
పండుగ సీజన్‌లో ఆర్డర్ల సంఖ్య పెరగడంతో.. ప్రముఖ ఫుడ్ డెలివరీ మేజర్ 'స్విగ్గీ' ప్రతి ఫుడ్ డెలివరీ ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.14కి పెంచింది. ప్రతి ఆర్డర్‌ను మరింత లాభదాయకంగా మార్చడంతో పాటు.. దాని లాభాలను పెంచుకోవడం కోసం కంపెనీ గతంలో వసూలు చేస్తున్న రూ.12 ఫీజును రూ. 14లకు పెంచింది. అంటే తాజాగా రెండు రూపాయలు పెంచిందన్నమాట.
యూనిట్ ఎకనామిక్స్‌ను మెరుగుపరచుకోవడానికి స్విగ్గీ.. ఏప్రిల్ 2023లో ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి.. అదనపు ఖర్చులు ఉన్నప్పటికీ ఆర్డర్ వాల్యూమ్‌లపై ఎటువంటి ప్రభావం చూపకపోవడంతో కంపెనీ ప్లాట్‌ఫామ్ ఫీజును క్రమంగా పెంచింది. ప్రతి ఆర్డర్‌పై రూ.2 పెరుగుదల వినియోగదారులపై పెద్దగా భారం చూపకపోయినా.. స్విగ్గీ వంటి కంపెనీల ఆర్థికస్థితి మెరుగుపడటంతో దోహదపడుతుంది.
ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లు