
ఎలాన్ మస్క్ అనగానే.. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు అని అందరూ చెబుతారు. అయితే ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ, వారానికి ఈయన ఎన్ని గంటలు పనిచేస్తారో తెలిస్తే.. తప్పకుండా అవాక్కవుతారు. ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
టెస్లాలోని ఏఐ సాఫ్ట్‌వేర్ వైస్ చైర్మన్ 'అశోక్ ఎల్లుస్వామి' ఒక పాడ్‌కాస్ట్‌లో ఎలాన్ మస్క్‌తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ.. ఆయన కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం భయపడని వ్యక్తి అని అభివర్ణించారు. అద్భుతమైన ఊహ, దూరదృష్టి కలిగిన మస్క్ వారానికి 80 గంటల నుంచి 90 గంటలు పనిచేస్తారని పేర్కొన్నారు.
నేను ప్రతివారం మస్క్‌ను కలుస్తాను. అతను చాలా తెలివైనవాడు, భవిష్యత్తును చాలా ముందుగానే అంచనా వేయగలడు. అతని దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అతను రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం భయపడడు. కష్టపడి పనిచేసే తత్త్వం ఉన్న మస్క్.. చాలా సరదాగా ఉంటారని అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?
2014లో టెస్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరిన ఎల్లుస్వామి.. దశాబ్దానికి పైగా కంపెనీలో ఉన్నారు. 2024లో AI సాఫ్ట్‌వేర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొంది.. మస్క్‌తో కలిసి పనిచేస్తూ, కృత్రిమ మేధస్సులో టెస్లా వృద్ధికి దోహదపడుతున్నారు.
Tesla's VP of AI Software Ashok Elluswamy on what it's like to work with Elon Musk: "I meet with him every week. He is really smart in the sense that he can predict the future very early; He works really hard. Easily 80-90 hours per week. I feel fortunate to work for him. He is… https://t.co/dB5l6EbxEx pic.twitter.com/qLPB0v0hUd
— Sawyer Merritt (@SawyerMerritt) May 14, 2025