
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. చాలామంది ఇందులో కొత్తగా నైపుణ్యాలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యా మంత్రిత్వ శాఖ 'స్వయం పోర్టల్'లో ఫ్రీ ఏఐ (AI) కోర్సులను అందిస్తోంది. వివిధ పరిశ్రమలలో ఏఐ ప్రాముఖ్యత పెరుగుతున్న సమయంలో ఈ కోర్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఏఐ/ఎమ్ఎల్ యూసింగ్ పైథాన్
ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తారు. ఇందులో స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, ఆప్టిమైజేషన్, డేటా విజువలైజేషన్ వంటివి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా.. డేటా సైన్స్‌లో విస్తృతంగా ఉపయోగించే ప్రోగ్రామింగ్ భాషలలో ఒకటైన పైథాన్‌ను కూడా కవర్ చేస్తుంది. ఈ కోర్సు 36 గంటల పాటు కొనసాగుతుంది. కోర్సు పూర్తయిన తరువాత చివరిలో సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది.
క్రికెట్ అనలిటిక్ విత్ ఏఐ
ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు అందించే ఈ కోర్సు ద్వారా.. క్రికెట్‌ను ప్రాథమిక ఉదాహరణగా తీసుకుని, పైథాన్‌ని ఉపయోగించి స్పోర్ట్స్ అనలిటిక్స్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలను తెలుసుకోవచ్చు. ఈ కోర్సు 25 గంటలు ఉంటుంది.
ఏఐ ఇన్ ఫిజిక్స్
ఈ కోర్సు మెషిన్ లెర్నింగ్ & న్యూరల్ నెట్‌వర్క్‌లు వాస్తవ ప్రపంచ భౌతిక శాస్త్ర సమస్యలను ఎలా పరిష్కరించగలవో చెబుతుంది. ఇందులో ఇంటరాక్టివ్ సెషన్‌లు, ఆచరణాత్మక ఉదాహరణలు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్ వర్క్ మొదలైనవి ఉన్నాయి. ఈ కోర్సు 45 గంటల ఉంటుంది.
ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్: తొలిరోజే 1.4 లక్షల కొనుగోళ్లు
ఏఐ ఇన్ అకౌంటింగ్
కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని ఈ కోర్స్ ప్రవేశపెట్టింది. అకౌంటింగ్ పద్ధతుల్లో ఏఐను ఎలా ఉపయోగించుకోవచ్చో.. ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు. ఇది 45 గంటల కోర్సు.
ఏఐ ఇన్ కెమిస్ట్రీ
ఈ కోర్సు ద్వారా వాస్తవ ప్రపంచ రసాయన డేటాసెట్‌లను ఉపయోగించాలో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా పరమాణు లక్షణాలు, మోడల్ ప్రతిచర్యలు, డిజైన్ డ్రగ్స్ మొదలైనవాటిని ఎలా అంచనా వేయాలో తెలుస్తుంది. ఇది 45 గంటల కోర్సు.