
మర మనుషులు మానవుల స్థానాన్ని రీప్లేస్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. హ్యుమనాయిడ్ రోబోల ఆవిష్కరణలో వస్తున్న మార్పులే అందుకు ఉదాహరణ. తాజాగా టెస్లా హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ మనుషుల్లా డ్యాన్స్ చేస్తున్న వీడియోలను ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎలాంటి ఆధారం లేకుండా అచ్చం మనుషుల్లానే డ్యాన్స్ చేయడం ఆ వీడియోలో చూడవచ్చు.
ఇదీ చదవండి: ఈసారి 7,000 మంది బలి?
ఆప్టిమస్ రోబో డ్యాన్స్ చేస్తున్న వీడియోను కోట్ చేస్తూ టెస్లా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. ప్రధానంగా కార్ల తయారీదారుగా ఉన్న టెస్లా రోబో డ్యాన్స్‌ను ఉటంకిస్తూ ‘మాది కార్ల కంపెనీ కదా’ అని సరదాగా పోస్టు చేసింది. టెస్లా తదుపరి వాటాదారుల సమావేశంలో తనతో పాటు ఆప్టిమస్ నృత్య బృందాన్ని వేదికపైకి తీసుకెళ్తానని ఎలాన్ మస్క్ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.
— gorklon rust (@elonmusk) May 13, 2025
— gorklon rust (@elonmusk) May 14, 2025
This is still very far from our final form https://t.co/6gIAllTPP5
— gorklon rust (@elonmusk) May 14, 2025
We're a car company right https://t.co/DWCw4i3HQV
— Tesla (@Tesla) May 14, 2025