
ముంబై: వాచీల తయారీ సంస్థ టైటాన్ సరికొత్త ఆటోమేటిక్స్ కలెక్షన్ శ్రేణిని ప్రవేశపెట్టింది. ఫీనిక్స్, నెక్సస్, గోల్డెన్ హార్ట్ తదితర వాచీల్లో ఆకర్షణీయమైన స్కెలిటల్ డయల్స్ ఉంటాయని సంస్థ తెలిపింది. అలాగే, డ్యుయల్ ఫినిష్ సాలిడ్ లింక్ స్ట్రాప్‌లు, 21 జ్యుయల్ బేరింగ్‌లు మొదలైన ప్రత్యేకతలతో వీటిని రూపొందించినట్లు టైటాన్ వాచెస్ మార్కెటింగ్ హెడ్ అపర్ణ రవి తెలిపారు. వీటి ధర శ్రేణి రూ. 18,325 నుంచి రూ. 22,150 వరకు ఉంటుంది.