
భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో పాక్ యుద్ధ విమానాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టిన విధానం ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు కలిసొచ్చే అంశంగా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న యుద్ధ వ్యూహాలు, పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలతో భారతదేశ డ్రోన్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ విస్తరిస్తోంది. ఇందులో భాగంగా దేశీయ కంపెనీలు యుద్ధం, భద్రతా అవసరాలను తీర్చే వేగవంతమైన ఆవిష్కరణలవైపు అడుగులు వేస్తున్నాయి. ఇది ఆయా కంపెనీల్లో పెట్టుబడులు ఆకర్షించి, సమర్థంగా వాటిని ఖర్చు చేసేందుకు వీలవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
డ్రోన్ వార్‌ఫేర్‌లో ఆవిష్కరణలు
శత్రు డ్రోన్లు నిరంతర భద్రతకు ముప్పుగా మారడంతో బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్, కెప్లర్, జెబు ఇంటెలిజెంట్ సిస్టమ్స్ వంటి సంస్థలు అడ్వాన్స్‌డ్ డిటెక్షన్, జామింగ్, న్యూట్రలైజేషన్ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్నాయి. సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రదేశాలు, పౌర మౌలిక సదుపాయాలను రక్షించడానికి ఇవి పరిష్కారాలు అందిస్తున్నాయి.
ఇదీ చదవండి: మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?
కొత్త టెక్నాలజీలపై దృష్టి
ఇటీవల యుద్ధంలో తక్కువ ఖర్చుతో కూడిన అధిక ప్రభావవంతమైన డ్రోన్ల పాత్రను భారత సాయుధ దళాలు గుర్తించాయి. ఇది కంబాట్ యూఏవీలు, నిఘా డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థల్లో పెట్టుబడులను వేగవంతం చేసేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశ డ్రోన్ రంగం 2019 నుంచి 40 మిలియన్ డాలర్లకు పైగా నిధులను ఆకర్షించింది. ఇది తదుపరి తరం సైనిక సాంకేతికతపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని సూచిస్తుంది. ఆధునిక యుద్ధాన్ని తట్టుకోగల కచ్చితమైన పేలోడ్లను మోసుకెళ్లే డ్రోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇది స్టార్టప్‌ల వృద్ధికి తోడ్పడుతుంది. స్మార్ట్, డిస్ట్రిబ్యూటెడ్ డిఫెన్స్ సొల్యూషన్స్, రియల్ టైమ్ బ్యాటిల్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలపై కంపెనీ దృష్టి సారిస్తున్నాయి.