
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించు కున్నాయి. శాకంబరి ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా కొనసాగాయి.

శాకంబరీదేవి అలంకారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా కనక దుర్గమ్మను నయన మనోహరంగా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు.



















