టెస్లా రోబో.. అచ్చం మనిషి తరహాలోనే! ఆశ్చర్యంలో ముంచెత్తిన మస్క్‌

Tesla Humanoid Robot Elon Musk Introduces AI Tesla Bot - Sakshi

Tesla Bot: ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు టెస్లా.. సంచలన ప్రకటన చేసింది. హ్యూమనాయిడ్‌ రోబోలను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. గురువారం(ఆగష్టు 19న) టెస్లా అర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) డే జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో రోబో ఫీచర్స్‌ను సర్‌ప్రైజ్‌ లాంఛ్‌ చేసి ఆశ్చర్యంలో ముంచెత్తాడు టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌

ప్రస్తుతం టెస్లా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీ కోసం ఉపయోగిస్తున్న ఏఐనే.. హ్యూమనాయిడ్‌ రోబోలకు ఉపయోగించబోతున్నారు. సుమారు 5.8 అడుగుల ఎత్తు, 125 పౌండ్ల బరువుతో రోబోను తయారు చేయనున్నారు. రోబో ముఖంలోనే పూర్తి సమాచారం కనిపించేలా డిస్‌ప్లే ఉంచారు. రోబోకు 45 నుంచి 150 పౌండ్ల బరువు మోసే సామర్థ్యం ఉంటుందని, గంటకు ఐదు మైళ్ల దూరం ప్రయాణిస్తుందని చెప్పాడు ఎలన్‌ మస్క్‌.  చదవండి: టెస్లాకు షాక్‌ ఇవ్వనున్న ఓలా

మనిషి రోబో తరహా డ్యాన్స్‌తో ప్రారంభమైన ఈ ఈవెంట్‌లో.. గతంలోలాగే హ్యూమనాయిడ్‌ రోబో ఫీచర్స్‌ గురించి స్వయంగా మస్క్‌ వివరణ ఇచ్చాడు.  ఇక ఈ రోబోల కోసం ఇప్పుడు వెహకిల్స్‌ కోసం ఉపయోగిస్తున్న.. ఆటోపైలోట్‌ సాఫ్ట్‌వేర్‌(ఏఐ)ను ఉపయోగించబోతున్నట్లు మస్క్‌ తెలిపాడు. ఈ న్యూరల్‌ నెట్‌వర్క్‌ ఎనిమిది కెమెరాలతో పని చేస్తుంది. మనిషికి ‘ఆర్థిక భారాన్ని దించే రోబోలుగా’ వీటిని అభివర్ణించాడు మస్క్‌. మిగతా రోబోల కంటే భిన్నంగా.. మనిషి తరహా ఆకారంలో ఈ రోబో ఉండడం విశేషం.  ‘చక్రాల మీదే కాదు.. రెండు కాళ్ల మీద కూడా టెస్లా ఏఐ అద్భుతంగా పని చేస్తుంది. ఇది నా గ్యారెంటీ’ అంటూ రోబో ఆవిష్కరణలో ఉద్వేగంగా మాట్లాడాడు మస్క్‌. కాగా, ప్రస్తుతం ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ రోబోలు.. వచ్చే ఏడాదికల్లా మార్కెట్‌లోకి రానున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top