టెస్లా .. రోబోట్యాక్సీ.. | Elon Musk unveils Cybercab at Tesla robotaxi | Sakshi
Sakshi News home page

టెస్లా .. రోబోట్యాక్సీ..

Oct 12 2024 6:17 AM | Updated on Oct 12 2024 8:01 AM

Elon Musk unveils Cybercab at Tesla robotaxi

30 వేల డాలర్ల లోపు ధర 

లాస్‌ ఏంజెలిస్‌: వాహనప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబోట్యాక్సీ ’సైబర్‌క్యాబ్‌’ను టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ ఎట్టకేలకు ఆవిష్కరించారు. అటానామస్‌ వాహనంగా ఉండే రోబోట్యాక్సీలో స్టీరింగ్‌ వీల్, పెడల్స్‌ ఉండవు. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే పట్టేంత క్యాబిన్‌ ఉంటుంది. స్వయంచాలిత వాహనాలు మనుషులు నడిపే వాహనాల కన్నా 10–20 రెట్లు సురక్షితంగా ఉంటాయని, సిటీ బస్సులతో పోలిస్తే వీటిలో ప్రయాణ వ్యయాలు కూడా చాలా తక్కువేనని మస్క్‌ చెప్పారు.  

సైబర్‌క్యాబ్‌ ఉత్పత్తి 2026లో ప్రారంభమవుతుందని, ధర 30,000 డాలర్ల లోపే ఉంటుందని మస్క్‌ తెలిపారు.  అలాగే 20 మంది పట్టే రోబోవ్యాన్‌ను కూడా మస్క్‌ ప్రవేశపెట్టారు. అటు వివిధ పనులు చేసి పెట్టే ఆప్టిమస్‌ రోబోను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు మస్క్‌ చెప్పారు. దీని ధర 20,000–30,000 డాలర్ల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. అటానామస్‌ వాహనాలు ప్రమాదాలకు దారి తీస్తున్న ఉదంతాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో టెస్లా స్వయంచాలిత వాహనాలకు అనుమతులపై సందేహాలు నెలకొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement