
ముంబై: ప్రభుత్వరంగ కెనరా బ్యాంక్ రుణ రేట్లను తగ్గించింది. ఏడాది కాలపరిమితికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్‌ఆర్) 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9% చేసినట్లు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీనితో వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు భారం తగ్గనుంది.
ఇక, ఒకరోజు ఎంసీఎల్‌ఆర్ 8.20%, ఒక నెల, మూడు, ఆరు నెలల కాలవ్యవధి ఎంసీఎల్‌ఆర్ 8.25% – 8.80 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కొత్త రేట్లు మే 12 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. ఆర్‌బీఐ గత నెల రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరుశాతానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.