ఆప్టిమస్‌ వచ్చేసింది.. ఇక మిగిలింది సెక్సీ రోబోనే! అన్నంతపని చేస్తాడా?

Tesla Humanoid Robot Optimus Out Catgirl Version Next Hints Musk - Sakshi

మరమనిషి వచ్చేశాడు.  మార్కెట్‌లోకి ఇప్పటిదాకా ఎన్నో హ్యుమనాయిడ్‌ రోబోలు(మనిషి తరహా రోబోలు) వచ్చినప్పటికీ.. అవి ఆలోచన సామర్థ్యానికి దూరంగా ఉంటున్నాయనేది ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్‌ ఎలన్‌మస్క్‌ అభిప్రాయం. ఆ అసంతృప్తిని పొగొట్టుకునేందుకు ఆలోచించే రోబోలను తెస్తానని చెప్పి.. శాంపిల్‌ను ప్రపంచానికి రుచి చూపించాడు. 

ఇంటెలిజెన్సీతో కూడిన హ్యూమనాయిడ్‌ రోబోలను టెస్లా తరపున మార్కెట్‌లో తెస్తామని ప్రకటించిన ఆ కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌.. ఇవాళ ఆ పని చేశాడు. టెస్లా ఆర్టిఫీషియల్‌ డే సందర్భంగా.. ఇవాళ రోబోను అందరి ముందుకు తెచ్చాడు. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో హెడ్‌కార్వర్ట్స్‌లో ఇవాళ జరిగిన ఈవెంట్‌లో హ్యూమనాయిడ్‌ రోబో అలరించింది. 

హ్యూమనాయిడ్‌ రోబోకు ఆప్టిమస్‌ అని ఎలన్‌ మస్క్‌ పేరుపెట్టగా..  అందరికీ అభివాదం చేసి ఫోజులు ఇచ్చాడు యంత్రుడు. ఇక మొక్కలకు నీళ్లు పోయడం, బాక్సులను మోయడం లాంటి పనులు చేసిన రోబో తాలుకా వీడియోను వేదికపై ప్రదర్శించారు. అయితే చివర్లో.. రోబో తడబడడం, ఇంజినీర్లు వచ్చి దానిని సరి చేయడం ట్రోలింగ్‌కు దారి తీసింది. ఏదైతేనేం రోబో ఆవిష్కరణ తర్వాత జరిగిన ప్రధాన చర్చ.. సెక్సీ రోబో ఎప్పుడు వస్తుందని!.

ఆప్టిమస్‌(Optimus) రోబోలు మార్కెట్‌లోకి రావడానికి మరో రెండు నుంచి ఐదేళ్ల మధ్య సమయం పట్టొచ్చు. టెస్లా ఏఐతోనే ఈ రోబోలు తయారు కాబోతున్నాయి. పైగా 20వేల డాలర్ల లోపే ఈ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడిన రోబోలు అందిస్తానని ప్రకటించి మరో సంచలనానికి తెర తీశాడు ఎలన్‌ మస్క్‌. అయితే.. ఈ రోబోలలో సెక్సీ వెర్షన్‌లు రాబోతున్నాయంటూ అతని చేసిన ప్రకటన గురించే ఆసక్తికర చర్చ సోషల్‌ మీడియాలో నడుస్తోంది. 

ఆప్టిమస్‌ రోబోలో క్యాట్‌గర్ల్‌ వెర్షన్‌ రాబోతోందని హింట్‌ ఇచ్చాడు ఎలన్‌ మస్క్‌. ఈ ఏప్రిల్‌ నెలో టెడ్‌(TED) హెడ్‌ క్రిస్‌ ఆండర్సన్‌ ఇంటర్వ్యూలో మస్క్‌ మాట్లాడుతూ.. రోబోలు శృంగార భాగస్వాములుగా మారడం బహుశా అనివార్యం. కానీ, క్యాట్‌గర్ల్‌ తరహా రోబోలను తయారు చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇది చాలా ఆసక్తికరమైన అంశం అంటూ సెక్సీ రోబోల గురించి హింట్‌ ఇచ్చాడు. దానికి కొనసాగింపుగా ఇవాళ క్యాట్‌గర్ల్‌ Catgirl వెర్షన్‌ ఉంటుందంటూ మరో ట్వీట్‌ చేశాడు కూడా. 2024 చివరికల్లా ఈ సెక్సీవెర్షన్‌ రోబోలు మార్కెట్‌లోకి తేవాలనే ఆలోచనతో ఉన్నాడు మస్క్‌. మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే మొండిపట్టుదల ఉన్న ఎలన్‌ మస్క్‌.. శృంగారభరితమైన రోబోల విషయంలో ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top