
ముంబై: ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కొత్తగా ఎస్‌బీఐ జనరల్ ఫ్లెక్సీ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. సొంతిల్లు లేదా అద్దె ఇంటికి సంబంధించి సమగ్రమైన బీమా రక్షణను ఈ ప్లాన్ అందిస్తుందని ఎస్‌బీఐ జనరల్ తెలిపింది. కస్టమర్లు తమ అవసరాలకు అనుకూలంగా దీన్ని తీసుకోవచ్చని పేర్కొంది.
ఇంట్లోని విలువైన వస్తువులతోపాటు.. ప్రత్యామ్నాయ వసతి కోసం అయ్యే వ్యయాలు, ఇంట్లో చోరీల నుంచి రక్షణ ఇలా అన్ని రకాల రక్షణలు ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉంటాయి. ఫైర్ కవర్ ఒక్కటి తప్పనిసరిగా ఉంటుంది. మిగిలినవి పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రీమియంతో 20 ఏళ్లకు రక్షణ పొందొచ్చని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది.