరికా, కెనడా, లండన్‌లో ఇళ్లు కొన్నట్లు శివశంకరన్ చెప్పుకొచ్చారు. -
గూగుల్ 200 ఉద్యోగాల్లో కోత!
విస్తృత పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా సేల్స్, పార్ట్నర్షిప్ విభాగాలను పర్యవేక్షించే గ్లోబల్ బిజినెస్ యూనిట్ నుంచి గూగుల్ 200 మంది ఉద్యోగులను తొలగించింది. టీమ్ సహకారాన్ని పెంపొందించడానికి, కస్టమర్ సేవను మెరుగుపరచడానికి, క్రమబద్ధమైన కార్యకలాపాలను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.ఇప్పటికే ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ వంటి కీలక ఉత్పత్తులను కలిగి ఉన్న గూగుల్ ప్లాట్‌ఫామ్ వివిధ విభాగాల్లో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. మారుతున్న మార్కెట్ డిమాండ్లు, పరిశ్రమ ధోరణుల నేపథ్యంలో తాజా లేఆఫ్స్‌ను ప్రకటించినట్లు పేర్కొంది. గూగుల్ కృత్రిమ మేధ, డేటా సెంటర్ టెక్నాలజీల్లో భారీగా పెట్టుబడి పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టెక్ కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. భవిష్యత్తు వృద్ధికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానాలకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. దాంతో ఉన్న ఉద్యోగులను ఆయా విభాగాలకు కేటాయిస్తున్నాయి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్ప్రముఖ కంపెనీల్లోనూ ఇదే ధోరణిగూగుల్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు ఇటీవల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇది పరిశ్రమ వ్యాప్తంగా ఉద్యోగుల పునర్నిర్మాణాన్ని సూచిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో పోటీ పడేందుకు కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. -
ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ప్రముఖ ఆడిటింగ్ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌజ్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) 1,500 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ తాజా నిర్ణయంతో యూఎస్ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఉద్యోగుల తొలగింపు దాని మొత్తం సిబ్బందిలో 2 శాతంగా ఉంది. ఆడిట్, ట్యాక్స్ విభాగాలకు చెందిన బాధిత ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ ద్వారా లేఆఫ్స్ సమాచారం అందించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.తొలగింపునకు కారణాలుప్రస్తుత వ్యాపార డిమాండ్లకు అనుగుణంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సమీకరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ఆలోచనాత్మకంగానే ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి, మారుతున్న ఖాతాదారుల డిమాండ్లు, పునర్నిర్మాణ ప్రయత్నాలు వంటి అంశాలను హైలైట్ చేస్తూ డెలాయిట్, కేపీఎంజీ వంటి సంస్థలు కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, మార్కెట్ తీరుకు అనుగుణంగా సంస్థలు మారుతున్నాయి.ఇదీ చదవండి: దేశంలో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..సవాళ్లుతొలగింపులతో ప్రభావితమైన ఉద్యోగులు తిరిగి కొలువు సాంపాదించాలంటే సవాళ్లను ఎదుర్కోకతప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ రంగంలో ఉపాధి అవకాశాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలు అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. పెరిగిన ఆటోమేషన్, వ్యాపార వ్యూహాలతో ఆడిట్, ట్యాకేషన్ నిపుణులు డేటా అనలిటిక్స్, అడ్వైజరీ సర్వీసులు లేదా ప్రత్యేక ఫైనాన్స్ రంగాల్లో కొత్త అవకాశాలకు అనుగుణంగా మారవలసి ఉంటుంది. -
27 ఎయిర్‌పోర్ట్‌లు, 430 విమానాలు నిలిపివేత
పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడి చేసిన నేపథ్యంలో స్థానిక విమానాశ్రయాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలు మే 10 వరకు వాణిజ్య కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో విమాన ప్రయాణాల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ చర్య ఫలితంగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 430 ఎయిర్‌క్రాఫ్ట్‌లు రద్దు అయినట్లు తెలిసింది. ఇది దేశంలోని మొత్తం షెడ్యూల్డ్ విమానాల్లో 3%గా ఉంది. ఈ ప్రభావం ఒక్క ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్థాన్‌లోని విమానయాన సంస్థలు కూడా 147 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇది వారి రోజువారీ షెడ్యూల్లో 17%గా ఉంది.ఇదీ చదవండి: ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్ జెట్లుదేశంలోని ప్రభావిత విమానాశ్రయాలు..శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్సర్, లుధియానా, పాటియాలా, బటిండా, హల్వారా, పఠాన్‌కోట్, భుంతర్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్‌గఢ్, జైసల్మేర్, జోద్పూర్, బికనీర్, ముంద్రా, జామ్‌నగర్, రాజ్‌కోట్, పోర్బందర్, కాండ్లా, గ్వాలియర్, హిండన్ సహా కీలక వ్యూహాత్మక విమానాశ్రయాలను మూనివేస్తున్నట్లు చెప్పారు. విమాన రాకపోకల్లో అంతరాయాలను తగ్గించడానికి సంస్థలు పని చేస్తున్నట్లు తెలిపాయి. విదేశీ విమానయాన సంస్థలు సున్నితమైన జోన్లలో కార్యకలాపాలను పూర్తిగా నిలిపేసి ముంబై, అహ్మదాబాద్ మీదుగా ప్రయాణించే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. విమానయాన సంస్థలు షెడ్యూళ్లను సర్దుబాటు చేయడానికి, ప్రభావిత ప్రయాణీకులకు వసతి కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల ప్రయాణాల్లో ఆలస్యం అనివార్యం అవుతుంది. -
ఆర్మీ సిబ్బందికి ఎయిర్ ఇండియా తోడ్పాటు
పాకిస్తాన్‌తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సెలవులు రద్దు చేసుకుని విధులకు వస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందికి తోడ్పాటు అందించేందుకు ఎయిర్ ఇండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రయాణాల కోసం తమ వద్ద టికెట్లు బుకింగ్ చేసుకున్న ఆర్మీ సిబ్బంది టికెట్లను రద్దు చేసుకుంటే ఉచిత రీషెడ్యూల్ లేదా పూర్తి రీఫండ్స్ అందించనున్నట్లు ప్రకటించాయి.పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. 60 మంది గాయపడ్డారు.ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశాలు జారీ చేశారు. సెలవులో ఉన్న బలగాలను వెంటనే విధులకు రప్పించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ (CRPF), బీఎస్ఎఫ్ (BSF), ఐటీబీపీ (ITBP) సహా అన్ని పారామిలిటరీ బలగాలు తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ సిబ్బంది ఇప్పటికే బుక్ చేసుకున్న విమాన టికెట్లను ఎటువంటి అదనపు రుసుములు లేకుండా రద్దు చేసుకునేందుకు, రీ షెడ్యూల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది."ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాలలో డిఫెన్స్ కోటా కింద 2025 మే 31 వరకు టికెట్లు బుక్ చేసుకున్న సిబ్బందికి తమ డ్యూటీ కమిట్మెంట్లకు మద్దతుగా 2025 జూన్ 30 వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడంపై పూర్తి రీఫండ్, వన్ టైమ్ మినహాయింపును అందిస్తున్నాం" అని ఎయిరిండియా ఒక పోస్ట్‌లో తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా ఇలాంటి పోస్ట్‌ను షేర్ చేసింది. -
ప్రైవేటు పెట్టుబడులు తగ్గుముఖం!
న్యూఢిల్లీ: ప్రైవేటు మూలధన వ్యయాలు (పెట్టుబడులు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం మేర తగ్గిపోవచ్చని కేంద్ర ప్రభుత్వ సర్వే అంచనా వేసింది. రూ.4.88 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ నిర్వహించిన ‘ఫార్వార్డ్ లుకింగ్ సర్వే’ తెలిపింది. 2024–25లో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు రూ.6.56 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 2023–24లో రూ.4.22 లక్షల కోట్లు కాగా, 2022–23లో రూ.5.72 లక్షల కోట్లు, 2021–22లో రూ.3.94 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. వీటి ప్రకారం 2021–22 నుంచి 2024–25 మధ్య కాలంలో మొత్తం మీద ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 66.3 శాతం పెరిగా యి. 2021–22లో ఒక్కో సంస్థ గ్రాస్ ఫిక్స్డ్ అస్సెట్ (జీఎఫ్ఏ) రూ.3,151 కోట్లుగా ఉంది. ఇది 2022–23లో రూ.3,279 కోట్లకు (4 శాతం వృద్ధి).. 2023–24లో రూ.4,183 కోట్లకు (27 శాతం వృద్ధి) పెరిగింది. విద్యుత్, గ్యాస్, స్టీమ్, ఎయిర్ కండీషనింగ్ సప్లై విభాగంలో ఒక కంపెనీ నుంచి అత్యధిక జీఎఫ్ఏ రూ.14,000 కోట్లుగా ఉంది. 2021–22లో ఒక్కో సంస్థ సగటున రూ.109 కోట్లను మూలధన వ్యయాలపై వెచ్చించింది. 20 22–23లో ఇది రూ.149 కోట్లు, 2023–24లో రూ. 1.07 కోట్లు, 2024–25లో రూ.172 కోట్ల చొప్పున ఉన్నాయి. తయారీ రంగం నుంచి 43.8 % మూ లధన వ్యయాలు ఉంటే.. ఐటీ నుంచి 15.6 %, రవాణా, స్టోరేజీ నుంచి 14 % చొప్పున ఉన్నాయి. వృద్ధి కోసమే పెట్టుబడులు.. ప్రస్తుత ఆస్తుల విలువను పెంచుకోవడంపై పెట్టుబడులకు 28.4 శాతం కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. 11.5 శాతం సంస్థలు అవకాశాలను విస్తృతం చేసుకోవడంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆదాయ వృద్ధి కోసం 2024–25లో మూలధన వ్యయాలు చేసినట్టు 49.6 శాతం ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు తెలిపారు. 30.1 శాతం సంస్థలు సామర్థ్యాల పురోగతికి, 2.8 శాతం సంస్థలు వైవిధ్యంపై పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించాయి. -
టారిఫ్‌లకు రెండు వైపులా పదును
న్యూఢిల్లీ: టారిఫ్‌లనేవి రెండువైపులా పదునున్న కత్తిలాంటివని హెచ్‌సీఎల్ గ్రూప్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. అమెరికాలాంటి పెద్ద మార్కెట్లలో టారిఫ్ ప్రభావిత పరిశ్రమలు నెమ్మదించినా వాటికి సేవలు కొనసాగించాల్సి రావడం ఒకెత్తైతే, టారిఫ్‌లవల్ల వ్యయాలు పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తవుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ కూడా భారతీయ ఐటీ కంపెనీలు కొత్త వ్యాపారావకాశాలను దక్కించుకునేందుకు కూడా తోడ్పడవచ్చని, ఇందుకు టెక్నాలజీ ఉపయోగపడగలదని ఆమె తెలిపారు. అమెరికా టారిఫ్‌ల ప్రభావం నేరుగా ఐటీ సంస్థలపై పడకపోయినా, అవి సేవలందించే మార్కెట్లలో పరిశ్రమలు మందగించడం వల్ల పరోక్షంగా దెబ్బతినొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో రోష్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టారిఫ్‌లు, డీగ్లోబలైజేషన్లాంటి భౌగోళికరాజకీయాంశాలు ఐటీ సేవలపై ప్రభావం చూపొచ్చని ఇటీవలే ఆరి్థక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా హెచ్‌సీఎల్ టెక్ సీఈవో సి. విజయకుమార్ కూడా తెలిపారు. -
ఎగిసిన స్టాక్ ఎక్స్ఛేంజీల లాభాలు
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 2,650 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,488 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 13 శాతం క్షీణించి రూ. 4,397 కోట్లకు పరిమితమైంది.అంతక్రితం క్యూ4లో రూ. 5,080 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 35 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 11.46 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎన్ఎస్ఈ నికర లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 12,188 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 19,177 కోట్లకు బలపడింది. ఈ కాలంలో మొత్తం రూ. 59,798 కోట్లమేర సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ) చెల్లించింది. బీఎస్ఈ లాభం హైజంప్మరో స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం హైజంప్ చేసి రూ. 494 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 107 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 543 కోట్ల నుంచి రూ. 926 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 23 డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 5 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది.కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీఎస్ఈ నికర లాభం 3 రెట్లు దూసుకెళ్లి రూ. 1,322 కోట్లను తాకింది. 2023–24లో కేవలం రూ. 404 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,596 కోట్ల నుంచి రూ. 3,236 కోట్లకు బలపడింది. ఈ కాలంలో ఈక్విటీ డెరివేటివ్స్‌లో 30.5 బిలియన్ కాంట్రాక్టులు ట్రేడ్‌కాగా.. రూ. 1,415 కోట్ల ఆదాయం నమోదైనట్లు బీఎస్ఈ వెల్లడించింది. -
పాక్‌కు యూకే షాక్.. వీసాలపై పరిమితులు!
లండన్: చదువు, ఉద్యోగం కోసం వెళ్లి శరణార్థి పేరిట అక్కడే శాశ్వతంగా తిష్ట వేస్తున్న పాకిస్తాన్ పౌరులకు యూకే షాకిచ్చింది. ఆసైలం (శాశ్వత నివాసం) దరఖాస్తుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాకిస్తానీ పౌరులకు యూకే వీసా నిబంధనలను కఠినం చేయనుంది. వీసా ఓవర్‌స్టేలు, ఆసైలం దరఖాస్తులపై కఠిన చర్యల్లో భాగంగా, యూకే ప్రభుత్వం పాకిస్తానీ పౌరులతో పాటు నైజీరియా, శ్రీలంక నుండి వచ్చే వారికి స్టడీ, వర్క్ వీసాలపై కఠినమైన పరిమితులను విధించనుందని టైమ్స్ వార్తా సంస్థ కథనం పేర్కొంది.యూకే శాశ్వత నివాసం కోసం వీసా హోల్డర్ల నుండి దరఖాస్తులు ఇటీల అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇందులో పాకిస్తానీ పౌరులు అగ్రస్థానంలో ఉన్నారు. హోమ్ ఆఫీస్ డేటా ప్రకారం.. 2024లో మొత్తం 108,000 మంది ఆసైలం కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో అత్యధికంగా 10,542 మంది పాకిస్తానీ పౌరులే ఉన్నారు.వీరిలో 16,000 మంది స్టూడెంట్ వీసాలపై యూకేకి వచ్చారు. పాకిస్తానీ, నైజీరియన్, శ్రీలంక దేశీయులు వర్క్, స్టూడెంట్ లేదా విజిటర్ వీసాలపై వచ్చి ఆ తర్వాత ఆసైలం కోసం దరఖాస్తు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిని అధికారులు "సిస్టమ్ దుర్వినియోగం"గా వర్ణించారు. ఈ నేపథ్యంలో వీసాలిచ్చే సమసయంలోనే కఠినంగా వ్యవహరించాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది.కొత్త నిబంధనల్లో భాగంగా వీసా దరఖాస్తుదారులను వారి ఆసైలం దరఖాస్తు రిస్క్‌ను అంచనా వేయడానికి ప్రొఫైలింగ్ చేస్తారు. అధిక రిస్క్‌గా భావించిన వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తారు. అంతేకాదు..వీసా హోల్డర్లు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నట్లు నిరూపించుకోకపోతే, వారికి పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే వసతి సౌకర్యాలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యూకే ప్రభుత్వం 2024లోనూ కేర్ వర్కర్లు, స్టూడెంట్లకు డిపెండెంట్లను తీసుకురాకుండా కఠిన నిబంధనల విధించించింది. దీంతో అప్పటి నుంచి 2025 మార్చి నాటికి వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గి 7,72,200కి తగ్గాయి.అయితే, ఈ ప్రతిపాదనలు వివాదాన్ని రేకెత్తించాయి. జాతీయత ఆధారంగా ప్రొఫైలింగ్ చేయడం వివక్ష దావాలకు దారితీయవచ్చని ఇమ్మిగ్రేషన్ లాయర్ అహ్మద్ ఖాన్, హెచ్చరించారు. "ఈ విధానాలు మూల కారణాలను పరిష్కరించకుండా మొత్తం సమాజాలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది" అని ఆయన అన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం, శ్రామిక లోటుతో ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న విశ్వవిద్యాలయాలు, వ్యాపారాలు కూడా ఆర్థిక ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. -
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ఆర్థిక ఉత్పత్తులు
టైర్ 2, ఇతర పట్టణాల్లో చిన్నతరహా వ్యాపారాలు నిర్వహించే మహిళలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ఆర్థిక ఉత్పత్తులను కోరుకుంటున్నట్టు ‘భారత్ ఉమెన్ యాస్పిరేషన్ ఇండెక్స్ (బీడబ్ల్యూఏఐ) 2025’ నివేదిక వెల్లడించింది. బిజినెస్ మేనేజన్మెంట్ ప్లాట్‌ఫామ్ ‘టైడ్’ దీన్ని విడుదల చేసింది.అంతేకాదు ఆయా పట్టణాల్లో చిన్నతరహా మహిళా పారిశ్రామికవేత్తల్లో మూడింట ఒక వంతు మంది రుణం పొందే విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తనఖా నిబంధనలు కఠినంగా ఉండడం, ఆర్థిక అక్షరాస్యత తగినంత లేకపోవడం వీరిని రుణ సదుపాయానికి దూరం చేస్తోందని, వీరికి తనఖా రహిత సూక్ష్మ రుణాలు సహా తదితర ప్రత్యామ్నాయ రుణ సదుపాయాలు అందించేందుకు సత్వర విధానపరమైన చర్యలు అవసరమని ఈ నివేదిక సూచించింది.‘‘టైర్ 2, 3, అంతకంటే చిన్న పట్టణాల్లో మహిళా పారిశ్రామికవేత్తలు డిజిటల్ అవగాహనతో వృద్ధి చెందాలన్న ఆకాంక్షలతో ఉన్నారు. కానీ, రుణ సదుపాయం, నెట్‌వర్క్‌లు, తదితర సంస్థాగత అంతరాలు వారిని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి’’అని తెలిపింది. మహిళల అభిప్రాయాలు.. 1,300 మంది మహిళా వ్యాపారవేత్తల అభిప్రాయాలను బీడబ్ల్యూఏఐ సర్వే చేసింది. ఆరి్థక, వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉందని 58% మంది చెప్పడం గమనార్హం. డిజిటల్ నైపుణ్యాలను పెంచుకోవాలన్న బలమైన ఆకాంక్ష 12 శాతం మందిలో కనిపించింది.28 శాతం మంది నిధుల విషయంలో తమ కుటుంబం నుంచి పురుష సభ్యుడి సహకారం అవసరమని చెప్పారు. వ్యవస్థాపకులుగా వారి ప్రయాణంలో ఇదొక పెద్ద అడ్డంకిగా నివేదిక పేర్కొంది.డిజిటల్ నైపుణ్యాల పెంపు, వారికి లభిస్తున్న వివిధ పథకాల సమాచారం అందించడం, నెట్వర్కింగ్ పెంపు ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యాలను సులభతరం చేయొచ్చని ఈ నివేదిక సూచించింది. -
జెన్సోల్పై కేంద్రం దర్యాప్తు
కంపెనీల చట్ట నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణల నేపథ్యంలో తాజాగా జెన్సోల్ ఇంజనీరింగ్, బ్లూస్మార్ట్ మొబిలిటీలపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. నిధుల అక్రమ మళ్లింపు, కార్పొరేట్ పాలనలో అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏప్రిల్‌లో చర్యలకు తెరతీసిన సంగతి తెలిసిందే.కంపెనీ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీలను సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది. బుకింగ్ ద్వారా క్యాబ్(రైడ్‌హెయిలింగ్) సర్వీసులు అందించే బ్లూస్మార్ట్ మొబిలిటీని సైతం అన్మోల్ ప్రమోట్ చేయడం గమనార్హం!కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జెన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్‌లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్‌లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని గత నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది. జెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది. -
ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలు
ఆర్బీఐ ప్రతిపాదించిన నూతన ముసాయిదా నిబంధనలు ఎన్బీఎఫ్సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) బంగారం రుణ ఆస్తులు నిదానించేలా చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణం), రుణాల పునరుద్ధరణ, టాపప్ బుల్లెట్ రుణాలపై ఈ ముసాయిదా దృష్టి పెట్టిందని.. ఈ నిబంధనలు ఎన్బీఎఫ్సీ రుణ ఆస్తుల వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముసాయిదా నిబంధనలు విడుదల చేసిన ఆర్బీఐ, భాగస్వాముల అభిప్రాయాలను ఆహ్వానించింది.బంగారం రుణాల విషయంలో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య వ్యత్యాసాలు తగ్గించి, ఏకరూపత తీసుకురావడం ముసాయిదా నిబంధనల లక్ష్యంగా ఉంది. బంగారం రుణాల విషయంలో అసాధారణ ప్రక్రియలను ఎన్బీఎఫ్సీలు పాటిస్తుండడం, బంగారం విలువపై అధిక నిష్పత్తిలో రుణాలు జారీ చేస్తుండడంపై ఆర్బీఐ గతేడాది సెప్టెంబర్‌లో కాస్తంత హెచ్చరించే ధోరణిని వ్యక్తం చేయడాన్ని నివేదిక ప్రస్తావించింది. 2024–25లో వ్యవస్థ వ్యాప్తంగా బంగారం రుణాలు 50 శాతానికి పైనే పెరిగాయని, బ్యాంక్‌ల బంగారం రుణ ఆస్తుల విలువ రెట్టింపైనట్టు పేర్కొంది. ఆభరణాలపై తక్కువ రుణాలు..ఎల్టీవీపై ఆర్బీఐ కొత్త నిబంధనల కింద ఎన్బీఎఫ్సీలు బంగారం రుణాల మంజూరు విలువను క్రమబద్దీకరించుకోవాల్సి వస్తుందని తెలిపింది. బుల్లెట్ రుణాలకు సంబంధించిన ఎల్టీవీ ప్రస్తుతమున్న 65–68 శాతం నుంచి 55–60 శాతానికి దిగొస్తుందని అంచనా వేసింది. దీంతో అంతే విలువ కలిగిన బంగారం ఆభరణాలపై మంజూరు చేసే రుణం తగ్గుతుందని తెలిపింది. కస్టమర్ల వద్ద నుంచి నిర్ణీత రోజులకు ఒకసారి (నెల) బంగారం రుణంపై వడ్డీని ఎన్బీఎఫ్సీలు వసూలు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, ఈ సంస్థలు ఈఎంఐ ఆధారిత బంగారం రుణాలపై దృష్టి పెట్టొచ్చని తెలిపింది. ఇదీ చదవండి: దేశంలో మారుతున్న ఉద్యోగుల ప్రాధాన్యతలుఎల్టీవీ పరిమితి మించితే అదనపు నిధుల కేటాయింపులు చేయాలన్న నిబంధన ఎన్బీఎఫ్సీలపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చని అభిప్రాయపడింది. ఆర్బీఐ ప్రతిపాదిత నిబంధనలు కొంత కాలానికి ఈ రంగం సామర్థ్యాలను బలోపేతం చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
నష్టాల్లో జీ మీడియా.. భారీగా తగ్గిన ప్రకటనల ఆదాయం
న్యూఢిల్లీ: జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ నష్టం మార్చి త్రైమాసికంలో మరింత పెరిగిపోయింది. రూ.37 కోట్ల నష్టాన్ని సంస్థ నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం కేవలం రూ.6.51 కోట్లుగానే ఉంది. దీంతో పోల్చి చూస్తే ఆరు రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది.ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గి రూ.156 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు 6 శాతానికి పైగా పెరిగి రూ.200 కోట్లుగా ఉన్నాయి. మార్చి క్వార్టర్లో ప్రకటనల ఆదాయం 13.5 శాతం తక్కువగా రూ.145 కోట్లకు పరిమితమైంది.సబ్స్క్రిప్షన్ ఆదాయం 6.9 శాతం తగ్గి రూ.10 కోట్లుగా ఉంది. ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీ మీడియా కార్పొరేషన్ రూ.119 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.98 కోట్లుగానే ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం 4 శాతానికి పైగా తగ్గి రూ.633 కోట్లుగా ఉంది. -
దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద మహీంద్రా డీలర్షిప్
భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ రిటైల్ సంస్థలలో ఒకటైన ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (AMPL) విజయవాడలో.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మహీంద్రా డీలర్‌షిప్‌ను ప్రారంభించింది.విజయవాడలోని ఏలూరు రోడ్డు, ఎనికెపాడులో ఉన్న ఈ కొత్త డీలర్షిప్ 1.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 14 వాహనాలను ఒకేసారి ప్రదర్శించగల కెపాసిటీ ఉన్న ఈ షోరూమ్‌లో.. ప్యాసింజర్ వెహికల్ (ఐసీఈ & ఈవీ), స్మాల్ కమర్షియల్ వెహికల్ (ఎస్సీవీ), లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎల్ఎంఎం) వాహనాలన్నీ లభిస్తాయి.ఈ కొత్త డీలర్షిప్ ద్వారా కేవలం సేల్స్ మాత్రమే కాకుండా.. సర్వీస్, వాహనాలకు అవసరమైన ఫాస్ట్-ఛార్జింగ్ సౌకర్యం కలిగి ఉంటుంది. టెక్నాలజీని ప్రతిబింబించేలా.. ఆకర్షణీయమైన డిజైన్ పొందిన ఈ షోరూమ్ 61 కొత్త సర్వీస్ బేలు కలిగి ఉంది. ఇవి ఏడాదికి 28000 మందికి సేవలను అందించగలవు.అతిపెద్ద మహీంద్రా డీలర్షిప్ ప్రారంభంతో.. ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా తన విస్తృత నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ గ్రూప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో 135 మహీంద్రా టచ్పాయింట్లను నిర్వహిస్తోంది.FY 2025లో ఈ గ్రూప్ 37,000 మహీంద్రా వాహనాలను విక్రయించింది. అంటే ప్రతి 13 నిమిషాలకు ఒక వాహనం అమ్ముడుపోయిందనమాట. దీంతో AMPL భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న OEM కోసం అతిపెద్ద సేల్స్ అండ్ ఆఫ్టర్-సేల్స్ భాగస్వామిగా నిలిచింది. -
దేశంలో మారుతున్న ఉద్యోగుల ప్రాధాన్యతలు
భారత్‌లో ఉద్యోగుల ప్రాధాన్యాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఓఎన్ 2025 ఎంప్లాయ్ సెంటిమెంట్ స్టడీ ప్రకారం ఈ ఏడాది దేశంలో 82 శాతం మంది తాము చేస్తున్న సంస్థలు మారాలని భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 60 శాతంగా ఉంది. మెరుగైన పనిప్రాంత ప్రయోజనాలు, కెరీర్ అవకాశాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఈ ధోరణి నొక్కి చెబుతుంది.ప్రయోజనాలకే ప్రాధాన్యతఏఓన్ రిపోర్ట్‌లోని అంశాల ప్రకారం.. భారతీయ ఉద్యోగులు 76 శాతం మంది తమ అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న వెసులుబాట్లను విడిచిపెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగులకు కోరుకునే ఐదు అత్యంత విలువైన ప్రయోజనాలను విశ్లేషించింది.వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్‌లు: ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్లు, రిమోట్ వర్క్ ఆప్షన్ల కోసం ఉద్యోగులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.మెడికల్ కవరేజ్: ఆసుపత్రిలో చేరడం, అవుట్ పేషెంట్ సేవలు వంటి ఆరోగ్య సంరక్షణ చర్యలు మెరుగ్గా ఉన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలు: ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతోపాటు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మెంటార్షిప్, లీడర్ షిప్ ట్రైనింగ్ వంటి సదుపాయాలు కోరుకుంటున్నారు.వేతనంతో కూడిన సెలవులు: పెయిడ్ సెలవులు, పేరెంటల్ లీవ్, వెకేషన్ల కోసం సెలవులు ఇచ్చే కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు.రిటైర్మెంట్ పొదుపు పథకాలు: పెన్షన్ పథకాలు, ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి పెట్టుబడి అవకాశాలకు పెద్దపీట వేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా 13 శాతం మంది ఉద్యోగులతో పోలిస్తే భారత్‌లో కేవలం 7 శాతం మంది మాత్రమే తక్కువ సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే భావనతో ఉంటున్నారు.వైద్య కవరేజ్ తరతరాలుగా అత్యధిక విలువ కలిగిన ప్రయోజనాల్లో ఒకటిగా ఆవిర్భవించింది. జెన్ ఎక్స్(1965-80 మధ్య జన్మించినవారు), జెన్ వై(1980-1995 మధ్య జన్మించినవారు) జెన్ జెడ్(1995-2005 మధ్య జన్మించినవారు) కంటే ఎక్కువగా వైద్య సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జెన్ జెడ్ ఉద్యోగులు వర్క్-లైఫ్ సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.వెల్నెస్ ప్రోగ్రామ్‌లకు ప్రాముఖ్యతకొవిడ్ తర్వాత కంపెనీలు తమ బ్రాండ్‌ను రూపొందించడంలో వెల్నెస్ ప్రోగ్రామ్‌ల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాయని ఏఓఎన్లోని టాలెంట్ సొల్యూషన్స్ ఫర్ ఇండియా హెడ్ నితిన్ సేథీ పేర్కొన్నారు. మెరుగైన ఆరోగ్యం, వెల్నెస్, ఫైనాన్షియల్ ప్లానింగ్ సొల్యూషన్స్‌ను తమ పాలసీల్లో పొందుపరిచేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఉద్యోగులను నిలుపుకోవడానికి, టాప్ టాలెంట్‌ను ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుందని చెప్పారు.యువ నిపుణుల్లో పదవీ విరమణ, ఆర్థిక ప్రణాళిక అంశాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయని ఏఓఎన్ హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ హెడ్ యాష్లే డిసిల్వా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్న వేతనాల ఆందోళనలే ఈ మార్పుకు కారణమని చెప్పారు. ఇది ఉద్యోగులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టడానికి దారితీస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేతఅభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి 43% మంది భారతీయ ఉద్యోగులు తమ ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఏఓఎన్ అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి 35 శాతంగా ఉంది. 10 శాతం మంది ఉద్యోగులు తమ నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కోసం వారి సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పారు. -
క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేత
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఎయిరిండియా ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులను మే, 8 వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన క్షిపణి దాడి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో ఎయిరిండియా ఢిల్లీ-టెల్ అవీవ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఏఐ 139ను ఇటీవల అబుదాబికి మళ్లించినట్లు తెలిపింది. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి కారణంగా ఇజ్రాయెల్-యెమెన్ ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.క్షిపణి దాడియెమెన్కు చెందిన హౌతీలు హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణితో ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పరిధిలో దాడికి పాల్పడ్డారు. దాంతో విమానాశ్రయం సమీపంలో టెర్మినల్ 3 పార్కింగ్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. మే 4న జరిగిన ఈ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. బోయింగ్ 787కు చెందిన ఎయిరిండియా విమానం ఏఐ139 ల్యాండ్ అవ్వడానికి గంట ముందు ఈ సంఘటన జరిగింది. ఫ్లైట్రాడార్24.కామ్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం జోర్డాన్ గగనతలంలో ఉందని, దాడి సమాచారం తెలిసిన వెంటనే దాన్ని అబుదాబికి మళ్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: సాంకేతికతతో యుద్ధానికి సైఎయిరిండియా స్పందనమే 4న జరిగిన ఈ సంఘటనకు ప్రతిస్పందనగా ఎయిరిండియా మొదట టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగిస్తున్న విమానాలను మే 6 వరకు నిలిపివేసింది. అక్కడ కొనసాగుతున్న భద్రతా కారణాల వల్ల విమానాల నిలిపివేతను మే 8 వరకు పొడిగించింది. టెల్ అవీవ్‌కు ఎయిరిండియా వారానికి ఐదు విమానాలను నడుపుతోంది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్షేత్రస్థాయిలో సంస్థ బృందాలు ప్రభావిత ప్రయాణీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. -
3జీ క్యాపిటల్ చేతికి స్కెచర్స్
న్యూయార్క్: షూస్ తయారీ సంస్థ స్కెచర్స్ను ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం 3జీ క్యాపిటల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 9 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. కొనుగోలు తర్వాత ప్రైవేట్ సంస్థగా మార్చనుంది. ఈ ఒప్పందానికి స్కెచర్స్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొనుగోలు అనంతరం కూడా కంపెనీకి స్కెచర్స్ చైర్మన్, సీఈవో రాబర్ట్ గ్రీన్బర్గ్, ఆయన మేనేజ్మెంట్ బృందం సారథ్యం వహిస్తుంది. సంస్థ హెడ్‌క్వార్టర్స్ కూడా మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన చోటే (కాలిఫోరి్నయా) కొనసాగుతుంది. -
భారీ ఐపీవోకి అవాడా గ్రూప్
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ రంగానికి చెందిన అవాడా గ్రూప్‌లో భాగమైన సోలార్ మాడ్యూల్స్ తయారీ విభాగం భారీ ఐపీవో సన్నాహాల్లో ఉంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 4,000–5,000 కోట్ల వరకు సమీకరించడంపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవోని నిర్వహించేందుకు పలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, న్యాయసేవల సంస్థలతో గ్రూప్ సంప్రదింపులు జరిపినట్లు వివరించాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను 5 గిగావాట్ ఇంటిగ్రేటెడ్ సోలార్ మాడ్యూల్, సెల్ తయారీ ప్లాంటు నిర్మాణం సహా ఇతరత్రా పెట్టుబడుల కోసం సంస్థ వినియోగించనుంది. అవాడా గ్రూప్‌లో బ్రూక్‌ఫీల్డ్‌కి చెందిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఫండ్, థాయ్‌ల్యాండ్‌కి చెందిన జీపీఎస్సీ మొదలైనవి 1.3 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. సోలార్ మాడ్యూల్స్ తయారీ, పునరుత్పాదక విద్యుదుత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్, అమోనియా మొదలైన విభాగాల్లో గ్రూప్ కార్యకలాపాలు ఉన్నాయి. 2024లో పలు సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థలు ఐపీవో ద్వారా నిధులు సమీకరించగా, మరిన్ని ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ రూ. 2,830 కోట్లు, అక్టోబర్‌లో వారీ ఎనర్జీస్ రూ. 4,321 కోట్లు సమీకరించాయి. -
UPIలో కీలక మార్పులు: జూన్ 16 నుంచే అమలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో కీలక మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ అప్డేట్ చేయనున్నట్లు, ఇది 2025 జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.యూపీఐ వినియోగదారులు.. లావాదేవీలు చేయడానికి కనీసం 30 సెకన్ల సమయం కేటయించాల్సి ఉంది. ఈ సమయాన్ని తగ్గించడానికి NPCI చర్యలు తీసుకుంటోంది. ఇది అమలులోకి వచ్చిన తరువాత.. ట్రాన్సక్షన్స్ మరింత సులభతరం అవుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలులావాదేవీలు, డెబిట్, క్రెడిట్ సేవల కోసం యూజర్ ఇప్పుడు 30 సెకన్ల సమయం వెచ్చించాల్సి ఉంది. దీనిని 15 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీ స్థితిని తనిఖీ చేసే సమయాన్ని 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీలు చేయడానికి సంబంధించిన టైమ్ తగ్గితే.. యూజర్ల సమయం కూడా ఆదా అవుతుంది. -
ఎయిర్టెల్, టాటా చర్చలకు చెక్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా గ్రూప్ మధ్య డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిజినెస్ విలీనానికి చెక్ పడింది. విలీన చర్చలను విరమించుకున్నట్లు ఎయిర్టెల్ తాజాగా వెల్లడించింది.చర్చలలో రెండువైపులా సంతృప్తికర ఫలితాలను సాధించకపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. డీటీహెచ్ బిజినెస్‌ల విలీనానికి టాటా గ్రూప్ డీటీహెచ్ విభాగం టాటా ప్లేతో అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా చర్చిస్తున్నట్లు 2025 ఫిబ్రవరి 26న ఎయిర్టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో రెండు సంస్థలూ సరైన పరిష్కారాన్ని సాధించలేకపోవడంతో చర్చలు విరమించుకున్నట్లు వివరించింది. -
ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఇలా..
న్యూఢిల్లీ: కీలక ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వినియోగం ఏప్రిల్‌లో పెరిగింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణత అనంతరం 4 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్‌లో డీజిల్ వినియోగం 8.23 మిలియన్ టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఏప్రిల్ నెల అమ్మకాలతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగినట్టు పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం (కేంద్ర పెట్రోలియం శాఖ పరిధిలోని) డేటా తెలియజేస్తోంది.2023 ఏప్రిల్ నెల విక్రయాలతో పోల్చి చూసినా 5.3 శాతం మేర వినియోగం పెరిగింది. కరోనా ముందు నాటి సంవత్సరం 2019 ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10.45 శాతం అధికం కావడం గమనించొచ్చు. కస్టమర్లు క్రమంగా ఎలక్ట్రిక్, పెట్రోల్ వేరియంట్ల వైపు మొగ్గు చూపిస్తుండడంతో డీజిల్ వినియోగంపై కొంత కాలంగా నెలకొన్న సందేహాలకు తాజా గణంకాలు తెరదించినట్టయింది. మొత్తం పెట్రోలియం ఇంధనాల్లో డీజిల్ వాటా 38 శాతంగా ఉంటుంది.ఇక ఏప్రిల్ నెలలో పెట్రోల్ అమ్మకాలు సైతం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 4.6 శాతం పెరిగి 3.43 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా పెట్రోల్ అమ్మకాలు 19 శాతం వృద్ధిని నమోదు చేయగా, నాటి గరిష్ట పరిమితి మీద మెరుగైన వృద్ధి నమోదైంది. ఎల్పీజీ విక్రయాలు 6.7 శాతం పెరిగి 2.62 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 3.25 శాతం తగ్గి 7,66,000 టన్నులుగా ఉన్నాయి. -
సరళతర ఎఫ్‌డీఐ విధానం.. అవకాశాలు అపారం
భారత్ అమలు చేస్తున్న సరళతర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం (ఎఫ్‌డీఐ) విదేశీ ఇన్వెస్టర్లకు అపారమైన పెట్టుబడి అవకాశాలను ఆఫర్ చేస్తోందని డెలాయిట్ ఇండియా తెలిపింది. ఫార్మాస్యూటికల్స్, ఆటో, పర్యాటక రంగాలకు ఎఫ్‌డీఐలను ఆకర్షించే శక్తితోపాటు ఉపాధి కల్పనకు చోదకాలుగా నిలవగలవని పేర్కొంది. వీటికితోడుగా ఎగుమతులు, ఆవిష్కరణలు భారత్ తదుపరి దశ వృద్ధిని నడిపించగలవని తెలిపింది.చాలా రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో(అనుమతుల్లేని) 100 శాతం ఎఫ్‌డీఐల రాకకు అనుమతించడం ద్వారా భారత్ ఎంతో ప్రగతి సాధించినట్టు డెలాయిట్ ఇండియా గుర్తు చేసింది. పర్యాటకం, నిర్మాణం, హాస్పిటల్స్, మెడికల్ డివైజ్‌లను ప్రస్తావించింది. ఈ విధాన నిర్ణయాలు స్థిరత్వాన్ని, స్పష్టతను అందిస్తున్నట్టు డెలాయిడ్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ పేర్కొన్నారు. 70 బిలియన్ డాలర్ల జాతీయ మోనిటైజేషన్ పైపులైన్, 100 పట్టణాల్లో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కార్యక్రమాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు వెంటనే కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలైన పెట్టుబడి జోన్లను అందిస్తున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్పర్యాటకం, ఆతిథ్య రంగంలో హోటళ్లు, రిక్రియేషన్ కేంద్రాల నిర్మాణానికి 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నట్టు మజుందార్ గుర్తు చేశారు. పారదర్శక, స్థిరమైన పెట్టుబడుల కేంద్రంగా భారత్ ప్రతిష్ట దీంతో మరింత ఇనుమడిస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం, సరళతర ఎఫ్‌డీఐ విధానం.. లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, పట్టణాభివృద్ధి రంగాల్లో అపార అవకాశాలను తీసుకొస్తున్నట్టు మజుందార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2024–2025) తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) 27 శాతం అధికంగా 40.67 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ భారత్‌లోకి రావడం గమనార్హం. -
బఫెట్ వారసుడొచ్చాడు..!
ఒమాహ: ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, బిలియనీర్ వారెన్ బఫెట్ (94) ‘బెర్క్‌షైర్ హాతవే’ చైర్మన్‌గా ఈ ఏడాది చివర్లో తప్పుకోనున్నారు. తన స్థానంలో వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించాలంటూ కంపెనీ బోర్డుకు సిఫారసు చేయనున్నట్టు శనివారం ప్రకటించి ఇన్వెస్టర్లను, ఫాలోవర్లను షాక్‌కు గురిచేశారు. దీంతో ఆరు దశాబ్దాల పెట్టుబడుల యాత్రకు బఫెట్ ముగింపు పలకనున్నారు. ‘‘కంపెనీ సీఈవోగా ఈ ఏడాది చివర్లో గ్రెగ్ బాధ్యతలు చేపట్టే సమయం ఆసన్నమైంది’’అంటూ వాటాదారులతో నిర్వహించిన ప్రశ్న–జవాబుల కార్యక్రమం చివర్లో బఫెట్ ప్రకటించారు.దీనిపైపై మాత్రం ప్రశ్నలకు అనుమతించలేదు. ఈ నిర్ణయం కంపెనీ బోర్డు సభ్యులైన తన ఇద్దరు పిల్లలు హోవర్డ్, సూసీ బఫెట్‌కు మాత్రమే తెలుసని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వేదికపై బఫెట్ పక్కనే గ్రెగ్ అబెల్ ఆసీనులై ఉండడం గమనార్హం. ‘‘బెర్క్‌షైర్ హాతవే కంపెనీ షేరు ఒక్కటి కూడా విక్రయించాలన్న ఉద్దేశం నాకు లేదు. చివరికి వీటిని విరాళంగా ఇచ్చేయాల్సిందే. కానీ, ప్రతీ షేరును కొనసాగించాలన్న నిర్ణయం ఆర్థిక కోణంలో తీసుకున్నదే. ఎందుకంటే నా కంటే కూడా గ్రెగ్ నాయకత్వంలో బెర్క్‌షైర్ భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాను’’అని బఫెట్ తెలిపారు.ఇప్పటికే కీలక బాధ్యతలు..బఫెట్ భవిష్యత్ వారసుడిగా గ్రెగ్ అబెల్ (62) గతంలోనే నియమితులయ్యారు. కంపెనీ నాన్ ఇన్సూరెన్స్ వ్యాపార బాధ్యతలను ఆయనే నిర్వహిస్తున్నారు. కానీ, బఫెట్ మరణానంతరమే ఆయన స్థానంలో కంపెనీ బాధ్యతల్లోకి గ్రెగ్ వస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. తనకు రిటైర్మెంట్ ప్రణాళికలేవీ లేవంటూ లోగడ బఫెట్ ప్రకటించడం ఇందుకు దారితీసింది. బెర్క్‌షైర్ కంపెనీని నడిపించే సామర్థ్యాలు గ్రెగ్ అబెల్‌కు ఉన్నాయని చాలా మంది ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.ఇకపై ఇన్సూరెన్స్ వ్యాపారం బాధ్యతల నిర్వహణతోపాటు కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను (2024 చివరికి 334 బిలియన్ డాలర్లు) అబెల్ ఎలా పెట్టుబడులుగా మలుస్తారన్న ఆసక్తి నెలకొంది. బఫెట్ ప్రకటన తర్వాత వేలాది మంది ఇన్వెస్టర్లు నిల్చుని మరీ దిగ్గజ ఇన్వెస్టర్ సేవలకు ప్రశంసలు కురిపించడం కనిపించింది. బఫెట్ సారథ్యంలో (1965 నుంచి నేటి వరకు) బెర్క్‌షైర్ ఎస్అండ్పీ 500 కంటే (ఏటా 10.4 శాతం) రెట్టింపు స్థాయిలో ఏటా 19.9 శాతం కాంపౌండెడ్ రాబడులు అందించడం గమనార్హం. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం వారెన్ బఫెట్ సంపద విలువ ప్రస్తుతం 169 బిలియన్ డాలర్లుగా ఉంది. -
సెకీతో రిలయన్స్ న్యూ సన్‌టెక్ ఒప్పందం
ముంబై: రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ సన్‌టెక్ తాజాగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో పాతికేళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది.ఒప్పందం ప్రకారం వచ్చే 24 నెలల్లో సమీకృత సోలార్ అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై రూ. 10,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కేడబ్ల్యూహెచ్‌కి రూ. 3.53 ఫిక్సిడ్ రేటు చొప్పున విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. -
ధీరూభాయ్ అంబానీ అసలు పేరేంటో తెలుసా?
భారదేశంలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ.. రిలయన్స్ సామ్రాజ్యం గురించి తెలిసిన దాదాపు అందరికీ, ఈ కంపెనీ ప్రారంభించిన వారు ధీరూభాయ్ అంబానీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధీరూభాయ్ అంబానీ అసలు పేరు ఏమిటో.. బహుశా చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో ఆ విషయం తెలుసుకుందాం.సాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్‌కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చి.. ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు.వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది. అందరూ ఈయనను 'ధీరూభాయ్ అంబానీ' అని పిలుచుకునే వారు. కానీ ధీరూభాయ్ అనేది ఆయన ముద్దుపేరు, అంబానీ అనేది ఇంటిపేరు.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..ధీరూభాయ్ అంబానీ అసలు పేరు.. 'ధీరజ్‌లాల్ హీరాచంద్ అంబానీ' (Dhirajlal Hirachand Ambani). 1932 డిసెంబర్ 28న జన్మించిన ఈయన.. ఏడుపదుల వయసులో 2002 జులై 6న మరణించారు. అప్పటికే రిలయన్స్ సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం. -
మరిన్ని కంపెనీలు కొంటాం: ప్రముఖ సీఈవో
న్యూఢిల్లీ: వేల్యుయేషన్ సముచితంగా ఉంటే మరిన్ని కంపెనీలను కొనుగోలు చేస్తామని ‘యూనికామర్స్ ఈసొల్యూషన్స్’ సీఈవో కపిల్ మఖీజా తెలిపారు. గత నాలుగేళ్లుగా ఈ–కామర్స్ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకున్నాయని, ఆమ్నిచానల్లాంటి కొత్త మోడల్స్ తెరపైకి వచ్చాయని ఆయన చెప్పారు.కంపెనీ ఇటీవలే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం షిప్వేను కొనుగోలు చేసిన నేపథ్యంలో కపిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూనికామర్స్ ప్రస్తుతం 7,000 పైచిలుకు వ్యాపారాలకు సేవలు అందిస్తోందని ఆయన వివరించారు.ఈ–కామర్స్ వ్యవస్థలో కస్టమర్లతో సంప్రదింపుల దశ, లావాదేవీలను ప్రాసెస్ చేసే దశ, ఆర్డరును పూర్తి చేసే దశ అని మూడు దశలు ఉంటాయని, తమ సంస్థ ఈ మూడు అంశాల్లోనూ సర్వీసులు అందిస్తోందని కపిల్ వివరించారు. తాము ఇప్పటికే భారత్ కాకుండా ఆరు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, మరింతగా విస్తరించే యోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. -
బెర్క్‌షైర్ హాత్వేను వీడనున్న వారెన్ బఫెట్: నెక్స్ట్ సీఈఓ ఎవరంటే?
శనివారం (2025 మే 3) జరిగిన బెర్క్‌షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్ బఫెట్' కంపెనీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.బెర్క్‌షైర్ హాత్వే సీఈఓగా గ్రెగ్ అబెల్ పేరును ప్రస్తావించగానే.. గ్రెగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. గ్రెగ్‌ను సీఈఓగా నియమించాలనే నిర్ణయం తన కుటుంసభ్యులకు తప్ప, గ్రెగ్‌కు కూడా తెలియవని బఫెట్ పేర్కొన్నారు.కంపెనీని నడిపించడానికి.. రెండు దశాబ్దాలుగా సంస్థలో పనిచేస్తున్న గ్రెగ్ అబెల్ సరైన వ్యక్తి అని కొందరు భావించినప్పటికీ.. పెట్టుబడుల విషయంలో ఈయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అనుమానం వ్యక్తం చేశారు. దీనికి బఫెట్ సమాధానమిస్తూ.. గ్రెగ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి నా సంపద మొత్తానికి కంపెనీలో పెట్టుబడిగా పెడతానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా.. నా సారథ్యంలో కంటే.. గ్రెగ్ సారథ్యంలో కంపెనీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన బఫెట్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మంచంలో సగం అద్దెకు: కొత్త ఆలోచనతో డబ్బు సంపాదిస్తున్న మహిళఎవరీ గ్రెగ్ అబెల్?62 ఏళ్ల గ్రెగ్ అబెల్.. రెండు దశాబ్దాలకు పైగా బెర్క్‌షైర్‌లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆల్బెర్టాలోని ఎడ్మంటన్‌లో జన్మించిన అబెల్ చిన్నప్పుడు బాటిల్స్ సేకరించడం, అగ్నిమాపక యంత్రాలను సర్వీసింగ్ చేయడం వంటి ఉద్యోగాలు చేశారు. ఆ సమయంలో ఉన్నతమైన విలువలను పొందారు. 1984లో ఆల్బెర్టా యూనివర్సిటీ ఉన్నత చదువులు చదివారు. బెర్క్‌షైర్ హాత్వేలో చేరిన తరువాత దినదినాభివృద్ధి చెందిన.. కీలకమైన పదవులను అలంకరించారు. ఇప్పుడు ఈయనను సీఈఓ పదవి వరించింది. -
కంపెనీల కార్పొరేట్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
షాపర్స్‌స్టాప్ లాభం పతనంరిటైల్ స్టోర్ల దిగ్గజం షాపర్స్‌స్టాప్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 91 శాతంపైగా పడిపోయి రూ. 2 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23 కోట్లుపైగా ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 1,064 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,046 కోట్ల అమ్మకాలు సాధించింది. మొత్తం వ్యయాలు 4 శాతం పెరిగి రూ. 1,090 కోట్లకు చేరాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 86 శాతం క్షీణించి రూ. 11 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ. 77 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం వృద్ధితో రూ. 4,628 కోట్లకు చేరింది.ఈక్విటాస్ లాభం పతనంప్రయివేట్ రంగ సంస్థ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్ఎఫ్బీ) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 80 శాతం క్షీణించి రూ. 42 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 208 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,685 కోట్ల నుంచి రూ. 1,869 కోట్లకు ఎగసింది. ప్రొవిజన్లు రూ. 107 కోట్ల నుంచి రూ. 258 కోట్లకు భారీగా పెరిగాయి. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 2.61 శాతం నుంచి 2.89 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 1.17 శాతం నుంచి 0.98 శాతానికి తగ్గాయి.ఇదీ చదవండి: లోకల్ కంటెంట్‌పై ఫోకస్.. రూ.32 వేల కోట్లు పెట్టుబడిలాటెంట్ వ్యూ అనలిటిక్స్ నికరలాభం రూ.51 కోట్లుడిజిటల్ అనలిటిక్స్ కన్సల్టింగ్ అండ్ సొల్యూషన్స్ ప్రొవెడర్ లాటెంట్ వ్యూ అనలిటిక్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.51.25 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు 2023–24 ఇదే క్వార్టర్లో నికరలాభం రూ.45.23 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.187.45 కోట్ల నుంచి రూ.253.29 కోట్లకు పెరిగింది. ‘‘త్రైమాసిక ప్రాతిపదికన 1.9%, వార్షిక ప్రాతిపదికన 35.3 శాతం పెరుగుదలతో వరుసగా తొమ్మిదో సారి ఆదాయం వృద్ధి సాధించడం సంతోషంగా ఉంది. బలమైన వ్యాపార మూలాలు, క్లయింట్లతో సత్సంబంధాలు మా స్థిరమైన పనితీరుకు నిదర్శనం’’ అని కంపెనీ సీఈవో రాజన్ సేతురామన్ తెలిపారు. 2025 మార్చి 31తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం రూ.173.49 కోట్లు, మొత్తం ఆదాయం రూ. 916.78 కోట్లుగా ప్రకటించింది. -
లోకల్ కంటెంట్‌పై ఫోకస్.. రూ.32 వేల కోట్లు పెట్టుబడి
డిస్నీ-రిలయన్స్ విలీనం తర్వాత ఏర్పడిన మీడియా సంస్థ జియోస్టార్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.32,000-33,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది అంతకుముందు సంవత్సరం రూ.30,000 కోట్ల పెట్టుబడితో పోలిస్తే 7% అధికం. స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్, డిజిటల్ విస్తరణపై ఫోకస్‌గా ఉన్న కంపెనీ దేశవ్యాప్తంగా స్థానిక కంటెంట్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. లోకల్ కంటెంట్‌కు ఆదరణ పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.వ్యూహాత్మక పెట్టుబడిగత మూడేళ్లలో జియోస్టార్ రూ.85,000 కోట్లు వెచ్చించి ప్రముఖ మీడియా సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముఖ్యంగా రీజినల్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్‌లో భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీ దృష్టి సారించింది. ఐపీఎల్ సీజన్లో 300 మిలియన్ల సబ్స్రైబర్లను చేరుకోవడం, క్రికెట్ పట్ల దేశంలో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని స్ట్రీమింగ్‌లో సాంకేతిక పురోగతిని పెంచడానికి పెద్దపీట వేస్తుంది.ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీస్థానిక కంటెంట్ విస్తరణ విభిన్న భాషా, సాంస్కృతిక ప్రేక్షకులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో జియోస్టార్ హైపర్-లోకల్, ఇండియన్ సెంట్రిక్ కంటెంట్‌పై ఆసక్తిగా ఉంది. ఇందులో ప్రాంతీయ క్రీడలు, వినోదం కీలకంగా మారబోతున్నట్లు కంపెనీ తెలిపింది. 5జీ, 4జీ నెట్వర్క్ విస్తరిస్తున్నందున జియోస్టార్ తన డిజిటల్ పంపిణీ ఛానళ్లను బలోపేతం చేస్తోంది. స్మార్ట్ టీవీలు, మొబైల్ పరికరాలు లేదా ప్రత్యక్ష ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విస్తృత ప్రేక్షకులకు కంటెంట్ అందుబాటులో ఉండేలా చూస్తోంది.